అరటిపండు తినండి, అరటిఆకులో భోజనం చేయండి..అంతులేని ఆరోగ్య శక్తులను పొందండి|Eat banana, dine on banana leaf.. get endless health powers in Telugu.

అరటిచెట్టు అంతులేని ఆరోగ్య శక్తులను అందించే గొప్ప ఔషధం(Banana tree is a great medicine that offers endless health benefits) :

     అరటిపండు తినడం అయినా, అరటిఆకులో భోజనం తినడం అయినా ఎంతో మధురానుభూతిని కలిగిస్తుంది కదా! మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వాలన్న, మన శరీరంలో రక్తం సరిగ్గా ఉండాలన్న, మలబద్దకం సమస్య లేకుండా ఉండాలన్న అరటి పండును తినాలని చెప్తుంటారు. దీని అర్ధం, అరటిపండులో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందజేస్తుంది.

    అరటి మొక్క ఉంటే అన్ని ఉన్నట్లే అంటారు. ఎందుకంటే, అరటిలోని ప్రతి భాగం ఉపయోగకరమే..అరటి కాండం, అరటి ఆకులు, అరటి పండు ఇలా..ఏదీ వ్యర్థం కాదు..మరియు అరటి ప్రసాదించే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం..అందుకే, దీనిని “కల్పతరువు” అంటారు. అరటిపండు ఒక “సూపర్ ఫ్రూట్(Super Fruit)”, చాలా ప్రముఖమైన, ప్రసిద్ధి పొందిన పండు. ఇది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇష్టమైన అరటిపండు.Eat banana, dine on banana leaf.. get endless health powers in Telugu.

    అరటిచెట్టు, అరటి ఆకులు శుభ సూచకం. అందుకే, అరటిని ఆహారం మొదలు శుభకార్యాలలో అలంకరణ వరకు అనేక రకాలుగా ఈ చెట్టును ఉపయోగిస్తుంటారు. అలంకరణ కూడా అరటిపండ్లను, అరటి ఆకులను బాగా వాడుతారు. అరటి నారను బట్టలు మరియు వివిధ వస్తువులు తయారు చేయడానికి వినియోగించడం జరుగుతుంది.

    అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క. ఇది “మ్యుసేసియో” కుటుంబానికి చెందినది. అరటిచెట్టు ఆసియా వాయువ్య దేశాలలో పుట్టింది. భారతదేశంలో మొత్తం 50 రకాల అరటిపండ్లు లభిస్తున్నాయి. వాటిలో కొన్ని రకాలు పచ్చ అరటిపండ్లు, చక్కరకేళి, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి, ముకిరీ..

100 గ్రాముల అరటిపండులో ఉన్న పోషక పదార్థాలు(Nutrients in 100 grams of banana) :

  • నీరు                                   –                       70.1 గ్రా
  • ప్రోటీన్                              –                       1.2 గ్రా
  • కొవ్వు పదార్థాలు              –                       0.3 గ్రా
  • పిండి పదార్థాలు             –                       27.2 గ్రా
  • క్యాల్షియం                        –                      17 మి.గ్రా
  • ఇనుము                           –                      0.4 మి.గ్రా
  • సోడియం                        –                       37 మి.గ్రా
  • పొటాషియం                  –                       88 మి.గ్రా
  • రాగి                                  –                      0.16 మి.గ్రా
  • మాంగనీస్                      –                      0.2 మి.గ్రా
  • జింక్                                –                     0.15 మి.గ్రా
  • క్రోమియం                       –                    0.004 మి.గ్రా
  • కెరోటిన్                            –                    78 మైక్రో.గ్రా
  • రైబోఫ్లేవిన్                       –                   0.08 మి.గ్రా
  • విటమిన్ సి                      –                   7 మి.గ్రా
  • థయామిన్                       –                   0.05 మి.గ్రా
  • నియాసిన్                        –                   0.5 మి.గ్రా
  • శక్తి                                     –                   116 కిలోకేలరీలు

అరటి ఆకులో భోజనం మరియు సాంప్రదాయ విశేషాలు(Meals and Traditional Features in Banana Leaf) :

