తమలపాకు ఆధ్యాత్మికతకు ప్రతీకగాను, అనారోగ్య సమస్యలకు “సంజీవిని” ఔషధంలాగా చేసే అద్భుతాలు ఎన్నో..|Betel leaf is a symbol of spirituality, and as a “sanjeevini” medicine for health problems in Telugu.

తాంబూలధారణతో తగినంత శక్తిని అందించే తమలపాకు, అనారోగ్య సమస్యలకు ఒక సంజీవిని ఔషధం(Betel leaf, which provides enough energy along with tambuladharan, is an antidote to ailments).

      ఆధునిక ప్రపంచంలో అందరు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడం సర్వ సాధారణంగా మారడం మనం చూస్తున్నాము.. అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాము. దీనికి ముఖ్యముగా మన జీవన విధానం మరియు ఆహారపు అలవాట్లు(Eating habits), వింత వింత రుచులు(Strange strange flavors) మన ఆరోగ్యాన్ని దెబ్బ తీసే విధంగా ఉంటున్నాయి. ఉరుకుల పరుగుల జీవన ప్రయాణంలో చిన్న సమస్య కాస్త అతి ప్రమాదకరంగా మారే వరకు కూడా నిర్లక్ష్యంగానే ఉండడం జరుగుతుంది.

      కానీ, మన ఆరోగ్యానికి ఔషధంగా ఉపయోగపడడానికి మన ఇంటి పెరట్లో(In our backyard) పెరిగే మొక్కల ద్వారా లభించేవి ఎన్నో రకాలుంటాయి అని మనం గ్రహించాల్సి ఉంటుంది. ఇవి రోగాలను చిన్న చిన్న ఇంటి చిట్కాల(Home Tips) రూపంలో నయం చేయడానికి ఎంతగానో సహాయపడుతాయి. ఇందులో భాగంగా మనం తెలుసుకోబోతున్న ఆకు “తమలపాకు”.Betel leaf is a symbol of spirituality, and as a "sanjeevini" medicine for health problems in Telugu.

    తమలపాకు ఒక తీగ చెట్టు. తమలపాకు(betel leaf) భారతీయ సంస్కృతిలోనే ఒక భాగం అని చెప్పాలి. ఈ తమలపాకును “నాగవల్లి(Nagavalli)” అని కూడా పిలుస్తారు. మరియు “గ్రీన్ గోల్డ్(Green Gold)” అని కూడా అంటారు. ఇది భారతీయ ఔషధం యొక్క పురాతన ఆస్తి(Ancient property)గా వ్యవహరిస్తారు. పూజా కార్యక్రమాల నుండి వివాహ శుభకార్యాల వరకు తమలపాకు తప్పనిసరి అవుతుంది. తాంబూలం కోసం ఉపయోగించేందుకు ముఖ్యమైన భాగం ఈ తమలపాకు. ఇది భారతదేశంలో విరివిగా లభిస్తుంది. ఇది “పైపరేసి(Piperaceae)” కుటుంబానికి చెందింది. తమలపాకును ఉత్తర భారతంలో “పాన్ పత్తా(పాన్ ఆకులు)(Paan leaves)” అని పిలుస్తుంటారు. తమలపాకుల తాంబూలం మన సంస్కృతిలో విశిష్ట స్థానం సంపాదించుకుంది. ఇలా..ఆయుర్వేదంలో  కూడా మన ఆరోగ్య మెరుగుదలకు తమలపాకు సేవనాన్ని ఔషదంగా ఉపయోగిస్తారు.

Betel leaf is a symbol of spirituality, and as a "sanjeevini" medicine for health problems in Telugu.

