ఋతుస్రావం యొక్క ప్రాముఖ్యత, ఆచారాలు మరియు నియమాలు|Importance of Menstruation, Rituals and Rules in Telugu

ఋతుస్రావానికి ఉన్న ప్రాముఖ్యత(Importance of Menstruation) :

    ప్రస్తుత సమాజం అంటే ఏ నియమాలు, కట్టుబాట్లు లేకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు జీవిస్తున్నారు. కానీ, కొన్ని వందల సంవత్సరాల క్రితం “నియమాలు(Rules)” లేకుండా మనిషి సమాజంలో జీవించలేకపోయేవాడు. స్థిరమైన సమాజానికి కొన్ని నియమాలు ఖచ్చితంగా అవసరమౌతాయి. ఇలాంటి నియమాల విషయానికి వస్తే, “రుతుస్రావం(menstruation)” కూడా ప్రాముఖ్యతను కల్గి ఉంది.Importance of Menstruation, Rituals and Rules in Telugu

లలితా సహస్త్రనామ భాష్యం “అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహా”.

సృష్టికి మూలం “స్త్రీ శక్తి(Woman Power)”..ఆ శక్తి యందు ఇమిడి ఉన్న దివ్యవిగ్రహాలు రెండు. 1. అమ్మ వారు(Mother is) 2. జన్మనిచ్చిన తల్లి(Birth mother)

     బ్రహ్మాండములు అమ్మ వారి “యోని(vagina)” నుండి జన్మిస్తాయి.**పరమాత్మ నుండి పరాశక్తి(Parashakti from Paramatma)**“పరాశక్తి నుండి ప్రకృతి(Prakriti from Parashakti)” అనగా..పంచభూతములు..ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వి ఆవిర్భవించి “ప్రకృతి నిర్మాణం(The Structure of Nature)” జరిగింది. ఈ పంచభూతములే పంచముఖముల గాయత్రి. ఈ ప్రకృతిలో పిండాండములు స్త్రీ యోని నుండి జన్మిస్తాయి. 

  • ముందుగా బ్రహ్మాండ జనన క్రమాన్ని పరిశీలిస్తే, ఈ యొక్క పాంచభౌతిక ప్రకృతి స్వరూపిణి(పంచభూతేశి) యగు జగన్మాతకు 6 ఋతువులు..బ్రహ్మాండములన్నియు జగద్యోనీ స్వరూపిణి జగన్మాత యోని నుండి జన్మించినవి.
  • పిండాండ జనన క్రమాన్ని పరిశీలిస్తే, పాంచభౌతిక దేహానికి 12 ఋతువులు. దీనినే “ఋతుచక్రం” అంటారు.

“దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః”

     ఇట్టి దైవీ స్వరూపమైన దేహం నందు ఏర్పడిన రుతుక్రమం స్తంభించనిదే ఈ దేహం నిర్మాణం కాదు. సభ్య సమాజంలో రుతు సమయాన్ని ముట్టు, అంటూ అనే ఏహ్యమైన ప్రక్రియగా చూస్తున్నారు. అనాచార సంస్కృతి ప్రభలి, స్త్రీని రుతు సమయంలో ముట్టుకోకుండా దూరంగా ఉంచే విధానం కొనసాగుతుంది. దానిని విచారించి చుస్తే, మానవ దేహం(నవమాసముల రుతు రక్తం, మల మూత్రం) యందే కదా నిర్మాణం జరిగినది. అయితే, ఋతుక్రమమును “ఒక యజ్ఞము“గా చెపుతున్నాయి శాస్త్రాలు..

