మారేడు(బిల్వం)చెట్టు రూపంలో కొలువై ఉన్న ఆ”పరమశివుడు” ఆరోగ్యప్రదాతగా, సకల వైభోగాలను అనుగ్రహిస్తున్నారు.|Lord Shiva is giving us all the blessings and health from the Maredu tree in Telugu.

బిల్వ పత్రం(Bael patra) అనగా ఏమిటి(What is Bael Patra)?

      ఈ బిల్వవృక్షం యొక్క శాస్త్రీయ నామం “మారేడు”. మారేడు అనగా “మా రాజు”. “మా-రేడు” తెలుగులో రాజు-ప్రకృతి, రేడు-వికృతి. ఆ చెట్టు పరిపాలకురాలు, అన్నింటిని ఇవ్వగలదు. ఎందుకంటే, ఈశ్వరుడే ఈ చెట్టు రూపంలో కొలువై ఉన్నారు. ఆ త్రినేత్రుడు, త్రిగుణాతీతుడు, మహాదేవుడు అయినటువంటి “పరమశివుడి”కి బిల్వపత్రం అంటే “బహుప్రీతి”.

     మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారంగా, ఎన్నో వృక్షాలను పవిత్రమైనవిగా భావిస్తారు. అలాంటి వృక్షాలకు ప్రత్యేక పూజలు చేసి, దైవ సమానంగా కొలుస్తారు. ఇలాంటి వృక్షాలలో ఎంతో ముఖ్యమైనది “మారేడు చెట్టు”. ఈ మారేడు ఆకు మూడు ఆకులుగా కలిసి “ఒకే ఈనే” లాగ ఉంటుంది. కాబట్టి, దీనికి “బిల్వము” అని పేరు వచ్చింది. దీన్ని పరమశివుని యొక్క మూడు కన్నులను సూచిస్తుంది. “జైనులు(Jains)” కూడా ఈ బిల్వపత్రాన్ని శుభప్రదంగా భావిస్తారు. 23 వ తీర్థంకరుడైన “పార్శవంతుడు” ఈ చెట్టు కింద మోక్షం పొందాడని నమ్ముతారు.

 

“త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ  త్రియాయుధం ! త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వము శివార్పణం” ! అని తలుస్తాము.

Lord Shiva is giving us all the blessings and health from the Maredu tree in Telugu

శ్లోకం : “బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం

అఘోర పాపసంహారం ఏక బిల్వ శివార్పణం”.

బిల్వపత్రంను ఈశ్వరుడికి ఎందుకు సమర్పిస్తాము(Why do we offer Bilvapatra to God)?

      ఏకబిల్వ పత్రంలోని మూడు రేకులలో ఎడమవైపు ఆకు “బ్రహ్మ(Brahma)” అని, కుడివైపు ఆకు “విష్ణువు(Vishnu)” అని, మధ్యఆకు “సదాశివుడని(Sadashiva)” పురాణాలు చెపుతున్నాయి. ఈ మారేడు దళం “ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞ్యానశక్తి“కి సంకేతం.

       ఈ బిల్వ వృక్షం సాక్షాత్ “శివ స్వరూపం” అని పురాణాలు తెలిపే కథల ద్వారా మనకు అర్ధం అవుతుంది. శివుడుకి ఎంతో ఇష్టమైన ఈ మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని ప్రతీతి. శివారాధన చేయడం కోసం “బిల్వ పత్రం లేదా మారేడు పత్రం”ను మన సంకల్పాలు నెరవేరడానికి సమర్పించుకోవడం అనేది మనము అన్ని శివాలయంలో చూస్తూనే ఉంటాము. ఈ మారేడు దళాలు లేనిదే “శివార్చన” పూర్తి కాదు అంటారు. హిందువులకు మారేడు వృక్షం అంత పవిత్రమైనది, సర్వశ్రేష్టమైనది మరియు శివ పూజకు అతి ముఖ్యమైన ఆకుగా ఈ “బిల్వపత్రం” ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ బిల్వపత్రం పూజకు ఉపయోగించడానికి కారణం ఒకటి దైవ రహస్యం, మరియు దైవ అనుగ్రహం అయితే, మనకు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగించే శక్తి కలిగి ఉంది అని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు.

“మారేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు” అని తెలుగు కవులు కూడా మారేడు పదాన్ని వివరించి చెప్పిన సందర్భాలు సాహిత్యంలో చాలా చోట్ల ఉన్నాయి.Lord Shiva is giving us all the blessings and health from the Maredu tree in Telugu

బిల్వపత్రం యొక్క ఔషధ గుణాల ప్రాముఖ్యత(Importance of Medicinal Properties of Bilva Patra) :

  • మారేడు చెట్టు నుండి వచ్చే గాలి శరీరానికి సోకడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. వ్యాధులు దరి చేరనివ్వదు. శరీరాన్ని శ్రేష్ఠముగా ఉంచుతుంది.
  • ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ బిల్వ వృక్షం యొక్క పండులో విటమిన్ సి, ఏ ,రిబోప్లావిన్, క్యాల్షియం, పొటాషియం, ఫైబర్,విటమిన్ బి1, బి6, బి12 వంటి విటమిన్లు, మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరం యొక్క మొత్తం పెరుగుదలను మరియు అభివృద్ధికి అవసరం.
  • ఆయుర్వేద ప్రకారం 3 దోషాలు ఉన్నాయి. వట్ట, పిట్ట మరియు కఫా. ఈ బిల్వపత్రం వినియోగం అనేది మూడు దోషాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
  • బిల్వపత్రం యొక్క పండులో యాంటీఆక్సిడెంట్లు కారణంగా, విరేచనాలు, వాంతులు వంటి కడుపు సంబంధిత వ్యాధులను నయం చేసే భేది మందు లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది.
  • బిల్వపత్రం వినియోగం అనేది మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలు మరియు కొలెస్ట్రాల్ వంటి జీవనశైలి వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుంది.
  • మారేడు వేరు రసం తీసి, తేనెతో కలిపి తీసుకుంటే, వాంతులు వెంటనే తగ్గుతాయి. ఈ రసాన్ని రోజు తాగడం వల్ల కూడా అనారోగ్యాలు దరి చేరవు.
  • బిల్వపత్రాలను దంచి కళ్లపై లేపనంగా వేసుకుంటే, కంటి దోషాలు ఏమైనా ఉంటే, నశిస్తాయి. బిల్వ చూర్ణం అతిసారాన్ని తగ్గిస్తుంది.

Lord Shiva is giving us all the blessings and health from the Maredu tree in Telugu

 

బిల్వపత్రం మన చర్మతత్వానికి కలిగించే ప్రయోజనాలు(Benefits of Bilva Patra for our skin) :

  • బిల్వపత్రాలను నూరిన రసంతో శరీరానికి పూయడం ద్వారా చెమట వాసన రాదు.
  • బిల్వపత్రం యొక్క రసం తాగడం వల్ల జుట్టు రాలడం సమస్యను అదుపులో పెట్టగలగడంలో సహాయపడుతుంది. మరియు కఠినమైన జుట్టును, పొడి జుట్టును మృదువుగా చేస్తుంది.
  • బిల్వఆకుల రసాన్ని జుట్టుకు పట్టించి, ఒక 30 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే, జుట్టు మెరుస్తుంది, నల్లబడుతుంది.
  • బిల్వపత్రం యొక్క మిశ్రమం మన చర్మం పై వచ్చే తెల్లటి మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.

మారేడు చెట్టుకు ఉన్న ప్రత్యేకతలు(Characteristics of maredu tree) :

