Constipation Treatment in Telugu | మలబద్ధకం సమస్య కి నివారణా మార్గాలు

Constipation Home Remedy Treatment in Telugu

మామూలుగా ప్రతీ వ్యక్తికి రోజూ విరేచనం అనేది సర్వసాధారణం. రోజూ 2 నుండి 3 సార్లు విరేచనం వెళ్ళటం అనేది వైద్యపరంగా సాధారణంగా చెప్పుకుంటాం. అయితే రోజూ 3 కంటే ఎక్కువ సార్లు వెళ్తే వేరేచనంగా భావించాలి అలాగే 3 రోజులు అయినా కూడా విరేచనం కాకపోతే అప్పుడు మలబద్దకం సమస్య తో బాధపడుతున్నాం అని గుర్తుంచుకోవాలి.

ఈ రోజుల్లో ఈ మలబద్దకం సమస్యతో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది.  మారుతున్న ఆహారపు అలవాట్లు,జీవన శైలి వలన ఈ సమస్య ఎక్కువ మందిలో చూస్తున్నాం. 

మలబద్ధకం  తగ్గటానికి బెస్ట్ ఆయుర్వేద మందులకు ఈ లింక్ క్లిక్ చేయండి 

Constipation Treatment in Telugu

మన పెద్ద ప్రేగులో ఉండే నీరు ఎక్కువగా ఆవిరి అవటం వలన మలం గట్టిగా మారి విరేచనం రావటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనివలన కడుపు ఉబ్బరంగా ఉండటం,బరువు పెరగటం,రక్తం కారటం,అలాగే కొందరిలో పైల్స్ రావటానికి కూడా దోహదం చేస్తుంది. మలబద్దకం సమస్య రావటానికి కొన్ని రకాల కారణాలు తెలుసుకుందాం.

  • కొందరు అదే పనిగా ఒకే చోట చాలా సేపు కూర్చుంటారు ఇలాంటి వారిలో ఈ సమస్య రావటానికి అవకాశం ఉంటుంది.
  • మనం సహజమైన ఆహారాన్ని తినటం మానేసి,కృత్రిమంగా తయారు చేసుకున్న ఆహారాన్ని ఎక్కువగా తినటం వలన కూడా ఈ సమస్య పెరగటానికి కారణం అవుతుంది.
  • కొందరు రాత్రి తొందరగా పడుకోకుండా ఉదయం తొందరగా లేవకపోవటం వలన మలబద్దకం వచ్చే అవకాశం ఉంటుంది.
  • కొన్ని కొన్ని సందర్భాలలో మనకు అలవాటుగా వచ్చే విరేచనాన్ని ఆపుకోవటం వలన.
  • మనం తినే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవటం వలన మలబద్దకం రావచ్చు.
  • పక్షవాతం,నరాల బలహీనత,హైపో థైరాయిడ్ వంటి వ్యాధులు ఉన్నవారిలో కూడా ఈ మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటుంది.
  • కడుపులో మంట,ఆందోళనని తగ్గించే మందులు ఎక్కువగా వాడేవారిలో ఈ సమస్య రావటానికి అవకాశం ఉంటుంది.

నివారణ:

  • పీచు పదార్థము ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. బీరకాయ,పొట్లకాయ,చిక్కుడు,గోరు చిక్కుడు వంటి వాటిలో పీచు ఎక్కువగా ఉంటుంది.
  • ప్రతి రోజూ నీరు వీలైనంత ఎక్కువగా త్రాగటానికి అలవాటు పడాలి. నీరు ఎక్కువగా తాగటం వలన మలబద్దకం సమస్య తగ్గటంతో పాటు బరువు ఎక్కువగా ఉన్నవారు బరువు కూడా తగ్గుతారు.
  • ప్రతీ రోజూ ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు త్రాగాలి.
  • బాగా పండిన మారేడు కాయ గుజ్జు తినటం వలన విరేచనం సాఫీగా అవుతుంది.
  • మార్కెట్లో త్రిఫల చూర్ణం తెచ్చుకొని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెమ్చా రాత్రి పడుకునే ముందు త్రాగటం వలన మరుసటి రోజు ఉదయం సుఖ విరేచనం అవుతుంది.
  • అల్లంతో చేసిన టీ ని అప్పుడప్పుడు త్రాగండి. దీనివలన మీ ప్రేగుల పనితీరు చాలా మెరుగుపడుతుంది.
  • పచ్చి పాలకూర రసం త్రాగటం వలన మలబద్దకం సమస్యని తగ్గించుకోవచ్చు.
  • ప్రతి రోజూ క్రమం తప్పకుండ వ్యాయామం చేయటం వలన ఈ సమస్య రాకుండా దూరంగా ఉండవచ్చు.
  • రోజూ పెరుగు తీసుకోవటం వలన కడుపులోని ప్రేగుల పనితీరు మెరుగుపడుతుంది.
  • ద్రాక్ష,దానిమ్మ,అరటి పండ్లవాటిని అప్పుడప్పుడు తినటం చేస్తూ ఉండాలి.

ఈ విదంగా పైన చెప్పిన జాగ్రత్తలు పాటించటం వలన మలబద్దకం సమస్యని తగ్గించుకోవచ్చు.

Also Read: విటమిన్ల ఆవశ్యకత గురించిన అవగాహనా

 

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.

అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.