మెనోపాజ్ వివరణ, లక్షణాలు, సమస్యలు మరియు నివారణలు|Menopause Definition, Symptoms, Problems and Remedies in Telugu

మెనోపాజ్ అనగా ఏమిటి(What is Menopause)?

 ఆడవారి జీవితంలో ఋతుస్రావం మొదలుకొని, మెనోపాజ్(రుతువిరతి) వరకు నెలసరి రక్తస్రావం అనేది తప్పనిసరి. అయితే, ఋతుస్రావం యొక్క చివరి దశను “మెనోపాజ్(menopause)” అని పిలుస్తారు. ఈ మెనోపాజ్ అనేది అత్యంత ముఖ్యమైన సహజ మార్పులలో ఒకటి, స్త్రీ యొక్క “పునరుత్పత్తి(Reproduction)”ని సూచించే సహజమైన జీవప్రక్రియ. ఇది పెద్దవయస్సు స్త్రీలలో ఋతుక్రమం ఆగిపోవటాన్ని లేదా ముగింపును సూచిస్తుంది. దీన్నే “మెనోపాజ్” అంటారు.

స్త్రీ యొక్క అండాశయాలు గుడ్లను ఉత్పత్తి చేయడాన్ని ఆపివేసినపుడు ఇది సంభవిస్తుంది. తద్వారా, స్త్రీ ఋతుచక్రకాలం ముగియడానికి ఆరంభం అవుతుంది. హార్మోన్ల(Hormonal) తేడా వల్ల చోటుచేసుకునే మార్పే ఈ “మెనోపాజ్”. ఈ దశలో నెలసరి నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. అండాశయాలు ఈస్ట్రోజెన్(Estrogen), ప్రాజెస్టరాన్(Progesterone) హార్మోన్లను చాల తక్కువగా ఉత్పత్తి చేయడమే అందుకు కారణం. తరచూ హార్మోన్ల స్థాయిలు మారుతుండడం వల్ల, నెలసరి ఓ పద్దతి ప్రకారం రాదు. ఈ మార్పు 40 సంవత్సరాల వయస్సు చివరిలో లేదా 50 సంవత్సరాల వయస్సులో మొదలై, నెమ్మదిగా కొనసాగి, చివరకు ఋతుచక్రం ఆగిపోతుంది. ఒక సంవత్సరకాలం పాటు రుతుక్రమం రానప్పుడు మెనోపాజ్ దశకు చేరుకున్నట్లు నిర్దారణ అవుతుంది. Menopause Definition, Symptoms, Problems and Remedies in Telugu

 ఇది స్త్రీకి సంభవించే అతి కీలకమైన పరివర్తన. మరియు మెనోపాజ్ స్త్రీ యొక్క జీవన నాణ్యతను ప్రభావితం చేసే అనేక శారీరక(Physical), భావోద్వేగ లక్షణాలను(emotional characteristics) కలిగిస్తుంది. అయితే ఈ మెనోపాజ్ అనేది చాలా సంవత్సరాలలో జరిగే ప్రక్రియ. ఇది 3 దశలుగా విభజించబడింది.

  1. పెరి మేనోపాజ్(Peri menopause) : ఇందులో స్త్రీ యొక్క అండాశయాలు తక్కువ ఈస్ట్రోజెన్ ను ఉత్పత్తి చేయడం ప్రారంభించడాన్ని “పెరి మెనోపాజ్” అంటారు. ఇది  మెనోపాజ్ కు 5 నుండి 7 సంవత్సరాల ముందే శరీరంలో కొన్ని మార్పులు మొదలౌతాయి. వీటిలో హార్మోన్ల స్థాయి క్రమంగా తగ్గుతుంది. దీన్ని, క్రమరహిత రుతుక్రమం, హాట్ ప్లషెస్, మరియు ఇతర లక్షణాల ద్వారా గుర్తించడం జరుగుతుంది.
  2. మెనోపాజ్(Menopause) : వరుసగా 12 నెలల పాటు రుతుక్రమం రాకపోవడాన్ని “మెనోపాజ్”గా గుర్తిస్తారు. ఈ దశలో స్త్రీ యొక్క ఈస్ట్రోజన్ స్థాయిలు గణనీయంగా పడిపోతాయి. దీని వల్ల, అనేక శారీరక, మానసిక భావోద్వేగ లక్షణాలు కలిగే స్థితిని చూస్తారు.
  3. పోస్ట్ మెనోపాజ్(Post Menopause) : మెనోపాజ్ తర్వాత్ స్త్రీ జీవితాంతం ఉండే ఈ దశను “పోస్ట్ మెనోపాజ్” అంటారు. ఈ దశలో మెనోపాజ్ యొక్క లక్షణాలు క్రమంగా తగ్గిపోతాయి. కానీ, బోలు ఎముకల వ్యాధి వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితుల ప్రమాదం పెరుగుతుంది.

