ఋతుస్రావం త్వరగా ప్రారంభం కావడానికి పాటించాల్సిన ఇంటి చిట్కాలు|Home tips to follow for early onset of menstruation in Telugu

ఋతుక్రమం త్వరగా రావడానికి పాటించాల్సిన చిట్కాలు(Tips to follow for early menstruation) 

     పరిస్థితుల్ని బట్టి, సమయాన్ని బట్టి, ఇంట్లో శుభకార్యాల కోసం అని లేదా బయట దేవాలయాల పూజలకు, కార్యక్రమాలకు వెళ్లడం కోసం అని, ఇంకా ఇతరత్రా శుభకార్యాలకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ..దానికి తగినట్లు మనము సిద్ధం అవ్వాలి అని చెప్పి..రుతుక్రమం అడ్డు పడకూడదు, సమస్య అవ్వకూడదు అంటే రుతుక్రమం ముందుగా రావడం ఎలా? ఎం చేయాలి? అని ఇలాగ ఆలోచించే ధోరణి చాలా సహజమైనది. ఎందుకంటే, ప్రతి ఆడపిల్ల, స్త్రీలు అనుభవించే పరిస్థితి.

     ఋతుక్రమం సమయానికి ప్రారంభం అవడానికి అయినా, త్వరగా ప్రారంభం అవ్వాలి అనుకున్నా సరే..ఇంటి చిట్కాలు సహజమైన పద్దతిలో లాభం కలిగించేవి మరియు ఉపయోగపడడం అనేది చాలా వరకు తెలిసిన విషయమే..అయితే, ఋతుక్రమ సమస్య ప్రతి నెల ఆలస్యంగా రావడం జరుగుతుంది అంటే..అది ఒక అనారోగ్య సమస్య(health problem) అయి ఉండవచ్చు అని గ్రహించాలి..వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం అవుతుంది.

రుతుక్రమ సమస్య అనేది ఇంటి చిట్కాల ద్వారా కూడా పరిష్కరించుకునే మార్గాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము..

బెల్లం(Jaggery) : త్వరగా రుతుక్రమం ప్రారంభం అవ్వడానికి బెల్లం కూడా ఎంతో సహాయపడుతుంది. బెల్లంను నేరుగా తినడం వల్ల వేడిని కలిగిస్తుంది శరీరంలో..అయితే, పల్లీలతో గానీ, నువ్వులతో కలిపి చేసిన లడ్డులను లేదా బెల్లం కలిపి చేసిన ఏ పదార్థం అయినా తినడం ద్వారా త్వరగా రుతుక్రమం మొదలవడం ఖచ్చితం అని చెప్పొచ్చు.

బొప్పాయి(Papaya) : ఇది గర్భాశయ లక్షణాలను కలిగి ఉండి, గర్భాశయాన్ని సంకోచించేలా చేస్తుంది. దీనివల్ల ముందుగానే పీరియడ్స్ వస్తుంది. దీని కోసం బాగా పండిన బొప్పాయి ని హ్యాపీ గా తినేయొచ్చు. జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. దీని వల్ల జుట్టు మరియు ఆరోగ్యానికి కూడా మంచిది.Home tips to follow for early onset of menstruation in Telugu

నువ్వులు(Sesame) : నువ్వుల్లో బయోయాక్టీవ్ సమ్మేళనాలు ఉంటాయి. దీని వల్ల త్వరగా రుతుక్రమం మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. వీటిని ఒక స్పూన్ తేనెతో కలిపి తీసుకోవాలి. రోజుకు 2 సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే, బెల్లం తో తయారు చేసిన నువ్వుల లడ్డు లేదా పట్టీలు తీసుకోవడం వల్ల కూడా సహాయపడుతుంది.Home tips to follow for early onset of menstruation in Telugu