 

    స్త్రీ రుతుక్రమం 4 వ రోజు నుండి దేహం అనూతన అండములను నిర్మాణం చేస్తుంది. అట్టి అండములు సంతానోత్పత్తి కొరకు 16 దినములు స్త్రీ దేహములో సిద్ధంగా ఉంటాయి. రజోబిందు..శ్వేత బిందు(శుక్రకణాలు) కలయికతో పిండంగా మారుతుంది. అప్పుడు, రుతుక్రమం స్తంభించి నవమాసములు తల్లి యొక్క “గర్భాలయం(Womb)” నందు నవ దేవి నిర్మిత నవ ఆవరణ పురి ఈ శరీరం(శరీరమే శ్రీ చక్రం)గా రూపుదిద్దుకుంటుంది. ఈ క్రమంలో గర్భం ధరించని యెడల ఋతువు ఏర్పడి 3 దినములు రజస్సును ప్రకృతికి ఇవ్వడం జరుగుతుంది.  Importance of Menstruation, Rituals and Rules in Telugu

ఆడవారు ఋతుక్రమంలో ఉన్నపుడు వేరుగా ఉండాలి అనే నియమం వెనుక ఉన్న అర్ధం ఏమిటి(What is the meaning behind the rule that women should separate when they are menstruating)?

   మానవుల ఇహపర సౌఖ్యం కోసం, సూక్ష్మ విషయ దర్శనం కోసం “శాస్త్రాలు(the sciences)” అవతరించాయి. అవి వేదాలను ఆధారం చేసుకొని ఉన్నాయి. మానవ సుఖ జీవనం కోసం కొన్ని ఆచారాలనీ, నియమాలనీ ఉపదేశించాయి. వాటిని పాటించడం ప్రతి “వైదికుని” కర్తవ్యం. “మడి, మైల” అనే పదాలను మనం వింటుంటాము. అవి “శుభ్రత”ను మటుకే తెలుపుతాయని అనుకోవడం పొరపాటు.

Importance of Menstruation, Rituals and Rules in Telugu

    స్త్రీలు ప్రతి మాసం ఋతుకాలంలో విడిగా ఉండడం మన పూర్వీకుల ఆచారం. దీనికి ఆధారం యజుర్వేదంలో 2 వ కాండ లోని 5 వ పాఠకం. అందులో విశ్వరూపవధ, రజస్వల వ్రతాలు ముఖ్యముగా చెప్పబడి ఉన్నాయి. పూర్వం, బృహస్పతికి తపస్సుకు పోగా, ఇంద్రుడు త్వష్ట కుమారుడైన విశ్వరూపుని గురువుగా చేసుకున్నాడు. ఆయనకు 3 తలలు. వాటితో అతడు సోమపానం, సురాపానం, అన్నభోజనం చేసేవాడు. ఒకప్పుడు తనకు లభించిన యజ్ఞభాగాన్ని రాక్షసులకి ఇవ్వడంతో కోపం చెందిన ఇంద్రుడు వజ్రాయుధంతో అతని శిరస్సుని ఖండించాడు. అవి పక్షులై “బ్రహ్మ హత్య” దోషాన్ని ధరించి ఇంద్రునికి ఆ దోషాన్ని ఇవ్వసాగాయి. దాంతో ఇంద్రుని ఇంద్రత్వానికే ఆపద వచ్చింది. యజ్ఞం ద్వారా కొంతమేరకు తొలగించి,

  • మిగిలిన ఆ దోషాన్ని 3 భాగాలు చేసి, పుచ్చుకున్న వారికి కోరిన వరమిస్తానన్నాడు. ఒక భాగాన్ని పృథ్వి తీసుకుంది. *వరంగా – భూమిపై ఎక్కడైనా తవ్వితే కొన్ని రోజులకు ఆ భూమి సమమయ్యేలా కోరింది. అలాగేనని, వరమిచ్చాడు ఇంద్రుడు.
  • వృక్షాలు ఒక భాగాన్ని పుచ్చుకున్నాయి. కొన్ని కొమ్మలు నరికినా వృక్షం మృతి చెందక మళ్ళీ వేరే శాఖలు మొలిచేలా వరాన్ని పొందింది.
  • అలాగే, స్త్రీలు చివరిభాగం తీసుకొని, దానికి బదులుగా పుత్రోత్పత్తి సామర్ధ్యాన్ని వరంగా పొందారు.
  • అందువల్ల, ఆ రజస్వలకాలంలో వారికి “బ్రహ్మహత్యా దోషం” ఉంటుంది. ఆ దోషం ఉండడం వల్ల, ఆ రోజుల్లో వారితో “సల్లాపాలు చేయరాదు, సమానంగా కూర్చోరాదు. ఒకటిగా భోజనం చేయరాదు. వారిని తాకరాదు. వారు వండినవి తినరాదు”.
  • అలా నియమాలు పాటించని పక్షంలో కొన్ని కష్టాలు వస్తాయని కూడా వేదమంత్రాలు చెప్తున్నాయి. ఇది వేదం చెప్పిన గాధ..

