Best Home remedy’s for low blood pressure in Telugu|లో బీపీ సమస్య బాధిస్తోందా, ఇంటి చిట్కాలతో పరిష్కారం సులభతరం అవుతుంది.

  “తక్కువ రక్తపోటు(low blood pressure)”తో భాదపడే వారికి ఇంటి చిట్కాలు 

       ఉదయము లేస్తూనే అసహనంగా, బద్దకంగా అనిపిస్తోందా? అదే అలసట కుర్చీలో నుండి లేచినపుడు కూడా అనిపిస్తుందా? శరీరంలోని రక్తమంతా మెదడుకు వెళ్ళిపోయి, ఇంకెక్కడా లేని భావన కలుగుతుందా? ఇలాంటి లక్షణాలు శరీరంలో అనిపిస్తుంటే మీ బీపీ సాధారణ స్థాయి కన్నా తక్కువున్నట్టే, దీనికి చికిత్స అవసరం. ఇందుకోసం కూడా మేము కొన్ని గృహ చిట్కాలు(home remedies) తెలియజేస్తున్నాము.

బీపీ తగ్గినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

        Best Home remedy's for low blood pressure in Teluguహై(high) మరియు లో బ్లడ్ ప్రెషర్(low blood pressure) ఎలాంటి లక్షణాలు బహిర్గతపరుచకుండా వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా చాల మంది దీనితో బాధపడుతున్నారు. తరచుగా జ్వరం(fever) రావడం లేదా బలహీనంగా(week) అనిపిస్తే కారణం, బ్లడ్ ప్రెషర్(blood pressure) సమస్యలు అని చెప్పవొచ్చు. రొండింటిలో బ్లడ్ ప్రెషర్ చాల ప్రమాదకర పరిస్థితిగా చెప్పవొచ్చు. ఎందుకంటే, దీని వలన మెదడుకు ఆక్సిజన్ మరియు అవసరమైన పోషకాల సరఫరా ఆగిపోయి, చాల ప్రమాదకర పరిస్థితులను ఏర్పరుస్తుంది. కావున పరిస్థిని విస్మరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

  •  బీపీ తక్కువగా ఉండే వారికి ఒక్కసారి హఠాత్తుగా చీకట్లు కమ్మి, అపస్మారక స్థితి(unconscious)లోకి చేరుకుంటారు. ఇలా జరగడానికి కారణం, మెదడుకు తగినంత రక్తం సరఫరా(blood circulation) జరగకపోవడం వల్ల, తక్కువ  రక్తపోటును హైపోటెన్షన్ (hypotension)అని కూడా అంటారు. దీని ప్రధాన లక్షణాలు మూర్ఛ, తల తిరగడం, కంటి కింద నల్లటి వలయాలు, అలసట, వికారం లేదా వాంతులు, చేతులు లేదా పాదాలు చల్లగా అయిపోవడం, చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు.
  • ఇటువంటి వారు ప్రతిరోజూ టీ(tea) లేదా కాఫీ(coffee) తాగితే…దీనిలోని కెఫీన్ రక్తపోటును పెంచడానికి పని చేస్తుంది. మీకు శ్వాస(breath) తీసుకోవడంలో ఇబ్బంది లేదా కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే టీ లేదా కాఫీ తాగండి.
  • లెమన్ వాటర్(lemon water) తాగడం వల్ల కూడా తక్కువ రక్తపోటు సమస్య దూరమౌతుంది. డీహైడ్రేషన్(dehydration) కూడా బీపీ తక్కువ అవడానికి కారణమౌతుంది. అందువల్ల తగినంత నీరు(water) తాగాలి. నీళ్లకు కొంత నిమ్మరసం జోడిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
  • వేసవి కాలంలో తప్పనిసరిగా మజ్జిగ తాగాలి. మీకు తక్కువ రక్తపోటు ఉన్నప్పుడల్లా మజ్జిగలో ఉప్పు, జీలకర్ర పొడి కలిపి తాగితే డీహైడ్రేషన్ తో పాటు రక్తపోటు సమస్య కూడా దూరమౌతుంది.
  • తులసి ఆకులను నమలడం వల్ల రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుంది. తులసిలో మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును సాధారణ స్థితికి చేర్చే గుణం కలిగి ఉంటుంది.
  • అల్లం ముక్కను నమలడం, దాల్చమ్ చెక్క పొడిని వేడి నీళ్లలో కలిపి తాగడం. ఖర్జురాన్ని పాలతో కలిపి తినడం వల్ల కూడా రక్తపోటును మాములు స్థాయిలో ఉంచుకోవొచ్చు. అలాగే రోజువారీ ఆహారంలో టమాటలు, ఎండుద్రాక్ష, క్యారెట్ మొదలైనవి తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.