మెనోపాజ్ కు కారణం ఏమిటి(What causes menopause)?

మెనోపాజ్ కారణంగా అండం విడుదల ఆగిపోతుంది. ఈ కారణంగా పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. కానీ, ఎప్పుడైనా ఒకసారి అండం విడుదలయ్యే అవకాశం ఉండి, గర్భం ఏర్పడడానికి దారి తీస్తుంది. అయితే, ఇది చాలా అరుదుగా జరిగే విషయమని గుర్తించాలి.

స్త్రీలలో అండం విడుదల ఎందుకు ఆగిపోతుంది(Why does ovulation stop in women)?

  1. ప్రతి స్త్రీ శరీరంలోని గర్భాశయానికి ఇరుప్రక్కలా “2 అండాశయాలు(Ovaries)” అమర్చబడి ఉంటాయి.
  2. సాధారణంగా, ఆడశిశువు పుట్టుకతోనే 12 లక్షల నుండి 20 లక్షల అండాలతో జన్మిస్తుంది. ఇలా..పుట్టుకతోనే నిర్ణీత సంఖ్యలో అండాలను కలిగి ఉండి బుట్టల్లాగా ఉంటాయి.
  3. ఆడపిల్ల రజస్వల అయ్యాక, రుతుక్రమం మొదలయ్యే సమయానికి సుమారు 400 నుండి 500 అండాలు మాత్రమే మిగులుతాయి.
  4. యుక్త వయస్సు వచ్చాక, నెలకొకటి చొప్పున పక్వమయి, విడుదలై, “ఫాలోఫియన్ ట్యూబ్(Fallopian tube)”ని చేరుకుంటాయి. అక్కడ వీర్యకణంతో కలిస్తే “ఫలదీకరణం” చెందుతుంది.
  5. ఇలా..కానీ పక్షంలో రుతురక్తస్రావంతో పాటు విసర్జించబడుతుంది. ఈ విధంగా “అండాల నిల్వ” తగ్గుతూ వస్తుంది.
  6. అండాశయంలోని అండాలు పూర్తిగా అయిపోయే దశను మెనోపాజ్ గా పేర్కొంటారు.
  7. మెనోపాజ్ దశకు చేరుకునే సరికి అండాల విడుదలతో పాటు హార్మోన్ల విడుదల కూడా ఆగిపోతుంది. ఇదే స్త్రీలలో పునరుత్పత్తి నిలిచిపోవడానికి సంకేతం అవుతుంది.

ఈ కార్యక్రమం సరిగ్గా జరగడానికి మెదడులోని హైపోథలామస్ అనే భాగం, పిట్యూటరీ గ్రంథి, ఓవరీల నుండి స్రవించే హార్మోన్లు ముఖ్యపాత్ర వహిస్తాయి. దీనినే “హైపోథలామో(Hypothalamo), పిట్యూటరీ(Pituitary), ఒవేరియన్ యాక్సిస్(Ovarian Axis)” అంటారు. హైపోథలామస్ నుండి వచ్చే హార్మోన్లు, పిట్యూటరీ గ్రంథిని ఉత్తేజితం చేస్తే, పిట్యూటరీ నుండి వచ్చే హార్మోన్లు ఓవరీని ఉత్తేజితం చేస్తాయి. ఓవరీ నుండి అండంతో పాటు ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్లు విడుదలై గర్భాశయం మీద పని చేసి, గర్భాశయంలో పిండం ఎదుగుదలకు కావలసిన మార్పులు జరిగేటట్టుగా చేస్తాయి.

