విరేచనాలు కారణాలు, లక్షణాలు, అరికట్టే విధానం మరియు ఇంటి చిట్కాలు|Diarrhea Causes, Symptoms, Prevention and Home Tips in Telugu

విరేచనాలు అనగా ఏమిటి(What is diarrhea)?

ఎవరికైనా వారి జీవితంలో ఏ సమయంలోనైనా విరేచనాలు కలగడం సహజం . విరేచనాలు అనేవి జీర్ణకోశ వ్యాధి . ఇది బాక్టీరియా లేదా పరాన్నజీవి ఇన్ఫెక్షన్ల నుండి వస్తుంది . వైరస్ లు సాధారణంగా వ్యాధిని కలిగించవు . ఈ వ్యాధి కారకాలు నోటి ద్వారా ప్రవేశించిన తర్వాత కలుషితమైన ఆహరం లేదా నీటిని తీసుకోవడం, కలుషితమైన వస్తువులు లేదా చేతులతో నోటితో సంబంధం ఉంటూ . .సరైన పరిశుభ్రతను పాటించనపుడు మొదలైన వాటి ద్వారా పెద్ద ప్రేగులను ఈ బాక్టీరియా అనేది చేరుకుంటాయి . ఫలితంగా ,  పేగు లైనింగులకు నష్టం వాటిల్లే అవకాశం చాలా ఉంటుంది . తద్వారానే మనం విరేచనాలను అనుభవిస్తూ ఉంటాము .Diarrhea Causes, Symptoms, Prevention and Home Tips in Telugu

  1. అమీబియాసిస్ విరేచనాలు(Amebiasis diarrhea) : సాధారణంగా, పేగులలో వ్యాధికారక పరాన్నజీవులు E. హిస్టోలిటికా మరియు స్ట్రాంగ్లోయిడియాసిస్ ఉండడం వల్ల విరేచనాలు కలుగుతాయి . వ్యాధికారక ఆధారంగా కారణమయ్యే వీటిని “అమీబియాసిస్ విరేచనాలు”  అంటారు . ఒక వ్యక్తి దీని బారిన పడినట్లయితే , చాలా సందర్భాలలో విరేచనాల సంకేతాలు ఉండకపోవొచ్చు . అరుదైన సందర్భాలలో ఈ పరాన్నజీవి శరీరంలో మరొక భాగానికి వెళ్లి చీముకు దారి తీయవచ్చు . తీవ్రజ్వరం, వికారం మరియు వాంతులు, కడుపు తిమ్మిరి వంటి లక్షణాలు కలుగుతుంటాయి .
  2. బాసిల్లరీ విరేచనాలు(Bacillary dysentery) : ఈ రకమైన విరేచనాలు అనేవి “సాల్మొనెల్లా మరియు కాంపిలోబాక్టర్ “ అనేవి ఈ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా. ప్రేగులోని బాక్టీరియా వల్ల కలిగే విరేచనాల లక్షణాలు..బ్లడీ డయేరియా, తీవ్ర జ్వరం, వికారం మరియు వాంతులు, కడుపు తిమ్మిరి వంటి వాటితో బాధపడడం జరుగుతుంది . ఈ పరిస్థితి కనుక తీవ్రతరం అయినట్లయితే పెద్ద ప్రేగు యొక్క విస్తరణతో పాటు తీవ్రమైన వాపు ఉండవచ్చు . ఇది కాస్త తీవ్రమైన మూత్రపిండ వ్యాధికి కూడా కారణం అయ్యే అవకాశం ఉంటుంది .

పారిశుద్ద సౌకర్యాలు తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇది ఎక్కువగా కన్పిస్తుంది . వ్యక్తిగత పరిశుభ్రత పాటించని వ్యక్తులకు కలిగే విరేచనాలు కాలుష్యం ద్వారా ఇతర వ్యక్తులకు వ్యాపించే ప్రమాదం కూడా ఉంది . అందుకే , వాష్ రూమ్ ని ఉపయోగించిన తర్వాత మీ చేతులను కడగడం చాలా ముఖ్యం .