    అయితే, ఇందులో ఎన్నో సంకేతాలు ఉంటాయి. శరీర నిర్మాణంలో దేవతా శక్తులే ఇంద్రియాదిదేవతలు. మన శరీరంలో మనకు తెలియని మార్పులు జరుగుతున్నట్లే, మనపై ప్రభావం చూపే సూక్ష్మ ప్రపంచంలోనూ జరుగుతాయి. ఇంద్రుడు ప్రధాన దేవతా శక్తి. ఆశ్చర్యంగా, కాలగమనాన్ని ఆధారం చేసుకొని మారే శరీర నియమాల్లో అంతు తెలియని దైవిక రహస్యాలను వేదం వివరిస్తుంది.

   ఇంద్రియాతీత సత్య దర్శనమే కదా వేద విజ్ఞానం. కొన్ని ధర్మాలని పాటించలేకపోవచ్చు. కానీ, మన అశక్తత వల్ల వదలి, వాటిని ధర్మాలే కావని, మనం చేసిందే ధర్మమని ఋషి విజ్ఞానాన్ని తూలనాడడం ఎందుకు? ఆధునిక కాలంలో వాటిని పాటించడం శ్రమ అని, అవి మూఢ నమ్మకాలని స్త్రీలను తక్కువ చేయడమేనన్న భావాలున్నాయి. కానీ, అవి సరికావు. ఇది వైదిక ఆచారమే. మన పూర్వీకులు పాటిస్తూ వచ్చిన ధర్మమే. మనకు దాని అర్ధం తెలియక అవి మూఢనమ్మకాలు అనడం సరియైనది కాదు. స్త్రీలు ఇంద్రునికి సహాయం చేసి, దోషాన్ని తాము తీసుకొని అనుభవిస్తున్నారని వారి గొప్పదనాన్ని తెలుపుతోంది. కనుక, వారిని తక్కువ చేయడం ఏ మాత్రము సరి కాదు.Importance of Menstruation, Rituals and Rules in Telugu

    పైగా, ఇది శరీరం యొక్క దోషము. వ్యక్తిత్వ దోషం కాదు. ఇది అవమానకరము కాదు. దేశ, కాల పరిస్థితులను బట్టి కొన్ని అనుకూలించకపోయిన, శక్తి వంచన లేకుండా యధాశక్తి వాటిని ఆచరించవచ్చు. ఇంట్లో ఇతరుల్ని తాకకుండా, వండకుండా విశ్రాంతిగా ఒకే చోట ఉండడం ఎప్పుడైనా కుదురుతుంది. శ్రద్ద ఉన్నపుడు తప్పకుండ ఆచరించగలం. నెలలో కేవలం, ఆ కొద్దిరోజులు జాగ్రత్తపడడం, కొంచెం శ్రమ అయినా, అసాధ్యం అయితే కాదు. బయట ప్రపంచం గురుంచి వదిలిపెట్టండి. మన ఇంట్లో మనం జాగ్రత్తగా ఉండగలం.

   4 వ రోజున స్నానం చేసాక, నీళ్లలో పసుపు కలిపి ఆ దోషాలన్నీ పోయేలా భగవత్ సమర్పణ చేసి, స్నానం చేస్తారు. ఇంట్లో ఆ మూడు రోజులు తిరిగిన చోటంతా “పసుపు నీళ్లు” చల్లి ఇల్లు కడుగుతారు. పైగా మంత్రం జపించేవాళ్ళు ఉన్న ఇంట, దీపారాధన, దేవతాపూజలు జరిగే ఇంతా ఇటువంటి “మైల”లు కలిస్తే, ఆ “మంత్రశక్తి, దైవశక్తి” నశిస్తాయి. దీనికి ఎన్నో నిదర్శనాలున్నాయి. తాయెత్తులు, యంత్రాలు వంటివి కూడా రజస్వల స్త్రీ స్పర్శతో శక్తిహీనమౌతాయి. మళ్ళీ సంప్రోక్షణ చేస్తే కానీ వాటిలో శక్తి చేరదు.

