మన ఆరోగ్యానికి ఎండుద్రాక్ష కలిగించే ఉపయోగాలు|Benefits of raisins for our health in Telugu

ఎండుద్రాక్ష లేదా కిస్మిస్(Raisins)

ప్రకృతి(Nature) మనకు ఒక్కో కాలానికి(Season) రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అందిస్తూ ఉంటుంది. కాలంతో సంబంధం లేకుండా సంవత్సరం అంతా కూడా లభించే పండ్లు ఉంటాయి. అందులో ఒకటి “ఎండుద్రాక్ష(కిస్మిస్)(Raisin)” ఇది ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. సకల ఆరోగ్య సమస్యల(Health problems)కు పరిష్కారం “ఎండుద్రాక్ష” అని సూచిస్తుంటారు. ఎండుద్రాక్షలో 2 రకాలున్నాయి, అవే ఒకటి గింజలతో కుడి ఉంటుంది. ఇంకోటి గింజలు లేనివి గా ఉంటాయి. ఉపయోగించే రకాన్ని బట్టి, ద్రాక్ష పండ్లు లేత ఆకుపచ్చ, ఊదా రంగు మరియు నలుపు రంగుల్లో లభిస్తాయి.

Benefits of raisins for our health in Telugu

తినడానికి రుచితో పాటు కాస్తంత పుల్లగా కిస్మిస్ లేదా ఎండుద్రాక్షను అందరు ఇష్టపడుతుంటారు. డ్రైఫ్రూట్(Dry fruits) గా కూడా కిస్మిస్ మనందరికీ తెలిసిందే కదా, అయితే ఈ చిన్న చిన్న ఎండుద్రాక్షలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవిగా కూడా ఉపయోగపడుతాయి అనేది నిజం. “ద్రాక్ష పండు(Grapes)” అంటే మనము తీసుకునే పండ్లలోని ఒక రకమైనది. ఈ ద్రాక్ష పండ్లను ఎండబెట్టిన తర్వాత తయారయ్యేదే మన ఎండుద్రాక్షలు వీటినే “కిస్మిస్” అని కూడా పిలుస్తారు.. చాలా మంచి పోషకాలను కలిగి ఉంటుంది.

Benefits of raisins for our health in Telugu

ప్రపంచవ్యాప్తంగా పండించే ద్రాక్షలో 80% ద్రాక్షను వైన్(wine) తయారీలోకి తీసుకుంటారు. 7% ద్రాక్షను ఎండుద్రాక్ష గా మారుస్తారు. మిగిలి ఉన్న శాతం ద్రాక్షను తాజాగా తినడానికి, జ్యూస్(Juice) చేసి తాగడానికి ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఎండుద్రాక్షల ఉత్పత్తి తరతరాలుగా కొనసాగుతూ వస్తుంది. ప్రపంచంలో ఎండుద్రాక్షను ఉత్పత్తి చేసే ఉత్పత్తి దారుగా మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో టర్కీ మరియు దక్షిణఆఫ్రికా ఉన్నాయి.

Benefits of raisins for our health in Telugu

అలాగే ఎండుద్రాక్షలో చక్కర, కేలరీలు అధికంగా ఉంటాయి. అయితే ఈ కిస్మిస్ ను ఎప్పుడు తినాలి? ఎలా తినాలి ? అనేది తెలుసుకోవడం చాల ముఖ్యం.

ఎండుద్రాక్షను ఎప్పుడైనా తినవచ్చు కానీ నానబెట్టిన ఎండుద్రాక్ష అనేది మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు ను కలిగిస్తాయి. ఎండు ద్రాక్ష కంటే నానబెట్టిన ద్రాక్షలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ద్రాక్షలో ఉండే పోషకాలన్నీ ఆ నీటిలో కరిగిపోతాయి. అందుకే ఈ నీటిని తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

ఎండుద్రాక్షలో లభించే పోషకాలు :

  1. ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి.
  2. ఇందులో పీచుపదార్దాలు, పిండి పదార్దాలు పుష్కలంగా ఉంటాయి.
  3. విటమిన్ ఏ, బి, సి అనేవి ఈ ఎండుద్రాక్ష కలిగి ఉంటుంది.
  4. వీటిలో లభించే ఖనిజ లవణాలు……కాపర్, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, పాస్పరస్, మాంగనీస్.

