వేప వృక్షం ఒక ఔషధాలయం మరియు సర్వరోగ నివారిణి|Neem tree is a medicine and panacea in Telugu

వేప చెట్టు అంత ఒక దివ్యఔషదాన్ని కలిగి ఉండి, ఇది మానవాళికి మరియు ప్రకృతికి చేకూర్చే లాభాలు తెలుసుకుందాము(Let’s know the benefits of neem tree as a miracle medicine to mankind and nature)

వేప అనగా ఏమిటి(What is neem)?

చాలా రకాల మొక్కలకు ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే, వాటన్నింటిని మించి వేయిరోగాలను సైతం తరిమికొట్ట గల శక్తి కలిగిన చెట్టు “వేప చెట్టు”. ఇన్ని ఔషధ గుణాలు కలిగి ఉండడం వల్లే ప్రపంచవ్యాప్తంగా గొప్ప విలువైన చెట్టుగా పేరు పొందిన శక్తివంతమైన ఒక “కల్పవృక్షం”. యుగ యుగాల నుండి మన దేశంలో గృహ వైద్యంలోను, ఆయుర్వేద, యునాని, హోమియోపతి మందుల్లో వేప సంబంధిత పదార్థాలు ఎక్కువగా వాడుతారు. Neem tree is a medicine and panacea in Telugu

 

 ప్రాచీన కాలం నుండి కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజా ఆరోగ్యానికి వేప చెట్టు పెద్ద దిక్కుగా ఉండేది. అందుకే, వేపను ఆయుర్వేద శాస్త్రం చింతామణి, సర్వరోగ నివారిణిగా కొనియాడుతున్నారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథములో ఇలా చెప్పాడు. “ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఆరోగ్యవంతంగా ఉంటూ, ఎక్కువ కాలం జీవిస్తారు”. ఇన్ని సుగుణాలున్న వేపచెట్టును మన ఇంటి ఆరోగ్య దేవతగా అభివర్ణింపబడుతుంది. యునాని వైద్యులు దీన్ని “బ్లేస్డ్ ట్రీ(Blessed Tree)” అంటారు.

వేప ప్రధానంగా ఆసియాలోనే కన్పిస్తుంది. ఇది  సహజంగా భారత ఉపఖండంలో పెరుగుతుంది. దీని ప్రాధాన్యం తెలిసాక, అన్ని దేశాలు ఈ వేపచెట్టును పెంచడం మొదలుపెట్టి ఉన్నారు. వేప శాస్త్రీయ నామం “అజాడిరచుట ఇండికా(AZADIRACHUTA INDICA)”. మహాగణి కుటుంబమైనా “మెలియేసి” కుంటుంబానికి చెందిన ఒక వృక్షం. దీన్ని “ఇండియన్ లిలాక్” అని కూడా అంటారు. సంసృతంలో “నింబ” అని, ఆఫ్రికా భాషలో” మ్వారోబైని(కిస్వాహిలి) అంటారు. దీని అర్ధం “నలభై చెట్టు”. అనగా, నలభై రకాల వ్యాధులను నయం చేస్తుంది అని చెప్తుంటారు. దీని ఉపయోగాన్ని గుర్తించడం మొదలు పెట్టి, ఇలాంటి వాతావరణం కలిగిన ప్రదేశాలు ఉన్న చోట ప్రపంచవ్యాప్తంగా వేపచెట్టును పెంచడం ఆరంభించారు.

వేప ఆకు, వేపపూత ఇలా వేప చెట్టు నుండి వచ్చే ప్రతి భాగం మనిషి ఆరోగ్యముగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మానవాళికి అవసరమయ్యే స్వచ్ఛమైన గాలిని ఈ వేప చెట్టు అందిస్తుంది. భారతదేశంలో వేప చెట్టు ను సాక్షాత్త్ “లక్ష్మి దేవి” గా ప్రజలు పూజిస్తారు. తెలుగు నూతన సంవత్సరం అయినటువంటి “ఉగాది” పండుగ రోజున.. వేపపూత, బెల్లంతో కూడిన ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెపుతున్నాయి.