హిందూమతంలో ప్రసిద్ధి చెందిన తమలపాకులు(Betel leaves are popular in Hinduism) :

  1.  ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది హైందవ మతం. ఈ హిందూ మతం యొక్క సంస్కృతి మన ప్రకృతిలో పెరిగే వృక్షాలు, చెట్లను పూజించడానికి, ఆరాదించటానికి ప్రాధాన్యతనిచ్చింది.
  2. భారతదేశంలో ఏ పండుగను తీసుకున్న అందులో ప్రకృతి ఆరాధన మిళితమై ఉంటుంది.
  3. ఉగాది పండుగకు వేపచెట్టు,
  4. సంక్రాంతి పండుగకు ధాన్యరాశులు, పశు పక్షాది పట్ల ప్రేమ చూపటం.
  5. అలాగే, వినాయక చవితి అంటే, నానావిధ ఫల పత్ర పుష్పాలతో స్వామిని అర్చించటం జరుగుతుంది. ఇలాంటి విశిష్ట సంస్కృతి మరి ఏ ఇతర మతంలోనూ కనపడదు. ప్రతి పండుగలో, ప్రతి శుభ సందర్భంలోను తాంబూలానికి అగ్రస్థానము ఉంటుంది.
  6. ముఖ్యమైన విషయం, మన భారతీయ సంస్కృతిలో వివాహది శుభకార్యాలకు తమలపాకు ఖచ్చితంగా ఉండాల్సిందే.  Betel leaf is a symbol of spirituality, and as a "sanjeevini" medicine for health problems in Telugu.
  7. ప్రపంచంలో దాదాపుగా 100 రకాల తమలపాకు తీగలు ఉన్నాయి. వాటిలో 40 రకాలు భారతదేశంలో కన్పిస్తున్నాయి.
  8. అయితే, ఈతమలపాకు చరిత్ర సుమారు 5000 వేల సంవత్సరాల కాలం నాటిది అని వివిధ మత గ్రంథాలలో, పురాణాలలో ప్రస్తావించారని చెప్తున్నారు.         
  9. అన్ని దేవాలయాలలో దేవతలు, దేవతలకు నిర్ణీత సంఖ్యలో తమలపాకుతో పూజ చేస్తారు మరియు మాలగా తయారు చేసి వేస్తుంటారు.
  10. అందులోని ఆంజనేయ స్వామికి తమలపాకుతో పూజ అంటే చాల ప్రీతికరం అయినది అని చెపుతారు.
  11. తమలపాకులను పూజ చేయునపుడు మరియు దేవుని ముందు పెట్టే కలశ స్థాపనలో ఉంచుతారు. శత పాత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్టే అని ఒక నమ్మకం ఉంది.
  12. వివిధ నోములు, వ్రతాలు, శుభకార్యాలు జరిగినపుడు అరటిపళ్ళు, ఒక వస్త్రం, తమలపాకుతో కలిపి ఇవ్వడం ఆనవాయితి.
  13. జ్యోతిష్య శాస్త్రం(Astrology)లో, తమలపాకులు అన్ని రకాల సమస్యలను, బాధలను తొలగించగలదు. మరియు అనేక రకాల కోరికలను నెరవేర్చగలదు. మరియు జీవితంలో అద్బుతమైన మార్పులను తీసుకురాగల శక్తి కలిగి ఉంది ఈ తమలపాకు అని వర్ణింపడం జరిగింది.
తమలపాకు పోషకాలు(Nutrients of betel leaf) :

100 గ్రాముల తమలపాకులో ఉండే పోషకాలు

  • కేలరీలు                   –          61 గ్రాములు
  • కొవ్వు                     –             1 గ్రాము
  • కార్బోహైడ్రేట్లు             –           6 గ్రాములు
  • ఫైబర్                      –          1.8 గ్రాములు
  • ప్రోటీన్                    –          3 గ్రాములు

ముఖ్య గమనిక(Important Note) :