Benefits of raisins for our health in Telugu

ఎండుద్రాక్ష మన ఆరోగ్యానికి కలిగించే ఉపయోగాలు :

  •  జ్వరం(Fever) : ఫినోలిక్ ఫైటోన్యూట్రియంట్స్ జెర్మీసైడల్ గా పనిచేయును. ఎండుద్రాక్షను తరచుగా తినడం వల్ల శరీరంలోని పులుపును స్వీకరించే శక్తి కలిగిన ఆమ్లాలను సమానం చేసి జ్వరం రానివ్వకుండా చేస్తుంది. మంచి యాంటీఆక్సిడెంట్ గా పనిచేయుట వల్ల జ్వరం ను తగ్గించే అవకాశం ఉంటుంది.
  • దంత రక్షణ(Teeth caring) : ఎండుద్రాక్షలో “ఓలెనిక్ ఆయాసిడ్” ఉన్నందున దంతాలలో ఉన్న బాక్టీరియా ను పెరగనివ్వకుండా మన దంతాలను రక్షిస్తుంది.
  • కండ్లకు మంచిది(Eye health) : ఎండుద్రాక్షలో ఉన్న “పాలీఫినాలిక్ ఫైటో న్యూట్రియంట్స్” వల్ల యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. బీటాకెరోటిన్, కెరోటినాయిడ్స్ కళ్ళకు మంచిది.
  • ఎముకలకు రక్షణ(Bones caring) : కాల్షియం, బోరాన్ ఎముకల తయారీకి, గట్టిపడడానికి ఉపయోగపడుతుంది.
  • రక్తం శుభ్రపడటానికి, నరాలకు బలం చేకూరడానికి, పది ఎండుద్రాక్ష పండ్లను నీళ్లలో వేసి బాగా ఉడకబెట్టి, గుజ్జుగా చేసుకొని తాగాలి అని న్యూట్రిషన్స్ చెప్తున్నారు.
  • కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు, ద్రాక్షను తింటే ఉత్తమ ఫలితాలను అందిస్తుంది అని చెప్తున్నారు.
  • మహిళలు ప్రతిరోజు ఎండుద్రాక్షను తినడం వల్ల యూరినల్ లో అమోనియా పెరగకుండా రాళ్లు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

