తలనొప్పి నివారణ కోసం ఔషధంగా ఉపయోగపడే మన ఇంటి చిట్కాలను వెంటనే పాటించేయండి.|Immediately follow our home remedies for headache relief in Telugu.

తలనొప్పి నివారణకు ఇంటి చిట్కాల ద్వారా సహజమైన మార్గాలు(Natural home remedies for headache) :

     తలనొప్పి(headache) ఎవరినైనా సరే దుఃఖపెట్టక మానదు..ఏ వయస్సు వారికి అయినా, తలనొప్పి రావడం అనేది వాళ్ళ పని ఒత్తిడి పైనా ఆధారపడి ఉంటుంది. కాలానికి అనుగుణంగా కూడా తలనొప్పి రాక మానదు. ఎందుకంటే, వాతావరణంలో వచ్చే మార్పులు కూడా మెదడు పని తీరు మరియు నాడీవ్యవస్థ పై ప్రభావం చూపి, అది కాస్త తలనొప్పి నుండి మన ఆరోగ్యం పై దాడి చేసే వరకు కూడా హానిని కలిగించే అవకాశం ఉండనే ఉంటుంది. దీని ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లోపించడం, తరచుగా చిరాకు, ప్రశాంతతను కోల్పోయేలాంటి భావాలు కలుగుతూ ఇలా..మొదలైన సమస్యలను ఉత్పన్నం చేస్తాయి.Immediately follow our home remedies for headache relief in Telugu.

    ఈ ఆధునిక కాలంలో తలనొప్పిని తగ్గించడానికి మనం మాత్రలు వేసుకోవడం సర్వసాధారణం అయిపొయింది. అంతేకదా లోకంతో పాటుగా మనము నడవాల్సి వస్తుంది. మనకు తెలియకుండానే అలవాటు పడిపోతాము కూడా..కానీ, ఒక్కసారి ఆలోచిస్తే, రసాయనాలతో కూడిన మాత్రలు మన ఆరోగ్యాన్నికి ఎంత హానిని కలిగిస్తుంది. మరియు ఎన్నో సమస్యలు సృష్టింపబడుతాయి అని అర్ధం అవుతుంది. అందుకే, ఈ రోజుల్లో అందరు ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని, ఇంటి చిట్కాలను పాటించడానికి ఇష్టపడుతున్నారు.

    సాధారణంగా తలనొప్పి నివారణకు జీవనశైలిలో, ఆహారంలో చేసుకునే మార్పులు ఏ విధంగా సహాయపడుతాయో..అదే విధంగా, మన ఇంటి వైద్యం అదేనండి..వంటింటి చిట్కాలతో తలనొప్పిని మటుమాయం చేసే పదార్థాలు ఔషధంగా మనకు ఉపయోగపడుతాయి. ఇంటి చిట్కాలతో ఉపయోగపడే పదార్థాలు ఏమిటి అని తెలుసుకుందాము.. 

లవంగాలు(Cloves) : లవంగాలను చూర్ణం చేసి శుభ్రమైన రుమాలులో ఉంచి, తలనొప్పి వచ్చినప్పుడల్లా వాసనను పీలుస్తూ ఉండాలి. తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మరియు లవంగం నూనెతో కూడా తలకు మర్దన చేసుకోవచ్చు. తలనొప్పిని తగ్గించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.Immediately follow our home remedies for headache relief in Telugu.

దాల్చిన చెక్క(Cinnamon) : దాల్చిన చెక్కను పొడి గా చేసి, నీటిని కలిపి పేస్ట్ చేయాలి. ఈ చూర్ణంను నుదిటిపై రోజుకు 3,4 సార్లు అప్లై చేయండి. తలనొప్పి నివారణ జరుగుతుంది. దాల్చిన చెక్కను టీలో కలిపి తాగిన ప్రయోజనం ఉంటుంది. Immediately follow our home remedies for headache relief in Telugu.

తులసి(Basil) : తులసి మొక్క ఆకులు అనేవి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది అని తెలుసు కదా..అయితే, తులసి టీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది తలనొప్పి నివారణకు అని చెప్తున్నారు.Immediately follow our home remedies for headache relief in Telugu.