Best Home remedy's for low blood pressure in Telugu

తక్కువ రక్తపోటు(Low BP) ని సహజ ధోరణిలో తీసుకువొచ్చే విధానం

విటమిన్లు(vitamins) : 

          విటమిన్ B-12, మరియు E-లో బీపీ ని సాధారణ స్థాయిలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. హై బీపీ(high bp) ఉన్నవారు ఎట్టిపరిస్థితిలోను విటమిన్ E తీసుకోకూడదు. విటమిన్ B-12 అనీమియా చికిత్సలో ఉపయోగపడుతుంది. ఇక ఇదే బీపీ ని పెంచడంలో కూడా సహకరిస్తుంది. ఈ విటమిన్లను కోరుకునే వారు బాదాం పప్పు, పాలకూర, స్వీట్ పొటాటో, గుడ్లు, పాలు, చీజ్, చేపలు తినాలి. దీనికి అదనంగా వైద్యుడి సలహా తో విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవొచ్చు. 

రోజ్ మేరీ నూనె(rose merry oil) :

        6 చుక్కల రోజ్ మేరీ నూనె(rose merry oil), 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె(coconut oil) లేదా ఆలివ్ నూనె(olive oil) లో కలిపి, దీనితో శరీరమంతా మసాజ్(body massage) చేసుకోవాలి. లేదా స్నానం చేసే నీటిలో రోజ్ మేరీ నూనె ను కలుపుకోవాలి. ఇలా రోజుకు ఒకసారి(once a day)చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

ఇది పనిచేసే విధానం,

     రోజ్ మేరీ నూనె లో కర్పూరం(camphor) ఉంటుంది. ఇది శ్వాస వ్యవస్థ(breathing process)ను ఉతేజపరుస్తుంది. దీని వల్ల రక్త సరఫరా సజావుగా సాగుతుంది. అందుకే రోజ్ మేరీ నూనె బీపీ ని తగ్గించడంలో సహకరిస్తుంది.

బాదాం పాలు(almond) :

           5,6 బాదాం(almond) పప్పులు రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే తొక్క తీసేసి వాటిని పేస్ట్(paste) చేసి ఒక డ్రింక్(drink) లా మరిగించండి. రోజు ఈ పానీయాన్ని తాగితే బ్లడ్ ప్రెషర్ పడి పోకుండా ఉంటుంది. బాదాం పాలు(almond milk) లో కొలెస్ట్రాల్ గాని, శ్యాచురేటెడ్ ఫ్యాట్ కానీ ఉండవు. నిజానికి ఇందులో ఒమేగా 3(omega) వంటి మంచి ఫ్యాట్స్ ఉంటాయి. మీ “లో బీపీ” డైట్(diet)లో ఈ పానీయాన్ని కూడా చేర్చుకోండి.

తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినండి :

         మెయిన్ మీల్స్(meals)కు మధ్యలో ఎక్కువ సేపు ఖాళీగా ఉండకుండా స్నాక్స్(snacks) తీసుకుంటూ ఉండండి. ఒక్కొక్కసారి మీల్స్ తర్వాత బ్లడ్ ప్రెషర్(blood pressure) పడిపోతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఎక్కువ సార్లు తక్కువ మోతాదులో ఆహరం తీసుకోండి. అంటే మీరు మూడు సార్లు కడుపు నిండుగా ఆహరం తీసుకుంటూ ఉన్నట్లయితే, అదే ఆహారాన్ని 5 సార్లు గా తీసుకోండి. ఇలా తీసుకోవడం డయాబెటిస్ పేషెంట్స్(diabetes patients)కి కూడా మంచిది.

