నిమ్మకాయ, నిమ్మరసం, నిమ్మ ఆకులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి ఉంది|Lemon, lemon juice and lemon leaves have the power to give complete health in Telugu

మన నిండు ఆరోగ్యాన్ని అందించే అమ్మ లాంటి..నిమ్మకాయ(Like mother who gives us full health.. lemon) :

      మన ప్రకృతిలో పెరిగే చెట్లలో “నిమ్మ చెట్టు(lemon tree)” ఒకటి. దీని నుండి లభించే నిమ్మకాయలు సహజ సిద్దమైనవి(Natural preparations). సహజంగా సమృద్ధిగా లభించే నిమ్మకాయలు, నిమ్మరసం అనేది మన శరీరానికి ఒక “దివ్యౌషధం(The panacea)” అని చెప్పాలి. సహజ సిద్ధంగా ప్రకృతి అందించిన నిమ్మకాయ ఒక శక్తిని కలిగి ఉండి, అమ్మ లాంటి ఆశీర్వాదాన్ని కలుగచేయడం అంటే, అంతటి ఆరోగ్య ప్రదాతగా మనకి ఉత్సహాన్ని అందచేస్తుంది అని అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కరికి తెలుసిందే..

     ఇది సహజ సిద్దమైన “యాంటీ సెప్టిక్(Antiseptic)” గా పని చేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యంను పొందేలా వివిధ రకాలుగా ఉపయోగపడుతాయి. అందుకే, ప్రతి ఇంటి వంట గదిలో నిమ్మకాయను ఎదో రూపంలో వంటకాల్లో వాడుతూనే ఉంటారు. ఇలా.. ప్రతి నిత్యం ప్రతి ఒక్కరు ఎదో రూపంలో ఒక సగం నిమ్మచెక్క రసం తీసుకోవడం అనేది మన ఆరోగ్యానికి ఎంతో లాభము కన్పిస్తుంది.

Lemon, lemon juice and lemon leaves have the power to give complete health in Telugu

      నిమ్మ పుట్టిల్లు దక్షిణాసియా. కానీ ఇండోనేషియా, భారతదేశంలోని అస్సాం(Assam) రాష్ట్రంలో మొదటిసారిగా పండించారు అని చెపుతారు. ఆ తర్వాత ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. ప్రస్తుతం నిమ్మను మెక్సికోలో పండిస్తున్నారు. తర్వాత స్థానంలో అంటే, భారత్, చైనా, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలలో నిమ్మను ఎక్కువగా పండిస్తున్నారు. నిమ్మకాయ అనేది “రూటేసి(Rutaceae)” కుటుంబానికి చెందిన పండు. దీని శాస్తీయ నామం “సిట్రస్ లిమోన్(Citrus lemon)”. నిమ్మ పండులో “విటమిన్ సి” సమృద్ధిగా ఉంటుంది. ఇవి పసుపు రంగులో ఉండి, “రుచికి పుల్లగా(sour to taste)” ఉంటాయి. నిమ్మ గురుంచి మొదటిసారిగా 10 వ శతాబ్దంలోని “అరబ్ సాహిత్యం(Arabic literature)”లో పేర్కొనబడింది. భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో మొదటిసారిగా పండించారు. 

     నిమ్మకాయ “మాడరిన్(Madarin), సిట్రాన్(citron)” వంటి “అడవి సిట్రస్ జాతుల” నుండి రూపొందిన ఒక మిశ్రజాతి(హైబ్రిడ్). “క్రిస్టోఫర్ కొలంబస్” 1493 లో తన ప్రయాణంలో నిమ్మ గింజలను యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికాలోకి ప్రవేశపెట్టాడని చరిత్ర చెబుతుంది. అలాగే, సుదీర్ఘ సముద్రయానం చేసేవారిలో వచ్చే “స్కర్వీ వ్యాధి(Scurvy)” గ్రస్తులలో నిమ్మరసంతో ప్రయోగాలు జరిపి ఇందులో ఉండే “విటమిన్ సి(Vitamin C)” లోపించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది అని కనుగొనడం జరిగింది.