పసుపు(turmeric) : పసుపులోని కర్క్యుమిన్ అనే సమ్మేళనం, మైగ్రేన్ దాడుల ఫ్రీక్వెన్సీని, తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాస్ పాలలో కొద్దిగా తాజా పసుపు వేసి మరిగించి, ఆపై వడకట్టి గోరువెచ్చగా తాగాలి. తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.Immediately follow our home remedies for headache relief in Telugu.

జీలకర్ర(Cumin) : జీలకర్రను వేయించి, శుభ్రమైన రుమాలులో ఉంచి వాసనను పీల్చడం అనేది కూడా యాంటీ బాక్టీరియల్ గా పనిచేసి, తలనొప్పి ని తగ్గిస్తుంది.Immediately follow our home remedies for headache relief in Telugu.

చందనం(Sandal) : చందనం పొడిని పేస్ట్ లా తయారుచేసి, నుదిటిపై అప్లై చేస్తే చాలు తలనొప్పి మటుమాయం అవుతుంది.

విటమిన్స్(Vitamins) : విటమిన్ – సి, డి, బి12, క్యాల్షియం, మాంసకృత్తులు, ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం ద్వారా తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. మరియు క్యాబేజి, క్యాలీఫ్లవర్, మెంతికూర, ఇతర రకాల ఆకుకూరలు కూడా మీ ఆహారంలో భాగం చేసుకుంటే లాభాన్ని పొందగలం. అయితే, తలనొప్పి భాదిస్తున్నపుడు, వెన్న, చాక్లెట్ లు, మాంసం లాంటి పదార్థాలు మీ ఆహరం నుండి పూర్తిగా తొలగించాలి. మరియు బయట లభ్యమయ్యే జంక్ ఫుడ్ ని తొలగించడం చాల ముఖ్యం.  

అల్లం(Ginger) : అల్లాన్ని నమిలినా సరే తలనొప్పి తగ్గుతుందంట. లేదా అల్లంతో కాషాయం చేసి కూడా తాగితే తలనొప్పి మటుమాయం అయిపోయి మంచి ఉపశమనం మరియు ప్రశాంతత లభిస్తుందంట.. Immediately follow our home remedies for headache relief in Telugu.

యూకలిఫ్టస్ ఆయిల్(Eucalyptus Oil) : ఈ యూకలిఫ్టస్ ఆయిల్ తో తలకు మర్దన చేయండి. తక్షణమే, తలనొప్పిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది.

కొబ్బరి నూనె(Coconut Oil) : కొబ్బరి నూనె తల భాగంలో చల్లదనాన్ని ఇచ్చి తలనొప్పిని తగ్గిస్తుంది. అందుకే, ఈ నూనెతో తలకు 10, 15 నిమిషాలు మర్దన చేస్తే చాలు మంచి ఉపశమనాన్ని మరియు గాఢమైన నిద్రను పొందగలం.

నిమ్మరసం నీళ్లు(Lemon juice) : గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగినా కూడా తలనొప్పి నుండి నివారణ జరుగుతుంది అంటారు.Immediately follow our home remedies for headache relief in Telugu.

ఆవుపాలు(Cow’s milk) : గోరువెచ్చని ఆవుపాలు సైతం తలనొప్పిని తగ్గిస్తుందట..

నువ్వుల నూనె(Sesame oil) : నువ్వులనూనెను వేడి చేసి, గోరువెచ్చగా ఉన్నపుడు తలకు మరియు శరీరానికి మర్దన చేసి, కొద్దిసేపు తర్వాత తలస్నానం చేస్తే, తలనొప్పి నుండి ఉపశమనం పొందుతారు.

జ్యూస్(Juice) : క్యాల్షియం సప్లిమెంట్స్ వల్ల రక్తప్రసరణ జరిగి, మీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. ఒక గ్లాస్ పాలు లేదా ఆరంజ్ జ్యూస్ తీసుకుంటే తలనొప్పి నివారణను పొందవచ్చు అంటారు. మరియు ఎక్కువగా ఉన్నపుడు క్యారెట్ జ్యూస్, కీరా జ్యూస్ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు. మరియు అరటిపండు, పైనాపిల్ జ్యూస్ కూడా బాగా ఉపయోగపడుతుంది.