చేపలు(Fish) : చేపలోని ఒమేగా ఫ్యాటి ఆమ్లాలు మరియు ఎన్నో రకాల చేపలను వాటి లోని ప్రోటీన్స్  ఋతుస్రావానికి మంచి ఉపయోగకారిని. అందుకే, మీరు తినగలిగే చేపలను మీ ఆహారంలో భాగం చేసుకోండి.Home tips to follow for early onset of menstruation in Telugu

గుడ్లు(Eggs) : గుడ్లు రోజుకు ఒకటి చొప్పున ప్రతిరోజూ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అంటారు. కాబట్టి, గుడ్డును తినడం అంటే, మంచి ప్రోటీన్ మన శరీరానికి అందుతుంది అని అర్ధం. రుతుస్రావం మొదలవడానికి అయినా, ఆరోగ్య పనితీరు కోసం అయినా గుడ్డును ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.Home tips to follow for early onset of menstruation in Telugu

అల్లం(Ginger) : అల్లంలోని బయోయాక్టీవ్ సమ్మేళనాలు శరీరంలో వేడి ని పెంచుతాయి. కావున, అర టేబుల్ స్పూన్ అల్లం రసాన్ని తేనెతో కలిపి తీసుకోవాలి. ఇలా రోజుకు 2 సార్లు చేయడం వల్ల ఋతుక్రమం త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి.

కాఫీ(Coffee) : కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ ని మీ పీరియడ్స్ కి ముందు నుండి రోజుకి 2 సార్లు కాఫీ తాగడం వల్ల ఋతుక్రమం త్వరగా వచ్చేలా చేస్తుంది.

పసుపు(Turmeric) : పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే సమ్మేళనం..మీ గర్భాశయ రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. అందుకే, ఒక గ్లాస్ నీటిలో పసుపు వేసి మరిగించి, దీనిని గోరువెచ్చగా ఉన్నపుడు తాగండి. ఈ విధంగా కూరల్లో వాడే పసుపు కూడా పీరియడ్స్ త్వరగా రావడానికి దోహదం చేస్తుంది.

పైనాపిల్(Pineapple) : పైనాపిల్ లో గర్భాశయ లక్షణాలు అధికంగా ఉంటాయి. పీరియడ్స్ త్వరగా రావాలి అంటే నేరుగా ఈ పండును తిన్నా లేదా జ్యూస్ రూపంలో తాగిన ఫలితం ఉంటుంది.

విటమిన్ సి(Vitamin C) : విటమిన్ సి శరీరంలోని ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచి, ప్రొజెస్టరాన్ స్థాయిలను తగ్గిస్తుంది.అందుకే, విటమిన్ సి కలిగిన ఫుడ్స్ ని తీసుకుంటే త్వరగా పీరియడ్స్ ని పొందవచ్చు. అయితే, రుతుక్రమం కోసం అని చెప్పి, ఎక్కువగా తీసుకుంటే కూడా సమస్యలు తలెత్తుతాయి.

దానిమ్మ(Pomegranate) : మీ పీరియడ్స్ సమయానికి ముందు క్రమం తప్పకుండా దానిమ్మ పండ్లను తినడం వల్ల త్వరగా పీరియడ్స్ రావడానికి అవకాశం ఉంటుంది.

బాదం(Almonds) : బాదంలోని పోషకాలు కూడా ఋతుక్రమ ప్రారంభానికి మంచి ఉపయోగాలు. అందుకే, బాదాం ను తినడం కూడా అలవాటు చేసుకోవడం సరి అయినది అవుతుంది.

ఎండుద్రాక్ష(Raisins) : ఎండుద్రాక్షలు కూడా రుతుక్రమం మొదలవడానికి మరియు బలం చేకూర్చడానికి ఉపయోగపడేవి. వీలును బట్టి క్రమం తప్పకుండ రోజుకు కొన్ని చొప్పున ఒక మోతాదులో మాత్రమే తీసుకోగలిగితే మంచి ఫలితం ఉంటుంది.