  1. తమలపాకును సాధారణంగా భోజనం తర్వాత నమలడం వల్ల జీర్ణక్రియ(digestion)కు సహాయపడుతుంది. మరియు నోటి ఆరోగ్యాన్ని(Oral health) మెరుగుపరుస్తుంది.
  2. తమలపాకును తినేటపుడు వాటి తొడిమను తీసేసి తినాలి.
  3. తమలపాకును తాజాగా నమిలినపుడు మాత్రమే ప్రయోజనం పొందుతాము.
  4. తమలపాకులో సున్నం(Lime), కాసు(kasu), తంబాకు(tobacco)..తదితర కృత్రిమ పదార్థాలు(artificial materials) చేరిస్తే, శరీరానికి హానికరంగా మారుతుంది అని గ్రహించాలి.
  5. తమలపాకులో పొగాకు ఉత్పత్తులు(tobacco products), పోకలు  వంటివి కలిపి తీసుకుంటే,అది నోటి క్యాన్సర్(oral cancer) కు కారణమౌతుంది.
  6. అయితే, కేవలం తమలపాకులను మాత్రమే నమిలితే ఈ ఆకులో “ఫైటోకెమికల్స్(Phytochemicals)” క్యాన్సర్ వ్యాధిని నిరోధించగలవు.

Betel leaf is a symbol of spirituality, and as a "sanjeevini" medicine for health problems in Telugu.

తమలపాకు యొక్క ఉపయోగాలు(Uses of betel leaf) :

ఆధ్యాత్మికతకు సంబంధించిన కార్యక్రమాలకు,శుభకార్యాలకు తమలపాకులను ఉపయోగించడం తెలిసినదే, అయితే, సహజంగా తమలపాకులో ఉండే పోషకాలు..మన ఆరోగ్యానికి మేలు చేసే విధానం తెలుసుకుందాం..

  • ఎముకలకు మేలు చేసే క్యాల్షియం(Calcium), ఫోలిక్ యాసిడ్(folic acid), విటమిన్ ఏ, సి(vitamin A, C) మరియు థయామిన్(thiamin), నియాసిన్(niacin), రిబోఫ్లావిన్(riboflavin), కెరోటిన్(carotene) వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
  • తాంబూలం రూపంలో తీసుకునే తమలపాకు మనకు రోగనిరోధక శక్తిని(Immunity) పెంచుతుంది.
  • ఫైబర్(Fibre)-అంటే పీచు పదార్థం. ఇది తమలపాకులో చాల ఎక్కువగా ఉంటుంది.
  • మన జీర్ణవ్యవస్థకు ఆకుకూరలు(Greens) ఏ విధంగా మేలు చేస్తాయో, తమలపాకులు కూడా అంతకంటే ఎక్కువగా మేలును కలిగిస్తాయి.
  • తమలపాకు యాంటీ ఆక్సిడెంట్(Antioxidant) గా పని చేస్తుంది. అంటే, ముసలితనపు మార్పులను కట్టడి చేస్తుంది అంటారు.
  • తాంబూలం కోసం తమలపాకులు అవసరపడుతాయి. మరియు భోజనానంతరం తాంబూల సేవనం అనేది మన సాంప్రదాయం.
  • తమలపాకు రసంను గొంతు నొప్పి(sore throat) నివారణకు ఉపయోగిస్తారు.
