తలనొప్పిని కలిగించే కారణాలు, తలనొప్పి రకాలు మరియు ఆచరించాల్సిన నివారణ మార్గాలు..|Causes of headache, types of headache and preventive measures to be followed in Telugu

తలనొప్పి అనగా ఏమిటి(What is a headache)? :

    “తలనొప్పి(headache)” అనేది చాలా సాధారణ ఆరోగ్య సమస్య. ప్రతిఒక్కరి జీవితంలో రోజువారీ పనుల ఒత్తిడి కారణంగా అలసట,  తలనొప్పి రావడం సహజమైన ప్రక్రియ అనవచ్చు. ఎవరి జీవితంలోనైనా కాలానికి అనుగుణంగా వాతావరణంలో వచ్చే మార్పులు మన ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపి, తలనొప్పికి కారణమౌతుంటాయి. ఇలా..తలనొప్పి తరచుగా కన్పించడం అంటే సాధారణంగా భావిస్తాము. కానీ, తీవ్రతరమైన నొప్పిని భరించలేని స్థితిని కలిగి ఉంటే చిన్న సమస్యగా భావించేది కాదు. జ్వరం, జలుబుతో వచ్చే తలనొప్పి లేదా వాంతులతో వచ్చే తలనొప్పి లేదా దగ్గు వల్ల వచ్చే తలనొప్పి అయితే ఇంకా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. తలనొప్పి రావడానికి వయోపరిమితి లేదు. ముఖ్యముగా, తలనొప్పి యొక్క ప్రాముఖ్యత ఒక వ్యక్తి యొక్క భాద(Sadness), దుఃఖం(sorrow), ఒత్తిడి(stress) పై ఆధారపడి ఉంటుంది.Causes of headache, types of headache and preventive measures to be followed in Telugu

    తలనొప్పి అనేది తల లేదా మెడ ప్రాంతంలో ఎక్కడో ఒక చోట బాధించే నొప్పి(A headache is a painful pain somewhere in the head or neck area). ఇది తల, మెడ భాగాల యొక్క వివిధ పరిస్థితుల కారణంగా ఒక రోగలక్షణం కూడా అయిఉండవచ్చు. తల, మెడ యొక్క తొమ్మిది సున్నితమైన ప్రాంతాలు “పెయిన్ – సెన్సిటివ్(Pain-Sensitive)” నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అవి “క్రానియం(పుర్రె యొక్క అస్తి కవచం)(Cranium (bony covering of the skull)), కండరాలు(muscles), నాడులు(nerves), ధమనులు(arteries), సిరలు(veins), చర్మఅంతర్గత కణజాలం(subcutaneous tissue), కళ్ళు(eyes), చెవులు(ears), నాసికా కుహరములు(nasal cavities), మ్యూకస్ త్వచాలు(mucous membranes)”.Causes of headache, types of headache and preventive measures to be followed in Telugu

   తలనొప్పి అత్యంత తీవ్రంగా ఉండి, సాధారణ ఆరోగ్యంపై దెబ్బతీసే జబ్బు..తలలోని రక్తనాళాల్లో రక్తప్రసరణ సరిగ్గా జరగకపొతే, రక్తనాళాలు ఒత్తిడికి గురి అయి, వాపును కలిగి ఉన్నప్పుడు తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు(It is said that if the blood circulation in the blood vessels in the head is not done properly, when the blood vessels are under pressure and have swelling, there are chances of headache). మరియు ఏదైనా విషయంపై పదే పదే ఆలోచించడం కూడా తలనొప్పికి దారి తీస్తుంది. జీవితాంతము కూడా తలనొప్పి “96% మంది”లో ఉంటుంది. ఇది పురుషుల కంటే కూడా స్త్రీలలో ఎక్కువగా వేధిస్తుంది(Harassment is more common among women than men) అని అంచనా వేయబడింది. ప్రపంచవ్యాప్తంగా “మానసికంగా కృంగదీసే తలనొప్పి 40%”, “మైగ్రేన్ 10%”, “తలలో సమూహంగా కనిపించే తలనొప్పి 1%” మందిలో కన్పిస్తుంది. Causes of headache, types of headache and preventive measures to be followed in Telugu

