పెరుగులోని పోషకాలు మరియు ఉపయోగాలు(Nutrients and uses of yogurt)
అస్సలు ఆకలి అనిపించడం లేదా? పెరుగు కనిపించిందా . .ఆ . .వెంటనే, మన మనస్సు దాని కదే అన్నం వైపు మొగ్గు చూపడం మొదలవుతుంది . అంత మధురత్వాన్ని సంతరించుకునే ఆహార పదార్థాలలో ముఖ్యమైనది “పెరుగు” . ఏ ఇంట్లో ను, శుభకార్యాలలోను పెరుగు మరియు పెరుగుతో చేసిన మజ్జిగ తప్పకుండా ఉండి తీరాలి . అది ఎన్నో రోజుల నుండి ఆహార పదార్థాలలో ఒక భాగంగానే వస్తూ ఉంది అని మనందరికి తెలిసిందే కదా !
అయితే , కొంతమందికి పెరుగు ఇష్టం ఉండదు . ఇంకా కొంతమందికి పెరుగుతో ఒక ముద్ద తినకపోతే తృప్తి కలగదు . పెరుగు తింటే జలుబు వస్తుంది అని , బరువు పెరుగుతామేమో అని ఆలోచించేవాళ్ళు కొంతమంది ఉంటారు . కానీ , పెరుగు ద్వారా ఎన్నో ప్రయోజనాలు మనం అందుకోగలం అని మీకు తెలుసా ? పెరుగును ఒక పదార్థంగా మాత్రమే భావిస్తున్నారా ? ఏదిఏమైనా పెరుగు గురుంచి మేము వివరించబోయే సమాచారాన్ని పూర్తిగా అర్ధం చేసుకొని తృప్తిగా తినడానికి ప్రయత్నించండి .
మన భారతదేశంలో పెరుగు అనేది సంపూర్ణఆహారం . పెరుగును అనేక దేశాల్లో కూడా ఎంతో కాలంగా ఆహారంగా వాడుతున్నారు . మనిషికి ఆరోగ్యాన్ని, బలాన్ని అందివ్వటంలో పెరుగు కు మించిన వేరే ఆహార పదార్థం లేదు అంటారు . ఇలా . .మన శరీరానికి పెరుగు ఎన్నో ఉపయోగాలను అందివ్వగలదు . ఒకరకంగా పెరుగును అమృతంతో పోలుస్తారు . పెరుగు ఎలాంటి వాత వ్యాధులనైనా జయించగలిగే శక్తి కలిగి ఉంటుంది . ఇందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు , ఖనిజాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి . పాలలో ఉండే ప్రోటీన్స్ కంటే పెరుగులో ఉండే ప్రోటీన్స్ మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది .
మనం తీసుకున్న పెరుగు 1 గంట తర్వాత 91% జీర్ణమయితే, అదే సమయంలో పాలు 32% మాత్రమే జీర్ణం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు . జీర్ణవ్యవస్థ మందకొడిగా ఉండేవాళ్ళకు పెరుగు అనేది ఒక అమృతంలాగా పని చేస్తుంది . ముఖ్యంగా పిల్లలు మరియు పెద్దవారు పెరుగు తీసుకున్నపుడు వారి జీర్ణవ్యవస్థకు అనుసరించి పని చేయగలదు అని చెప్తున్నారు.
పెరుగులో ఉండే పోషక విలువలు పాలలో ఉండే పోషక విలువలతో సమానంగా ఉన్నపటికీ, పెరుగులో ఉండే ప్రత్యేక గుణం మనలో ఆరోగ్యాన్ని పెంచే పదార్థాలలో ఉన్నతస్థానంలో ఉంచుతుంది . పాలు పెరుగుగా మారడానికి జరిగే ప్రక్రియలో ఇందులోని బాక్టీరియా పాలలో ఉండే ప్రోటీన్ ను తేలికగా అరిగేలా చేస్తుంది . ఈ రకమైన మార్పు వలన పెరుగు త్వరగా జీర్ణం అవుతుంది . అంతేకాకుండా, జీర్ణకోశంలో పెరిగే హానికర బాక్టీరియాలను పెరగనివ్వకుండా చేస్తుంది . ఇంకా మనకు మంచి చేసే బాక్టీరియాను పెరిగేలా కూడా చేస్తుంది . ఈ బాక్టీరియా పెరుగులో ఉండే మినరల్స్ త్వరగా రక్తంలో కలిసేలా చేయడం, బి కాంప్లెక్స్ విటమిన్ ను తయారుచేయడం లాంటి పనులు చేస్తుంది .