Benefits of raisins for our health in Telugu

  • సంతానం లేని స్త్రీలు ఎండుద్రాక్షను తినడం తో అండాశయంలోని లోపాలు తొలగిపోయి, సంతానం కలిగే అవకాశం ఏర్పరుస్తుంది అని ఆయుర్వేదం చెపుతుంది.
  • ఎండుద్రాక్షలోని న్యూట్రిషన్ విలువలు గర్భిణికి మరియు పొట్టలో పెరుగుతున్న శిశువుకు కూడా చాల ఆరోగ్యకరమైనవి అలాగే ముఖ్యమైనవి కూడా.
  • 200మిల్లీగ్రా. పాలతో, 50 గ్రా. ఎండుద్రాక్ష పండ్లను తినడం వల్ల “నరాల నిస్సత్తువ” , రక్తపోటు దీర్ఘకాల వ్యాధులు నయం అవుతున్నాయి.
  • రక్తం శుభ్రపడటానికి, నరాలకు బలం చేకూరడానికి  10 ఎండుద్రాక్ష పండ్లను నీళ్లలో వేసి బాగా ఉడకబెట్టి, గుజ్జుగా చేసి తాగడం తాగాలని న్యూట్రిషన్స్ చెప్తున్నారు.
  • గొంతు వ్యాధితో బాధపడే వారు ఎండుద్రాక్ష ను తీసుకోవడం వల్ల శరీరంలోని శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. మరియు ఉపశమనాన్ని కలిగిస్తుంది.
  • సెక్సువల్ వీక్నెస్ : “లిపిడో” ను ఎక్కువ చేసే “అమైనో యాసిడ్ ఆర్జినిన్” ఎండుద్రాక్షలో ఉండడం వల్ల, దాంపత్య జీవితంలోని నిరాశలను తొలగిస్తుంది.
  • ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, విరోచనం సాఫీగా జరుగుతుంది. మలబద్దకంతో బాధపడుతున్నట్లయితే ఎండుద్రాక్షను తింటే సరిపోతుంది. మరియు  ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఎండుద్రాక్షతో పాటు సోంపును కలిపి తీసుకుంటే, మలబద్దకం నుండి ఉపశమనం కలుగుతుంది.
  • ఎండుద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి, తర్వాత పిల్లలకు ఇస్తే, వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి చెందుతుంది. కాకపొతే, నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాలి. దీనివల్ల పండ్లలోని రసం నీటిలోకి బాగా కలసిపోయి పిల్లలకు పోషకాలు అందుతాయి.
  • రక్తహీనత : ఒక మోతాదులో “ఐరన్, కాపర్, బి -కాంప్లెక్స్” అనేవి ఎండుద్రాక్షలో ఉండడం వల్ల రక్తహీనతను సరిచేస్తుంది. వీటిలో ఇనుము అధికంగా ఉండడం వల్ల రక్తంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్తహీనత కు మంచి మందుగా ఉపయోగపడుతాయి.
  • ఎసిడోసిస్ : పొటాషియం, మెగ్నీషియం అనేది ఎండుద్రాక్షలో పుష్కలంగా ఉన్నందున, ఎసిడోసిస్ రాకుండా నియంత్రిస్తుంది.
  • శరీర బరువు : ఎండుద్రాక్షలో గ్లూకోస్ మరియు ఫ్రక్టోస్ ఉంది అధిక శక్తిని ఇస్తూ, బరువును పెంచే కారకంగా ఎండుద్రాక్ష ఉపయోగపడుతుంది. తక్కువ బరువు కలిగిన వారు డ్రై ఫ్రూట్స్ గా  ఎండుద్రాక్షను తీసుకుంటే, చాల మంచిది.
  • ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేనివారికి ఎండుద్రాక్ష ఎంతో ఉపయోగాన్ని ఇస్తుంది.
  • చలి కాలంలో కిస్మిస్ తీసుకోవడం చాల మంచిది. దీనివల్ల బాక్టీరియా, ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా కాపాడుతాయి.
  • ఎండుద్రాక్షలోని ఫినాలిక్ పదార్థాలు వివిధ రకాల క్యాన్సర్లను అడ్డుకోవడం జరుగుతుంది.
  • శరీరంలో టాక్సిన్స్ ను నివారించడంలో ఈ ఎండుద్రాక్ష ఎంతగానో సహాయపడుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Benefits of raisins for our health in Teluguఎండుద్రాక్ష యొక్క పోషణ
  1. కేలరీలు             –             129
  2. ప్రోటీన్               –             1.42 గ్రా.
  3. కొవ్వులు             –             0.11 గ్రా.
  4. కార్బోహైడ్రేట్లు       –             34.11 గ్రా.
  5. చెక్కరలు          –              28.03 గ్రా.
  6. డైటరీ ఫైబర్       –              1.9 గ్రా.
  7. విటమిన్ సి       –              1 మిల్లీగ్రా.
  8. క్యాల్షియం        –               27 మిల్లీగ్రా.
  9. మెగ్నీషియం       –               15 మిల్లీగ్రా.
  10. ఐరన్                 –               0.77 మిల్లీగ్రా.
  11. పొటాషియం     –              320 మిల్లీగ్రా.
  12. పాస్పరస్           –               42 మిల్లీగ్రా.
  13. సోడియం           –              11 మిల్లీగ్రా.
ఎండుద్రాక్షల యొక్క దుష్ప్రభావాలు చూద్దాం 

     రకరకాల రంగుల్లో దొరికే ఎండుద్రాక్ష పండ్లు అన్ని ఒకే రక

మైన పోషక విలువలను కలిగి ఉంటుంది. అలాగే మన శరీరానికి ఒకే రకంగానే యాంటీఆక్సిడెంట్ గా పని చేస్తుంది. ఇలా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తూ ఉన్న కూడా దుష్ప్రభావాలను కలిగి ఉండే అవకాశం ఉంటుంది. అది ఎలాగంటే, ఈ పదార్థము అయినా కూడా అతిగా తీసుకోవడం వల్ల మన శరీరానికి హానిని తలపెట్టకుండా ఉండలేదు కదా, అలాగే ఎండుద్రాక్షను చాలా పరిమితంగానే తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజును గమనిస్తూ ఉండాలి ఎండుద్రాక్షను తినడం వల్ల వచ్చే మార్పులు ఏ విధంగా  ఉంటున్నాయి అని. ఏదైనా కష్టమైన మార్పు ను గనుక గమనిస్తే, వెంటనే డాక్టర్ సలహా తో మాత్రమే ముందుకు వెళ్లడం మంచిది. 

Add Comment