తలనొప్పికి గల కారణాలు(Causes of headache) :

తలనొప్పిలలో 200 పైగా రకాలున్నాయంట..కొన్ని హాని చేయనివి ఉంటాయి. కొన్ని హానిని కలిగించేవిగా ఉంటాయి. నాడీ సంబంధ పరీక్ష ద్వారా తలనొప్పి గురుంచి కనుగొనడం జరుగుతుంది. అలాగే, అదనపు పరీక్షలు అవసరమో లేదో, ఏది ఉత్తమ చికిత్స అనేది నిర్ణయింపబడుతుంది.

  • భోజనం మానుకోవడం(skipping meals) : ఉదయం పూట ప్రతిఒక్కరు ఎదో ఒక అల్పాహారం తీసుకోవాలి. ఖాళీ కడుపుతో ఉండరాదు. ఎందుకంటే, మనకు ఆకలి వేసినపుడు మన శరీరంలోని రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. షుగర్ లెవెల్స్ పెరిగినపుడు శరీరంలో నరాలు సంకోచించి, మెదడుకు సిగ్నల్స్ పంపడం వల్ల తలనొప్పి వస్తుంది. మరియు మెదడుకు కావాల్సిన ఆక్సిజన్ కూడా సరిగా అందకపోవొచ్చు.
  • నిర్జలీకరణం(Dehydration) : మన శరీరంలో నీటి శాతం తక్కువైనపుడు డీహైడ్రేషన్ కు గురి అవుతుంటాము. దీని వల్ల శరీరంలో వేడి శాతం పెరగడం, తలనొప్పి రావడం, దీని నుండి శరీరం నీరసం అయి, తల తిరగడం జరుగుతుంది. ఈ విధంగా మన మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం జరిగి, వీటి నుండి విపరీతమైన నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, తద్వారా నీరసం, అలాగే “గ్యాస్ సమస్యలు” వస్తాయి..దీనితో మలబద్దకం ఏర్పడి, మలబద్దకం వల్ల ఫైల్స్ ఇలా ఒకడానికిఒకటి సమస్యలు అనేది తోడ్పడుతాయి.
  • ఒత్తిడి(stress) : శారీరకంగా గాని, మానసికంగా కానీ కలిగే ఒత్తిడి కారణంగా తలనొప్పి వస్తుంది.Causes of headache, types of headache and preventive measures to be followed in Telugu
  • నిద్రలేమి(Insomnia) : రీరానికి అవసరమైన నిద్రను పొందడం చాల అవసరం. ఇందులో వచ్చే మార్పులు నిద్రకు భంగం కలిగించుకుంటే తలనొప్పికి దారి తీస్తుంది.
  • అతినిద్ర(Hypersomnia) : అతిగా నిద్ర పోవడం అనేది అలవాటు చేసుకోవడం కూడా సరి కాదు. వెంటనే తలనొప్పి ప్రభావం మన పై పడుతుంది.
  • దగ్గు, జలుబు, జ్వరం(Cough, cold, fever) : ఈ లక్షణాలు ఉన్నప్పుడు తలనొప్పి సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది.
  • ఎక్కువగా ఏడవడం, వేదన చెందడం(Excessive crying and agony) : మనసుకు కలిగే ఇబ్బందులు కూడా తలనొప్పిని కలిగిస్తాయి ఎందుకంటే, వాటిని మనం తట్టుకోలేని స్థితికి చేరుకుంటాము తద్వారా, తల మొత్తం కూడా పట్టేసిన భావన కలుగుతుంది.
  • పని ఒత్తిడి(Work Stress) : కంప్యూటర్ ముందు గాని, ఆఫీసులో పని చేసే చోట ఒకే పొజిషన్లో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కండరాలు పట్టేయడం జరుగుతుంది. దీనితో అలసట మొదలై, తల పని చేయడం ఆగిపోయిన ప్రభావం కలగడం మొదలౌతుంది.Causes of headache, types of headache and preventive measures to be followed in Telugu
  • మసాలా వంటకాలు(Spicy Dishes) : మసాలా తో కూడిన ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
  • ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్(Electronic Gadgets) : ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వినియోగం అనేది తలనొప్పికి గాని, మెదడు పై ప్రభావం పడుతుంది అంటున్నారు వైద్యులు.
  • ఆల్కహాల్(Alcohol) : అతిగా ఆల్కహాల్ ను సేవించడం కూడా తలనొప్పి పై ప్రభావం చూపుతుంది.

