బ్రెయిన్ ట్యూమర్ నివారణ అనేది సమతుల్య పౌష్టికాహారంతో సాధ్యం చేసుకోవచ్చు|Prevention of brain tumors is possible with a balanced diet in Telugu

మెదడులో కణితిని తగ్గించుకునే ప్రయత్నంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు(Foods to take in an attempt to reduce brain tumor) :

     బ్రెయిన్ ట్యూమర్ అనేది ప్రాణాంతక వ్యాధి(Brain tumor is a deadly disease)..బ్రెయిన్ ట్యూమర్ నివారణపై అవగాహన పెంచేందుకు, మానసిక ఆరోగ్య రుగ్మతలను తగ్గించడానికి ప్రతి సంవత్సరం “జూన్ 8(June 8th)”“ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని(World Brain Tumor Day)” నిర్వహిస్తారు. మెదడులోని కణితుల గురుంచి అవగాహనను కల్పించటంతో పాటు, మెదడు యొక్క ఆరోగ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అని నొక్కి చెప్పే ఉద్దేశ్యంతోను, మరియు రోగులు వారి కుటుంబాలు కోలుకోవడంలో సహాయం చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ రోజు సందర్బంగా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ప్రమాదాన్ని తగ్గించడంలో పలు ఉత్తమ ఆహార పదార్థాల గురుంచి ఆరోగ్య నిపుణులు(Health professionals) సూచిస్తున్నారు. అవి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సమతుల్యమైన ఆహార పదార్థాలు బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాన్ని తగ్గించగలవా(Can a balanced diet reduce brain tumor risk)?

    “అవును ఖచ్చితంగా తగ్గించగలవు” అనే సమాధానం చెప్పాలి..ఎందుకంటే, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మన శరీర ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే విధానంలో బ్రెయిన్ ట్యూమర్ ఒక్కటే కాదు..తలనొప్పి సమస్య, ఇంకా శరీరంలో కలిగే ఎన్నో సమస్యలను పరిష్కరించుకోగలం అని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి.. Prevention of brain tumors is possible with a balanced diet in Telugu

    మానవ శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో మెదడు ఒకటి. ఎందుకంటే, శరీరంలో ప్రతి అవయవం చేసే ప్రతి పనిని ఇది నియంత్రిస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ మీ మెదడు ఆరోగ్యం(Brain health) క్షీణించడం ప్రారంభమౌతుంది. అయితే, ఈ రోజుల్లో ప్రజలు జీవిస్తున్న జీవన శైలి..చిన్న వయస్సులో కూడా “అభిజ్ఞా క్షీణత(Cognitive decline)”కు దారి తీస్తుంది.

    మెదడుకు సంబంధించిన సమస్యలు, రుగ్మతల నుండి రక్షించగల “మ్యాజిక్ మందులు(Magic medicine)” లేవు..అందుకే, ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అనుకునే వాళ్లందరు ఆరోగ్యకరమైన ఆహార విధానాలను(Healthy eating habits) పాటిస్తున్నారు. దీని కోసం, మన సంపూర్ణ ఆరోగ్య రక్షణ, పోషణకై సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవడంపై చాలా శ్రద్ద వహిస్తున్నారు..ఇవి మీ మెదడులోని కణితులు(Tumors), అల్జిమర్స్(Alzheimer’s), చిత్తవైకల్యం(Dementia) వంటి రుగ్మతల నుండి మిమ్మల్ని రక్షించడమే కాకుండా మీ మానసిక స్థితి(state of mind)ని మెరుగుపరుస్తాయి. మరియు ఇది మెదడు కణితిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మెదడు కణితుల ప్రమాదాన్ని తగ్గించే నిర్దిష్ట ఆహారాలు ఏవీ లేనప్పటికీ, కొన్ని ఆహార కారకాలు ప్రయోజనకరంగా ఉండవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