స్వరూపం(appearance) :

ఇప్పుడంటే కొబ్బరి చెట్టును కలియుగ కల్పవృక్షం అంటున్నారు కానీ, ఒకప్పుడు కల్పవృక్షం అంటే ” వేపచెట్టు” అని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. వేపచెట్టు చాల త్వరత్వరగా పెరగగలదు. 15 నుండి 20 మీటర్లు, కొన్నిసార్లు 35 నుండి 40 మీటర్ల వరకు కూడా ఎదగగలదు. ఈ చెట్టు కొమ్మలు బాగా విస్తరించి ఉంటుంది. ఇది చూడటానికి ఎంతో ఆకర్షణీయమైన రంగుతో కళకళలాడుతూ, పచ్చదనంతో పరిసరాలను ఆహ్లాదంగా కనిపించేలాగా చేయడమే కాకుండా, నీడనిస్తూ, సేదతీరుస్తూ, ఆరోగ్యానిస్తూ చివరికి ఎండి, రాలిపోయిన ఆకులు, పండ్లతో నేలను సైతం పోషకభరితం చేస్తూ, అణువణువు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నటువంటి అసలైన కల్పవృక్షం “వేపచెట్టు” అని అంటారు.

వేప చెట్టుతో మనకు ముడిపడి ఉన్నఅనుబంధం(Our association with Neem tree) :Neem tree is a medicine and panacea in Telugu.

 

  • ఒకప్పుడు, తెల్లవారుతూనే దంతధావనానికి గుర్తుకువచ్చేది “వేపపుల్ల” మాత్రమే..
  • కాసేపు సేద తీరడానికి మన పెరట్లో ఉండే “వేపచెట్టు నీడ”..
  • పిల్లలకు ఏ అమ్మవారు సోకితేనో వేపాకు పడక..
  • ఇల్లు కట్టుకోవడానికి వేప కలప..
  • పెద్దవాళ్ళు అందరు కలిస్తే కబుర్లు చెప్పుకోవడానికి వేపచెట్టు కిందే ఒక రచ్చబండ..
  • ఇలా మన దినచర్య వేపచెట్టు తో ఎంతో అనుబంధాన్ని పెనవేసుకోవడం జరిగింది. ఏ నొప్పి కైనా సరే, వ్యాధికి అయినా సరే వేపచెట్టును ఆశ్రయించేవారంట. అందుకే దానికి “పల్లెటూరి వైద్యశాల” అని పేరు పెట్టారు విదేశీయులు.   
  • కేవలం, సాంప్రదాయంగా ఉగాది పచ్చడిలో వేసే వేపపువ్వు మాత్రమే కాదు, బహురూపాల్లో వేప మన జీవితాల్లో భాగమైపోయింది. దీంతో ఇప్పుడున్న చెట్లకు రెట్టింపు ఉంటె కానీ మన అవసరాలు తీరవు అని తెలియజేస్తున్నారు నిపుణులు.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర వృక్షంగా “వేప చెట్టును” తీసుకోవడం జరిగింది.
  • వేప మన తెలుగు సంస్కృతి లోనే ముఖ్య భాగంగా వినియోగపడుతుంది. కొన్ని గ్రామాల్లో వేప చెట్టును దైవంగా భావిస్తూ, వాళ్ళ ప్రతి శుభకార్యం నందు మొదటగా వేప చెట్టును పూజించడం ఆచారంగా వ్యవహరిస్తారు.
  • ఒక సంరక్షిణిగా వేపచెట్టు మానవాళికి మాత్రమే కాకుండా పంటలకు కూడా కాపాడడంలో సాటి లేని విధంగా నిరూపించుకుంది. అందుకే, మన పెద్దలు వేప చెట్టును “ఔషదాల గని” నిరూపించారు.
ఆసక్తికరమైన వాస్తవం(Interesting fact) :

ఎవరైనా సరే తమ జీవితకాలం మొత్తంలో 3 లేదా అంతకు ఎక్కువ వేపచెట్లను పెంచడం చేసి ఉంటె, వారు స్వర్గానికి వెళతారు అని శాస్త్రం చెప్తుంది.

వేప ఔషధ ఉపయోగాలు మరియు ఎలా పని చేస్తుంది(Medicinal uses of neem and how it works)? 

భారతదేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో గృహ వైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తున్నారు.

