జీలకర్ర మన ఆరోగ్య మెరుగుదలకు ఎన్నో ఔషధ సద్గుణాలను అందిస్తూ మేలు కలిగించే గొప్ప మూలిక దినుసు|Medicinal properties and benefits of cumin seeds for our health in Telugu

జీలకర్ర యొక్క ఔషధగుణాలు మరియు ఉపయోగాలు(Medicinal properties and uses of cumin) :  

      మనం ఇంట్లో వంట మొదలుపెట్టగానే కావాల్సింది “జీలకర్ర”. కూరల్లో పోపు పెట్టడానికి వాడే ఈ జీలకర్రతోనే వంట అద్భుతం అనిపించేంత సువాసనను, రుచిని అందిస్తుంది. జీలకర్ర లేనిది వంట ముందుకు సాగదు. జీలకర్ర లేకుండా వంట చేసిన అంత రుచిని కోల్పోయినట్లుగా ఉంటుంది. అయితే, ఈ ఆధునిక కాలంలో మనం తెలుసుకోవాల్సింది..జీలకర్ర కేవలం వంటల్లో రుచి కోసమేనా? ఆరోగ్య ప్రయోజనాల కోసం ఏమైనా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయా అనేది?..Medicinal properties and benefits of cumin seeds for our health in Telugu

      ప్రపంచంలోని సుగంధ ద్రవ్యాలలో జీలకర్రకు ప్రత్యేక స్థానం ఉంది. జీలకర్రను చరిత్రలోనే తొలిసారిగా పండించిన మూలిక. దీని శాస్త్రీయ నామం “క్యుమినమ్ సిమినమ్”. జీలకర్ర అనేది పండ్లతో కూడిన పుష్పించే మొక్క మరియు ఆ పండ్లు ఎండిన తర్వాత జీలకర్ర విత్తనాలు వస్తాయి.Medicinal properties and benefits of cumin seeds for our health in Telugu

జీలకర్ర అనగానే గుర్తుకు వచ్చేది, జీర్ణక్రియను వృద్ధి చేస్తుంది అని. విషపదార్థాలను తొలగిస్తుంది అని..సాధారణంగా పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాటను వినిపిస్తూనే ఉంటారు. మన కడుపు అసౌకర్యంగా ఉందా? జీర్ణ సమస్యలు తలెత్తుతున్నాయా? అయితే, “వెంటనే జీలకర్రను నమలండి..జీలకర్ర నీళ్లు తాగండి” అని.

      జీలకర్రను ప్రాచీన కాలం నుండి ఉపయోగించబడుతుంది. “జీలకర్ర” నల్ల మిరియాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా 2 వ స్థానంలో ప్రసిద్ధిచెందిన మసాల దినుసు. రోజువారీగా మనం వంటల్లో వాడుతూనే ఉంటాము. జీలకర్ర 2 రూపాల్లో లభిస్తుంది. రోజు ఉపయోగించే “తెల్ల జీలకర్ర” మరియు “నల్ల జీలకర్ర” దీనినే “షాజీరా” అంటారు. ఈ రెండింటికీ ఔషధ గుణాలు చాలా ఉన్నాయి.

      జీలకర్ర తూర్పు మధ్య ప్రాంతం మరియు భారతదేశానికి చెందినది. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల ముందు మధ్యపాశ్చ(Midwest) దేశాల వాళ్ళు దిగుమతి మొదలుపెట్టుకున్నారు. అయితే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించబడుతుంది.

Medicinal properties and benefits of cumin seeds for our health in Telugu

జీలకర్రలో ఉండే పోషకాలు(Nutrients in Cumin) :

  • జీలకర్రలో విటమిన్లు, క్యాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి.
  • ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఎస్సెన్షియల్ ఆయిల్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
  • క్యాన్సర్ కారక నిరోధకాలు కూడా కలిగి ఉంటాయి.
  • మనకు రోజు అవసరమయ్యే ఫైబర్ లో నాలుగో వంతు ఒక గ్రాము జీలకర్రలో లభిస్తుంది.
  • జీలకర్రలో ఉండే మెగ్నీషియం, మన శరీర విశ్రాంతికి ఎంతో తోడ్పడుతుంది.