  1. బిల్వములోని ముందు భాగము నందు అమృతమును, వెనుక భాగమున యక్షులను కలిగి ఉండుట చేత, బిల్వపత్రం ముందు భాగంను శివుని వైపు ఉంచి పూజించాలి.
  2. సాధారణంగానే వృక్షాలు పూలు పూసి, కాయలు కాస్తూ ఉంటాయి. కానీ మారేడు చెట్టు పువ్వు లేకుండా కాయలు కాస్తుంది.
  3. ఏదైనా పుష్పాలతో పూజ చేసేటపుడు, తొడిమ ను తీసివేసి పూజ చేస్తాము. కానీ మారేడు దళాలతో పూజ చేసేటపుడు తప్పనిసరిగా తొడిమలు ఉండాలి.
  4. పరమశివునికి ప్రీతికరమైన బిల్వవృక్షం కు ప్రదక్షణ చేస్తే, 3 కోట్ల దేవతలకు ప్రదక్షిణ చేసిన పుణ్యం లభిస్తుంది.
  5. శివార్చనకు మూడు రేకులతో ఉండే పూర్తి బిల్వదళమునే ఉపయోగించాలి. ఒకసారి కోసిన బిల్వపత్రం సుమారు 15 రోజుల వరకు పూజ అర్హతను కలిగి ఉంటుంది. వాడిపోయిన కూడా ఎటువంటి దోషం ఉండదు కానీ, మూడు రేకులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.
  6. మారేడు దళానికి ఉన్న ఈనే శివలింగానికి తాకినప్పుడు మన ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.
  7. మారేడు దళాలను కోసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. ఈ బిల్వపత్రాలను బుధవారం, శనివారం మాత్రమే కోయాలి. అమావాస్య, పౌర్ణమి, సోమవారం, మంగళవారం, మరియు సంక్రాంతి, శివరాత్రి వంటి పండుగల రోజు మారేడు దళాలను కోయకూడదు. అందుకే, ఈ దళాలను ముందు రోజు కోసి భద్రపరుచుకోవాలి. ఈ రోజు అర్చన చేసిన మారేడు దళాలను మరుసటి రోజు వాటిని కడిగి స్వామి వారికి అర్చన చేయవచ్చు అంటున్నారు.

ఇంట్లో బిల్వపత్రం చెట్టును ఏ విధముగా పెంచుకోవాలి(How to grow Bilvapatra tree at home)?

  1. ఈ మారేడు చెట్టు అనేది ఎలాంటి సందేహం లేకుండా మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు.
  2. ఈ బిల్వవనం అనేది కాశీక్షేత్రంతో సమానమైనది.
  3. ఈ మారేడు దళం గాలిని, నీటిని దోషరహితం చేస్తుంది.
  4. మన ఇంటి ఆవరణలో ఈశాన్య భాగమున మారేడు చెట్టు పెంచినట్లయితే ఆపదలు తొలగి, సర్వ ఐశ్వర్యములు కలుగును. తూర్పున ఉన్నచో సుఖప్రాప్తి, పడమర వైపు ఉన్నచో సుపుత్రసంతానము కలుగును. దక్షిణము వైపు ఉన్నచో యమబాధలు ఉండునని జ్యోతిష్య నిపుణులు చెపుతున్నారు.

  “మారేడు దళం లేదా బిల్వ పత్రం చెట్టు” శివుడికి ప్రీతికరం ఒక్కటే కాదు ఆ “ఈశ్వరుడి ప్రతి రూపమే” ఈ “బిల్వ చెట్టు” అని తెలుసుకున్నాము. బిల్వ చెట్టు మరియు ఆకుల నుండి మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది అని తెలిసినప్పటికి, బిల్వ చెట్టును పూజించడం అనేది అలవాటు చేసుకోవడం మరియు బిల్వ ఆకును ఆ శివుడికి సమర్పిస్తే చాలు “భోళాశంకరుడు” అని పిలువబడే శివుడు ఎన్నో సమస్యల నుండి విముక్తుల్ని చేయగలరు అని శాస్త్రాలు, జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. బిల్వ చెట్టుకు పూజ చేయడం, బిల్వ ఆకులతో అర్చన చేయడం అనే అర్ధం తెలియని వారికి దీని అంతరార్థం తెలుసుకొని, భారతీయ సంప్రదాయాలకు విలువ ఇవ్వడం అనేది ఒక్కటే కాదు, ఇలా చేయడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలను ఎంత స్థాయిలో కలిగిస్తుంది అనేది వైజ్ఞానిక పరంగా కూడా అర్ధం చేసుకోవచ్చు.

Add Comment