పసుపు అనేది ప్రకృతి ప్రసాదించిన శక్తివంతమైన ఔషధం. మానవాళికి ఇది ఒక రక్షణ మరియు ఉపయోగాలు ఎన్నో.. |Turmeric is a powerful medicine gifted by nature in Telugu

ప్రకృతి ప్రసాదించిన సర్వ గుణ సంపన్న ఔషధమైన మహా దినుసు..పసుపు(Maha Dinusu is a medicine endowed with all the virtues of nature turmeric) :

      భారతీయ సంస్కృతిలో హిందువులు తమ నిత్య జీవితంలో ఏ శుభకార్యమైన పసుపుతోనే ప్రారంభించడం ఆనవాయితిగాను, ఆచారంగాను వస్తుంది. ఇంట్లో పూజ అనగానే పసుపు అవసరం తప్పనిసరి, పెళ్లి వేడుక అనగానే పసుపు కావాల్సిందే..హంగామా ఉండాల్సిందే..ఇంకా ఎన్నో రకాల భారతీయ పండుగలకు పసుపు ఎంతో ముఖ్యం అవుతుంది. భారతీయ సాంప్రదాయంలో పసుపు అభివృద్ధి(Development)కి సూచనగా ఉంటుంది. 

      పూర్వకాలమే ఋషులు(The sages) పసుపు(turmeric) ను గుర్తించి, మానవాళికి ఉపయోగపడేలా మరియు రక్షణ కలిగించేందుకు ఎంతో కృషి చేసారు. ఇంకా పసుపును అందరు ఆరాధించే విధంగా గొప్ప ప్రాముఖ్యతను తెలియజేసారు. పసుపు లేని వంట ఇల్లు ఉండదు. పసుపును పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఈ భూమండలంపైన పసుపు అంతటి శక్తివంతమైన మూలిక(herb) మరొకటి లేదు అనడం అతిశయోక్తి కాదేమో..Turmeric is a powerful medicine gifted by nature in Telugu

      పసుపు అని పిలువబడే మసాలా భారతీయ వంటకాలలో వాడే అత్యంత ముఖ్యమైన పదార్థం. అత్యంత ప్రభావంతమైన “పోషకాహార సప్లిమెంట్(Nutritional supplement)”. పసుపులో “కర్క్యుమిన్(Curcumin)” అనే ఆక్టివ్ కాంపౌండ్(Active compound) ఉంటుంది. భారతదేశంలో పసుపు యొక్క రుచి(the taste) మరియు బంగారు పసుపు వర్ణం(Golden yellow color) కలిగి ఉన్న కారణంగా “‘రాణి మసాలా(Rani Masala)” అని పిలుస్తారు. Turmeric is a powerful medicine gifted by nature in Telugu

      పసుపు అనేదిఅల్లం జాతి(Ginger Race)”కి చెందిన దుంప. అయితే, పసుపును 2 రకాలుగా ఉపయోగిస్తారు. దుంపగా ఉన్నపుడు దానిని “పచ్చి పసుపు” అని, దుంపను ఎండబెట్టి పొడి చేయడాన్ని “పసుపు పొడి” అని పిలుస్తారు. ఎక్కువగా మనం వాడేది వంటల్లో “పసుపు పొడి”ని. ఇది “జింజిబేరేసి” కుటుంబానికి చెందినది. పసుపును శాస్త్రీయంగా కర్క్యుమిన్ అని పిలుస్తారు. ఈ దుంప లోపల అంతా పసుపు రంగులో ఉండడం వలన దీనికి “పసుపు” అని పేరు వచ్చింది అని చెపుతారు. భారతదేశంలో దాదాపు 6 వేల సంవత్సరాల నుండి పసుపును ఔషధంగా(medicine), సౌందర్య సాధనంగా(cosmetic), వంటల్లో ముఖ్యమైన దినుసుగా(as an important ingredient in cooking) మరియు వస్త్రాలపై అద్దడానికి(as a dye on textiles) వాడుతున్నారు అని తెలిసింది. బౌద్ధ శిష్యులు(Buddhist disciples) 2000 సంవత్సరాల క్రితమే పసుపుతో అద్దకం వేసిన వస్త్రాలు ధరించారని తెలుస్తోంది.Turmeric is a powerful medicine gifted by nature in Telugu