Lemon, lemon juice and lemon leaves have the power to give complete health in Telugu

నిమ్మతో ఉపయోగాలు(Uses of lemon) :

      మనం నిమ్మరసం తాగినప్పుడు, నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, వెంటనే “రోగనిరోధక శక్తి(Immunity)”ని ఎక్కువగా అందేలా చేస్తుంది. ఇంకా ఇందులో విటమిన్ ఏ, ఇ, బి6 ఉంటుంది. ఇనుము, రాగి, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం, క్యాల్షియం, రైబో ఫ్లేవిన్, జింక్ ఉంటాయి. నిమ్మకాయలను “ఆయుర్వేదం(Ayurveda)”లోనూ ఉపయోగిస్తారు.

Lemon, lemon juice and lemon leaves have the power to give complete health in Telugu

 

  1. వేసవి కాలంలో చేసే నిమ్మ షోడా(Soda lemon), నిమ్మ షర్బత్(Lemon sherbet), నిల్వ ఉండే పానీయాలు తయారు చేస్తారు అని మనకు బాగా తెలుసు.
  2. వేసవి కాలంలో వేడిమి తాకిడి కి గురి అయ్యే వారికి నిమ్మ రసం ఇస్తే చాలు త్వరగా శక్తి  వస్తుంది. అందుకే నిరాహార దీక్ష చేసేవారు, విరమించే సమయానికి నిమ్మ రసంతో దీక్షను విరమించడం జరుగుతుంది.
  3. వేసవి కాలంలో నిమ్మపండు నుండి వచ్చే రసంతో పానీయంగా తయారుచేసి, అందులో ఉప్పు లేదా చక్కర వేసి(Add salt or sugar) తాగుతుంటారు.
  4. నిమ్మ రసంతో పులిహార చేసుకొని చాల ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు మరియు చాలా రుచిగా కూడా ఉంటుంది. నిమ్మపండులతో ఊరగాయ పచ్చళ్ళు(Pickled lemons) చేస్తారు.

 నిమ్మకాయలో ఉండే పోషక విలువలు(Nutritional values of lemon) :

  • శక్తి                          –                 30 క్యాలరీలు
  • పిండిపదార్థాలు            –                 9 గ్రాములు
  • చక్కర                      –                 2.5 గ్రాములు
  • పీచుపదార్థాలు            –                 2.8 గ్రాములు
  • కొవ్వు పదార్థాలు          –                 0.3 గ్రాములు
  • మాంసకృత్తులు            –                 1.1 గ్రాములు
  • నీరు                         –                 89 గ్రాములు
  • విటమిన్ సి                 –                 53 మిల్లి గ్రాములు
  • సిట్రిక్ యాసిడ్             –                 5 గ్రాములు

Lemon, lemon juice and lemon leaves have the power to give complete health in Telugu

నిమ్మరసం మన ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు(Benefits of lemon juice for our health) :
  • రోగనిరోధక శక్తి(Immune Power) : నిమ్మరసంలో విటమిన్ సి “యాంటీ ఆక్సిడెంట్” లక్షణాలు కలిగి ఉండడం వల్ల మనలో రోగనిరోధక శక్తిని వెంటనే పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అందుకే, నిమ్మరసం తాగినపుడు చాలా సేపు వరకు శక్తివంతము(Energetic)గా ఉండగలుగుతాము. ముఖ్యముగా, వేసవిలో కలిగే అలసట, నీరసం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, దగ్గు, జలుబు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు అంటువ్యాధుల నుండి రక్షించే “యాంటీబయాటిక్” గా కూడా పని చేయగలదు.
  • డీహైడ్రేషన్ ను దూరం చేస్తుంది(Prevents Dehydration) : వేసవి కాలంలో మనం ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురి అవ్వడం జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిమ్మకాయ నీళ్లు, షర్బత్ ను తీసుకోవడం ద్వారా మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతేకాదు, శరీరంలోని వ్యర్థ పదార్థాలను, ట్యాక్సిన్లను బయటకి పంపించడంలో బాగా తోడ్పడుతుంది.

