సౌందర్యం మరియు ఆరోగ్యాన్ని అందించే కలబంద ప్రయోజనాలు, దుష్ప్రభావాలు|Aloe vera benefits, side effects for beauty and health in Telugu

సౌందర్యం మరియు ఆరోగ్యాన్ని అందివ్వగలిగే కలబంద ప్రయోజనాలు(Aloe vera benefits for beauty and health) 

“కలబంద” మొక్క అనేది ఇంటి ముందు అలంకారానికి ఉపయోగించేది మాత్రమే కాదు. ఇది ఒక రకమైన ఔషదపు మొక్క..ఇంకా చెప్పాలంటే అద్భుతమైన మూలిక అని కూడా అంటారు. ఈ కలబంద మొక్క.. చూడడానికి కొంచెం దట్టంగా ముళ్ళు స్వభావం కలిగి ఉంటుంది. మరియు జిగురు లాంటి గుజ్జు పదార్థంతో నిండి ఉంటుంది.. ఈ గుజ్జు 96% నీటితోనే తయారవుతుంది. శతాబ్దాలుగా కలబందను సంప్రదాయ ఔషధ మొక్కగా వాడుతున్నారు.

ఎన్నో ఆయుర్వేద గుణాలను కలిగి ఉండే ఈ కలబంద మొక్కలను ఇంట్లో  పెంచుకోవడం వల్ల  అందంతో పాటు ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతాయి. ఈ మొక్కలను చాల సులభతరంగా అన్ని రకాలైన భూముల్లోనూ లేదా కుండీల్లోనూ పెంచుకోవచ్చు. ఈ మొక్కల యొక్క నిర్వహణ కూడా చాలా సులభమమే అవుతుంది. ఇది తక్కువ నీటితోనే పెరగగలదు. మరియు ఈ మొక్క పెరిగేందుకు ఎక్కువ పోషకాలు కూడా అవసరం లేదు. కలబంద మొక్క పొడవు తక్కువగా ఉంటుంది కాబట్టి, గాలిలో ఉన్న తేమను పీల్చుకొని జీవించగలిగే గుణం ఉంటుంది.Aloe vera benefits, side effects for beauty and health in Telugu

కలబందలో విటమిన్ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి6, బి12, ఫోలిక్ యాసిడ్ మరియు 18 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇంకా దీనిలో క్యాల్షియం, క్రోమియం, సెలెనియం, మెగ్నీషియం, జింక్, సోడియం, ఇనుము, పొటాషియం, కాపర్, మాంగనీస్ వంటి 20 రకాల మినరల్స్ ఉంటాయి. మరియు కలబందలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ లక్షణాలు చాలా ఉన్నాయి. ఇన్ని గుణాలు కలిగిన కలబందను ఉదయం పూట ఖాళీ కడుపుతోనే జ్యూస్ రూపంలో తీసుకుంటే చాలు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెపుతున్నారు.Aloe vera benefits, side effects for beauty and health in Telugu

కలబందను ఉపయోగించడం వల్ల మన చర్మం మరియు జుట్టును తేమగా ఉంచుతూ..చక్కటి అందంతో పాటుగా మెరుపును అందిస్తుంది. కలబంద లోని గుజ్జును జ్యూస్ లా చేసి తాగుతూ ఉంటారు. దీని వలన పలు రకాలైన అనారోగ్య సమస్యలను నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. కాలిన గాయాలకు, వాపులకు కలబంద గుజ్జును రాసుకోవాలి. అలాగే, శరీరం మొత్తానికి ఈ గుజ్జుతో మసాజ్ లా చేసి స్నానం చేస్తే కనుక బ్యాక్టీరియా, మృతకణాలు సులువుగా తొలిగిపోతాయి. ఈ కలబందను మార్కెట్ లో లభించే అనేక రకాలైన సౌందర్య ఉత్పత్తులలో వాడుతున్నారు.  ఈ విధంగా కలబంద మనకు  ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తూ ఉంది. వాటి వివరాలు ఏంటో తెలుసుకుందాము.

కలబంద జ్యూస్ తయారీ విధానం(Preparation of Aloe Vera Juice) :Aloe vera benefits, side effects for beauty and health in Telugu

  • 1 గ్లాస్ నీళ్ళలో  కలబంద గుజ్జు,
  • కొంచెం నిమ్మరసం,
  • తేనె వేసుకోవాలి.
  • ఈ మూడింటిని బాగా కలిసేలా కలిపాలి. ఈ విధంగా చక్కని జ్యూస్ లా తయారు అవుతుంది.