  • తమలపాకులను దంచి చూర్ణముగా చేసి రాత్రంతా నీటిలో ఉంచండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగడం వలన ప్రేగు కదలికలు సులభతరం అవుతాయి. కడుపు శుభ్రం అవుతుంది అని ఆయుర్వేదం చెప్తుంది.
  • ప్రతి రోజు ఉదయం తమలపాకు టీ(Betel leaf tea), తమలపాకు నీళ్లు(betel leaf water) తాగడం మంచి అలవాటు అని చెప్పవచ్చు.
తమలపాకుకు సంబంధించిన ఆధ్యాత్మికత(Spirituality of Betel Leaf) :
  1. ఎవరి ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడుకి తావు ఉండదు అని పండితులు చెప్తుంటారు.
  2. మన ఇంట్లో ఉండే కష్టాలు తొలగిపోయి, మనకు అదృష్టం కలిగి పట్టిందల్లా బంగారమే అవుతుందంట.
  3. ఈ చెట్టు మన ఇంట్లో ఉండడం వల్ల ఎటువంటి గ్రహదోషాలు ఉండవు. భూత, ప్రేత, పిశాచాలు మన ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు అని అంటారు.
  4. తమలపాకు తీగ చెట్టు ఇంట్లో ఉండడం అనేది సాక్షాత్ ఆంజనేయ స్వామి మన ఇంట్లో కొలువై ఉన్నట్టే అని అర్ధం.
  5. ఈ మొక్క ఎదుగుతూ, చిగురిస్తూ ఉంటే, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మన మీద ఉన్నట్టే.
  6. అప్పులు తీరి, ఆర్థికంగా బాగుండాలి అన్న తమలపాకు చెట్టును మన ఇంట్లో తప్పకుండ పెంచుకోవాలి అంటారు.
  7. మన ఇంట్లో ఐశ్వర్యం సమృద్ధిగా ఉండాలి అంటే, నువ్వుల నూనె కలిపినా సిందూరంతో “శ్రీరామ” అని తమలపాకు పై రాసి, ఈ ఆకును ఆంజనేయ స్వామి పటం ముందు ఉంచి నమస్కరించాలి. మరుసటి రోజు ఉదయం దానిని తినడం కానీ, పారే నీటిలో వేయడం కాని చేయాలి. ఇలా చేస్తే లక్ష్మి దేవి అనుగ్రహానికి పాత్రులు అవుతాము అని పండితులు చెప్తున్నారు. అయితే, ఈ ఆకును చెత్త బుట్టలో కానీ, అందరు నడిచే దారిలో కానీ పడవేయడం అన్నది సరి కాదు.
మన రాష్ట్రంలో ముఖ్యముగా సాగులో ఉన్న తమలపాకు రకాలు(Mainly cultivated types of betel leaf in our state are) :
  1. తెల్లకు(కాల్జేడు)
  2. కారపాకు
  3. మన దగ్గర తుని తమలపాకుకు ఎంతో పేరు ఉంది. ఈ తుని తమలపాకు లేతగా, చిన్నగా, కారంగా ఉంటాయి.
తమలపాకు అందించే ఆరోగ్య ప్రయోజనాలు(Health benefits of betel leaf) :