Lemon, lemon juice and lemon leaves have the power to give complete health in Telugu

  • ఒత్తిడిని తగ్గిస్తుంది(Reduces stress) : నిమ్మ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరం యొక్క ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే నిమ్మ ఆకులను నలిపి వాటి నుండి వాసనను పీలుస్తూ ఉంటె ఒత్తిడి తగ్గుంతుందంట. మానసికంగా ఒత్తిడికి గురి అయ్యే వారు, నిమ్మ ఆకులతో ఇలా చేస్తే, ఒక ఔషధంతో ఉపశమనం కలిగి ఉంటుంది మరియు ఉత్సహంగా ఉండగలరు అంటారు.
  • పార్శ్వపు నొప్పి(Migraine pain) : నిమ్మ ఆకులను, వేడి చేసి ఉంచిన నీళ్లలో వేసి నానబెట్టి, ఒక నెల రోజుల పాటు పడుకునే ముందు తాగాలి. ఇలా చేస్తే, మైగ్రేన్ తలనొప్పి, ఆస్తమా తగ్గిపోతుంది. అయితే, గమనించాల్సిన విషయం, నీటిలో ఆకులను వేసి మరిగించకూడదు. వేడి నీటిలో మాత్రమే వేసి నానబెట్టాలి.
  • రక్తహీనత కోసం(For anemia) : ప్రధానంగా నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, మనం తీసుకునే ఆహారంలోని ఇనుము అధికంగా గ్రహించడానికి సహాయపడుతుంది. తద్వారా రక్తహీనతను నివారించడంలో తోడ్పడుతుంది.
  • క్యాన్సర్ నివారణ(Prevention of cancer) : నిమ్మలోని కొన్ని పదార్థాలు క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.
  • పచ్చకామెర్ల వ్యాధి(Jaundice) : నిమ్మ నుండి 2 చెంచాల వరకు రసాన్ని తీసి, ఒక గ్లాసు నీటిలో కలుపుకొని రోజుకి 4 లేదా 5 సార్లు తాగడం వల్ల పచ్చకామెర్ల వ్యాధి తగ్గుతుంది.
  • ఊబకాయం(Obesity) : రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో ఒక నిమ్మకాయ రసం, ఉప్పు కలుపుకొని తాగడం వల్ల ఊబకాయం నుండి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది. శరీరంలో అధిక కొవ్వు పేర్కొని ఉంటె తొలగించగలదు.
  • కాలేయం శుభ్రత(Liver Cleansing) : ఒక గ్లాస్ వేడినీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వలన కాలేయంను శుభ్రపరుస్తుంది అని భావిస్తారు.
  • బరువు తగ్గుదల కోసం(For weight loss) : శరీరం అధిక బరువును కలిగి ఉండేవారు ఆహారాన్ని తగ్గించి, రోజుకు 2, 3 సార్లు నిమ్మరసం సేవిస్తే, బరువు తగ్గుతుంది.
  • జీర్ణవ్యవస్థ మెరుగుదల(Digestive system improvement) : మలబద్దకం, అజీర్ణం మొదలగు జీర్ణక్రియ వ్యాధుల్లో ప్రతిరోజు రెండు పూటలా నిమ్మరసం త్రాగితే, జీర్ణవ్యవస్థ సరిగా పని చేస్తుంది. ఆకలి, బరువు పెరుగుతుంది.
  • మూత్రపిండాల్లో రాళ్లు దూరం(Kidney stone removal) : సాధారణంగా కిడ్నీలో రాళ్లు అనేవి “క్యాల్షియం” ఎక్కువ అవడం వల్ల వస్తుంది. అందుకే, సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే, భవిష్యత్ లో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. మూత్రపిండాలు బాగుండాలి అంటే, మన శరీరం హైడ్రేట్ గా ఉండడం తప్పనిసరి. మూత్రపిండాల్లో  ఏర్పడ్డ రాళ్ల పరిమాణంను తగ్గించడంలో చాల ఉపయోగకరంగా ఉంటుంది. నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల “యూరినరీ ట్రాక్(Urinary tract)” లో  “పిహెచ్ బ్యాలన్స్(pH balance)” మెయింటన్ అవుతుంది. దీంతో “ఇన్ఫెక్షన్(Infection)” బారిన పడకుండా ఉండగలం.
  • గుండె సమస్యలు(Heart problems) : ఒక యాంటీఆక్సిడెంట్ కావడం వల్ల రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ ను తగ్గించి, అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. గుండెలో వచ్చే మంటను తగ్గించేస్తుంది. స్ట్రోక్, గుండె జబ్బుల సమస్యలు దరి చేరకుండా తగ్గించే అవకాశం ఉంటుంది. 
  • నిద్రలేమి(Insomnia) : ఒక గ్లాస్ వేడి నీటిలో 4 నిమ్మ ఆకులను నానబెట్టి తాగితే, నిద్రలేమి సమస్య, గుండెదడ, నరాల బలహీనత వంటి సమస్యలు దూరం అవుతాయి.
  • చేతులను శుభ్రం చేయడం(Cleaning hands) : నిమ్మ ఆకులను నలిపి చేతులకు రాసుకుంటే, చేతులపై ఉండే బాక్టీరియా నశిస్తుంది.