    అరటి ఆకులో భోజనం మనసుకు ఇంపుగా, తృప్తిగా ఉంటుంది. పూర్వకాలంలో అతిధులు ఇంటికి వచ్చినపుడు అరటి ఆకులో భోజనం పెట్టేవారు. ఎందుకంటే, ఈ అరటి ఆకులు చాలా సున్నితంగా, పెద్ద సౌలభ్యంగా ఉండి, తడి అంటకుండా ఉండడం చేత సులువుగా ఆకులో భోజనం చేయడానికి వీలు పడుతుంది. మరియు ఆరోగ్యానికి మంచిది. భోజనంలో ఏదైనా విషం కలిసినపుడు అరటి ఆకు నల్లగా మారడం జరుగుతుంది. అలా..విషప్రభావాన్ని హరించివేస్తుంది. అందుకే, ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశంతోనే అరటి ఆకులో భోజనం పెట్టేవారు. ఈ అరటి ఆకు క్షయ, కఫవాతం, దగ్గు, ఉబ్బసం, మొదలైన వ్యాధుల్ని అణచివేసి జఠరాగ్ని, వీర్యబలాన్ని, ఆయువుని పెంచుతుంది.

   అయితే, ఎవరైనా ఇంటికి వెళ్లిన లేదా శుభకార్యాలకు వెళ్ళినపుడు భోజనం చేసిన తర్వాత అరటి ఆకు మన వైపుకు మడచాలి. అటువైపు మడిస్తే సంబంధాలు చెడిపోతాయని నమ్మకం.Eat banana, dine on banana leaf.. get endless health powers in Telugu.

ఇతిహాసాలలో అరటిపండు ప్రస్తావన(Mention of banana in epics) :

     శుభప్రదమైన అరటిచెట్టు వెనుక ఒక ఇతిహాస సంబందమైన కథ కూడా ఉంది. పూర్వకాలంలో “దుర్వాసమహాముని” సాయంసంధ్యావేళ కూడా ఆదమరిచి నిద్రపోతున్నప్పుడు ఆయన “భార్య(కదలీ)” సంధ్యావందనం సమయం అయిన కారణమున ఆయనను నిద్ర నుండి మేలుకొల్పుతుంది. దుర్వాసుడు నిద్ర నుండి లేచి చుసిన మరుక్షణమే ఆయన నేత్రాల నుండి వచ్చిన కోపాగ్నికి ఆవిడ “భస్మరాశి” అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత దుర్వాస మహర్షి మామ గారు తన కూతురు గురుంచి అడుగగా, ఆవిడ తన కోపాగ్ని వల్ల భస్మరాశి అయినది అని చెప్పి, తన మామగారి ఆగ్రహానికి గురి కాకుండా ఉండేందుకు దుర్వాసముని తన భార్య శుభప్రదమైన కార్యాలన్నింటిలో “కదలీ ఫలం”(సంస్కృతంలో కదలీ ఫలం అంటే అరటిపండు) రూపంలో వినియోగించబడుతుంది అని వరాన్ని ఇస్తాడు అని చెప్పబడింది..

అరటి చెట్టులోని ఒక్కో భాగం వివరణ(Description of each part of banana tree) :

      అరటితో రకరకాలైన వంటకాలు చేసుకోవచ్చు. అరటి కూర, అరటి వేపుడు, అరటి బజ్జి ఇలా..మొదలైన రకాలు. అరటితో అల్పాహారాలు, అరటి పండు రసాలు కూడా చేసుకోవచ్చు. అరటికాయతో చిప్స్ కూడా తయారు చేయడం ఓ అల్పాహారం. ఇది ప్రపంచవ్యాప్తంగా బహుప్రసిద్ధి. ఎన్నో కంపెనీలు లాభదాయకంగా ఈ చిప్స్ తో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అరటిపండుగానో, అరటికాయతో కూర చేసుకొని గాని మాత్రమే తింటే మన శరీరానికి అన్ని మంచి పోషకాలు అందుతాయి. లేదంటే, అరటి పండును లేదా అరటి కాయను రకరకాల ఆహారపదార్థాల రూపంలో..(బ్రేడ్స్, కుకీస్, చిప్స్, మిల్క్ షేక్) వంటి వాటిలో ఉపయోగించి తీసుకోవడం వల్ల పోషకాలు అన్ని అందకపోవొచ్చు. అరటి సాగు ఉద్యాన రైతులకు ఓ ఆదాయ వనరు. అరటిలోని ఒక్కో భాగం అందించే ప్రయోజనాలు చుద్దాం..