ఖర్జురాలు(Dates) : ఈ ఖర్జురాలు మీ శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. మీ పీరియడ్స్ కి ముందు రోజు రోజంతా ఖర్జురాలను అధిక పరిమాణంలో తిన్నా సరిపోతుంది త్వరగా పీరియడ్స్ మొదలవడానికి.

ఆముదం(Castor Oil) : అర టేబుల్ స్పూన్ ఆముదం తీసుకొని పొత్తి కడుపుపై మసాజ్ చేసి, వేడి బట్ట ను 15 నుండి 20 నిమిషాల వరకు ఉంచాలి. రోజుకు 2 సార్లు ఇలా చేయవచ్చు. ఈ ఆముదం ఎంతగానో సహాయపడగలదు పీరియడ్స్ త్వరగా రావడానికి.

సోంపు(Aniseed) : ఒక గిన్నెలో నీళ్లు పోసి, సోంపు వేసి బాగా మరగనిచ్చి, చల్లారిన తర్వాత వడకట్టి క్రమం తప్పకుండ తాగుతూ ఉండాలి. ఈ విధంగా గర్భాశయంలో రక్తప్రవాహాన్ని పెంచి, పీరియడ్స్ త్వరగా రావడానికి ప్రేరేపిస్తుంది.

క్యారట్(Carrot) : క్యారెట్స్ లో బీటాకెరోటిన్, బయోయాక్టీవ్ కంపౌండ్స్ ఉంటాయి. ఇవి గర్భాశయ లైనింగ్ షెడ్డింగ్ ని ప్రేరేపించి, పీరియడ్స్ త్వరగా వచ్చేలా చేస్తాయి. అందుకే, రోజుకో క్యారట్ తినడం వల్ల త్వరగా పీరియడ్స్ ని పొందే అవకాశం ఉంటుంది.

పెరుగు(Curd) : పెరుగు అనేది కొందరిలో రుతుక్రమం ఆగిపోయేలా చేస్తుంది. కొందరిలో ప్రారంభం అయ్యేలా చేస్తుంది. ఈ విషయం ఎవరికీ వారుగా గమనించుకోవాలి. కొందరిలో చాలా పలుచగా మజ్జిగ చేసుకొని తాగిన కూడా రుతుక్రమ ప్రారంభానికి సహాయపడుతుంది. రోజుకు కొంచెం పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ, పెరుగు వల్ల ఋతుక్రమానికి కలిగే ఆటంకం ఎలా ఉంది అని గమనించుకున్నాక పెరుగు తీసుకోవడమా? మజ్జిగ సేవించడమా? అని నిర్ణయం తీసుకోవచ్చు.

ముగింపు(conclusion) 

    పైన తెలిపిన చిట్కాలు..ఆహార పదార్థాలు..మన రోజువారీ జీవనవిధానం మరియు ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే, మీ శరీరానికి కావలసిన పోషక పదార్థాలు ఎంత మోతాదులో అవసరమౌతాయి అనేది న్యూట్రిషన్స్ ద్వారా అడిగి తెలుసుకొని, ఏ పదార్థం, ఏ పండ్లు ఏ మేర తీసుకోవడం సరి అవుతుంది, వాటి పనితీరు గురించి తెలుసుకున్నాక, ఆ విధానంలో తినడం అలవాటు చేసుకోవడం మంచిది. తద్వారా, ముందుగా మీ శరీర ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానూ, శక్తివంతంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే, స్త్రీలకు కావాల్సింది ముందుగా వారి శరీరం బలంగా ఉండడం. దీని ద్వారానే పై పోషకాలన్నీ కూడా..రుతుక్రమం అనేది సాఫీగా రావడానికైనా లేదా రుతుస్రావం వల్ల వచ్చే నొప్పి, అలసట, నీరసం నుండి విముక్తుల్ని చేయగలదు. అందుకే, తినే ఆహరంపై శ్రద్ద వహించడం ముఖ్యం. 

