Blood pressure symptoms and treatment in Telugu|రక్తపోటు లక్షణాలు మరియు చికిత్స

రక్తపోటు(Blood pressure)

               రక్తపుపోటు లేదా రక్తపోటు(blood pressure) అనేది రోగం(desease) కాదు. రోగ లక్షణము కాదు. ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని సంక్షిప్తంగా వర్ణించటానికి వైద్యులు నాలుగు జీవ లక్షణాల(vital signs)ను వాడుతారు. అవి శరీరపు ఉష్ణోగ్రత(body temperature), నాడీ లేదా హృదయ స్పందన (pulse or heart rate), ఊపిరి జోరు(respiration rate), రక్తపుపోటు(blood pressure) ఈ నాలుగూ లేకపోతే ఆ వ్యక్తి మరణించినట్లే! కనుక ఈ 4 జీవ లక్షణములు అవధిని మించి పెరిగిన తరిగిన మంచిది కాదు. రక్తపోటు అవధిని మించి పెరిగితె దానిని “అధిక రక్తపోటు”(high blood pressure or hypertension) అంటారు. ఇలా రక్తపుపోటు మితి మీరితే అది రోగ లక్షణం.

Blood pressure symptoms and treatment in Telugu

               ఎక్కువ శాతం మందిలో హృదయానికి సంబందించిన వ్యాధులు రావడానికి కారణం హైబీపీ, హైపర్ టెన్షన్. హృదయానికి సంబందించిన వ్యాధులు రావడమే కాదు..వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) ప్రకారం భారతదేశం మొత్తంలో 63% మరణాలు నాన్ కమ్యునికబుల్ డిసీసెస్(non communicable deseases) వలన జరిగితే..27% మరణాలు కార్డియో వాస్క్యులర్ డిసీసెస్ వలన జరుగుతున్నాయి. అయితే ఆ కార్డియో వాస్క్యూలర్ డిసీసెస్ గల కారణాలలో హైపర్ టెన్షన్ ఒక మూల కారణమే. బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే 120/80 కంటే ఎక్కువగా ఉంటె దానిని హైపర్ టెన్షన్ అంటారు. మరియు హైపర్ టెన్షన్ లేదా హైబీపీకు ట్రీట్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. తరుచుగా బీపి ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మరియు డాక్టర్ సూచనల మేరకు మెడిసిన్(medicine) తీసుకోవాలి.

  1. రక్తపు పోటు అంటే ఏమిటి?
  2. రక్తపు పోటుకి కారణాలు
  3. కొత్త చికిత్స
  4. కొత్త మందు
  5. రక్తపోటుని అదుపులో పెట్టడం ఎలా.
  6. బి.పి. ని అదుపు చేసే ఆహార నియమాలు
  7. రక్తపీడనం కొలిచే విధానం
  8. హైపర్ టెన్సివ్ క్రైసిస్

రక్తపుపోటు లక్షణాలు(blood pressure causes) :

            సహజంగా ప్రతి ఒక్కరు ఎటువంటి అనారోగ్యకరమైన లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తలు తీసుకుంటారు.అయితే హైబీపీ వచ్చినపుడు ఎటువంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉండదు. అందుకే హైబీపీ ని “సైలెంట్ కిల్లర్”(silent killer) అంటారు.ఎటువంటి లక్షణాలు కనపడకపోవడంతో ఆరోగ్యంపై దృష్టి ఉండదు. మరియు అదే కొనసాగితే అధిక రక్తపోటు వలన గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సమస్య త్రీవస్థాయికి చేరితే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.

             అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం హైబీపీ వచ్చిన సరే మీ శరీరంలో ఎదో తప్పు జరుగుతుంది అని ఎటువంటి లక్షణాలు ద్వారా తెలియవు అని అన్నారు. కాబట్టి ఆరోగ్యానికి సంబదించిన ఎటువంటి సమస్యలు వచ్చిన ప్రమాదం గురుంచి తెలుసుకొని మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. వీటితో పాటు ఈ సమస్యకు అనుగుణంగా నడుచుకోవాలి అని సూచించారు.

