Beauty tips for Pimples in Telugu | మొటిమలు తగ్గటానికి ఆరోగ్య చిట్కాలు

 Pimples Removing Tips in Telugu:

Pimples Removing Tips in Telugu:

 

Pimples ప్రధానంగా స్కూలుకు వెళ్లే వారు,కాలేజీలకు వెళ్లే యువతి యువకులు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతూవుంటారు. అయితే చిన్నప్పటినుండి బాగానే ఉండి,ఇలా యుక్త వయస్సు రాగానే ఏంటీ సమస్య అని బాధపడతారు.

అలాగే ఈ మొటిమలు ముఖం మీదే కాకుండా భుజాలు,మెడ పైన,ఛాతి వంటి భాగాలలో కూడా వస్తుంటాయి.

Pimples స్వేదగ్రంథులకు సంబంధించిన ఒక చర్మ సమస్య. ఆడవారిలో ఈస్ట్రోజన్,ప్రొజెస్టరాన్ మగవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లో ఉండే సమతుల్యం లోపించడం వలన మొటిమలు రావటానికి కారణం అవుతుంది.

సాధారణంగా 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల యువతి యువకులు తమ ముఖం మెరిసి పోవాలని కోరుకుంటారు. చిన్న మొటిమ వచ్చినా కూడా వాళ్ళు పడే కంగారు మామూలుగా ఉండదు.

రకరకాల గృహ చికిత్సలు,మార్కెట్లో దొరికే క్రీములు వాడుతూవుంటారు. అసలు మొటిమలు ఎలా వస్తాయి?ఇవి రావటానికి కారణాలు ఏంటి?

Pimples రావటానికి గల కొన్ని ప్రధాన కారణాలు తెలుసుకుందాం:

  • యువతి,యువకులలో మార్పుచెందే హార్మోన్స్ వలన మొటిమలు రావటానికి అవకాశం ఉంటుంది.
  • బ్యాక్తీరియా ఇన్ఫెక్షన్స్ కూడా ఒక ప్రధాన కారణం.
  • కొన్ని రకాల వ్యాధులకు ఎక్కువ మోతాదులో తీసుకునే ఆంటీబయోటిక్స్ మందులు వాడటం.
  • ప్రతీ చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఒత్తిడికి గురి కావటం.
  • గర్భ నిరోధక మాత్రలు ఎక్కువగా తీసుకోవటం.
  • కొందరిలో వంశపార్యపరంగా కూడా మొటిమలు వస్తుంటాయి.
  • ఆడవారిలో థైరాయడ్,PCOD  సమస్య ఉన్న వారిలో కూడా మొటిమలు వస్తాయి

ఈ క్రింద ఉన్న క్రీమ్ వాడటం వలన మొటిమలు తొందరగా తగ్గుతాయి. ఇమేజ్ లింక్ క్లిక్ చేసి కొనండి.

నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • మొటిమలు రాగానే చాలా మంది చేసే తప్పు మొటిమలు గిల్లటం,ఇలా చేయటం వలన గిల్లిన చోట నల్లటి మచ్చలు ఏర్పడి దీర్ఘకాలికంగా ఆ మచ్చలు అలానే ఉంటాయి.
  • మొటిమలు వచ్చిన వాళ్ళు నలుగురు ఏమనుకుంటారో అని ఒక రకమైన ఆత్మనూన్యతా భావానికి లోనై ఒత్తిడి కి గురౌతారు. వ్యాయామం చేయటం,ఆటలు ఆడటం వంటివి చేయటం వలన ఒత్తిడి నుండి దూరంగా ఉండవచ్చు.
  •  చాలా మంది నీళ్లు ఎక్కువగా త్రాగరు. కానీ తప్పకుండ మీరు ఒక నియమం పెట్టుకోండి అది ఏమిటంటే ప్రతి రోజూ ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి గంట గంటకి ఒక గ్లాసు నీరు త్రాగాలి.
  • మనం రోజూ వండుకునే ఆహారపదార్థాలు అదే రోజు తినాలి. మరుసటి రోజు తినకూడదు. అలాగే నిల్వ ఉండే ఆహారపదార్థాలు తినకూడదు.
  • మన ముఖాన్ని రోజూ గోరువెచ్చని నీటితో 4 నుంచి 5 సార్లు శుభ్రం చేసుకోవాలి.
  • మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు డాక్టర్ సలహా లేకుండా వాడరాదు.
  • రోజూ 7 నుండి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి.
  • తాజాగా ఉండే పండ్లు,కూరగాయలు,ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
  • కూల్డ్రింక్స్,స్వీట్స్,కేక్స్,వేపుడు పదార్థాలు,కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తినటం తగ్గించాలి.
  • కొందరు మొటిమలు తగ్గటానికి మందులు వాడతారు,కానీ మొటిమలు తగ్గగానే మానేస్తారు. ఆలా కాకుండా 7 నుంచి 8 వారాలు వాడటం మంచిది.

