“తేనె” ఎన్నో పోషకాలను నింపుకుని శక్తినిచ్చే ఆరోగ్యప్రదాయిని..మన ఈ అమృతమైన మధువు|Medicinal properties of honey are benefits and side effects for health and beauty nutrition in Telugu

తేనె ఎన్నో ఔషధగుణాలను కలిగిన పోషకపదార్థం(Honey is a nutrient with many medicinal properties) :

       తేనె(honey) ప్రకృతి వరప్రసాదాలలో ఒకటి. ఇది తిరుగులేని ఔషధగుణాలతో కలగలసిన పోషకపదార్థం అని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు కాబట్టి, అన్ని వయస్సుల వారు అమితంగా ఇష్టపడే మన ఈ “మధువు”, ప్రకృతి నుండి సహజసిద్దంగా తయారు చేయబడి, ఎన్నో వేల సంవత్సరాలుగా చాలా సుపరిచితమైన, రుచికరమైన ఈ మధువు, ఎప్పటికి ప్రసిద్ధమైనదిగానే ఉంటుంది. తేనె తిరుగులేని ఔషధ గుణాలు కలిగి ఉన్న, ఒక సంపూర్ణ పోషక పదార్థమని మరియు బలవర్దకపు ఆహరం కూడా ఇదేనేమో..అందుకే, దీన్ని “స్వచ్చమైన తేనె(Pure honey), ఆరోగ్యప్రదాయిని(healthy)” అంటారు.

     మన ఆయుర్వేదానికి తేనె ఒక ప్రాణం లాంటిది. భారతదేశంలో పురాతన, సంప్రదాయ వైద్య వ్యవస్థలైన సిద్ద, ఆయుర్వేదంలో తేనె ఒక ప్రధాన మూలికగా ఉపయోగపడుతుంది. శ్వాసకోశ వ్యాధులకు(For respiratory diseases) తేనెకు మించిన దివ్యౌషధం లేదని చెప్పడం జరిగింది. అయితే, దీనిని సేకరించిన తీరు, నిలువచేసేందుకు వాడిన విధానాలను బట్టి పలు రకాలుగా విభజించారు. ప్రపంచవ్యాప్తంగా చుస్తే, మన పూర్వీకులు తేనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై(Health benefits) బాగా అవగాహన ఏర్పరుచుకున్నవారు అని అర్ధం చేసుకోవచ్చు.Medicinal properties of honey are benefits and side effects for health and beauty nutrition in Telugu

తేనెలోని గుణాలు(Properties of honey) :

  1. తేనెలో క్యాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్ , సోడియం, సిలికాన్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
  2. థైమీన్, రిబోప్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్ లాంటి విటమిన్లు ఉంటాయి,
  3. పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, ఎంజైములు ఉంటాయి.
  4. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్స్, ఖనిజలవణాలు ఎక్కువగా ఉంటాయి.
  5. ఇన్ని రకాల పోషకాలను కలిగి ఉంది కాబట్టే, తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెపుతారు.
  6. శక్తిని అందించే ఈ తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్(Cholesterol) ఉండదు.
  7. తేనెలో రంగులు, రకాలు ఉంటాయి. పసుపు, బూడిద, ముదురు కాఫీ, నలుపు..ఇలా భిన్న వర్ణాలతో పాటుగా కొన్ని తేనెలు వర్ణవిహీనంగాను ఉంటాయి.
  8. అలాగే ఒక్కో తేనె ఒక్కో రకమైన రుచిని, సుగంధాన్ని వెదజల్లుతాయి.
  9. అంటే, తేనె రంగు, రుచి, సువాసన..అన్నీ మధుకీటకాలు సేకరించే పూలజాతుల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి, యూకలిఫ్టస్, నిమ్మ, నారింజ పూల నుండి మకరందాన్ని సేకరిస్తే, అది ఘాటైన వాసనను, రుచిని కలిగి ఉంటుంది.
  10. చాలామంది వంటల్లో పంచదార కన్నా తేనెను వాడటానికి ఇష్టపడుతారు. బేకింగ్ ఉత్పత్తుల్లో తేనె వాడటం వల్ల రుచిగా ఉండడంతో పాటు అవి సువాసన వెదజల్లుతూ ఉంటాయి.
  11. పైగా ప్రాసెస్ చేయకుండా నేరుగా తేనెపట్టు నుండి తీసిన జుంటి తేనెలో ఎంజైములు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా దొరుకుతాయి.