  • మెనోపాజ్ దశలో అండాలు పూర్తి అయిపోయి, విడుదల కాకపోవడం వలన మొదట ప్రొజెస్టరాన్ హార్మోన్ స్థాయి తగ్గిపోతుంది.
  • ఆ తర్వాత నెమ్మదిగా ఈస్ట్రోజన్ స్థాయి తగ్గిపోతుంది.
  • ఈ రెండింటి స్థాయి తగ్గడంతో పిట్యూటరీ నుండి వచ్చే “ఎఫ్.ఎస్.ఎచ్(F.S.H)” అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది.
  • ఈస్ట్రోజన్ ను “ఫెమినైన్ హార్మోన్(Feminine hormone)” అంటారు. ఇది క్రమంగా తగ్గిపోవడం వలన స్త్రీలలో కొన్ని శారీరకమైన, మానసికమైన మార్పులు వస్తాయి.
  • మెనోపాజ్ లక్షణాలకు ఇవే కారణాలు.Menopause Definition, Symptoms, Problems and Remedies in Telugu
మెనోపాజ్ యొక్క లక్షణాలు(Symptoms of Menopause) 

మెనోపాజ్ లక్షణాలు ఒక స్త్రీకి ఒకలాగా, ఇంకొకరికి ఒకలాగా మారుతుంటాయి. ఇవి తేలికపాటి సమస్యగాను లేదా తీవ్రమైన సమస్యగాను ఉండే అవకాశం ఉంటుంది. మెనోపాజ్ స్త్రీ శరీరంలో అనేక మార్పులకి కారణం అవుతుంది. ముఖ్యముగా వయస్సు రీత్యా వచ్చే వృద్ధ్యాప్యం వల్ల వస్తుంది. అయితే, ఏవి వృద్ధ్యాప్య సంకేతాలు, ఏవి మెనోపాజ్ సంకేతాలు అనే తేడాను గుర్తించడం కొంచెం కష్టం. అనేక ఆరోగ్య పరిస్థితులు, శారీరక లక్షణాలు మెనోపాజ్ ని సూచిస్తాయి. ఈ లక్షణాలు ఈస్ట్రోజన్ ఉత్పత్తి, హార్మోన్ల హెచ్చుతగ్గులని సూచిస్తుంది.

ఋతుస్రావంలో కలిగే అసమానతలు(Irregularities in Menstruation) :

కొన్ని సాధారణ ఇతర లక్షణాలు :