పెరుగు తయారీ విధానం(Yogurt preparation method) :
పాలను వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో మజ్జిగ చుక్కలను వేస్తే అనగా సుమారు 1 లీటర్ పాలలో 1 చెంచా మజ్జిగను కలిపితే ..కొన్ని గంటల తర్వాత పాలు గడ్డగా తయారు అవుతాయి . దీనినే మనం “పెరుగు” అంటాము . పాల వెచ్చదనాన్ని బట్టి, అందులో వేసే మజ్జిగ పరిమాణాన్ని బట్టి “పెరుగు గడ్డ కట్టుకునే సమయం” , “పెరుగు రుచి” ఆధారపడి ఉంటుంది . పాలలో వేసే తోడు తక్కువైతే పెరుగు తియ్యగా ఉంటుంది . తోడు ఎక్కువైతే పెరుగు పుల్లగా తయారుఅవుతుంది.
పెరుగుని తీసుకునే విధానం(How to consume yogurt) :
- మీగడ తీసిన పెరుగు గాని , పాలపై వెన్న తీసి తయారుచేసిన పెరుగును గాని తింటే అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంటాయి .
- పూర్తిగా తోడుకొని పెరుగును అస్సలు తినకూడదు .
- ప్రతి రోజు పెరుగు తినాలి అనే నియమం పెట్టుకోకూడదు .
- రాత్రి సమయంలో పెరుగును తినకూడదు .
- పెరుగును వేడి చేసి తినకూడదు .
- ఎంత మంచిదైనా వేసవికాలం పెరుగును ఎక్కువగా తీసుకోవద్దు . చల్లని వాతావరణంలో పెరుగు తినడం మంచిది కాదు .
పెరుగును ఎవరు తీసుకోకూడదు(Who should not take curd) :
పెరుగును సాధారణంగా రిఫ్రిజిరేటర్లో పెట్టడం అలవాటుగా మారింది . కానీ , దానిలో 2 రోజుల కంటే ఎక్కువగా పెట్టుకుంటూ మనం తీసుకోకూడదు . దీని వల్ల కొన్ని సార్లు కడుపులో హానికర సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం లేకపోలేదు . మీకు ఏమైనా అలెర్జీ ఉన్న తీసుకోకూడదు . అందులోను, పాల ఉత్పత్తులు అలర్జీ అయితే . .పెరుగు తినడం మానేయాలి . పుల్లని పండ్లు తో సలాడ్ లాగ తీసుకోవడం కూడా అస్సలు మంచిది కాదు . కిడ్నీ సమస్యలు ఉన్నవారు , చెడు కొలెస్ట్రాల్ తో బాధపడే వారు పెరుగును తక్కువ పరిమాణంలో తీసుకోవాలి . పెరుగులో ఉప్పు , పాలు , చేప , నెయ్యి , తేనె కలిపి కూడా తినకూడదని నిపుణులు చెపుతున్నారు .
పెరుగులోని పోషక పదార్థాలు(Nutrients in yogurt) :
పోషకపదార్థం విలువలు
- నీటిశాతం 89.1%
- ప్రోటీన్ 3.1%
- క్రొవ్వులు 4%
- మినరల్స్ 0.8%
- కార్బోహైడ్రేట్స్ 3%
- క్యాల్షియం 149 మి . గ్రా
- ఫాస్పరస్ 93 మి . గ్రా
- ఇనుము 0.2 మి . గ్రా
- విటమిన్ -ఎ 102 ఐ.యు
- విటమిన్ -సి 1 మి . గ్రా
ఆయుర్వేదంలో పెరుగు(Yogurt in Ayurveda) :
అన్ని రకాల జ్వరాల్లో కూడా పెరుగును నిరభ్యంతరంగా వాడుకోవచ్చని మరియు జలుబుగా ఉన్నప్పుడు పెరుగు చాల ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేదంలో సూచించబడుతుంది . అలాగే , మూత్రసంబంధమైన రోగాల్లోను , జిగురు విరేచనాలు అయ్యేవారికి గాని పెరుగు చాలా ఉత్తమంగా పని చేస్తుంది అంటున్నారు . పెరుగులో పెసరపప్పు, శొంఠి , పంచదార , ఉసిరికాయ పొడి చేర్చి తింటే అధికమైన ఉపయోగాలు పొందవచ్చని ఆయుర్వేదం వివరిస్తుంది .