            సహజంగా హైబీపీ ని క్యూర్ చేయడం సాధ్యం కాదు. కాకపొతే కొంతవరకు జీవనశైలి మరియు మెడిసిన్ ద్వారా క్యూర్ చేయవచ్చు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేసారు. సాధారణంగా ఎటువంటి లక్షణాలు హైబీపీ ఉన్న వారికి కనపడక పోగా చాల తక్కువ శాతం మందికి ఈ లక్షణం కనబడుతుంది అని తెలియజేసారు. హైబీపీ సమస్యతో బాధపడేవారికి తలనొప్పితో పాటు నోస్ బ్లీడింగ్ అవుతుంది. ఇదే లక్షణం కన్పిస్తే తప్పకుండా డాక్టర్ ని సంప్రదించండి. లేకపోతె స్పృహ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

            ఎప్పుడైతే అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ సమస్య వస్తుందో అప్పటి నుండి శారీరక మార్పులతో పాటు మానసికంగా కూడా చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. ఉదాహరణకి మెట్లు ఎక్కడం, వాకింగ్ మరియు ఏదైనా బరువులు మోసినపుడు ఊపిరి తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే ఆందోళన ఎక్కువగా ఉంటుంది.

           మీ రక్తపోటు అదుపులో ఉంచుకోవడానికి శారీరకంగా మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అధిక బరువు ఉండడం వల్ల మరెన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి తగినంత వ్యాయామం క్రమం తప్పకుండ చేయాలి. దాంతో ఆరోగ్యముగా ఉంటారు. బరువు మరియు రక్తపోటు అదుపులో ఉంటుంది. హృదయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అంతే అవసరం. రోజువారీ తీసుకొనే ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటివి తీసుకోవాలి. వీలైనంతవరకు చెక్కరను, ఆయిల్ ను తగ్గించండి. మీరు తీసుకొనే క్యాలరీలపై దృష్టి పెట్టండి. ప్రాసెస్డ్ ఫుడ్స్, హై సోడియం ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అస్సలు తీసుకోకండి.

            రక్తపోటు ఎక్కువగా ఉన్న వారికి బయటకి ఏమి లక్షణాలు కనపడవు. చాపకింద నీరులా శరీరానికి కొంత హాని చేసిన తర్వాత మరో సందర్భంలో ఎప్పుడో జరిగిన హాని ప్రస్ఫుటమౌతుంది. ఇలా ముదిరిన తర్వాత మందులు వాడిన జరిగిపోయిన హానిని తిరగబెట్టలేము. అందుకని తరచు రక్తపోటు ఎంత ఉందో, అవకాశం దొరికినప్పుడల్లా కొలుచుకొని చూస్తూ ఉండాలి. ఈ రోజుల్లో వైద్యుడి దగ్గరికి ఏ పని మీద వెళ్లిన రివాజుగా నర్సులు రక్తపు పోటును కొలిచి నమోదు చేస్తారు. అలా నమోదు చేసినపుడు రోగి ఆ కొలతల్ని అడిగి తెలుసుకొని గుర్తు పెట్టుకోవడం మంచిది. ఈ కొలత ఉండవలసిన దాని కంటే ఎక్కువ ఉంటె ఎక్కువ రక్తపుపోటు(high blood pressure) ఉందని అంటారు.                 ఎక్కువ రక్తపు పోటు ఉంటె అది గుండె జబ్బుకి, మూత్రపిండాల జబ్బుకి దారి తీసే ప్రమాదం ఉంది. దీనికి విపర్యంగా మూత్రపిండాలకు జబ్బు చేస్తే దాని మూలంగా రక్తపుపోటు పెరుగుతుంది కూడా. అందుకని రక్తపుపోటు విలువ మీద ఓ కన్నేసి ఉంచటం చాల మంచి అలవాటు, ప్రాణాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాము.