విరేచనాలకు దారి తీసే పరిస్థితులు(Conditions that lead to diarrhea)

విరేచనాలు అనేవి ఒక సాధారణ సమస్య అనే చెప్తాము . ప్రకృతిలో ఏర్పడే  కలుషితం మరియు మన ఇంటి అపరిశుభ్రత వాతావరణం, కలుషిత ఆహరం, కలుషితమైన నీరు కారణంగా ఒక అంటువ్యాధిలా ఏర్పడి విరేచనాలను అనుభవిస్తుంటాము. అపరిపక్వమైన ఆహరం తీసుకోవడం వల్ల కూడా “డయేరియా”కు దారి తీస్తుంది . ఒక్కోసారి విరేచనాలు అవడం వల్లనే కడుపు ఖాళీ అయి, మన శరీరం తేలిక పడినట్లుగా ఉండడం కూడా గమనిస్తుంటాము . ఇది ఒక సమయంలో మంచి అన్పించడం సహజం . అయితే , తరచుగా విరేచనాలు అవుతూ . .వికారం ,వాంతులు, కడుపు నొప్పి , బరువు తగ్గడం, రక్తంతో కూడిన మలం రావడం వంటి వాటితో అనుభవిస్తున్నట్లయితే కాస్త జాగ్రత్త అవసరం అవుతుంది . దీనికి ఇంటి చిట్కాలతో తగ్గుముఖం పడితే సరే . .లేదంటే వైద్యుడిని సంప్రదించి, సరైన చికిత్స విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది.

డయేరియా బారిన పడకుండా ఉండేందుకు మన వ్యక్తిగత పరిశుభ్రతయే ముఖ్యం . ఇదే మనల్ని కాపాడగలదు .

ప్రపంచం మొత్తంలో ప్రతి సంవత్సరం 2 బిలియన్ల మంది వరకు విరేచనాల కారణంగా మరణించడం జరుగుతుంది . అలాగే ,  5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల పిల్లలు 1.9 మిలియన్ల మంది అది కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలలో విరేచనాలతో మరణిస్తున్నారు అనేది సమాచారం . మరణానికి 2 వ అతి పెద్ద కారణం ఈ “విరేచనాలు” అంటే..పరిస్థితి విషమిస్తే ఎంత ప్రమాదకరమో అర్ధం అవుతుంది కదా !Diarrhea Causes, Symptoms, Prevention and Home Tips in Telugu

విరేచనాలలో కనపడే లక్షణాలు(Symptoms seen in diarrhea)

  1. నీళ్ల లాగ విరేచనాలు మొదలవడం లేదా రక్తం జిగురుతో విరేచనం కలగడం .
  2. విరేచనాలతో పాటు వాంతులు అవడం .
  3. కడుపునొప్పి పదే పదే వస్తూఉండడం .
  4. ఇన్ ఫెక్టీవ్ డయేరియాల్లో సాధారణంగా జ్వరం వస్తుంది .
  5. శరీరం నీరసించడం, బి . పి . తక్కువై డీహైడ్రేషన్ కు గురి అవ్వడం .
  6. గుండె దడగా అనిపించడం, గుండె కొట్టుకునే వేగం ఎక్కువవడం .
  7. విపరీతమైన దాహం కలగడం .
  8. కాళ్ళు ,చేతులు లాగడం.
  9. శరీరం చల్లబడటం .
  10. కళ్ళు లోపలికి పోవడం ఆరంభమౌతుంది .
  11. నోరు ఎండిపోవడం .
  12. చర్మం తేమను కోల్పోయి….పొడిబారినట్లు, చర్మం రంగును కోల్పోయినట్లు కన్పించడం .Diarrhea Causes, Symptoms, Prevention and Home Tips in Telugu
విరేచనాల వల్ల మనకు కలిగే అనర్థాలు(Harms caused by diarrhea) :
  • విరేచనాల తీవ్రతను బట్టి మన శరీరంలో నీరు ,  ఎలక్రోలైట్స్ తగ్గిపోయి డీహైడ్రేషన్ కు దారి తీస్తుంది .
  • బి . పి . తక్కువస్థాయికి చేరుకున్నట్లయితే బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బతినవచ్చు .
  • అదే బి . పి . ప్రమాదకరస్థాయికి పడిపోయి . .10 నిమిషాలకు పైగా కూడా గుర్తించలేకపోతే కిడ్నీలు “ఎక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్” అనే వ్యాధికి గురి కావచ్చు .
  • దీర్ఘకాలం డయేరియాతో బాధపడే వారిలో మాల్ న్యూట్రిషన్ సమస్య ఏర్పడవచ్చు .
  • ఈ లక్షణాల తీవ్రత సరైన సమయంలో గుర్తించి మంచి చికిత్సను అందించకపోతే మరణం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది . ప్రతి సంవత్సరం దాదాపు 10లక్షల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నట్లు సమాచారం .
విరేచనాలు మరణానికి దారి తీస్తుందా(Can diarrhea lead to death)?

