త్రాగు నీరు యొక్క రకాలు మరియు నీటి నాణ్యతతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు|Types of drinking water and health benefits of water quality in Telugu

    మనం తాగే నీటి నాణ్యతే మన ఆరోగ్యానికి “శ్రీ రామ రక్ష” అని చెప్పొచ్చు. కానీ, ప్రకృతి నుండి తాగే నీటిని స్వచ్ఛమైనదిగా పొందలేకపోతున్నాము. కారణం అడిగితే..ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రకృతి, వాతావరణ కాలుష్యం అవ్వడానికి మనమే కారణం అవుతున్నాము వివిధ రకాల ఫ్యాక్టరీల సాకుతో. తద్వారా, మనమే మనం తాగే నీరును కలుషితం చేసుకుంటున్నాము. అందుకే, లభించే నీటిని ఫిల్టర్, పరీక్షలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.

అసలు సహజ వనరుల నుండి పొందే తాగునీటితో పాటు మరెన్ని రకాల నీళ్ళున్నాయి? వాటిని ఎలా తయారు చేస్తారు. అవి మన ఆరోగ్యానికి మంచివేనా? అనే చర్చలు కొనసాగుతున్నాయి. నీరు లేకుండా ఈ భూగోళంపై మనిషి జీవితం అసాధ్యం. ఎందుకంటే, శరీరంలోని జీవక్రియలన్ని సక్రమంగా జరగాలంటే..నీరు చాలా అవసరం. మానవ శరీరం కూడా 70% వరకు నీటితోనే నిండి ఉంటుంది.

రెండు(2) “హైడ్రోజన్ అణువులు”, ఒక(1) “ఆక్సిజన్ అణువు” కలిస్తే ఒక “నీటి అణువు” ఏర్పడుతుంది(Two hydrogen atoms and one oxygen atom combine to form a water molecule.). ఇలాంటి లక్షల నీటి అణువులు కలిస్తే “నీటి బిందువు(drop of water)” ఏర్పడుతుంది. భూగోళంపై నీరు 71% ఉంటుంది. అందులో 96.5% సముద్రాల రూపంలో కలిగి ఉండే నీరే. భూగ్రహం పై ఉన్న నీటిలో 1% మాత్రమే మానవ అవసరాలకు ఉపయోగపడే మంచి నీరు.Types of drinking water and health benefits of water quality in Telugu

తాగునీటికి ఏ లక్షణాలు ఉండాలి? ఆ నీటిలో ఏముండాలి? డబ్బులు ఖర్చు చేసి కొనుక్కునే నీటిలో ఉన్న ప్రత్యేకత ఏమిటీ? అసలు ఏ నీరు సురక్షితం? అనేది తెలుసుకుందాము..

ప్రాణ కోటి మనుగడకు నీరు చాల అవసరం(Water is essential for the survival of millions of animals)

ప్రకృతిలో సహజంగా లభించే ఏ నీటికైనా పి.ఎచ్ విలువ 6.5 – 7.5 మధ్యలో ఉండాలి. దానిని “సాధారణ నీరు” లేదా “నార్మల్ వాటర్(Normal Water)” అంటారు. సాధారణంగా, ఈ నీటికి రంగు, రుచి ఉండవు. దీనిని తాగేందుకు ఉపయోగించవచ్చు. మానవ శరీరం దాదాపు 60% నీరుతో కూడి ఉంటుంది. శరీర పనితీరుకు తగినంత నీరు త్రాగడం చాల ముఖ్యం. అయితే,

  • మానవ మెదడు(The human brain)లో 75 నుండి 80% ,
  • మనిషి గుండె(human heart)లో సుమారు 73% ,
  • ఎముకల్లో(in the bones) 22% ,
  • దంతాల్లో(in the teeth) 10%,
  • చర్మంలో(in the skin) 20%,
  • రక్తంలో(in the blood) 83%,
  • కండరాలలో(in the muscles) 75.6% నీరు ఉంటుందని వైద్యులు చెపుతున్నారు.