రక్తపు పోటు అంటే ఏమిటి?(what is blood pressure) :

              మన గుండె పని చెయ్యాలి కానీ ప్రయాస పడుతూ చేయకూడదు. రక్తపు పోటు మన గుండె ఎంత కష్టపడి పనిచేస్తుందో తెలియజేస్తుంది. రక్త నాళాల్లో ఉరకలు, పరుగులు తీస్తూ ప్రవహిస్తున్న రక్తం అలలు మాదిరి ప్రవహిస్తుంది. ఇలా పారుతున్న రక్తం నాళం గోడల మీద ఒత్తిడి (pressure) పెడుతుంది. ఈ ఒత్తిడి గుండెకి దగ్గరగా ఉన్నపుడు ఎక్కువగా ఉండి, దూరం వెళుతున్న కొద్దీ క్రమేపి తగ్గి, కేశనాళికల దగ్గర నెమ్మదిగా ప్రవహించి, ఆఖరున సిరలలో ప్రవేశించి నీరసించి, నెమ్మదిగా కండరాల సహాయంతో మళ్ళీ గుండెకు చేరుకుంటుంది. కనుక శరీరం అంతటా పోటు ఒకేలా ఉండదు. వైద్యులు “రక్తపు పోటు” అన్నపుడు దమనులలో ఉన్న పీడనం (pressure) శరీరం అంతటా  ఈ పీడనం ఒకేలా ఉండదు. కనుక సాధారంగా జబ్బు మీద కొలుస్తారు.

Blood pressure symptoms and treatment in Telugu

               ఈ పోటు వేళను బట్టి, అప్పటి వారికి పడ్డ ప్రయాసను బట్టి, మనసులో ఉండే ఆరాటాన్ని బట్టి, వేసుకుంటున్న మందుల్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. కొందరికి వైద్యుడి పరికరాలు చూడగానే గుండె స్పీడ్ గా కొట్టుకొని ఈ పోటు పెరుగుతుంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకొని ఆరోగ్యాంగా ఉన్న వ్యక్తుల రక్తపుపోటు 120/80 ఉంటుందని వైద్యులు నిర్ణయించారు. ఈ విలువలు 135/85 దాటితే ఆ వ్యక్తి అధిక రక్తపుపోటు తో భాద పడుతున్నట్లు లెక్క. సాధారంగా ఈ కొలతలు 2,3 సార్లు తీసి, సంఖ్యలు ఎక్కువగా ఉంటేనే రక్తపుపోటు ఎక్కువయ్యింది అని నిర్ణయిస్తారు. రక్తపుపోటు చికిత్స కోసం కొత్త ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మార్గదర్శక ప్రకారం రక్తపోటు, సిస్టోలిక్ రక్తపోటు >140mmhg, డయాస్టోలిక్ రక్తపోటు >90 mmhg కంటే అధికంగా ఉన్నప్పుడు(140/90) ఫార్మకోలాజికల్ యాంటీ హైపర్టెన్సివ్ చికిత్సను ప్రారంభించాలని 25 ఆగస్టు 2021 న సిఫార్స్ చేసింది.

                  ఇక్కడ విషయాన్ని బట్టి రక్తపుపోటు కొలవడానికి రెండు సంఖ్యలు వాడుతారని తెలుస్తుంది కదా. ఈ రెండింటిలో మొదటి సంఖ్య (ఎగువ ఉన్న సంఖ్య) సిస్టోలిక్ పోటు(sistolic pressure), రెండొవ సంఖ్య (దిగువ ఉన్న సంఖ్య)(diastolic pressure). గుండె ముకుళించుకున్నపుడు రక్తం ఒక్క ఉదుటున ముందుకు వస్తుంది. అపుడు ఈ పోటు ఎక్కువగా ఉంటుంది. దీనినే సిస్టోలిక్ పోటు అంటారు. గుండె వికసించుకునపుడు ప్రవాహం అంతిమ దశలో ఉంటుంది. అపుడు ఈ పోటు తక్కువగా ఉంటుంది. ఇదే డయాస్టోలిక్ పోటు. పూర్వపు రోజుల్లో ఉష్ణోగ్రతని, రక్తపుపోటుని రస స్తంభం(mercury column) పొడవుని బట్టి కొలిచేవారు. ఈ రోజుల్లో పాదరస స్తంభం వాడకుండానే కొలవగలుగుతున్నారు.