తేనె యొక్క చరిత్ర(History of Honey) :Medicinal properties of honey are benefits and side effects for health and beauty nutrition in Telugu

  • తేనెటీగలు(honey Bees) అనేవి ఒక రకమైన తుమ్మెదలు(fireflies). ఆర్దికపరంగా మానవులకు సహాయపడుతున్న ఉత్పాదక కీటకాలు(Productive insects).
  • తేనెటీగలు పువ్వుల నుండి మకరందాన్ని(Nectar)(పూలలో ఉత్పత్తి అయిన తియ్యటి ద్రవ పదార్థాన్నిస్రవించడం) సేకరించి తేనెపట్టు(honeydew)లో ఉంచుతాయి. తర్వాత తేనెగా మారుస్తాయి. దానినే మనం “తేనె” అని పిలుస్తుంటాము. ఇది మంచి పోషక ద్రవం.
  • ఇవి సంతానోత్పత్తి కోసం తేనెపట్టును ఏర్పరుచుకుంటాయి. తేనె ఒక మంచి యాంటీబ్యాక్టీరియా(antibacterial), యాంటిసెప్టిక్ ఔషధపదార్థం(antiseptic). రోగనిరోధక శక్తి(immunity)ని పెంపొందించడంలో మనం తినే ఆహారం పెద్ద పాత్ర పోషిస్తుంది.

Medicinal properties of honey are benefits and side effects for health and beauty nutrition in Telugu

  • తేనె వాడకం ఈనాటిది కాదు. అనాది నుండి వాడుకలో ఉంది. శిలాయుగం చివర్లోనే అడవి తేనె సేకరణ జరిగిందని చెప్పడానికి ఆధారాలున్నాయి. అంటే, 10000 వేల సంవత్సరాల మొదలు 50000 సంవత్సరాల ముందు నుండి ఈ తేనె మాధుర్యాన్ని చవి చూస్తున్నారని చెప్పవచ్చు.
  • స్పెయిన్ లోని వాలెన్సియా అనే ప్రాంతంలోని గుహలో అడవి తేనె కోసం వేటకు సంబందించిన చిత్రాలున్నాయి. ఇవి 8000వేల సంవత్సరాల నాటివని చారిత్రకులు నిర్థారించారు కూడా..Medicinal properties of honey are benefits and side effects for health and beauty nutrition in Telugu

 

  • నిజానికి తేనెటీగ జీవన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన కీర్తి – స్పెయిన్ శాస్త్రజ్ఞుడు “హ్యూబర్(Huber)” కు దక్కుతుంది.
  • 200 సంవత్సరాల క్రితం స్వతహాగా గుడ్డివాడైనప్పటికీ, తన భార్య సహాయ సహకారాలతో, రాణి ఈగ తన గూడుకు చాలా దూరంలో ఉన్న మన ఈగతో ఎలా సంపర్కం పెంచుకుంటుంది? తేనెపట్టుపై ఉన్న రంధ్రాల సైజు ను చూసి, కూలి మగ ఈగలను, వాటి సంఖ్యను ఎలా గుర్తించవచ్చో..హ్యూబర్ వివరంగా తెలియజేసారు.
  • స్వచ్ఛమైన తేనె ఎన్నటికీ చెడిపోదు. ఎందుకంటే, రెండు రెట్లు ఎక్కువ తీపి ని కలిగి ఉండే తేనె, క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉండడం వల్ల “బాక్టీరియా”ను చంపేస్తుంది.
  • తేనెలో 14 నుండి 18 శాతం వరకు తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండడంతో పులియడం, పాడవడం జరగదు.Medicinal properties of honey are benefits and side effects for health and beauty nutrition in Telugu

 