మనిషి జీవితంలో విరేచనాలు కలగడం సహజమైన ప్రక్రియ. అది మన ఆహార విధానం, జీవనశైలి యొక్క పరిశుభ్రత, మన చుట్టూ ఉండే వాతావరణ శుద్ధి పైన ఆధారపడి ఉంటుంది అని సాధారణంగా అందరికి తెలిసిన విషయమే కదా ! కానీ, విరేచనాలను అనుభవిస్తున్న సమయంలో 1, 2 రోజులు వచ్చే విరేచనాలు పెద్దగా ఇబ్బంది కలిగించవు . లేదా అంతవరకు తట్టుకునే శక్తిని కలిగి ఉన్నారు వారు అని అర్ధం చేసుకోవచ్చు.

దీనికి మించి ఎక్కువ రోజులు విరేచనాలు కలుగడం వల్ల వచ్చే ఇబ్బంది సాధారణం కాకపోవచ్చు . సహజంగానే మనిషి తన శక్తిని అంతటిని కోల్పోవడం ప్రారంభమౌతుంది . శరీరంలో ఎన్నో రకాల మార్పులు, సమస్యలు చోటు చేసుకుంటాయి . ఈ సమయంలోనే సరైన చికిత్స విధానం లేదా ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు . ఇలాంటి ఆలోచనలు సరైన క్రమంలో చేసి, విరేచనాలను అదుపులో పెట్టె ప్రయత్నం చేయడం ఎంతో మేలును కలిగిస్తుంది .

లేదు అంటే, ఎలాంటి అవగాహన లేకుండా శరీరంలో కలిగే మార్పులను గుర్తించకుండా, విరేచనాలను తేలికగా తీసుకున్న సరే..మన శరీరం తట్టుకునే స్థాయిని కోల్పోతే..మరణానికి దారి తీసినా అందులో ఆశ్చర్యం అవసరం లేదు . ఎందుకంటే, వీటి చికిత్స అనేది మన చేతిలోనే ఉంటుంది. అది విషమ పరిస్థితి గా మారినా కూడా మేము ఇక్కడ పొందుపరిచిన వివరాల ప్రకారం అనుసరించి మీ జీవన శైలిని దానికి తగ్గట్టుగా మార్చుకుంటే తిరిగి సాదారణ స్థితికి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. లేదు అవగాహన లేకుండా, వైద్యుడిని సంప్రదించకుండా మీకు మీరే అనుభవిస్తే గనుక అత్యంత ప్రమాదకరం అనే చెప్పాలి. ఇది ప్రాణాలతో చెలగాటం ఆడే ఒక వ్యాధి అనొచ్చు. కాబట్టి, సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి .

విరేచనాల సమయంలో తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు(Foods to eat during diarrhea)
  • వేడి చేసి చల్లార్చిన నీటిని తీసుకోవాలి .
  • శరీరం ఈ సమయంలో ఎంతో నీటిని కోల్పోతుంది . వాటిని తిరిగి పొందాలంటే . .కొంచెం కొంచెంగా ఆహారం రూపంలో తీసుకుంటే సరిపోతుంది .
  • నీళ్లతో కాచిన సగ్గుబియ్యం జావ , ఓట్ మీల్ , పల్చటి మజ్జిగ, గంజి లాంటివి తీసుకోవచ్చు .
  • మన వంటింటి మూలికలతో తయారు చేసే టీ లను ఎక్కువగా తాగుతూ ఉండాలి .

తీసుకోకూడని ఆహారపదార్థాలు(Foods not to be consumed

  • కాఫీలు ,తీపి ఎక్కువగా కలిగి ఉండే పానీయాలు తీసుకోకూడదు. ఇవి డీహైడ్రేషన్ ను ఎక్కువ చేస్తాయి .
  • ఫ్రై చేసిన వేపుడు పదార్థాలు, ఐస్ క్రీములు, ఆల్కహాల్ లాంటివి తీసుకోరాదు .
  • తేనె, ద్రాక్షపళ్ళు, పప్పులు, చెర్రీలు లాంటివి తినరాదు .
విరేచనాల కోసం వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి(When to consult a doctor for diarrhea) :Diarrhea Causes, Symptoms, Prevention and Home Tips in Telugu
  1. కడుపులో అసౌకర్యం , అజీర్ణం లేదా తేలికపాటి విరేచనాలు సాధారణంగా ఆందోళన కలిగించే విషయం కాదు . ఇంటి చిట్కాలు పాటించిన కొద్దీ గంటల్లోనే మనం సమస్య నుండి బయటపడగలుగుతాము . పిల్లలు మరియు వృద్దులు త్వరగా డీహైడ్రేషన్ కు గురి అవుతారు . కాబట్టి ,  1, 2 రోజుల కంటే ఎక్కువ రోజులు వాంతులు , విరేచనాలతో భాదపడుతున్నట్లయితే వైద్యుడిని తప్పనిసరిగా సంప్రదించాలి .
  2. జ్వరం
  3. దీర్ఘకాలిక మలబద్దకం .
  4. రక్తపు మలం లేదా వాంతి
  5.  మన శరీరంలో గ్యాస్ ను బయటకు పంపలేకపోవడం .
  6. మైకము లేదా తలతిరగడం .
  7. సులువుగా బరువు తగ్గడం
  8. పొత్తికడుపు లేదా పొట్టలో గడ్డ
  9. మింగడంలో కష్టం .
  10. మూత్రవిసర్జన చేసేప్పుడు నొప్పి .
  11. ఐరన్ లోపంతో రక్తహీనత లాంటి సమస్యలు ఏర్పడినపుడు.
విరేచనాల నివారణకు ఇంటి చిట్కాలు(Home tips for preventing diarrhea) :
  • పెరుగు(Yogurt) : పెరుగులో మంచి బ్యాక్టీరియా లేదా ఫ్రొబయోటిక్స్(Bacteria or probiotics) ఉండడం వల్ల..పెరుగు తిన్నప్పుడు కొంత ప్రశాంతతను కలుగజేసి . .జీర్ణవ్యవస్థను సక్రమంగా పని చేసేలా చేస్తుంది . పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ పేగులలోని చెడు బాక్టీరియాను నాశనం చేస్తుంది . తద్వారా ,  విరేచనాల సమయంలో మలం విడుదలను నియంత్రిస్తుంది.
  • చిన్న సైజు అరటిపండు(Small size banana) : విరేచనాల సమయంలో చిన్న అరటిపండ్లను తప్పనిసరిగా తినండి . ఇవి సులభంగా జీర్ణం అవుతాయి . మలం గట్టి పడుతుంది. తద్వారా, విరేచనాలను అదుపులో పెట్టగలదు .Diarrhea Causes, Symptoms, Prevention and Home Tips in Telugu