Medicinal properties and benefits of cumin seeds for our health in Telugu

జీలకర్ర అందించే ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits of Cumin) :

     ఆహరం జీర్ణం కాకపోయినా, విరేచనాలు అవుతున్నా, కడుపు ఉబ్బరంగా ఉన్నా జీలకర్ర బాగా పని చేస్తుంది. జీలకర్ర కంటి సమస్యలతో పాటుగా మన శరీరంలోని ఎన్నో సమస్యలకు ఔషధంగా ఉపయోగపడుతుంది.

  • జ్ఞాపక శక్తిని పెంచుతుంది(Improves Memory) : జీలకర్ర గింజలను నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. ఆ తర్వాత నాని ఉన్న జీలకర్రను తినాలి. దీనితో మతిమరుపు సమస్య దూరం అవుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర తినడం వల్ల, నాడీ వ్యవస్థ ప్రభావంతంగా పని చేయడంలో, జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో జీలకర్ర ఎంతో మేలు కలిగిస్తుంది. జీలకర్ర మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించి, దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలకు మెరుగైన పోషణను అందించడానికి సహాయపడుతాయి.
  • మానసిక ఒత్తిడి(Mental stress) : జీలకర్రలో ఉండే “విటమిన్ బి” మన శరీరానికి కావలిసిన శక్తిని అందిస్తుంది. కాబట్టి, ప్రతి రోజు జీలకర్రతో చేసిన టీ ని తీసుకుంటూ ఉండడం వల్ల ఎంతో మేలు చేస్తుంది.
  • మంచి నిద్రను అందిస్తుంది(Provides good sleep) : జీలకర్రలో ఉండే నూనెలు ఒత్తిడి, ఆందోళన తొలగిస్తాయి. జీలకర్రలో ఉండే “మెలటోనిన్(Melatonin)” నిద్రకు ఉపయుక్తమై హార్మోన్లను నియంత్రిస్తుంది. ఫలితంగా నిద్రలేమి సమస్యల నుండి దూరం చేసి, దీనికి కారణమైన మానసిక సమస్యలను తగ్గిస్తుంది.
  • రోగనిరోధక శక్తి(Immune Power) : రోజు ఉదయాన్నే జీలకర్ర వేసి మరగపెట్టిన నీళ్లను తాగుతూ ఉంటే, రోగనిరోధక శక్తి పెరిగి, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో చేరిన మలినాలను, ఫ్రీ-రాడికల్స్ ను తొలగించి, వ్యాధులను తట్టుకొనే శక్తిని పెంచుతుంది. దీనివల్ల దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
  • రక్తహీనతను దరి చేరనివ్వదు(Does not lead to anemia) : మన రక్తంలో హీమోగ్లోబిన్ తయారవడానికి కావలసిన ముఖ్యమైన పదార్థం “ఐరన్”. అయితే, మన ఆహారంలో జీలకర్రని చేర్చడం ద్వారా ఐరన్ ని పొందవచ్చు. శరీరంలో ఐరన్ తగ్గటం వల్ల రక్తహీనత(అనీమియా) వస్తుంది. ఇది ఎక్కువగా పిల్లల్లో, ఆడవాళ్ళలో, యుక్తవయస్సు వాళ్లలో ఎక్కువగా వస్తుంది.
  • జీర్ణవ్యవస్థలో సమస్యలు(Digestive problems) : జీలకర్ర నీటిని తాగడం అలవాటు చేసుకోవడం వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, అసిడిటీ, అజీర్తి, కడుపులో వికారం, కడుపులోని అల్సర్లు వదిలిపోతాయి. కిడ్నీలో రాళ్లు సైతం కరుగుతాయి. కడుపులో ఉండే నులిపురుగులు కూడా చచ్చిపోతాయి.
  • కడుపులో నులిపురుగుల నివారణ(Prevention of stomach worms) : మజ్జిగలో కాస్త ఇంగువను, జీలకర్ర పొడిని, సైంధవ లవణాన్ని కలిపి తీసుకుంటూ ఉంటే గనుక కడుపులో నులిపురుగులు సమస్య తగ్గుతుంది మరియు పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.
  • గుండె నొప్పులు తగ్గుటకు(To reduce heart pain) : జీలకర్రను కషాయంగా కాచి తాగుతూ ఉంటె గుండె జబ్బులు దరి చేరకుండా అరికట్టగలుగుతుంది. రక్తపోటును, మధుమేహంను అదుపులో ఉంచుతుంది. జీలకర్ర నీటిని తాగేవారికి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీంతో రక్తం సరఫరా మెరుగుపడటమే కాకుండా రక్తనాళాల్లో అడ్డంకులు తొలగి గుండె సమస్యలు రావు.
  • అలెర్జీ తగ్గుటకు(To reduce allergy) : శరీరంలో ఏర్పడే తామర, తల్లమచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఇలాంటి చర్మవ్యాధులను నివారించడానికి జీలకర్ర వైద్యం ఉపయోగకరంగా ఉంటుంది. జీలకర్ర అలెర్జీకి గొప్ప ఔషధం.