చర్మం కోసం కలబంద(Aloe Vera for Skin) :

అన్ని రకాల చర్మతత్వం వారు కూడా కలబంద గుజ్జును ముఖంపై అప్లై చేసి మసాజ్ చేసుకొని, కొద్దిసేపు తర్వాత కడిగేసుకుంటే చాలు మన చర్మానికి ఎంతో తేమను అందించడంలో సహాయపడుతూ..ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే, ముఖ్యంగా పొడిబారిన చర్మం కలిగిన వారు కలబంద జెల్ ను ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలను కలిగి ఉంటాము. జెల్ వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి ఉత్పన్నం కావు. మరియు ఎలాంటి దద్దుర్లు, రాషెష్ ఇంకా కట్స్ లాంటివి ఏమి ఉన్న సరే ఈ కలబంద జెల్ అనేది ఉపశమనాన్ని కలిగించి, సమస్య నుండి బయట పడేలా చేస్తుంది. కాబట్టి, కలబంద జెల్ ను ముఖంపై అప్లై చేయడానికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. స్వచ్ఛమైన కలబంద మొక్క నుండి తీసిన గుజ్జును ఉపయోగించి మంచి లాభాలను పొందండి. మరియు  చర్మాన్ని మృదువుగా, తాజాగా మరియు మెరుపును అందించడంలో కేశాలను బలంగా మార్చడంలో, సిల్కిగా ఉంచడంలో కలబంద జ్యూస్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది.   

 మొటిమల కోసం కలబంద(Aloe Vera for Acne) :

మన చర్మంపై ఆరోగ్యకరమైన చర్మ కణాలు మరణించడాన్ని “ఏక్ఫ్లోటింగ్” అంటారు. ఈ ఆరోగ్యకర కణాలు మరణించడం వలనే మొటిమలు ఏర్పడుతాయి. కలబంద జెల్ తరచూ ఉపయోగించడం వల్ల ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై ఉండే “డెడ్ స్కిన్ సెల్స్” చనిపోయే సమస్యను తగ్గిస్తుంది. ఈ జెల్ చర్మానికి ఎటువంటి హాని కలగనివ్వకుండా బాక్టీరియాతో సమర్థవంతంగా పోరాడుతూ ఒక “యాంటీ సెప్టిక్” లా పని చేస్తుంది. తద్వారా, ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది..

జుట్టు కోసం కలబంద(Aloe Vera For Hair) :

కలబంద జెల్ అనేది జుట్టు సమస్యలకు మంచి పరిష్కార మార్గం అని చెప్పాలి. జుట్టుకు ఈ జెల్ ఒక మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. ఈ కలబందలో ఉండే “ప్రోటో యోలైటిక్”  అనే ఎంజైములు మన తలపై ఉన్న “డెడ్ స్కిన్ సెల్స్” ను రిపేర్ చేయడంలో సహాయపడుతాయి. కాబట్టి, మీ జుట్టు రఫ్ గాని, డ్రై గా మారినపుడు ఈ కలబంద జెల్ ను జుట్టుకు పట్టించి మసాజ్ చేసి, 30 నిమిషాల వరకు ఆగి, జుట్టును శుభ్రం చేసుకోవాలి. తర్వాత మన జుట్టుకు కలిగే అనుభూతి చాల స్మూత్ గా ఉంటుంది.  ఈ విదంగా జుట్టుకు రాసుకునే ముందు తేనె, ఆలివ్ ఆయిల్, పెరుగు, కొబ్బరినూనె లాంటివి కలబంద గుజ్జులో కలిపి జుట్టు కు అప్లై చేసి, మసాజ్ చేసుకోవచ్చు. ఇలా మన జుట్టు కుదుళ్ళ నుండి రిపేర్ చేయబడుతుంది.Aloe vera benefits, side effects for beauty and health in Telugu

షాంపూ కోసం కలబంద(Aloe Vera for Shampoo) :

కలబంద జెల్ ను షాంపూ రూపంలో కూడా వాడుకోవచ్చు. ఇలా వాడడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చని చెబుతారు. జీవం లేని జుట్టుగా రఫ్ గా, డ్రై గా కనిపిస్తుంటే..కలబంద జెల్ తో జుట్టుకు షాంపూ చేస్తే కనుక తిరిగి శిరోజాలకు జీవం ఉట్టిపడేలా చేస్తుంది అనడంలో ఆశ్చర్యం అవసరం లేదు. ఎందుకంటే, కలబంద జెల్ ను ఉపయోగిస్తే వెంటనే ఫలితాన్ని చూడగలుగుతారు. అయితే, పూర్తిగా షాంపూ రూపంలో కలబంద జెల్ ను ఉపయోగించడమే కాకుండా, మీరు ఏదైతే షాంపూ ను ఉపయోగిస్తారో దానిలో 1 టేబుల్ స్పూన్ కలబంద జెల్ ను కలిపి జుట్టుకు పట్టించండి. అలాగే, కొబ్బరి నీళ్లను కూడా జత చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మీ జుట్టు బాగా శుభ్రపడుతుంది.

