సమాజంలో రుతుక్రమం సమయంలో స్త్రీల పట్ల వివక్ష, అవగాహన తీరు మరియు పరిశుభ్రత|Discrimination, perception and hygiene towards women during menstruation in society in Telugu

ఋతుస్రావం ఎందుకు ఏర్పడుతుంది(Why does menstruation occur)?

   ఆడవారిలో నెలసరి రక్తస్రావం సహజమైనది. స్త్రీలలో అండోత్పత్తి జరిగి, ఫలదీకరణ జరగకపోతే, “నెలసరి” వస్తుంది. ఈ ఋతుస్రావమే లేకపోతే “మానవ జాతి(homo sapiens)” నశించి పోతుంది. స్త్రీలు పిల్లల్ని కనలేరు. శరీరం నుండి “మూత్రం, మలం” బయటకి పంపించినట్టే, బహిష్టు రక్తాన్ని కూడా బయటకి పంపించి వేస్తుంది.Discrimination, perception and hygiene towards women during menstruation in society in Telugu

సమాజంలో ఋతుస్రావంపై కొనసాగుతున్న చర్యలు(Ongoing actions on menstruation in society) 

    స్త్రీలు అనేక రకాల వివక్షత(Discriminatory)లకు గురవుతున్నారు. రాజకీయ అధికారం, నిర్ణయాధికారం లేకపోవడం, ఆరోగ్యం, విద్యా, ఆర్థికాధికారాల్లో వివక్షత, గృహహింస లాంటి చాలా అంశాలను గుర్తించి, వాటికి వ్యతిరేకంగా ఎంతో మంది పనిచేసినా కూడా, ఈ వివక్షత విశ్వరూపం మాత్రం మనకింకా పూర్తిగా కనబడనేలేదు. స్త్రీల ప్రాథమిక అవసరాలను విడిగా గుర్తించకపోవడం వివక్షతలో వివక్షత. “స్త్రీలు ప్రత్యేక శరీర నిర్మాణం కలిగి ఉంటారని, వారికి ప్రత్యేక అవసరాలు ఉంటాయని”, వాటికి అనుగుణంగా ప్రాథమిక సౌకర్యాలను ఏర్పరచాలనే భావన ఇప్పటివరకు కూడా బలంగా మన ఆలోచనలో, సంస్కృతిలో, విధివిధానాలలో పాతుకొననే లేదు.

   స్త్రీల హక్కులు, అభివృద్ధి, సమానత్వం, ఆరోగ్యం, సాధికారతలను కలిపి ప్రభావితం చేస్తున్న అంశం ఒకటి ఉన్నది. అది స్త్రీల శారీరక ధర్మం. స్త్రీలని ప్రత్యుత్పత్తికి సిద్ధం చేసేది. అది “బహిష్టు, నెలసరి, బయట ఉండడం, ముట్టు, ఋతుస్రావం, డేటు..వయస్సు, సామాజిక స్థాయి, కులము, ప్రాంతము బట్టి వేరు వేరు రకాలుగా పిలువబడే శారీరక ధర్మం(Menstruation, Menstruation, Abstinence, Touch, Menstruation, Date..Physical dharma called differently according to age, social level, caste, region”.)”. ఆడపిల్లలు..”పెద్దమనుషులు, రజస్వల, పుష్పవతి” అయ్యేది, స్త్రీ శరీరం సంసిద్ధం కావటం జరిగేది మానవ జాతిని సుస్థిరంగా కొనసాగించడానికే..ఇలా చదువుతుంటే, ఒక అద్భుతమైన పనిగా, ధర్మముగా వినిపించేదిగా ఉన్నా కూడా..మన నిత్య జీవితంలో మాత్రం సిగ్గుపడాల్సిన విషయముగా. రహస్యంగా ఉంచుకోవాల్సిన స్థితిలోనే ఉన్నాము ఇంకా..

