మానవ కళ్యాణ మంగళ హారతులు పాడే మామిడి చెట్టు(Mangal Kalyan is a mango tree that sings Mangal Aarti)
ఈ ఒక్క వాక్యంలోనే మామిడి చెట్టు(Mango tree) యొక్క అర్థమును, లాభాలను నింపుకొని ఉంది. మామిడి చెట్టు ప్రపంచ మానవాళికి ఆరోగ్య ప్రయోజనాలు(Health benefits) కలిగిస్తూనే, ఆధ్యాత్మిక చైతన్యాన్ని(Spiritual consciousness) ప్రసరింపజేస్తూ, మనసుకు ప్రశాంతత(calmness)ను అందించడంలో మామిడి చెట్టు ఇన్ని అద్భుతాలను(Miracles) కలిగి ఉంది.
మామిడి చెట్టు అనగానే గుర్తుకు వచ్చేది తియ్యటి మామిడి పండ్లు(Sweet mango fruits). చూడగానే నోరూరించే మామిడిపండ్ల మాధుర్యమే(Sweetness) వేరు. పండ్లలో “రారాజైన(King)” మామిడి పండ్లను ప్రపంచమంతా ఇష్టపడే ఆహారంగా ప్రాచుర్యం పొందింది. వేసవి కాలంలో దొరికే ఈ “సూపర్ ఫ్రూట్(Super fruit)” ను తినడం ద్వారా మన శరీరానికి భానుడి(sun burn) ప్రతాపం నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనికంటే ముందుగా మామిడి అనగానే ఎవరు తినకుండా ఉండలేరు.
- మామిడి అనేది భారతదేశపు “జాతీయ ఫలం”.
- వేసవి కాలం(summer season)లో ఈ పంటను చేస్తారు. సుమారుగా 40 సంవత్సరాలు ఉంటుంది.
- మామిడి చెట్టు 4000 వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. ఇవి “మాంగిఫెరా(Mangifera)” అనే ప్రజాతికి చెందిన “వృక్షాలు”.
- దీని ఆకులు “ఆకు పచ్చ రంగు(Green color)లో” ఉంటాయి. ఈ ఆకులను “చూత పత్రి(Chuta Patri)” అని కూడా అంటారు. ఈ ఆకు కిరీటం ఆకారంలో ఉంటుంది. పరిమాణము పెద్దది. మరియు ఈ చెట్టు మహా వృక్షం(Great tree)గా పెరగగలదు.
- మన భారతదేశంలో 100 రకాలకు పైగా మామిడి పండ్లు దొరుకుతాయి. వీటి కాయలను ఉరగాయల(Reptiles) తయారీలో ఉపయోగిస్తారు. అలాగే మామిడి నుండి రసం(Mango juice) తీసి కూడా సేవిస్తారు.
- ఇందులో “కెరోటిన్(carotene), విటమిన్ సి(Vitamin c), క్యాల్షియం(Calcium)” ఎక్కువగా ఉంటాయి.
మన సనాతన ధర్మం, సాంప్రదాయంలో మామిడి తోరణాలు(Mango arches in our Sanatana Dharma, tradition) :
- “మంగళకరమైన మామిడి(Auspicious Mango)” దీని మరో నామం. భారతీయ సంప్రదాయంలో మామిడి ఆకుల తోరణం ఉత్తమమైన తోరణంగా భావిస్తారు.
- మన సంసృతిలో ప్రతి పండుగా, ప్రతి శుభకార్యం, ప్రతి పూజ విధానంలో కూడా మామిడి తోరణం తోనే ప్రారంభమౌతుంది. అంతగా మామిడి ఆకులు శుభప్రదానికి(Good luck) సూచికగా వ్యవహరిస్తారు.
- ఈ మామిడి చెట్టు అనేది కార్బన్ డయాక్సైడ్(carbon dioxide) గ్రహిస్తూ, ఆక్సిజన్(Oxygen)ను మనకు అందించడమే కారణం అన్ని వేడుకల్లోనూ శుభసూచికగా మామిడి ఆకుల తోరణాలతో ఆరంభమౌతుంది.