Lemon, lemon juice and lemon leaves have the power to give complete health in Telugu

నిమ్మరసం చర్మ సౌందర్యానికి కలిగించే ప్రయోజనాలు(Benefits of lemon juice for skin beauty) :
  •  ఆయుర్వేదంలో చర్మసౌందర్యానికి(For skin care) నిమ్మకు మించినది లేదు అని నిరూపించబడింది. అందుకే, చాల “సౌందర్య సాధనాల(Cosmetics)” తయారీలో నిమ్మను ఉపయోగిస్తారు.
  • మొటిమలు మరియు అనేక రకాల చర్మ వ్యాధులకు నిమ్మరసాన్ని రోజుకు 2,3 సార్లు సేవించడం వలన మంచి లాభం ఉంటుంది. మరియు శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తుంది. ఇంకా చర్మాన్ని కాంతివంతం(Brighten the skin)గా మార్చడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
  • చర్మంపై ఉండే మృతకణాల(Dead cells)ను, ముడతల(wrinkles)ను ఇది తొలగిస్తుంది. జిడ్డు కలిగిన చర్మాన్ని(Oily skin) తొలగించడంలో దీనికి మించిన సౌందర్య సాధనం లేదు అని చెప్పవచ్చు.
  • చేతులు, పాదాలు మృదువు(Hands and feet are soft)గా ఉండడానికి “నిమ్మ రసము”ను వాడుతారు.
  • శిరోజాల సంరక్షణ(To preserve the heads)కు మరియు చుండ్రు సమస్యలకు కూడా నిమ్మ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  • చుండ్రు సమస్య(Dandruff is a problem) ఉన్నవారు మీ తలకు నిమ్మరసంను పట్టించి, ఓ 10 నిమిషాల తర్వాత యాంటీ డాండ్రఫ్ షాంపు తో కడిగేయండి మంచి ఫలితాన్ని చూస్తారు. ఎందుకంటే, నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఫోలికల్ మూలాల నుండి చుండ్రుతో పోరాడడానికి సహాయపడుతుంది.
  • కొన్ని తాజా ఆకులను పేస్ట్ చేసి, అందులో తేనె కలిపి ముఖంపై ప్యాక్ వేసుకుంటే, మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
  • స్నానం చేసేప్పుడు కొన్ని నిమ్మ ఆకులను వేసి ఉంచి, ఆ నీటితో స్నానం ఆచరిస్తే, మనకు ఉండే చర్మ సమస్యల(Skin problems) నుండి విముక్తి కలుగుతుంది.
నిమ్మకాయతో టీ తయారీ(Preparation of tea with lemon) :
  • నిమ్మకాయతో టీ తయారు చేయడానికి ముందుగా ఒక పాత్రలో నీటిని వేడి చేసి, 1/4 స్పూన్ టీ పౌడర్ వేసి ఒక్క నిమిషం మాత్రమే మరగనివ్వాలి.
  • మరిగించేటప్పుడు మీ ఇష్టాన్ని బట్టి, పుదీనా ఆకులు లేదా అల్లం ముక్కలు వేసి కూడా మరిగించవచ్చు.
  • తర్వాత, వడకట్టి దానిలో నిమ్మరసం, తేనె లేదా చక్కర వేసి తాగేయండి. ఇందులో నల్ల ఉప్పు కూడా చిటికెడు వేయడం వల్ల రుచిగా కూడా ఉంటుంది.