ఋతుక్రమ సమయంలో శారీరక, మానసిక సమస్యలు(Physical and mental problems during menstruation) :

   నెలసరి సమయంలో మన శరీరంలోని హార్మోన్లలో చోటు చేసుకునే తేడా వల్ల ఎదురయ్యే మరో సమస్య “ప్రీ మెన్స్ట్రుల్ సిండ్రోమ్(Pre Menstrual Syndrome)”. ఇది దాదాపు 90% మహిళలకు ఎదురయ్యే సమస్య. నెలసరి 2 వారాల ముందు నుండి చిరాకు, ఒత్తిడి, ఆందోళన, ఉద్వేగాలకు లోనవడం, అలసట, తలనొప్పి, ఆకలి లేకపోవడం, రొమ్ముల్లో నొప్పి..వంటి లక్షణాలు కన్పిస్తాయి. అయితే, ఇవి అందరికి ఒకేలా ఉండవు. నెలసరి ప్రారంభం అయి, ఆగిపోయాక ఈ లక్షణాలు అదుపులోకి వస్తాయి. హార్మోన్ల ప్రభావం అనేది చర్మం, జుట్టు పైనా కూడా ఉంటుంది. నెలసరి సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ ల పని తీరులో తేడా వల్లే ఈ పరిస్థితి. అధిక బరువు ఉన్నవారు, వ్యాయామం సరిగా అలవాటు లేని వారికీ ఈ లక్షణాలు మరింత అధికంగా ఉంటాయి. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సమస్య అదుపులోకి వస్తుంది.

ఋతుస్రావం గురుంచిన అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి(Everyone should have awareness about menstruation) 

  దురదృష్టవశాత్తు ఋతుస్రావాన్ని సహజమైనదిగా చూడటం లేదు. దీని చుట్టూ రకరకాల అపోహాలు, పద్ధతులు, ఆచారాలు, నియంత్రణలు, పరిమితులు ఉన్నాయి. ఈ నమ్మకాలన్నీ కూడా స్త్రీలు నెలసరి పరిశుభ్రతను పాటించడానికి సరైన అవకాశాన్ని ఇవ్వనివే.

   ఎవరైనా అమ్మాయితో నీ శరీరం ఎదుగుతోంది..పునరుత్పత్తికి సిద్దమవుతుంది. ఇది ప్రకృతిలో అద్భుతమైన విషయం. భయపడనక్కర్లేదు, భాదపడనక్కర్లేదు, సిగ్గు అసలే పడనక్కర్లేదు అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. శుభ్రమైన బట్ట వాడి రక్తస్రావాన్ని పీల్చేట్టు చేయాలి. ఆ వాడిన బట్టని సబ్బుతో ఉతికి ఎండలో ఆరవేయాలి. చీమలు, పురుగులు చేరని చోట, బాక్టీరియాలు, ఫంగస్ లు రాని చోట జాగ్రత్త పరచాలి. ఈ పని నువ్వు చేయడానికి నీ కుటుంబ సభ్యులు, సమాజం నీకు సహాయపడుతుంది అని అర్ధం అయ్యేలా చెప్పాలి.

    అయితే, 4 మాటల చుట్టూ తిరుగుతూ ఉంది..అది “రహస్యం, భయం, సిగ్గు, అవమానం”.. వీటిని రహస్యంగా ఉంచాల్సిన విషయం అంటారా? ఎందుకు? ఆడపిల్లలకి మాత్రమే పరిమితమా? ఎందుకీ నిషేధాలు? ఇళ్లలోకి రాకూడదు?, పొలాల్లోకి రాకూడదు?, గుళ్ళలోకి రాకూడదు? బహిష్టు కంటే మరొక కార్యం ఉంటుందా? ముట్టు అపవిత్రమైంది అయితే, మానవ జాతి మనుగడ అంతా అపవిత్రత మీదే కదా ఆధారపడి ఉన్నది. బానిస, బానిసకొక బానిస అసలే ఆడవాళ్లు, అందులోను ముట్టయ్యారు. అంటే అర్ధం అంటయ్యారు.

   స్త్రీలు తమ జీవితకాలంలో అనుభవించే ఋతుక్రమం పట్ల మనకున్న నమ్మకాలు..ఆడపిల్లలు, స్త్రీల బ్రతుకులను ఎంత అసహ్యంగా చేస్తున్నాయి. అసలేమి తెలియనితనం దగ్గరి నుండి మొదలు పెట్టి, ముట్టు గుడ్డలకి కరువు నుండి, వాటిని పారేయడానికి కూడా చోటు లేకపోవడం భౌతిక సమస్యలయితే, అంటరానితనం, ముట్టరానితనం మానవ హక్కులనే హరించివేస్తోంది అవకాశాలని దూరం చేస్తోంది. అనారోగ్యాలని దగ్గర చేస్తోంది.