  1. ఈ సమయంలో తొందరగా అలసిపోవడం,
  2. తలనొప్పులు
  3. వేడి సెగలు, చెమటలు,
  4. వేడి ఆవిరిలు(Hot flushes)..దీని నుండి అధిక స్వేదనం మొదలౌతుంది..
  5. ఈ వేడి ప్లాష్ అనేది శరీరం అంతటా వ్యాపించే వేడి యొక్క ఆకస్మిక అనుభూతి, సాధారణంగా చెమటలు మరియు చర్మం ఎర్రబడడం.
  6. రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం,
  7. జననేంద్రియాల దగ్గర పొర పొడిబారి పలుచగా మారడం, కలయికలో అసౌకర్యం,
  8. మానసిక స్థితిలో తేడాలు,
  9. గుండెలో మార్పులు, గుండె దడ 
  10. కీళ్ల నొప్పి, కండరాల నొప్పి,
  11. లిబిడిలో మార్పులు,
  12. ఏకాగ్రత దెబ్బతినడం,
  13. జ్ఞాపకశక్తి మందగించడం,
  14. జుట్టు రాలడం లేదా జుట్టు సన్నబడటం,
  15. అధిక బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురౌతాయి.
  16. వీటిని అదుపులో ఉంచేందుకు వైద్యులు హార్మోన్లను సిఫారస్ చేస్తారు. అవి ఈస్ట్రోజెన్ కు ప్రత్యామ్న్యాయం. అలా వాడే అన్ని రకాల మందుల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ తప్పనిసరిగా ఉంటుంది. ఇవి చాలా రకాల్లో లభిస్తాయి. వాటి వల్ల కొంత మార్పు ఉన్న సరే..”గర్భాశయ క్యాన్సర్” వచ్చే ఆస్కారం ఎక్కువ. అందుకే, వైద్యులు ఈస్ట్రోజెన్ తో పాటు ప్రొజెస్టరాన్ కూడా సిఫారస్ చేస్తుంటారు.Menopause Definition, Symptoms, Problems and Remedies in Telugu
మెనోపాజ్ కారణంగా శరీరంలో వచ్చే మార్పులు(Changes in the body due to menopause) 
  • క్రమరహిత రుతుక్రమం(Irregular Menstruation) : క్రమరహిత పీరియడ్స్ అనేవి వరుసగా రావడాన్ని “మెనోపాజ్” అని నిర్దారణ జరుగుతుంది.
  • కోల్డ్ ప్లాష్(Cold Splash) : కోల్డ్ ప్లాష్, హాట్ ప్లాష్ అనేవి 2 రకాలు. హాట్ ప్లాష్ లో ఉన్నట్లుండి చెమట వస్తుంది. అదే, కోల్డ్ ప్లాష్ లో అకస్మాత్ గా చలి అనిపిస్తుంది.
  • యోని పొడిగా మారడం(Vaginal dryness) : కణజాలాలు కుంచించుకోవడం. మెనోపాజ్ యోని లూబ్రికేషన్ లో తగ్గుదలకు కారణమవుతుంది. ఇది లైంగిక సంపర్కం సమయంలో పొడిబారడం, అసౌకర్యం మరియు నొప్పికి దారి తీస్తుంది.
  • మానసిక స్థితిలో మార్పులు(Changes in mood) : మెనోపాజ్ అనేది మానసిక మార్పులు, చికాకు, ఆందోళన మరియు నిరాశకు కారణమౌతుంది.
  • నిద్రకు ఆటంకాలు(Sleep disturbances) : మెనోపాజ్ నిద్రకు ఆటంకాలు, నిద్రలేమి, రాత్రి సమయంలో చెమటలు వచ్చే లాంటి స్థితిని కలుగజేస్తుంది.
  • మూత్రం ఆపుకోలేని స్థితి(Urinary Incontinence) : తుమ్మినా, దగ్గినా, గట్టిగా నవ్విన సమయంలో తెలియకుండానే మూత్రాశయం మీద నియంత్రణ కోల్పోతారు. దీని వల్ల మూత్రవిసర్జన నియంత్రించలేరు.
  • ఎముక సాంద్రత కోల్పోవడం(Loss of bone density) : ఈ మోనోపాజ్ “ఆస్టియోపోరోసిస్” అనే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది ఎముకలు బలహీనంగా మరియు పెళుసుగా మారడాన్ని కారణమౌతుంది.
  • బరువు పెరగడం(Weight gain) :ఈ మెనోపాజ్ అనేది స్త్రీ యొక్క శరీరంలో హార్మోన్ల మార్పులు, తగ్గిన కండర ద్రవ్యరాశి మరియు జీవనశైలిలో మార్పులతో సహా అనేక కారణాల వల్ల బరువు పెరగడానికి కారణమౌతుంది.
  • గర్భసంచి కోల్పోవడం(Loss of uterus) : గర్భసంచిని దాని స్థానంలో పట్టి నిలిపే లిగమెంట్లలో పటుత్వం తగ్గి, గర్భసంచి జారిపోయే అవకాశాలు ఎక్కువవడం.Menopause Definition, Symptoms, Problems and Remedies in Telugu
మెనోపాజ్ లక్షణాలు ఎంతకాలం ఉంటాయి(How long do menopause symptoms last)?

మెనోపాజ్ లక్షణాలు ఒక్కొక్క స్త్రీకి  ఒక్కో రకంగా మార్పులు కలుగుతుంటాయి. అందరికి ఒకేలాగా ఉండవు. అలాగే, కొంతమంది మహిళలు కొన్ని నెలల పాటు లక్షణాలను అనుభవిస్తారు. మరికొందరు చాలా సంవత్సరాల పాటు ఆ సమస్యను అనుభవిస్తారు.

మెనోపాజ్ లో వచ్చే సమస్యలు(Complications in Menopause) 

ఈస్ట్రోజన్ అనేది ఒక రక్షణ హార్మోన్. రక్తనాళాల సమస్యలు రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే దాని స్థాయి తగ్గుతుందో అప్పుడు రక్తనాళాల గోడలు మందంగా మారి, “ఎథిరోస్క్లిరోసిస్(Atherosclerosis)” అనే వ్యాధి రావడం వలన గుండె పోటు, బ్రెయిన్ స్రోక్ వచ్చే ప్రమాద అవకాశాలు పెరుగుతాయి.