    నిత్యం దీక్షగా ఉన్న స్త్రీలు ఆ 4 రోజులు మంత్ర జపం, స్తోత్ర పారాయణం, దీపారాధన వంటివి చేయరాదు(మానసికంగా నామస్మరణ చేస్తే తప్పు లేదు). తిరిగి స్నానాదులు చేసాక 5 వ రోజు నుండి వాటిని కొనసాగించవచ్చు. అప్పుడు, మధ్యలో ఆపిన దోషం ఉండదు. అలా కాకుండా, ఆ 4 రోజుల్లోనూ వాటిని కొనసాగిస్తే, పాపం సంక్రమిస్తుంది. ఆ సమయంలో దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొన్న దోషమే అవుతుంది..మాములుగా నిత్యం సహజంగా మన శరీరం నుండి మలినాలు విసర్జించాక, స్నానం చేస్తేనే కానీ పూజాదులకు పనికిరాదంటారు. మరి ఈ విషయంలో నియమాలు ఉంచడం ఎంత అవసరమో ఆలోచించండి.

    ఆరోగ్యరీత్యా కూడా..ఆ 4 రోజులు స్త్రీకి విశ్రాంతి అవసరం. అప్పుడు కూడా ఆమెకు విశ్రాంతి నివ్వకుండా, ఇంటి పనులు చేయించడం అంటే  మగవాడి దౌర్జన్యమే అని భావించాల్సి వస్తుంది..అప్పటి “ఇన్ఫెక్షన్” ప్రభావం గురుంచి విజ్ఞాన శాస్త్రం కూడా చెప్పింది. భారతీయ విజ్ఞానంలో “భౌతికవిజ్ఞానమ్, సూక్ష్మ ప్రపంచ విజ్ఞానం” అనేవి కలిసి ఉంటుంది. భౌతిక విజ్ఞానం ఇంకా ఎదుగుతోంది. ఇప్పటికే మన ఆచారాలలో కొన్నింటి ఆరోగ్య రహస్యాలు అంగీకరిస్తున్నాయి. ఇంకా ఈ సైన్స్ ఎదిగితే, అన్నింటిని అంగీకరిస్తారు. కానీ, ఈ లోపలే మనం వీటిని పోగొట్టుకోకూడదు. ఈ 4 రోజులు ఆమె ఇంట్లో కలవకూడదు. ఇంటి యజమాని కానీ ఇంకెవరైనా కానీ దీపారాధన చేయవచ్చు.

ఋతుచక్రం యొక్క నియమాలు నాడు – నేడు(Rules of Menstrual Cycle On – Today) :

Importance of Menstruation, Rituals and Rules in Telugu

  1. ఋతుచక్రం సమయంలో చెడు రక్త విసర్జన వల్ల శరీరం నుండి దుర్గంధం వస్తుంది. ఫలితంగా ఆడపిల్లలు బలహీనంగా, చికాకును కలిగి ఉంటారు.
  2. అందువల్ల, పూర్వం ఇలా నెలసరిలో ఉన్న స్త్రీలను ఏ పని చేయనివ్వకుండా ఇంటి అరుగుపై చాప వేసి దానిపై కూర్చోబెట్టేవారు. కాబట్టి, ఆమె బయట చేరింది అనేవాళ్ళు.
  3. బహిష్టు సమయంలో ఆహారంగా అన్నంలో పప్పు – నెయ్యి మాత్రమే తినేవారు(At the time of menstruation, they used to eat only pulses and ghee in rice).
  4. బహిష్టు స్నానం పూర్తికాగానే గర్భదోషాలు(Miscarriages) నివారించబడటానికి గోళీకాయంత “పసుపు” ముద్దను మ్రింగేవారు. “గర్భదోషాలు” ఉండేవి కావు.