 

రక్తపు పోటుకి కారణాలు(blood pressure reasons) :

                    ఎవ్వరికైనా రక్తపుపోటు ఎందుకు పెరుగుతుంది? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ప్రవర(family history), లింగం(gender) ,వయస్సు(age), జాతి(race) అన్ని కొంచెంగానో లేదా ఎక్కువగానో దోహదం చేస్తాయి. తల్లిదండ్రులకు, దగ్గరి బంధువులకి ఉంటె పిల్లలకి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. గణాంకాల ప్రకారం అమెరికాలో ఉండే నల్ల వారిలో ఈ పెరుగుదల ఎక్కువగా కన్పిస్తుంది. ఇలాంటి కారణాల వల్ల వచ్చే రక్తపుపోటు పెరుగుదలని ఇంగ్లీషులో primary hypertension అంటారు. మనం వీటిని అంతర్జనిత కారణాల వల్ల వచ్చే పెరుగుదల అనవొచ్చు. ఇలా కాకుండా ఎదో జబ్బు వల్ల వచ్చేది secondary hypertension లేదా తెలుగులో వ్యాధిజనిత కారణాల వల్ల వచ్చే పెరుగుదల అనవొచ్చు. ఇటువంటి వర్గీకరణ కంటే భౌతిక సూత్రాలని ఉపయోగించి ఏయే సందర్భాలు రక్తపుపోటు పెరుగుదలకు దోహదం చేస్తాయో చూడవొచ్చు.