తలనొప్పి రకాలు(Types of headache) :

తలనొప్పి విషయంలో వివిధ వర్గీకరణ వ్యవస్థలు ఉన్నాయి. తలనొప్పి అనేది ఒక నిర్దిష్ట రోగాలక్షణం కాదు. అంటే, దీనర్థం అనేక ఇతర కారణాలు ఉంటాయి. తలనొప్పి మొత్తం 3 రకాలుగా ఉంటుంది.

  1. ప్రైమరీ తలనొప్పి(Primary headache) : ప్రైమరీ తలనొప్పి కూడా 3 రకాలుగా ఉంటుంది. ఇందులో ఒకటి సాధారణ కారణాలతో వచ్చే నొప్పి. రెండోవది, మైగ్రేన్ కారణంగా వచ్చే తలనొప్పి. మూడవది, ఆందోళన, ఒత్తిడితో వచ్చే తలనొప్పి. మరియు
  • క్లస్టర్ తలనొప్పి(Cluster headache) : సమూహ వైఖరి తలనొప్పి లేదా క్లస్టర్ తలనొప్పి పెక్కు ఇబ్బందులను కలిగిస్తుంది. ముఖం మధ్య పైభాగంలో కళ్ళ చుట్టూ దీని ప్రభావం కలిగి ఉంటుంది. ఈ రకం తలనొప్పి కొన్ని వారాలు, నెలలు పాటు భాదిస్తుంది. మరియు ఈ తలనొప్పి వచ్చే రోజులలో కొన్ని సందర్భాలలో అసలు తలనొప్పి ఉండదు. ఇలా..తలనొప్పి రహితమైన వ్యవధి కొన్ని నెలల నుండి సంవత్సరాల వరకు కొనసాగవచ్చు. ఇది ఆకస్మికంగా కనిపించే జబ్బు. మంటను రేకెత్తిస్తుంది. 15 నిమిషాల నుండి 3 గంటల వరకు కొనసాగుతుంది. కొన్ని సందర్భాలలో 24 గంటల వ్యవధిలో పలుమార్లు రావొచ్చు. దీని విశిష్ట లక్షణాలలో కళ్ళ నుండి నీరు కారడం, ముక్కు గడ్డకట్టడం, హెచ్చు శ్లేష్మం చేరి ఉంటాయి.
  • సైనస్ తలనొప్పి(Sinus headache) : ఈ రకమైన తలనొప్పితో కనిపించే లక్షణాలు ముఖంలో నొప్పి లేదా ఒత్తిడి, ముక్కులో అడ్డంకి తలనొప్పితో కూడిన సైనస్ లు. వైరల్ జలుబు లేదా సూక్ష్మజీవుల ద్వారా సంక్రమించే సైనస్ ఇన్ఫెక్షన్ తర్వాత ఎదురవుతుంది. దీని వల్ల ముక్కునుండి గట్టిదనంతో వర్ణరహితమైన శ్లేష్మం కారడం, వాసన పసికట్టడంలో మాంద్యం లేదా అసలు వాసన పసికట్టలేకపోవడం, ముఖంలో నొప్పి మరియు జ్వరం ఒత్తిడి. ఇది యాంటీబయోటిక్స్ వాడకం ద్వారా వారం రోజులలో అదుపు చేయవచ్చు.Causes of headache, types of headache and preventive measures to be followed in Telugu
  • థండర్ క్లాప్ తలనొప్పి(Thunder clap headache) : ఈ తలనొప్పి చాల తీవ్రస్థాయిలో గరిష్టంగా ఉంటుంది. ఇది ఆకస్మికంగా లేదా కొద్దీ కొద్దిగా మొదలవడం జరుగుతుంది. చాలా తీవ్రమైన తలనొప్పిని అనుభవిస్తున్నట్లయితే మెదడులో రక్తస్రావం, మెదడులో ఒత్తిడికి దారితీసే హైపర్ టెన్షన్ ఇబ్బందులను కల్గిస్తుంది.