మన శరీరం కలిగి ఉన్న నీటిలో 2% కోల్పోయిన కూడా శారీరక పనితీరు గణనీయంగా దెబ్బతింటుంది. కాబట్టి, నీరు అన్ని అవయవ భాగాలకు అత్యంత అవసరమైన ద్రావకం.Types of drinking water and health benefits of water quality in Telugu

మినరల్ వాటర్ అర్థం ఏమిటీ(What does mineral water mean)?

నీటిలో మినరల్స్ లేకపోతే, మనిషి శరీరానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. మినరల్ వాటర్ పేరుతో బాటిళ్లలో అమ్మే నీటిని మనం తాగుతుంటాము. అసలు “భూమి లోపల(within the earth)” నుండి లేదా “భూమి ఉపరితలంపై(on the surface of the earth)” నుండి లభ్యమయ్యే నీటినే “మినరల్ వాటర్(Mineral Water)” అంటారు.

ఇందులో సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, వంటి మినరల్స్ ఉంటాయి. ఇందులో మనిషి శరీరానికి కావలసిన దాని కంటే తక్కువగానో, ఎక్కువగానో మినరల్స్ ఉంటాయి. ఈ నీటిని తాగితే..ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(Bureau of Indian Standards) ప్రకారం, సహజంగా లభించే మినరల్ వాటర్ తాగితే శరీరంలో జీర్ణక్రియలకు అవసరమైన మినరల్స్ సమతూకంలో ఉంటాయి.

కొన్ని కంపెనీలు మాత్రం “ప్లాస్టిక్(Plastic) లేదా గ్లాస్ బాటిల్స్(Glass Bottles)” లో మినరల్ వాటర్ ని అమ్మకాలకు పెడుతున్నాయి. అయితే, తరచుగా ఈ బాటిల్స్ ని వాడడం సాధారణం అయింది. కాబట్టి, ఆ బాటిల్స్ పై ఉన్న మినరల్ లిస్ట్ “బి.ఐ.ఎస్(BIS)” తో సరిపోయిందా? లేదా? చూసుకోవాలి. అయితే, ఆ నీటి “టీ.డీ.ఎస్(TDS)” మాత్రం “500మిల్లీగ్రా/ఎల్” దాటకూడదు.Types of drinking water and health benefits of water quality in Telugu

టి.డి.ఎస్(టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్) అంటే ఏమిటి(What is TDS (Total Dissolved Solids))?

నాణ్యమైన నీటి విషయంలో వినిపించే “మరో పదం టి.డి.ఎస్.” నాణ్యమైన తాగునీటిలో “ఆర్గానిక్ సాల్ట్స్(Organic Salts), క్యాల్షియం(Calcium), పొటాషియం(Potassium), మెగ్నీషియం(Magnesium), సోడియం(Sodium), బైకార్బోనేట్స్(Bicarbonates), క్లోరైడ్స్(Chlorides), సల్ఫేట్స్(Sulphates)” అలాగే కొద్దీ మొత్తంలో “కర్బన పదార్థాలు(Organic materials)” కరిగి ఉంటాయి.

వీటితో పాటు నీటిలో “కాడ్మియం(Cadmium), లెడ్(Lead), నికెల్(Nickel)” వంటి లోహాలు కూడా చాలా తక్కువ మోతాదులో కరిగి ఉంటాయి. ఇలా నీటిలో కరిగి ఉన్న ఈ పదార్థాల మొత్తాన్నే “టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్(Total Dissolved Solids)” అంటారు. ఇది ఒక లీటర్ నీటిలో 500మిల్లీగ్రా/లీ మించకూడదు. అలాగే, 100మిల్లీగ్రా/లీ తగ్గకూడదని బ్యూరో ఆఫ్ ఇండియన్స్ స్టాండర్డ్స్ నిర్ణయించింది.

మనం తాగే నీటిలో టీ.డీ.ఎస్ 100 కంటే తక్కువ ఉంటే “అవసరమైన మినరల్స్ లేనట్లే”. అలాగే, 500 కంటే ఎక్కువ టీ.డీ.ఎస్ ఉంటె ఆ నీరును “కఠిన జలం(hard water)” అంటారు. ఈ రెండు తాగడానికి పని చేయవు.

ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీటిని తాగాలంటే..దాని టి.డి.ఎస్ 100 నుండి 500 మధ్య ఉండాలి. మనము తాగే నీటిలో టి.డి.ఎస్ ఎంత ఉందొ తెలుసుకునేందుకు మార్కెట్ లో “టి.డి.ఎస్ మీటర్లు(TDS Meters)” దొరుకుతాయి.Types of drinking water and health benefits of water quality in Telugu

నీటి నాణ్యతను ఎలా కొలుస్తారు(How is water quality measured?)?

నీరు ఎంత నాణ్యమైనదో, తాగేందుకు ఉపయోగపడుతుందో లేదో అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కొన్ని పరీక్షల ద్వారా నిర్థారిస్తుంది. వీటిలో ఇండియన్ స్టాండర్డ్స్ డ్రింకింగ్ వాటర్ స్పెసిఫికేషన్ – 10500 అంటారు.

నీటి నాణ్యతను నిర్దారించే పరీక్షలు 60 వరకు ఉన్నాయి. ఇందులో రసాయన పరీక్షలతో పాటు “మైక్రో బయాలజీ పరీక్షలు” ఉన్నాయి. “పి.ఎచ్(pH), టి.డి.ఎస్(TDS), టోటల్ ఆల్కాలినిటి(Total Alkalinity), హార్డ్ నెస్(Hardness), మెటల్స్(Metals)” వంటి రసాయన పరీక్షల ద్వారా నిర్ణయిస్తే..నీటిలో ఉండే బాక్టీరియా, ఫంగస్, పెస్టిసైడ్ అవశేషాల కోసం “టోటల్ కోలిఫామ్(Total coliform), ఈ కోలిఫామ్(this coliform)” వంటి మైక్రో బయాలజీ పరీక్షలు చేస్తారు.

పరీక్షలో ప్రధానమైనవి చూసుకుంటే..పి.ఎచ్ 6.5 నుండి 7.5 ఉండవచ్చు. అలాగే,

  • బైకార్బోనేట్స్(Bicarbonates) 200మిల్లీగ్రా/లీ,
  • క్యాల్షియం(Calcium) 75మిల్లీగ్రా/లీ,
  • మెగ్నీషియం(Magnesium) 30మిల్లీగ్రా/లీ,
  • నైట్రేట్(Nitrate) 45మిల్లీగ్రా/లీ,
  • టోటల్ ఆర్సెనిక్(Total arsenic) 0.01మిల్లీగ్రా/లీ,
  • కాపర్(Copper) 0.05మిల్లీగ్రా/లీ,
  • క్లోరైడ్స్(Chlorides) 250మిల్లీగ్రా/లీ,
  • సల్ఫేట్(Sulphate) 200మిల్లీగ్రా/లీ,
  • ఫ్లోరైడ్(Fluoride) 1మిల్లీగ్రా/లీ,
  • ఐరన్(Iron) 0.3మిల్లీగ్రా/లీ,
  • మెర్క్యురీ(Mercury) 0.01మిల్లీగ్రా/లీ,
  • జింక్(Zinc) 5మిల్లీగ్రా/లీ వరకు ఉండాలి.
నీటి నాణ్యతలో తేడా వస్తే..ఏమౌతుంది(What happens if there is a difference in water quality)?

నీటి నాణ్యత కోసం వివిధ రకాల పరీక్షలు చేయడం ద్వారా ఆ నీటిని తాగేందుకు ఉపయోగించవచ్చా? లేదా? అనేది నిర్ణయిస్తారు. బి.ఐ.ఎస్ ప్రకారం,