    కానీ, నేడు ఈ కాలంలో స్త్రీ సాధికారత వల్ల పాచ్చ్యత విష సంస్కృతి ప్రభావం వల్ల అమ్మాయిలు బహిష్టు నియమాలను ఉల్లంఘించడం జరుగుతుంది. ఫలితంగా, బహిష్టు నొప్పులు(Menstrual pains), గర్భస్రావాలు(miscarriages) జరుగుతున్నాయి. 

ఋతుక్రమంకు సంబంధించిన ఆచారాలు, నిషేధాలు(Rituals and taboos related to menstruation) :

   స్త్రీలలో రుతుక్రమం అనేది సహజమైన ప్రక్రియ. పురాతన కాలం నుండి ఈ రుతుస్రావం గురుంచి చాలా నమ్మకాలు ఆచారాలు ఉన్నాయని చాలా మందికి తెలుసు.

  1. భారతదేశ ఆధునికత వైపు అడుగులు వేస్తున్న బహిష్టు యొక్క పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కలిపిస్తున్నారు.
  2. ఈ సమయంలో కూడా చాలా చోట్ల పీరియడ్స్ వచ్చిన స్త్రీని అపవిత్రంగా చూస్తూనే ఉంటారు.
  3. ఋతుక్రమ సమయంలో ఆలయాలకు, ప్రార్థన స్థలాలకు వెళ్లడాన్ని హిందూ ధర్మం నిషేదించింది. ఇది పరమ సత్యం అని దాదాపు చాలామందికి తెలుసు. వంట గదిలోకి వెళ్ళకూడదు అని, నదిలో స్నానం చేయకూడదు అని కూడా చెబుతూ ఉంటారు.
  4. దీనికి మతపరమైన కారణాలు ఏవైనా సరే, దీనికి సంబంధించి శాస్త్రీయ కారణం హార్మోన్ల(Hormonal) మార్పులే.
  5. రుతుక్రమ సమయంలో మహిళల శరీరంలో చాలా హార్మోన్లు మారుతూ ఉంటాయి. దీని వలన ఆమెకు “చిరాకు, కోపం” వస్తూ ఉంటుంది. మరియు ఆమె మనసు ప్రతికూలతతో నిండిపోయి ఉంటుంది.
  6. నదిలో స్నానం చేసే సమయంలో ఆమె ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండొచ్చు అని ఈ నియమ నిబంధనలను పెట్టారు.
  7. ఆలయం అనేది సానుకూలతతో ఉన్న ప్రదేశం కాబట్టి, ఆలయానికి వెళ్ళేటప్పుడు మనసు ప్రశాంతతో నిండి ఉండాలి. కానీ, దేవాలయానికి వెళ్ళేటప్పుడు చిరాకుగా అనిపిస్తే ప్రశాంతంగా అస్సలు ఉండదు.
  8. ఇదే కాకుండా పూర్వకాలంలో ఏదైనా దేవుడిని పూజించేపుడు “కీర్తన మరియు ముఖ్య మంత్రం” పఠించకుండా పూజ పూర్తయ్యేది కాదు. మంత్రాన్ని శ్రద్దగా పఠించాలి. “ఉచ్ఛరణ(pronunciation)”లో తప్పులు చేయకూడదు.
  9. కానీ, ఋతుక్రమ సమయంలో మహిళ నొప్పి, అలసటతో భాదపడుతూ ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ సేపు ఒకే చోట కూర్చొని మంత్రం జపించడం అస్సలు వీలు పడదు. అందుకే, స్త్రీలను పూజలు చేయడానికి నిషేదించారు.
  10. రుతుక్రమ సమయంలో ఇంట్లోని అన్నీ ప్రదేశాలకు తిరిగి ఉన్నాము అంటే..తిరిగి శుభ్రపరుచుకోవడం సరైన మార్గం. లేదంటే..ఆ దోషం అనేది అనుభవించాల్సి వస్తుంది. అంత ఓపిక లేదు అనుకుంటే, విశ్రాంతి తీసుకోవాలి ఒకే స్థలంలో ఉంటూ..