  1. ఆస్టియోఫోరోసిస్ – ఈస్ట్రోజన్ తగ్గడం వలన, ఎముకల్లో క్యాల్షియం తగ్గి అవి గుల్లబారి తొందరగా విరిగి పోతుంటాయి.
  2. ముఖ్యముగా, వెన్నుపూస, తొడ ఎముక, మణికట్టులలో ఎముకలు విరగడం ఎక్కువగా కనబడుతుంది.
  3. మూత్రాశయ సమస్యలు
  4. గర్భాశయం జారిపోవడం
  5. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ కు గురయ్యే అవకాశాలు ఉండడం.
మందులు ఏ పరిస్థితి ఉన్నవారికి ఇవ్వొచ్చు(Medicines can be given to people in which condition)?
  • మెనోపాజ్ లక్షణాలైన హాట్ ఫ్లాష్ మరియు రాత్రి సమయంలో అధికంగా చెమటలు కలిగే వారికి.
  • చిన్న వయస్సులో మెనోపాజ్ వచ్చిన వారికి
  • చిన్న వయస్సులో గర్భసంచి తొలగించినవారికి.
తీసుకోవాల్సిన నోటి మాత్రలు(Oral tablets to be taken) 
  1. క్యాల్షియం మాత్రలు మెనోపాజ్ తర్వాత ప్రతి స్త్రీ జీవితాంతం వేసుకోవాల్సి వస్తుంది.
  2. అవసరాన్ని బట్టి విటమిన్ – డి మాత్రలు వేసుకోవాలి.
  3. థైరాయిడ్, డయాబెటిస్, బిపి – వీటికి మాత్రలు వాడుతూ అదుపులో ఉంచుకోవాలి.
మెనోపాజ్ లక్షణాల కోసం నివారణ మార్గాలు(Remedies for menopause symptoms) 
  1. ఆహారంలో మార్పులు(Changes in diet) : శరీరంలో కలిగే మార్పులకు సమతుల్యమైన ఆహరం చాలా ముఖ్యం. సూక్ష్మపోషకాల ప్రాముఖ్యతను గుర్తించి, స్థానిక, సీజనల్, సాంప్రదాయకరమైన ఆహారాన్ని స్వీకరించాలి. సప్లిమెంట్స్ పై ఆధారపడవద్దు. మరియు ఆహరం తీసుకోవడం, ఉపవాసం ఉండడం చేయకూడదు. తగిన డైట్ చేయడం ద్వారా మెనోపాజ్ లక్షణాలు తగ్గిపోతాయి. బరువు కూడా అదుపులో ఉంటుంది.Menopause Definition, Symptoms, Problems and Remedies in Telugu
  2. వ్యాయామం తప్పనిసరి(Exercise is a must) : వ్యాయామం కారణంగా బలం, శక్తి సామర్ధ్యాలు, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతాయి. కాబట్టి, మహిళలు రోజుకు కనీసం 30 నిమిషాలు పాటు వ్యాయామం కోసం కేటాయించడం చాలా మంచిది. దీని వల్ల ఉత్సహంగా ఉండగలుగుతారు. “కెగల్స్ వ్యాయామాలు” అనేవి జననేంద్రియాల దగ్గర కండరాలను గట్టి పరుస్తాయి. ఇవి చేయడం వలన మూత్ర సంబంధిత సమస్యలను అదుపులోకి తీసుకు రావొచ్చు.Menopause Definition, Symptoms, Problems and Remedies in Telugu
  3. విశ్రాంతి తీసుకోవడం(Resting) : వయస్సు పెరిగే కొద్దీ విశ్రాంతి తీసుకోవడంపై శ్రద్ద వహిస్తే చాలు..ఈ విశ్రాంతి వల్ల ఎన్ని రోగాలను సైతం నివారించగల శక్తి కలిగి ఉంటుంది.Menopause Definition, Symptoms, Problems and Remedies in Telugu
  4. ఒమేగా ఫ్యాటి(Omega Fatty) : ఒమేగా – 3 ఫ్యాటి యాసిడ్స్ లభించే ఆయిలీ ఫిష్ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనివల్ల మెనోపాజ్ తో వచ్చే సమస్యలను అధిగమించవచ్చు అని వైద్యశాస్త్రం చెప్తుంది.Menopause Definition, Symptoms, Problems and Remedies in Telugu
ముగింపు(Conclusion) :