  1. ఫ్లోరైడ్(Fluoride) 1 కంటే ఎక్కువ ఉంటే “డెంటల్ ఫ్లోరోసిస్(Dental Fluorosis)” అలాగే,
  2. సోడియం(Sodium) ఎక్కువగా ఉంటే “బి.పి(B.P)” వస్తుంది.
  3. పంట పొలాల ఎరువుల ద్వారా నైట్రేట్ తాగునీటితో కలిసి శరీరంలోకి వెళ్తే “నైట్రేట్(Nitrate)” గా మారుతుంది. అది రక్తంలో ఆక్సిజన్ సరఫరా ను తగ్గించి “శ్వాస ఇబ్బందులు(Causes breathing difficulties), కళ్ళు తిరగడం(dizziness), కనుపాపలు నీలం రంగులోకి మారడానికి” కారణమౌతుంది(blue irises)”. దీనినే “బ్లూ బెర్రీ సిండ్రోమ్(Blue Berry Syndrome)” అంటారు.
  4. ఆర్సెనిక్(Arsenic) ఎక్కువగా ఉంటే చర్మంపై “తెల్లని మచ్చలు(White spots)” వస్తాయి.
  5. క్యాల్షియం(Calcium) తక్కువైతే ఎముకల సమస్యలు(Bone problems) వస్తాయి.
  6. టి.డి.ఎస్(TDS) తక్కువ ఉన్న నీటిని తాగితే “నాడీ వ్యవస్థ(nervous system)” పై ప్రభావం చూపుతుంది.

నీటి రుచి బాగా లేదు అనిపించినా, రంగు మారినా, నలకలు కనిపించినా నీటిలో ఎదో తేడా ఉందని, తాగడానికి పనికి రాదని అర్ధం చేసుకోవాలి. వెంటనే, ప్రభుత్వం గుర్తించిన “వాటర్ టెస్టింగ్ ల్యాబరేటరీ(Water Testing Laboratory)లలో” పరీక్షలు చేయించుకోవాలి.

ఏ నీటిని మరిగించినా సరే మంచినీరుగా మారుతుందా(Does boiling any water turn it into fresh water)?

ప్యూరిఫైడ్ వాటర్(Purified Water), డిస్టిల్డ్ వాటర్(Distilled Water), మినరల్ వాటర్(Mineral Water)” ఇలా అనేక రకాలైన నీరు అందుబాటులో ఉంది. అయితే, ఏ నీరు అని తెలియనప్పుడు దానిని తాగాల్సి వస్తే.. తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలు..

  • భూమి నుండి ఎత్తులో ఉన్నపుడు “డిస్టిల్డ్ వాటర్” లా ఉండే వర్షపు నీరు, భూమిని సమీపిస్తూనే..కాలుష్యాన్ని నింపుకుంటుంది. గాలిలో ఉండే “కార్బన్ డై యాక్సయిడ్(Carbon Dioxide), సల్ఫర్ డయాక్సయిడ్(Sulfur Dioxide)” వంటి వాటితో కలసి నీరు కలుషితం అవుతుంది. ఇటువంటి కాలుష్యాన్ని “ఎస్.పి.ఎమ్(సస్పెండెడ్ పర్టిక్యూలేట్ మ్యాటర్)(SPM (Suspended Particulate Matter))” అంటారు. నీటి కాలుష్యం వలన 250 రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
  • రివర్స్ ఆస్మోసిస్(Reverse osmosis)” ద్వారా నీటిని శుద్ధి చేస్తే అందులో పోషకాలు పోతాయి. అలాగే, పదే పదే నీటిని ఫిల్టర్ చేయడం కూడా మంచిది కాదు.
  • ఫ్రిడ్జ్ లో పెట్టిన నీటిలో కూడా త్వరగా “బాక్టీరియా” వచ్చి చేరుతుంది. నీటిపై ఎలాంటి అవగాహన లేనప్పుడు తాగాల్సి వస్తే..నీటిని మరిగించి తాగడం మంచి పద్దతి.
  • అలాగే, వస్త్రాన్ని మడతలుగా పెట్టి వడగట్టడం, “అల్ట్రా వయొలెట్ లైట్ల ఫిల్టర్లు(Ultra Violet Light Filters)” వాడటం ద్వారా కూడా సులభంగా నీటిని శుద్ధి చేయవచ్చు.Types of drinking water and health benefits of water quality in Telugu
ఆక్టివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకే “బ్లాక్ వాటర్”(Black water is for those who are more active) 

వివిధ రకాలైన నీళ్లతో పాటు ఈ మధ్య కాలంలో “బ్లాక్ వాటర్(Black Water)” లేదా “ఆల్కలీన్ వాటర్(Alkaline Water)” ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ వాటర్ ను క్రికెట్, సినీ సెలబ్రెటీలు ఎక్కువగా వాడుతున్నారు(This water is mostly used by cricket and movie celebrities). నాణ్యమైన వాటర్ అంటే..పి.ఎచ్ 7 కు కొద్దిగా అటు, ఇటుగా ఉంటుంది. కానీ, బ్లాక్ వాటర్ పి.ఎచ్ 8 నుండి 9 వరకు ఉండవచ్చు.