  • పంపు జోరు(rate of pumping). గుండె ఎక్కువ జోరుగా కొట్టుకుంటే రక్తపుపోటు ఎక్కువగా అవుతుంది.
  • ప్రవహించే రక్తం పరిమాణం(volume) పెరిగితే పోటు పెరుగుతుంది. అంటే శరీరంలో ఎక్కువ రక్తం ఉంటె పోటు కూడా ఎక్కువగానే ఉంటుంది. మనం ఎక్కువగా ఉప్పు తింటే అది రక్తపు పరిమాణాన్ని పెంచుతుంది. ఇది అందరిలోను ఒకేలా ఉండదు.
  • ప్రవాహానికి నిరోధం(resistance) ఉంటె పోటు పెరుగుతుంది. గొట్టం చిన్నదయినా నిరోధం పెరుగుతుంది. లేదా గొట్టంలో ఏదైనా అడ్డు పడ్డ నిరోధం పెరుగుతుంది. అందుకనే రక్తనాళపు గోడలలో కొలెస్టరాల్ పేరుకుంటే పోటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మందులు రక్తనాళాల్ని కుంచించుకునేలా చేస్తాయి(vasoconstriction). కొన్ని పెద్దవయేలా చేస్తాయి(vasodilators). ఈ మందుల ప్రభావం వల్ల రక్తపుపోటు పెరగడం, తరగడం జరగవొచ్చు.
కొత్త చికిత్స(treatment) :
  1. రీనల్ సింపథెటిక్ నెర్వ్అబ్లేషన్ లో మూత్రపిండాలకు చేరువలో ఉండే రక్తనాళాన్ని ఎంచుకొని దానిలోకి ఒక సన్నని పైపుని పంపుతారు. ఈ రక్తనాళం మోసుకెళ్లే అధిక రక్తపోటుకు కారణమయ్యే సంకేతాలను ఈ సన్నని వైరు ఛిద్రం చేస్తుంది. తద్వారా రక్తపోటును పెంచేందుకు ఉద్దేశించిన సంకేతాలు మెదడు నుండి మూత్రపిండాలకు చేరడానికి ముందే అంటే….మార్గమధ్యలోనే సమసిపోతాయి.
  2. రోజు తీసుకునే ఆహారంలో మిర్చి తీసుకోండి. మిరపలో ఉండే కాప్సాసిన్  రక్తపోటు పై ప్రభావంతంగా పని చేస్తుంది. మిరపలో ప్రత్యేక గుణాలు నైట్రిక్ ఆక్సయిడ్ ను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా రక్తనాళాలు సురక్షితంగా ఉంటాయి.
కొత్త మందు(medicine) :
  • అధిక రక్తపోటు నివారణకు సరికొత్త విధానాన్ని శాస్త్రజ్ఞులు రూపొందించారు. ఈ విధానంతో ప్రాణాలు కాపాడడమే కాదు. లక్షలాది మంది రక్తపోటు భాదితుల జీవన ప్రమాణాలను పెంచవచ్చని ప్రకటించారు.
  • ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు మూడేళ్లపాటు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి ఈ విధానాన్ని రూపొందించారు. ఆస్ట్రేలియా, ఐరోపా లో ఈ అధ్యయనం చేసారు
  • చికిత్సకు లొంగని స్థాయిలో రక్తపోటు ఉన్న రోగులకు ఆరు నెలల పాటు ఈ విధానంలో చికిత్స చేశామని, తర్వాత మూడేళ్లపాటు వారి రక్తపోటు అదుపులోనే ఉందని వివరించారు. ఈ చికిత్స విధానాన్ని పెర్క్య్ టేనియస్ రీనల్ సింపథీటిక్ డినర్వేషన్ (percutaneous renal sympathetic denervation) అని అంటారు.
  • దీని ప్రకారం….మెదడుకు సిగ్నల్స్ పంపే నరాలు కిడ్నీల చుట్టూ ఉంటాయి. రక్తపోటును పెంచేవి కూడా కిడ్నీలే. కిడ్నీల నుండి మెదడుకి సంకేతాలు పంపకుండా వాటి మధ్య ఉన్న నరాలను నిర్వీర్యం చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
  • ఈ విధానంలో స్వల్ప, దీర్ఘకాలిక సమస్యలు కూడా ఏమి ఉండవు. ఈ విధానంలో లోకల్ అనస్తీషియా ఇస్తారు. నిర్దిష్ట నరంపై రేడియో ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ని ఉపయోగిస్తారు. దీనితో కిడ్నీలకు రక్తాన్ని పంపించే ఆ నరం నిర్వీర్యం అవుతుంది.
రక్తపోటుని అదుపులో పెట్టడం ఎలా…(how to control blood pressure) :

        మన అలవాట్లను మార్చుకొని చాల వరకు రక్తపోటును అదుపులో పెట్టవచ్చు. ఇటువంటి సలహాలని ఆచరణలో పెట్టె ముందు వైద్యున్ని సంప్రదించడం మంచిది.

  1. పొగ తాగే అలవాటు మానుకోవాలి.