  • 18 శాతం కన్నా తక్కువ తేమ ఉన్న పదార్థాలలో సూక్ష్మజీవులు కానీ, ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు. కానీ పిల్లలకు హాని కలిగించేంత మొత్తంలో సూక్ష్మ క్రిములు ఉండడానికి అవకాశం ఉంది.
  • పంచదార కనిపెట్టకముందు మనిషి తొలిసారిగా తీపి రుచిని తెలుసుకుంది దీని ద్వారానే అంటారు. మొట్టమొదటగా మద్యాన్ని తయారు చేసింది కూడా తేనెతోనే అంటున్నారు.
  • ప్లేటో(Plato), అరిస్టాటిల్(Aristotle), డిమోక్రటిస్(Democrates.)..లాంటి తత్వవేత్తలంతా “తేనె వైశిష్టాన్ని(“The specialty of honey)” తమ గ్రంథాల్లో పేర్కొన్నారు.
తేనెతో ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits of Honey) :
  • పూర్వం మశూచికం వల్ల ఏర్పడ్డ మచ్చలు త్వరగా తగ్గేందుకు చైనీయులు తేనెను మందుగా వాడేవారు.
  • రక్తంలో కలిసిన తేనె మూత్రపిండాలు(Kidneys) మరియు ఇతర అంతర్భాగాలకు(other internal organs) వినాశనకారి కాదు.
  • తేనెను సేవించడం వల్ల సున్నితమైన జీర్ణాశయం లోపలి పొరకు(stomach lining) ఎలాంటి హాని కలగదు.
  • తేనెలోని యాంటీఆక్సిడెంట్స్ – క్యాన్సర్(Cancer) మరియు హృదయ రోగ సమస్యలను(Cardiovascular problems) అడ్డుకుంటుంది.Medicinal properties of honey are benefits and side effects for health and beauty nutrition in Telugu

 

  • తేనెలో ఔషధ గుణాలున్న నూనెలు, ఫ్లవనాయిడ్లు, పాలీఫినాలు, టెర్పీన్లు ఉన్నాయి. ఇవి అనేక రకాల “అల్సర్ల(ulcers)”ను తగ్గిస్తాయి.
  • కాలిన గాయాలకు, చర్మ క్యాన్సర్లకు, పుండ్లకు, తేనె ను పూస్తే త్వరగా తగ్గుముఖం పడుతాయి. ఇది “యాంటీ మైక్రోబియల్(anti-microbial)” ఏజెంట్ గా చక్కగా పని చేస్తుంది.
  • ఎలెర్జీ(allergies)ని నివారిస్తుంది అని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. ఎలర్జీలు సాధారణంగా “పరాగరేణువుల(of pollinators)” వల్లే వస్తాయి. తేనెటీగలు మీ చుట్టుపక్కల ఉన్న మొక్కల నుంచే కదా తేనె ను సేకరించేది కాబట్టి ఆ పరాగరేణువులు మీ శరీరంలో చేరి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
  • అమృతప్రాయం అయిన మధువులో రవ్వంత విషము కూడా ఉంటుంది. మకరంధంలో సహజంగా ఉండే బాక్టీరియా “బాట్యులిన్(Botuline)” అనే టాక్సిన్ ను విడుదల చేస్తాయి. ఈ విషం “క్యాన్సర్, మల్టిపుల్ స్ల్కిరోసిస్(Cancer, multiple sclerosis)” కు మంచి మందు. ఇదే విషం సంవత్సరం లోపు పిల్లలకు హానికరము అవుతుంది.
  • అజీర్తికి, విరేచనాలకు(For indigestion and diarrhea) తేనె ఒక దివ్యౌషధం.
  • చెడు వాసనలని, వాపుని, మచ్చల్ని కూడా మటుమాయం చేస్తుంది.

1.మన శరీరంలో రక్తప్రసరణకు తేనె ఎంతో ఉపయోగకరం(Honey is very useful for blood circulation in our body) :

తేనెను మీరు తీసుకునే విధానం బట్టి వివిధ రకాలుగా మీ శరీరంపై ప్రభావం చూపుతుంది.