Lemon, lemon juice and lemon leaves have the power to give complete health in Telugu

నిమ్మకాయతో ఇంటి చిట్కాలు(Homemade tips with lemon) :
  1. నెయిల్ పాలిష్(Nail polish) : ఒక కప్పు గోరు వెచ్చటి నీటిలో సగం నిమ్మకాయ రసం వేసిన తర్వాత, 5 నిమిషాలు మీ వేళ్లను నానబెట్టాలి. మీ గోర్లను శుభ్రం చేసే ముందు నిమ్మతొక్కతో రుద్దండి. దీనివల్ల, మన గోర్లకు ఉండే నెయిల్ పాలిష్ పూర్తిగా తొలగిపోతుంది.
  2. మరకల శుభ్రత(Stain Cleaning) : మైక్రోవేవ్ ను శుభ్రం చేయడానికి నిమ్మరసం నీళ్లు, నిమ్మ తొక్కలను నానబెట్టిన నీళ్లతో శుభ్రం చేస్తే, చాలా సులువుగా మరకలు తొలగిపోగలవు.
  3. జిడ్డు మరకలు(Oil stains) : మన బట్టలపై ఏర్పడే జిడ్డు మరియు ఏ ఇతర రకాల మరకలు అయిన సరే, నిమ్మరసంతో ఉప్పును జత చేసి అప్లై చేయండి. చాల సులువుగా మరకలు వదిలిపోతాయి.
  4. ఫ్రిడ్జిలో దుర్వాసన(Bad smell in the fridge) : మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ నుండి దుర్వాసన వస్తున్నట్లయితే, నిమ్మకాయను సగం కట్ చేసి, ఫ్రిడ్జిలో ఉంచండి. దుర్వాసన మటుమాయం అవుతుంది.
నిమ్మ గింజల యొక్క మహిమ(The glory of lemon seeds) :

Lemon, lemon juice and lemon leaves have the power to give complete health in Telugu

  1. నిమ్మకాయలోని గింజలను పారేయడం మాత్రమే మనకు తెలుసు. నిమ్మగింజల రుచి చేదుగా ఉన్నప్పటికీ, గింజలను తినడం వల్ల ఆరోగ్యానికి కలిగించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అంటున్నారు.
  2. నిమ్మగింజల్లో “సాలిసిలిక్ యాసిడ్(Salicylic acid)” ఉంటుంది. అది నొప్పి నివారిణిగా పని చేస్తుందట.
  3. అందుకే, తలనొప్పి, కడుపునొప్పి, నడుము నొప్పి వచ్చినప్పుడు నాలుగు నిమ్మగింజలను నోట్లో వేసుకొని బాగా నమిలి మింగాలి. ఆపై ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిని సేవించాలి. ఇలా చేస్తే ఆయా నొప్పుల నుండి సహజంగానే ఉపశమనం పొందవచ్చు.
  4. కడుపులో నులిపురుగులు ఉన్నవారికి కూడా ఈ గింజలను నమిలి తింటే నులిపురుగులు త్వరగా నాశనం అవుతాయి అంటున్నారు. శరీరంలో మలినాలు తొలగిస్తుంది.
  5. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కూడా ఉంటాయి.
  6. కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. 
  7. కానీ, గింజలను కూడా తినడం ఆరోగ్యానికి మంచిది అని చెప్పారు అనేసి, అతిగా తినడం అలవాటు చేసుకోవద్దు. వీలైనప్పుడు లేదా మీకు ఏదైనా సమస్య అనిపించినపుడు గింజలను నమిలి తినండి.
నిమ్మకాయ తొక్క ప్రయోజనాలు(Benefits of Lemon Peel) :

      నిమ్మకాయ అందించే లాభాలు చాలా ఉన్నాయి కదా అందులో నిమ్మ తొక్క కూడా ఏ మాత్రం తీసిపోకుండా మన శరీరానికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. నిమ్మకాయ తొక్కలలో శక్తివంతమైన బయో యాక్టీవ్ కాంపౌండ్స్ తో పాటు, ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నిమ్మ తొక్కలో పెక్టిన్ వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. నిమ్మతొక్క వాసన ను పీల్చడం చేసిన కూడా ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. నిమ్మతొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరం ఆరోగ్యముగా ఉండేలా సహాయపడుతుంది.