పసుపు యొక్క గుణగణాలు :

  • పసుపు దుంప రూపంలో మెట్ట ప్రాంతంలో విరివిగా పండుతుంది. దుంపలపై ఉండే పొట్టు తీసి, ఎండబెట్టి పసుపును తయారు చేస్తారు.
  • దుంపల నుండి పసుపును వివిధ ప్రక్రియల ద్వారా పసుపు కొమ్ములు(turmeric antlers), పసుపు పొడి తయారు చేస్తారు. వాణిజ్య పరంగా పసుపుకు చాల ప్రాముఖ్యత ఉంది.
  • ఈ పసుపును ఇంటి వంటల్లోను మరియు పూజా కార్యక్రమాలకు వాడుతుంటారు.
  • పసుపులో విటమిన్లు, లవణాలతో పాటు శరీర ఆరోగ్యానికి తోడ్పడే ఫైటిన్(Phytin), ఫాస్ఫరస్(phosphorus) కూడా అధికంగానే ఉంటుంది.

Turmeric is a powerful medicine gifted by nature in Telugu

  • పసుపు రేణువులో వివిధ రకాల జీవన ప్రక్రియలకు తోడ్పడే యాంటీ బయోటిక్, క్యాన్సర్ నిరోధక, ఇన్ఫ్లమేషన్ నిరోదించేవిగాను, ట్యూమర్ కలగకుండా ఉండే, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉన్న వందలాది పరమాణువులున్నాయి()There are hundreds of molecules that have antibiotic, anti-cancer, anti-inflammatory, anti-tumor and antioxidant properties..
  • పసుపు దుంపల్లో “కర్క్యుమిన్” అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఈ పదార్థం వల్లే పసుపు సహజమైన పసుపు రంగును కలిగి ఉంటుంది.
  • పసుపు దుంపల్లో కర్క్యుమిన్ కేవలం 3 నుండి 5 శాతమే ఉన్నప్పటికీ శరీర సౌందర్యానికి, ఆరోగ్యం మెరుగుదలకు ముఖ్యపాత్ర వహిస్తుంది.
  • మహారాష్ట్రకు చెందిన “సాంగ్లి(Sangli)” పట్టణంలో ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు వ్యాపారం జరుగుతుంది. భారతీయులు 3000 సంవత్సరాల నుండి పసుపును వాడుతున్నారు.

పసుపుకు ఇతర పేర్లు(Other Names of Turmeric) :

  1. సంస్కృతంలో “అమేష్ఠ, భద్ర, హృదయవిలాసిని, జ్వరాంతిక మరియు సువర్ణవర్ణ” అని పిలుస్తారు.
  2. హిందీలో దీనిని “హల్దీ” అంటారు.
  3. మరాఠీలో “హలాద్” అంటారు.
  4. ఇంగ్లీషులో “ఇండియన్ కుంకుమ” అంటారు.
  5. కన్నడంలో “అరిసిన మరియు అరిశిన” అంటారు.
  6. తమిళంలో “మంజల్” అంటారు.
  7. తెలుగులో “పసుపు, హరిద్ర” అని అంటారు.
  8. మలయాళంలో “మంజల్” అంటారు.
పసుపు అందించే ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits of Turmeric) :

    పసుపులో ఉండే కర్క్యుమిన్ మన శరీరం మరియు మెదడుకు చాల ప్రయోజనాలను కలిగి ఉన్నాయి అని చూపిస్తున్నాయి. తాజా అధ్యయనాల్లో, మార్కెట్లో లభించే మందుల కంటే కూడా పసుపు బాగా పని చేస్తుంది అని నిరూపించబడినది. ఏదైనా గాయం అయితే చాలు పసుపు రాస్తారు..అది అలవాటు కావచ్చు..తరతరాల నుండి ఆచరణలో ఉంది అనవచ్చు. అయితే ఇది “యాంటీ సెప్టిక్(Antiseptic)” గా పని చేస్తుంది అని నమ్మకమే ఇందుకు కారణం.. సెప్టిక్ కాకుండా చూడడంలో, గాయాలు మాన్పించడంలో పసుపు బాగా పని చేస్తుంది అని వేలాది ఏళ్ళ క్రితమే భారతీయులు గుర్తించారు. పసుపులో ఉండే ఆయుర్వేద గుణాలు మన ఆరోగ్య మెరుగుదలకు ఎంతో శక్తిని అందిస్తూ, సహాయపడుతుంది.Turmeric is a powerful medicine gifted by nature in Telugu