   మనం మాడ్లాలేమా? ప్రపంచంలోని ప్రతి ఒక్కరి బాధ్యతాయుతంగా మనుషులుగా నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి, గుసగుసలు పక్కకు పెట్టి, బహిష్టు గురుంచి బహిరంగంగా మాట్లాడుదాము(Let’s talk openly about menstruation). ఆడవాళ్ళ జీవితాలకు ఒక అందమైన అనుభవం కావాలి. “ముట్టు” కాదు, “మైల” కాదు అని వివరించాలి.

  కాబట్టి, ప్రపంచం గుర్తిస్తోంది..మే 28 న “మెన్స్ట్రుల్ హైజీన్ మేనేజ్మెంట్ రోజు(Menstrual Hygiene Management Day)” గా గత 3 సంవత్సరాలుగా సెలబ్రేట్ చేసుకుంటోంది. కేవలం పరిశుభ్రత అంశంగా కాక అందమైన అనుభవంగా సెలబ్రేట్ చేసుకుందాం..Discrimination, perception and hygiene towards women during menstruation in society in Telugu

   పిల్లలకు పాఠశాల(School)లో విషయం పట్ల అవగాహన పెంచడంతో పాటు సమాచారాన్ని “ఒక తరం నుండి ఇంకో తరానికి(“From one generation to another)” అందజేయడంలో తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు ముఖ్యపాత్ర వహిస్తున్నారు. కనుక వాళ్ళను కూడా అవగాహన కలిగించేందుకు ప్రేరేపించేలా ప్రయత్నం చేయాలి. అయితే, “సమాచారం తెలిసి ఉండడం ఒక మెట్టయితే, అవగాహన కలిగి ఉండడం తరువాతి మెట్టు”. ప్రత్యుత్పత్తి అవయవాలు, ఋతుచక్రం, బహిష్టు సమయంలో పరిశుభ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురుంచి అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. మరియు బహిష్టు గురించి “మగవాళ్ల”కు కూడా సరియైన అవగాహన తప్పకుండా ఉండేలాగా చూడాలి. 

ఋతుస్రావ పరిశుభ్రత(Menstrual Hygiene) 

   10 సంవత్సరాల వయస్సు నుండి మొదలు 50 సంవత్సరాల వయస్సు దాకా స్త్రీలకి బహిష్టులు ఉంటాయి. బహిష్టు సమయంలో 3-5 రోజుల వరకు స్త్రీల యోని నుండి రక్తస్రావం అవుతుంది. ఈ రక్తస్రావాన్ని పీల్చడానికి స్త్రీలు యోని ప్రాంతంలో బట్టలను, ఇతర పీల్చే గుణం ఉన్న పదార్థాలను ధరించి రక్తస్రావం బయటకు వచ్చి, ఇబ్బంది కలగకుండా ఉండేటట్లు చూసుకుంటారు. రక్తాన్ని పీల్చుకోవడానికి సురక్షితమైన విధానాన్ని ఎంచుకోవాలి. ఈ బట్టను లేదా వేరే వాటిని తరచుగా మార్చుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది.. Discrimination, perception and hygiene towards women during menstruation in society in Telugu

   మౌలికాసదుపాయాల కల్పనా రంగాలైన నీరు, పారిశుధ్య రంగాలు “మానవ మలం” తొలగింపు భాద్యత తీసుకుంటాయి. కానీ, బహిష్టు వ్యర్థాల తొలగింపుకి మాత్రం వాళ్ళ దగ్గర ప్రత్యేక పద్ధతులు ఏమి లేవు. కేవలం, వాడి పారేసే “నాప్కిన్సే(napkins)” ఉపయోగిస్తే చెత్త పెరిగిపోతుంది. ఇదొక “పర్యావరణ సమస్య(Environmental problem)”గా మారుతుంది. ఇది ప్రస్తుతం, ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్య. ఒక సమస్యకి పరిష్కారంగా మరొక సమస్యను సృష్టించుకోకూడదు.

