ఋతుక్రమ ప్రారంభ శుభ, అశుభ ఫలితాల వివరణ మరియు వేడుకల ఆచారాలు|Menstrual onset auspicious, inauspicious results explanation and rites of celebration in Telugu

ఓం

 స్త్రీలు రజస్వల అవడం యొక్క శుభ మరియు అశుభ ఫలితాలు(Auspicious and inauspicious results of menstruation in women) 

రజోదర్శనం అనగా స్త్రీ రజస్వల అగుట. ప్రథమ రజస్వల ప్రాతః కాలం నుండి మధ్యాహ్నం లోపు అయిన శుభం. మిగిలిన కాలం అశుభం.

Menstrual onset auspicious, inauspicious results explanation and rites of celebration in Telugu

వారఫలం(reward) 

సోమ, బుధ, గురు, శుక్ర వారములందు ప్రధమ రజస్వల అయిన శుభ ఫలము. ఆది, మంగళ, శని వారములందు అశుభ ఫలితము కలుగుతుంది.

శుభ తిథులు(Auspicious Tithis) 

తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిధులు శుభం.

రజస్వలకు దుష్ట తిధులు(Bad breasts for menses)

అమావాస్య, ఉభయ పాడ్యమిలు, షష్టి, అష్టమి, ద్వాదశి తిధుల యందున, పరిఘ యోగముల పూర్వార్ధమందున, వ్యతీపాత, వైదృతి యోగములందున, సంధ్యాకాలమందున, ఉప్పెన, భూకంపం మొదలైన ఉపద్రవ కాలమందున, భద్ర కరణము నందున మొదటిసారి రజస్వల అయినా శుభకరం కాదు.Menstrual onset auspicious, inauspicious results explanation and rites of celebration in Telugu

శుభ నక్షత్రాలు(Auspicious stars) 

అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి.

ఈ నక్షత్రములందు ప్రధమ రజస్వల అయినా సౌభాగ్యం, సౌఖ్యం, సంతానం, ఆయువు, ధనం కలుగుతుంది.

  • మిగిలిన నక్షత్రములు అశుభ ఫలములు ఇచ్చును. కావున శాంతి చేయాలి. రజస్వల కాకుండానే వివాహాలు జరిపించే పూర్వపు రోజుల ప్రకారం భర్త యొక్క జన్మ నక్షత్రం నాడు హాని అని చెప్పబడింది.
  • దుష్ట నక్షత్రములందు ప్రధమముగా రజస్వల అయినపుడు హోమయుక్తమైన శాంతి జరిపించి, దానాదులు నిర్వహించి తిరిగి “షుహా” నక్షత్రములో రజోదర్శనమైన తదుపరి శుభ ముహూర్త కాలమందు గర్భాదానం చేయాలి. ఈ విధంగా చేసిన యెడల సంతాన ప్రాప్తి కలుగుతుంది మరియు
  • గ్రహణ సమయములందు, సంక్రాతి యందు,
  • అశుభమైన నిద్రా సమయములందు, అర్ధరాత్రి యందు ప్రధమ రజస్వల అయినచో యుక్తమైన శాంతులు నిర్వహించాలి.

లగ్న గ్రహ ఫలము(Ascendant planet) 

ప్రధమ రజోదర్శన సమయమున..

కేంద్ర, కోణ, లాభ స్థానములందు శుభ గ్రహములు, తృతీయ, షష్ఠ లాభ స్థానములందు క్రూర గ్రహములు శుభ ఫలములిస్తాయి. చంద్రుడు అష్టమ స్థానమునందు ఉండిన “పతి” నాశనం కలుగజేస్తారు. కానీ, చంద్ర తార బలములు సంపన్నమైనపుడు పుత్ర, ధన సంపత్తులు కలుగుతాయి. కుజుడైనను లేక చంద్రుడైనను లగ్నమునకు 3, 6, 10 స్థానములందున్నచో సంపన్నులగు కుమారులు కలుగుతారు.

నక్షత్ర గ్రహ బలం యొక్క ఫలితం(Result of nakshatra planet strength) 

రజస్వల సమయ నక్షత్రమందు గురుడు గానీ, శని గానీ ఉన్నా..ఏ గ్రహము లేకున్నను శుభము. రజస్వల సమయ నక్షత్రమందు కుజుడున్నను బుధ, శుక్రులు కలిసి ఉన్నను, రవి ఉన్నను, రాహు కేతువులున్నను అశుభం.