  • అల్లం(Ginger) : అల్లంలో ఉండే “జింజేరోల్స్ మరియు షోగాల్స్” అని పిలువబడే బయోయాక్టీవ్ సమ్మేళనాలు కడుపు భాగంలో సంకోచనాలను పెంచడంలో సహాయపడుతాయి . ఇది కడుపులో అజీర్ణం కలిగించే ఆహారపదార్థాల వేగవంతమైన కదలికను సహాయపడుతుంది . తద్వారా అసౌక్యరం, అజీర్ణం సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు . అల్లంలోని సమ్మేళనాలు వాంతులు, విరేచనాలు తగ్గించడంలో సహాయపడుతుంది . విరేచనాలతో బాధపడే వ్యక్తులు వారి ఆహారంలో గాని, టీ రూపంలో గాని అల్లంను భాగం చేసి తీసుకోవచ్చు . మంచి ఫలితాన్ని పొందవచ్చు .
  • కొబ్బరి నీరు(Coconut water) : విరేచనాల వల్ల ముఖ్యంగా మన శరీరం డీహైడ్రేషన్ కు గురి అవ్వడం జరుగుతుంది . ఖనిజాలు , ఎలక్రోలైట్లు అందివ్వగల మరియు శరీర ద్రవాలను తిరిగి సరి చేయగల శక్తి “కొబ్బరి నీరు” లో ఉంటుంది. కాబట్టి, కొబ్బరి నీరు విరేచనాల సమయంలో తప్పకుండ తీసుకోవడం ద్వారా ఒక చికిత్స లాగ మనకు పని చేయగలదు . ఈ కొబ్బరి నీరు అనేది శరీరంలో రక్తప్రసరణను కూడా పెంచగలదు . విరేచనాల నుండి త్వరగా ఉపశమనం కలిగేలా సహాయపడగలదు .Diarrhea Causes, Symptoms, Prevention and Home Tips in Telugu
  • పుదీనా(Mint) : పుదీనా అనేది జీర్ణాశయ రుగ్మతలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది . అందుకే, ఆయుర్వేద మూలికా చిట్కాలలో ఎక్కువగా వాడడం జరుగుతుంది . ఈ పుదీనా మూలికను అజీర్ణ వాయువు, విరేచనాల చికిత్స కోసం సాంప్రదాయ ఇరానియన్ ఔషధ విధానాల్లో విస్తృతంగా వాడుతుంటారు . పుదీనా ఆకులను పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు . పుదీనా ఆకులతో స్మూతీని తయారు చేసుకోవచ్చు . సాధారణంగా , పుదీనా ఆకులు, యాలకులు నీటిలో కలిపి, బాగా వేడి చేసి..టీలు తయారు చేసి తాగుతుంటారు . మరియు ఈ ఆకులను పొడి చేసి ఇతర రకాలైన పానీయాలు తయారు చేయడం మరియు ఆహారపదార్థాలలో కలపడం చేస్తుంటారు .
  • దాల్చిన చెక్క(Cinnamon) : దాల్చినచెక్క అనే మసాలా దినుసులో ఉండే అనేక యాంటీ ఆక్సిడెంట్లు..“యూజినాల్ , సిన్నమాల్దీహైడ్ , లినాలూల్ మరియు క్యాంఫోర్” లాంటి సమ్మేళనాల కారణంగా . .కడుపులో అజీర్ణం, గ్యాస్ , ఉబ్బరం, తిమ్మిరి మరియు పులి తేన్పులను తగ్గించడంలో సహాయపడుతాయి. గుండెలో మంటను తగ్గించడానికి, కడుపులోని ఆమ్లతను న్యూట్రలైజ్ చేయడానికి కూడా సహాయకారిగా ఉంటుంది. మన జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకారిణి . విరేచనాల చికిత్స కోసం . .1 స్పూన్ దాల్చినచెక్క పొడిని లేదా దాల్చినచెక్కను ఆహారంలో భాగం చేసుకోవడం తప్పనిసరి. వేడినీటిలో దాల్చినచెక్కను వేసి వేడి చేసి టీ రూపంలో తీసుకోవచ్చు. విరేచనాల సమయంలో రోజుకి 2,3 సార్లు తీసుకోవాలి. తద్వారా మంచి ఉపశమనాన్ని పొందుతారు .