  • వేప పువ్వును హిందువులు ( తెలుగు రాష్ట్రాల ప్రజలు, కన్నడిగులు, మహారాష్ట్ర ప్రజలు) ఉగాది పచ్చడి తయారీ లో చేదు రుచి కోసం వాడుతారు.Neem tree is a medicine and panacea in Telugu

 

  • వేప కొమ్మ పుల్లతో మన దంతాలు తోముకోవడానికి ఉపయోగిస్తారు.
  • ఈ చెట్టు  నుండి లభించే కలప, తక్కువ ధరలో తలుపులు, కిటికీలు తయారు చేయడంలో వాడుతారు.
  • వేప నూనె(Neem Oil) : వేపచెట్టు గింజల నుండి వేప నూనెను తయారు చేస్తారు. దీనిని సహజ క్రిమిసంహారక, కీటకనాశనం, శీలింద్రనాశిని గా ఉపయోగిస్తారు. మాయిశ్చరైజింగ్  మరియు యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలతో కుడి ఉంది కాబట్టి, సౌందర్య సాధనాలు, సబ్బులు, షాంపూలు మరియు జుట్టుకు అవసరమయ్యే నూనె లాంటి వ్యక్తిగత సంరక్షణను కలిగించే ఉత్పత్తుల వాడకంలో ఎంతో ఉపయోగిస్తున్నారు.Neem tree is a medicine and panacea in Telugu

 

  • వేప ఆకులు(Neem leaves) :

“అమ్మవారు” వంటి అంటువ్యాదులు సోకినవారిని “వేపఆకుల” మీద పడుకోబెడుతారు. అనేక చర్మ వ్యాధులను అరికట్ట కలిగే శక్తి కలిగినది ఈ “వేప ఆకులు”. ముఖ్యముగా “గజ్జి, మొటిమలకు” పై పూతగా బాగా పని చేస్తుంది. “అమ్మవారు” వంటి అంటువ్యాదులు సోకినవారిని “వేపఆకుల” మీద పడుకోబెడుతారు. అనేక చర్మ వ్యాధులను అరికట్ట కలిగే శక్తి కలిగినది ఈ “వేప ఆకులు”. ముఖ్యముగా “గజ్జి, మొటిమలకు” పై పూతగా బాగా పని చేస్తుంది.Neem tree is a medicine and panacea in Telugu

 

  • వేప గింజలు(Neem seeds) : వేప గింజల “కెర్నలు” వేప నూనె తీయడానికి ఉపయోగిస్తారు. కెర్నలు పశువులకు సహజ ఫీడ్ సప్లిమెంట్ గా,కీటక మరియు శీలింద్ర సంహారిణిగా కూడా ఉపయోగించవచ్చు. వేపకాయ గుజ్జును క్రిమిసంహారిణిగా వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు.
  • వేప బెరడు(Neem seeds) : జ్వరం, చర్మ రుగ్మతలు, జీర్ణ సమస్యలతో సహా అనేక రకాల అనారోగ్యాలతో చికిత్స చేయడానికి వేప బెరడు ను సంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు. ఇది సహజ క్రిమిసంహారక, పురుగుల నివారిణిగా ఉపయోగించబడుతుంది.
  • వేప టీ(Neem Tea) : వేప ఆకులను నీటిలో మరిగించి “వేప టీ” ని తయారు చేస్తారు. ఇది ఆరోగ్య సమస్యల యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు సహాయపడుతుంది.
వేప ఆకుల వల్ల కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits of Neem Leaves) :

ఈ భూమి మీద మీరు కనుగొనగల అత్యంత సంక్లిష్టమైన ఆకులలో వేప ఆకు ఒకటి. అందుకే, వేప చెట్టు అనేది చాలా ప్రత్యేకమైన చెట్టుగా మనం భావించవచ్చు. వేప చెట్టు లో జీవశాస్త్ర పరంగా 130 కి పైగా చురుకైన సమ్మేళనాలు(compounds) ఉన్నాయి. వేపాకు ఎన్నో నమ్మశక్యం కాని ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంది.

  • యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు(Anti-inflammatory properties) : వేప చెట్టు ఆకులు, బెరడులో ఉండే సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఆర్థరైటిస్, అస్తమా, తామర వంటి వ్యాధులతో వల్ల నొప్పి మరియు వాపు, ఎరుపును తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.
  • యాంటీ బాక్టీరియల్ లక్షణాలు(Antibacterial properties) : వేపచెట్టులో ఉండే సమ్మేళనాలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి, హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడటానికి మరియు ఇన్ఫెక్షన్లను నిరోధించడానికి సహాయపడుతుంది. దీనితో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
  • యాంటీ ఫంగల్ లక్షణాలు(Antifungal properties) : వేప చెట్టులోని సమ్మేళనాలు యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి, ఫంగల్ ఇన్ఫెక్షన్ల తో పోరాడడానికి సహాయపడుతాయి. చర్మం మరియు గోర్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా కాండిడా మరియు రింగ్ వార్మ్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు(Antioxidant properties) : వేప చెట్టులో ఉండే సమ్మేళనాలు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంది, ఇవి ఫ్రీ రాడికల్స్ యొక్క హానికరమైన ప్రభావాల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇది క్యాన్సర్ మరియు గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.
  • వేపాకు వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు(Benefits of Neem for Skin) : వేప ఒక యాంటీ ఆక్సిడెంట్ ఆహారం. ఇది మీ జుట్టు మరియు చర్మం ఆరోగ్యానికి చాలా మంచిది. వేప ఆకులు చర్మ సంబంధిత వ్యాధులను నివారించడంలో అద్భుతంగా పని చేస్తుంది అని నిపుణులు రుజువు చేసారు. మీరు మీ శరీరాన్ని వేపతో కడిగితే, అది శుభ్రంగా, ప్రకాశవంతంగా మారుతుంది. మీరు స్నానం చేసే ముందు వేప పేస్ట్ తో మీ శరీరాన్ని రుద్దుకొని, కొంచెం సేపు ఆరనిచ్చి ఆపై నీటితో కడిగేస్తే అది మంచి యాంటీ బాక్టీరియల్ స్నానముగా పని చేస్తుంది. ఇంకో విధమైన చిట్కా.. కొన్ని వేప ఆకులను రాత్రి పూట నీటిలో నానబెట్టి, ఉదయం ఈ నీటితో స్నానం చేయవచ్చు.
  • రోగ నిరోధకత కోసం(For immunity) : ఇది విభిన్నమైనటువంటి బ్యాక్టీరియా, వైరస్, శీలింద్రాలు, మరియు పరాన్న జీవుల నుండి మీ శరీరాన్ని కాపాడుతూ..వేప సారం వ్యాధి నిరోధకతను మెరుగుపరచడంలో వేప మనకు ఎంతో సహాయం చేస్తుంది అని కూడా అధ్యయనాలు నిరూపించబడింది. ముఖ్యముగా, లింఫోసైట్లు మరియు మోనోసైట్లు సంఖ్యలో గణనీయమైన పెరుగుదల చూపబడింది. ఈ రెండు తెల్ల రక్త కణాల రకాలు. ఇవి సంక్రమణ కలిగించే, సూక్ష్మజీవులపై పోరాడే భాద్యత కలిగి ఉంటాయి.
  • హృదయానికి(For the heart) : వేప ఆకులు గుండెకు రక్తప్రసరణ జరపడాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తూ, హృదయ సంబంధిత వ్యాధి “అరిత్మీయ” ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