    ఋతుక్రమంలో ఉన్న స్త్రీలు చాలా శక్తివంతులని అంటారు. ఋతుస్రావం ఉన్న స్త్రీలు ఈ సమయంలో శక్తిని స్వీకరించడానికి మరియు గ్రహించడానికి సిద్ధంగా ఉంటారు. దీని అర్ధం..వారు ప్రతికూల శక్తులతో సహా ఇతరుల శక్తులను సులభంగా గ్రహించగలరు. అందువల్ల, బహిష్టు సమయంలో ప్రార్థన స్థలాలకు దూరంగా ఉండాలని చెబుతారు. గ్రూపులుగా ఉన్న ప్రజల దగ్గరికి మరియు సమావేశాలకు దూరంగా ఉండాలని కోరారు.

ఆయుర్వేదంలో ఋతుప్రవాహం గురుంచి(About Menstruation in Ayurveda) :

    ఆయుర్వేదం 3 జీవసంబంధమైన శక్తులను(దోషాలు అని పిలుస్తారు) గుర్తిస్తుంది – “వాత, పిత్త మరియు కఫా” – ఇది శరీరం యొక్క అన్ని విధులను ప్రభావితం చేస్తుంది.

  • బహిష్టు భాషలో, ఋతుస్రావంకు దారి తీసే హార్మోన్ల విడుదల వాత దోషం(Vata dosha) ద్వారా ప్రేరేపించబడుతుంది. ఇది అన్ని కదలికలను నియంత్రిస్తుంది.
  • అండోత్సర్గం ప్రక్రియ అనేది పిత్త దోషం(Pitta dosha) యొక్క ఫలితం. ఇది అన్ని పరివర్తన ప్రక్రియలకు భాద్యత వహిస్తుంది.
  • మరియు రుతుస్రావం తర్వాత మనం ఆనందించే స్థిరత్వం కఫ దోషం(Kapha dosha) యొక్క ఆధిపత్యం కారణంగా ఉంటుంది. ఇది కణ నిర్మాణాన్ని నిర్వహిస్తుంది.
  • ఆయుర్వేదం రుతుక్రమ రుగ్మతలను(Menstrual disorders)(మరియు దానికి సంబందించిన ఏదైనా వ్యాధి) ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దోషాలను తీవ్రతరం చేస్తుంది. మరియు చికిత్స దోషాలను తిరిగి సమస్థితికి తీసుకురావడం పై దృష్టి పెడుతుంది.

   మతపరమైన ఆచారాలు రుతుప్రభావాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో..అర్ధం చేసుకోవడానికి, వాత దోషం యొక్క ఉప – రకాల గురుంచి తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే, ఇది రుతుక్రమం సమయంలో ప్రధాన దోషం అయిన వాత దోషంలో 5 ఉప రకాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని వివిధ భాగాలలో కదలికలను నియంత్రిస్తాయి. ప్రతి ఉప – రకం నిర్దిష్ట కార్యకలాపాలను సులభతరం చేయడానికి కదలిక యొక్క నిర్దిష్ట దిశను కలిగి ఉంటుంది. ఇక్కడ కేవలం, 2 ఉప – రకాల గురుంచి కొంచెం విశదపరుస్తాము. అవి 1. సమాన వాయు  2.అపాన వాయు.