  • జీలకర్ర(Cumin) : జీలకర్ర అనేది ఒక యాంటీ మైక్రోబియల్(Antimicrobial). ఇన్ఫెక్షన్ వల్ల కలిగే వాపును తగ్గిస్తుంది. “ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్(Irritable bowel syndrome)” ఉన్న రోగులలో నొప్పితో కూడిన మలవిసర్జనను జీలకర్ర తగ్గించగలదని క్లినికల్ ట్రయల్స్ తెలుపుతున్నాయి . ఈ జీలకర్రలో “టానిన్లు, ఆల్కలాయిడ్స్ , గ్లైకోసైడ్లు , చెక్కరలు , టెర్ఫిన్లు మరియు ఫ్లెవనాయిడ్లు” వంటి బయోయాక్టీవ్ సమ్మేళనాలు ఉంటాయి . కాబట్టి,  అజీర్ణం మరియు కడుపులో ఏర్పడే అదనపు ఆమ్లాలను తగ్గిస్తుంది. తద్వారా, గ్యాస్ అనేది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. జీలకర్రను పొడి రూపంలో, వేడి నీటిలో మరగపెట్టి గానీ,  ఆహారంలో గాని తీసుకున్నట్లయితే  ముందుగా మన శరీరంలో గ్యాస్ ని తొలగించి..విరేచనాలకు తగిన ఉపశమనాన్ని కలిగించగలదు .
  • తులసి ఆకులు(Tulsi leaves) : తులసిలో ఉండే బయోయాక్టీవ్ సమ్మేళనాలు(Bioactive compounds) మనకు ఆకలిని పెంచుతాయి. గ్యాస్ ని తగ్గిస్తుంది . తులసిలో ఉండే యుజినాల్ కూడా కడుపులోని అసిడిటీని న్యూట్రలైజ్ చేస్తుంది . ఇలా . .మొత్తం మన జీర్ణవ్యవస్థను సరి చేయగల శక్తి తులసి లో ఉంటుంది .  కాబట్టి, టీ రూపంలో లేదా ఆహారంలో భాగం చేసుకోవడం చేస్తూ ఉంటే . .విరేచనాల నుండి ఉపశమనాన్ని పొందే అవకాశం ఉంటుంది .
  • గుమ్మడికాయ(Pumpkin) : గుమ్మడికాయ, గుమ్మడికాయ గింజలు, ఆకులు అనేవి విరేచనాలకు మంచి చికిత్స విధానంగా పని చేస్తుంది. ఇవి విరేచనాలకు కారణమయ్యే సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. గుమ్మడికాయలో ఉండే కరిగే ఫైబర్స్ మలం గట్టిపడడానికి సహాయపడుతుంది. తద్వారా, మలం నుండి నీటిని గ్రహిస్తుంది. మరియు గుమ్మడిలో అధిక స్థాయిలో పొటాషియం కూడా ఉంటుంది. అందుకే, గుమ్మడికాయను విరేచనాల సమయంలో తినడం వల్ల శరీరం కోల్పోయిన ద్రవాలను ఎలక్రోలైట్స్ తో సరి చేయగలదు. ఉడికించిన లేదా వేపిన గుమ్మడికాయ ముక్కలు తినండి. పచ్చి గుమ్మడి కాయ ఆకులతో లేదా విత్తనాలతో తయారుచేసిన రసాన్ని కూడా తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలం .
  • నిమ్మకాయ నీళ్లు(Lemon water) : నిమ్మకాయ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండడం వల్ల మన జీర్ణవ్యవస్థను సరి చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ, చిటికెడు ఉప్పు , తేనె కలుపుకొని..ఉదయం ఖాళీ కడుపుతోనే  తాగాలి. ఈ కారణంగా విరేచనాల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.
  • విశ్రాంతి(Rest) : విరేచనాల సమయంలో జీర్ణ సమస్యలు, ఒత్తిడి, ఆందోళనలు అనేవి తీవ్రతరం అవుతుంటాయి. కాబట్టి, తగిన విశ్రాంతి చాల అవసరం అవుతుంది. లోతైన శ్వాస తీసుకుంటూ . .”యోగ ,ధ్యానం(Yoga, meditation)” వంటివి చేస్తూ ఉండడం ద్వారా మన మనస్సు పొందే ప్రశాంతత రూపేణా కూడా మన శరీరంలో కలిగే సమస్యలు మనకు ఇబ్బందికరంగా అనిపించదు. విరేచనాలు తగ్గడం కోసం, నీరసం నుండి విముక్తులం అవడానికి తీసుకునే ఎన్నో చికిత్సలు,  జాగ్రత్తలు ఎంత అవసరమో..మనసు ఒక ప్రశాంతతను చేకూర్చడానికి కూడా తగిన విశ్రాంతి తీసుకోవడంపై కూడా దృష్టి ఉంచాలి . Diarrhea Causes, Symptoms, Prevention and Home Tips in Telugu