ఇంకా కలబంద జెల్ లో కొబ్బరి నూనె ను కలిపి జుట్టుకు పట్టించి, శుభ్రం చేయడం వల్ల కూడా మంచి కండీషనర్ గా కూడా పని చేస్తుంది.

బరువు తగ్గడానికి కలబంద(Aloe vera for weight loss) :

కలబందలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల , ఇవి శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపి, శరీరాన్ని శుభ్రం చేస్తాయి. శరీరంలో టాక్సిన్స్ అనేవి తొలిగితే మన యొక్క జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. మరియు పోషకాలను గ్రహిస్తుంది. ఈ విధంగా ఉదయం ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తీసుకుంటే త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

డయాబెటిస్ నియంత్రణ కోసం కలబంద(Aloe Vera for diabetes control) :

కలబందలో ఉండే లెక్టిన్లు, ఆంత్రాక్వినోన్స్ అనేవి సహజంగానే రక్తంలో గ్లూకోస్ స్థాయిలను తగ్గించే యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ విధంగా రక్తంలో చక్కర శాతాన్ని తగ్గించడమే కాకుండా మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. ప్రీడయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారి రక్తంలో చక్కర నిల్వలు నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని కొన్ని అధ్యయనాలు చెపుతున్నాయి. అయితే, కలబంద రసాన్ని సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ మెరుగుపడుతాయి అని పరిశోధకులు గుర్తించారు. కానీ, కలబంద జ్యూస్ ని డయాబెటిస్ ఉన్న వారు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాల ఉత్తమం.

మలబద్దకం నివారణ కోసం కలబంద(Aloe vera for constipation) :

కలబందలో విటమిన్స్, మినరల్స్, యాసిడ్స్ అనేవి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తీసుకోవడం చేత మన శరీరంలోని పేగు వ్యవస్థ సక్రమంగా పని చేసేలా సహకరిస్తుంది. మలాన్ని మృదువుగా చేయగలదు. తద్వారా మలబద్దకం నివారణ అనేది జరిగి జీర్ణవ్యవస్థ కు ఆటంకం కలగకుండా మెరుగ్గా పని చేస్తూ ఉంటుంది.

జీర్ణవ్యవస్థ సమస్యలు(Digestive problems) :

ప్రతిరోజూ కొద్దీ మొత్తంలో కలబంద జ్యూస్ తాగుతున్నట్లయితే.. గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం మరియు గ్యాస్ట్రోఏసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీస్(GERD) లాంటి సమస్యల నుండి ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెపుతున్నాయి. తద్వారా జీర్ణవ్యవస్థ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

రోగనిరోధక శక్తి మెరుగుదలకు కలబంద(Aloe Vera for Immunity Enhancement) :

విటమిన్ సి అనేది మానవ శరీరం ఆరోగ్యంగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడంలో మరియు ఇన్ఫెక్షన్ తో పోరాడడానికి చాలా బాగా సహాయపడుతుంది. అయితే, కలబంద విటమిన్ సి కలిగి ఉంటుంది. కాబట్టి, కలబంద జ్యూస్ తీసుకోవడం అనేది మనకు ఒక శక్తి అందించినట్లు అవుతుంది.

కాలిన గాయాలు కోసం కలబంద(Aloe vera for burns) :

మన శరీరంపై ఏ భాగంలో అయినా సరే చర్మం తెగినా, మంట కలిగిన, కాలినా, వాపు వచ్చిన, కందినా, పొడిబారిన ఇలా ఏ సమస్య వచ్చిన సరే ఆ ప్రదేశంలో కలబంద గుజ్జును రాసేయాలి. కలబంద గుజ్జు అనేది అక్కడి చర్మ కణాలకు శక్తిని అందిస్తూ..ఆ ప్రదేశం గట్టిగా ఏర్పడేలా చేస్తుంది. కాబట్టి, ఫలితం అనేది మనకు క్షణాల్లోనే కన్పిస్తూ మంచి ఉపశమనాన్ని అందజేస్తుంది.