      నిమ్మతొక్కల పొడి శరీర సౌందర్యాన్నీ పెంచే స్క్రబ్ గా కూడా ఉపయోగపడుతుంది. నిమ్మతొక్కల పొడి లో కాస్త తేనె కలిపి ముఖానికి అప్లై చేస్తే ముడతలు, మచ్చలు తొలగిపోయి, ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇతర చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి. నిమ్మతొక్కల పొడిలో కొంచెం వంట సోడా, ఉప్పు కలిపి పళ్ళు తోముకుంటే, దంతాలు ఆరోగ్యముగా తెల్లగా మెరుస్తాయి.

 

Lemon, lemon juice and lemon leaves have the power to give complete health in Telugu

దుష్ప్రభావాలు(Side effects) :

ప్రతి నిత్యం తీసుకునే వారిలో దంతాల యొక్క ఎనామిల్ సమస్యలు వస్తుంటాయి. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ నోటిపూతలను ప్రేరేపిస్తుంది. ఎక్కువ మొత్తంలో నిమ్మరసం తీసుకునే వారిలో ఒకేసారి శరీరం బరువు పెరగడం, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులు కనిపించే అవకాశాలు ఉంటాయి. కడుపు నొప్పితో పాటు, గ్యాస్ట్రిక్ సమస్యలను తీవ్రతరం చేస్తుంది. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. మరియు అతిగా తీసుకునే నిమ్మరసంతో ఆస్టియో ఆర్థరైటిస్ కు కారణమౌతుంది.

ముగింపు(Conclusion) :

  నిమ్మచెట్టులోని ప్రతి భాగం అంటే, ఆకులు, పండ్లు, నిమ్మకాయలోని గింజలు, రసం పిండేసిన నిమ్మ తొక్కలు ఇవి అన్ని కూడా మన శరీరానికి ఎన్ని ఉపయోగాలు కలిగిస్తాయి అనేది తెలుసుకున్నాము కదా! ఒక్కోసారి.. నిమ్మకాయలు మన ఇంట్లో లేనిదే తోచదు అనేంతగా మన ఇంట్లో ముఖ్య భాగం అయి ఉంది. ఇక వేసవి కాలంలో తప్పనిసరిగా నిమ్మనీళ్ళు తాగనిదే మన శరీరం ఉత్సహాన్ని పొందలేము.

       అయితే, నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిది అని చెప్పి, ఎలాగైనా తాగేయాలి అనే నియమాలు పెట్టుకోవద్దు. నిమ్మరసం అనేది అందరికి సరి అవ్వొచ్చు కానీ కొంతమందికి పడదు అంటారు వారి వారి శరీర తత్వాన్ని బట్టి, జలుబు, దగ్గు చేయడం జరుగుతుంది.

అందుకే, ముందుగా మన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించుకోవాలి. వైద్యుడి సలహాలు సూచనలు పాటించాలి. ఆ తర్వాత గాని, ప్రతి నిత్యం కూడా వీలైనంతగా ఒక సగం నిమ్మ చెక్క రసమును ఎదో రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందగలం అనేది నిరూపితం అయింది.. ఇంకో విషయం వచ్చేసి, ఎంత ఆరోగ్యముగా ఉన్న వాళ్ళు కూడా రోజుకు ఒక నిమ్మకాయ ను మించి ఎక్కువగా తీసుకుంటే, అది కాస్త దుష్ప్రభావాలకు దారి తీయవచ్చు. మరియు రోజుకు ఎంత మోతాదులో నిమ్మరసం తీసుకుంటే, మీ శరీర స్థితి  మీకు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది అనేది గ్రహించుకోవాలి. దాని బట్టి కూడా మీకు మీ ఆరోగ్య పరిస్థితి గురుంచి అవగాహన కలిగి జాగ్రత్తగా ఉండగలుగుతారు.

Add Comment