Migraine Headache Symptoms and Treatment in Telugu | పార్శ్వపు నొప్పి లక్షణాలు మరియు నివారణా విధానం

Migraine symptoms and Home Treatment in Telugu Language:

Migraine Headache symptoms అందరికి తెలుసు. కానీ పార్శ్వపు తలనొప్పి గురించిన అవగాహన మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. సాధారణంగా పార్శ్వపు తలనొప్పితో బాధపడేవారి సంఖ్య మగవారితో పోలిస్తే ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. పార్శ్వపు తలనొప్పి ఒకవైపే వస్తుంది అనుకుంటారు కొందరు కానీ,ఇది రెండు వైపులా కూడా వస్తుంది.

ఇలా రెండు వైపులా వచ్చే తలనొప్పి ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇలా వచ్చేవారిలో భోజనం సరిగ్గా తినరు,శబ్దాలు ఎక్కువగా వచ్చినా,ప్రయాణాలు చేయాల్సి వచ్చినా,మాట్లాడాలన్నా వీరికి చికాకు కలుగుతుంది.

సాధారణంగా వచ్చే తలనొప్పి,పార్శ్వపు తలనొప్పి ఒకటి కాదు. Migraine Headache ఎక్కువగా జన్యుపరమైన కారణాలవల్ల వచ్చే అవకాశం ఉంటుంది.

అంటే మన వంశంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటె మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పార్శ్వపు నొప్పి నిర్ధారణకు కొన్ని రకాల రక్త పరీక్షలు చేసుకోవాలి వాటిలో EEG,CT SCAN,MIR BRAIN వంటి పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

Recommended Migraine Roll on

Migraine symptoms:

  • కొన్ని రకాల ఆంటీబయోటిక్స్ మందులు,పెయిన్ కిల్లర్ మందులు ఎక్కువగా వాడటం.
  • మానసికంగా ఎక్కువగా ఆందోళనకు లోనయ్యేవారిలో,ఒత్తిడికి ఎక్కువగా గురయ్యేవారిలో,అనవసరమైన ఆలోచనలు చేసేవారిలో పార్శ్వపు తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
  • గర్భవతి  స్త్రీలలో హార్మోన్స్ లలో హెచ్చు తగ్గులు ఏర్పడినప్పుడు.
  • డిప్రషన్ ఎక్కువగా ఉన్నవారిలో,నిద్ర సరిగ్గా లేనివారిలో పార్శ్వపు నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • కొందరికి ఎక్కువగా ఎండలో తిరుగుతున్నా,ప్రయాణాలు ఎక్కువగా చేసినా కూడా ఈ రకం తలనొప్పి రావచ్చు.
  • వంశపార్యపరంగా కూడా రావచ్చు.

Recommended Migraine Tablets

Migraine Headache Home Treatment:

Migraine Headache symtoms and Treatment in Telugu

1.నిద్ర

పార్శ్వపు తలనొప్పితో బాధపడేవారికి ముందుగా కావాల్సింది మంచి నిద్ర. కాబట్టి రోజులో కనీస 7 నుంచి 8 గంటలు నిద్ర పోవటానికి ప్రయత్నించండి.

Migraine Headache symtoms and Treatment in Telugu

2.మసాజ్

పార్శ్వపు తలనొప్పికి మర్దన ఎంతగానో ఉపయోగపడుతుంది. నువ్వుల నూనె గాని లేదా ఆముదం నూనెను గాని తీసుకొని తల మీద బాగా మర్దన చేయటంవలన ఈ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చును.

Migraine Headache symtoms and Treatment in Telugu

3.అల్లం 

అల్లం మైగ్రైన్ సమస్యను తగ్గించటంలో బాగా ఉపయోగపడుతుంది. అల్లం మరియు నిమ్మ రసం సమపాళ్లలో తీసుకొని రోజులో కనీసం రెండు నుండి మూడుసార్లు త్రాగాలి.

అలాగే ఒక స్పూన్ అల్లం రసానికి ఒక స్పూన్ నిమ్మ రసం కలిపి ఒక గ్లాసు గోరువెచ్చని నీటికి కలిపి త్రాగాలి,ఇలా రోజూ చేయటంవలన మైగ్రైన్ సమస్య నుండి బయటపడవచ్చు.

Migraine Headache symtoms and Treatment in Telugu

4.ఐస్ ముక్కలు 

తలనొప్పి ఉన్నచోట కొన్ని ఐస్ ముక్కలు ఒక బట్టలో వేసి మర్దన చేయటం వలన పార్శ్వపునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా రోజులో రెండు లేక మూడు సార్లు చేయండి.

Migraine Headache symtoms and Treatment in Telugu

5.పుదీనా 

పుదీనా ఆకులలో మెంథాల్ పార్శ్వపు నొప్పిని తగ్గించటంలో బాగా సహాయపడుతుంది. దీనికోసం మీరు కొన్ని పుదీనా ఆకులను తీసుకొని,వాటిని బాగా రుబ్బి రసం తీయాలి. అలా తీసిన రసాన్ని నుదిటి మీద రుద్దాలి.

అలాగే వేడి బ్లాక్ టీ లో కొన్ని పుదీనా ఆకులను వేసి 10 నిమిషాల తర్వాత త్రాగాలి. ఇలా చేయటం వలన నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

ఇలా పైన చెప్పిన విధంగా చేస్తే మీకు ఎటువంటి హానీ లేకుండా చాలా సులభంగా మీ ఇంట్లోనే పార్శ్వపు నొప్పిని తగ్గించుకోవచ్చు.

 

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.

అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.