Best uses and side effects of Carom seeds provide to improve our Health in Telugu|మన ఆరోగ్య మెరుగుదలకు వాము అందించే ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

వాము యొక్క ఉపయోగాలు 

వాము మన భారతీయులకు చాలా సుపరిచితంగా తెలిసిన  గొప్ప ఓషధి. వాము ఈజిప్టుకు చెందిన సుగంధ ద్రవ్యం. కానీ, వామును భారత ఉపఖండంలో అందరి ఇళ్లల్లో సాధారణంగా వంటకాలలో ఉపయోగించే మసాలా దినుసులలో ఒకటిగా మారింది.  వాము లేదా ఓమ ను సంస్కృతంలో “దీప్యక, ఉగ్రగంధ” అని, హిందీ లో “అజ్వాయిన్” అని పిలుస్తుంటారు. వాము మొక్క అనేది ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. మొక్క యొక్క పువ్వులు గుత్తులు గుత్తులు గా ఉంటాయి. ఈ పువ్వుల నుండే విత్తనాలు వస్తాయి.

దీని శాస్త్రీయ నామంట్రాకీస్పెర్మమ్ కాప్టికమ్( Trachyspermum copticum)”. 

వాము చాలా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయ్ అని తెలుస్తుంది. వామును భారతదేశమంతటా పండిస్తారు. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా మధ్యప్రదేశ్, గుజరాత్. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో సాగు చేస్తారు. వాము చలి వాతావరణంలో బాగా పెరుగుతుంది. ఇది తెల్లని పూలు కలిగిన చిన్న ఏక వార్షికపు మొక్క. వాము యొక్క చేదు రుచి సాధారణంగా థైమ్(ఒక రకమైన వాము జాతికి చెందిన మొక్క)తో పోల్చబడుతుంది. ఈ రెండు మూలికలు థైమోల్ అని పిలువబడే ఒక రసాయన పదార్థాన్ని కలిగి ఉంటాయి. వాము గింజల నుండి సుగంధ తైలాన్ని డిస్టిలేషన్ విధానం ద్వారా వేరుపరిచి థైమాల్ గా మార్కెట్ చేస్తుంటారు.

వంటింటి దినుసు వాము :

వామును  వంటకాల్లో ఉపయోగించేందుకు ఇది ఒక రకమైన దినుసు.  వాము జీలకర్రలా అనిపించినా వాము గింజ జీలకర్ర కంటే చిన్న పరిమాణంలో ఉంటుంది. దీని రుచి ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నది అయినా వాము చేసే మేలు చాల గొప్పది అంటారు. వాము గింజల నుండి వాము ఆవశ్యక నూనె ను స్టీమ్ డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా సంగ్రహిస్తారు.

వామును ఎలా ఉపయోగించాలి(how to use carom seed)?

వివిధ రకాల వంటకాలలో మనం వామును ఒక మసాలా దినుసుల రూపంలో ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వామును ఘాటైన రుచి కోసం వేయించి లేదా ఎండబెట్టి ఉపయోగిస్తారు. వామును కొంచెం నోట్లోకి తీసుకొని నమలడం అందరికి అంతగా ఇష్టం ఉండదు. ఘాటును తట్టుకోలేరు. కాబట్టి వామును పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. వాము నూనె కలిగి ఉన్న  వైద్య ప్రయోజనాల వల్ల పరిమళవైద్యం(aromatherapy)లో గొప్పగా వినియోగిస్తారు. అంతేకాకుండా వాముతో వివిధ రకాల మాత్రలు మరియు గుళికలు తయారుచేసి వాణిజ్యపరంగా అందుబాటులోకి తెస్తున్నారు.

రోజుకు తెసుకోవాల్సిన వాము మోతాదు(how much carom can be taken per day)

సాధారణంగా ప్రతిరోజు వామును 2గ్రా మోతాదు తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు

Best uses and side effects of Carom seeds provide to improve our Health in Telugu

. కానీ, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వామును సేవించాలి అనుకుంటే ఆయుర్వేద వైద్యుడితో విచారించడం మంచిది.

అయితే దీనిని పొడి రూపంలో కంటే కూడా, ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో వాము పొడిని కలిపి సేవిస్తూ ఉంటె కలిగే లాభాలు చూద్దాం..