- మామిడి ఆకులు “జీవితానికి(For life)” ప్రతీకగా సూచిస్తాయి. అనగా, మామిడి చెట్టు ఆకులు, పండ్లు..అన్ని సర్వశక్తులను(Almighty) కలిగి ఉంది.
- మానవ శ్రేయస్సుకు శరీర సౌందర్యం(Body beauty0 తో పాటుగా, ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తూ, ఇంటి తోరణాల రూపంలో మన చుట్టూ ఉండే వాతవరణాన్ని శుద్ధి చేస్తూ(Purifying), మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతుంది.
- అలాగే మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. చెడు శక్తుల(Evil forces) నుండి కూడా మన అందరిని, ఇంటి ని రక్షింపబడుతుంది అనేది నమ్మకంగా వస్తున్న ఆచారంగా వ్యవహరిస్తారు.
మామిడి పేర్లు పుట్టుపూర్వోత్తరాలు(Mango Names are Birth Names) :
ఇంగ్లీష్ : మామిడి
తమిళం : మాంపజం / మంక
మలయాళం : మాంపజం
తెలుగు : మామిడి పాండు
కన్నడ : మావిన హన్ను / మావింకాయి
హిందీ : ఆమ్ / కేరి
బెంగాలీ : ఆమ్
గుజరాతీ : కేరి
కొంకణి : అంబో
మరాఠీ : అంబ
ఒరియా : అంబ
పంజాబీ : అంబ్ / ఆమ్
కాశ్మీరీ : అంబ్
- ఖచ్చితంగా మామిడి ప్రారంభం ఎక్కడో తెలియకపోయిన శిలాజాల ఆధారంగా 25 నుండి 30 మిలియన్ సంవత్సరాల పూర్వం మామిడి ఉన్నట్లు రుజువు అయింది. పురాణాలలో(In Puranas), వేదకాలం(the Vedic period)లో ఉన్నట్లు వర్ణనలు ఉన్నాయి. ఇండియా, శ్రీలంక, బర్మా, బంగ్లాదేశ్ మామిడి చెట్టు జన్మ స్థలంగా విశ్వసించబడుతోంది.
- భారతద్వీపకల్పం(Peninsular India) అంతటా కూడా మామిడి చెట్ల పంటను సమశీతోష్ణ పరిస్థితుల్లో(In temperate conditions) కూడా పండిస్తూ ఉన్నారు. కరేబియన్, మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు ఆసియా, మధ్య, దక్షిణ ఆఫ్రికా దేశాల్లోనూ పండిస్తున్నారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడి చెట్టును ఇంటి పెరటిలో చూడవచ్చు.
- మామిడి పండ్లు ఎక్కువగా తియ్యగా(Sweet) ఉన్న, కొన్ని జాతుల పండ్లు కొంచెం పుల్లగా(Sour) ఉంటాయి. కొన్ని పండ్లు ఎక్కువ పీచు(peach, fiber), రసం(juice) ను కలిగి ఉంటాయి. వీటిని “రసాల పండ్లు” అంటారు. బంగినపల్లి రకం మామిడి కాయలు ఎక్కువ తీయగా మెత్తటి కండ(soft tissue) కలిగి ఉంటాయి. నీటి శాతం(percentage of water) ఎక్కువ కనుక రసభరితంగా(Playfully) ఉంటాయి.
మామిడి పోషకాహార విలువలు(Nutritional values of mangoes) :
దీనిని ఎక్కువగా తాజాగా(Fresh)నే తింటారు. ఇవి అందరికి అందుబాటులోనే ఉంటాయి. తాజా మామిడి పండులో (15%) చక్కర, 1% మాంసకృత్తులు మరియు గుర్తించదగిన మోతాదులో ఏ ,బి, సి విటమిన్లు(Vitamin A, B, C) ఉంటాయి.