Blood pressure symptoms and treatment in Telugu

  1. బరువుని అదుపులో పెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి శరీరానికి అనుకూలమైన బరువు ఉండాలి తప్పితే అతిగా ఉండకూడదు. లావుపాటి శరీరంతో పోలిస్తే బక్కపలచని శరీరం ఎప్పుడు శ్రేయస్కరమే.
  2. ఆరోగ్యకరమైన ఆహారం తినడం. తినే తిండిలో పుష్కలంగా కాయకూరలు, పళ్ళు, దినుసులు, కొవ్వు తక్కువగా ఉండే పాలు, పెరుగు మొదలైన పదార్థాలు ఉండడం మంచిది. నూనెలు, నేతులు వాడేటప్పుడు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు(unsaturated fatty acids) సంతృప్త కొవ్వు ఆమ్లాల కంటే(saturated fatty acids) మంచివని గుర్తు పెట్టుకోవాలి. కొన్ని రకాల చేప నూనెలు(fish oils) ఈ సందర్భంలో మంచివని గమనించాలి. ఉదాహరణికి: eicosapentaenoic acid(EPA) and docosahexaenoic acid(DHA)
  3. ప్రతిరోజు నియమం తప్పకుండ వ్యాయామం చేయటం. ప్రతిరోజు అరగంటకు తక్కువ కాకుండా, కొద్దిగా చెమట పట్టే వరకు గబగబా నడవడం.
  4. ఆహారంలో ఉప్పు తగ్గించి తద్వారా సోడియం తగ్గించటం. ఉప్పు లేకపోతె ఆహరం రుచిగా ఉండదు. కానీ సాధ్యమైనంత వరకు ఉప్పుని మితంగా వాడడం చిన్నప్పటి నుండి అలవాటు చేసుకోవడం మంచిది.
  5. మనసుకు ఆరాటం(anxiety), ఉద్రిగ్దత(stress) తగ్గించటం. యోగ మరియు మంత్రం జపం చేయటం వల్ల రక్తపుపోటు అదుపులోకి వస్తుంది అనడానికి ఆధారాలు ఉన్నాయి.

Blood pressure symptoms and treatment in Telugu

  1. మాదక ద్రవ్యాలను సేవించేప్పుడు మితి మీరకుండా ఉండడం. ఆల్కహాల్, సారా వంటి మాదక ద్రవ్యాలు మోతాదులో తీసుకుంటే పర్వాలేదు కానీ, మితి మీరితే ప్రమాదం. ఆడవారి యెడల విచక్షణ చూపటం కాదు కానీ, మగ వారు భరించగలిగే మోతాదులో స్త్రీలు సగమే భరించగలుగుతారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యాంగా ఉన్న సరే మాదక ద్రవ్యాలు ముట్టకూడదు

ఈ సలహాలను పాటిస్తే ఎంత లాభం ఉంటుందో, సిస్టోలిక్ పోటు ఈ మాత్రం తగ్గుతుందో, ఈ దిగువ పట్టికలో చూపటం జరిగింది.

                      సలహా                       వివరణ  సలహా పాటిస్తే సిస్టోలిక్ సంఖ్యలో తగ్గుదల 
ఎక్కువగా ఉన్న బరువుని తగ్గించాలి. 10 కిలోల బరువు తగ్గితే.. 5 నుండి 20 పాయింట్లు
పథ్యం చేయాలి. కొవ్వు తక్కువగా ఉన్న పాలు, పళ్ళు, కాయగూరలు తింటే.. 8 నుండి 14 పాయింట్లు
రోజు వ్యాయామం చేయాలి. చెమట పట్టే వరకు 30 నిమిషాలు గబగబా నడిస్తే.. 4 నుండి 9 పాయింట్లు
మాదక ద్రవ్యాలు తగ్గించాలి. రోజు ఒక గ్లాస్ కంటే ఎక్కువగా తాగకుండా ఉంటె..(మగవారికి)

రోజు అరా గ్లాస్ కంటే ఎక్కువగా తాగకుండా ఉంటె..(ఆడవారికి)

