Tulasi benefits to beauty for your skin and hair in Telugu|సహజమైన అందం నిగారింపు కోసం తులసి చిట్కాలు

చర్మం మరియు జుట్టుకు తులసి ఉపయోగాలు(Tulasi benefits for skin and hair) 

సహజమైన అందం(beauty) మరియు ఆరోగ్యాన్ని మన చర్మానికి ఎలా ఉపయోగపడుతుందో మీరే చదవండి.

        కరోనావైరస్(corona virus) మన శరీరాలకే కాకుండా, ప్రపంచ పర్యావరణానికి కూడా ఎంతో హాని చేసింది. అలాగే సౌందర్య సాధనాల(beauty products)పై కూడా ప్రభావం చూపింది. రసాయన ఉత్పత్తుల కొనుగోలు తగ్గుముఖం పడేంతగా బయటికి వెళ్లలేకపోతున్నారు. అలాంటివారి కోసం ఇంట్లోనే మెరిసే చర్మాన్ని(glowing skin) సొంతం చేసుకొనేలా తులసి చాలా ఉపయోగపడుతుంది. 

Tulasi benefits to beauty for your skin and hair in Telugu

       అందంగా మెరిసిపోయే చర్మం కోసం, సహజసిద్దమైన పదార్థాలు(natural products) చాలా బాగా ఉపయోగపడుతాయి. అందులో మన ఇంట్లో రోజు కనిపించే తులసి మొక్క(basil plant). తులసి చర్మసంబంధిత సమస్యలు(skin diseases) తగ్గించేస్తుంది. తులసి అనేది మీ చర్మానికి ఎంతో మీలు చేసే సుగంధం మొక్క. తులసి మొక్క చాలా సులభంగా లభిస్తుంది. మంచి రసం కలిగి ఉంటుంది. ముఖ్యమైనది “విష్ణుమూర్తికి” ఎంతో  ప్రీతికరమైనది, ఇష్టమైనది.రాక్షస భాదను తొలగించే సామర్థ్యం కలిగి ఉంది. అలాగే మన మనసు మరియు మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కూడా తన గాలి ద్వారా ఎంతో ప్రవిత్రతను కలిగిస్తుంది.

          మన చర్మం కోసం తులసి ఆకులు ఎంతగానో ఉపయోగపడి లాభాన్ని చేరుస్తుంది. కర్పూరం, యూకలిఫ్టస్, యుజెనాల్ మరియు బీటా-కార్యోఫైలిన్ వంటి అంశాలు తులసిలో ఉండటం వల్ల, ఇది ఒక శక్తివంతమైన “యాంటిఆక్సిడెంట్”, మరియు చర్మం కోసం యాంటీమైక్రోబయల్ ఏజెంట్ గా చర్మగాయాలను తగ్గించడంలో ఎంతో సహకరిస్తుంది.

        తులసి లో విటమిన్లు, మినరల్స్, ఎలెక్రోలైట్స్, మరియు ఫీతోనూట్రిఎంట్స్ లాంటివి ఎన్నో కలిగి ఉండి, తులసి ఒక అద్భుతమైన పదార్థంగా మన healthy hair and skin కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖంపై వచ్చే pimples blackheads acne and skin infections ని తగ్గించడంలో ఉపయోపడుతుంది. ఇందులో చాలా ఎక్కువగా విటమిన్ k, యాంటీఆక్సిడెంట్స్ సహకారంతో జుట్టు లోపల blood circulation కలిగించి జుట్టు పెరగడంలో ఉపయోపడుతుంది.