- ఆయుర్వేద పంచకర్మ చికిత్సలో “ధారా ” అనే ప్రక్రియలో పెరుగుతో చేసిన మజ్జిగను తలపై ధారలా పడేలా చేస్తారు .
సౌందర్యానికి పెరుగు ఉపయోగం(Uses of yogurt for beauty) :
- పెరుగు మన శరీర సౌందర్యానికి , చర్మం నిగారింపును పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది .
- సూర్యరశ్మి వేడికి చర్మం పాడవకుండా చేస్తుంది .
- చర్మానికి సరఫరా అయ్యే నరాలకు బలాన్ని ఇస్తుంది .
- పెరుగులో ఉండే బాక్టీరియా మన చర్మ పోషణకు చాల ఉపయోగం .
- పెరుగును ప్రతి రోజు ముఖానికి రాసి , 15 నిమిషాల తర్వాత కడిగేస్తుండాలి . అప్పుడు ముఖం ఎంతో అందంగా , మృదువుగా , కాంతివంతంగా మారుతుంది
- పెరుగులో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పై పూతగా పూసి . .మసాజ్ చేసి కడిగేసేయాలి . దీంతో , చర్మంపై మలినాలు తొలిగిపోతాయి . చర్మంపై తేమ శాతం పెరుగుతుంది . ముఖం నిగారింపు రెట్టింపవుతుంది .
- ముఖంపై మొటిమలు ఉన్నవారికి పెరుగులో కొంచెం శనగపిండి కలిపి ముఖానికి అప్లై చేస్తే, ముఖంపై ఉండే బాక్టీరియాను తొలగించి.. మొటిమలు తగ్గుముఖం పడేలా చేస్తుంది . .
శిరోజాలకు పెరుగు ఉపయోగం(Use of yogurt for headaches) :
- తలస్నానానికి ముందుగా పెరుగును తలకు పట్టించి , మర్దన చేయడం వల్ల మన శిరోజాలకు మంచి కండీషనర్ గా పని చేస్తుంది .
- చుండ్రు సమస్యతో బాధపడే వారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడిని కలిపి తలకు పట్టించి, 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు .
పెరుగు నిత్యయవ్వనం(Yogurt is eternal youth) :
మనం రోజు తినే ఆహారపదార్థాలలో ఉండే రకరకాల రసాయనాలు, అనేక విషపదార్థాలు..మన శరీరం యొక్క వ్యాధినిరోధక శక్తిని చిన్నాభిన్నం చేస్తాయి . తద్వారా మన శరీరంలోని కణాలు త్వరగా క్షీణించి, మనం వయస్సు పెరిగిన వారిగా కన్పిస్తుంటాము . అలాంటి సమయంలో పెరుగు ఒక సంజీవినిలా పని చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పెరుగును నిత్యం తీసుకోవడం ద్వారా మనలో కణాల క్షీణత కన్పించదు . ఇంకా రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు వయస్సు కన్పించకుండా నిత్య యవ్వనంగా ఉండే అవకాశాన్ని కల్పిస్తుంది అని పరిశోధనల్లో నిరూపణ జరిగింది అని నిపుణులు తెలియజేస్తున్నారు .
వివిధ రకాల అనారోగ్యసమస్యలకు పెరుగు ఉపయోగం(Uses of yogurt for various health problems) :
- చర్మవ్యాధులు(Skin diseases) : చర్మవ్యాధులు ఉన్న వారికి పెరుగు, మజ్జిగ అనేది అద్భుతమైన ఉపయోగం అని చెప్పొచ్చు . సోరియాసిస్ , ఎగ్జిమా వంటి చర్మవ్యాధులకు పెరుగు గాని, మజ్జిగను గాని చర్మానికి పై పూతగా వాడుకుంటే మంచి ఫలితాలు కన్పిస్తాయి . పెరుగులో పలుచని బ్యాండేజ్ బట్ట ను ముంచి చర్మవ్యాధి ఉన్న ప్రాంతంలో కొద్దిసేపు ఉంచితే తొందరలోనే ఆ ప్రాంతం ఆరోగ్యవంతమైన చర్మంగా రూపొందుతుంది .