  • తేనె చాలా సులభంగా జీర్ణమై, ఇతర ఆహార పదార్థాల కంటే కూడా త్వరగా రక్తంలో కలుస్తుంది.
  • సాధారణంగా నీటితో కలిపి తాగితే, అది రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్య(Red blood cell count)ను(RBC) పెంచడంలో ఎంతో  ఉపయోగపడుతుంది. శరీరంలోని వివిధ భాగాలకు రక్తంలో ఆక్సిజన్ అందజేయడంలో ఈ RBC లు ముఖ్య పాత్ర వహిస్తాయి.
  • గోరువెచ్చని నీటితో తేనె ను సేవిస్తే, రక్తంలో హీమోగ్లోబిన్(hemoglobin) స్థాయిని పెంచి, రక్తహీనత(anemia) నుండి ఉపశమనం కలుగుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఐరన్ లోపించడం వల్ల “రక్తహీనత” ఏర్పడుతుంది. దీనితో శరీర భాగాలకు ఆక్సిజన్ అందజేసే సామర్థ్యం రక్తంలో తగ్గుతుంది. దీంతో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మాంద్యం వంటి సమస్యలు వస్తాయి. అయితే తేనె రక్తానికి ఆక్సిజన్ అందజేసే సామర్ధ్యాన్ని పెంచడం ద్వారా పై సమస్యలను నివారిస్తుంది.
  • రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచడం అనేది చాల ముఖ్యం. ఎందుకంటే, శరీరం ఎంత ఆరోగ్యముగా ఉంది, ఎంత సులభంగా శక్తిని తిరిగి పొందుతోంది అనేది రక్తంలోని ఆక్సిజన్ స్థాయిపై ఆధారపడి ఉంటాయి. తేనెను తాగడం వల్ల రక్తపోటు(blood pressure), హైపర్ టెన్షన్ పై మంచి ప్రభావాన్ని చూపుతాయని తెలుసుకున్నారు. తేనె “లో-బీపి” యొక్క ప్రభావం కూడా గణనీయంగా తగ్గిస్తుంది అని నిర్దారణ జరిగింది.
  • కిమియోతెరపి రోగులలో(in chemotherapy patients) సైతం ప్రమాదకర స్థాయిలో ఉన్న “తెల్లరక్తకణాల సంఖ్య(White blood cell count)”ను నియంత్రించబడి, ఆ సమస్య తిరిగి పునరావృతం అవ్వకుండా నివారించబడింది అని ప్రాథమిక ఆధారాల వల్ల రుజువైంది.

2. తీపి అనగానే చక్కర అనుకుంటాము. దీనికి మించి సురక్షితమైనది తేనె(Sweetness means sugar. Honey is also safer than) :Medicinal properties of honey are benefits and side effects for health and beauty nutrition in Telugu

  • చక్కర వాడకం అనేది శరీరంపై చెడు ప్రభావం కలిగిస్తుంది అని వింటున్నాము కదా! ఇందుకు తేనె ఒక గొప్ప ఆరోగ్యప్రదాయిని అంటారు. ఎందుకంటే తీయని రుచిని కలిగిస్తూ, శరీరాన్ని సురక్షితంగా ఉంచుతుంది. తేనె రసాయన తయారీలో భాగంగా కొంత చక్కర లక్షణాలు కలిసినప్పటికీ, అది చక్కర కంటే ఎంతో భిన్నమైంది. ఎందుకంటే, ఇందులో 30% గ్లూకోస్(glucose), 40% ఫ్రక్టోస్(fructose) (ఈ రెండు సాధారణ చక్కరలు) అలాగే, 20% ఇతర సంక్లిష్టమైన చక్కర లక్షణాలను కలగలిపి ఉంటాయి. తేనెలో ఇంకా డెక్స్ట్రిన్(dextrin), స్ట్రాచీ ఫైబర్(strachy fiber)  కూడా ఉంటాయి. రక్తంలోని చక్కర స్థాయిని సాధారణంగా ఉంచడంలో ఈ మిశ్రమం సహాయపడుతుంది.

3. యోగ సాధన చేసే వారికి తేనె ఒక సహాయకారిగా పని చేస్తుంది అనవచ్చు(It can be said that honey acts as a helper for those who practice yoga) :

  • యోగసాధన చేసేవారు తేనె వాడటం వల్ల రక్తంలోని రసాయనంలో సమతుల్యత వస్తుంది. ఉదయాన్నే యోగసాధనకు ముందు గోరువెచ్చని నీటిలో తేనెను కలిపి రోజు సేవించడం వల్ల శరీరంలోని అన్ని వ్యవస్థలు బాగా తెరుచుకుంటాయి మరియు మరింత శక్తివంతం అవుతాయి.