    మన దేశ వనరులని దృష్టిలో పెట్టుకొని కొత్త సమస్యలు ఉత్పన్నం కానీ పద్దతిలో పరిష్కారం గురుంచి ప్లాన్ చేయాలి. చెత్త తొలగింపు నిర్వహణ మనకి ఇప్పటికే తలకుమించిన భారంగా ఉన్నది. వాడి పారేసిన నాప్కిన్స్ ని సరైన పద్దతిలో కనుక తొలగించకపోతే, అది మరొక పెద్ద పర్యావరణ సమస్యగా తయారౌతుంది. ఏ కార్యక్రమం అయినా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో బహిష్టు పరిశుభ్రతను ప్రోత్సహిస్తున్నపుడు, వ్యర్దాల తొలగింపు పద్దతులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

    బహిష్టు పరిశుభ్రతా వ్యర్థాలని ఏ విధంగా తొలగించాలి అనే విషయంలో మన దేశంలో కొన్ని మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళనాడులో ‘యూనిసెఫ్ చౌక”గా తయారయ్యే “కొలిమి”లను ఏర్పాటు చేసింది(In Tamil Nadu, UNICEF has set up “cheap” cooking “furnaces”). వీటిని “కట్టెలతోను, కరెంట్” తో కూడా నడపవచ్చు. వీటిలో “శానిటరీ నాప్కిన్స్” ని పారవేయవచ్చు. మహారాష్ట్రలో బాలికల మరుగుదొడ్లకు ప్రత్యేకమైన గుంటలను ఏర్పాటు చేసారు. వాడిన నాప్కిన్స్ ఇందులో పడేస్తే అవి కంపోస్ట్ అవుతాయి. ఉత్తరప్రదేశ్లో జల్లెడపట్టిన కలపపొట్టుని బట్టలో చుట్టి నాప్కిన్స్ ని తయారు చేస్తున్నారు. ఈ పదార్థాలు తేలికగా మట్టిలో కలిసిపోతాయి. ఇవన్నీ కూడా ప్రయోగాత్మకంగా జరుగుతున్న మంచి ప్రయత్నాలు. స్థానికంగా శానిటరీ నాప్కిన్స్ ని తయారు చేస్తే స్థానిక ఆర్డిక వ్యవస్థ బలోపేతం అవడమే కాక, కొనసాగడానికి, వ్యర్థాల్ని తొలగించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

శానిటరీ ప్యాడ్స్ చవకగా అందించడం, నాణ్యత కలిగిన, స్థానికంగా దొరికే వస్తువులతో తయారైన వాటిని, పారవేయడంలో మనుషులకి, ప్రకృతికి హాని కలిగించని పద్దతిని ఏర్పరుచుకోవడం తక్షణ అవసరం. అయితే, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి మాత్రం అవగాహనతో సమాజంలో సామాజిక మార్పు రావాలి. ప్రతి కార్యక్రమం ఆ దిశగా పని చేయాలి. సామాజిక ఆంక్షలు తొలగినప్పుడే, రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేనప్పుడే నిజమైన పరిశుభ్రత మొదలౌతుంది(Real cleanliness begins when social taboos are removed and there is no need to keep secrets).

ప్రభుత్వం యొక్క భాద్యత తప్పనిసరిగా ఉండాలి(The responsibility of the government must be there) 

   ఋతుస్రావ సమయంలో ప్యాడ్స్ కొనలేని దుస్థితి కొందరిది అయితే, శానిటరీ ప్యాడ్స్ వల్ల వచ్చే ఇబ్బందులు కొంతమందివి, ఇంకా కొన్ని గ్రామాలల్లో అవగాహన లేక, సిగ్గుతో ప్యాడ్స్ కొనలేక, బట్టను వాడడం జరుగుతుంది..కానీ, వాటిని శుభ్రపరుస్తున్నారా? వాటి శుభ్రత సరిగా లేకపోతె మన ఆరోగ్యానికే హాని కలుగుతుంది అని తెలియకపోవడం..అనే దుస్థితిలో ఉండడం..వాడిన ప్యాడ్స్ ను ఎక్కడ పడవేయాలి?..వాటి యొక్క చెత్త తొలగింపు ఎలా చేయాలి? అనే ప్రశ్నార్ధక సమస్య..ఇలా ఎన్నో బహిష్టు నుండి సమస్యలని ఎదుర్కోవడం సహజంగా జరుగుతున్నా కూడా..ఎవరి ఇబ్బంది వారిది, ఎవరి ఆనందం వారిది..సరైన పరిష్కారం కనిపించట్లేదు..