  • చక్కర స్థాయిలు(Sugar Levels) : ఫ్లవనాయిడ్స్, టెర్పినాయిడ్స్ లను వేప కలిగి ఉండడం వల్ల, రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది అని చెప్తున్నారు. మరియు రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు కూడా వేప కలిగి ఉంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు, మన శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తుంది. వేప ఆకులను నిత్యం తీసుకోవడం వల్ల కడుపులో నులి పురుగుల సమస్యను అరికట్టవచ్చు అని నిపుణులు నిర్థారించారు.
  • అసిడిటీ(Acidity) : యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు శ్వాస సంబంధిత సమస్యలను మరియు దగ్గు, ఊపిరితిత్తులకు సంబందించిన శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. వేప ఆకులు అసిడిటీ, ఆకలి లేకపోవడం వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. వేప వినియోగం జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.
  • గాయాలు నయం చేయటంలో వేపతో చికిత్స(Neem treatment in wound healing) : వేప ఒక ప్రభావంతమైన, సహజమైన గాయాల నివారిణిగా పని చేస్తుంది అని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. వేప ఆకులు నింబిడిన్ మరియు సోడియం నింబిడేట్ వంటి సమ్మేళనాలు కలిగి ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి నొప్పిని మరియు వాపును తగ్గించడంలో సహాయపడుతూ, గాయం అయిన ప్రదేశంలో మరల వ్యాధి సంక్రమణ కలిగే అవకాశాలను తగ్గిస్తాయి.
  • క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది(Helps destroy cancer cells) : ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, క్యాన్సర్ కణాలను చంపగల శక్తిని కలిగి ఉంది. ప్రతి ఒక్కరికి కూడా తమ శరీరంలో క్యాన్సర్ కణాలు ఉంటాయి. కానీ, అవి సాధారణంగా వ్యవస్తీకరించబడి ఉండవు. అయితే మీరు శరీరంలో కొన్ని పరిస్థితులను సృష్టించినపుడు అవి వ్యవస్తీకరించబడుతాయి. ఈ కణాలు విడివిడిగా వాటికై అవి ఆలా తిరుగుతూ ఉన్నంతకాలం ఎటువంటి సమస్య ఉండదు. అవి గనుక అన్ని ఒక చోట చేరి, దాడి చేస్తే అప్పుడు అది సమస్య అవుతుంది. ఇది చాలా పెద్ద సమస్య. మీరు ప్రతిరోజు వేపాకును తీసుకుంటే, అది శరీరంలోని క్యాన్సర్ కణాలను ఒక నిర్దిష్ట పరిమితిలో ఉంచుతుంది. తద్వారా, ఒక గ్రూపు లాగ ఏర్పరుచుకొని, వ్యవస్థకి వ్యతిరేకంగా పని చేయకుండా ఉంటాయి.
  • హానికరమైన బాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడుతుంది(Helps destroy harmful bacteria) : ఈ ప్రపంచం బ్యాక్టీరియాతో నిండిపోయి ఎలాగైతే  ఉందో, అలాగే ఈ శరీరం కూడా. మీలో మీరు ఉహించగల దాని కన్నా ఎక్కువ సూక్ష్మ జీవులు నివసిస్తూ ఉన్నాయి. ఈ బాక్టీరియాలో చాలా వరకు సహాయకారిగా ఉంటాయి. అవి లేకుంటే మీరు ఏమి అరిగించుకోలేరు. కానీ కొన్ని బ్యాక్టీరియాలు హాని ని కలిగించగలవు. మీ శరీరం ఈ బాక్టీరియాలను నిర్వహణ చేయడానికి నిరంతరం శక్తిని ఖర్చు పెడుతూ ఉంటుంది. ఒకవేళ అధిక స్థాయిలో బ్యాక్టీరియా గనుక ఉంటె, మీకు మతకగా ఉంటుంది. ఎందుకంటే, మీ సంరక్షణ వ్యవస్థ వాటితో యుద్ధం చేసేందుకు చాలా ఎక్కువ శక్తిని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాగే, శరీరంలో కొన్ని భాగాల్లో కొద్దిగా వాసన వస్తూ ఉన్నట్లయితే దాని అర్ధం అక్కడ బ్యాక్టీరియా కొంచెం ఎక్కువగా చురుకుగా ఉంది అని.