రజోదర్శన స్థాన ఫలితం(Rajodharshan Sthana Result) 

  • తన ఇంటి యందు
  • గొడ్డలి చావిడి యందు
  • స్వగ్రామ మధ్య మందు
  • జల సమీపమున
  • ఇంటి ఆవరణ మధ్య ..రజస్వల అయిన శుభము.
  • గ్రామము బయట, ఇతర గ్రామములందు, నగ్నముగా ఉన్నపుడు, ఇతర ఇండ్లలోను ప్రధమ రజస్వల అయినను అశుభం.

వేళా విశేషములు(Always special) 

  1. ప్రాతః కాలం..చిర సౌభాగ్యం.
  2. ఉషా కాలం ..సౌభాగ్య లోపం.
  3. పూర్వాహ్నమ్ ..పుణ్యక్షేత్ర దర్శనం.
  4. మధ్యాహ్నం ..ధనవతి, పుత్రవతి.
  5. సాయంత్రం ..జారగుణం.
  6. సంధ్యలందు ..చెడుప్రవర్తన కలది.
  7. అర్ధరాత్రి ..బాల వైధవ్యం కలుగును.

రాత్రివేళ నిర్ణయం(Night time decision) 

రాత్రి రజస్వల అయినచో రాత్రిని 3 భాగాలుగా చేసి, 2 భాగముల కాలం పూర్వదినము, మూడవభాగ కాలమున తదుపరి దినమునకు చెందుతుంది.

వస్త్ర ఫలితం(Textile result)  

  • తెల్లబట్ట కట్టుకొని రజస్వల అయిన, సౌభాగ్యవతి.
  • గట్టి బట్ట కట్టుకొని రజస్వల అయినా పతివ్రతయు, దుకూల వస్త్ర దారియైన పట్టపురాణి అగును.
  • నూతన వస్త్రం ధరించగానే, శుభ సంపన్నురాలగును. చిరిగిన బట్ట కట్టుకొనిన దౌర్భాగ్యరాలగును.
  • ఎర్రని బట్ట కట్టుకొనిన వ్యాధి గ్రస్తురాలగును.
  • నల్లని వస్త్రం ధరించినదైనా దరిద్రురాలగును.

రజస్వల శుద్ధి(Purification of Revenue) :

రజోవతి అయిన స్త్రీ..

మొదటి దినమందు “చండాల స్త్రీ సమానురాలు”, 2 వ దినమందు “పతితురాలితో సమానురాలు”, 3 వ దినమందు “చాకలి స్త్రీతో సమానం”, 4 వ దినమున కూడా “శూద్ర స్త్రీ సమానురాలు”, 5 వ దినమందు “దేవ పితృ కార్యములందు పరిశుద్ధురాలు” అన్నారు.

4 వ దినమందు స్నానముచేత శుచి కాగలదు. బహిష్టు అయిన స్త్రీ మూడు(3) రోజుల తర్వాత శుద్ధి అవుతుంది.

ప్రధమ రజస్వల అయిన కన్యకు ఆసనమేసి కూర్చుండబెట్టి, అక్షతలు తలపై వేయాలి. దీపమున్న గదిలోనే కన్యను ఉంచాలి. సువాసినులకు స్త్రీ గంధం, పుష్పములను, తాంబూలములను లవణము, పెసలు మొదలుగునవి ఇవ్వాలి.

ప్రధమ రజస్వల అయిన వస్త్రముతోనే 3 రోజులు ఉంచాలి. ఎవరిని తాకకుండా జాగ్రత్తగా, ప్రశాంతముగా ఉండునట్లు చూడాలి. భోజన విషయంలో “పులగము, నెయ్యి, పాలు” వంటి సాత్విక ఆహరం..ఉప్పు, పులుపు, కారం లేకుండా ఇచ్చుట మంచిది. 4 వ రోజు స్నానం చేయించి నూతన వస్త్రములు కట్టించాలి.Menstrual onset auspicious, inauspicious results explanation and rites of celebration in Telugu

సర్వ ఋతువులకు సాధారణ నియమములు(General rules for all seasons) 

3 దినములు ఎవరిని తాకకూడదు. అభ్యంగనము, కాటుక, స్నానము, పగలు నిద్రించుట, అగ్ని ముట్టుట, ప్రాసనము, సూర్యావలోకనము, భూమిపై గీతలు గీయుట చేయుట చేయకూడదు. క్రింద పడుకోవాలి, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, తాంబూలము, గంధమాల్యములు ఉపయోగించరాదు. ఇవన్నీ ఆరోగ్యం కొరకు పాటించే నియమాలు.