4. తేనె ఒక శక్తివంతమైన సంపూర్ణ పోషక ఆహారం(Honey is a powerful wholesome food) :

  • సంప్రదాయ వైద్యంలో తేనె శరీరానికి తక్షణం శక్తినిచ్చే కారకంగా ఉపయోగపడుతుంది. “యునైటెడ్ స్టేట్స్ నేషనల్ హనీ బోర్డు(United States National Honey Board)” వారు తేనె వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే, తేనె అనేక విటమిన్లు, మినరల్స్ ను చిన్న మోతాదులో కలిగి ఉంటాయి.Medicinal properties of honey are benefits and side effects for health and beauty nutrition in Telugu

5. జీర్ణప్రక్రియకు తేనె ఒక సంరక్షణకారిణి(Honey is a preservative for digestion) :

  • మలబద్దకం(constipation), ఉబ్బరం(bloating), గ్యాస్ సమస్యలు(gas problems) వంటి వాటిని నియంత్రించడంలో తేనె ఒక దివ్యౌషదంగా ఉపయోగపడుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆరోగ్య సంరక్షిణిగా, అలెర్జీని తగ్గించే మందుగా ఎంతో ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ షుగర్ కు బదులుగా తేనెను వాడటం వల్ల శరీరంలో ఉత్పత్తి చేసే మైకోటాక్సిన్(mycotoxin) గటుల్లోని విషపూరిత ప్రభావాన్ని నియంత్రిస్తుందని గుర్తించారు.

6. చర్మం మరియు తలపై గల మాడుకు సంబంధించిన రోగాలకు తేనెతో నియంత్రణ(Control of skin and scalp diseases with honey) :

  • తేనెతో గల అనేక ఆరోగ్య ప్రయోజనాలతో చర్మ, మాడు సంరక్షణ ప్రధానమైనవి. అధిక తీవ్రతతో కలిగిన సమస్యలు ఉన్నట్లయితే, తేనెను ఆ ప్రదేశంలో అప్లై చేయడం వల్ల, వారం రోజుల్లోనే చుండ్రు(dandruff) తగ్గుతుంది, దురద(itching) నుండి ఉపశమనం కలుగుతుంది, జుట్టు రాలే సమస్య(hair loss problem) నుండి కూడా మెరుగుదల కన్పిస్తుంది. ఈ విధంగా క్రమం తప్పకుండ చేస్తే మళ్ళి ఆ ఇన్ఫెక్షన్ లక్షణాలు కన్పించవు.

7. పిల్లలకు ఉపశమనం కలిగి మంచి నిద్రను పొందడానికి తేనె ఉపయోగపడుతుంది(Honey is useful for soothing children and getting good sleep) :