తులసి చర్మానికి, శిరోజాలకు,దంతాలకు  ఎంతో మేలును కలిగిస్తుంది. అలాగే వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

 మొటిమలను తగ్గించడంలో తులసి పాత్ర | tulasi uses for pimples in telugu

Tulasi benefits to beauty for your skin and hair in Telugu

  • తాజా తులసి ఆకులను తినడం వల్ల రక్తం శుద్ధి అయి మొటిమలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి.
  • తులసి ఆకులని పేస్ట్ చేసి ముఖానికీ అప్లై చేసిన మంచి ఫలితం ఉంటుంది.
  • తులసి ఆకుల పేస్ట్ కి కొంచెం పసుపు కలిపి, క్రమం తప్పకుండ వారానికి 2,3 సార్లు అప్లై చేసిన మొటిమలు నుండి విముక్తి  కలుగుతుంది
  • tulasi powder + rosewater తో కలిపి ముఖానికి పట్టిస్తే చర్మరంధ్రాలు తెరుచుకొని, మొటిమలు, చర్మసమస్యలు తగ్గుతాయి.
  • తులసి ఆకుల రసానికి, పుదీనా ఆకుల రసం కలిపి ముఖానికి అప్లై చేస్తే ఉపశమనం ఉంటుంది.

చర్మానికి ఉపయోగపడే తులసి cleanser(Tulasi cleanser uses for skin in Telugu) 

Tulasi benefits to beauty for your skin and hair in Telugu

          వాతావరణం నుండి వచ్చే కాలుష్యం, వేడి, దుమ్ము దూళి మరియు బ్యూటీ ప్రొడక్ట్స్ నుండి వచ్చే సమస్యలు, ముఖం ఫై ఉండే excess oil ఇలా అన్నింటిని తొలగిస్తుంది.

  • oily skin : tulasi leaves paste +egg white తో పేస్ట్ లా కలిపి ముఖానికి అప్లై చేసి, 10-15 మినిట్స్ టైం వరకు వేచి, ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటె ముఖ చర్మం చాలా క్లీన్ గా ఉంటుంది.
  • పాలను బాగా మరిగించిన తర్వాత అందులో తులసి ఆకులు + కరివేపాకు ఆకులు వేసి చల్లారబెట్టాలి. కొద్దిసేపు అయినాక ఆకులని వడకట్టి, మిగిలిన పాలను డబ్బాలో నిలువ చేసి, creamy face cleanser గా వాడుకోవోచ్చు.

తులసి నూనె(Tulasi oil)

       శిరోజాల సంరక్షణకు కూడా తులసి చాలా అవసరం. కేశసంపదను పెంచుతుంది. కుదుళ్ళలో చెమట, దురద, చుండ్రు, చిన్న చిన్న కురుపులు రావడం వంటి సమస్యలతో భాధపడుతుంటారు. ఇటువంటి వారికి తులసి నూనె చక్కటి ఔషదంగా ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది. తులసి ఆకు పొడి ని కొబ్బరి నూనె తో కలిపి వేడి ఎక్కడం మొదలయ్యాక దానిలో మెంతులు కూడా వేసి బాగా వేడి చేయాలి. ఈ నూనెను డబ్బాలో భద్రపరుచుకొని, వారానికి 2 సార్లు తలకు మర్దన చేసి, గంట సమయం తర్వాత తలస్నానం చేయాలి. సమస్య నుండి అతి త్వరలో పరిష్కారం లభిస్తుంది.

నల్లమచ్చలు (pigmentation)
  1.  తులసి ఆకుల రసానికి అంతే మోతాదులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి, 15 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ప్రతిరోజు చేయడం వల్ల నల్లమచ్చలు తగ్గుతాయి.
  2. తులసి ఆకు పేస్ట్ + పసుపు కలిపి పేస్ ప్యాక్ ల వేసుకుంటే కూడా మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడతాయి.
  3. తులసి ఎండు ఆకుల పొడి + తేనె తో కలిపి ప్యాక్ వేసుకున్నాక, గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మంచి కలర్ మరియు చర్మం మృదువుగా మారుతుంది.
తులసి టోనర్(tulasi toner)