  • ప్రతిరోజు ఉదయాన్నే వాము నీటిని తాగడం వల్ల గుండెల్లో మంట ప్రభావం, అజీర్ణం సమస్య, అసిడిటీ లాంటి సమస్యలను సులువుగా ఎదురుకోవొచ్చు. 
  • వాము నీటితో శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఆకలిని కూడా పెంచగలదు వాము నీరు.
  • జీర్ణాశయంలో ఉండే అసౌకర్యంను తొలగించి, జీర్ణక్రియ వేగమును పెంచుతుంది. ఈ క్రమంలో శరీరంలో ఉండే వ్యర్థాలు తొలగిపోతాయి. శరీరం బరువు పెరగకుండా ఉండగలదు.
  • సీజనల్ గా వచ్చే వ్యాధులు జ్వరం, జలుబు, ఫ్లూ వంటివి తగ్గించడానికి వాము నీళ్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఈ నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధులు రాకుండా నివారిస్తుంది. దీనితో పాటుగా రక్తం సరఫరా మెరుగుపడుతుంది. హైబీపీ ని తగ్గిస్తుంది.
  • గుండెజబ్బులు రాకుండా నివారించగలుగుతుంది. యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కూడా వాము కలిగి ఉంటుంది. కాబట్టి బాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా అరికడుతుంది.
  • కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా వాము నీరు తగ్గించగలదు. అలాగే రక్తనాళాల్లో ఉండే అడ్డంకులను తొలగించి, గుండెకు సంబంధించి ఆటంకాలను ఎదుర్కొంటుంది.
  • మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్లను సైతం వాము నీరును సేవిస్తూ ఉంటె సులువుగా కరిగించేస్తుంది. వాము నీటిని ఏ పద్దతిలో ఎలా తాగిన మంచి ప్రయోజనాలను మనం అందుకుంటాం..
  • వామును ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు వేసి కలిపి తాగితే వాంతులు తగ్గుముఖం పడుతాయి.
  1. జలుబు, తలనొప్పి కోసం వాము(carom seeds for cold ,headache) : ఆయుర్వేద వైద్యుల ప్రకారం, వాము పిత్తను తీవ్రతరం చేస్తుంది. అంటే శరీరానికి శక్తివంతమైన వేడిని ఇస్తుంది. అందువల్ల జలుబు యొక్క లక్షణాలను తగ్గించడం లో సహాయపడవొచ్చు. జలుబు, మైగ్రేయిన్ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చుస్తే సమస్య తీరిపోతుంది.
  2. ఉబ్బసం కోసం వాము(carom seeds for asthma) : వాము ఒక సమర్ధవంతమైన శ్వాస నాళాలను వదులు చేయు మూలిక మరియు వాణిజ్య ఔషధానికి సమానమైనది అని తెలిసింది. అందువల్ల, ఆస్తమా లక్షణాల కోసం వాము ఉపయోగకరమని చెప్పవొచ్చు. ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. వామును తీసుకొనే ముందు ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించడం మంచిది.
  3. బరువు తగ్గడం కోసం వాము(carom seeds for weight loss) : ఆయుర్వేద వైద్యుల ప్రకారం, వాము ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసి, గ్యాస్ మరియు అపానవాయువు వంటి జీర్ణ రుగ్మతలను తగ్గిస్తుంది. వాము యొక్క ఈ మూడు లక్షణాలు మీ బరువును తగ్గించడానికి సహాయపడవొచ్చు. కానీ అది ఆకలిని కూడా పెంచుతుంది.ఈ ఆకలి ని పెంచే లక్షణం వాము యొక్క బరువును తగ్గించే ప్రయోజనానికి వ్యతిరేకంగా ఉంది. ఏ రూపం లో అయినా వామును తీసుకొనేప్పుడు వైద్యుడిని సంప్రదించండి.
  4. జీర్ణక్రియ కోసం వాము(carom seeds for digestion) : వాము గ్యాస్ట్రిక్ యాసిడ్ స్రవించడాన్ని పెంచుతుంది మరియు కడుపు ప్రేగులలో ఆహరం యొక్క ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. అందువల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపర్చడానికి వాముకు ఖచ్చితమైన సామర్థ్యం ఉంది. వాము,మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకొని చూర్ణం చేసి, ప్రతి రోజు భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి.