2. సెకండరీ తలనొప్పి(Secondary headache) : ఇందులో వచ్చే తలనొప్పి ఏదైనా వ్యాధి కారణంగా రావొచ్చు. ఈ వ్యాధులు సాధారణంగా వచ్చే జలుబు లాంటి సమస్యల వల్ల వస్తుంది. మెదడుకు సంబంధించి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ వల్ల మరియు మెదడు పనితీరు సమస్యల వల్ల తలనొప్పి రావడం అనేది జరుగుతుంది. ఈ స్థితిలో ఉన్నపుడు రోగి యొక్క నాడీని పరిశీలించాలి, ఇందులో నరాలు తెలివిలేనివిగా ఉంటాయి. కొన్ని రకాల సర్జరీలు అనేవి వైద్యులు సూచిస్తారు.

3. అతి తీవ్రమైన తలనొప్పి(Severe headache) : ఈ తలనొప్పి అనేది పక్షవాతం వల్ల వస్తుంది. ఈ నొప్పి సమయంలో ఒక వస్తువు రెండుగా కనపడడం, నిద్రలోంచి లేవగానే తీవ్రమైన తలనొప్పి, జ్వరముతో వచ్చే తలనొప్పి, వాంతులతో కూడిన తలనొప్పి, ఇవన్నీ ప్రమాదకారకాలు. వయస్సుతో పెరిగే తలనొప్పితో చూపు తగ్గడం ప్రమాదకర జబ్బులకు సంబంధించి లక్షణాలు కావొచ్చు. పూర్తిగా భరించలేని స్థితిలో కనుక ఉన్నట్లయితే, ఈ సమస్యలను అనుభవిస్తున్నట్లయితే, ఇందులో నాడి కుళ్లిపోవడం జరుగుతుంది. తప్పకుండ శస్త్రచికిత్స అవసరపడుతుంది. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

మైగ్రేన్ తలనొప్పి (Migraine headache) :Causes of headache, types of headache and preventive measures to be followed in Telugu

     మైగ్రేన్ తలనొప్పి అనేది స్త్రీలలో అధికంగా చూస్తుంటాం..మైగ్రేన్ రావడానికి తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనై వాపు అనేది వచ్చి మైగ్రేన్ కి కారణమౌతుంది. ఈ తలనొప్పి చాలా వరకు తలకు ఒక పక్క భాగంలో వస్తుంది. కానీ, కొన్ని సార్లు తలలో రెండు వైపులా కూడా రావొచ్చు. ఈ రకమైన తలనొప్పి తీవ్రంగా ఉండి, తలలో కొట్టుకుంటున్నట్లుగా..వస్తూ పోతున్నట్లుగా..తగ్గుతూ లేదా తీవ్రమౌతున్నట్లుగా ఉంటుంది. కొందరికి వాంతులు అవుతుంటాయి. వాంతి చేసుకున్నాకే ప్రశాంతంగా అనిపిస్తుంది. కొందరికి కావు. ఎవరైనా మాట్లాడితే చిరాకుగా ఉంటుంది. శబ్దాలు వినాలి అనిపించదు అంతగా తట్టుకోలేని పరిస్థితిలో కి వెళ్తారు. ప్రయాణం చేసిన, ఎండలో ఎక్కువగా తిరిగిన, భోజనం ఆలస్యం అయినా లేక అస్సలు తినకపోయినా, నిద్ర తక్కువైనా లేక మరీ ఎక్కువైనా ఇలాంటి సందర్భాలన్నింటిలోను ఈ రకం తలనొప్పి రావొచ్చు. ఇవ్వన్నీ కూడా పార్శ్వపు నొప్పిని ప్రేరేపించేవి కానీ, పార్శ్వపు నొప్పికి మూలకారణాలు కావు. “పార్శ్వపు తలనొప్పి” అనేది జన్యుపరమైన తలనొప్పి. వంశంలో ఎవరికైనా ఉంటె మనకు రావచ్చు.  పురుషుల్లోనూ ఉండొచ్చు కానీ, స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. ఈ పార్శ్వపు నొప్పిని శాశ్వతంగా తగ్గించే మందు ఏమి లేదు. కాకపొతే, దీన్ని తగ్గించి, నియంత్రించేందుకు మంచి చికిత్సలు ఉన్నాయి. ఇలా నియంత్రణలో ఉంచితే, కొన్నాళ్లకు దానంతట అదే పోతుంది. కానీ, మళ్ళి కొంతకాలం తర్వాత కూడా వచ్చే అవకాశం లేకపోలేదు.

తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు(Frequent headaches should not be ignored) : Causes of headache, types of headache and preventive measures to be followed in Telugu

తలనొప్పి రావడానికి కారణాలు ఉంటాయి. అందులోను తరచూ తలనొప్పితో బాధపడుతుంటే, అశ్రద్ధ చేసే సమస్య కాదు అంటున్నారు వైద్యులు. రక్తపోటు కారణంగా మెదడులో కణతుల వల్ల, రక్తనాళాల్లో రక్తప్రసరణలో మార్పుల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, నిద్రలేమి వల్ల వచ్చే అవకాశం ఉంది. మగవారిలో రక్తపోటు, మానసిక ఒత్తిడి, మెదడులోని కణతుల వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణ తలనొప్పిని సులువుగా తగ్గించుకునే మార్గాలను అనుసరిస్తే చాలు మటుమాయం అవుతాయి. కానీ, తరచూ భాదించేదిగా ఉంటే..ఏ కారణంతో మొదలయింది అని గ్రహించుకోవాలి. ఏ మాత్రం సమస్యను అదుపు చేయలేని స్థితిలో ఉంటే వైద్యుడి సలహాలు, పరీక్షలు చేయించడం ఉత్తమం అవుతుంది..

తలనొప్పిని తగ్గించుకోవడానికి ఇతర రకాలైన మార్గాలను ఎన్నుకోండి(Choose other ways to relieve headaches) :
  • ఆక్యుప్రెషర్(Acupressure) :

1. చూపుడు వేలు, బొటన వేలు మధ్యలో(Index finger, middle of thumb) : మన ఎడమ చేతి యొక్క చూపుడు వేలు, బ్రొటన వేలుకు మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. దీన్ని “యునివ్యాలీ పాయింట్” అంటారు. మీ కుడి చేతి బొటన వేలితో 2,3 నిమిషాల పాటు సున్నితంగా నొక్కి ఉంచి, గుండ్రంగా తిప్పండి. కానీ, నొప్పి కలిగేంతగా ఆ భాగాన్ని పట్టుకోవద్దు. ఇది ఒత్తిడిని తగ్గించేందుకు సహకరిస్తుంది. తలనొప్పి తగ్గుతుంది. సాధారణ సమస్యకు ఇది మంచి చిట్కా కూడా..

2. కళ్ళ మధ్యలో, ముక్కుపై(Between the eyes, on the nose) : ముక్కు ప్రాంతం దగ్గర “డ్రిల్లింగ్ బాంబ్” పాయింట్ అంటారు. తలనొప్పి వచ్చినపుడు, మీరు మీ రెండు చేతుల యొక్క చూపుడు వేళ్ళను ఉపయోగించి, రెండు కళ్ళ మధ్యలో ముక్కు భాగంపై కనీసం 15 సెకన్లు సున్నితంగా ప్రెస్ చేస్తూ మర్దన చేయండి. దీనివల్ల, తలనొప్పి, సైనస్ నొప్పులు తగ్గుతాయి.