క్యాన్సర్ నివారణ(Prevention of cancer) :

కలబంద మొక్క అనేది క్యాన్సర్ ను సైతం నివారించగలిగేంతటి శక్తి కలిగి ఉండవచ్చని నిపుణుల అభిప్రాయం .  కలబంద జెల్ మరియు కలబంద సారంలో సోమం లేదా సేలీనియం, జింక్ ఖనిజాలు , విటమిన్లు ,  రసాయనిక ఆమ్లద్రవాలు వంటి అనామలీకరణ పదార్థాలుండడం చేత శరీరంలో గడ్డలు కట్టడాన్ని దోహదం చేసే కణాల పెరుగుదలను వేగంగా పెరగకుండా అడ్డుకుంటాయి . కణతలు లేక గడ్డలు ఏర్పడటాన్ని అరికట్టే తత్వం కలబందలో ఏ మాత్రం ఉందో అనే విషయం పరిశోధకుల బృందం పర్యవేక్షిస్తుంది . క్యాన్సర్ వ్యాధి నివారణకు అందరికి అందుబాటులోకి వచ్చే విధంగా “మందు”ను కనుక్కోవడమే వారి ద్యేయంగా కృషి చేస్తున్నారు అని అనుభవజ్ఞుల ద్వారా తెలిసిన సమాచారం .Aloe vera benefits, side effects for beauty and health in Telugu

కలబంద దుష్ప్రభావాలు(Side Effects of Aloe Vera) :
  • 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల చిన్న పిల్లలకు కలబంద చిట్కాలను శరీరంలోనికి సేవించడానికి అనుమతించకూడదు .
  • పెద్ద వయస్సు వారు ఎవరైనా, కలబందలో ఉండే రబ్బరు లాంటి గుజ్జును నిరంతరంగా సేవిస్తున్నట్లయితే గనుక..జీర్ణశయాంతర సమస్యలకు కారణమవుతుంది.
  • కలబందను ఎక్కువగా తీసుకోవడం వల్ల అలెర్జీలు వస్తాయి . దీంతో దద్దుర్లు ఎక్కువై . .చికాకు పుట్టించడం , దురద వల్ల చర్మం ఎర్రగా మారడం జరుగుతుంది .
  • బరువు తగ్గడం కోసం కలబంద రసాన్ని ఎక్కువగా తీసుకోవడం చేస్తూ ఉంటే . .శరీరంలో పొటాషియం తగ్గిపోయి . .ఎక్కువగా బలహీనంగా మారిపోయి , భయాందోళనకు గురి అవుతారు .
  • కలబంద రసంలో “ఆంత్రాక్వినోన్ ” అనే ద్రవం ఉంటుంది . ఇదే “భేదిమందు “..వీటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి .  ఇది మీ ఐబీఎస్ సమస్యను మరింత పెంచుతాయి .  దీనివల్ల ,  అలసట ,  వికారం ,  కడుపునొప్పి ,  వాంతులు ,  విరేచనాలు వంటి సమస్యలు కలుగుతాయి .
  • అలాగే ,  సున్నితత్వంతో కూడిన శరీరం కలిగిన వారు, కలబందను ఏ రూపంలో సేవించాలి అనుకున్న వైద్యుడి సలహా తప్పనిసరిగా పాటించాలి .
  • గర్భిణీ స్త్రీలు కలబందను సేవించడం అనేది అస్సలు సురక్షితం కాదు .  ఎందుకంటే ,  కలబంద సేవనం ద్వారా గర్భస్రావాలు సంభవించినట్లు రిపోర్ట్స్ ఉన్నట్లు నిపుణులు వివరిస్తున్నారు .
  • అందుకే ,  పరిమితికి మించి కలబందను ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయొద్దు .
ముగింపు(Conclusion) :

కలబందను ఇంటి పెరటులో అందానికి అలంకరణ గా మాత్రమే కాదు, ఒక ఔషధకారిణి గా కూడా వర్ణించవచ్చు . అది మన బాహ్య శరీర సౌందర్యానికి గాను మరియు  వాతావరణ శుద్ధి కోసం కూడా ఎన్నో రసాయనిక చర్యలను జరిపి, లాభాలను చేకూర్చగలదు . ఇందుకు గాను ,  మన ఇంటి పరిసరాలలో వీలైనంత ఎక్కువగా కలబంద మొక్కలను పెంచుతూ ఉండడం మన పర్యావరణానికి ఎంతో మేలు కలిగించడం తో పాటుగా మన ఆరోగ్య సంరక్షకారిణిగా ఎంతగానో ఉపయోగపడుతుంది .