  5. వాయువు కోసం వాము(carom seeds for gas, acidity) : గ్యాస్ నివారణ కోసం 500గ్రా వాముకు, 60 గ్రా రాతి ఉప్పు, నల్ల ఉప్పు, సాధారణ ఉప్పును 1:1:1 నిష్పత్తిలో జోడించడం ద్వారా ఒక సాంప్రదాయక మిశ్రమాన్ని తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని 1 చెంచా పొడిని గోరు వెచ్చటి నీటిలో తీసుకుంటే, గ్యాస్ ,వాంతులు మరియు వికారం యొక్క లక్షణాల నుండి ఉపశమనం పొందుతారు.ఆయుర్వేద ప్రకారం, వాము ఒక్కటి కూడా ప్రేగుల వాయువును తగ్గించడంలో సహాయపడుతుంది మరియు పొట్టలోని ఏ సమస్య అయినా చాల సులువుగా పరిష్కరించబడినట్లు అనిపిస్తుంది. అలాగే, 1స్పూన్ జీలకర్ర పొడి, 1స్పూన్ వాము పొడి, అర చెంచా అల్లం పొడి ని నీటిలో కలిపి తాగితే ఛాతిలో మంటలు తగ్గుతాయి. .
  6. కడుపు నొప్పి కోసం(carom seeds for stomach pain) : ఇటీవలి అధ్యయనాలు, వాము కాల్షియం చానెల్స్ ని అడ్డుకోవడం ద్వారా పనిచేస్తుందని సూచిస్తుంది. ఇది కడుపు బిగుతును తగ్గిస్తుంది. అంతేకాక, వాము యొక్క ఈ లక్షణం అతిసారం యొక్క లక్షణాలను తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటుంది అని పేర్కొంది. ఆయుర్వేద వైద్యులు, కడుపు నొప్పి ఉపశమనం కోసం వాము, అల్లం మిశ్రమాన్ని సూచిస్తారు.
  7. ఋతుక్రమము కోసం వాము(carom seeds for menstrual periods) : మీ కడుపులో ప్రేగులను క్లియర్ చేయడమే కాకుండా, మీ ఋతు చక్రంతో అద్భుతాలు చేయగల మరో మసాలనే ఈ వాము. ఒక గ్లాసు వేడి నీటి తో వామును మింగడం వల్ల గర్భాశయం సమర్థవంతంగా ఉత్తేజితమవుతుంది. ఇందులోని యాంటీ-స్పాస్మోడిక్ గుణాలు ఋతు తిమ్మిరి మరియు నొప్పులను నివారించడంలో కూడా సహాయపడతాయి. ఈ ప్రభావవంతమైన, సులభమైన మరియు గృహ-ఆధారిత పద్ధతులను అవలంబించడమే కాకుండా, వైద్యుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది. మీ ప్రత్యేక శరీర రకం మరియు స్థితిని బట్టి నిపుణుల నుండి వైద్య చికిత్స పొందడం చాలా ముఖ్యం. అంతేకాకుండా, సమస్య యొక్క మూల కారణాన్ని నిర్ధారించినప్పుడు మాత్రమే సమస్య సగం పరిష్కరించబడుతుంది.
  8. గర్భధారణ సమయంలో వాము(carom seeds during pregnancy) : ఈ మూలికలో గర్భస్రావాన్ని ప్రేరేపించడానికి 100% సామర్థ్యం లేదు. గర్భధారణ సమయంలో వాము యొక్క వినియోగం పుట్టిన పిల్లల్లో లోపాలకు కారణంగా గుర్తించబడింది.జంతువుల మీద జరిపిన ప్రయోగాలలో వాము ఎదిగే పిండంలో  శారీరక వికలములు కలుగజేసే కారణం ఆధారంగా పిండం కోసం వాము విషతుల్యమైనదని తెలుస్తుంది.
  9. పాలు ఇచ్చే తల్లుల కోసం(carom seeds for nursing mother) : నేషనల్ డైరీ రీసెర్చ్  ఇన్స్టిట్యూట్ వారు జరిపిన అధ్యయనాల ప్రకారం, వాము నీరు సమర్ధవంతమైన స్తన్యవృద్ది ఔషదంగా ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నారు. క్షీర గ్రంధుల నుండి పాల ప్రవాహాన్ని పెంచడానికి పాలు ఇచ్చే తల్లులు  వామును తరతరాలుగా ఉపయోగిస్తున్నారు. అంతేకాక వాములో కొన్ని ఫైటోఈస్ట్రోజెన్లు ఉండడం వాళ్ళ పాలు ఇచ్చే తల్లుల శరీర ఈస్ట్రోజెన్ తో కలుస్తాయని తెలుసుకున్నారు. వామును ఏ రూపంలో తీసుకున్న పాలు ఇచ్చే తల్లులు ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
  10. శిశువుల కోసం వాము నీరు(carom seeds water for babies) : శిశువుల్లో వాయువుతో నిండిన పొట్ట మరియు జలుబు లక్షణాల నుండి ఉపశమనం కలిగించేందుకు వాము నీరు ను ఉపయోగిస్తారు ఇది ఒక ప్రసిద్ధమైన పరిష్కారం. వామును ఆయుర్వేదంలో వేడిని కలిగించే మూలికగా  పేర్కొన్నారు. కానీ శిశువులు మరియు పిల్లల్లో వాము నీరు తీసుకోవడం అనేది ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ జరపలేదు. అందుకోసం మీ శిశువులకు వాము నీరు సేవింపజేసే ముందు ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించండి.