  • చిన్న చిన్న గాయాల నుండి క్యాన్సర్ వ్యాధుల వరకు పసుపు ఒక విరుగుడుగా పని చేస్తుంది.
  • పసుపు ఫ్రీరాడికల్స్ తోను, వ్యాదులతోను పోరాడే శక్తి కలిగి ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధిస్తుంది.
  • పసుపు రోగనిరోధక శక్తి(Immunity)ని పెంచుతుంది.
  • రక్త శుద్ధి(Blood Purification) వలన మన చర్మం ఆరోగ్యముగా ఉండేలా చేస్తుంది.
  • పసుపులో అత్యంత శక్తివంతమైన కర్క్యుమిన్ ఉండడంతో ఇది ఆర్థరైటిస్, చర్మ క్యాన్సర్, గాయాలు, కాలేయ వ్యాధులు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లకు మూలికా చికిత్సగా ఉపయోగపడుతుంది(It is useful as a herbal treatment for arthritis, skin cancer, wounds, liver diseases, urinary tract infections.).
  • పసుపులోని కర్క్యుమిన్ “కొవ్వు కణాలను(Fat cells)” పెరగనివ్వకుండా చేస్తుంది అని అంటారు.Turmeric is a powerful medicine gifted by nature in Telugu
  1. ప్రథమ చికిత్స(First aid) : దెబ్బలు, గాయాలు తగిలి రక్తస్రావం జరుగుతూ ఉంటే, దానిపై పసుపు చల్లటం అనేది మొదటి చికిత్స. ఇది చాలా మందికి తెలిసిన విషయం అయినా కూడా కొంతమంది ఇష్టపడుతారు చేయడానికి, కొంతమందికి వాటి జోలికి కూడా వెళ్ళలేరు. కానీ, హాని కలిగించేది కాదు కాబట్టి, తప్పకుండా చేయవలసిన పని..
  2. మొటిమలు(pimples) : జామ ఆకులు, పసుపు కలిపి పేస్ట్ లా చేసి మొటిమలపై అప్లై చేయాలి.
  3.  కఫము(Phlegm) : వేడి పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగాలి కఫము తగ్గుతుంది.
  4. రక్తశుద్ధి(Blood purification) : ఆహారపదార్థాలలో పసుపును కొంచెం వాడటం అలవాటు ఉంటుంది అందరికి, అయితే ఇది రక్తశుద్ధిని కూడా చేస్తుంది.
  5. దగ్గు, జలుబు(Cough, Cold) : మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి పట్టాలి. మరియు పాలు వేడి చేసి దానిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే, దగ్గు తగ్గడమే కాదు, మంచి నిద్ర కూడా పడుతుంది అంటారు.
  6.  నొప్పులు, బెణుకులు(Aches, Sprains) : పసుపు, ఉప్పు, సున్నం కలిపి పట్టు వేయాల్సి ఉంటుంది.
  7. దంత సంరక్షణ(Dental care) : పసుపు, ఉప్పు కలిపి దంతాలను శుభ్రం చేసుకున్నట్లయితే, తెల్లగా మారడంతో పాటు, దంతాల్లో ఉండే సూక్ష్మ క్రిములు గాని, పిప్పి పళ్ళు గాని తగ్గిపోయి దంతాలకు రక్షణగా ఉంటుంది.
  8. డయాబెటిస్(Diabetes) : పసుపులో ఉండే కర్క్యుమిన్, రక్తంలోని గ్లూకోస్ స్థాయిలు తగ్గిస్తుంది. తద్వారా, మధుమేహం నియంత్రించడానికి సహాయపడుతుంది. ఒక చిన్న గ్లాస్ నీళ్లలో ఒక పసుపు కొమ్ము వేసి రాత్రంతా నానబెట్టి, పొద్దున్నే లేచాక దానిలో నుండి పసుపు కొమ్మును తీసేసి, ఒక చెంచాతో బాగా కలిపి పడగడుపునే తాగేసేయాలి. దీనితో చక్కర వ్యాధి అదుపులో ఉంటుంది. మరియు ఈ నీళ్లు కొలెస్ట్రాల్ ను, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే, పసుపు కలిపిన పాలను తాగడం వల్ల చక్కర వ్యాధి అదుపులోకి వచ్చింది  అని నిపుణులు తెలియజేస్తున్నారు.
  9. తల తిరుగుడు(Dizziness) : పసుపు దుంపను దంచి ముద్దగా చేసి తలపై రాసుకోవాలి. మంచి ఫలితాన్ని పొందుతారు.