మనం ఏ ఆహరం తీసుకున్నా శరీరంలో “యాసిడ్(acid)” తయారు అవుతూ ఉంటుంది. దానిని బాలన్స్ చేయడానికి ఆల్కలీన్ లక్షణాలు(Alkaline properties) ఎక్కువగా ఉన్న బ్లాక్ వాటర్ ని తీసుకోవడం వలన సమతుల్యత ఏర్పడి ఆ మనిషి “యాక్టీవ్(active)”గా ఉండేలా చేస్తుంది.

అయితే, “శరీరానికి శ్రమ కలిగించని వారు(Those who do not toil the body)” బ్లాక్ వాటర్ తాగితే “ఆరోగ్య సమస్యలు(Health problems)” వస్తాయి. శరీరం యాక్టీవ్ గా లేకపోతె బ్లాక్ వాటర్ తాగడం వలన “క్షార లవణాలు(Alkali salts)” శరీరంలో ఏర్పడుతాయి. ఈ బ్లాక్ వాటర్ లో కూడా కొన్ని “ఖనిజ లవణాలను” కలుపుతారు. బ్లాక్ వాటర్ “అతిగా తాగడం” కూడా మంచిది కాదు.Types of drinking water and health benefits of water quality in Telugu

నీటి వలన కలిగే లాభాలు(Benefits of water)
  1. మలేరియా వ్యాధి(Malaria is a disease) బారిన పడినప్పుడు చలివేస్తుంది. అప్పుడు “గోరువెచ్చటి నీరు(Warm water)” తాగడం మంచిది.
  2. జ్వరం(fever)తో ఉన్న రోగికి చెమటను బయటకు రప్పించడానికి “వేడి నీరు(hot water)” ఇవ్వడం ఉత్తమం.
  3. కడుపు నొప్పి(Abdominal pain) ఉన్నపుడు వేడి నీరు తీసుకోవడం వలన లాభం చేకూరుతుంది.
  4. అజీర్తి(Indigestion), వాత రోగం(vata disease) ఉన్నపుడు, నీరు అధికంగా తీసుకుంటే జీర్ణక్రియ సరిగా పనిచేస్తుందని వైద్యులు తెలిపారు.
  5. జలుబు(a cold) ఉన్నపుడు నిమ్మకాయ రసం నీళ్లలో కలుపుకొని తాగితే, లాభదాయకంగా ఉంటుంది.
  6. కిడ్నీలో రాళ్లు(Kidney stones) ఉన్నపుడు, నీరు అధికంగా తీసుకుంటే ఆ రాళ్లు కరిగి బయటకు వచ్చే అవకాశం ఉంది అని వైద్యులు పేర్కొన్నారు.Types of drinking water and health benefits of water quality in Telugu
నీటి వలన కలిగే నష్టాలు(Water damage) 
  1. భోజనం తినేటప్పుడు మధ్య మధ్య లో నీరు తాగకూడదు.
  2. దాహం ఉంటేనే నీరు తాగాలి. దాహం వేసినపుడు ఉప్పుగా ఉన్న పదార్థాలు లేదా తియ్యటి పదార్థాలు తీసుకోవాలి.
  3. భోజనానికి అరగంట ముందు, భోజనం చేసిన ఒక గంట వరకు నీరు తాగకూడదు. భోజనం చేసేటపుడు నీటిని ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
ముగింపు(Conclusion) 