  1. అరటి గెలలు : అరటి మొక్కను పెంచడానికి ముఖ్య కారణం అరటి గెలలు కోసం. ఈ అరటి గెలల నుండి అరటి కాయలు వస్తాయి. వీటి నుండి పండుగా మారితే అరటి పండుగా తినేయవచ్చు. అరటి కాయల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది వాసోడైలేటర్ గా పని చేస్తుంది. రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది అథెరోస్ల్కెరోసిస్(Atherosclerosis), గుండెపోటు, గుండె జబ్బులను నివారించగలదు. ఆకుపచ్చ అరటి కాయలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ఇన్సులిన్ హార్మోన్ ను నెమ్మదిగా విడుదల చేస్తుంది కాబట్టి, డయాబెటిస్ ఉన్న వారికి కూడా మంచిది. ఈ అరటి కాయలను కూర చేసుకోవడానికి ఉపయోగిస్తారు మరియు చిప్స్ ని తయారు చేస్తారు.Eat banana, dine on banana leaf.. get endless health powers in Telugu.
  2. అరటి పువ్వు : అరటి పువ్వులలో కరిగే ఫైబర్స్, కరగని ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీకు ఎక్కువ కాలం కడుపు నిండుగా అనిపించేలా చేస్తాయి. మలబద్దకం, ఇతర జీర్ణ సమస్యలను నివారిస్తాయి. ఆరోగ్యకరమైన పేగు సూక్ష్మజీవులను మెరుగుపరచి, పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇవి రక్తంలోని చక్కరస్థాయిలను తగ్గించడం వలన, టైపు-2 డయాబెటిస్ ప్రమాదాన్ని నివారిస్తాయి.Eat banana, dine on banana leaf.. get endless health powers in Telugu.
  3. అరటి కాండం : అరటి కాండంలో ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజుకు 25 గ్రా నుండి 40 గ్రా అరటి కాండం తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇది ఇన్సులిన్, హిమోగ్లోబిన్ ఉత్పత్తికి తోడ్పడే పొటాషియం, విటమిన్ బి6 మొదలైన మూలకాల గొప్ప ఆహార వనరు.Eat banana, dine on banana leaf.. get endless health powers in Telugu.
  4. అరటి ఆకు : అరటి ఆకులు అనేవి నేరుగా తినేది కాదు. అలా ఎవరు కూడా తినరు. అయితే, వీటిలో ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి మంచిది. ఈ ఆకుల్లో EGCG వంటి ఫాలిఫెనాల్స్ ఉంటాయి. ఈ ఫాలిఫెనాల్స్ శరీరంలోని అన్ని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వ్యాధులను నివారిస్తాయి. అరటి ఆకులో పార్కిస్సన్స్ వ్యాధికి చికిత్స చేసే ఎంజైమ్ అయిన ఫాలిఫెనాల్ ఆక్సిడేస్ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటితో తయారు చేసిన గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది. అరటి ఆకులో వివిధ రకాల ఆహార పదార్థాలు వండటానికి మరియు ఏవైనా ఆహార పదార్థం అరటి ఆకులో ఉంచి ఆవిరిలో  ఉడికించడం చేస్తుంటారు. వేడి వేడి ఆహారాన్ని అరటి ఆకుపై వడ్డిస్తే అద్భుతమైన వాసన వస్తుంది. అందుకే, ఈ ఆకులో అన్నం వడ్డించే సాంప్రదాయం వచ్చింది. ఇది ఒక బాక్టీరియా సంహారకాలుగా ఉపయోగపడుతుంది. పర్యావరణానికి అనుకూలమైనవి.Eat banana, dine on banana leaf.. get endless health powers in Telugu.
  5. అరటి పండు : ఎల్లప్పుడూ తక్కువ ధరకు లభించే, ఎక్కువ పోషకాలు కలిగి ఉన్న పండు ఏది అంటే, అది అరటిపండు. ఈ పండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. ఇతర పండ్ల కంటే, అరటి పండులో చక్కర శాతం తక్కువగా ఉంటుంది. తేలికగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక ఫైబర్ జీర్ణక్రియ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది తద్వారా కొవ్వు కూడా తగ్గుతుంది.Eat banana, dine on banana leaf.. get endless health powers in Telugu.
అరటి పండును ఏ సమయంలో తినడం సరైనది(When is the best time to eat banana)? :