   అందుకే, ప్రభుత్వం బహిష్టు కు సంబంధించి చర్యలు తీసుకోవాలి. ముఖ్యముగా, స్త్రీలకు పై పై అనారోగ్యాల కోసం ప్రభుత్వం పథకాలు అమలు చేయడం..చూపించుకోవడం కోసం అనేది అందానికి మెరుగులు దిద్దడం వంటిదే అవుతుంది. అసలైన, ఋతుక్రమ సమస్యలు ఏమి ఉన్నాయి? ఎలా ఎదుర్కొంటున్నారు? వారి ఆరోగ్యం ఏ విధంగా బలహీనపడుతుంది? కావాలసిన అవసరాలు ఏమిటి అని తెలుసుకోవాలి? ఏ ఇబ్బంది అనేది కలగకుండా, స్త్రీ గా పుట్టినందుకు గర్వంగా ఉంది అనే భావన కలిగేలాగా, ఆ ప్రత్యేకస్థానం, గౌరవం దక్కేలా చేయడం ప్రభుత్వం యొక్క భాద్యత అయి ఉండడం స్త్రీలకు ఇచ్చే అసలైన విలువగా గుర్తింపు పొందగలగాలి ప్రభుత్వం.  

ఋతుస్రావం సమయంలో ప్యాడ్స్ వాడకం(Use of pads during menstruation)

పీరియడ్స్ సమయంలో క్రమం తప్పకుండా ప్రతి 4 లేదా 6 గంటలకు ఒకసారి మార్చుకోవడం చాలా ముఖ్యం. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే, శానిటరీ ప్యాడ్స్ వల్ల వచ్చే సమస్య కూడా ఒకటి ఉంది. ప్యాడ్స్ వాడకం ద్వారా వారి తొడలు, మరియు ఇతర ప్రాంతాల్లో దురద, దద్దుర్లు రావడం జరుగుతుంది. Discrimination, perception and hygiene towards women during menstruation in society in Telugu

బట్టతో తయారుచేసిన ప్యాడ్స్ యొక్క ఉపయోగాలు :

  • ఇది పర్యావరణానికి అనుకూలమైనవి. ఎలాంటి కాలుష్యాన్ని కలుగజేయదు.
  • ప్లాస్టిక్(Plastic), నాన్-బయోడిగ్రేడ్ మెటీరియల్స్(Non-biodegrade materials)తో తయారుచేయబడిన డిస్పోసబుల్ ప్యాడ్ల మాదిరిగా కాకుండా, క్లాత్ ప్యాడ్లు పత్తి, జనపనారతో తయారుచేస్తారు(Cloth pads are made of cotton and jute). వీటిని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు.
  • ఈ క్లాత్ ప్యాడ్లు చాల సౌకర్యంగా ఉంటాయి. చాల తేలికగా, బ్రీతబుల్ గా ఉంటాయి(Very light and breathable.). చర్మానికి చికాకు కలిగించేసే రసాయనాలు, సింథటిక్ పదార్థాలు ఉండవు(Contains no chemicals or synthetic ingredients that can irritate the skin).
  • వీటి ధర ఎక్కువగానే ఉంటుంది. కానీ, వీటిని చాలా కాలం పాటు వాడుకునే వీలు ఉంటుంది. కాబట్టి, శానిటరీ ప్యాడ్ల కంటే తక్కువ ఖర్చు అవుతుంది.
  • అయితే, ఇది వ్యక్తులను బట్టి ఉంటుంది. బహిష్టు రక్తస్రావం పరిమాణం మరియు క్లాత్ ప్యాడ్ స్థితిని బట్టి ఎంతకాలం వాడటం శ్రేయస్కరం అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
  • ప్రతి 2 – 5 సంవత్సరాల ఒకసారి ఎప్పుడైనా ప్యాడ్ స్థితిని బట్టి మార్చాల్సిన అవసరం ఉంటుంది అని వైద్యులు చెప్తున్నారు.

క్లాత్ ప్యాడ్ ను శుభ్రం చేయు విధానం :Discrimination, perception and hygiene towards women during menstruation in society in Telugu

