Gas Trouble Symptoms and Solution in Telugu | జీర్ణ సంబంధ సమస్యల లక్షణాలు మరియు నివారణా మార్గాలు

Gas Trouble problem solution and Ayurvedic Home Remedies in Telugu:

 

ఈ  రోజుల్లో పాశ్చాత్య ఆహారం తినటం,జీవనశైలి వలన gas Trouble Symptoms సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నవారు నలుగురితో చెప్పుకోవాలన్నా నలుగురిలో తిరగాలన్నా చాలా ఇబ్బందిగా భావిస్తారు.

ప్రపంచ జనాభాలో సుమారు 80 శాతం మంది gas troubleతో బాధపడుతున్నారు అని కొన్ని గణాంకాల ద్వారా తెలుస్తుంది. మన జీర్ణాశయంలో సైలెంట్ గా ఉండి,అనుకోకుండా మంట,నొప్పి,తాపం ఏర్పడేదాన్నే gas trouble గా మనం చెప్పుకుంటాం.

ఈ సమస్య ఎక్కువగా ముదిరితే అల్సర్,కణితులు ఏర్పడి కాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు రావటానికి ఆస్కారం ఉంటుంది. జీర్ణాశయ గోడలనుండి ఆమ్లాలు,ఎంజైములు స్రవిస్తూఉంటాయి.

అయితే ఎప్పుడైతే ఈ జీర్ణాశయ గోడలకు గాస్ట్రిస్ సమస్య ఏర్పడుతుందో ఈ ఆమ్లాలు,ఎంజైమ్ల విడుదలలో ఆలస్యం జరిగి జీర్ణక్రియ కుంటు పడుతుంది.

ఈ gastric చిన్న సమస్యగా ఉన్నప్పుడే గుర్తించి తగిన చికిత్స చేయించుకోకపోతే ఈ సమస్య వలన జీర్ణకోశములోనే కాకుండా మిగతా శరీర భాగాలకు వేరే వ్యాధులు వ్యాపించి వ్యాధి తీవ్రత ఎక్కువ అవుతుంది. అయితే ఈ సమస్య ఏర్పడటానికి గల కొన్ని కారణాలు ఏంటో చూద్దాం…

Gas Trouble Symptoms:

  • ఈ రోజుల్లో 50 ఏళ్ళు పైబడిన వారిలో శారీరిక నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయి. అందువలన పెయిన్ కిల్లర్ మందులు వాడటం ఎక్కువైపోయింది. ఈ పెయిన్ కిల్లర్స్ వాడటం వలన జీర్ణాశయంలో పై పూత దెబ్బతిని గాస్ట్రిస్ సమస్యకి దారితీస్తుంది.
  • స్మోకింగ్,ఆల్చహాల్ త్రాగేవారిలో అలాగే సరైన సమయంలో భోజనం చేయకపోవటం,బయట దొరికే జంక్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తినేవారిలో గాస్ట్రిస్ సమస్య రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.

Recommended Ayurvedic Gas Trouble Tablets

  • చాలా మంది ఉదయం పనులలో ఉండి అల్పాహారం తినటం మానేస్తారు. దీనివలన తీవ్రమైన మానసిక ఒత్తిడి,చికాకు ఉంటుంది. దీనికి కారణం పోషకాహారం లోపించటం. దీనికి ఉదయం టిఫిన్ చేయకపోవడమే అని కొన్ని పరిశోధనలో వెల్లడైంది.
  • కొందరు ఆహారం తినే సమయంలో T.V చూస్తూనో లేదా మొబైల్ చూస్తూనో తింటారు. దీనివల్ల వారు ఆహారాన్ని సరిగ్గా నముల కుండా తింటారు. ఇలా తినటం వలన ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లిన తరువాత ఆహారం జీర్ణం కావటానికి జీర్ణాశయం మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆహారం బాగా నమిలి తినాలి.
  • కొందరు ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తుంటారు. అలాగే అతినిద్ర,వ్యాయామం చేయకపోవటం వలన కూడా ఈ సమస్య రావటానికి దారితీస్తుంది.

Solution for gas Trouble:

  • వాము ఎన్నో ఔషధ పరమైన గుణాలను కలిగి ఉంటుంది. ఈ వాము లో థైమాల్ అనే ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది గ్యాస్,అజీర్ణం సమస్యలను తగ్గించటంలో చాలా చక్కగా పనిచేస్తుంది. దీనికి మీరు చేయవలసింది ఏంటంటే…  3 టేబుల్ స్పూన్ల వామును తీసుకోండి,ఇప్పుడు అర కప్పు మరుగుతున్న నీటిలో ఈ వాముని వేసి,కొద్దిసేపటి తర్వాత ఈ మిశ్రమాన్ని వడపోసి త్రాగటం వలన అజీర్ణం సమస్య నుండి బయటపడవచ్చు.

Gas trouble problem solution and ayurvedic home remedies in Telugu

  • ఆపిల్ సైడర్ వెనిగర్ జీర్ణాశయంలోని అనవసరమైన వాయువులను తొలగించటంలో చాలా చక్కగా పని చేస్తుంది. ఇది గ్యాస్ ని దూరం చేయటమే కాకుండా అజీర్ణం సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీనికి మీరు చేయవలసింది 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి,చల్లారిన తర్వాత త్రాగండి. ఇలా చేయటం వలన మీ జీర్ణక్రియ వ్యవస్థ క్రమబద్ధంగా ఉంటుంది.
  • అల్లం ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం. మీరు భోజనం చేసిన తరువాత ఒక చిన్న అల్లం ముక్కని నమలడం ద్వారా అజీర్ణం సమస్య తగ్గుతుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం ని తీసుకొని ఒక సగం గ్లాసు మరుగుతున్న నీళ్లలో కలిపి,ఒక 15 నిమిషాల తర్వాత ఆ నీటిని సేవించండి. ఇలా రోజుకి మూడు సార్లు త్రాగండి.

Gas trouble problem solution and ayurvedic home remedies in Telugu

  • మనకు ఏ విధమైన సమస్య లేకున్నా ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగటం చాలా మంచిది. నిమ్మ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తిని పంచుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం,ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి భోజనం చేసిన తర్వాత తాగితే మంచి పలితం ఉంటుంది.

Gas trouble problem solution and ayurvedic home remedies in Telugu

  • దాల్చిన చెక్క మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఒక మంచి ఔషధం. ఇది మన పొట్ట ని శుభ్రం చేస్తుంది. అలాగే మన కడుపులోని యాసిడ్స్ ప్రభావాన్ని తగ్గించటమే కాకుండా,ప్రేగుల గోడలలో ఉండే ఆమ్లాల స్రావాన్ని తగ్గించటంలో సహాయపడుతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి,1/2 టేబుల్ స్పూన్ తేనెని తీసుకొని ఒక కప్పు పాలలో కలపండి. తరువాత ఆ పాలని వడపోసి తాగండి. ఇలా చేయటం వలన గ్యాస్ట్రబుల్ సమస్య నుండి బయటపడవచ్చు.

Gas trouble problem solution and ayurvedic home remedies in Telugu

 

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.

అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.