3. కనుబొమ్మల మధ్య(Between the eyebrows) : కనుబొమ్మల మధ్య ఉండే ప్రాంతాన్ని మూడో కన్నుగా భావిస్తారు. అక్కడ ఒక నిమిషం పాటు బొటన వేలు లేదా చూపుడు వేలుతో ఒత్తిడి చేయండి లేదా రెండు వేళ్ళతో మర్దన చేయండి. దీనివల్ల విశ్రాంతి కలగడమే కాకుండా తలనొప్పి కూడా తగ్గుతుంది.

  • అరోమా థెరిపీ(Aroma Therapy) : Causes of headache, types of headache and preventive measures to be followed in Teluguఅరోమా థెరపీ అనేది అన్ని రకాలుగా శ్రేయస్కరం. చందనం, మిరియాలు, యూకలిఫ్టస్, లావెండర్ మరియు  రకరకాల ఔషదాలతో తయారైనది. కాబట్టి, తలనొప్పిని దూరం చేయడానికి ఈ ఔషధం చక్కగా పనిచేస్తుంది.
  • లోతైన మెదడు ప్రేరణ(Deep Brain Stimulation)Causes of headache, types of headache and preventive measures to be followed in Telugu
  • జీవన క్రియ మార్పుల సూచన(Indication of lifestyle changes)(Bio feed back)
  • ప్రగతిశీల కండరాల సడలింపు)(Progressive muscle relaxation)
  • కౌన్సిలింగ్ థెరపీ(Counseling therapy)
మన జీవన విధానంలో అలవాటు చేసుకొని, ఆచరణలో పెట్టాల్సిన మార్పులతో తలనొప్పిని సులభతరంగా తరిమివేయొచ్చు(We can get rid of headaches easily by making changes in our lifestyle) :

    తలనొప్పి సాధారణంగా మన జీవనశైలి అలవాట్లతో ముడిపడి ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే, మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగం తల, మెదడు..ఇవి చాలా సున్నితమైన భాగాలు కూడా..వీటిలో రక్తప్రసరణ అనేది సవ్యంగా లేకపోతె వచ్చే నష్టాలు ఎన్నో ఉంటాయి అని వైద్యులు చెప్తుంటారు. రక్తప్రసరణ బాగుండాలి అంటే..మనము వాటిపై ఎలాంటి ఒత్తిడిని పెంచుతున్నాము. ఎలా తగ్గించుకోవాలి అనే అవగాహనను కలిగి ఉండడం చాల ముఖ్యం.