తమలపాకు ఒక అద్భుతమైన “అనాల్జేసిక్(Analgesic)”. కాబట్టి, ఇది నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని కలిగించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందివ్వగలుగుతుంది.

  • తలనొప్పి(Headache) : నుదుటి మీద తమలపాకులతో రాయడం చేస్తుండాలి లేదా తమలపాకు రసంతో మర్దన చేయాలి. దీనివల్ల తలనొప్పి గానీ, మైగ్రేన్ నొప్పి గాని తగ్గిపోవడానికి తమలపాకులు బాగా పని చేస్తాయి.
  • నొప్పి నివారణ(Pain relief) : చిన్న గాయాలు, వాపు, నొప్పి వీటి మీద తమలపాకు ఉంచితే సమస్య తగ్గుతుంది. తమలపాకును నమిలి తిన్న ఇదే ఫలితం ఉంటుంది.
  • మలబద్దకాన్ని తగ్గిస్తుంది(Reduces Constipation) : తమలపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్ వల్ల ఖాళీ కడుపుతో తీసుకున్నట్లయితే, అరుగుదలకు సహకరించి, మలబద్దకానికి విరుగుడుగా పని చేస్తుంది.
  • ఆకలిని పెంచుతుంది(Increases appetite) : నోరు రుచిగా అనిపించకపోయినా, తినాలని లేకపోయినా 2 తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుంది.
  • అంతర్గత అవయవాలను శుభ్రపరుస్తుంది(Cleanses internal organs) : శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను(Toxins) తమలపాకులు బయటకు పంపిస్తాయి. రక్తప్రసరణను మెరుగుపరచి, మెటాబాలిజంను కూడా వృద్ధి చేస్తుంది.
  • దగ్గును తగ్గిస్తుంది(Reduces Cough) : శరీరంలో కఫము ఏర్పడకుండా చేసి తద్వారా దగ్గు రాకుండా నివారించగలదు.
  • ఫంగల్ ఇన్ఫెక్షన్(Fungal infection) : రోజుకు 2 తమలపాకులు తినండి. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు ఇన్ఫెక్షన్స్ దరి చేరకుండా చేస్తాయి.
  • మొటిమలు నివారణ(Acne Prevention) : మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ ఏవైనా సరే తమలపాకు రసాన్ని క్రమం తప్పకుండ రాస్తూ ఉంటే తగ్గుదల కన్పిస్తుంది.
  • చెవి నొప్పి(Earache) : కొబ్బరినూనెను తమలపాకు రసాన్ని కలిపి చెవిలో వేస్తె చెవినొప్పి నుండి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
  • సహజమైన నోటి ప్రెషనర్(Natural Oral Pressurizer) : తమలపాకును నమలడం వల్ల ఓరల్ హైజిన్ ను కాపాడుతుంది. చిగుళ్ళను బలోపేతం చేసి, దంతక్షయాన్ని నివారించి, సహజమైన నోటి ఫ్రెషనర్ గా పని చేస్తుంది.
  • నిరాశ ను తగ్గిస్తుంది(Reduces depression) : రోజు తమలపాకులను తీసుకుంటూ ఉండడంతో మానసికంగా ఆరోగ్యముగా ఉంచుతుంది నిరాశ నిస్పృహలను పోగొడుతుంది.
  • మూత్రపిండాల్లో రాళ్లు(Kidney stones) : మన శరీరంలోని రక్తంలో కనిపించే మురికి పదార్థమే “యూరిక్ యాసిడ్”.  దీని పరిమాణం పెరుగుదలను వైద్య భాషలో “హైపర్ యురిసెమియా” అంటారు. ఇది పెరగడం వల్లే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయి. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు రోజు తాజా తమలపాకును నమలాలి. ఇది మీ యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది.
  • క్యాన్సర్ తో పోరాడుతుంది(Fights Cancer) : క్యాన్సర్ కణాలతో పోరాడే యాంటీ-క్యాన్సర్ ఏజెంట్స్ తమలపాకులో ఉన్నాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించగలవు. కణితుల పెరుగుదలను ఆపడంలో కూడా తమలపాకు ప్రభావంతంగా పని చేస్తుంది. తమలపాకు ఒక మ్యాజికల్ పని చేస్తుంది క్యాన్సర్ లక్షణాలతో పోరాడడంలో అని చెప్పవచ్చు.
  • పులిపిర్లు(warts) : తమలపాకు కాడను సున్నంలో కలిపి ఒక వారం పాటు ఆ పులిపిరి కాయలపై పూయండి. దీనితో పులిపిరి అనేది రాలిపోతుంది.
తమలపాకును ఎవరు తినకూడదు(Who should not eat betel leaf) :

     గుండె జబ్బులు ఉన్నవారు తమలపాకులను తినకూడదు. అలవాటు ఉన్న మానుకోవాలి. ఎందుకంటే, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. మరియు గుండె నెమ్మదిగా కొట్టుకునే వ్యక్తులు తమలపాకును తినకూడదు. తమలపాకు వారి హృదయ స్పందన రేటు తగ్గిస్తుంది.

తమలపాకును ప్రతి రోజు తినవచ్చా(Can betel nut be eaten every day)? :

       పరిశోధనల ప్రకారం, రోజుకు ఒక తమలపాకును తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకి వెళ్లిపోతాయి. అలాగే, కడుపు యొక్క PH స్థాయిలను పునరుద్ధరిస్తుంది. మరియు ఆకలిని పెంచుతుంది.