  10. కాలేయ ఆరోగ్యం(Liver Health) : పసుపులోని కర్క్యుమిన్ పదార్థం, కాలేయం పనితీరును దెబ్బతీసే తీవ్రమైన “సిరోసిస్”వ్యాధి నుండి రక్షణ కల్పిస్తుంది. విషతుల్యమైన పదార్థాల నుండి కాలేయానికి హాని కలగకుండా కాపాడుతుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సయిడ్స్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు కాలేయ కణాల్ని ఆరోగ్యముగా ఉంచడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే వర్ణకం పిత్త వాహికల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా చూస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా తాగే అలవాటు ఉంటే, ప్రతి రోజు ఉదయం, సాయంత్రం 5 గ్రా పసుపును ఒక గ్లాస్ నీళ్లలో గాని, మజ్జిగలో గాని, కలిపి ఒక “నెల రోజుల” పాటు తాగితే, లివర్ కు ప్రమాదం లేకుండా ఉంటుంది.
  11. పసుపు క్యాన్సర్ ను చంపగలదు(Turmeric can kill cancer) : పసుపు శరీరంలోని ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయం, నోరు మొదలైన భాగాలలో క్యాన్సర్ దరి చేరకుండా నివారిస్తుంది. ఎపుడైనా కణితి(ట్యూమర్) ఏర్పడితే, దాన్ని నిర్ములించేటట్లు చేస్తుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే రసాయానానికి 24 గంటలోపే క్యాన్సర్ కణాలను చెంపే శక్తి ఉన్నట్లు పరిశోధకులు తేల్చి చెప్పారు. గాయాలు, ఇన్ఫెక్షన్ల నుండి కూడా రక్షణ కలిపించే శక్తి ఉంటుంది.
  12. గుండె సమస్యలు(Heart problems) : పసుపు గుండెలోని “ఎండోతెలియం”ను బాగా పని చేసేలా చేస్తుంది.ఎండోతెలియం సరిగా పనిచేయకపోవడం వల్లే మనకు గుండెకు సంబందించిన రోగాలు వస్తాయి. పసుపులో ఉండే కర్క్యుమిన్ గుండెకు సంబందించిన చాల రకాలైన రోగాల ప్రక్రియలను ఆపటంలో మరియు వ్యతిరేకంగా పనిచేయటంలో పసుపు సహాయకారిగా పని చేస్తుంది.
  13. డిప్రెషన్(Depression) : WHO ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల మంది డిప్రెషన్ తో భాదపడుతున్నారు. అయితే కొన్ని క్లినికల్ ట్రయల్స్ ప్రకారం, పసుపులో ఉండే కర్క్యుమిన్ “యాంటిడిప్రెసెంట్(Antidepressant)” కూడా పని చేస్తుంది అని తెలిసింది.
  14. కీళ్ల నొప్పులు(Joint pains) : ఆర్థరైటిస్ అనే వ్యాధి కీళ్ల నొప్పులకు సంబంధించింది. ఈ వ్యాధిలో దాదాపు 100 రకాలు ఉంటాయి. ఈ వ్యాధి వల్ల కీళ్లలో నొప్పి, వాపు, బిరుసుతనం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల ప్రకారం పసుపు ఆర్థరైటిస్ ను తగ్గిస్తుంది అని పూర్తిగా చెప్పలేము. ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స లేదు. కేవలం, లక్షణాలను తగ్గించటమే ప్రస్తుతం ఉన్న మార్గం.
  15. అల్జీమర్స్(Alzheimer’s) : ఈ అల్జీమర్స్ వ్యాధి లో మనుషులు జ్ఞాపక శక్తిని కోల్పోతూ ఉంటారు. ఇది ఎక్కువగా 60 సంవత్సరాల పై బడిన వారిలో ఈ రోగం వస్తుంది. ఈ వ్యాధికి ఇంతవరకు ఎలాంటి చికిత్స లేదు. కేవలం లక్షణాలను తక్కువ చేయగలదు. ఈ రోగం బారిన పడ్డప్పుడు మెదడు వాపు మరియు ఆక్సీకరణం దెబ్బతింటుంది. అయితే పసుపులో ఉండే యాంటీ ఇంఫ్లమ్మెటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అల్జీమర్స్ రోగం బారిన పడ్డ వారికి సహాయపడుతుంది.
చర్మ సౌందర్యాన్ని పెంపొందించే పసుపు(Turmeric for skin beautification) :