మీరు రోజూ కొంత వేపను తీసుకుంటూ (శరీరం లోపల మరియు బయట వేపను వాడే విధంగా కూడా చూసుకోవాలి) ఉంటె అది పేగు ప్రాంతంలో ఉన్న ఇబ్బంది కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అలాగే మీ పెద్ద పేగును శుభ్రంగా ఇన్ఫెక్షన్(Infection) లేకుండా ఉంచుతుంది.

  • వేప గర్భనిరోధకంగా పని చేస్తుంది(Neem works as a contraceptive) : వేప అనేది గర్భనిరోధకానికి సమర్ధవంతమైన మార్గం. గర్భాశయానికి వేపనూనెతో చికిత్స వలన సంతానోత్పత్తి ఆపు చేయవచ్చని ప్రీక్లినికల్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీని ప్రకారం, జంతు నమూనాలు ఎలాంటి దుష్ప్రభావాలను చూపించలేదు. మరియు కొన్ని నెలల తర్వాత వాటి సంతానోత్పత్తి పునరుద్ధరింపబడింది. మరియొక అధ్యయనంలో, యోని ద్వారా వేప చమురును ఉపయోగించుటం వల్ల స్పెర్మల కదలికను నిరోదించినట్లు వెల్లడించారు. ఖరీదైన గర్భనిరోధక పద్దతులను పొందలేని వ్యక్తులకు సులువుగా అందుబాటులో ఉండేలా తక్కువ ధరలో లభించే మరియు విషపూరితం కానీ గర్భనిరోధక వేప నూనె యొక్క విలువ ఈ ఫలితాన్ని అన్నింటిని చూపుతుంది.
వేప ఆకు యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాలు(Spiritual Benefits of Neem Leaf) :

శరీరంలో విభిన్నమైన లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. వీటిలో రెండు ఏమిటంటే, శీత, ఉష్ణ. మీ వ్యవస్థ శీత వైపుకు వెళితే, శరీరంలోని శ్లేష్మం స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో మితిమీరిన శ్లేష్మం అనేది, సాధారణ జలుబు నుండి సైనసైటిస్ నుండి ఇంకా ఎన్నో ఇతర రకరకాల పరిస్థితులకు అనుసంధానమై ఉంటుంది. వేప శరీరంలో ఉష్ణాన్ని కలిగిస్తుంది. ఈ ఉష్ణాన్ని సృష్టించడం అనేది వ్యవస్థలో చాలా తీక్షణమైన శక్తి రూపాలను తయారు చేయడంలో సహాయపడుతుంది.

వాస్తు ప్రకారం కూడా చాలా శుభప్రదమైనదిగా తేల్చారు. అందుకే వేపచెట్టును ఇంటి వాయువ్య మూలానా పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ చెట్టు నుండి వచ్చే గాలి “పడక గది(Bed room)” కిటికీల నుండి లోనికి వీచేలాగా చూసుకోవాలి. ఈ విధమైన గాలిని మనం స్వీకరిస్తున్నట్లయితే అది మన ఆరోగ్యానికి చాలా  కలిగిస్తూ, ఉత్సహాన్ని నింపుతుంది.

సర్వరోగనివారిణి(All-in-one) :Neem tree is a medicine and panacea in Telugu

 

“తినగ తినగ వేము తీయన” అని వేమన అన్నట్లుగానే..ఎన్నో ఔషధ గుణాలు కలిగి, మనుషుల ఆరోగ్యానికే కాదు. పంటల ఆరోగ్యంలోనూ వేప కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని కాలాల్లోను, అన్ని ప్రాంతాలలోను లభించే మహత్తరమైన దివ్యఔషధి వేప. పరిసర ప్రాంతం యొక్క కాలుష్యాన్ని నివారిస్తుంది. మన జీవన శైలిలో ఉపయోగించే సౌందర్య సాధానాలలోను ఉపయోగపడుతుంది. ఎరువులు, క్రిమిసంహారకాల పరిశ్రమలోనూ దీనికి డిమాండ్ ఎక్కువ. వేప ఉత్పత్తుల్ని జీవ ఎరువుగా, జీవ పురుగుమందుగా వాడుతున్నారు.

ఈ రోజుల్లో కలుషితమౌతున్న వాతావరణానికి ప్రతి ఇంటి దగ్గర అలాగే మార్గంకు ఇరువైపులా వేపచెట్లను పెంచి, అభివృద్ధి జరిగేలా ప్రతి ఒక్కరు తమ వంతు భాద్యత నిర్వహించాలి. 

వేప యొక్క దుష్ప్రభావాలు(Side Effects of Neem) :

వేపచెట్టులోని ప్రతి భాగం కూడా మనకు ఎన్నో ఉపయోగాలు, లాభాలను కలిగించిన కూడా ఈ రోజుల్లో మాత్రం, తమ వ్యక్తిగతంగా ఏ ఉత్పత్తిని వాడిన..వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. ఏ మేర వరకు హాని కలిగించదు అని నమ్ముతారో వాటిని సహజంగానే వినియోగించవచ్చు. అంతకు మించి అధిక స్థాయిలో వేప ఉత్పత్తులను వాడాలి అనుకుంటే, నిపుణుల సహాయంతో సేవించడం, వినియోగించడం అనేది చూసుకోవాలి. 

 

 

Add Comment