Best Weight loss diet in Telugu | బరువు తగ్గాలి అనుకుంటే ఈ డైట్ పాటించండి

7 Days Weight loss Plan-ఏడు రోజుల డైట్ ఎలా చేయాలి?

ఈ రోజుల్లో Best weight loss diet అనేది ఎంతగానో అవసరం. మారుతున్న జీవనశైలి,ఆహారపు,అలవాట్ల వల్ల బరువు పెరగటం జరుగుతుంది. దానిని తగ్గించుకోవటానికి మనం  రకరకాల డైట్స్,ఎక్సరసైస్ లు చేస్తూవుంటాం.

అయినా కూడా బరువు తగ్గక చాలా మంది నిరాశ కు లోనవుతారు. ఇప్పుడు చెప్పే ఈ డైట్లో కచ్చితంగా మీరు ఒక వారంలో రెండు నుండి మూడు కిలోలు తగ్గుతారు. అలాగే 18నుండి 60 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్నవారు మాత్రమే ఈ డైట్ చేయాలి.

 డైట్ చేస్తున్న  ప్రతి రోజు మూడు లీటర్ల నీళ్లు త్రాగాలి,ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం,తేనె కలుపుకొని త్రాగాలి,కానీ ఈ డైట్ ఒక నెలలో రెండు సార్లు మాత్రమే చేయండి.

వెయిట్ లాస్ గ్రీన్ టీ ఈ లింక్ క్లిక్ చేసి కొనండి

 

7 Days Weight loss Plan

 డైట్ చేయకూడని వారు:

  •  షుగర్ వ్యాధి తో బాధపడుతున్నవారు.
  •  నెలసరిలో ఉన్న ఆడవాళ్లు.
  •  ఇతర రోగాల తో బాధపడుతున్న వారు.

 

Day 1: మొదటి రోజులో కేవలం పండ్లు మాత్రమే తినాలి,కానీ అరటి పండు తినకూడదు. ఉదయం ఒకగ్లాసు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం,తేనె కలుపుకొని త్రాగాలి. ఉదయం,మధ్యాహ్నం,రాత్రి పండ్లు మాత్రమే తినాలి. ఆపిల్,జామ,బొప్పాయి,పుచ్చపండు,ద్రాక్ష,ఆరంజ్,సపోటా మొదలైన పండ్లు తినవచ్చు. కావాలి అంటే గ్రీన్ టీ కూడా త్రాగవచ్చు. 

7 Days Weight loss Plan

 

Day 2: రెండవ రోజు కూరగాయలు,ఆకుకూరలు మాత్రమే తినాలి,బంగాళాదుంప మాత్రం తినకూడదు. ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం,తేనె కలుపుకొని త్రాగాలి. కూరగాయలు పచ్చివి తినవచ్చు, కావాలంటే ఉడక పెట్టుకొని తినవచ్చు. ఆయిల్ మాత్రం వాడరాదు.సొరకాయ,కీరదోస,చిక్కుడు,బీరకాయ,పాలకూర,మెంతి కూర,మొదలైననవి తినవచ్చు.

7 Days Weight loss Plan

 

Day  3:  మూడవ రోజు పండ్లు,కూరగాయలు కలిపి తినాలి. ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం,తేనె కలుపుకొని త్రాగాలి. ఉదయం పండ్లు తీసుకున్నారు అనుకోండి మధ్యాహ్నం కూరగాయలు తీసుకోండి. ఆలా మార్చి మార్చి తీసుకోండి. గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు.

7 Days Weight loss Plan 

Day 4: నాల్గవ రోజు 6 అరటి పళ్ళు ,మూడు గ్లాసుల పాలు  తీసుకోవాలి. ఉదయం నిద్రలేవగానే ఓక గ్లాసు గోరువెచ్చని నీళ్ల లో నిమ్మరసం,తేనె కలుపుకొని త్రాగాలి. ఒక గంట తరువాత 2 అరటి పళ్ళు,ఒక గ్లాసు పాలు  త్రాగాలి,ఆలానే మధ్యాహ్నం,రాత్రి కూడా 2 అరటి పళ్ళు,ఒక గ్లాసు పాలు త్రాగాలి. ఎలాంటి ఇతర ఆహారం తీసుకోకూడదు.

7 Days Weight loss Plan

 

Day 5: ఐదవ రోజు వెజిటేరియన్స్ తినేవాళ్లు అయితే 300 గ్రాముల  పన్నీర్,250 గ్రాముల సొయా తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే 1/2 కిలో  చికెన్,రెడ్ మీట్,12 గుడ్లు తీసుకోవచ్చు. అయితే పైన చెప్పిన వాటిలో ఏదో ఒకటి మాత్రమే తీసుకోండి. వొండుకునేటప్పుడు ఎలాంటి ఆయిల్ వాడకూడదు,కావాలంటే టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పు,కారం వాడుకోవచ్చు.

7 Days Weight loss Plan

Day 6:ఆరవ రోజు కూడా ఐదవ రోజులో చెప్పిన విధంగానే తీసుకోవాలి,వాటితో పాటు కూరగాయలు కూడా తీసుకోవచ్చు.

7 Days Weight loss Plan

 

Day 7: ఏడవ రోజు ఉదయం,మధ్యాహ్నము,రాత్రి కేవలం ఒక కప్పు బ్రౌన్ రైస్ తో పాటు దానికి సరిపడా ఏదైనా కర్రీ తీసుకోవాలి. ఇలా చేస్తే మీరు 2 నుండి 4 కిలోల బరువు తగ్గుతారు.

బెస్ట్ వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ కి ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి. అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.