డీహైడ్రేషన్(Dehydration) : తలనొప్పికి డీహైడ్రేషన్ కూడా కారణమౌతుంది కాబట్టి, ఒక గ్లాస్ నిండా చల్లటి నీళ్లు తాగితే, తలనొప్పి తగ్గుముఖం పడుతుందంట..

గోరువెచ్చటి నీటితో స్నానం(Warm water bath) : తలనొప్పి తీవ్రంగా బాధిస్తుంటే, గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం అలవాటు చేసుకుంటే సరి. పూర్తి విశ్రాంతి కలిగిన అనుభూతిని చెందుతారు. మరియు గోరువెచ్చని నీటితో నింపిన బగేట్ లో మన పాదాలను ఓ 15 నిముషాలు ఉంచడం వల్ల, మీకు దీర్ఘకాలంగా ఉన్న తలనొప్పి లేదా సైనస్ వల్ల వచ్చిన తలనొప్పిని నివారించుకోవచ్చు. ఇలా..కనీసం 2,3 వారాల పాటు చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.

మంచి నిద్ర చాలా అవసరం(Good sleep is essential) : సరైన నిద్ర లేకపోవడం కూడా తలనొప్పికి కారణమౌతుంది. అందుకే, రోజుకు తప్పకుండ 8 గంటల పాటు నిద్రించేలా అలవాటు చేసుకోవడం తప్పనిసరి. దీనితో తలనొప్పులు దూరం చేసుకోవొచ్చు.Immediately follow our home remedies for headache relief in Telugu.

తలనొప్పి, పార్శ్వపు నొప్పిని తగ్గించగల ఆయుర్వేద వివరణ(Ayurvedic explanation for reducing headache and migraine) :Immediately follow our home remedies for headache relief in Telugu.

ఆయుర్వేదాన్ని కూడా సమగ్ర విధానంతో మాత్రమే భావించడం జరుగుతుంది. మన శరీరం, మనసు, ఆత్మను పరిగణలోకి తీసుకుంటుంది. జీవం అనేది గాలి, ఆకాశం, అగ్ని, భూమి, నీరు..ఈ 5 అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీనినే “పంచభూతాలు” అంటాము. ఇందులో గాలి అనేది “శ్వాసవ్యవస్థ, నాడీవ్యవస్థ”తో ముడిపడి ఉంటుంది. ఆకాశం అనేది శరీరంలోని స్పేస్ అనగా..”నోరు, చెవుల”తో ముడిపడి ఉంటుంది. అగ్ని మన “జీవక్రియ”తో ముడిపడి ఉంటుంది. భూమి శరీర స్వరూపం అనగా “ఎముకల”తో ముడిపడి ఉంటుంది. ఇక నీరు ద్రవాలతో అనగా “రక్తం, లాలాజలం” వంటి వాటితో ముడిపడి ఉంటుంది.

ఈ 5 అంశాలు మనలోని శక్తిని, దోషాలను నిర్థారిస్తుంది. శరీరంలో వాత, పిత్త, కఫ అనే 3 దోషాలను కలిగి ఉండి, ఇందులో ఎదో ఒక దోషం ఎక్కువగా ఉండడం వల్ల, అనారోగ్యం వెంటాడుతుంది. దీని వల్ల సమస్యలు రాకుండా ఉండాలి అంటే, మిగిలిన వాటిని సమతుల్యం చేసుకోవాలి. తలనొప్పి, మైగ్రేన్ నొప్పి కూడా వాత దోషాల్లోని సమతుల్య లోపం వల్లే వస్తుంది. ఆయుర్వేద పరంగా కూడా సమస్య పరిష్కారానికి, దోషాలను సరిచేస్తే ఈ నొప్పులనుండి కూడా విముక్తులం అయ్యే అవకాశం ఉంటుంది. మరియు ఇందులో భాగంగా శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తారు. ఆహారం, జీవనశైలిలో మార్పులను తెలియజేస్తారు. అలాగే, ఒత్తిడి నుండి ఉపశమనం కలిగి ప్రశాంతంగా ఉండేందుకు కూడా కొన్ని మెళుకువలను సూచిస్తారు. ఆయా దోషాలను తగ్గించేందుకు ఏ విధానాలు మీ సమస్యలకు సరైనవి అని ఆయుర్వేద వైద్య నిపుణులు నిర్ణయిస్తారు.