     అరటి పండు అనేది శక్తితో కూడిన పండు అంటారు. రోజంతా ఎంతో శక్తిని పొందుతామని భావిస్తారు. కనుక, ప్రతి ఒక్కరు తమ తమ పనులకు వెళ్లే ముందు అల్పాహారం తినకపోయినా సరే అని ఒక అరటిపండుతో సరిపెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. జిమ్ కు వెళ్లే వారు శక్తి కోసం తినడం అలవాటు చేసుకుంటారు. కానీ, ఉదయం ఎలాంటి అల్పాహారం తీసుకోకుండా అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు వైద్య నిపుణులు. అలాగే, రాత్రి పడుకునే ముందు పాలు, అరటిపండు తినడం కూడా కొంతమందికి అలవాటు ఉంటుంది. కానీ ఇది కూడా హానికరం మన ఆరోగ్యానికి అని, అంటున్నారు నిపుణులు. దానివల్ల దగ్గు వస్తుంది అంటారు. కేవలం, మనం ఏదైనా ఆహార పదార్థాలు తీసుకున్నాక మాత్రమే అరటిపండును తినడం అలవాటు చేసుకోవాలి అదే శ్రేయస్కరం ఆరోగ్యానికి..

  • గుండె సమస్య : అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, వాటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల రక్తంలో ఈ రెండు పోషకాలు అధికంగా చేరి గుండెకు హాని కలిగిస్తుంది.
  • జీర్ణక్రియ సమస్య : అరటిపండులో ఉండే పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అరటి పండు అనేది ఆమ్లముగా ఉంటుంది కాబట్టి, ఖాళీ కడుపుతో ఆమ్ల ఆహారాలను తీసుకుంటే, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

కోతులకు కూడా ఇష్టమైన పండు అని చెప్పొచ్చు.Eat banana, dine on banana leaf.. get endless health powers in Telugu.

అరటిపండు అందించే ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits of Banana) :