  1. ఆకు కూరలు(Green vegetables) : కాలే, బచ్చలి కూర, కొల్లార్డ్స్, స్విస్ చార్ట్ వంటి ఆకుకూరలు ఫోలేట్, బీటాకెరోటిన్, విటమిన్లు సి, కె వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి మెదడు కణితులు అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్ఫ్లమ్మెటరీ కంపౌండ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడును  దెబ్బతినకుండా కాపాడుతాయి
  2. క్రూసిఫెరస్ కూరగాయలు(Cruciferous Vegetables) : బ్రోకలీ, క్యాలీఫ్లవర్, బ్రస్సెల్స్ మొలకలు వంటి క్రూసిఫెరస్ కూరగాయలు క్యాన్సర్ నుండి మెదడును రక్షించడంలో సహాయపడే పోషకాలతో నిండి ఉన్నాయి. ఈ కూరగాయలలో సల్ఫోరాఫేన్(Sulforaphane) అనే సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడు కణితులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  3. తృణధాన్యాలు(Cereals) : తృణధాన్యాలు(బార్లీ, గోధుమ, ఓట్స్, మొక్కజొన్న) తగిన మొత్తంలో పిండి పదార్దాలను కలిగి ఉంటాయి. ఇవి మీ మెదడుకు స్థిరమైన శక్తిని అందిస్తాయి. మిమ్మల్ని అప్రమత్తంగా ఉంచి, ఏకాగ్రతను, దృష్టిని పెంచుతాయి. అంతేకాకుండా, తృణధాన్యాల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో మంచి హార్మోన్లను(సెరోటోనిన్) మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సెరటోనిన్ మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మనస్సును ప్రశాంతపరుస్తుంది. స్థిరమైన నిద్రను ఇస్తుంది.Prevention of brain tumors is possible with a balanced diet in Telugu
  4. గింజలు, విత్తనాలు(Nuts and seeds) : కాయలు, విత్తనాలు ముఖ్యముగా, వాల్నుట్స్, గుమ్మడికాయ గింజలు పూర్తిగా యాంటీఆక్సిడెంట్స్ తో నిండి ఉంటాయి. ఇవి మెదడు కణాల ఆక్సీకరణ ప్రక్రియను ఎదుర్కోవడంలో సహాయం చేస్తాయి. ఈ విత్తనాలు, గింజలు మీ ఆలోచనా నైపుణ్యాలను అభివృద్ధి చేసే బహుళ ఖనిజాలను కలిగి ఉంటాయి. మెగ్నీషియం, విటమిన్ -బి, ట్రిప్టోఫాన్ మంచి పరిమాణంలో నట్స్, గింజలలో కూడా అందుబాటులో ఉన్నాయి. బాదం, అవిసెగింజలు వంటి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను పుష్కలంగా కలిగి ఉన్నాయి. ఇవి కొత్త మెదడు కణాలను పెంచడంలో సహాయపడుతాయి. మరియు మెదడును రక్షిస్తుంది.Prevention of brain tumors is possible with a balanced diet in Telugu
  5. పసుపు(turmeric) : పసుపు అనేది యాంటీ ఇన్ఫలమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన మాసాల. మెదడులో మంటను తగ్గించడం ద్వారా మెదడు కణితులు అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గించడంలో పసుపు సహాయపడుతుంది అని అధ్యయనాలు చెపుతున్నాయి.
  6. చేపలు(Fish) : మెదడు సజావుగా పని చేయడానికి చాలా ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు చేపలలో కన్పిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు పనితీరును ప్రోత్సహిస్తాయి. ఒమేగా 3 కొవ్వులు EPA, DHA రూపంలో లభిస్తాయి. ఇవి దీర్ఘకాలిక, స్వల్పకాలిక జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో చాలా సహాయం చేస్తాయి. తక్కువ DHA స్థాయిలు చిత్తవైకల్యం, అల్జిమర్స్ తో సహా వివిధ మెదడు వ్యాధులకు దోహదం చేస్తాయి. సాల్మన్, ట్యూనా వంటి చేపలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయం చేస్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థ అభివృద్ధిలో సహాయపడుతాయి.Prevention of brain tumors is possible with a balanced diet in Telugu
  7. బెర్రీలు(Berries) : బెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి వాటి అన్నింటిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు దెబ్బతినకుండా కాపాడుతాయి.
  8. బ్లూ బెర్రీలు(Blue Berries) : బ్లూ బెర్రీస్ లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఫైబర్, విటమిన్ సి, మాంగనీస్, సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్స్, క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్ అలాగే రికవరీ సమయంలో జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత విషయంలో రోగులు ఇబ్బంది పడుతారు. అయితే, ఈ బ్లూ బెర్రీస్ ని కనీసం 12 వారాల పాటు రోజు తీసుకుంటే వృద్దులలో జ్ఞాపశక్తితో పాటు నేర్చుకోవడం కూడా పెంపొందుతుంది అని అధ్యయనాలు చెప్తున్నాయి.Prevention of brain tumors is possible with a balanced diet in Telugu