2 నుండి 4 పాయింట్లు
బి.పి. ని అదుపు చేసే ఆహార నియమాలు(healthy diet for control the blood pressure) :
  1. పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం. ఆయా సీజన్లో పండే పండ్లను తినడం మనకు తరతరాలుగా తెలుసు. అన్నంతో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు కూరగాయలు, ఇతర తృణ ధాన్యాలను ఆహారంగా తీసుకొని జీవించినట్లైతే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి.
  2. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానం అని ప్రకృతి వైద్యుల నమ్మకం. ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అవసరమైనది. పిండిపదార్థలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్థాలు రోగనిరోధకశక్తికి  కావలసిన విటమిన్లు, శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్థాలను ఆహారంగా పేర్కొనవచ్చు.
  3. ఇవి కాక శరీరానికి నూతన ఉత్స్తహాన్ని ఇచ్చే కాఫీ, టీ, లాంటి వాటిని కూడా ఆహారపదార్థాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపంలో లభ్యమౌతుంది.
  4. గుప్పెడంత గుండె మన ఛాతిలో రెండు ఊపిరితిత్తుల మధ్య పెరికార్డియం అనే పొరను కప్పుకొని నియమంగా, నిశ్చలంగా ఉండే ఓ శరీర అవయవము, ఈ గుండె తన క్రమాన్ని, నియమాన్ని తప్పి ఎక్కువ కొట్టుకున్న, తక్కువ కొట్టుకున్న అది జీవనాన్ని శాసించే వ్యాధి..గుండె జబ్బు, గుండె జబ్బులలో ఒకటి ఈ రక్తపోటు.
  5. గుండె, రక్తనాళాల్లో ఉండే రక్తం వాటి గోడలపై చూపించే ఒత్తిడిని రక్తపోటు లేదా blood pressure అంటారు. ఇది ముఖ్యముగా రెండు స్థితులపైనా ఆధారపడి ఉంటుంది. 1.గుండె కండరాలు పంపు చేసే శక్తి. 2. రక్తనాళాలు పంపు చేసిన రక్తాన్ని ఎంతవరకు తీసుకుంటాయో ఆ శక్తి.
  6. blood pressure రెండు స్థితులలో గమనిస్తాము. గుండె పూర్తిగా ముడుచుకొనే స్థితిని “సిస్టోలిక్(systolic)” అని, పూర్తిగా విడుచుకొనే స్థితిని “డయాస్టోలిక్(diastolic)” అని అంటారు. ఈ రెండింటికి మధ్య తేడాను “పల్స్ ప్రెషర్ (pulse pressure)” అని వ్యవహరిస్తారు.

 

ఉప్పు : బ్లడ్ ప్రెషర్ వచ్చాక నయం అవ్వడమన్నది ఉండదు. కానీ జీవన విధానంలో మార్పుల ద్వారా రాకుండా జాగ్రత్త పడవొచ్చు. జీవితంలో చిన్న చిన్న మార్పుల ద్వారా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. రోజుకు 5 గ్రాముల కంటే మించి ఉప్పును వాడకూడదు. ముఖ్యముగా ప్రొసెస్డ్, ప్యాకెజీ పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, క్యాన్డ్ పదార్దాలు తినడం బాగా తగ్గించాలి. ఎందుకంటే ఇందులో అదనపు ఉప్పు ఉంటుంది. సోడియమ్ క్లోరైడ్(sodium cloride) బి.పి ని అధికం చేస్తుంది.

Blood pressure symptoms and treatment in Telugu

పొటాషియం : ఇది బి.పి ని తగ్గిస్తుంది. బీన్స్, బఠాణీలు, నట్స్, పాలకూర, క్యాబేజి, కొత్తిమీర, అరటి, బొప్పాయి, ద్రాక్ష, కమలా, నారింజ, నిమ్మ వంటి పండ్లలో పొటాషియం లభిస్తుంది. తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం గల పండ్లు రక్తపోటు తగ్గించడంలో బాగా ఉపయోగపడుతాయి. కొబ్బరి నీరులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

కొవ్వు పదార్థములు : వీటి వలన రక్తంలో కొలెస్టరాల్ పెరిగి బిపి ఎక్కువ అవడానికి దోహదపడుతుంది. నూనెలు ద్రవరూపంలో ఉన్న కొవ్వులు, వీటి వాడకం తగ్గించాలి. ఏ రకమైన పచ్చళ్ళు, ఆవకాయ, కారం ఊరగాయ వంటి వాటిలో నూనెలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ మోతాదులో వాడాలి. జంతు మాంసాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.