కలబందను బాహ్యసౌందర్యం కోసం అంటే . .మీ యొక్క చర్మం మరియు కేశ సంరక్షణకు ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు అనేది తెలుసుకున్నాము కదా! అయితే ,  ఒక్కోసారి మీ చర్మం ఏదైనా కారణాల చేత కలబందను ఇమిడించుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది . అందుకే ,  తరచుగా కలబంద వినియోగం చేయకూడదు .  ఒక నియమం ప్రకారం మాత్రమే,  మీ చర్మానికి ,  జుట్టుకు కలబందను వినియోగిస్తే . .వచ్చే ఫలితాలు మీకు సంతృప్తిని కలిగిస్తున్నాయా? లేదా? అనేది పరీక్షించుకోవాలి .  తగిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, ఏ కారణం చేత మీకు సరిపడడం లేదు అనేది కూడా చూసుకోవాలి . ఇంకా ఏ రూపంలో కలబందను వినియోగిస్తే . .మంచి ఫలితాన్ని పొందగలం అనేది కూడా మీ శరీరంలో కలిగే మార్పులను బట్టి పరీక్షించుకోవాలి . 15 రోజులు లేదా 30 రోజులకు ఒకసారి.. ఇలాగా ,  ఒక నియమావళి గా  చర్మంపై అప్లై చేసి మర్దనా చేసుకోవడం మరియు కేశాలకు ఒక ప్యాక్ లాగ వేసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని తప్పకుండ పొందే అవకాశం ఉంటుంది . లేదా 2,3 నెలలకు ఒకసారి మీకు వీలైనప్పుడు కలబంద వినియోగం చేస్తూ ఉన్న.. వాటిలోని ఎన్నో పోషకాలను మనం అందిపుచ్చుకున్నవాళ్ళం అవుతాము . 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లలకు కలబందను ఏ రూపంలో కూడా ఉపయోగించకుండా ఉంటేనే మంచిది .

అయితే ,  శరీరంలోనికి సేవించడానికి కలబందను ముఖ్యంగా బరువు తగ్గడం కోసం అని చెప్పి తీసుకోవడం చేస్తున్నారు .  అవును..మంచి ఫలితాన్ని ఇస్తాయి అని మేము చెప్తాము . కానీ , తరచుగా సేవించడం మంచిది కాదు .  ఇంకా మీ వయస్సు మరియు మీ ఆరోగ్య పరిస్థితిని అవగాహనలో ఉంచుకొని మాత్రమే కలబంద రసం మీకు ఎంత ప్రయోజనం చేకూర్చుతుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండ ఉంటుంది . అప్పుడే మంచి ఫలితాన్ని అందుకోగలరు . గర్భిణీ స్త్రీలు కూడా..కలబందను మీరు ఏ రూపంలో తీసుకోవాలి అనుకున్న వైద్యుడిని సంప్రదించి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది .  కలబందతో కూడిన చిట్కాలు లాభాలను చేకూర్చుతాయి అని చెప్పగానే..పాటించేయడం అస్సలు శ్రేయస్కరం కాదు అనే చెప్తాము .  ఎందుకంటే ,  దానికి తగినట్లుగా మీ శరీరం చాలా బలంగాను మరియు సంపూర్ణ ఆరోగ్యంతో కూడినదై ఉండాలి .  అప్పుడే, ఎలాంటి హానికర విపత్తులనైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది .

ఇంకా వివిధ రకాల వ్యాధుల కోసం కలబందను ఉపయోగించాలి అనుకుంటే , దీనికి ముందు మీరు కలబంద చిట్కాలు వాడి ఫలితాలను పొంది ఉంటే సరే . .లేదు కొత్తగా ప్రయత్నించాలి అనుకునే వాళ్ళు, చిట్కాను ఉపయోగించే తీరు సరిగా అర్ధం చేసుకోవాలి .  ఒకసారి ప్రయత్నించండి..తర్వాత మీ శరీరంలో కలిగే మార్పులు అర్ధం చేసుకోండి . ఎలా భావన కలుగుతుంది అని . హానికర సమస్యలు లేవు అనిపిస్తే . .ఫలితం పొందే వరకు మాత్రమే చిట్కాను ఉపయోగించండి . . అంతేగాని, తరచుగా కలబంద ఉపయోగిస్తూ ఉంటే శరీర ఆరోగ్య పరిస్థితి చురుకుగా ఉంటుందేమో అనే భావనలోకి వెళ్లొద్దు . అలా ఉపయోగించాలి అనుకుంటే . .వైద్యుడి సలహా కూడా తీసుకొని మీ ఆరోగ్య పరిస్థితిని సరిచూసుకోండి . అప్పుడే , మీ ఆరోగ్యమే మీ చుట్టూ సంతోషకర వాతావరణాన్ని నింపగలుగుతుంది .  .

Add Comment