  • త్వరగా శక్తిని అందిస్తుంది(Provides quick energy) : అనారోగ్యానికి మరియు జీర్ణసంబంధమైన సమస్యలకు అరటిపండు మంచి ఔషధంలా పని చేస్తుంది. జబ్బునపడిన వాళ్లు అరటిపండును తింటే త్వరగా కోలుకుంటారు.
  • జీర్ణవ్యవస్థ(Digestive system) : అరటిపండును భోజనం తర్వాత తినడం వల్ల ఆరోగ్యానికి, జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. అరటిపండు సులభంగా జీర్ణమై, మలబద్దకం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
  • చెడు కొవ్వు(Bad fat) : అరటిలో పీచు పదార్థం ఉండడం వల్లే, రక్తంలో కొవ్వును తగ్గించే సామర్థ్యం కలిగి ఉండి, చెడు కొవ్వును నియంత్రించడంలో సహాయపడుతుంది.Eat banana, dine on banana leaf.. get endless health powers in Telugu.
  • టాక్సిన్స్(Toxins) : మన శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది.
  • కడుపులో ఆమ్లాలు(Stomach Acids) : కడుపులో ఆమ్లాలు ఎక్కువైతే, రోజు ఒక అరటిపండు తినమని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే, ఇవి ప్రకృతి సిద్ద యాంటాసిడ్ గా పని చేస్తాయి. ఈ యాంటాసిడ్ ప్రభావం కడుపులో పుండ్లను తగ్గిస్తుంది.
  • రోజుకు అరటిపండు తినడం వల్ల రక్తపోటును తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, రోగనిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది. మరియు మన కళ్ళు ఆరోగ్యముగా ఉంటాయి. శరీర పెరుగుదలకు, ఎముకల దృఢత్వానికి మంచిది.
  • రోజుకు ఒక అరటిపండును తినడం వల్ల బరువు, ఊబకాయం, ప్రేగు సంబంధిత రుగ్మతలు, మలబద్దకం నుండి ఉపశమనం, విరేచనాలు అదుపు చేయడం, రక్తహీనత, క్షయ వ్యాధి, ఆర్థరైటిస్, గౌట్, మూత్రపిండాలు, మూత్ర రుగ్మతల నుండి అరటిపండు కాపాడుతుంది.
  • పొటాషియం(Potassium) : అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటును తగిన మోతాదులో ఉండేలా చేస్తుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల పక్షవాతం ముప్పు తక్కువగా ఉన్నట్లు పలు అధ్యయనాల్లో గుర్తించారు. మరియు ఇది ఎముకలకు, దంతాలకు మంచిది.Eat banana, dine on banana leaf.. get endless health powers in Telugu.
  • మూత్రపిండాల ఆరోగ్యం(Kidney Health) : మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా రక్షణగా ఉంటుంది. వారానికి 2-3 అరటిపండ్లు తినే మహిళలు మూత్రపిండాల వ్యాధి బారిన పడే ముప్పు తక్కువని ఓ అధ్యయనంలో తేలింది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కూడా అరటి పండులో ఉండే పొటాషియం  సహాయపడుతుంది.
  • అరటి పండు జ్యూస్(Banana Juice) : గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సక్రోజ్, మాల్టోజ్ ను పొందవచ్చు.Eat banana, dine on banana leaf.. get endless health powers in Telugu.
  • ఒత్తిడి, నిద్ర(Stress, Sleep) : అరటిపండులో ఉండే “ట్రిఫ్టోఫాన్” అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే “సెరటోనిన్”గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే, రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది అని చెపుతారు.
  • అరటిపండ్లలో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం, జీర్ణాశయం గోడలకున్న సన్నని పోర నాశనం కాకుండా కాపాడుతుంది.
  • పైల్స్(Piles) : అరటి పండు తినడం ద్వారా పైల్స్ సమస్య నుండి కూడా విముక్తి అవ్వచ్చు అంటున్నారు. కానీ, ఖాళీ కడుపుతో అరటిని తీసుకోకూడదు.
  • అరటి తొక్క(Banana peel) : అరటితొక్క లోపలి భాగాన్ని దోమ కరిచిన దగ్గర రుద్దడం వల్ల దురద, వాపు తగ్గిపోతుంది.
  • పురుషుల శృంగార సమస్యలు(Male sexual problems) : పురుషులలో శృంగార సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే, అరటిపండు, నెయ్యి కలిపిన మిశ్రమం వారితో తాగిస్తే, ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు.
  • ఎయిడ్స్ వైరస్(AIDS virus) : అరటికి “ఎయిడ్స్” వైరస్ తో పోరాడే శక్తి ఉంది. అరటిలో ఉండే “బాన్ లెక్” అనే రసాయనం ఎయిడ్స్ వైరస్ పై శక్తివంతంగా పోరాడుతుంది అని తేల్చారు. ప్రస్తుతం వైరస్ నిరోధానికి వాడుతున్న “టి20, మారావిరాక్” మందులతో సమానంగా ఈ రసాయనం పని చేస్తుంది. అరటిలోని లెక్టిన్ రసాయనం వైరస్ ను శరీరంలో ప్రవేశించనీయకుండా అడ్డుకొని ఇన్ఫెక్షన్ ను నిరోధిస్తుంది. ఈ రసాయనం ప్రోటీన్ పై పరుచుకొని “హెచ్ ఐ వి” జన్యుపదార్థం మూసుకుపోయేలా చేస్తుంది.