దుష్ప్రభావాలు :

      తమలపాకు వాడకం ఎక్కువయితే, క్యాన్సర్, అలెర్జీ లాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అది కాకుండా తమలపాకు అనేది సాధారణంగా కొంతమందికి వ్యసనానికి దారి తీసే అవకాశం ఉంటుంది. తమలపాకును అతిగా తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు అని నిపుణులు చెప్తున్నారు. 

     పూర్వకాలంలో అయితే, తాంబూలం రూపంలో భోజనం తర్వాత ఒక నియమావళిగా సేవించడం జరిగేది అని పెద్దలు చెప్పే మాట. అందుకే, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారు అనేది నిజం. కానీ, ఈ కాలంలో పద్దతి అటుంచి, తమలపాకును ఎన్నో రకాల పొగాకు ఉత్పత్తులను జోడించి, పాన్ రూపంలో తీసుకోవడం అనేది వ్యసనంగా మారి, మీ ఇష్టం వచ్చినట్లు మాత్రమే తినడానికి మీకు మీరుగా అనుమతి ఇచ్చుకుంటే, అది కలిగించే ప్రమాదాలను కూడా స్వయంగా మీరే అనుభవించక తప్పక పోవొచ్చు. 

ముగింపు(Conclusion) :

 తమలపాకు యొక్క అవసరం ఆధ్యాత్మికంగాను, మరియు మన ఆరోగ్య సమస్యలకు గాను ఎంతగా ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నాము. తమలపాకును ఏ విధంగా తీసుకోవాలి కూడా చర్చించాము. కాబట్టి, రోజుకి ఒకటి చొప్పున కేవలం తాజా తమలపాకు తీసుకోవడం అలవాటు చేసుకోవచ్చు అని ఖచ్చితంగా చెప్పగలిగే విషయం ఎందుకంటే, మంచి ఆరోగ్య స్థితిని మనం పొందగలం అనేది నమ్మకం.

అయితే, దీనికి మించి రకరకాల పాన్ లను తింటాము అనేది, ఏ రకమైన పాన్ పత్తా ఎంతటి ఆరోగ్య స్థితిని కలుగజేస్తుంది అనేది అవగాహన పెంచుకొని మాత్రమే తినడం శ్రేయస్కరం అని మేము చెప్పగలం. తమలపాకు సేవించడం వ్యసనంగా మారడం కొంతమందిలో చూస్తూ ఉంటాము. దీని నుండి ఎంత ఆరోగ్య లాభాన్ని పొందుతున్నారు అనేది కూడా చూసుకోవాలి. 

        ముఖ్యముగా, ఆడవాళ్లు, గర్భిణీ స్త్రీలు వాళ్ళ శరీర తత్వాన్ని సరి చూసుకోవడం ముఖ్యం అవుతుంది. ఆ తర్వాతే, తమలపాకు తినడం పై శ్రద్ధ వహించండి. మీరు తిన్నపుడు కలిగే మార్పులు మీ శరీరంలో ఏ స్థితిని కలిగించి ఉంటాయి అనేది గమనించుకోవాలి. అశ్రద్ధ వహించి, గమనించే స్థితిని కోల్పోతే కనుక గర్భ స్రావం అయ్యే ప్రమాదాలు కూడా లేకపోలేదు.

ఆధ్యాత్మికంగా తమలపాకు ఎన్నో ప్రయోజనాలు అందించి, అద్బుతమైన జీవన విధానం జీవించేలాగా అదృష్టాన్ని ఇస్తుంది. అలాగే, ఆరోగ్యానికి సంబంధించి తమలపాకు లేదా పాన్ రూపంలో గాని సేవించేముందు మీలో కలిగే మార్పులు గమనించుకొని, సమస్యలు కనుక వస్తే, ఏ ఇతర రకాల అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయా అనేది వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం సరి అయినది. మీ శరీరాన్ని కాపాడుకోవడం కోసం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని గుర్తు పెట్టుకోవాలి.

Add Comment