Turmeric is a powerful medicine gifted by nature in Telugu

  • ప్రతి రోజు కానీ లేదా మీకు వీలు కలిగినపుడు గాని ఉదయం స్నానం చేసే కంటే అరగంట ముందు మీ శరీరానికి పసుపు, శనగపిండి కలిపిన మిశ్రమం పట్టించి స్నానం చేస్తే, ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది.
  • ఆముదంలో కొంచెం పసుపు కలిపి శరీరానికి పట్టించి, 10  నిమిషాల తర్వాత సబ్బుతో శుభ్రం చేసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మ వ్యాధులు అన్ని తగ్గిపోతాయి.
  • మన పాదాలకు పసుపు రాసుకోవడం భారతీయ సాంప్రదాయం. అయితే పాదాలకు పగుళ్లు వచ్చిన, నీటిలో తడిచి చెడిపోయినట్లు అయినా సరే, పసుపును రాయండి సమస్య తీరిపోతుంది.
  • వేపఆకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్ ను శరీరానికి పట్టించండి. మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మ వ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి. మరియు చర్మం నునుపుగా మారి చర్మం తేజోవంతమౌతుంది.
  • జామ ఆకులను, పసుపును కలిపి మెత్తటి పేస్ట్ తయారు చేసి, ముఖానికి రోజు రెండు సార్లు రుద్దుకొని, శుభ్రం చేస్తూ ఉంటే, మొటిమలు తగ్గుతాయి.
పసుపును ఎక్కువగా తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలు(Side effects of excessive consumption of turmeric) :Turmeric is a powerful medicine gifted by nature in Telugu

     అనేక ఆరోగ్య నివేదికల ప్రకారం, ఒక్కో వ్యక్తి రోజుకు 500 మిల్లిగ్రాముల పసుపు తినవచ్చు. ఇది 1-3 గ్రాములు గా ఉంటుంది. దీని కంటే ఎక్కువ తీసుకుంటే, ప్రమాదమని చెప్పాలి. పసుపును మీరు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అది కూడా మీరు తీసుకునే పరిమాణాన్ని బట్టి ఉంటాయి.

ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు, ఉబ్బసం, తల తిరగడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాగే, ఆక్సలేట్లు పెరగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఎక్కువగా వస్తాయి. పిత్తాశయ సమస్యలు, రక్తస్రావం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు పసుపును వీలైనంత తక్కువగా తినడం మంచిది. 

పసుపులో ఉండే కర్క్యుమిన్ మన శరీరానికి అలెర్జీలను కలిగించవచ్చు. ఎందుకంటే, పసుపు కొందరి వ్యక్తులకు అలెర్జీలకు కారణం అవుతుంది. ఇది కాస్త చర్మ వ్యాధికి దారి తీస్తుంది. కొంతమందికి పసుపు పై పూతగా రాసిన లేదా సేవించినా కూడా ఇలాంటి ప్రతి చర్యలకు కారణం అవుతుంది.