  • గర్భాశయ భాదలు తగ్గుటకు(To reduce uterine cramps) : జీలకర్రను నెయ్యిలో వేయించి, మెత్తగా పొడి చేసి ఉంచి, దీనిలో సైంధవలవణం లేదా ఉప్పును కలిపి 2 పూటలా తీసుకుంటే, గర్భాశయ సమస్యలు నెమ్మదిస్తాయి. ఈ మిశ్రమాన్ని అన్నంలో కానీ, మజ్జిగలో కానీ తీసుకోవాలి.
  • మూత్ర సంబంధ వ్యాధులు(Urinary Diseases) : జీలకర్రను దోరగా వేయించి, దీనికి సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పంచదార, వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని కుంకుడు కాయంత మాత్రలు చేసుకొని 2 పూటలా 2 మాత్రలు వేసుకోవాలి. దీనివల్ల మూత్ర సంబంధ వ్యాధులు..మూత్రంలో మంట, వేడి, పచ్చదనం తగ్గుతాయి.
  • నీరసం తగ్గుటకు(To reduce depression) : జీలకర్రను గానీ, లేదా ధనియాలు + జీలకర్ర మిశ్రమం గానీ తీసుకుంటే మంచిది. నీరసం, అలసట, కాళ్ళ నొప్పులు, పైత్యంతో బాధపడేవారికి మంచి ఔషధం అని చెప్పాలి.
  • పేగులు శుభ్రపడుటకు(To cleanse the intestines) : ధనియాలు, జీలకర్ర సమానకొలతలో తీసుకొని వాటిని విడివిడిగా వేయించి,  పొడి చేసుకోవాలి. అందులో తగినంత సైంధవలవణం లేదా ఉప్పు కలిపి అన్నంలో, టిఫిన్ లో, మజ్జిగలో కలుపుకొని వాడుకుంటే, పేగులు శుభ్రపడి రోగాలకు దూరంగా ఉంటారు.
  • పైత్య రోగాలకు(For Biliary Disorders) : జీలకర్రను నిమ్మరసంతో కలిపి రోజుకు 2 పూటలా తీసుకుంటే, కడుపులో వేడి, తల తిరుగుడు మొదలైన పైత్య రోగాలు తగ్గుతాయి.
  • తేలు కుట్టుట(Scorpion sting) : జీలకర్ర, తేనె, ఉప్పు, నెయ్యి కలిపి దంచి తేలు కుట్టిన చోట కట్టు కడితే, తేలు విషమును హరిస్తుంది.
  • క్యాన్సర్ నివారణ(Prevention of cancer) : శరీరంలోని కణాల్లో మొదలయ్యే క్యాన్సర్ క్రమంగా వృద్ధి చెంది, ట్యూమర్లు గా పెరగడాన్ని మనం చూస్తూనే ఉంటాము. ఈ తరహా ట్యూమర్లు పెరగడాన్ని జీలకర్ర అడ్డుకుంటుంది అని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. లివర్ క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్లో జీలకర్ర ప్రభావంతంగా పని చేస్తుంది అంటున్నారు.
  • బరువు తగ్గుదల(Weight loss) : జీలకర్రను తీసుకోవడంతో బరువు అదుపులో ఉంటుంది, బరువు తగ్గుతారు అని అధ్యయనాలు తేల్చడం జరిగింది. దీనికి సరిపోయే విధంగా జీలకర్ర నీటిని గాని ఏ రూపంలో సరి అనిపిస్తే అలా సేవించడం అలవాటు చేసుకోవాలి.
  • చర్మ వ్యాధులకు(For skin diseases) : జీలకర్రలో విటమిన్ “ఇ” అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యముగాను, ప్రకాశవంతంగాను చేస్తుంది. ఇది మీ హార్మోన్లను సక్రమంగా పనిచేయడానికి మరియు చర్మ సమస్యలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. జీలకర్ర లేహ్యాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు, గజ్జి, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులను త్వరగా తగ్గిస్తుంది.
  • జుట్టు రాలడం సమస్య(Hair loss problem) : జీలకర్రను మీ ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలు, జుట్టు రాలే సమస్యను, బట్టతలను తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్, జీలకర్ర ఆయిల్ సమాన కొలతతో తీసుకొని బాగా కలిపి జుట్టుకు రాయటం వలన వెంట్రుకల పెరుగుదలను పెంచి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
  • నెలసరి క్రమబద్దం(proper menstruation) : జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల శరీరం ఋతుక్రమ సమయంలో ఇబ్బందులను తట్టుకోగలుగుతుంది. మరియు నెలసరి క్రమంగా వచ్చేలా చేస్తుంది.
హిందూ వివాహ సాంప్రదాయంలో జీలకర్ర యొక్క ప్రాధాన్యత(Importance of Cumin in Hindu Wedding Traditions) :