ముగింపు(Conclusion) :

తలనొప్పి రావడం ఒక సమస్య..అందులోను జలుబు, జ్వరం వల్ల వచ్చే తలనొప్పి లేదా వాంతుల వల్ల వచ్చే తలనొప్పి లేదా దగ్గు వల్ల వచ్చే తలనొప్పి..ఇలాగ భాదిస్తున్నట్లయితే, ముందుగా మనం ఆరోగ్యముగా ఎంత వరకు ఉన్నాము అనేది  కూడా తప్పకుండా చూసుకోవాలి. ఎందుకంటే, మన శరీరంలో కూడా రక్తప్రసరణ అనేది ఎలాంటి ఆటంకం కలగకుండా జరిగేలా చూసుకోవాలి అంటే..మానసికంగా, శారీరకంగా ఒక శక్తివంతులుగా అవ్వడానికి వివిధ మార్గాల ద్వారా ప్రయత్నం చేయడం సరిఅయిన దారి. అప్పుడే తలనొప్పి ఒకటే కాదు..ఎలాంటి రోగం అయినా దరి చేరడానికి సాహసం చేయలేదు.

      ఆ తర్వాత, మీకు సాధారణ తలనొప్పిగా అనిపిస్తే..దానికి మాత్రలు వేసుకోవడం మాత్రమే పరిష్కారం కాదు. మన వంటింటి లో ఉండే పదార్థాలు కూడా దివ్యౌషదంలాగా పని చేస్తాయి అంటున్నారు. దీనికి ఆయుర్వేదం కూడా ఎంతో తోడ్పాటును అందించగలదు. మన శరీర పని తీరు సరిగ్గా ఏ భాగం ఇబ్బంది కరంగా ఉంది అని ఆయుర్వేద నిపుణులు గుర్తించి..దానికి తగిన సలహాలు, ఆహారపదార్థాలు, వ్యాయామాలు సూచిస్తారు..అయితే, తలనొప్పి తరచుగా బాధిస్తుంటే..ఇంటి చిట్కాలు పాటిస్తూ ఉపశమనం కలిగింది అని ఆ సమయం వరకు తృప్తిపడి మరల చిట్కాలు ప్రయోగిస్తూ వెళ్లడం తెలివిలేనితనం అంటారు..

      అందుకే, ప్రతి వ్యక్తికి తలనొప్పి వచ్చిన, తరచూ భాదించిన సరే ఒక అవగాహనను పెంచుకోవడం ముఖ్యం. సమస్య వచ్చినపుడు ఏ విధమైన మనోదైర్యంను కలిగి ఉండాలి అని..ఈ శక్తితోనే సమస్యను పూర్తిగా కూడా నివారించుకోగలుగుతాము. ఈ అవగాహన మనలో పెరిగినట్లయితే సమస్యను గుర్తించగలుగుతాము. ఎలాగా తగ్గించుకోవడం సరిఅయిన మార్గం అని మన మనసే సలహా చెప్పగలుగుతుంది. వ్యాయామాలు చేయమన్నారు అని కూడా మన మెదడు అసలే ఒత్తిడిని కలిగి ఉంటే, ఇంకా శ్రమ కలిగించవద్దు. ఎంత ప్రశాంతంగా తగ్గించుకునే మార్గం ఉంటుందో ఆలోచించాలి. సమస్య తీవ్రతరం అనిపిస్తే వైద్యుడి సలహా కూడా పాటించడం ఎంతో అవసరం అవుతుంది. ఈ సమయంలో కూడా సొంత చిట్కాలు తగ్గిస్తాయి అని వదిలేస్తే..మన శరీరాన్ని మనమే భాదించుకోవడం అవుతుంది. 

Add Comment