Pimples తగ్గటానికి ఉపయోగపడే కొన్ని గృహ చిట్కాలు:

  • మొటిమలు తగ్గటానికి రెండు రోజులకు ఒక్కసారి సగం కప్పు అలోవెరా గుజ్జుని త్రాగండి. అలాగే మొటిమలు ఉన్న చోట పూయండి. గర్భిణీలు మాత్రం అలోవెరా గుజ్జు త్రాగరాదు.
  • దాల్చిన చెక్కను ఒక పేస్ట్ లాగ తయారు చేసి మొటిమలపై రాసి ఒక గంట తరువాత చల్లటి నీటితో కడగండి.
  • ఒక టీస్పూన్ మిరియాలు తీసుకోండి,అందులో ఒక 8 నుండి 10 వేపాకులు,20 గ్రాముల గంధం పొడి కలిపి మెత్తగా పేస్ట్ లాగా నూరుకోవాలి. నూరుకున్న ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి,ఒక గంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజుకి ఒకసారి రెండు వారాలు చేస్తే మొటిమలు తప్పకుండా తగ్గుతాయి.

Pimples Removing Tips in Telugu:

  • కొద్దిగా నిమ్మరసం తీసుకోండి,అందులో తులసి ఆకులను కలిపి మెత్తగా పేస్టులాగా నూరండి. నూరిన ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. ఇలా చేయటం వలన మొటిమలు తగ్గటం మాత్రమే కాకుండా…ముఖం పైన ఉండే మచ్చలు కూడా తగ్గుతాయి.
  • ఒక టేబుల్ స్పూన్ తేనెలో పాలు,పసుపు పొడి,కొద్దిగా సరిపడా నిమ్మరసం కలిపి మొటిమలపై రాసుకొని 30 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడగటం వలన మొటిమలు తొందరగా తగ్గుతాయి.

Pimples Removing Tips in Telugu:

  • టమాటా రసం కొద్దిగా తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె,ఒక చిటికెడు బేకింగ్ సోడా కలిపి ఒక మిశ్రమంగా తయారు చేయాలి. ఇలా చేసుకున్న ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించాలి. తరువాత ఒక 15 నిమిషాల తరువాత  చల్లటి నీటితో కడగాలి. ఇలా రోజుకి ఒకసారి చొప్పున 2 వారాలు చేస్తే మొటిమలు తగ్గటమే కాకుండా మచ్చలు కూడా తగ్గుతాయి.
  • ఒక ఉల్లిపాయ తీసుకోండి,దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి,మిక్సీలో వేసి ఒక పేస్టులాగా చేయండి. తరువాత ఆ పేస్టుని ఒక బట్టలో వేసి రసం మొత్తం బయటకు తీసి..కేవలం మిగిలిన గుజ్జుని ముఖానికి పట్టించండి. ఒక గంట ఆగి చల్లటి నీటితో కడగండి.

ఇలా మీరు పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ…చిట్కాలు వాడుతూఉంటె తొందరగా మొటిమలు అనే సమస్య నుండి బయటపడవచ్చు.

 

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.

అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.