ముగింపు(Conclusion) :

విరేచనాలు రావడం, తగ్గించుకోవడం సహజ ప్రక్రియ అంటాము . ముఖ్యంగా విరేచనాలు ఇబ్బందిని కలిగించకూడదు అంటే..గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన విధానం ఏమిటీ అంటే..మన ఇంటి లోపల మరియు వెలుపల మరియు మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలతో పాటుగా మన శరీరం, మన జీవన విధానం కూడా పరిశుభ్రతతో ఎల్లవేళలా ఉండేటట్లు చూసుకోవడం. అలాగే ముఖ్యమైనది నీటి శుద్ధి, వాతావరణం శుద్ధి. అందుకే, వీలైనంతగా విరేచనాలకు సంబంధించిన సమాచారం వివరించి ఉన్నాము .

విరేచనాల వల్ల ఒక్కోసారి మన ప్రేగులలో పేరుకుపోయే చెడు వ్యర్థాలు, విష పదార్థాలు లాంటివి ఉన్నట్లయితే పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది . ఈ విధంగా మన శరీరానికి ఎంతో మేలును ఈ విరేచనాలు కలిగిస్తాయి అని కూడా అనొచ్చు. అయితే,  విరేచనాలు ప్రారంభ దశ కంటే ముందు మీ ఆహార ప్రణాళికలో ఏర్పడిన మార్పులు మరియు మీ అనారోగ్యం కారణంగా లేదా మీరు తీసుకునే మందులు లేదా మీ శరీరానికి కలిగించే శ్రమ లేదా మీరు తీసుకున్న ఆహారం మీ శరీరానికి సరిపడకపోవడం ఇలా . .ఎన్నో రకాల కారణాలు మీరు అనుభవించారా అనేది గమనించుకోవాలి. ఎందుకంటే . .కారణం గుర్తించగలిగితే..ఇంటి చిట్కాలతో కూడా సులువుగా విరేచనాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది మరియు తద్వారా అవగాహన కూడా కలుగుతుంది . మన జీవనశైలిలో ఏర్పరుచుకోవాల్సిన మార్పులు ఏంటి అని . .

విరేచనాల సమస్య కొన్ని ప్రాంతాల్లో కేవలం వ్యక్తిగత కారణాలతో మరియు వ్యక్తిగతం కాకపోవొచ్చు. ఆ ప్రాంత పరిశుభ్రతపైనా ఆధారపడి ఉంటుంది . ఆ ప్రాంత ప్రజలందరు కూడా ఒకేసారి ఈ సమస్యను అనుభవించడం జరుగుతుంది . అలాంటి సమయంలో ఎవరికీ వారుగా మీ చుట్టూ పరిసరాలను, మీ ఇంటిని పరిశుభ్రం చేసుకోవడం మీ కర్తవ్యం అయితే..అక్కడి ప్రాంత పెద్దలు మరియు  ప్రభుత్వానిది అసలైన కర్తవ్యం తప్పకుండా ఉంటుంది. కాబట్టి, తగిన చర్యలు ప్రభుత్వం వెంటనే తీసుకునే ప్రయత్నం చేసి..విరేచనాల సమస్య నుండి ప్రజలందరూ త్వరగా విముక్తులు అయ్యేలా చేయాలి. మరియు వారికి సరైన అవగాహన విధానం తెలియజేయడంలో కూడా ప్రభుత్వం ముందుండేలా చర్యలు తీసుకోవాలి .