  • తేనె వాడకం వల్ల పిల్లల్లో దగ్గు, కఫము నుండి బాగా ఉపశమనం పొంది రాత్రి పూట బాగా నిద్రపోతారని అధ్యయనాలు తేల్చాయి.
తేనెను ఎలా తాగితే విషంగా మారుతుంది(How does drinking honey become poison)..?Medicinal properties of honey are benefits and side effects for health and beauty nutrition in Telugu
  • తేనెను మీరు అలాగే పచ్చిగా సేవించాలి అనుకున్న అది సరైన పద్దతి అవుతుంది. లేదా తేనెను నీటితో తీసుకోవాలి అంటే, నీళ్లను మరిగించేటప్పుడు తేనెను వేయకూడదు. మీరు ఎంత గోరువెచ్చని నీరును తాగగలుగుతారో ఆ సమయంలో మాత్రమే తేనెను వేసి తాగాలి. తేనెను మరిగించకూడదు(honey should not be boiled). తేనె ఒక ఉష్ణ వీర్య పదార్థం(Thermal semen). కాబట్టి, తేనెను నేరుగా మంటపై వేడిచేయకూడదు. ఎందుకంటే, వేడి నీటిలో కానీ, వేడి పదార్థంలో కానీ తేనెను వేస్తే, అది “విషంగా(poisonous)” తయారు అవుతుంది. ఎవరికైనా, ఆ విధంగా తేనెను సేవించడం అలవాటు ఉంటె కనుక మనం విషం తాగుతున్నట్లే అని గమనించుకోవాలి అని సద్గురు చెప్తున్నారు.Medicinal properties of honey are benefits and side effects for health and beauty nutrition in Telugu
  • తేనెను గోరువెచ్చని నీటితో కలిపి పడగడుపున తాగితే, బరువు(weight) తగ్గుతారు. ఇందులో నిమ్మరసం, మిరియాల పొడి, తేనె వేడి నీటిలో కలిపి తాగితే బరువు తగ్గడమే కాదు, కడుపులో గ్యాస్ సమస్య కూడా తగ్గుతుంది.
  • తేనెను గోరువెచ్చని పాలతో సేవిస్తే, బరువు పెరుగుతారు.
  • తేనెను వేడి వాతావరణంలోను, ఎండాకాలంలోనూ పరిమితంగానే వాడాలి.( తేనెలో రకరకాల పువ్వుల మకరందాల అంశ ఉంటుంది. వీటిల్లో విష పుష్పాల సైతం ఉంటాయి.)
  • తేనెను శుద్ధి చేయకుండా వాడకూడదు. దీనిలో అనేక సూక్ష్మ జీవులు ఉంటాయి. తేనెలో “బొటులినియం ఎన్దోసఫోర్స్(Botulinum Endosafors)” అనేది చిన్నపిల్లలకు హాని చేయును. 1 సంవత్సరం పిల్లలకు అసలే వాడకూడదు. “తుతిన్(Tutin)” అనేది విషపదార్థం. శరీరానికి మంచిది కాదు.
చర్మం మరియు జుట్టు యొక్క సౌందర్య పోషణకు తేనె చేసే అద్భుతాలు(Miracles of honey for skin and hair beauty nutrition) :
    1. జుట్టుకు తేనె రాస్తే తెల్లబడుతుంది అనేది మన పెద్దవాళ్ళ హెచ్చరిక ఎంతమాత్రం నిజం కాదు. తేనె వల్ల పొడి బారిన జుట్టు మృదువుగా అవుతుంది. పొడి జుట్టుకు తేనె, మందారం కలిపి అప్లై చేస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.
    2. చర్మంలోని తేమ గుణాన్ని పెంపొందించే శక్తి తేనెకు ఉంటుంది.
    3. పాలు, తేనెల మిశ్రమాన్ని లేదా సెనగపిండిలో తెల్లసొన, తేనె కలిపి చర్మానికి, ముఖానికి పట్టిస్తే, అవి కాంతివంతంగా మెరుస్తాయి.
    4. మొటిమలు(pimples) ఉన్న చోట తేనె రాసి ఒక అరగంట తర్వాత వెచ్చని నీటితో, తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. మొటిమలు తగ్గుముఖం పడుతాయి.
    5. తేనె మన పగిలిన పెదాలని కూడా సంరక్షిస్తుంది.
    6. తేనెలో పొడి చేసిన చక్కరను కలిపి, రోజుకు ఒకసారి సాయంత్రం సమయంలో కొద్దిగా అప్లై చేసి మసాజ్ లా చేసి కడుక్కుంటే సరి, ముఖంపై ఉన్న దుమ్ము తొలగి, కాంతివంతంగా తయారు అవుతుంది.Medicinal properties of honey are benefits and side effects for health and beauty nutrition in Telugu
తేనె కల్తీ అవుతుందా..(Can honey be adulterated)? :
  • తేనె నిజమైనది అవునా కాదా? తెలుసుకోవాలి అంటే, ఒక స్పూన్ తేనెను తీసుకొని నీటిలో వేయాలి. అది “త్వరగా కరిగిపోతే మంచి తేనె కాదు”. సరిఅయిన, “ఒరిజినల్ తేనె నీటిలో ఆలస్యంగా” కరుగుతుంది.

    తేనె ఒకప్పుడు అడవుల్లో మాత్రమే లభించేది. కానీ, ఇప్పుడు పట్టణాల్లో అది కూడా ఇళ్ల పెరడులో కూడా తయారు అవుతుంది. ఇలా కృత్రిమంగా జరిగే ఈ తేనెటీగల పెంపకం. తేనె సేకరణ వల్ల తేనె పట్టుల్లో లభించే తేనె ప్రమాణం క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఇక అడవుల్లో లభించే తేనె సంగతి సరేసరి. ఇప్పటికి సగానికి క్షీణించిన ఈ “అడవి తేనె” మరి కొన్ని సంవత్సరాలు గడిస్తే కనుమరుగు అయిపోతాయనే  భయాన్ని “ప్రకృతి ప్రేమికులు(Nature Lovers)” వ్యక్తం చేస్తున్నారు.Medicinal properties of honey are benefits and side effects for health and beauty nutrition in Telugu

    ప్రకృతి ప్రసాదించిన సహజసిద్దమైన ఔషధం ఈ తేనె. తేనెలో ఉండే ఔషధ గుణాలు అన్ని ఇన్ని కావు. మరి అలాంటి ఔషదం నేడు విషంగా మారిందా? అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు. అన్ని కంపెనీల తేనెలు ఒకేలా ఉండవు అని చెపుతున్నాయి. “ప్యూర్ హనీ(Pure Honey)” అని విక్రయిస్తున్న తేనెలో అధికశాతంలో యాంటీబయోటిక్స్ వాడుతున్నారని, వీటి వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని “సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(Centre for Science and Environment)” హెచ్చరిస్తోంది.