ఋతుస్రావ వేడుకను ఏ ఏ రాష్ట్రాలలో ఏ పద్దతిలో జరుపుకుంటారు(Menstruation ceremony is celebrated in which manner in which states)

ఋతుక్రమం అనేది ప్రతి అమ్మాయి జీవితంలో ఒక మలుపు. అంటే ఒక అమ్మాయి స్త్రీగా మారే ప్రయాణం మొదలైంది. ఋతుస్రావాన్ని నిషిద్ధ అంశంగా భావించబడుతుంది. మరియు దీని గురించి బహిరంగంగా మాట్లాడటానికి పరిమితం చేయబడింది. ఒకవైపు ఇది నిషిద్ధ అంశం అయితే, మరోవైపు పండుగలా జరుపుకుంటారు.

భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో, అమ్మాయి యొక్క మొదటి రజస్వలను ఒక ప్రత్యేక వేడుకగా, పండుగా జరుపుకోవడం ఆచారంగా వస్తూ ఉంది. అయితే, భారతదేశంలో వివిధ ప్రాంతాలలో, వివిధ రకాలుగా జరుపుకుంటారు.

తెలంగాణ, ఆంద్రప్రదేశ్(Telangana, Andhra Pradesh) 

ఆడపిల్లకు మొదటిసారి ఋతుక్రమం “పెద్దమనిషి పండుగ” అని గొప్ప వేడుకగా జరుపుకుంటారు. ఈ వేడుకను పీరియడ్స్ యొక్క మొదటి, 5 వ రోజు మరియు చివరిరోజున జరుపుకుంటారు. అమ్మాయికి మొదటి రోజున, ఆమె తల్లి మినహా 5 మంది మహిళలు కలిసి “మంగళ స్నానం” చేయిస్తారు. తర్వాత ప్రత్యేక గది ఏర్పాటు చేసి, రుచికరమైన వంటలు చేసి అన్ని వేరుగా పెడతారు. మరియు చివరి రోజున అమ్మాయికి “చందనం” పూస్తారు. అలాగే, అమ్మాయి అమ్మమ్మ వాళ్ళ తరపున “మేనమామ” ఆమెకు చీర, నగలను బహుమతిగా అందిస్తారు.

కర్ణాటక(Karnataka) 

ఈ రాష్ట్రంలో అమ్మాయి మొదటి ఋతుస్రావం యొక్క ఫంక్షన్ ఘనంగా జరుపుకుంటారు. దీన్ని “ఋతు శుద్ధి” లేదా ఋతు కళా సంస్కార్” అంటారు. పూర్వకాలంలో ఈ ఆచారం ద్వారా ఆడపిల్లలకు రుతుక్రమ విషయాలపై అవగాహనను కలిపించేవారు. ఎలాంటి రుతుక్రమ సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు ఇలా చేస్తారు.

అస్సాం(Assam) 

అస్సాం రాష్ట్రంలో ఆడపిల్ల మొదటి ఋతుక్రమాన్ని “తునోలియా బియా” అనే పండుగగా జరుపుకుంటారు. పెళ్లిళ్ల మాదిరిగానే ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. వేడుక సమయంలో అమ్మాయి ఏమి చేయకూడదని నిషేధించి, ఒంటరిగా గదిలో ఉంచుతారు. ఈ సమయంలో సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలను చూడటం అశుభం. కనుక, ఆమెను 7 రోజుల పాటు ఏకాంతంగా ఉంచుతారు. ఈ 7 రోజుల తర్వాత అమ్మాయికి అరటి మొక్క తో పెళ్లి జరిపిస్తారు. ఈ వేడుకలో బంధువులు అందరు వచ్చి బహుమతులు ఇచ్చి, ఆశీర్వదిస్తారు.

తమిళనాడు(Tamil Nadu) 

ఈ రాష్ట్రంలో అమ్మాయి యొక్క మొదటి రుతుస్రావంను “మంజల్ నిరతు వీసా” అనే పండుగగా జరుపుకుంటారు. ఈ క్రమంలో అమ్మాయి మేనమామ మామిడి, కొబ్బరి, వేప ఆకులతో గుడిసెను నిర్మించి, అమ్మాయికి పసుపు నీళ్లతో స్నానం చేయించి, గుడిసెలో ఉంచుతారు. తర్వాత అమ్మాయికి “పట్టుచీర కట్టి నగల”తో అలంకరిస్తారు. రుచికరమైన వంటకాలను తయారు చేస్తారు. చివరగా “పుణ్య ధనం”తో వేడుక ముగుస్తుంది. తర్వాత మేనమామ కట్టిన గుడిసెను తొలగించి వేస్తారు. మరియు ఒక పూజారి ఇంటిని శుద్ధి చేస్తారు.