ఫ్లూయిడ్స్(fluids) ఎక్కువగా తీసుకోండి :

         ప్రతి రోజు కనీసం 2,3 లీటర్ల నీళ్లు(water) తీసుకోండి. దీనితో పాటు కొబ్బరి నీరు(coconut water), బెల్ కా షర్బత్ లాంటివి మీ “లో బీపీ” డైట్(diet)లో ఉండాలి. ఇందువల్ల మీకు కావాల్సిన ఎలెక్రోలైట్స్(elecrolytes) మీకు అందుతాయి. లో బీపీ కి గల కారణాలలో డీహైడ్రేషన్(dehydration) కూడా ఒక కామన్ రీసన్(common reason). డీహైడ్రేషన్ ని తగ్గించడానికి బెస్ట్ రెమెడీ నీళ్లు(best remedy). కాబట్టి తగినంత నీరు తాగడం మర్చిపోవొద్దు.

తగినంతగా ఉప్పు(salt)ను తీసుకోవాలి :

           ఉప్పు(salt)ను అధిక మోతాదు లో తీసుకోవడం సరియైనది కాదు. తగిన మోతాదులో తీసుకోవడం చాల ముఖ్యం. మీ రోజు వారి ఆహారంలో 1 టీస్పూన్ ఉప్పు మీ ఆహారంలో చేర్చబడి ఉండాలి. వేసవి కాలంలో లేక యోగ, వ్యాయామం చేసే అలవాటు ఉంటె చిటికెడు ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కలిపిన నీళ్లు దగ్గర ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. ఉప్పు ఎక్కువైతే మటుకు వాటర్ రిటెన్షన్(water retension) కు, హై బీపీ(high bp)కి దారి తీస్తుందని గుర్తు పెట్టుకోవాలి.

ఎండు ద్రాక్ష(dried grape) :

          రాత్రంతా ఎండుద్రాక్ష ను నానబెట్టి మరుసటిరోజు పాలల్లో మరిగించి తీసుకోండి. లేదంటే, నానబెట్టిన ఎండుద్రాక్షలను మీ టిఫిన్ టైం(breakfast)లో తీసుకోండి. ఇది రక్తం సరఫరా(blood circulation) సరిగ్గా జరిగేటట్లు చేస్తుంది. ఫలితంగా హెల్తి బ్లడ్ ప్రెషర్(healthy blood pressure) ఉంటుంది.

బీట్ రూట్(beet root) :

         లో బ్లడ్ ప్రెషర్ ను తగ్గించే శక్తివంతమైన ఔషదంగా “పచ్చి బీట్ రూట్ రసం” అని చెప్పవొచ్చు. లో బ్లడ్ ప్రెషర్(low bp) తో బాధపడే వారు రోజు కనీసం 2 గ్లాసుల బీట్ రూట్ రసాన్ని(beet root juice) తాగడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఎలా రోజు తాగితే వారంలోనే మార్పులను గమనిస్తారు.

బ్లాక్ కాఫీ(black coffee) :

        బ్లాక్ కాఫీ(black coffee) కూడా లో బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుంది. లో బీపీ(low bp) అలసట, బలహీనత పరుస్తుంది. ఇలాంటి సమయంలో పాలు(milk) కలపని బ్లాక్ కాఫీ తాగితే అలసట నుండి త్వరగా ఉపశమనం పొందవొచ్చు.

గ్రీన్ టీ(green tea) :

        గ్రీన్ టీ(green tea) రోజుకు 2 లేదా 3 సార్లు తాగితే చాలు, ఎలా పనిచేస్తుందంటే.. కాఫీ తరహాలోనే గ్రీన్ టీ లో కెఫిన్ సమృద్ధిగా ఉంటుంది. కెఫీన్ “లో బీపీ” ని ఎలా తగ్గిస్తుందో ఖచ్చితంగా తెలియదు కానీ, ఇది ఒక ధమనులను వెడల్పు చేసే ఒక హార్మోన్ ను ఉత్తేజ పరుస్తుందన్న విషయం మాత్రం అర్ధం అవుతుంది. 

 

Add Comment