   ఆడవారి జీవితంలో రుతుస్రావం “ప్రారంభ దశ” నుండి “ఆగిపోవటం అనే దశ” వరకు చేరుకోవటం ఒక సహజ ప్రక్రియ. బహిష్టులు ఆగిపోవడం అనేది మెనోపాజ్ దశ. ఈ మెనోపాజ్ వివరణ, లక్షణాలు, సమస్యలు తెలుసుకున్నాము..

స్త్రీల వయస్సు పెరిగే కొద్దీ మెనోపాజ్ దశకు చేరుకోవడం సాధారణం అని ప్రతి ఒక్కరు గుర్తించాలి మరియు మెనోపాజ్ అనగా ఏమిటి? మెనోపాజ్ కలిగించే లక్షణాలు, సమస్యలు ఏమిటి? అని తెలుసుకోవాలి..ఈ విధంగా మెనోపాజ్ గురించిన అవగాహన ఉండడం తప్పనిసరి అవుతుంది. సాధారణంగానే, శరీరంలో ఎన్నో మార్పులు, సమస్యలు వివిధ రకాల కారణాల వల్ల అనుభవించడం జరుగుతూనే ఉంటాయి. వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో వచ్చే మార్పులు వారికి ఆందోళన కలిగించవచ్చు. 

  అయితే, మెనోపాజ్ దశకు చేరుకునే కంటే ముందే మీ ఆరోగ్యం పైన దృష్టి ఉంచాలి. మరియు దీనికి సంబంధించిన జాగ్రత్త చాలా అవసరం అని గుర్తించాలి. అందుకు గాను..ఆరోగ్యకరమైన జీవనశైలికి, సమతుల్యమైన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహరం, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల మెనోపాజ్ లక్షణాల నుండి వచ్చే భాద నుండి ఉపశమనం పొందవచ్చు. యుక్త వయస్సులో మనసుకు నచ్చిన ఎన్నో ఆహార పదార్థాలను తినడం అలవాటుగా మారినా కూడా ఆ వయస్సులో వారి శరీరం అన్ని పదార్థాలను జీర్ణింపచేసుకోగలదు. కానీ, గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటీ అంటే..వయస్సు పెరిగే కొద్దీ తీసుకునే ఆహరం ఎంత వరకు జీర్ణం అవ్వగలుగుతుంది అని. మీరు తినే ఆహార పదార్థాలు ప్రతి ఒక్కదాన్ని పరీక్షించుకొని చుడండి. ఏ పదార్థం ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అని ఆలోచన చేసుకోండి. దీని నుండి ఏ పదార్థం ఎంతమేర తీసుకోవాలి అనేది మీది మీకు అవగతం అవుతుంది. 

వయస్సు పెరిగే కొద్దీ..సమతుల్యమైన ఆహరం మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎంతమేర తీసుకోవాలి అనేది చూసుకోవాలి. తర్వాత, తగిన వ్యాయామం మీకు వీలైనంతగా చేయడానికి సమయం కేటాయించండి. వ్యాయామం చేస్తూ..మీ శరీర బరువును అదుపులో ఉంచుకోవడం అన్నివిధాలా మేలును కలుగజేస్తుంది. తర్వాత..మీరు రోజు మొత్తంలో తగినంత విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించుకోవాలి. విశ్రాంతి అంటే..కేవలం, ఆలోచనలతో కూడిన నిద్ర అని కాదు అర్ధం. ఆందోళన, ఒత్తిడి కలిగించేలాంటి ఎన్ని సమస్యలు ఉన్నా..ధ్యానం ద్వారా వాటిని అధిగమించే శక్తిని పెంచుకోవడం అని అర్ధం మరియు అతి ముఖ్యం అవుతుంది. ఈ విధంగా మీ జీవితాన్ని మీరే ఒక సరిఅయిన స్థితిలో బ్రతకడం అలవాటు అనేది చేసుకోవడం మొదటి అడుగుగా భావించాలి. ఆ తర్వాత ఆరోగ్యపరంగా గానీ, మానసికంగా గాని వచ్చే సమస్యలు అన్ని చిన్నవిగానే కన్పించడమే కాదు. చిటికెలో ఆ సమస్యలను అదుపు చేసుకోగల సామర్ధ్యాన్ని, శక్తిని, తెలివిని కలిగి ఉండగలరు.

