Garlic Uses in Telugu | వెల్లుల్లి యొక్క ప్రయోజనాలు

Uses of Garlic in Telugu Language:

భారతీయులు తమ ప్రతీ వంటకాలలో Garlic లేకుండా వంట చేసుకోరు అంత ప్రముఖమైనది. ఈ వెల్లుల్లి చాలా ఘాటుగా,చేదుగా ఉంటుంది. అయినప్పటికీ దీనిని వంటకాలలో వాడటం వలన చాలా రుచిని కలిగిస్తుంది.

దీనిలో అనేక రకాల ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. వెల్లుల్లికి ఇంత ఘాటు ఉండటానికి కారణం ఇందులో సల్పర్ అధిక మోతాదులో ఉంటుంది. దీనిలో సల్పర్ తో పాటుగా అల్లిసిన్ అనే ముఖ్యమైన సమ్మేళనం ఇందులో ఉంటుంది.

Uses of Garlic in Telugu Language

వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్,యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీఫంగల్ వంటి గుణాలు కలిగి ఉండటం వలన అనేక రకాల వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అలాగే చాలా రకాల వ్యాధులకు చికిత్సగా కూడా ఉపయోగించుకోవచ్చు.

Recommended Multivitamins Tablets

పోషక విలువలు :

ప్రతి 100 గ్రాముల వెల్లుల్లి లో ఉండే పోషక విలువలు క్రింద వివరించటం జరిగింది.

  •  ఫైబర్:2.1 గ్రాములు 
  • శక్తి:149 కేలరీలు 
  • కార్బోహైడ్రేట్స్:33.6
  • చెక్కర:1.00 గ్రాములు 
  • కొవ్వు పదార్థాలు:0.5 గ్రాములు 
  • ప్రోటీన్లు:6.39 గ్రాములు 
  • విటమిన్ బి :15%
  • విటమిన్ బి2:7%
  • విటమిన్ బి5:12
  • విటమిన్ బి9:1%
  • విటమిన్ సి:52%
  • ఇనుము :14%
  • సోడియం :1%
  • సెలీనియం :14.2 మిల్లీగ్రాములు 

 

1.చర్మ వ్యాధులు:

వెల్లుల్లి చర్మ వ్యాధులు ఉన్నవారు వాడటం వలన ఉపశమనం కలుగుతుంది. రోజూ తినే ఆహారంలో రెండు వెల్లుల్లి రెబ్బలను కట్ చేసి తినాలి . ఇలా ఆహారంలో తీసుకోవటం వలన వెల్లుల్లిలో ఉండే ఘాటు తెలియకుండా ఉంటుంది.

2.రక్త పోటు నివారణకు:

వెల్లుల్లి తో రక్త పోటుని తగ్గించుకోవచ్చు. వయస్సు తో సంబంధం లేకుండా అందరినీ వేధించే సమస్య రక్తపోటు. వెల్లుల్లి లో  అల్లిసిన్ అనే రసాయనం రక్తపోటుని తగ్గించటంలో సహాయ పడుతుంది. ఇందులో ఉండే రసం,సెలీనియం ఎర్ర రక్త కణాలను ఉత్తేజపరచటంలో సహాయపడుతుంది. ప్రతి రోజూ 3 నుండి 4 వెల్లుల్లి రెబ్బలను ఆలివ్ ఆయిల్ లో వేడి చేసి తీసుకోవటం వలన రక్తపోటుని అదుపులో పెట్టుకోవచ్చు.

3.బరువుని తగ్గిస్తుంది :

ప్రతీ రోజూ కొన్ని వెల్లులి రెబ్బలను తినటం వలన తొందరగా అధిక బరువుని తగ్గించుకోవచ్చు. వెల్లుల్లి మన జీర్ణాశయంలో ఉండే ఎంజైములను ఉతేజపరచటం వలన బరువు తగ్గటానికి అవకాశం ఉంటుంది. మనం తినే ఆహారం జీర్ణమైన తరువాత ఏర్పడే కొవ్వుని ప్రాసెస్ చేసి మన శరీరం నుండి బయటకి పంపించుటలో ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా మన శరీర జీర్ణక్రియ వ్యవస్థని మెరుగు పరుస్తుంది.

4.యాంటీ బాక్టీరియల్:

వెల్లుల్లి రసం బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ని తగ్గించటంలో ఎంతగానో సహాయపడుతుంది. రోజూ వెల్లుల్లిని తినటం వలన మనకు సాధారణంగా వచ్చే దగ్గు,జలుబు,గొంతులో ఇన్ఫెక్షన్ వంటి రోగాలు రాకుండా కాపాడుతుంది.

శ్వస సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి రోజు వెల్లుల్లి తినటం వలన మంచి పలితం ఉంటుంది.

5.మధుమేహం తగ్గించటం:

మధుమేహ వ్యాధితో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరం. కొన్ని వెల్లుల్లి రెబ్బలని తీసుకొని మెత్తగా గుజ్జులాగా చేసి,ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో వేసి త్రాగటం వలన మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

జాగ్రత్తలు :

వెల్లుల్లిలో సల్పర్ అధిక మోతాదులో ఉండటం వలన కడుపులో మంట వచ్చే అవకాశం ఉంటుంది. వెల్లుల్లి కొంతమందికి పడదు ఎలర్జీ,తలనొప్పి,ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. వెల్లుల్లి ప్రతి రోజు రెండు లేదా మూడు కంటే ఎక్కువగా తీసుకోరాదు.

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి. అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.