- 100 గ్రాముల మామిడిలో 60 కేలరీలు ఉంటాయి.
- ఈ పండులో 1.4 గ్రాముల ప్రోటీన్,
- 24.7 గ్రా కార్బోహైడ్రేట్స్,
- 22.5 గ్రా చక్కర, మరియు
- 2.6 గ్రా ఫైబర్ ఉన్నాయి.
- రోజూ వారి విలువలో 67% విటమిన్ సి మామిడి లో లభిస్తుంది.
- ఇది రాగి, ఫోలేట్, థయామిన్, మెగ్నీషియం, నియాసిన్, పొటాషియం, మరియు రిబోఫ్లేవిన్ యొక్క మంచి పోషకాల మొత్తాన్ని కలిగి ఉంది.
వేసవి కాలంలో మాత్రమే దొరికే ఈ మామిడి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన లాభాలు చూద్దాము(Let’s see the health benefits of eating this mango fruit which is available only in summer):
- మామిడి పండ్లలో క్వెర్సెటిన్, ఫిసెటిన్, ఐసోక్వెర్సిట్రిన్, ఆస్ట్రాగాలిన్, గాలిక్ యాసిడ్, మిథైల్ గాలెట్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, ప్రోస్టేట్ కాన్సర్, లుకేమియా వంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి.
- మామిడి పండులో ఉండే విటమిన్ బి6 చర్మంలోని సెబమ్(Sebum) ను తగ్గిస్తుంది.
- మామిడిలోని పొటాషియం(Potassium) చర్మానికి తేమను అందిస్తుంది.
- మామిడిలోని మెగ్నీషియం(Magnesium) మొటిమలు, చర్మ జిడ్డు తత్వాన్ని(Oiliness of the skin) తగ్గిస్తుంది.
- మామిడి పండులో ఎక్కువగా ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటు నుండి రక్షిస్తాయి.
- మామిడిలో ఐరన్ కూడా ఉంటుంది కనుక, రక్తహీనతతో బాధపడే వారికి మామిడి పండ్లు మంచి ఔషదంగా పని చేస్తాయి. మరియు ఎర్ర రక్తకణాల వృద్ధి చెందుతాయి.
- మామిడిని తినడం వల్ల శృంగార వాంఛలు(Romantic desires) కూడా పెరుగుతాయి.
- చర్మ సౌందర్యానికి మామిడిని మించిన పండు లేదు. అలాగే జుట్టు కూడా ఆరోగ్యకరం(Healthy hair)గా ఉంటుంది.
- మామిడిలో ఉండే ఖనిజాలు(Minerals) గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.
- రోగనిరోధక శక్తి(Immunity) : మామిడి లో విటమిన్ ఏ, సి మరియు కొన్ని రకాల కెరోటినాయిడ్లు(Carotenoids) కూడా ఉన్నాయి. ఈ అతి ముఖ్యమైన పోషకాలు రోగనిరోధక వ్యవస్థను(The immune system) బలంగా, ఆరోగ్యాంగా ఉంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
- కొలెస్ట్రాల్(Cholesterol) : మామిడి పండులో అధిక స్థాయిలో విటమిన్ సి, ఫైబర్ మరియు పెక్టిన్ ఉన్నాయి. ఇది అధిక కొలెస్ట్రాల్ స్థాయిని(Accumulated fat in the blood) నియంత్రించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తుంది.
- చర్మ సౌందర్యం(Skin beauty) : మామిడి పండు మన చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా, చర్మం అందంగా, మృదువు(Soft)గా ఉండడానికి ఉపయోగపడుతుంది. అందుకే, మచ్చలేని చర్మాన్ని(Flawless skin) సొంతం చేసుకోవాలి అంటే, ప్రతి రోజు ఒకటి చొప్పున మామిడి పండు(Mango fruit) ను తినండి.