  • సమాన వాయు : దీని దిశ వృత్తాకారంగా ఉంటుంది. కడుపు ప్రాంతంలో జీర్ణక్రియ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఆహరం కడుపులోకి ప్రవేశించినపుడు, సమాన వాయు ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఆమ్లాలను విడుదల చేస్తుంది.
  • అపాన వాయు : ఈ అపాన వాయు ఉదరం క్రింద ప్రాంతంలో ఉంటుంది. శరీరంలోని వ్యర్థాల విడుదల, పిల్లల పుట్టుక మరియు శరీరం నుండి రుతుప్రవాహాన్ని నిర్వహించడం వలన దీని దిశ నిలువుగా క్రిందికి ఉంటుంది. అపాన వాయు దిశలో ఏదైనా మార్పు రుతుప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది.
ముగింపు(Conclusion) :

     పీరియడ్స్ రావడం, సకాలంలో పీరియడ్స్ రాకపోవడం గురుంచి ఆలోచన వస్తే ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు..కానీ, రుతుక్రమ ప్రాముఖ్యతను, వాటి ఆచారాలను, నియమాలను అర్ధం చేసుకుంటే గాని..స్త్రీ ఒక శక్తి స్వరూపంగా ఎలా భావించబడుతుంది అనేది భోదపడుతుంది. అలా అని దేవతలా కొలుస్తూ ఉండడం కాదు. మీరు ఇచ్చే గౌరవం సంపూర్ణ ప్రేమ స్థితి కలిగి ఉందా? లేదా? అని చూసుకోవడంలోనే అసలైన భావన.

     అది ఎలాగంటే, స్త్రీ యొక్క రుతుక్రమ సమయాన్ని అంటరానితనంగా చూసే, మానసిక దుర్భరత్వ స్థితి నుండి మేల్కొని, స్త్రీ రుతు సమయాన్ని పవిత్ర భావనతో ఆచరించనివ్వండి. అంతేకానీ, మన శరీరం ఎలా తయారైంది అని మర్చిపోయి..ఋతుస్రావాన్ని అవమానించేంత స్థితిలోకి వెళ్ళకూడదు. దీనికంటూ కొన్ని ఆచారాలు, పద్ధతులు నియమించారు అంటే, దాని వెనుక ఒక పరమార్థం కలిగి ఉంది. కాబట్టి, పూర్వకాలం నుండి ప్రతి స్త్రీ అవలంభిస్తూ వస్తున్న ఈ క్రమాన్ని బాగా అర్దమ్ చేసుకోవాలి..అప్పుడే గానీ ఋతుక్రమాన్ని మరియు స్త్రీ ని తక్కువ చూపు చుస్తున్నామా? తీసిపడేస్తున్నామా? అనేది ఎవరికీ వారు తెలుసుకోగలుగుతారు.

    “అంతటా దేవుడు ఉన్నాడు కదండీ” అనే వేదాంత వచనాన్ని దీనికి అన్వయించడం తప్పు. అంతటా దేవుడు ఉన్నాడు అనిపిస్తే ఒకే చోట మందిరం ఏర్పరిచి, దేవతా పూజ చేయడం ఎందుకు? శరీర స్పృహ ఉన్నంత కాలం ఆచారం పాటించవలిసిందే. ఈ విధమైన అశౌచంలో ఉన్న స్త్రీ శరీరం నుండి ప్రసరించే సూక్ష్మ విద్యుదయస్కాంత తరంగాల ఆవరణ దివ్యంగా ఉండదు. విపరీత శక్తులతో ఉంటుంది. ఇది సూక్ష్మ ప్రపంచాన్ని దర్శించగలిగిన వాళ్లకి తెలుస్తుంది.

    మన చుట్టూ జగత్తులో దైవీకశక్తులు, విపరీత శక్తులు ఉంటాయి. విపరీత శక్తుల ప్రభావం పడకుండా ఉండేందుకే శౌచాన్ని పాటించాలి. “ఇవన్నీ ఆచారాలు పాటించడం మా ఇంట్లో కుదరవు, ప్రస్తుత కాలంలో కూడా పూర్వపు ఆచారాలు పాటించడం ఒక చాదస్తం అనుకుంటూ” తప్పించుకుంటే, నష్టపోయేది మనమే మరియు మన ఆరోగ్యమే..ఆ నష్టానికి సిద్ధపడితే వదలవచ్చు. శాస్త్రాన్ని పాటించడం వల్ల పాటించిన వారికే ప్రయోజనం కానీ ఇంకెవరికో ఉండదు అని గ్రహించాలి.

..సర్వేజనా సుఖినో భవంతు.. 

 

Add Comment