Curry Leaves Benefits in Telugu | కరివేపాకు యొక్క ఉపయోగాలు

Curry Leaves Health Benefits in Telugu Language :

Curry Leaves Benefits తెలుసుకోవటం మనకు చాలా అవసరం. ఎందుకంటే మన భారత దేశంలో దాదాపుగా అన్ని వంటకాలలో ఈ Curry Leaves ని విరివిగా ఉపయోగిస్తారు. కరివేపాకు మంచి రుచిని మరియు సువాసనను కలిగి ఉంటుంది. కరివేపాకును ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాలలో ఉండేవారు ఉపయోగిస్తారు.

దీనిని పండించే దేశాలలో భారత దేశం మొదటి స్తానంలో ఉంది. మన దేశంతో పాటు చైనా,నైజీరియా,ఆస్ట్రేలియా, వంటి దేశాలలో కూడా పండిస్తారు. కరివేపాకులో కార్బోహైడ్రేట్స్,పాస్ఫరస్,కాల్షియం,మెగ్నీషియం,అలాగే ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇంకా దీనిలో విటమిన్ ఏ,బి,సి,ఈ లు కూడా అధికంగా ఉంటాయి.

Curry Leaves Benfits inTelugu

కరివేపాకుని ఎక్కువగా ఉపయోగించటానికి ప్రధాన కారణం ఇది చాలా చౌకగా లభించటం. దీనిని పులిహోర,సాంబారు,బిర్యానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల వంటకాలలో విరివిగా వాడతారు, కానీ చాలా వరకు దీనిని తినకుండా తీసి ప్రక్కన పడేస్తారు. దీనివలన కరివేపాకు నుండి లభించే పోషకాలు మనకు లభించకుండా మనమే అడ్డుకుంటున్నాం.

ఈ Curry Leaves కేవలం వంటల్లో మాత్రమే కాకుండా,అనేక రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేయటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కరివేపాకు  వలన కలిగే కొన్ని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం…

1.జీర్ణశక్తిని పెంచుతుంది:

కరివేపాకుని రోజు తీసుకోవటం వలన జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా ఉంటుందో మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని బయటికి పంపిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారు అలాగే జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండాలి అనుకునేవారు ప్రతి రోజు తమ వంటకాలలో కానీ,నేరుగా కానీ ఈ కరివేపాకు తీసుకోవాలి.

కొన్ని కరివేపాకు ఆకులని తీసుకొని,మిక్సీలో వేసి అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి వడ కట్టి పిప్పి పడేసేయండి. ఇప్పుడు ఒక జ్యుసులాగా తయారవుతుంది. ఇలా తయారు చేసిన జ్యుసుని రోజూ ఒక గ్లాసు తీసుకోవటం వలన జీర్ణశక్తి మెరుగు పడుతుంది.

2.మదుమేహంని నియంత్రిస్తుంది:

ప్రస్తుత కాలంలో మధుమేహం ఒక ప్రధానమయిన దీర్ఘకాలిక సమస్య. ఈ రోజుల్లో వయస్సు పెరుగుతుంది అనే బాధ కంటే మధుమేహం గురించి బయపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇలాంటి వారు రోజువారీ వంటకాలలో కరివేపాకుని వాడటం చాలా మంచిది. అలాగే 4 నుండి 5 కరివేపాకులు నేరుగా తినటం అలవాటు చేసుకోవటం వలన మధుమేహ వ్యాధిని కొద్దివరకు నియంత్రించుకోవచ్చును.

Recommended Diabetic Immunity Powder

3.మూత్ర పిండ సమస్యలు:

ఈ కరివేపాకుని ప్రతీ రోజు క్రమం తప్పకుండ ఏదో రకంగా తీసుకోవటం వలన మూత్ర పిండ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అయితే ఇప్పటికే  ఈ సమస్యతో బాధపడేవారు ఎం చేయాలంటే..ముందుగా కరివేపాకు యొక్క వేరుని తీసుకొని,కొన్ని నీళ్లలో వేసి బాగా మరిగించండి.

ఇప్పుడు ఒక కాషాయం తయారవుతుంది. ఇలా తయారయిన కషాయాన్ని రోజూ తీసుకోవటం వలన మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లు కరగటంతో పాటు ఇంకా మూత్రపిండాలకు సంబంధించి అనేక సమస్యలు తొలగి పోతాయి.

4.డయేరియా:

ఎండాకాలంలో చాలా వరకు ఈ డయేరియా సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ డయేరియా నుండి బయటపడటానికి ఒక టీ స్పూన్ కరివేపాకు పొడిని గ్లాసు మజ్జిగలో కలిపి తాగటం వలన మంచి పలితం ఉంటుంది. అలాగే ప్రతీ రోజూ ఒక స్పూన్ కరివేపాకు పొడికి కొద్దిగా తేనె కలిపి తీసుకోవటం వలన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

5.చుండ్రు:

కరివేపాకుకి చుండ్రు ని తగ్గించే గుణం ఉంటుంది. దీనికి మీరు కొన్ని కరివేపాకు ఆకులు తీసుకోవాలి,ఆకులకు సమానంగా నిమ్మపండు తొక్క,శీకాకాయ,పెసలు సమానంగా తీసుకోవాలి.

అలా తీసుకున్న వాటిని అన్ని కలిపి పొడిలాగా నూరుకొని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి. ఇలా నిల్వ చేసుకున్న పొడిని ఒక షాంపూ లాగా వాడుకోవటం వలన వారం రోజుల్లోనే చుండ్రు సమస్య తగ్గుతుంది.

అలాగే కొబ్బరి నూనె తీసుకొని అందులో కొన్ని కరివేపాకు ఆకులను వేసిఆకులు నల్లగా మారేంత వరకు చిన్న మంట మీద వేడి చేసి తరువాత వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న నూనెని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకొని జుట్టుకి వాడుకోవటం వలన జుట్టు పెరుగుదల కు మరియు వెంట్రుకలు తెల్లబడకుండా సహాయపడుతుంది.

Recommended Anti-Dandruff Shampoo

పైన చెప్పిన ఇన్ని రకాలుగా కరివేపాకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కరివేపాకుని చిన్న చూపు చూడకుండా తమ రోజు వారి వంటకాలలో తప్పకుండ వాడుకోవాలి. 

Also Read:Best 10 Health Tips in Telugu

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి. అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.