ఈ ప్రకృతిలో ఎన్నో రూపాల్లో నీరు ఉన్నప్పటికీ..మనము వినియోగించడానికి, తాగడానికి కావాల్సిన నీరు స్వచ్ఛమైనదిగా ఈ రోజుల్లో దొరకడం అసాధ్యం అనే చెప్పాలి. అందుకే, లభించిన కొద్దీ నీరును వివిధ రకాల పద్దతుల ద్వారా శుద్ధి చేయడం, ఫిల్టర్ చేయడం జరుగుతుంది..ఈ విధంగా, నీటిని ప్యూరీఫైర్ చేస్తూ..కొన్ని రకాల పరీక్షల అనుగుణంగా నాణ్యతను గుర్తించి..త్రాగే నీటిలో ఎంత మోతాదులో ఖనిజాలు, లవణాలు ఉండాలి అనేది నిర్ణయించడం జరుగుతుంది. నీటిలో ఉండే ఖనిజ, లవణాలు.. ఎక్కువ, తక్కువ అవ్వకుండా కూడా జాగ్రత్త వహిస్తూ..మంచి నీటిని తాగడానికి అందుబాటులోకి తెస్తున్నారు. అయితే, నీరు ఎన్ని రకాలుగా తాగడానికి ఉపయోగిస్తున్నారు? నాణ్యతను ఎలా గుర్తిస్తారు? మన ఆరోగ్యానికి కలిగించే ప్రయోజనాలు ఏంటి? అనేది తెలుసుకున్నాము..

మనిషి జీవనం, మనుగడ అనేది నీటిపై ఆధారపడి ఉంది. నీరు లేనిది ఈ సృష్టి ముందుకు సాగడం ఉహించలేనిది, అసంభవం అని ఖచ్చితంగా చెప్పగలిగే విషయమే అవుతుంది. ఇంత ప్రాముఖ్యత కలిగిన నీరు..శరీరానికి ఎంత మోతాదులో తీసుకోవడం అనేది మాత్రమే ముఖ్యం అవదు..నీటిలో ఉండాల్సిన ఖనిజ, లవణాలు ఎంత మోతాదులో ఉండి..మన శరీరానికి లాభాన్ని చేకూరుస్తున్నాయి, ఆరోగ్యముగా ఉంచుతుంది అనేది చూసుకోవడం అతి ముఖ్యమైన విషయం. 

సాధారణంగా మనం వింటూనే ఉన్నాము..ప్యూరీఫైర్ చేసిన నీరు, కొంతమందికి సరిపడే విధంగా ఉన్నా, కొంతమందికి దగ్గు, జలుబు నుండి మొదలై అనారోగ్య పరిస్థితికి కారణమౌతుంది. కానీ, ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటి అంటే..కలుషితమైన నీరు లేదా తక్కువ, ఎక్కువ ఖనిజ లవణాలు నీటిలో చేరడం వల్ల కూడా మన ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది అనేది సమాజంలో అందరికి తెలియకపోవడం.

ముఖ్యముగా మనిషి బ్రతకడానికి మరియు శరీరంలో ఎన్నో మలినాలను, రోగాలను సైతం బయటకు పంపే శక్తి నీటికి ఉంది. అందుకే, మనం త్రాగే నీటిపైన శ్రద్ధ వహించడం చాలా అవసరం. మనకు లభ్యమయ్యే నీటిని ఏ విధంగా పరీక్ష చేయాల్సిన అవసరం ఉంది అని అవగాహనను పెంచుకోవాలి. ఆ తర్వాత నీటిని వేడి చేయడమా? లేదా ఫిల్టర్ చేయడమా? ఇంకా ఏ విధానంలో నీటి నాణ్యతను సరి చేయడం ద్వారా మన ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా ఉండగలదు అని తెలుసుకోవాలి.

స్వచ్ఛమైన ప్యూరీఫైర్ చేసిన నీరును కొనడం పైన దృష్టి పెట్టేకంటే..ఎవరికివారుగా ఒక అవగాహన కలిగి ఉండడం..అంటే, మన శరీరానికి ఎంత మోతాదులో ఖనిజ లవణాలు అవసరమౌతున్నాయి? వాటిని నీటి ద్వారా పొందడం ఎలా? సహజమైన పద్దతిలో ఏ విధంగా మన శరీరానికి అవసరమయ్యే ఖనిజ లవణాలు కలిగి ఉన్న నీటిని తీసుకోగలం అని తెలుసుకోవడం గాని, పరీక్షించుకోవడం గానీ చేయడం చాలా ముఖ్యమైన విషయం అని చెప్పాలి..మరియు గుర్తించాలి ప్రతి ఒక్కరు. 

Add Comment