  1. ప్రతి వ్యక్తి రోజుకు 2,3 లీటర్ల నీటిని(2,3 liters of water) తాగడం తప్పనిసరి అవుతుంది. అప్పుడే శరీరం డీహైడ్రేట్(Dehydrate) అవ్వకుండా ఉండగలదు. అందులోను గోరువెచ్చటి నీటిని తాగడం అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. ముఖ్యమైన విషయం వచ్చేసి..కొంతమందికి దాహం అనేది కలగదు. ఇందుకు కారణం ఆరోగ్య సమస్య కావొచ్చు లేదా ఇతర సమస్య కావచ్చు..అలాంటప్పుడు నీటిని తాగాల్సిందే అని తాగడం సరియైనది కాదు. ముందుగా సమస్య ఏంటి అనేది తెలుసుకోవాలి.
  2. వీలైనంతగా మనం,, పూర్తీ ఆరోగ్యవంతులుగా లేనట్లు మనకు అనిపిస్తే, ముందుగా సరిఅయిన నిద్ర మనకు అందేలా చూసుకోవాలి. అది కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండ సమయ పాలన అలవాటు చేసుకోవాలి.
  3. సరైన పౌష్టికాహారం(Nutritious food), సరైన సమయానికి క్రమం తప్పకుండా ప్రతిరోజు తినడం అలవాటు చేసుకోవాలి.
  4. వ్యాయామం(exercise) అనేది ప్రతి వ్యక్తి తమ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ఏ వ్యాయామం అనేది ఎంత లాభాన్ని చేకూరుస్తుంది, ఎంత ఒత్తిడిని కలిగించి ఆరోగ్యానికి ఇబ్బంది చేరుస్తుంది అని చూసుకున్నాక..మీకు వీలైనంతగా చేయగలిగే వ్యాయామాలనే క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి.
  5. యోగాసనాలు(Yogasanas) చేయడం అనేది కూడా తలనొప్పి నుండి విముక్తిల్ని చేయడమే కాక, మన శరీరంలోని, తలభాగంలోను రక్తప్రసరణకు బాగా ఉపయోగపడుతుంది.
  6. మీ వయస్సును బట్టి, మీరు ఎంత బరువు(weight) ఉండడం మంచిది అని తెలుసుకోవాలి. ఎక్కువుగా ఉన్నట్లు అనిపిస్తే, సాధ్యమైనంతవరకు తగ్గించుకునే ప్రయత్నం చేయండి.
  7. కాఫీ ఎక్కువగా తాగడం అలవాటు మానుకోవాలి. కాఫీ(Coffee) లేకపోతె బ్రతకలేము అనేట్లుగా బానిస అవ్వడం నుండి విముక్తుల్ని చేసుకోండి.
  8. మానసిక ఒత్తిడి, ఆందోళన..వీటి నుండి బయటపడడానికి ధ్యానం(meditation) చేయడం లేదా ఇంకా ఏదైనా మీకు నచ్చిన, మనసుకు ఆనందం కలిగించే మార్గాల ద్వారా ప్రశాంత వాతావరణం కలిగేలాగా చూసుకోవడం నేర్చుకోవాలి.
  9. రోజు వారి దినచర్యలో ఎక్కువ పని ఒత్తిడికి గురి అయితే, వెంటనే కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. దీని ద్వారా మెదడుకు ప్రశాంతత కలుగుతుంది.
  10. మనం బయటకి వెళ్లాల్సి వస్తే, ఎండాకాలంలో అయితే, తల పూర్తిగా కవర్ అయ్యేలా స్కార్ఫ్ కట్టుకోవడం, క్యాప్ పెట్టుకోవడం అనే అలవాటు చాలా మంచిది. దీని వల్ల నేరుగా తలపై ఎండా తీవ్రత నుండి ఎలాంటి దుష్ప్రభావం అనేది పడకుండా కాపాడుకునే వీలు ఉంటుంది. మరియు ఏ కాలానికి అయినా దానికి అనుగుణంగా తలను కానీ, శరీరాన్ని కానీ కవర్ చేసేలా చర్యలు తీసుకోగలిగితే కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.
  11. ఎండాకాలంలో అయితే ఎండ వేడిమికి డిహైడ్రేట్ అవ్వడం జరిగి, తలనొప్పి భాదించడం సాధారణం కదా..అందుకే, చల్లటి కొబ్బరి నీళ్లు(Cold coconut water), మజ్జిగ(buttermilk), ఇతర సహజసిద్ధ పానీయాలు(Natural drinks) తాగితే కూడా వెంటనే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.Causes of headache, types of headache and preventive measures to be followed in Telugu

ముగింపు(Conclusion) :

       తలనొప్పి అంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామా అనేది గమనించుకోవడం తప్పనిసరి అవుతుంది. దీని ద్వారా మన ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచుకునే అవగాహన సామర్థ్యం వస్తుంది. అందులో తలనొప్పి ఏ విధంగా మనల్ని భాదిస్తుంది..ఏ పరిస్థితి నుండి మన శరీరానికి ఇబ్బంది మొదలైంది అని ఆలోచించడం మనం వేసే మొదటి అడుగుగా భావించాలి.