    రుతుక్రమం త్వరగా రావడానికి ఇంటి చిట్కాలను పాటించడం వల్ల లాభం కలుగుతుంది..కానీ, ప్రతి సారి చిట్కాలపై ఆధారపడి బ్రతకడం అనగా..చిట్కాలను పాటిస్తూ, రుతుస్రావం కోసమై ఎదురుచూడడం అనేది అలవాటు చేసుకునేంత మంచి పద్దతి కాదు అని నా ఉద్దేశ్యం..ఆరోగ్యముగా ఉండడానికి కావలసిన పోషకాలను మీ శరీరానికి అందిస్తూ..శరీరం ఎంత ఆరోగ్యముగా ఉంది..ఎంత శక్తివంతంగా ఉంది అని చూసుకుంటే చాలు..దానికదే..రుతుస్రావం సరిఅయిన సమయంలో మొదలు అవ్వడం జరగాలి. అలా రాలేదు అంటే..ఇంకా మీ శరీరానికి కావాల్సిన పోషకాలు ఏ విధంగా తగ్గుతున్నాయి. తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటి అని ఆలోచించండి..ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ అవగాహన కోసమై నిపుణులను అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి తప్పకుండా..

     అన్ని పోషకాలు శరీరానికి అందేలాగా అన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకుంటున్నాము..అయినా సరే, రుతుక్రమంలో కలిగే మార్పులతో, ఆలస్యంగా రావడం అనే సమస్యతో భాదపడుతున్నాము అని మీలోని ప్రశ్న అయితే..ముందుగా, ఒక సరైన విధానంలో ఆహరం తీసుకోవడం అతి ముఖ్యమైన లక్షణంగా భావించాలి..మరి మీరు తీసుకునే ఆహారం ఎంత? ఏ మోతాదు? మీ శరీరానికి సరిపడేది ఎంత? ఎక్కువగా లేదా తక్కువగా పోషకాలు అందుతున్నాయా? అనేది గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం. ఎందుకంటే, ఆరోగ్య జీవనం అనేది కేవలం అన్ని రకాల పోషకాలపైనా ఆధారపడి ఉంది. పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి, దృష్టి పెట్టాల్సింది దీనిపై మాత్రమే..అయితే, పరిస్థితి చేయి దాటే వరకు వచ్చి అనుభవిస్తున్నట్లయితే, వైద్యుడి సలహా, సూచనలు తీసుకోవాలి.

     మనం దృష్టి పెట్టాల్సింది కేవలం రుతుక్రమం సరైన సమయానికి రావడం కోసం మరియు సాఫీగా రావడం కోసం మాత్రమే..కానీ, బహిష్టు ముందుగా రావడం గురించి ఆలోచించాల్సిన ఆలోచనే రాకూడదు అని నా అభిప్రాయం..ఎంత మేర వీలయితే అంతగా మీ యొక్క పరిస్థితులను, ఫంక్షన్ల ను మీకు అనుకూలమైన సమయానికి జరిగేలాగా చేసుకోండి..ఆ పరిస్థితుల కోసం అని చెప్పి శరీరంలో జరిగే సహజమైన ప్రక్రియను మీ చేతులోకి తీసుకొని ఎలా అంటే అలా ఆటాడించాలి అని చూస్తూ మీ ప్రాణాలను ఆ పూజలు, ఫంక్షన్ల కోసం అని పణంగా పెట్టడం మీ వరకు మీకు సరి అనిపిస్తుందా అని ఆలోచించుకోవడం ముఖ్యం. ఎందుకంటే, ఒక సహజ ఋతుస్రావాన్ని ముందు, వెనక్కి లాగడం అంటే, మీ శరీరంలోని అవయవాలతోను, హార్మోన్ల తోను మీరు ఆటాడుకోవడం లాంటిది. ఇది కాస్త చివరగా, అవగాహన లేని తీరుతో ప్రాణ నష్టంకు దారి తీసే ప్రమాదం లేకపోలేదు అని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.

..సర్వేజనా సుఖినో భవంతు.. 

 

Add Comment