ఇవన్నీ కారణాలు ఒక ఎత్తు అయితే, మీ ఆరోగ్య పరిస్థితి విరేచనాలకు ముందు ఎలా ఉంది అనేది గమనించుకోవాలి. ఏమైనా అనారోగ్యం బారిన పడ్డట్లయితే..వెంటనే, తగిన చికిత్సను తీసుకోగలిగితేనే విరేచనాలను తట్టుకునే శక్తిని పొందగలరు . ఇంకా విరేచనాల సమయంలో మీరు ఏ ఆహారం తీసుకుంటే మీకు సరిపడుతుంది అనేది గమనించుకోవాలి. మీ ఇష్టం వచ్చిన ఆహారంను తీసుకున్నా మీ విరేచనాలను అదుపులో ఉండేలా మీ శరీరం మీకు సహకరిస్తుంది అనుకుంటే అది మీ వ్యక్తిగతం అంటాము. అలా కానీ పరిస్థితిలో ఏ మాత్రం అశ్రద్ద చేయడం సరి కాదు. తీసుకునే ఆహారం, శారీరక శ్రమ, పరిశుభ్రత పైన చాలా శ్రద్దను పెంచుకోవాలి. తద్వారా, కొంతైనా మీ సమస్య నుండి సులువుగా బయట పడే మార్గం ఉంటుంది. మరియు వైద్యుడిని సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించి, చికిత్స అనేది తీసుకుంటేనే తర్వాత మీ శరీరం బలంగా ఉండే అవకాశం ఉంటుంది .

అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే . .ఏ కారణం చేత అయినా విరేచనాలు కలగొచ్చు. అయితే పరిస్థితిని బట్టి.. 1, 2 రోజులు కంటే ఎక్కువగా రోజుల తరబడి అయ్యే అవకాశాలు ఉండడం మనం చూస్తూనే ఉంటాము. ఏ పరిస్థితిలోనైనా ఈ విరేచనాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి, పరిశుభ్రతతో పాటు, మన శరీరాన్ని బలంగా ఉండేలా తయారుచేసుకోవాలి. ఎంత పెద్ద అవాంతరం ఏర్పడిన కూడా తట్టుకునే స్థితిని మనం పొంది ఉండాలి . అది ఆహరం ద్వారా అయినా సరే, మానసికంగా యోగ ద్వారా అయినా సరే అభివృద్ధి అనేది చేసుకోవాలి . విరేచనాల సమయంలో విశ్రాంతిని మానసికంగానూ, శారీరకంగానూ తీసుకోవాలి. అప్పుడే త్వరగా కోలుకునే పరిస్థితిని మనం చూస్తాము .

ఈ సమయంలో వైద్యుడి సలహాలు, ఇంటి చిట్కాలు ఎంత అవసరమో మన మనోబలం కూడా అంతే సరిసమానంగా కంటే ఎక్కువే ఉండడం చాలా అవసరం. ఎందుకంటే, విరేచనాలు అనేవి మన శరీర బలాన్ని పూర్తిగా కోల్పోయేలా చేసి, ప్రాణంతో చెలగాటం ఆడేలా చేస్తుంది. మనకు పూర్తిగా శక్తి లేదు అనిపిస్తుంటే తట్టుకోవడం కష్టతరమైనది మాత్రమే కాదు . .ప్రాణం పై ఆశను కోల్పోవడం కూడా జరుగుతుంది. అందుకే, సరైన సమయంలోనే గుర్తించి, అవగాహనను ఏర్పరుచుకొని జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో శ్రద్ద వహించడం చాలా ముఖ్యం.

Add Comment