తలనొప్పి ఎలా మొదలౌతుంది?..తలనొప్పిలో రకాల గురుంచి..తలనొప్పిని కలిగించే కారణాలు..జీవన విధానంలో చేసుకోవాల్సిన మార్పులు తెలుసుకున్నాము..మన జీవితంలో జరిగే ఎన్నో మార్పులు, దుఃఖం, కష్టం, నష్టం ఇలా అనుభవిస్తుంటాము..దీనితో పాటుగా ఈ ఆధునిక కాలంలో పెరిగిన కాలుష్యంతో వాతావరణంలో సంభవించిన మార్పులు ప్రజల యొక్క ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఏర్పడుతున్నపుడు, తలనొప్పి అందులో ఎంత మాత్రం..కదా! ఈ విధంగా తలనొప్పి రావడానికి ఎన్ని కారణాలు ఎదురుఅవుతున్నాయి అర్ధం చేసుకోవచ్చు. 

     సాధారణంగా, తలనొప్పి అనగానే, అందరికి మందులు వేసుకోవడం అలవాటు ఉంటుంది..ఒకటి, రెండు రోజుల వరకు సరే..కానీ, నెలల తరబడి మందులు, మాత్రలు వేసుకోవడం అనేది కూడా, అందులోను రసాయనాలతో కూడినవి. కాబట్టి, ఆరోగ్య పరిస్థితిపై దుష్ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. తరచుగా మందులను వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినపుడు..వాటి నుండి కలిగే లాభం ఏ మేర ఉండగలదు అని అవగాహనను పెంచుకోవడం ప్రతిఒక్కరి కర్తవ్యం అవుతుంది. అందుకే, ముందుగా మనం చేయాల్సిన చిన్న చిట్కాలను పాటించడం అలవర్చుకోవాలి..

     ఈ విధానంలోనే, తలనొప్పి భాదిస్తుందా? అయితే, మన రోజువారీ జీవితంలో జరిగే సంఘటనలను, ఆరోగ్య విషయంలో లేదా జీవితంలో జరిగే తేడాలను గమనించగలిగితే, వాటి నుండి సమస్యను పరిష్కారం చేసుకునే మార్గాలు కన్పిస్తాయి. పైన తెలిపిన విధంగా, ప్రతి వ్యక్తి తమ ఆరోగ్య సమస్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, చేసుకోవాల్సిన మార్పుల పైన దృష్టి పెట్టగలిగితే చాలు..తలనొప్పి సమస్య మన దరి చేరడం అనేది అసంభవం అని చెప్పేయొచ్చు..

    తరచుగా తలనొప్పి భాదిస్తుంది అంటే..వీలైనంతగా మీ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి కూడా ప్రయత్నం చేయవొచ్చు పైన తెలిపిన పరిష్కార మార్గాల ద్వారా..కానీ, పరిస్థితి చేయిదాటే వరకు చేరుకున్నట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకోవడం సరి అవుతుంది.

     వైద్యుడి సలహాలతో చికిత్స తీసుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నా సరే, తర్వాత..ఏ రూపంలోనైనా, ఏ విధంగా అయినా తలనొప్పి దరి చేరదు అనుకోవడం పొరపాటే అవుతుంది. అందుకే, మన అంతరంగం నుండి కూడా శక్తి సామర్ధ్యాలను కలిగి ఉండేలా మనం తయారవ్వాలి. మరియు మన రోజూవారి దినచర్యలో భాగంగా పౌష్టికాహారం, మంచి నిద్ర, వ్యాయామం, ఆందోళన, ఒత్తిడి నుండి విముక్తుల్ని చేసుకోవడానికి ధ్యానం..ఇలా అనేక రకాల సరిఅయిన అలవాట్లను పాటించడం మర్చిపోవొద్దు. చిన్నతనం నుండే పిల్లలకు కూడా సరిఅయిన అవగాహనను, జీవితం విలువ అర్ధం అయ్యేలాగా.. అంటే, మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి. ఏ విధంగా ఒత్తిడిని కలిగిస్తున్నాము. తట్టుకునే శక్తిని మరియు మార్గాలను వివరంగా తెలియజేయడం అతి ముఖ్యమైన విషయం. ఈ క్రమంగా తలనొప్పి సమస్యలు తీవ్రతరం అవ్వకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తేలిక అవుతుంది.

Add Comment