Brown Rice Health Benefits in Telugu

 

Brown Rice Benefits:

మన దేశములో ప్రధానంగా మన రెండు తెలుగు రాష్టాలతో పాటు కేరళ,తమిళనాడు వంటి రాష్టాలలో సాధారణంగా అందరూ ఎక్కువగా తినే ఆహారం అన్నం. కానీ మనం  ప్రతి రోజు తినే అన్నం గురించి ఆలోచించేది ఒకటే…అది అన్నం తెల్లగా ఉందా…తినటానికి సౌకర్యంగా ఉందా అని మాత్రమే ఆలోచిస్తాము.

కానీ అందులోని పోషక విలువల గురించి ఆలోచించము. దాదాపుగా మన అందరము కూడా పూర్తిగా పాలిష్ చేయబడిన బియ్యంనే వాడుతున్నాం. పాలీష్ చేయబడిన బియ్యంలో బీ కంప్లెక్సు విటమిన్లు లేకుండా పోతున్నాయి.

Brown Rice Benfits

 అందువల్ల దంపుడు బియ్యం తినటం మన ఆరోగ్యానికి చాలా  మంచిది… కానీ ఇప్పుడు పట్టణాలలో,పల్లెటూళ్లలో దంపుడు బియ్యం తినే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రోగాలను అదుపులో ఉంచటానికి,ముందు తరాల వారు ఎక్కువగా రోగాల బారిన పడకుండా ఉండటానికి దంపుడు బియ్యం తినటం చాలా అవసరం. దంపుడు బియ్యం తినటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి .

అవి ఏంటో తెలుసుకుందాము …..

 

  • శరీర బరువును తగ్గిస్తుంది,బరువు పెరగకుండా కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థం వాళ్ళ శరీరంలో ఉండే అదనపు క్యాలరీలను తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా తగ్గిస్తుంది
  • మన శరీర నాడీ వ్యవస్థ ఆరోగ్యకరంగా,సక్రమంగా పనిచేయటానికి…ఎముకలు వృద్ధిచెందటాని అవసరం అయిన మెగ్నీషియం ,జింక్ పుష్కలంగా దంపుడు బియ్యంలో లబిస్తాయి.

Brown Rice Benfits

  • దంపుడు బియ్యంలో సెలీనియం ఎక్కువగా ఉండటం వలన ఉబ్బసం వంటి రోగాలతో బాధపడేవారిలో దాని తీవ్రతను తగ్గిస్తుంది.
  • రక్తంలో ఉండే చెక్కర నిల్వలను నియంతిస్తుంది. బ్రౌన్ రైస్ లో ఉండే పీచు పదార్థం వలన టైపు 2 డయాబెటిక్ వచ్చే అవకాశాన్ని నియంత్రిస్తుంది…అలాగే డయాబెటిక్ ఉన్నవారికి దానిని నియంత్రిస్తుంది.

Brown Rice Benfits

  • గుండె జబ్బులు  రాకుండా నియంత్రిస్తుంది. బ్రౌన్ రైస్ రక్తపోటును తగ్గిస్తుంది. రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా తోడ్పడుతుంది. దీనివలన కొలెస్ట్రాల్ అదుపులో ఉండి,గెండె జబ్బులు వచ్చే అవకాశాన్ని చాలావరకు తగ్గిస్తుంది.
  • పాలిచ్చే తల్లులకు బ్రౌన్ రైస్ ఒక వరం…ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివలన పాలు సమృద్ధిగా బిడ్డకు  లభిస్తాయి.

బెస్ట్ బ్రౌన్ రైస్ బ్రాండ్స్ ఇక్కడ క్లిక్ ఆన్లైన్లో కొనండి

 

  • మనం రోజూ తినే అనారోగ్యకరమైన ఆహారాలవల్ల మన శరీరములో అనవసరమైన టాక్సిన్స్ పెరిగిపోతాయి. బ్రౌన్ రైస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వలన ఆ టాక్సిన్స్ పెరగకుండా కాపాడతాయి.
  • కాన్సర్ వంటి  ప్రాణాంతక వ్యాధిన పడి అనేక మంది చనిపోతున్నారు. బ్రౌన్ రైస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వలన …మన శరీరంలో కాన్సర్ కారక కణాలు వృద్ధి చెందకుండా తోడ్పడుతుంది.

Brown Rice Benfits

  • ఈ  రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డిప్రెషన్. దాదాపుగా ఈ సమస్య నూటికి తొంబై మంది ఎదుర్కొంటున్నారు. బ్రౌన్ రైస్ లో గ్లుటామిన్,గ్లిజరిన్ మరియు గాబా వంటి కొన్ని ఎమినో ఆసిడ్స్ లభించటం వలన.. మన మెదడులోని సిరోటినివ్ ఉత్పత్తి ని పెంచి డిప్రెషన్ ని తగ్గిస్తుంది.

 

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.

అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.