  1. ప్యాడ్ తీసిన వెంటనే నీళ్లతో ఒకసారి కడిగేసి, ఆ తర్వాత చల్లని నీటిలో 30 నిమిషాల వరకు నానబెట్టాలి. దీనివల్ల మరకలు ఏర్పడకుండా ఉంటాయి. వేడి నీటిని ఉపయోగించవద్దు. ఎందుకంటే, మరకలు అలాగే ఉండిపోతాయి.
  2. సహజమైన, పర్యావరణానికి అనుకూలమైన సబ్బును వాడి, శుభ్రపరుచుకోవాలి.
ప్రస్తుత కాలంలో ఋతుస్రావ సమయంలో ప్యాడ్స్ కి బదులుగా “కప్స్” వాడుతున్నారు(Nowadays cups are used instead of pads during menstruation) 
  • బహిష్టు సమయంలో ప్యాడ్స్ కి బదులుగా, “బహిష్టు కప్(Menstrual cup)” లను ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.
  • ప్యాడ్స్ అనేవి “అసౌకర్యాన్ని, పర్యావరణ కాలుష్యం”ను కలుగజేస్తూ..ఎలర్జీలతో పాటు ఇతర సమస్యలకు కారణమౌతున్నాయి. కాబట్టి, బహిష్టు కప్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి.
  • అయితే, ఈ కప్స్ సిలికాన్ తో తయారు చేస్తారు. ఇది ప్యాడ్స్ కంటే ఎక్కువగా రక్తస్రావాన్ని అదుపు చేయగలదని, దీని వాడకం మంచిదని వైద్యులు అంటున్నారు. ఈ కప్ ను 10 – 12 గంటల వరకు వాడవచ్చు.
  • ఒకవేళ మీరు బహిష్టు కప్ లను వాడాలనుకుంటే ఒకసారి గైనకాలజిస్ట్ ను సంప్రదించడం మంచిది. ఇందులో చిన్న సైజ్, పెద్ద సైజ్ లు అందుబాటులో ఉంటాయి.
  • మీకు ఏ సైజ్ సరిపోతుందో గైనకాలజిస్ట్ ను అడిగి, తెలుసుకొని ఆ సైజ్ ను కనుక్కొని వాడాలి.
  • అధిక రక్తస్రావం జరిగి, నిండిపోతే..10 – 12 గంటల ఒకసారి తీసేయాలి. లేకపోతె లీక్ అవుతుంది.
  • ఇది దీర్ఘకాలంగా ఉపయోగించే ప్యాడ్స్ కంటే కూడా చౌకగా లభిస్తుంది. దీన్నీ తరచుగా మార్చవలసిన అవసరం లేదు.
  • శానిటరీ ప్యాడ్స్ లాగ ప్రతి రోజు పడేయాల్సిన అవసరం లేదు. పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది.
  • ఈ కప్ ను ఉపయోగించడం వల్ల యోని భాగం ఆరోగ్యముగా, పరిశుభ్రముగా ఉండే అవకాశం ఉంటుంది.Discrimination, perception and hygiene towards women during menstruation in society in Telugu

 

బహిష్టు కప్ ను వాడే విధానం :

  1. ముందుగా మీ చేతులు శుభ్రం చేసుకోవాలి. తర్వాత, కప్ అంచులను నీటితో తడపాలి.
  2. అంచులను పైకి ఉండేలా కప్ ని ఒక చేతితో మడిచి పట్టుకోవాలి.
  3. ఇప్పుడు ఈ కప్ ను నెమ్మదిగా యోని లోపలికి ఇన్సర్ట్ చేయాలి.
  4. కప్ లోపలికి పెట్టిన తర్వాత అటూ, ఇటూ తిప్పాలి.
  5. మీరు సరిగ్గా ఇన్సర్ట్ చేసి ఉంటె, లోపల కప్ ఉందనే ఫీల్ రాకూడదు. లోపల ఎదో ఉందని అనిపించదు.
  6. ఎప్పటిలానే అన్ని పనులు సులువుగా చేసుకోవచ్చు.

కప్ ను బయటకి తీసే విధానం :

  • కప్ ను బయటకి తీసేపుడు కుడా చేతులు శుభ్రపరుచుకోవాలి.
  • ఇప్పుడు బొటన వేలు, చూపుడు వేలు ను యోనిలోకి పెట్టి కప్ కింది మొన భాగాన్ని పట్టుకొని నెమ్మదిగా లాగాలి.
  • గట్టిగా నొక్కితే సీల్ తెరుచుకుంటుంది. కనుక నెమ్మది గా లాగాలి.
  • ఇప్పుడు కప్ బయటకి తీసి, తర్వాత రక్తస్రావం ను శుభ్రపరచాలి.
  • ఇలా రోజుకు కనీసం, 2 సార్లు కప్ ను మార్చవలసి ఉంటుంది.
ముగింపు(Conclusion) 