     మెదడు కణితుల ప్రమాదాన్ని తగ్గించడానికి “సాధారణ శారీరక శ్రమ(Regular physical activity)” ముఖ్యమైనది. చురుకైన నడక(Active walking), సైక్లింగ్(cycling) వంటివి ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు “మితమైన వ్యాయామాలు(Moderate exercises)” చేయాల్సి ఉంటుంది. ఇంకా, పండ్లు మరియు కూరగాయలు(Fruits and vegetables) పుష్కలంగా తినడం అలవాటు చేసుకోవాలి. ప్రాసెస్ చేయబడిన ఆహరం(Processed food), చక్కర ఆహారాలను(Sugary foods) పరిమితం చేయడం ద్వారా మెదడులో కణితులు రాకుండా చూసుకోవచ్చు.

ముగింపు(Conclusion) : 

    మెదడులో కణితులు పెరగడానికి కారణం మన అలవాట్లే మనపై దాడి చేసాయి అని చెప్పేయొచ్చు సులువుగా..ముందు ఆర్టికల్ లో మెదడు యొక్క కణితి ఏర్పడే విధానం, చికిత్స గురుంచి తెలుసుకున్నాము. ఇప్పుడు, మన జీవన శైలిలో అలవరుచుకునే ఆహారపు అలవాట్లను, తీసుకోవాల్సిన ఆహార పదార్దాలను తెలుసుకున్నాము. మెదడులో పెరిగే కణితులను పూర్తిగా ఆహార పదార్థాలతో నివారించుకోగలమా అనే ప్రశ్న మీలో కనుక వస్తే, దీనికి సమాధానం అవును నివారించుకోగలం అనే చెప్పాలి.. 

     కేవలం, పౌష్టికాహారం తీసుకుంటే సరిపోతుందా అంటే..ఇది కాదు నియమావళి..ముందుగా ప్రతి వ్యక్తికి మన శరీరం మరియు మెదడు పని తీరు గురుంచి అవగాహనను పెంచుకోవాలి. ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే, ఎలాంటి ఆరోగ్య రక్షణ మనకి కలుగుతుంది అని. ఎంత మేర ఆహారపదార్థాలు మీ శరీరానికి అవసరమవుతాయి అని “న్యూట్రిషన్స్” ద్వారా తెలుసుకోవాలి. అలా మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా మీ ఆహార నియమాలు పాటించాలి. తద్వారా, మన శరీరంపై ఏ రోగం అయినా దాడి చేయాలి అని చూసిన, అది వెనక్కి వెళ్లిపోయే అంతటి రోగనిరోధకశక్తిని సంపాదించుకుంటాము. దీనితో పాటు శరీరంలో రక్తప్రసరణకు ఆటంకం కలగకుండా చిన్న చిన్న వ్యాయామాలు అలవాటు చేసుకోవడం, లేదా మన పని కోసం ఇతరులపై ఆధారపడకుండా చేసుకుంటే శారీరక శ్రమ కూడా కల్గుతుంది.

     అయితే, పెద్దలు ఈ నియమాలను అనుసరిస్తూ, పిల్లలకు చిన్నతనం నుండే ఒక అవగాహనను ఏర్పరచాలి. దీనితో ఒక బంగారు భవిష్యత్ కోసం సంపూర్ణ ఆరోగ్యాన్ని పిల్లలకు అందించిన వాళ్ళం అవుతాము.

Add Comment