     భారతీయ కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసే తేనెలో మాత్రమే యాంటీబయోటిక్స్ వీలైనంత వరకు నియంత్రిస్తున్నాయి. ఇందుకు కారణం, ఐరోపా, అమెరికా వంటి దేశాల్లో తేనె ఉత్పత్తులకు కఠినమైన, నిర్దిష్టమైన నిబంధనలు ఉంటాయి. కానీ మన దేశీయ మార్కెట్లో విక్రయించే తేనె ఉత్పత్తులకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేవు. విదేశీ మార్కెట్లో విడుదల చేసే తేనె ఉత్పత్తుల్లో నిర్ణీత యాంటీబయోటిక్స్ వాడాలని షరతులు పెట్టింది భారత్ ఎగుమతుల తనిఖీ కౌన్సిల్(ఈఐసి). కానీ, మన దేశంలో ఇవేవి ఉండవు. .

ముఖ్య గమనిక : తేనెటీగలు, తేనె అనగానే మనకు అడవిలోనే దొరుకుతుంది అని తెలుసు..ఈ ఆధునిక కాలంలో కృత్రిమంగా జరిగే తేనెటీగల పెంపకం అనేది చేస్తున్నారు..అడవులు అంతరించిపోతుంటే, ఈ ఆలోచన కూడా సరియైనది అవుతుంది కదా! అందుకే, ప్రతిఒక్కరిలో అవగాహన రావడంతో పాటుగా, ఎవరికీ వీలైనంతగా వారు తేనెటీగల పెంపకం అనేది కనుమరుగవ్వకుండా చూసుకోవాల్సిన భాద్యత ఉంది అని గమనించుకోవాలి..ఇలా చేయగలిగితే, అందరి కృషి ఫలితమే, అమృతప్రాయమైన, ఆరోగ్యప్రదాయిని అయిన తేనెను సంరక్షించుకొని, అభివృద్ధి చేసుకున్న వాళ్ళం అవుతాము అని  గ్రహించుకోవాల్సి ఉంటుంది.. 

తేనెతో దుష్ప్రభావాలు(Side effects with honey) :

    తేనెను అధికంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం అవుతుంది. మలబద్దకం ఏర్పడుతుంది, జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది, తలనొప్పి, కడుపులో గ్యాస్ ఏర్పడడం, ఆకలి మందగించడం, బలహీనత, వికారం సమస్యలు రావొచ్చు. రోగనిరోధకశక్తి కోసం తేనెను తీసుకోవడం సరి..కానీ, తేనెను అవసరానికి మించి తీసుకునే అలవాటు మానుకోమంటున్నారు. లేదంటే, కలిగే నష్టాలను చూడాల్సి వస్తుంది..

  1. ఊబకాయం(Obesity) : 1 టీస్పూన్ తేనెలో 64 కేలరీలు ఉంటాయి. తేనెను అతిగా వినియోగిస్తే, ఇది మీ బరువును పెంచుతుంది.
  2. దంతాలు(the teeth) : తేనెలో ఉండే తీపి, నోటిలో బాక్టీరియాను అధికమయ్యేలా చేస్తుంది. దీనితో దంతాలకు హానికరం మరియు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
  3. జీర్ణక్రియ(Digestion) : మన శరీరంలోని జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉండాలంటే, తేనెను పరిమిత స్థాయిలో మాత్రమే తీసుకోవాలి. లేదంటే, కడుపునొప్పితో పాటు, జీర్ణ సమస్యలు తెలెత్తుతాయి.
  4. ఎలర్జీలు(Allergies) : కొందరికి తేనె అంటే ఎలర్జీ ఉండవచ్చు. తేనె వినియోగానికి దూరంగా ఉండడం మంచిది.
ముగింపు(conclusion) :

     తేనెలోని గుణాలను తెలుసుకున్నాము. ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది తెలుసుకున్నాము. అందుకే, ఎన్నో  పోషకాలతో కలగలిసిన స్వచ్ఛమైన “తేనె”ను ఆరోగ్య ప్రదాయిని అనడంలో ఎటువంటి సందేహం లేదు కదా! ఈ రోజుల్లో అనేక వైద్య శాస్త్ర పరిశోధనలు తేనె నుండి కలిగే ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. కానీ, మన పూర్వీకులు చేసిన ఎన్నో పరిశోధనల తర్వాతే, తేనె నుండి మనం ఎన్నో ప్రయోజనాలను పొందగలం అని నిర్థారించారు.

