Best Hair growth tips in Telugu | వెంట్రుకల పెరుగుదలకు ఉపయోగపడే చిట్కాలు

Best Tips for Hair fall and growth in Telugu:

చాలా మందిని బాధపెట్టే సమస్య Hair fall. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు,ఆహారపు అలవాట్ల వల్ల  చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని వేధిస్తున్న ప్రధాన సమస్య జుట్టు రాలటం. జుట్టు ఊడిపోతుంటే అదేదో ప్రాణం పోతున్నట్టు బాధపడేవారు చాలా మందే ఉంటారు. జుట్టు సహజంగా రోజూ ఎంతో కొంత రాలిపోతూ వుంటుంది.

ఎందుకంటే జుట్టు లో మూడు దశలు ఉంటాయి అవి… ఎప్పుడూ  పెరిగే దశ,విశ్రాంతి దశ,రాలిపోయే దశ అనే మూడు రకాలుగా ఉంటుంది. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే….జుట్టు మాములుగా మగవాళ్ళలో తల మీద లక్ష దాక,ఆడవారిలో లక్షన్నర దాక ఉంటాయి.

జుట్టు ఎందుకు రాలుతుందో కారణాలు తెలుసుకోకుండా షాంపూలు,క్రీంలు,ఆయిల్స్ ఎన్ని వాడినా కూడా ఫలితం ఉండదు.  ఇవన్నీ వాడే ముందు అసలు జుట్టు ఎందుకు రాలుతుందో తెలుసుకోవాలి.

Recommended Hair Fall Control Oil

Best Tips for Hair fall and Hair growth in Telugu

  •  ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినేవారిలో,కాలుష్యంలో తిరిగే వారిలో జుట్టు రాలుతుంది.
  •  కొందరిలో ఎప్పుడయినా జ్వరం లాంటి సమస్య వచ్చిందనుకోండి జ్వరం తగ్గిన తరువాత రెండు వారాలకో లేదా మూడు వారాలకో జుట్టు మాములుగా ఊడిపోయేదానికంటే ఎక్కువగా ఊడిపోతుంది.
  • ఆడవారిలో గర్భినిగా ఉన్నసమయములో జుట్టు సహజంగా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ సమయములో హార్మోన్స్ లెవెల్స్ బాగుంటాయి కానీ డెలివరీ అయినా తరువాత కొన్న్ని రోజులకు జుట్టు రాలటం జరుగుతుంది.

Best Tips for Hair fall and Hair growth in Telugu

  • డిప్రెషన్ వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఎక్కువగా డిప్రెషన్ ఉన్నవాళ్లలో హార్మోన్స్ లెవెల్స్ తగ్గటం,పెరగటం జరగటం వల్ల  జుట్టు కి కావలసిన పోషకాలు లభించవు.
  • కొందరు దీర్ఘకాలిక వ్యాధులకు వాడే మందులు,అలాగే యాంటిబయోటిక్ మందులు వాడటం వలన కూడా జుట్టు రాలుతుంది.
  • డాండ్రఫ్ ఉన్నవాళ్లలో కూడా ఈ సమస్య ఉంటుంది. అలాగే వంశపార్యంగా కొందరిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
  • మనం మార్కెట్లో దొరికే అనేక రకాల నూనెలు వాడటం వలన కూడా జుట్టు రాలుతుంది. ఈ నూనెలలో సహజంగా ఉండే నూనెతో పాటు పెట్రోలియం బయో అనే కెమికల్స్ ఎక్కువగా వాడతారు. 
  • చాలా మంది జుట్టు అందంగా కనపడటానికి ఏవేవో కలర్స్ వాడుతుంటారు.దీనివల్ల కూడా జుట్టు రాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

జుట్టు రాలకుండా ఉండటానికి  తీసుకోవాల్సిన కొన్నిజాగ్రత్తలు:

 

  • ఎప్పుడైతే జుట్టు రాలే సమస్య ఉంది అనుకుంటే…ముందుగా గృహవైద్యం వాడటం మంచిది. కొబ్బరి నూనె గాని ,ఆముదం నూనెగాని లేదా నువ్వుల నూనె తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసి  రాత్రి పడుకునే ముందు తలకు బాగా పట్టించి తరువాత రోజు ఉదయం కుంకుడు కాయ రసం తో స్నానం చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయటం వల్ల జుట్టు రాలుట తగ్గించవచ్చు.
  • ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే ఒక సామెత అందరికి తెలిసే ఉంటుంది. అయితే ఈ ఉల్లి రసాన్ని వారానికి రెండు లేదా మూడుసార్లు తలకు బాగా పట్టించి ఒక గంట తర్వాత కుంకుడు కాయ రసం తో స్నానం చేయటం వల్ల మూడు నెలల్లో ఈ జుట్టు రాలె సమస్య నుండి బయటపడవచ్చు.
  • జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వకూడదు మరియు హెయిర్ బ్యాండ్స్ వాడకం తగ్గించాలి.
  • మంచి పోషకాలు,ప్రోటీన్స్ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. అలాగే బయట దొరికే తినుబండారాలు,ఫాస్ట్ ఫుడ్,జంక్ ఫుడ్స్ వంటి ఆహారాలను తినటం తగ్గించాలి.

పైన చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలే సమస్య నుండి బయటపడవచ్చు,కానీ కొందరిలో సమస్య తీవ్రంగా ఉంటుంది…అలాంటి వారు డాక్టర్ సూచనల మేరకు ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది.

 

 

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.

అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.