      హిందూ వివాహంలో త్రేతాయుగం నాటి నుండి వధూవరులు పెళ్లి ముహూర్త సమయంలో జీలకర్ర మరియు బెల్లంతో తయారు చేసిన ముద్దను ఒకరి తలపై ఒకరు పెట్టె ఆనవాయితీ ఉందని రామాయణం ద్వారా తెలుస్తుంది. రామాయణంలో శ్రీరాముడు, సీతమ్మ వార్ల వివాహాన్ని వర్ణించేటపుడు జీలకర్ర ప్రస్తావన వస్తుంది. నేటికీ భద్రాద్రి ఆలయంలో సీతారాముల కళ్యాణంలో “జీలకర్ర బెల్లం” ఘట్టంను జరిపిస్తారు.

జీలకర్ర, బెల్లం(Cumin, Ginger) :

  1. హిందూ సాంప్రదాయంలో వేదమంత్రాల సాక్షిగా జీలకర్ర, బెల్లం ఒకరి శిరస్సుపై ఒకరు పెట్టుకోవడం, జీలకర్ర, బెల్లం ఈ రెండింటి కలయిక వలన కొత్త శక్తి ఉద్బవిస్తుంది అని కొందరు నమ్ముతారు..జీలకర్ర, బెల్లం పెట్టే చోట సహస్రార చక్రం ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇక భృకుటి మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. అంటే ఈ క్రతువులో మనిషి అత్యున్నత స్థితిని సూచించే విధంగా రెండు చక్రాలను మేల్కొలిపే ప్రయత్నం జరుగుతుంది అని అర్ధం. ఇలా ఏర్పడిన బంధం జీవితకాలం నిలిచిపోతుందట.
  2. జీలకర్ర, బెల్లం రెండింటిలో వేరు వేరు లక్షణాలు కన్పిస్తాయి. బెల్లం పూర్తిగా కరిగిపోతుంది. జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పు లేకుండానే, తనని అంటిపెట్టుకుని ఉన్న పదార్దానికి సద్గుణాలను అందిస్తుంది. వివాహ బంధంలో ఒకరికి ఒకరు కరిగిపోతూనే, ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకోవాలని తనలోని సద్గుణాలను ఎదుటివారికి అందించాలని ఈ జీలకర్ర బెల్లం యొక్క మిశ్రమం వధూవరులు ఇద్దరికీ పరస్పర ఆకర్షణ ఆరంభమైన శుభకరమైన లక్షణాలలో, ఆ మొదటి దృష్టి వధూవరుల మధ్య మానసిక బంధాన్ని క్షణక్షణానికి పెంచుతుంది అని విశ్వసిస్తారు.
  3. జీలకర్ర, బెల్లం ఈ రెండు పూర్తి భిన్నమైన పదార్థాలు. కానీ, ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలు తీరిపోతాయని వైద్యశాస్త్రం చెబుతోంది. శరీరానికి చలువచేయడం దగ్గర్నుంచి, రక్తహీనతను తగ్గించడం వరకు సమస్యలను పరిష్కరిస్తాయి. జీలకర్రకు ముసలితనం రాకుండా చేసే ప్రభావం ఉంది అంటారు. ఇక బెల్లం అమృతంతో సమానం అని అర్ధం. ఈ రెండు కలిస్తే, కలకాలం నిత్యయవ్వనంతో ఉండమని పూర్వీకుల దీవెనగా ఉండమని భావించవచ్చు. శాస్త్రజ్ఞులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు.
జీలకర్ర యొక్క దుష్ప్రభావాలు(Side Effects of Cumin) :