      దీనిబట్టి చూస్తే, ఒక స్వచ్ఛమైన తేనెను మన పూర్వీకులు ఎప్పటినుండో, తేనె నుండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకొని, ఒక అవగాహన సామర్థ్యంతో మాత్రమే తీసుకోవడం జరిగింది. అంతేకానీ, తేనె ఒక అమృతంలాగా ఉంది అని గుడ్డిగా నమ్మి సేవించలేదు అని తెలుస్తుంది. అలాగే, అప్పటికాలంలో ఉన్న స్వచ్ఛమైన, కాలుష్యరహితమైన వాతావరణమే కారణం అయి ఉంటుంది. తేనెటీగలు సేకరించే మకరందం కూడా అంత స్వచ్ఛమైనదిగా ఉంది కాబట్టి, తేనెపట్టు నుండి తీసిన తేనె ఎంతో మాధుర్యాన్ని సంతరించుకునేది..

     ఈ రోజుల్లోని వాతావరణం ఎక్కడ చుసిన కాలుష్యహితంగానే కన్పిస్తుంది. ఏ చిన్న మొక్క..పువ్వును కూడా వదలకుండా కాలుష్యం అనేది కప్పి పడేసింది. ఇక మకరందం ఎలా కాలుష్యం అవ్వకుండా ఉండగలదు ?. అందుకే, అప్పటి తేనె రుచి, ఇప్పటి తేనె రుచికి చాలా తేడా ఉంది అని కూడా పెద్దలు అంటున్నారు..అందులోను తేనెను అమ్మే విక్రయదారుల తెలివి ఎలా ఉంది అంటే, అసలు మనం సేవించేది తేనె నేనా ?  ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామా? లేదా ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుంటున్నామా? ఏది మనకు అర్ధం కానీ స్థితిలో మనల్ని పడేస్తున్నారు..అంతగా తేనెను కల్తీ అనేది జరుగుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

     అతి ముఖ్యముగా, మనం తెలుసుకోవాల్సింది..తేనెపట్టు నుండి తీసిన తేనెను వెంటనే అమ్మడం చేస్తుంటారు. మీకు వీలైనంతగా ప్రయత్నించి, అక్కడి నుండి తీసుకుంటే కొంతలో కొంత సహజమైన ఔషధగుణాలు కలగలిసిన అమృతమైన తేనె రుచిని మనం ఆస్వాదించడానికి వీలు అవుతుంది. లేదంటే, ఏదైనా బ్రాండ్ తేనెను తీసుకునేప్పుడు పరీక్షించుకోండి..తేనెలోని ఎన్నో రకాలు, ఎన్నో రుచులు కొంతమందికి పడకపోవచ్చు, పెద్ద సమస్యగా ఇబ్బంది కలిగించవచ్చు. ఈ పరిస్థితిని ఎవరికివారు గుర్తించగలగాలి.

     తేనెతో ఎలాంటి ఇబ్బంది అనిపించకపోతే..రోజుకు ఒక్కరికి 1 టీస్పూన్ తేనె తీసుకోవడం సరిపోతుంది..దీనికి మించి ఎంతైనా సరే , మాకు నచ్చినట్లు నాలుక రుచికి ఎంత కావాలి అనిపిస్తే అంత తినేస్తాము అంటే మాత్రం అతి లేదా అధికం అనేది ఎందులోనూ పనికి రాదు అని తెలిసిందే..కదా! తేనె నుండి మన ఆరోగ్యానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే వైద్యుడిని సంప్రదించే ముందు..తేనె లాంటి అమృతాన్ని తగు మోతాదులో తీసుకోకపోతే, అది విషంతోనే సమానం అంటారు అని అందరు వాడే పదమును గుర్తు చేసుకుంటే చాలు..మన ఆరోగ్యాన్ని మనమే ఒక అవగాహనతో రక్షించున్నవాళ్ళం అవుతాము..

 

Add Comment