- ఏకాగ్రత(Concentration) : మామిడి పండ్లను తినండి. మీ ఏకాగ్రత(Concentration) మరియు జ్ఞాపక శక్తిని(The power of memory) పెంచుకోండి. ఎందుకంటే, ఈ పండులో ఈ శక్తిని పెంచే గుణం ఉంది.
- ఆల్కలైజ్(Alkalize) : మామిడి పండు “టార్టారిక్(Tartaric)” మరియు “మాలిక్ యాసిడ్(Malic acid)”తో సమృద్ధిగా ఉంటాయి. సిట్రిక్ యాసిడ్(Citric acid) కూడా ఈ పండులో పుష్కలంగా ఉండడం వల్ల, ఇది మన శరీరంలోని క్షార నిల్వ(Alkali storage)ను నిర్వహించడానికి సహాయపడుతుంది.
- బరువు తగ్గటం(weight loss) : మామిడి లో చాలా విటమిన్లు, అవసరమైన పోషకాలు(Nutrients) పుష్కలంగా ఉన్నాయి కాబట్టి, బరువు తగ్గటానికి ఒక మార్గంగా ఉపయోగపడుతాయి. మనం ఒక్క మామిడి పండు ను తింటే చాలు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల, ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడం తో పాటుగా, మన శరీరం నుండి అనవసరమైన కేలరీలను burn చేస్తుంది. అందుకే మన శరీరంలో ఉండే అదనపు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
- మామిడి పండులోని ఎంజైమ్(Enzyme) లు శరీరంలోని ప్రోటీన్ కంటెంట్ ను వేరు చేయడంలో సహాయపడుతాయి. ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఈ పండు అనేక రకాల కడుపు సంబంధిత వ్యాధులను నివారిస్తాయి.
మామిడి రకాలు(Mango Varieties) :
1)బంగినపల్లి 2) గిర్ కేసర్ మామిడి 3)చందూరా 4)రుమానియా 5)మాల్గోవా 6)చెక్కర కట్టి 7)నీలం 8)జలాలు 9)రసాలు 10)చిన్న రసాలు 11)పెద్ద రసాలు 12)చెరుకు రసాలు 13) షోలాపూరి 14)అల్ఫాన్సా 15)నూజువీడు రసం 16)పంచదార కలశ 17)కోలంగోవా 18)ఎండ్రాసు 19)సువర్ణరేఖ 20)చాకులు 21)కలెక్టర్ 22)ఆచారి 23)ఇమామ్ పసంద్ 24)దసేరి 25)జహంగీర్ 26)ఢిల్లీ పసంద్ 27)నూర్జహాన్ 28)బెనీషా 29)హిమానీ 30)కొబ్బరి మామిడి 31)పుల్లూర 32)ఇంటి పెరడులో మామిడి
33) నీలిషాన్(బెనీషా + నీలాన్ని కలిపి అభివృద్ధి చేసినది) 34) పండూరి వారి మామిడి 35) అంపిరేడు లేక కొండ మామిడి 36)అంటూ మామిడి లేక చిలకముక్కు మామిడి లేదా బెంగుళూరు మామిడి
ఆయుర్వేదంలో మామిడి ఔషదంగా ఎలా ఉపయోగపడుతుంది(How mango is used as a medicine in Ayurveda) :
- నిద్రలేమి(Insomnia) : రాత్రి పడుకునే ముందు ఓ మామిడి పండును తినండి. హాయిగా నిద్ర పడుతుంది అని వైద్యులు చెప్తున్నారు. దీని ద్వారా నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.
- దంతాలు గట్టిగా ఉండాలంటే(For strong teeth) : మామిడి యొక్క తాజా ఆకులను నమలండి. నమిలినప్పుడు నోట్లో లాలాజలం ఊరుతుంది. దీన్ని ఉమ్మేయండి. ఇలా ప్రతి రోజు చేస్తూ ఉండడం వల్ల, దంతాలు కదులుతూ ఉంటే దృడంగా తయారౌతాయి. అలాగే చిగుళ్ల నుండి వచ్చే రక్తస్రావం కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది అని వైద్యులు సూచిస్తున్నారు.