  11. నులి పురుగులకు వాము(carom seeds for stomach worms) : మన జీర్ణాశయ ప్రేగులలో పురుగులను అంతు పట్టించే వ్యతిరేక గుణం ఆయుర్వేద మందులో వాము కు కలిగి ఉంది. ఆయుర్వేద వైద్యులు అజ్వాన్ సత్(వాము సారం)ను సూచిస్తారు. వాము అద్భుతుమైన కోలినెర్జిక్(cholinergic)గా వ్యవహరిస్తారు. అవి పేగులలో కదలికను సరిచేసి పెంచుతుంది. దీని ద్వారా జీర్ణాశయం నుండి చాల సులువుగా పురుగులను బయటకి పంపించేస్తుంది.
  12. కీళ్ల వాపు కోసం వాము(carom seeds for arthritis) : కీళ్ల నొప్పులు, వాపులు, మంటలు, సలిపినట్లు ఉండడం ఇలాంటి ఏ పరిస్థితి ఉన్న “వాము నూనె” ను అప్లై చేయడంతో అద్భుతాలు మీరే చూస్తారు. అలాగే, ఆ ప్రాంతంలో వాము పొడిని నీటితో పేస్ట్ లా చేసి, పూస్తే నొప్పుల నివారణను అరికట్టవొచ్చు.
  13. దగ్గు కోసం వాము(carom seeds for cough) : వాము గొంతు కండరాలను విశ్రాంత పరిచి, దగ్గును తగ్గుముఖం పట్టేలాగా సహాయపడుతుంది. వాము ఒక సమర్ధవంతంగా పనిచేసే యాంటీస్పాంస్మోడిక్(antispasmodic) గా వ్యవహరిస్తారు. ఆయుర్వేద ప్రకారం, దగ్గు వచ్చినపుడు, వామును వేడి నీటితో కొంచెం తీసుకొని నమలాలి. వాముకు తమలపాకు కలిపి రాత్రిపూట నమిలితే రాత్రి దగ్గు రాదు. ఉదయం మరియు సాయంత్రం ఒక కప్పు వాము నీటిని తాగడం వల్ల కూడా దగ్గు తగ్గుముఖం పట్టేలా మంచి ఫలితం ఇస్తుంది.
  14. క్లీన్సింగ్ చర్మం(cleansing skin) : చర్మం పై మొటిమలు, మచ్చలు ఇలా ఏవి ఉన్న సరే వాము పొడిని కొంచెం తీసుకొని నీటితో పేస్ట్ ల చేసి ముఖానికి అప్లై చేసి, 15నిమిషాల తర్వాత కడిగేయాలి. మృదువైన చర్మం తో పాటు మంచి ఫలితాలను పొందుతారు.
  15. దోమలను తిప్పికొట్టుట(Mosquito repellent) : ఆవనూనె, వాము కలిపి మన ఇంట్లో ఉన్న కిటికీలు, తలుపులు, కార్డుబోర్డులు, మరియు మూలల దగ్గర అప్లై చేయాలి. దోమలు ఇంట్లోకి రావు. మంచి సువాసన కూడా వస్తుంది.
  16. తెల్ల జుట్టు తగ్గడం(To stop greying of hair) : వాము, కరివేపాకులు, ఎండుద్రాక్షలు, చెక్కర ను ఒక కప్పు నీటిలో వేసి మరిగించి, ప్రతిరోజు తాగుతూ ఉండండి. కొన్ని రోజుల తర్వాత ఫలితం కన్పిస్తుంది.
వాము దుష్ప్రభావాలు(carom seeds side effects)
  • గర్భిణీ స్త్రీలు వాము మూలిక ను నివారించాలి. ఎందుకంటే, వాము ఒక గర్భస్రావ కారకం. పిండం అభివృద్ధిని అడ్డుకుంటుంది.
  • పూర్తి ప్రయోజనాలను పొందేందుకు గర్భధారణ సమయంలో అజ్వైన్‌ను సరైన మొత్తంలో తీసుకోవడం మంచిది. అయినప్పటికీ, అధిక పరిమాణంలో తినడం కొన్ని దుష్ప్రభావాలను ప్రేరేపిస్తుంది.
  • గర్భధారణ సమయంలో అజ్వైన్‌ను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని తీవ్రతరం చేయవచ్చు, ఇది గర్భధారణపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ పరిమాణంలో అజ్వైన్ తినడం వల్ల కూడా తల తిరగడం మరియు వికారం పెరగవచ్చు.
  • వాము ఒక థైమోల్ అనే రసాయన పదార్ధం కలిగి ఉంటుంది. థైమోల్ కొంతమందిలో తేలికపాటి చర్మ దద్దుర్లు కలిగిస్తాయి. థైమోల్ అధిక వినియోగం మైకం, వికారం మరియు వాంతులు కలిగించే అవకాశం ఏర్పడుతుంది. 
  • దీర్ఘకాలికంగా గ్యాస్, గుండెల్లో మంట, సమస్యలతో బాధపడే వారు వామును అధికంగా తీసుకుంటారు. ఇలా అధికంగా తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గిచడానికి బదులు యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

Add Comment