- గుండెకు పెరుగు ఉపయోగం(Benefits of yogurt for the heart) : పెరుగులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది . కొవ్వు తక్కువగా ఉంటుంది . పెరుగులో ఉండే ప్రోటీన్స్ అతిగా తినడాన్ని నిరోధిస్తుంది . తద్వారా, మన శరీర బరువు కూడా అదుపులో ఉండగలదు . ఇందులోని కొవ్వు కూడా గుండె ఆరోగ్యానికి మంచిది . మరియు పెరుగులో క్యాల్షియం తలనొప్పిని తగ్గిస్తాయి .
- జీర్ణవ్యవస్థకు పెరుగు ఉపయోగం(Benefits of yogurt for the digestive system) : పెరుగు అందించే ఉపయోగాలలో ముఖ్యమైనది మన జీర్ణవ్యవస్థను పటిష్టం చేయడం . పెరుగు జీర్ణాశయంలోని గ్యాస్ ను కూడా తగ్గిస్తుంది . జీర్ణశక్తిని పెంచుతుంది . అలాగే , పెప్సిన్ అనే ఎంజైమ్ విడుదల అయ్యేలా కూడా చేస్తుంది కడుపులో ఇన్ఫెక్షన్ ని కలిగించే రకరకాల సూక్ష్మజీవులు మన కడుపులో పెరుగు ఉన్నప్పుడు వాటి ప్రభావం చూపలేవు . కడుపులో అల్సర్ , గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ , హైపర్ ఎసిడిటీ తో బాధపడే వారికి పెరుగు అద్భుతంగా పని చేస్తుంది . దీనికి కారణం వచ్చేసి , పెరుగు పుల్లగా ఉన్న అది క్షారగుణం కలిగి ఉంటుంది . కాబట్టి , జీర్ణం అయ్యేటప్పుడు కార్బన్ డైయాక్సిడ్ నీరుగా మారుతుంది . తద్వారా , హైపర్ ఎసిడిటీ , అల్సర్ లాంటివి తగ్గుతాయి . ప్రతీరోజును పెరుగు తీసుకుంటూ ఉంటే ఎపండిసైటిస్ రాదు . మరియు ఎమీబియాసిస్ చేతితో తీసివేసినట్లుగా పోతుంది. పెరుగులో కాస్త ఉప్పు కలిపి తింటే అజీర్తి సమస్యలు తగ్గుతాయి . పెరుగులో నల్ల మిరియాల పొడిని కలిపి తీసుకున్న ఆహరం మంచిగా జీర్ణమవుతుంది .
- డిప్రెషన్(Depression) : డిప్రెషన్ లో ఉన్న వారికి పెరుగును ఆహారంలో భాగం చేయాలి . పెరుగు అందించే ఎన్నో రకాల ఉపయోగాలు వారి యొక్క మానసిక సమస్యలు , ఒత్తిడి నుండి బయట పడగలిగేలాగా వాళ్ళ మానసిక స్థితిని మెరుగుపరుస్తూ. .శక్తివంతులుగా తయారుచేయగలదు . మెదడు చురుకుగా పని చేసేలా సహాయపడగలదు .
- నిద్రపట్టని వారికి(For those who can’t sleep) : నిద్రపట్టని వారికి , ఫిట్స్ తో బాధపడే వారికి పెరుగు ఒక వరం అనే చెప్తారు . వీరందరూ పెరుగును తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు . నీరు కలపకుండా గట్టి పెరుగును తిని చుడండి . గాఢమైన నిద్రలోకి జారుకుంటారు . తద్వారా , మానసిక ఆందోళనల నుండి బయట పడి ప్రశాంతంగా ఉండేలా పెరుగు అందించే పోషకాలు సహాయపడుతాయి .