         తులసి ఆకులు నీటిలో వేసి మరిగించాక, ఈ నీటిని చల్లార్చిన తర్వాత అందులో  కొన్ని చుక్కలు గ్లిసరిన్ వేసి, ఈ ద్రావణాన్ని టోనరుగా వాడుకోవచ్చు. మొటిమలు పోవడమే కాకుండా, ముఖ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

Acne and radiant skin కోసం

Tulasi benefits to beauty for your skin and hair in Telugu

  • ఆయిలీ లేదా సున్నితమైన చర్మం కలిగి ఉన్నట్లయితే ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. acne నుండి రక్షణ పొందడం అంటే, దీనికి తులసి చాలా సహాయపడి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది అలాగే చర్మం నుండి టాక్సిన్స్ మరియు బాక్టీరియాను తొలగిస్తుంది. ఇది ఒక astringent గాను ఉపయోగపడుతుంది.
  • తులసి ఆకుల పేస్ట్ + చందనం పొడి + rosewater ను కలిపి ప్యాక్ ల తయారు చేసుకుని, ముఖానికి అప్లై చేయాలి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు వేసుకుంటూ ఉంటే, చర్మ తత్వాన్ని కాపాడుకోవొచ్చు.
  • తులసి ఆకులు + వేపాకు + లవంగాలు, కొన్ని నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ని కూడా ముఖానికి అప్లై చేస్తూ ఉంటె మంచి ఫలితం కన్పిస్తుంది.
  • తులసి ఆకులు + గ్రీన్ టీ ఆకులు + పెరుగు కలిపి పేస్ట్ లా తయారు చేసుకొని, ప్యాక్ ల వేస్తూ ఉంటె మెరిసే చర్మాన్ని పొందవొచ్చు.
చర్మంపై ముడతలు తగ్గడానికి(Reduce the wrinkles)

    వేడి ఉష్ణోగ్రతలో ఎక్కువ సేపు ఉండడం వల్ల మొదటగా నష్టం కలిగేది చర్మానికి. చర్మంలో సాధారంగా ఉండే ఆయిల్స్ ని  తగ్గించేస్తుంది. బిగుతువుగా ఉండే చర్మం లూజుగా అయ్యేలా చేస్తుంది. ముఖంపై గీతలు, ముడతలు కన్పించడం మొదలు అవుతుంది.

  •  తులసి ఆకులని నీళ్ళల్లో వేసి మరిగించిన, చల్లార్చిన ఆ నీటిని రోజు తాగడం వాళ్ళ ఆరోగ్యవంతమైన ఫలితాన్ని పొందవొచ్చు .
  1. తులసి గ్రీన్ టీ(tulasi green tea) : గ్రీన్ టీ ఆకులు మరియు తులసి ఆకులు నీళ్లలో వేసి, బాగా మరిగించాక, తేనె ను కలిపి తీసుకుంటూ ఉంటె చర్మం దృఢత్వాన్ని కలిగి ఉండడం మొదలౌతుంది.
చర్మతత్వం లేతగా మారడం(Tulasi pack for even and lighten skin tone)

Tulasi benefits to beauty for your skin and hair in Telugu

           uneven skin tone and hyperpigmentation రావడానికి ముఖ్య కారణం, pollution and the harsh UV rays. detoxifying చేయడం వల్ల pollution and heat and stress నుండి రిలాక్స్ ను కలిగించి skin condition ను సక్రమంగా ఉంచుతుంది. తులసి లో ఉండే ఆయిల్స్ చర్మానికి nourish and moisturize ను అందించి, చర్మ మృదుత్వాన్ని రెట్టింపు చేస్తుంది.

  • తులసి ఆకులు + శనగపిండి + నీళ్లు కలిపి ప్యాక్ తయారుచేసి, వారానికి 2,3 సార్లు అప్లై చేస్తూ ఉండాలి. మంచి నిగారింపును సొంతం చేసుకోవొచ్చు.

పొడిబారిన చర్మం కోసం తులసి ప్యాక్(Tulasi face mask for dry skin)

       తులసి పొడి + పెరుగు తో ప్యాక్ రెడీ చేసి ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాలు వొదిలేసి, క్లీన్ చేసుకోవాలి.