- దంత సంబంధ సమస్యలు(Dental problems) : మామిడి ఆకులను ఎండబెట్టి, బూడిద అయ్యేవరకు మండించండి. దీనికి ఉప్పు కలిపి టూత్ పౌడర్ లా వాడుకోవాలి. ఈ పొడి కి ఆవనూనెను కలిపి వాడుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
- శరీరం కాలినప్పుడు(When the body burns) : మామిడి ఆకులను కాల్చి, బూడిద చేసిన తర్వాత ఆ భస్మాన్ని కాలిన గాయాలపై చిలకరించండి. దీంతో కాలిన గాయం మానుతుంది.
- అతిసారం(diarrhea) : లేత మామిడి ఆకును పెరుగులో నూరి దానిని సేవిస్తే అతిసారం తగ్గుతుంది.
- పాదాల పగుళ్లు(Cracked feet) : మామిడి జిగురు లో ఉప్పును చేర్చి వేడి చేసి ఔషదంగా పూస్తే, కాళ్ళ పగుళ్లు, చర్మ వ్యాధులు నశిస్తాయి. మరియు మామిడి జిగురుకు మూడు రేట్ల నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసి, ప్రతి రోజు పాదాలకి లేపనం లాగ చేసుకోవాలి.
- కడుపులో పురుగులు(Worms in the stomach) : మామిడి టెంకలోని జీడిని తీసేసి వేరుపరచి ఆరబెట్టాలి. దీనికి పెద్ద చెంచాడు మెంతులను కలిపి మెత్తగా నూరాలి. దీనిని ఒక పెద్ద సీసాలో భద్రపరుచుకొని, కొన్ని రోజుల పాటు మజ్జిగ తో కలిపి తీసుకోవాలి.
- జ్వరం(Fever) : మామిడి వేర్లను మెత్తగా రుబ్బి అరికాళ్లకు, అరిచేతులకు రాసుకుంటే జ్వరంలో కనిపించే వేడి తగ్గుతుంది.
- చెవి నొప్పి(ear pain) : స్వచ్ఛమైన మామిడి ఆకుల నుండి రసం తీసి, కొద్దిగా వేడి చేసి నొప్పిగా ఉన్న చెవిలో డ్రాప్స్ గా వేసుకోవాలి.
- నీరసం(Boredom) : మామిడి ముక్కలకు 1 టీస్పూన్ తేనెను, చిటికెడు కుంకుమ పువ్వు, ఏలకులు, రోజ్ వాటర్ ను చిలకరించి ఆస్వాదించండి.
- వడదెబ్బ(sunburn) : పచ్చి మామిడి కాయను నిప్పుల మీద వేడి చేసి పిండితే సులభంగా గుజ్జు వస్తుంది. దీనికి కొద్దిగా చల్లటి నీళ్లను, పంచదారను చేర్చి తాగాలి. ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా, శరీరానికి ఎండ వల్ల కోల్పోయిన శక్తి ని తిరిగి పొందగలరు.
- చెమట కాయలు(Sweat nuts) : రెండు పచ్చి మామిడి కాయలను గిన్నెలో నీళ్లు పోసి ఉడికించాలి. చల్లారిన తర్వాత గుజ్జును పిండి పంచదార, ఉప్పు కలిపి సేవించండి. దీని వల్ల శరీరంలో వేడి తగ్గి, చర్మం పేలిపోకుండా ఉంటుంది.
- పచ్చకామెర్లు (Jaundice) : పచ్చి మామిడికి మిరియాలు, తేనె కలిపి తిన్నట్లయితే, పచ్చకామెర్ల వ్యాధి నుండి రక్షణ పొందవచ్చు.