పచ్చి పసుపు ప్రయోజనాలు(Turmeric Benefits) :

     పసుపు ముద్దల వాడకం అనేది శీతాకాలంలో ప్రయోజనకరం. ఎందుకంటే, పచ్చి పసుపులో పసుపు పొడి కంటే ఎక్కువ ఆరోగ్య కారకాలు ఉంటాయి.Turmeric is a powerful medicine gifted by nature in Telugu

  • పచ్చి పసుపులో “లిపోపాలిసాకరైడ్” అనే మూలకం ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
  • పచ్చి పసుపుతో చేసిన “టీ” అత్యంత ప్రయోజనకరమైన పానీయం.
  • పచ్చి పసుపుకు బరువు తగ్గించే గుణం ఉంది.
  • పచ్చి పసుపును జ్యూస్ లో -వేసి గాని, పాలలో మరిగించి గాని, వంటకాలలో ఉపయోగించడం, ఊరగాయలు చేసేటపుడు గానీ, చట్నీలు చేసేప్పుడు గాని, పులుసులో వేసి గాని వాడుకోవచ్చు.
  • పచ్చి పసుపులో క్యాన్సర్ తో పోరాడే గుణాలు ఉన్నాయి. హానికరమైన రేడియేషన్ కు గురి కావడం వల్ల వచ్చే కణితుల నుండి రక్షిస్తుంది.
  • పచ్చి పసుపును గర్భిణీ స్త్రీలు ఉపయోగించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఎవరైనా శస్త్ర చికిత్స చేయించుకోబోతున్నట్లయితే, మరియు అధిక మోతాదులో మందులు తీసుకుంటున్నప్పుడు గానీ పచ్చి పసుపును తీసుకోకూడదు.
ముగింపు(Conclusion) : 

       పసుపు మహాద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉండి, మానవాళి ఆరోగ్యానికి అందించే ఉపయోగాలు తెలుసుకున్నాము. మన శరీరానికి ఒక రక్షణ కవచంలాగా మారి, రోగనిరోధక శక్తిని ఏ విధంగా ఇస్తుంది తెలుసుకున్నాము..పసుపు ఒక వంట ఇంటి మసాలా..కావున ఎంత మోతాదు మన వంటకాల్లో చేర్చడం సరి అనేది అవగాహన పెంచుకోవడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. దీని నుండి మనం మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడం అనేది తెలుస్తుంది. 

       చర్మ సౌందర్యం కోసం పై పూతగా పసుపు ను ఉపయోగించాలి అంటే, ముందు పసుపు మీకు ఏ మేర వరకు తీసుకోవడం అనేది ఇబ్బంది కలుగకుండా ఉంటుంది అని పరీక్షించుకోవాలి. ఎందుకంటే, అందరి శరీర తత్వాలు కానీ, చర్మ తత్వాలు కానీ సరిసమానంగా ఉండలేవు కాబట్టి, వారి వారి సమస్యలను తెలుసుకొని, దృష్టిలో పెట్టుకొని తగు విధంగా పసుపు వాడకం అనేది నిర్ణయించుకోవాలి. ఇలా..పరీక్షించుకున్న తర్వాత, మీ చర్మతత్వానికి ఇబ్బంది అనిపించకపోతే, కనీసం 6 నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి అయినా పసుపు పొడిలో కొంచెం కొబ్బరి నూనె లేదా మీకు ఇష్టమైన నూనె మరియు కొంచెం బియ్యంపిండి కలిపి పేస్ట్ లాగ చేసుకొని శరీరానికి పట్టించి, స్నానం చేయండి. పసుపుతో చర్మసంబంధ రుగ్మతలు తొలగి, తేజోవంతులుగా కన్పిస్తారు. 

      ముఖ్యంగా, గర్భిణీస్త్రీలు పసుపు తీసుకోవడంలో మీ ఆరోగ్య పరిస్థితి ఏ మేర సహకరిస్తుంది లేదా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పరుస్తుందా అని గమనించుకోవడం మర్చిపోవొద్దు. గర్భిణీలు అయినా, మాములుగా ఏ వ్యక్తులకైనా అతిని మించి పసుపును వాడడం అనేది లాభదాయకం కాదు అని తెలిసిందే కదా!

     తగు జాగ్రత్తలతో పసుపు ను ఉపయోగించుకోండి మీ అవసరాలకు. అయినా సరే, ఏ విధమైన సమస్యలు తలెత్తుతున్నాయి అనిపించినా వైద్యుడి సలహా తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. ఎం కాదులే అని మీ ఇష్టం వచ్చినట్లు పసుపును తీసుకోవడం, సేవించడం అనేది  ప్రాణానికి గానీ, శరీరానికి గానీ హాని కలిగే విధంగా వ్యవహరించడం మంచిది కాదు.  

Add Comment