Types of Vitamins in Telugu-విటమిన్స్ లోని రకాలు
పోషక పదార్థాలను మనం Vitamins అంటాము. ఇవి మన శరీరానికి చాల ముఖ్యమైనవి. ఈ Vitamins మనము ఆరోగ్యాంగా ఉండడానికి దోహదపడతాయి,వీటిని A,B,C,D.E.K విటమిన్లు అని పిలుస్తారు.వీటి గురించి తెలుసుకోవడం మనకు చాల అవసరం.
Vitamin A:
మనం రోజు తీసుకునే ఆహారంలో A విటమిన్ సరిపడా లేకుంటే కంటి చూపు తగ్గటానికి అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి సమయంలో కళ్ళు సరిగ్గా కనపడక పోవడం,కళ్ళు కాంతిహీనంగా ,పొడిబారినట్టు కనపడటం జరుగుతుంది.
కేరెట్ ,బొప్పాయిపండు,టొమోట,,పాలు,పాల కూర,తోటకూర,మామిడి పండులో A విటమిన్ అధికంగా ఉంటుంది.
Best Recommended Vitamins Tablets
Vitamin B:
మనం తీసుకునే ఆహారంలో B విటమిన్ తగ్గినట్లయితే ఆకలి తగ్గడం,నీరసం,అలసట వంటి లక్షణాలు కనపడతాయి. అన్ని రకాల గింజలు,వేరుశనగ,మాంసం,దంపుడు బియ్యం,ఉప్పుడు బియ్యంలో B విటమిన్ అధికంగా ఉంటుంది.
ఈ B విటమిన్ లో రిబిఫ్లోవిన్ అనే విటమిన్ కూడా ఉంటుంది,ఇది ఆహరం లో తగ్గడం వలన నాలుక మీద,నోటి పెదాల మీద ఫుల్లు ఏర్పడటం జరుగుతుంది. ఆకుకూరలు,కాలేయం,గుడ్డు లో రిబోఫ్లోవిన్ ఎక్కువగా ఉంటుంది.
Vitamin C:
మనం తీసుకునే ఆహారంలో సి విటమిన్ తగ్గితే జలుబు,అంటూ వ్యాధులకు గురి కావడం జరుగుతుంది.దీనివలన నోట్లో పండ్లు ,చెవి నుండి రక్తం కారడం వంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది.అలాగే తల తిరగటం,వాంతులు రావటం జరుగుతుంది.నారింజ,నిమ్మ,కాయగూరలు,జామ, ఉసిరి,టమేటాలో ఎక్కువగా ఉంటుంది.
Vitamin D:
D విటమిన్ ముఖ్యంగా పెద్దవారిలో ఎక్కువగా చూస్తుంటాం.దీనివలన కాళ్ళ నొప్పులు,నడుం నొప్పులు ఉంటాయి.అలాగే ఆడవాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.కాలేయం,ఉదయం పూట వచ్చే సూర్యరశ్మి,,చేపలు,గుడ్లు,చేప నూనె,పాలలో D విటమిన్ ఎక్కువగా ఉంటుంది.
బెస్ట్ మల్టీవిటమిన్స్ టాబ్లెట్స్ ఇక్కడ క్లిక్ చేసి కొనండి
Vitamin E:
చర్మ రక్షణకు విటమిన్ E ఎంతగానో సహాయ పడుతుంది,చర్మం కాంతివంతంగా ఉండటానికి ,శరీరంపై ఉండే ముడతలు తొలగించడానికి దోహదపడుతుంది. అలాగే చర్మం పై ఉండే నల్లటి వలయాలను తొలగిస్తుంది.కేశసౌందర్యానికి కూడా సహాయపడుతుంది.ఒత్తయిన జుట్టు పెరగటానికి సహాయపడుతుంది.విటమిన్ E ఆకుకూరలు,టమాటో,బాదాం పప్పు,చిలకడ దుంప,ఆలివ్ ఆయిల్ వంటి వాటిలో ఎక్కువగా లభిస్తుంది.
Best Recommended Vitamins Tablets
Vitamin K:
K విటమిన్ లోపం వలన పురుషులలో బీజకణాల అభివృద్ధి లేకపోవడం,అలాగే ఆడవారిలో గర్భస్రావం వంటి సమస్యలు రావటం జరుగుతుంది.సూర్య కాంతి,మొలకెత్తిన గింజలు,కుసుమ నూనె,మాంసం,పళ్ళు,కూరగాయలలో ఎక్కువగా ఉంటుంది.
K విటమిన్ తగ్గడం వలన ఏదైనా గాయం అయినప్పుడు రక్తం తొందరగా గడ్డ కట్టదు. డాక్టర్లు రోగి కి ఆపరేషన్ చేసేటప్పుడు K విటమిన్ ఇస్తారు.మంచి పుష్టికరమైన ఆహరం తీసుకోవడం వలన K విటమిన్ లభిస్తుంది.
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి. అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.