జిడ్డుగా ఉండే చర్మం కోసం తులసి ప్యాక్(Tulasi face mask for oily skin)

      తులసి పొడి + ముల్తానీ మట్టి + చందనం పొడి + jojoba oil 4 drops +rose water . వీటన్నింటిని కలిపి ప్యాక్ రెడీ చేసి ముఖానికి అప్లై చేయాలి.

Spot treatment for blemishes

      తులసి ఆకులు + వేప ఆకులు కలిపి కొంచెం నీళ్లు వేసి పేస్ట్ చేయాలి. ఇందులో నిమ్మకాయ రసం 4,5 చుక్కలు కలిపి, ప్యాక్ ను సిద్ధం చేసి ముకానికి అప్లై చేయాలి.

తులసి నీళ్ళతో ముఖానికి ఆవిరి పట్టించడం(Tulasi facial steam)

     రాత్రి పడుకొనే ముందు ఈ steam ను ముఖానికి అందించాలి. మంచి relaxation ను ఇస్తుంది.

  • స్టీమ్ లో తాజా తులసి ఆకులు లేదా ఎండిన తులసి ఆకులు వేసి మరిగించాలి.
  • cleanser తో ముఖం క్లీన్ చేసుకున్నాక, స్టీమ్ 10-15 నిమిషాలు ముఖానికి అందేలా చేయాలి.
  • తర్వాత ముఖాన్ని శుభ్రం చేసి, serum or moisturizer ను అప్లై చేసుకోవాలి.
జుట్టు రాలిపోవడం తగ్గిస్తుంది(reducing the hair fall)
  • తులసి ఆకుల్ని కొబ్బరి నూనెలో వేసి మరిగించి తలకు పట్టించి, తలస్నానం చేయాలి.
  • ఆమ్లా పొడి మరియు తులసి పొడి ని తీసుకొని అందులో 1 టీస్పూన్ కొబ్బరి నూనె కలిపి పేస్ట్ ల చేసి జుట్టు కు అప్లై చేసి, 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.
  • వెంట్రుకలు చిట్లిపోకుండా ఉండాలంటే, తులసి ఆకుల పేస్ట్ లో 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ కలబంద పేస్ట్ వేసి కలిపి జుట్టుకు అప్లై చేయాలి. 1 గంట సమయం తర్వాత తలస్నానం చేయాలి.వెంట్రుకలు మృదుత్వాన్ని పొందుతుంది.
చుండ్రుని తగ్గిస్తుంది(reduce the dandruff)

       చాలా  సులువైన పద్దతిలో మీరు తలకు వాడే regular నూనె లో, కొంచెం తులసి నూనెను జత చేసి అప్లై చేస్తూ ఉండాలి.

Tulasi hair mask for conditioning

        తులసి పొడి మరియు వేప ఆకు పొడి + బాదం నూనె లేదా కొబ్బరి నూనె ను కలిపి జుట్టుకు అప్లై చేయాలి.

తెల్ల వెంట్రుకలు తగ్గించడానికి(control the white hair) 

        ఆమ్లా పొడి ని మరియు తులసి పొడి ని నీళ్ల పేస్ట్ ల కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఈ మిశ్రమంతో తర్వాత రోజు జుట్టును కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మంచి నిగారింపును అందిస్తుంది.

దంత సౌందర్యానికి(teeth whitening) 

దంతాలపై పాచి తొలగించి, మెరిసే తత్వాన్ని అందించడంలో తులసి కూడా ఒక ఆయుర్వేద ఔషదంగా ఉపయోగపడుతుంది. ఎండిన తులసి ఆకుల పొడిని రోజు క్రమం తప్పకుండ దంతాలపై కనీసం 10 నిమిషాలు రుద్దితే కొద్దీ రోజుల్లోనే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

Add Comment