- కామెర్లు వ్యాధి(Jaundice) : హెపటైటిస్ వచ్చిన వారికి రక్తంలో అమ్మోనియా శాతం పెరిగి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది . పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ అమ్మోనియా నుండి వచ్చే చెడు లక్షణాలను నిరోధిస్తుంది . అందుకే , కామెర్లు వచ్చిన వారు పెరుగును తీసుకుంటూ ఉండాలి. ఇది వారికి ఒక దివ్యౌషధంలా పని చేస్తుంది . ఈ వ్యాధి ఉన్న వారికి పెరుగు , మజ్జిగను అధిక మొత్తంలో ఆహారంగా ఇస్తూ దాంట్లో కొద్దిగా తేనె కలిపి కూడా ఇస్తే మరింత త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది . .
- ఎముకల బలానికి పెరుగు ఉపయోగం(Use of yogurt for bone strength) : పెరుగులో ఉండే క్యాల్షియం మన శరీర ఎముకలకు , దంతాలకు చాలా మంచి ఫలితాన్ని ఇవ్వగలదు . మరియు ప్రోటీన్స్ , మినరల్స్ , విటమిన్లు పెరుగులో ఉండడం వల్ల ఇమ్మ్యూనిటి పెంచి, మన శరీరం బలంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది .
- మలబద్దకం(Constipation) : మలబద్దకం సమస్య ఉన్న వారు పెరుగును తీసుకోవడం వల్ల ఫలితాన్ని చూస్తారు .
- విరేచనాలు(Diarrhea) : అధిక విరేచనాలతో బాధపడే వారికి కూడా పెరుగు చాలా మంచి ఉపయోగకరమే . ఇదే పెరుగు కలిగి ఉండే మహత్యం . వేడి వేడి అన్నంలో పెరుగు కలుపుకొని తింటే విరేచనాల నుండి ఉపశమనం కలుగుతుంది . జిగట విరేచనాలతో భాధపడేవారు పెరుగులో కొంచెం మెంతులు కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది .
- సరైన PH లెవెల్ కోసం(For the right PH level) : రోజు పెరుగును తీసుకోవడం వల్ల ఆడవాళ్ళలో యోని ఆరోగ్యంగా ఉంటుందంట . యోని ఆరోగ్యానికి దోహదపడే పిఏచ్ స్థాయి స్థిరత్వం పెరుగు వల్లనే కలుగుతుంది . కాబట్టి , యోని సమస్యలకు ప్రభావంతమైన ఫలితాలు రాబట్టడానికి పెరుగు తప్పకుండా తీసుకోవడం చాల మంచిది .
- పెరుగులో ఎండుద్రాక్ష కలిపి తీసుకుంటే . .మన శరీరానికి విటమిన్ ఎ , సి , ఇ, బి 2,బి 12 తో పాటు కెరటోనాయిడ్స్ అందుతాయి . మరియు పురుషుల్లో వీర్యకణాల నాణ్యత మెరుగు అవుతుందని ఓ పరిశోధనలో పేర్కొన్నారు .
- వాతం , కఫాలను తగ్గించే గుణాలు పురుగులో పుష్కాలంగా ఉంటాయి .
- పుల్లటి పెరుగులో క్యాల్షియం , విటమిన్ డి ఉండడం వల్ల, ఎముకలు , దంతాల మంచి ఫలితాన్ని ఇస్తుంది . స్త్రీలలో క్యాల్షియం లోపం ఎక్కువగా కన్పిస్తుంది కాబట్టి , పుల్లటి పెరుగు తినడం చాల అవసరం అవుతుంది .
- పెరుగులో కాస్త పసుపు , అల్లం కలిపి తింటే ఫోలిక్ యాసిడ్ శరీరంలోకి చేరుతుంది .
- పెరుగులో చెక్కరకు బదులు తేనె కలిపి తింటే అల్సర్ తగ్గుతుంది . మరియు పెరుగు, తేనె యాంటిబయాటిక్ గా పని చేస్తుంది. కాబట్టి, మన శరీరంలో ఇన్ఫెక్షన్స్ ఉంటే . .వాటిని తగ్గించగలదు .
- పెరుగులో కొద్దిగా చక్కర కలిపి తీసుకుంటే తక్షణ శక్తిని అందిస్తుంది . ఇంకా మూత్రాశయ సమస్యల నుండి బయటపడేస్తుంది . కానీ , అతిగా పెరుగు చక్కరను తీసుకోకూడదు .