- గుండె ఆరోగ్యం మెరుగుదల(Improving heart health) : పచ్చి మామిడికి మిరియాలు, తేనె కలిపి తీసుకోవడం గుండెకు ఒక టానిక్ లాగ పని చేస్తుంది. పచ్చి మామిడిలో “విటమిన్ సి” పుష్కలంగా పని చేస్తుంది. గుండె కండరాలను బిగుతుగా చేసే శక్తి మామిడికి ఉంది. అలాగే, చర్మాన్ని మిలమిలా మెరిసేలా చేసే శక్తి కూడా దీనికి అధికంగా ఉంది.
“అతి” అనేది అన్ని వేళలా సరి కాదు. కాబట్టి, ఎక్కువ మోతాదులో “పచ్చి మామిడి”ని తినకూడదు. అలా తిన్నట్లయితే, “ఆర్థరైటిస్, కీళ్ళవాతం, సైనసైటిస్, గొంతునొప్పి, ఎసిడిటీ” లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, మామిడిని పరిమితంగా తినటం చాల మంచి పద్ధతి.
గర్భిణీ స్త్రీలు మామిడి పండ్లను తినవచ్చా..(Can pregnant women eat mangoes)?
మామిడి అనేది సీజన్లో దొరికే పండు. మామిడి పండులో విటమిన్ ఏ, సి మరియు బి6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. “విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్” రెండు కూడా గర్భిణీ స్త్రీ(pregnant woman)కి మరియు బేబీ కి అతి ముఖ్యమైనది. వీటితో పాటు మరికొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం..
- గర్భిణీ స్త్రీలకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- మామిడిలోని ఫైబర్ జీర్ణశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
- అధికబరువును కూడా తగ్గించుకోవచ్చు.
- మామిడిలోని క్యాల్షియం కంటెంట్ కండరాల నొప్పిని, ఒత్తిడిని తగ్గిస్తుంది.
- దీనిలోని ఐరన్ అనీమియా ను నివారిస్తుంది.
- బాగా పండిన మామిడి పండులో “బీటా కెరోటిన్” ఎక్కువగా ఉంటుంది.ఇది అప్పుడే పుట్టిన బేబీ కి కంటిచూపును అందిస్తుంది.
- “డయాబెటిస్” ఉన్న గర్భిణీస్త్రీలు మామిడి పండ్లను ఎక్కువుగా తీసుకోకూడదు. మామిడిలో చక్కర శాతం ఎక్కువగా ఉంటుంది.
- అలాగే మామిడిని రసాయనాలతో పండించినవి, రసాయనాలతో మాగించిన పండ్లు తల్లి మరియు బిడ్డ ఆరోగ్యానికి కూడా హానికరమే అవుతుంది.
- మామిడి తో చేసిన జ్యూస్, మిల్క్ షేక్ లు తాగడం వల్ల ఎక్కువ క్యాలరీలు శరీరానికి అందుతాయి. దాంతో “జెస్టేషనల్ డయాబెటిస్(గర్భధారణ మధుమేహం)”కు కారణం అవుతుంది.
ముగింపు(Conclusion) : వేసవి కాలంలో దొరికే మామిడి పండును తినడం అందరికి శ్రేయస్కరం. రోజులో ఎన్ని పండ్లు తినడం వల్ల మీ శరీరానికి హాయిని కలిగిస్తుంది. హుషారుగా ఉండగలుగుతున్నారు అనేది గమనిస్తే మీది మీకే తెలిసే అవకాశం ఉంటుంది. దీని అర్ధం ఏమంటే, మీ శరీరంలో కలిగే మార్పులు ఏ విధమైన పరిస్థితిని కలిగిస్తుంది చూడాలి. దీన్ని అనుసరించి, ఎంత మోతాదులో మామిడి ని తీసుకోవడం అనేది నిర్ణయింపబడుతుంది. మీ శరీర మోతాదును బట్టి మామిడి పండును తీసుకున్నట్లయితే, ఎలాంటి హానికర పరిస్థితులను ఎదురుకోవాల్సిన అవసరం ఏర్పడదు.