ఒడిశా(Odisha) 

ఈ రాష్ట్రంలో మొదటి ఋతుస్రావంను “రాజ ప్రభ” అనే పేరుతో వేడుకను జరుపుకుంటారు. ఈ 3 రోజులలో భూమి తల్లికి రుతుక్రమం వస్తుందని నమ్ముతారు. వేడుక కోసం, అమ్మాయికి తన ఋతుస్రావం యొక్క 4 వ రోజున స్నానం చేయించబడుతుంది. ఈ ఆచారం రుతుపవనాల మొదటి వర్షానికి సంబందించిన “మిథున్ సంక్రాంతి” అని పిలువబడే మరొక ఆచారంతో కూడా ముడిపడి ఉంది. 4 వ రోజు కూడా వర్షం కారణంగా నేల యొక్క ఉత్పాదకతకు సంబంధించినవి. వేడుకల సమయంలో మహిళలు మరియు బాలికలు తమ అన్ని పనుల నుండి విరామం తీసుకొని, కొత్త బట్టలతో అలంకరించుకొని, స్వీట్లను ఆస్వాదిస్తారు.

ముగింపు(Conclusion) 

మొదటి సారి ఋతుక్రమం జరిగినపుడు..ఏ సమయంలో ప్రారంభం అయితే, అది ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అని తెలుసుకున్నాము..అలాగే, ఏ ఏ రాష్ట్రాల్లో ఋతు వేడుక సంబరాలు పండుగలా జరుపుకుంటూ ఆనందించడం ఆచారంగా వస్తుంది అని చూసాము..ఋతుక్రమం మన శరీరంలో సహజమైన ప్రక్రియగా కొనసాగుతున్నప్పటికీ, ముందు ఆర్టికల్స్ లో ఋతుస్రావం జరగడానికి మన శరీర భాగాల పని తీరు ఎలా ఉంటుంది అని తెలియజేశాము. రుతుక్రమ సమయంలో పాటించాల్సిన ఆచారాలు మన ఆరోగ్యానికి, మన ఇంటికి ఎంతటి లాభం కలుగజేస్తుంది చెప్పి ఉన్నాము.

అయితే, ఇందులో ఋతుక్రమ ప్రారంభం యొక్క ఘడియ లేదా సమయం చూసుకోవడం కూడా చాలా ముఖ్యం అని పెద్దలు చెప్తుంటారు. కానీ, అది నమ్మేఅంతటి విషయం కాదు అని కొందరు వాదన చేసే వాళ్ళు ఉన్నా కూడా..శుభ, అశుభ ఫలితాలు అనుభవించి దాని అర్ధం సంపూర్ణముగా తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ విషయం బోధపడుతుంది అని చెప్పగలం..

ఎందుకంటే..రుతుక్రమం మొదటి సారి వచ్చిన ఘడియను బట్టి కూడా మన జీవితం ఆధారపడి ఉంటుంది..అయితే, ఆ సమయం ఎలాంటిది అని పండితులని అడిగి తెలుసుకొని, అశుభ సమయం అని తేలితే, పరిహారాలు చేయాల్సిన అవసరం ఉంటే, తప్పక చేయించడం సరైనది అని చెప్పాలి..నమ్మకం కలగకపోతే..ఇలాంటి విషయాలను పెద్దలను కానీ, పండితులని గానీ వివరంగా అడిగి తెలుసుకుంటే చాలా బాగా అర్ధం చేసుకోగలరు. మరియు అశుభ సమయం అంటేనే, దోషం ఏర్పడింది అని అర్ధం..ఆ కారణంగా, పరిహారాలు చేయడం అనేది ఆ దోషం నుండి విముక్తుల్ని చేసి, వారి జీవితంలో శాంతిని నెలకొనేలా చేస్తుంది అని భావన.

దీనిని అతి సామాన్యమైనదిగా తీసిపడేసే విషయం కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించి, ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. దీనికి తోడు..రుతుక్రమ సమయంలోను, ముగిసిన తర్వాత ఆచరించాల్సిన కొన్ని విషయాలు కూడా(తెలియజెసున్నాం) బాగా గుర్తుకుపెట్టుకొని, పాటించడం అనేది నిత్య జీవితంలో ప్రతి నెల చేస్తూ ఉన్నట్లయితే, వారిపై దోష ప్రభావం చాలా తగ్గిపోయి..ప్రశాంత జీవనం అనేది చూడగలుగుతాము. ఈ అనుభవాన్ని ఎవరికీ వారుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలు..పూర్వం నుండి వచ్చే ఆచారాలు, వాటికి విలువ ఇచ్చేవారు ఎంత జ్ఞానంతో ఆలోచించారు అనేది అర్ధం చేసుకోవడానికి వీలు ఉంటుంది.   

..సర్వే జనా సుఖినో భవంతు..

Add Comment