ముగింపు(Conclusion) :
పెరుగు అందించే ఉపయోగాలు మన ఆరోగ్యానికి ఎంతటి మేలును కలిగిస్తున్నాయి అనేది తెలుసుకొని ఉన్నాము . ముఖ్యంగా, గేదె పాలు లేదా ఆవు పాలతో తయారు చేసిన పెరుగు అనే తేడాను చూడాల్సిన అవసరం లేదు . ఎవరికీ ఏది ఇష్టంగా అనిపిస్తుంటే అది తినడం అలవాటు చేసుకుంటారు . పెరుగు బాహ్యసౌందర్యానికి అనగా చర్మం , శిరోజాలకు మంచి పోషణను కలిగించే ఔషధంగా ఉపయోగపడుతుంది మరియు ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను అందించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది అనేది తెలుసుకున్నాము .
ఏ కాలంలో పెరుగును తీసుకోవచ్చు అంటే . .వేసవి కాలంలో తీసుకోవచ్చు . వర్షాకాలంలో, శీతాకాలంలో మీ ఆరోగ్యాన్ని బట్టి తీసుకోవచ్చు . అయితే , పెరుగును ఇష్టపడని వారు కూడా ఉంటారు కదా ! కాబట్టి , వారు పెరుగు రుచిని చూసి , పెరుగు యొక్క ఫలితాలు మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ఉత్తమం . పూర్తిగా ఇష్టం లేకపోతే వాటి పోషకాలు మీ శరీరానికి అందివ్వడానికి అయినా కొంచెంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి . అది కూడా వారానికి 3 లేదా 4 సార్లు తినడానికి ప్రయత్నించండి .
ఇంకా . .పెరుగును చాలా ఇష్టపడే వారు ఉంటారు . కాబట్టి, పెరుగులోని పోషకాలు వీరికి పుష్కలంగా అందుతాయి అనేది మనం నమ్ముతాము . కానీ , సమస్య ఏమిటి అంటే . .పెరుగును తీసుకునే విధానంను వివరించాము . ఆ ప్రకారంగా తినడం మంచి ఫలితాలను ఇస్తాయి . అందులోను ఎంత మోతాదు తీసుకోవాలి అనేది తెలిసి ఉండాలి. కాబట్టి , వైద్యుడిని అడిగి మీ ఆరోగ్య సమస్యలు తెలుసుకొని ఏ మోతాదులో పెరుగును తినాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం అవుతుంది . తద్వారా, పెరుగు వల్ల మీ ఆరోగ్యం హానికరం అవ్వడానికి అవకాశం ఉండదు .
పెరుగు ఇష్టం అని తినడం అలవాటు ఉన్న వారిలో కూడా.. కొంతమందికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అని కూడా పైన వివరించి ఉన్నాము . బహుశా పెరుగు వల్ల ఆ సమస్యలు వస్తున్నాయి అని అవగాహన కూడా లేకపోవడం ఒక కారణం. అందుకే, పెరుగు గురించి అన్ని వివరాలు అందరికి తెలియజేయాలి అనేది మా ప్రయత్నం .
అయితే , పెరుగు వల్ల జలుబు చేస్తుందా ? అలెర్జీ సమస్య భాదపెడుతుందా ? ఇంకా మీ శరీరంలో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా ? అనేది అర్ధం చేసుకోగలిగే అవగాహనను పెంచుకోవాలి . పెరుగు తినడం వల్ల అనగా..రోజు తగిన మోతాదులో తినడం లేదా మీ ఇష్టం వచ్చినంత తినడం వల్ల మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది. మరియు తినకపోవడం వల్ల మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అని పూర్తిగా అర్ధం చేసుకోవాలి. అప్పుడే మీకు ఒక అవగాహన కలిగి పెరుగు ఎంత ఇష్టం అయినా ఏ మోతాదులో తీసుకుంటే మీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అనేది తెలుస్తుంది . ఇంకా ఏ కాలంలో ఏ మోతాదులో తినడం మీ ఆరోగ్యానికి సరిపడుతుంది అనేది మీకే తెలియొచ్చు కూడా..దానికి గాను మీ ఆరోగ్యంపై మీరు దృష్టి పెట్టి అవగాహన చేసుకుంటూ ఉండాలి . లేదా మీకు ఏది అర్ధం కావడం లేదు అనుకుంటే , వైద్యుడి సలహా తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి .
..సర్వేజనా సుఖినో భవంతు . ..