  • స్త్రీ ప్రాణాలు హరించే సోమరోగానికి(For leprosy, which kills women) : స్త్రీలలో గర్భాశయ రోగాలు ముదిరిపోయి చివరికి సోమరోగంగా మారి యోని గుండా తెల్లని నీరు నిరంతరం స్రవిస్తూ ఉంటుంది. దీనిని వెంటనే ఆపకపోతే, ధాతువులు శోషించి ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. పచ్చి ఉసిరికాయరసంలో గాని, ఉసిరికాయలతో కాచిన కషాయంలో గాని, అరటిపండ్లను కలిపి కొంచెం తేనె, పటికబెల్లం కూడా చేర్చి, రెండుపూటలా సేవిస్తూ ఉంటే, స్త్రీల సోమరోగం హరించిపోతుంది.
  • మూత్రంలో మంట తగ్గుటకు(To reduce inflammation in urine) : బాగా మెత్తగా ఉన్న పసుపు పచ్చని చిన్న అరటిపండు తింటూ ఉంటే మూత్రంలో మంట తగ్గడమే కాక ఆమాశయం(పొట్ట) కూడా పరిశుభ్రం అవుతుంది.
అరటిచెట్టు ఆధ్యాత్మిక ప్రయోజనాలు మరియు ఇంటి పెరట్లో ఏ దిశలో అరటిచెట్టును పెంచవచ్చు(Spiritual benefits of banana tree and in which direction can a banana tree be grown in the backyard) ?Eat banana, dine on banana leaf.. get endless health powers in Telugu.
  1. జ్యోతిష్య శాస్త్రంలో అరటిచెట్టుకు గౌరవప్రదమైన స్థానం ఉంది. మన ఇంట్లో అయితే, ఒక(1)అరటిచెట్టు పెంచడం ఉత్తమం, రెండు(2) చెట్లు పెంచడం మాధ్యమం, మూడు(3)చెట్లు పెంచడం వ్యాధి కారకం, నాలుగు(4)చెట్లు పెంచడం నాశన కారకం అని పెద్దల మాట. కాబట్టి, ఒక(1)అరటిచెట్టు పెంచుకోవడం సరియైనది.
  2. పూజకు ఉత్తమమైన దిక్కు ఈశాన్యం. కాబట్టి, ఈశాన్యం, తూర్పు, ఉత్తర దిశలో అరటిచెట్టును నాటవచ్చు. ఇంటి ముందు భాగంలో ఎప్పుడు నాటకూడదు. ఇంటి వెనుక భాగం, పెరట్లోనే నాటాలి.
  3. . అరటిచెట్టుకు శుభ్రమైన నీరు మాత్రమే పోసి పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి వ్యర్థ పదార్థాలు కానీ, మురికి నీరు కానీ పోయకూడదు. చెట్టు చుట్టూ శుభ్రముగా ఉండేలా చూసుకోవాలి అంటే అర్ధం దేవతాస్వరూపంగా కొలుచుకొవాలి. అంతేకాదు, అరటిఆకు ఎండిపోతే, వెంటనే దానిని తీసివేసి పడేయాల్సి ఉంటుంది.
  4. ఏ ఇంటి ఆవరణలో అయితే, అరటిచెట్టు ఉంటుందో..అక్కడ విష్ణువు నివాసం ఉంటాడు. తులసిని లక్ష్మిదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి, అరటిచెట్టు దగ్గర తులసి మొక్కను నాటాలి.
  5. అరటిచెట్టును నాటడం ద్వారా గురుగ్రహం యొక్క శుభ ఫలితాలు పొందవచ్చు అని పండితులు అంటారు. అందుకే, గురువారం రోజున అరటిచెట్టుకు పసుపుతో పూజ చేసి, దీపం వెలిగించాలి.
  6. ఆ ఇంటి వారంత సుఖసంతోషాలు, సిరిసంపదలు కలిగి, ఆరోగ్యముగా ఉంటారని ప్రజల నమ్మకం. పెళ్లికాని అమ్మాయిలకు త్వరగా పెళ్లి అవుతుంది అని విశ్వసిస్తారు మన భారతీయ సంస్కృతిలో.
  7. ఎంతటి కష్టానైనా తొలగించగలుగుతుంది. ఉన్నత విద్య, జ్ఞానాన్ని పొందడంలో అరటి చెట్టు సహాయపడుతుంది.
  8. సంతానం కలగాలి అన్న, మాంగళ్య దోషాలు, ముఖ్యముగా అత్తింటి నుండి కష్టాలు తొలగాలి అన్న అరటిచెట్టు పూజిస్తే, విశిష్ట ఫలితాలు కలుగుతాయి అంటారు.
  9. ఎందుకంటే, ఒక శాంతియుత సానుకూలమైన శక్తిని, అరటిచెట్టు ఆవరణలో బయటకి పంపిస్తూ ఉంటుంది. కాబట్టి, అరటిపండ్లను పూజ కార్యక్రమాలకు కూడా ఉపయోగిస్తుంటారు.
  10. వాస్తుప్రకారం, అరటిచెట్టును నాటడం అనేది సరైన దిశలో నాటేలాగా శ్రద్ధ వహించాలి. లేదంటే, నష్టాలు ఎదుర్కునే అవకాశం ఉంటుంది అంటారు.
అరటిచెట్టు యొక్క దుష్ప్రభావాలు(Side Effects of Banana) :
  1. మైగ్రైన్ తలనొప్పి : మద్యపానీయంతో పాటు అరటిపండు తినడం మంచిది కాదు. దీని వల్ల పార్శ్వపు తలనొప్పిని పెంచుతుంది.
  2. మీరు ఏదైనా అలెర్జీని కలిగి ఉన్నట్లయితే, అరటి పండు తినకపోవడం మంచిది. సాధారణంగా, శ్వాసలో గురక శబ్దం, దగ్గు, దురద పెట్టె గొంతు, జలుబుతో ముక్కు కారటం మరియు కళ్ళ వెంట నీరు కారడం వంటి లక్షణాలు అరటితో కలిగే అలెర్జీలు.
  3. అరటిని అధికంగా తీసుకున్నట్లయితే పొట్టలో అధిక వాయువు ఏర్పడడానికి దారి తీస్తుంది.
  4. అరటి టైపు-2 డయాబెటిస్ కు కారణం కావొచ్చు అని చెప్పబడింది.
  5. అరటి మగతనిద్రకు కారణం అవుతుందనే నమ్మకం ఉంది.
  6. ఇది దంత క్షయానికి కారణం కావొచ్చు.
ముగింపు(Conclusion) :

మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే “అరటిపండు” గురుంచిన ఎన్నో విషయాలు, ప్రయోజనాలు తెలుసుకున్నాము. ప్రతి ఒక్కరు రోజుకు ఒకటి చొప్పున మాత్రమే అరటిపండును తినండి..మనకు సులభంగా ప్రకృతి అందించిన అరిటాకులో భోజనము చేయండి ఇంతవరకు చేస్తే కూడా సరిపోతుంది. ఎందుకంటే, మన శరీరానికి కావాల్సిన పోషక విలువలు అందుతాయి..

   త్వరగా శక్తిని అందిస్తుంది కదా అని కావొచ్చు..కొంతమంది రోజుకు 2,3 అరటిపండ్లను ఉన్నాయ్ కదా అని తినేస్తుంటే..అది వారి ఇష్టం..కానీ, పూర్తి ఆరోగ్యవంతులు 2,3 అరటిపండ్లను తిన్న కూడా నష్టం ఉండదు..ఆరోగ్యంలో ఏదైనా సమస్యలు ఉన్నపుడు మాత్రం జాగ్రత్త వహించాలి. అరటిపండును తిన్నపుడు వచ్చే మార్పులు మీ శరీరంలో ఏ విధంగా ఉన్నాయి అని గమనించుకోవాలి. మరి ముఖ్యముగా, ఉదయం ఏదైనా అల్ఫాహారం తీసుకోకుండా అరటిపండును తినడం, రాత్రి పడుకునే ముందు అరటిని తిని పడుకోవడం అస్సలు చేయకూడదు. ఇలాంటి కొన్ని చిట్కాలను పాటించడం తప్పనిసరి అవుతుంది అరటిపండును తినాలి అంటే..లేదంటే, ఎదో ఒక సమస్య అరటితో కొని తెచ్చుకున్నవాళ్ళు అవుతారు..

      అరటిచెట్టును మన ఇంటి పెరట్లో సరైన దిశలో నాటకపోతే..సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగానే..అరటిపండును తినడానికి కూడా సరైన అవగాహన పెంచుకోవాలి. లేదంటే, ముందే ఆరోగ్య సమస్యలున్నట్లయితే అది కాస్త ఎలాంటి పరిస్థితికి దిగజార్చే వీలు ఉంది అని తెలుసుకోవడం ముఖ్యం..మరి సమస్య తీవ్రంగా అనిపిస్తే..వైద్యుడి సలహా తీసుకోవడం మర్చిపోవొద్దు.. 

..సర్వేజనా సుఖినో భవంతు.. 

Add Comment