ఆహారంలో మార్పులు : ఎక్కువ పీచు పదార్థం ఉన్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, కాయకూరలు, ఆకుకూరలు, పప్పులు వాడాలి. రోజుకు కనీసం 5 సార్లు పండ్లు, కూరగాయలు తింటుండాలి. సాస్ లు, ఊరగాయలు బాగా తగ్గించాలి.

ఆల్కహాల్ : అలవాటు ఉండేవారు మానివేయాలి. లేదా పరిమితులు ఉండాలి. ఆల్కహాలు ఎక్కువ క్యాలరీలు ఉన్న పానీయం.

పొగ తాగడం : దీనిలో నికోటిన్ ఉండడం వల్ల రక్తనాళం పై ప్రభావం చూపుతుంది. పొగ తాగడం వాళ్ళ రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఉప్పు, కారాలు ఎక్కువగా తినడం..పొగ, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం చేయవద్దు.

రక్తపీడనం కొలిచే విధానం(blood pressure measure) :

Blood pressure symptoms and treatment in Telugu

శరీరంలో ప్రసరించే రక్తం, రక్తనాళాలపై కలిగించే ఒత్తిడిని రక్తపీడనం లేదా రక్తపోటు అంటారు. శరీరం యొక్క ప్రధాన జీవ లక్షణాలలో రక్తపోటు ఒకటి. ధమనులు, దమనికలు, రక్తనాళాలు, శిరల ద్వారా రక్తం ప్రవహించే రక్తంలో దాని పీడనం తగ్గుతూ వస్తుంది. సాధారణంగా రక్తపీడనం అని వ్యవహరించేటపుడు ధమని పీడనాన్ని(గుండె నుండి రక్తాన్ని ఇతర అవయవాలకు చేరవేసే పెద్ద దమనులలోని పీడనం) పరిగణిస్తారు. దమనీ పీడనాన్ని సాధారణంగా “సిగ్మోమానోమీటర్” అనే యంత్రంతో కొలుస్తారు. ఇది పాదరసం యొక్క నిలువుటెత్తుతో ప్రసరించే రక్తం యొక్క ఒత్తిడిని సూచిస్తుంది.

హైపర్ టెన్సివ్ క్రైసిస్(hypertensive crisis) :

దీనిని మనం రెండు రకాలుగా విభజించుకోవొచ్చు. 1.హైపర్ టెన్సివ్ అర్జెన్సీ  2.హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ

హైపర్ టెన్సివ్ అర్జెన్సీ(hypertensive urgency) : రక్తపోటు ఎక్కువగా ఉండి, ఏ లక్షణాలు కనపడకపోతే ఈ విదంగా అనుసరించండి.

  • ఐదు నిమిషాల పాటు ఎదురుచూడండి.
  • మళ్ళీ ఒకసారి బీపీ రీడింగ్ చుడండి.
  • ఒకసారి ఏదైనా లక్షణాలు ఉన్నాయో లేదో మీ శరీరంలో కలిగే మార్పులు గమనించండి.
  • ఛాతిలో నొప్పి కలగడం.
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు .
  • వికారం.
  • నడుంనొప్పి.
  • మాట్లాడటం ఇబ్బందిగా అనిపించడం.

           ఒకవేళ ఈ లక్షణాలు లేనట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే హైపర్ టెన్సివ్ అర్జెన్సీ ఉన్నపుడు ఏ అవయవాలకు కూడా ఇబ్బంది ఉండదు. అయినా సరే, శరీరంలో కలిగే మార్పులకు డాక్టర్ సలహా కూడా పాటించండి.

హైపర్ టెన్షన్ ఎమర్జెన్సీ(hyper tension emergency) :

  • ఛాతిలో తీవ్రంగా నొప్పి కలగడం.
  • తలనొప్పి తీవ్రంగా ఉండడం.
  • కళ్ళు మసకబారడం.
  • వికారం.
  • శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడం.
  • ఇలాగ రక్తపోటు బాగా పెరిగిపోయి,

                       ఈ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

 

 

 

 

Add Comment