   సమాజంలో స్త్రీలు అనేక రకాల వివక్షతలకు గురవుతున్నారు. వాటిని అదుపులో పెట్టడానికి, మార్పులు తీసుకురావడానికి ఎంతో మంది కృషి చేస్తున్నారు. కానీ, సాదించలేకపోతున్నాము అనే వెలితి..కదా! అందుకే, బహిష్టుకు సంబందించిన ముందు ఆర్టికల్స్(Articles)లో తెలియపరిచినట్లుగానే..ఈ సృష్టిని, మానవ జాతిని అందులోను ఆడపిల్లలుగా సృష్టింపబడడం అనే విలువను తెలుసుకునే ప్రయత్నం చేసి, అర్ధం చేసుకోగల సామర్థ్యం ప్రతి ఒక్కరికి కలిగితే చాలు..దానికదే, ఆడవారికి కలిగే బహిష్టు యొక్క పరమార్థం, సంపూర్ణమైన ఒక  అవగాహనను పొందగలం అనేది నా నమ్మకం..

     బహిష్టు యొక్క రక్తస్రావంను “అంటూ, ముట్టూ” అని ఆడవారిని హేళన చేయడం ధర్మం కానే కాదు..మరి ఋతుక్రమ సమయంలో వాళ్ళకంటూ ఒక స్థలం కేటాయించి జాగ్రత్తగా చూసుకోవడం ఎంత అవసరమో..అంతకు మించి ఒక పవిత్ర భావనతో మాత్రమే వారితో మెలగడం చాలా ముఖ్యం అని గ్రహించాలి. అలా అని చెప్పేసి..ఋతుక్రమ సమయంలో కూడా స్వేచ్ఛగా తిరుగుతాము. మాకు అన్ని హక్కులు కావాలి. దేవాలయాలకు, మరి ఏ ఇతర పవిత్రమైన స్థలాలకు వెళ్ళడానికి అనుమతి కావాలి. అదే ఆడవారికి కలిగే ఆనందం, నిజమైన స్వేచ్ఛ..అంటే మాత్రం మనం మన తెలివి ఏ స్థాయిలో ఎదిగి ఉన్నాము అనేది ఋజువవుతుంది.

    ముఖ్యముగా, ఒక సనాతన ధర్మం కలిగి ఉన్న భారతదేశంలో మన పూర్వీకులు బహిష్టు యొక్క పరమార్థం తెలుసు కాబట్టే..ఆ సమయంలో స్త్రీలు ఎలా ఉండాలి. ఏ ఏ ఆచారాలు పాటించడం..స్త్రీ యొక్క ఆరోగ్యానికి గాని, ఆ కుటుంబానికి గాని, సమాజానికి గాని ఎంతటి మేలు కలిగిస్తుంది ఒక అవగాహనతో మాత్రమే చెప్పడం జరిగింది. వాటిని మన పెద్దలు పాటిస్తూ రావడం జరిగింది.

   బహిష్టు ఒక సహజమైన ప్రక్రియ..అయితే మనకు కావాల్సింది ఒక “అవగాహన స్థితి” మరియు “పరిశుభ్రత”. అంతేకాని, మనకు ఉన్న తెలివితేటలను అనుసరించి, ఆచారాలు అన్ని కూడా ఒక “చాదస్తం” అని తీసిపడేసి, తిరుగుతూ..తిరిగి సమాజంలో వివక్షత కలుగుతుంది అనేది సరైన తీరు కానే కాదు. ఆడవారిని గౌరవించగలిగితే, బహిష్టు యొక్క ప్రాముఖ్యత, విలువ అర్ధం అవ్వాలి. అర్ధం చేసుకోవాల్సిన భాద్యత కూడా ఉంటుంది తప్పనిసరిగా సమాజంలోని ప్రతి ఒక్కరికి.. అయితే, ఈ విధమైన మార్పు తీసుకురావడానికి కృషి చేయాలి. ఆ సమయంలో ఆడవారు చేయాల్సిన పని మరియు ఎంత విశ్రాంతి తీసుకోవాలి అనే దానిపై కూడా అవగాహన తీసుకురావాలి. కేవలం, విశ్రాంతి అంటే, అది వాళ్లకి ఇచ్చే విశ్రాంతి సమయం కాదు. మన ఇల్లు, పరిసరాలు శుద్ధిగా ఉంచడం కోసం అని కూడా గుర్తుపెట్టుకోవాలి. దీని నుండి కలిగే లాభం అవగతం చేసుకోవాలి.

..సర్వేజనా సుఖినో భవంతు.. 

Add Comment