అయితే, ఎంతోమంది మహిళలకు వారి రుతుస్రావం సమస్యలు, పరిస్థితుల గురించి తెలియకపోవడం..రుతుస్రావం, మెనోపాజ్ నుండి వచ్చే సమస్యలు ఏ కారణం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది? సమస్యలను ఎలా అదుపులో ఉంచుకోవాలి అనేది తెలియకపోవడం..అనేది పెద్ద సమస్యగా మారి..వారి ఆరోగ్య పరిస్థితి నిలకడలేని స్థితిలో ఉంచుతుంది. అందుకే, ఈ విషయాలు అన్ని కూడా ప్రతిఒక్కరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరియు అర్ధం చేసుకోలేని పెద్దవాళ్లకు కూడా వివరించడం చాల మంచిది. దాని వల్ల, వారిలో ఆందోళన అనేది తొలగి, వారి జీవనశైలి లో చేసుకోవాల్సిన మార్పులు ఏమిటి అని? అవగతం అవడానికి అవకాశం ఉంటుంది. 

ఎందుకు వివరిస్తున్నాము అని ఆలోచన కనుక వస్తే..ఈ ఆర్టికల్ లో తెలిపిన లక్షణాలు, సమస్యలు అనేవి అన్ని కూడా కేవలం సరైన పోష్టికాహారం లోపం మరియు తగిన విశ్రాంతి లేకపోవడం వల్ల..మీ ఆరోగ్య పరిస్థితి అనేది శరీరంలో ఎన్నో మార్పులకు దారి తీస్తుంది. మెనోపాజ్ ఒక సహజ ప్రక్రియ. అది ఆగిపోవాల్సిన దశ అయినప్పటికీ, ఆ సమయంలో ఎన్నో రకాల సమస్యలు అనేవి ముందుగా ఉండే ఆరోగ్య సమస్యల నుండే మొదలవడం జరుగుతుంది. జీవితంలో ప్రతి సమయంలో ఒక సమస్యను అనుభవిస్తున్నాము అంటే..దాని ముందు మన జీవన విధానం ఎలా ఉండింది అని గుర్తుకుచేసుకోవాలి. దానిపైనే ఆధారపడి ఉంటుంది ఆ సమస్య ఏ రూపంలో, ఏ కారణంగా మొదలై,  అనుభవిస్తున్నాము అనేది తెలుసుకోగలం. 

అందుకే, ఏ పదార్థాలు మీకు సరిపడుతున్నాయి, సరి పడడం లేదు అనేది మీది మీకు అర్ధం కానీ స్థితిలో కనుక ఉన్నట్లయితే..వెంటనే వైద్యుడి సలహాలు, న్యూట్రిషన్ సలహాలు పాటించండి. వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి కూడా మీకు తగిన సూచనలు అందివ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు మేము వయస్సుతో నిమిత్తం లేకుండా నచ్చిన ఆహారపదార్థాలు తీసుకుంటూ..తగిన విశ్రాంతి లేకుండా వ్యవరించడం ఇలా ఎన్నో రకాలైన మార్పులు మీ జీవన విధానంలో అలవాటుగానే ఉండనివ్వాలి అనుకుంటే..మెనోపాజ్ దశకు వచ్చేటప్పటికి శరీరంలో కలిగే చిన్న చిన్న మార్పులు..పెద్ద సమస్యగాను..పెద్ద రోగాలుగాను మారే అవకాశం ఉంటుంది. సరైన జీవన విధానం లేకపోతె వాటిని తట్టుకునే శక్తి లేక..మెనోపాజ్ అంటే ఒక సమస్య, ఒక ఆందోళన మాత్రమే కాదు..ప్రాణాపాయ స్థితికి చేరుకోవడానికి కూడా మార్గం సులభం అవుతుంది.  

  

 

 

Add Comment