      జీలకర్ర మన శరీరానికి మేలు చేసే గొప్ప ఔషధం అని తెలుసు. అలాగే, విషపూరితం కానిది. జీలకర్రను అధిక మొత్తంలో తీసుకున్న సరే నష్టం లేదు. అయితే, రోజుకు 300 నుండి 600 మిల్లీగ్రాములు మాత్రమే తీసుకోవాలని పరిశోధకులు అంటున్నారు. మోతాదు మించితే, టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గుతుందని, ఫలితంగా, పురుషుల్లో సంతాన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మరియు గర్భంతో ఉన్న మహిళలు కూడా జీలకర్రను అధికంగా తీసుకునే అలవాటు చేసుకోవద్దు అని చెపుతున్నారు..

ముగింపు(Conclusion) : 

    జీలకర్ర రుచి కోసమే కాదు..సంపూర్ణ ఆరోగ్యానికి కావాల్సిన ఔషధ గుణాలను కలిగి ఉంది అని చాలా విషయాలు తెలుసుకున్నాము..జీలకర్రను వంటల్లో ఉపయోగించడం ఎంత ముఖ్యమో..వాటిని వేయించి వాసనను పీల్చడం చేస్తూ ఉంటె కూడా సర్వరోగనివారిణిగా కూడా పని చేస్తుంది..

    రోజుకు ఒక్క గ్లాస్ నానబెట్టి ఉంచిన “జీలకర్ర నీటిని” తాగడం అలవాటు చేసుకోవడం మరియు జీలకర్ర వేసి మరిగించిన నీటిని తాగడం అలవాటు చేసుకోవడం గానీ చేస్తూ ఉంటే, దీనివల్ల కలిగే ప్రయోజనాలను క్లుప్తంగా తెలుసుకున్నాము..

    అలాగే, వంటలో ఉపయోగించడానికి అయిన సరే, జీలకర్రను తగు మోతాదులో వేయడం మాత్రమే సరిఅయింది అని గుర్తుపెట్టుకోవాలి..మరియు జీలకర్ర నీటిని తాగే విషయంలో కూడా జాగ్రత్త వహించండి..అధిక మోతాదులో తీసుకుంటే వచ్చే దుష్ప్రభావాలు శరీరానికి హాని కలిగించేవిగా ఉంటాయి..అది ఎలాగో..మీ శరీరంలో వచ్చే మార్పులను బట్టి గమనించుకోండి..ముందే అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వైద్యుడి సలహాలు తీసుకోవడం తప్పనిసరి అవుతుంది..

    గర్భిణీస్త్రీలు కూడా తమ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే జీలకర్ర నీటిని గానీ, జీలకర్రను గానీ ఎంత మోతాదులో తీసుకోవడం మీ ఆరోగ్య విషయంలో శ్రేయస్కరం అవుతుంది అనేది గమనించుకోవాలి. ఆ తర్వాతే జీలకర్రను మీ ఆహారంలో భాగం చేసుకోవడం సరి అవుతుంది.

Add Comment