నీరు ఎక్కువగా తాగడం వలన మన ఆరోగ్యానికి హానికరమా?|Is Drinking Too Much Water Harmful To Our Health? in Telugu

నీరు ఎక్కువగా తాగినా ప్రమాదమేనా(Is drinking too much water dangerous)?

నీరు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిది అంటారు. చాలా మంది సెలబ్రెటీలు వారి సౌందర్యానికి ఆరోగ్య రహస్యం తాగే నీరే అని కూడా చెప్తుంటారు. కానీ, అవసరానికి మించి నీరు తాగడం కూడా మన ఆరోగ్యానికి హానికరం అవుతుంది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

మన శరీరంలో 70% వరకు నీరు ఉంటుంది అని మనందరికీ తెలుసు. కానీ, శరీరంలో నీటి శాతం ఎక్కువయితే, అది అనేక “అనారోగ్య సమస్యలకు(for health problems)” దారి తీస్తుంది. కొంతమంది రోజుకు 8 నుండి 9 గ్లాస్ ల కంటే ఎక్కువ నీటిని త్రాగుతారు. మరి ఒక రోజుకు ఎంత మోతాదులో నీటిని సేవించడం మేలు కలుగుతుంది? ఎక్కువ నీటిని తాగడం వలన దుష్ప్రభావాలు కలుగుతాయా? అనే విషయాలు తెలుసుకుందాము..

శరీరంలో తగినంత నీరు లేకపోవడం, నీటిని తాగకపోవడం వల్ల కూడా గుండె సంబంధ వ్యాధులు, మరియు నీరు లేకుంటే రక్తం చిక్కబడడం, కొలెస్ట్రాల్ పెరగడం జరుగుతుంది. మలబద్దకం సమస్యలు, ఎంజైమ్స్ ఉత్సహంగా పని చేయకపోవడం వల్ల తిన్న ఆహరం కూడా సరిగ్గా జీర్ణం కాదు. తద్వారా, గ్యాస్, అసిడిటీ వంటి ఇబ్బందులు కలుగుతాయి.

అదేవిధంగా, “అధిక నీరు”ను తాగడం వల్ల శరీరాన్ని విషపూరితం చేస్తుంది..దీని సాధారణ లక్షణాలు..గందరగోళం, అయోమయస్థితి, మత్తుగా అనిపించడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, వికారం, వాంతులు. కొన్ని సందర్భాలలో, అధిక నీరు నుండి కలిగే నష్టం మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఆర్టరీస్ లో ఎక్కువ నీరు చేరితే, మెదడు కణాలు ఉబ్బుతాయి, ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా, అనారోగ్య సమస్యలు వస్తాయి మరియు ప్రాణాంతకం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మెదడులో ఒత్తిడి పెరిగితే, అధిక రక్తపోటు, తక్కువ హృదయ స్పందనకు కారణం అవుతుంది. సాధారణంగా, ప్రతి మనిషికి రోజుకు 2 లీటర్ల నీరు సరిపోతుంది. కానీ, కొంతమందికి 3 లీటర్ల నీరు తీసుకోవడం వల్ల శరీరం విష ప్రభావానికి లోను అవుతుంది.   

Is Drinking Too Much Water Harmful To Our Health? in Telugu

హైపోనట్రేమియా సంభవించవచ్చు(Hyponatremia can occur in) :

రక్తంలో సోడియం గాఢత తగ్గిపోయే స్థితిని “హైపోనట్రేమియా(Hyponatremia)” అంటారు. అధిక నీరు శరీరంలో “సోడియం స్థాయిలను(Sodium Levels)” తగ్గిస్తుంది. ఎక్కువ నీరు త్రాగడం వలన శరీరంలో అసమతుల్యత(Imbalance) ఏర్పడుతుంది. ఇది “వికారం(nausea), వాంతులు(vomiting), తిమ్మిరి(cramps), హైపోనాట్రేమియా(hyponatremia)” వంటి పరిస్థితులకు దారి తీస్తుంది.

తలనొప్పికి కారణం కావొచ్చు(Headaches can be caused by) :

తలనొప్పి అనేది “ఓవర్ హైడ్రేషన్(Overhydration) లేదా డీహైడ్రేషన్(dehydration)” రెండింటి లక్షణం. మీరు ఎక్కువ నీరు త్రాగినపుడు మీ రక్తంలో “ఉప్పు శాతం(Percentage of salt)” తగ్గుతుంది. ఇది మీ శరీరంలోని అవయవాలలో వాపుకు(For swelling in the limbs) కారణమౌతుంది.

ఎలక్రోలైట్ స్థాయిలు తగ్గుతాయి(Electrolyte levels are reduced by) :

ఎక్కువ నీరు తాగినపుడు ఎలక్రోలైట్ స్థాయిలు పడిపోతాయి. ఈ “తక్కువ ఎలక్రోలైట్ స్థాయిలు” “కండరాల తిమ్మిరి(Muscle cramps)”కి కారణమౌతాయి. శరీరంలోని ఎలక్రోలైట్స్ లో “పొటాషియం(Potassium), సోడియం(Sodium), మెగ్నీషియం(Magnesium)” వంటి ఖనిజాలు ఉంటాయి. నీరు అధికంగా తాగితే “ఎలక్రోలైట్ లెవల్స్” పడిపోవడానికి కారణమౌతుంది. ఫలితంగా, గుండె(Heart), కిడ్నీ(kidney) పనితీరుపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. ప్రతిరోజు అధికమోతాదులో నీరు తాగితే, “మినరల్స్ నిష్పత్తి(Ratio of minerals)”లో సమతుల్యం దెబ్బతిని “బ్రెయిన్ ఫాగ్(brain fog), బరువు పెరగడం(weight gain), తలనొప్పి(headaches), కండరాల బలహీనతలకు(muscle weakness)” కారణమౌతుంది.Is Drinking Too Much Water Harmful To Our Health? in Telugu

అలసట(Fatigue) :

నీరు ఎక్కువగా తాగడం వలన అలసట కలుగుతుంది. మీరు తాగే నీటిని ఫిల్టర్ చేస్తూ..మీ రక్తంలో ద్రవ స్థాయిలను సమతుల్యం చేసే భాద్యత మూత్రపిండాలపై ఉంటుంది. ఎక్కువ నీటిని తాగడం వలన మూత్రపిండాలపై పని భారం పెరిగి, మూత్రపిండాలు తొందరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. మరియు అది హార్మోన్ల(Hormonal)పై ప్రభావం చూపుతుంది. దీంతో శరీరానికి ఒక రకమైన అలసట ఆవహిస్తుంది.

పొటాషియం లోపం సంభవిస్తుంది(Potassium deficiency occurs in) :

ఎక్కువగా తీసుకునే నీరు వల్ల పొటాషియం లోపానికి దారి తీస్తుంది. పొటాషియం అనేది శరీరంలో ముఖ్యమైన మినరల్. దీని లోపం వల్ల కాళ్లలో మంట(Burning in the legs), ఛాతి నొప్పి(pain in the chest) మొదలైన లక్షణాలు కన్పిస్తాయి.

తరచుగా మూత్ర విసర్జన(Frequent urination) :

ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల, మీకు తరచుగా మూత్రవిసర్జన సమస్యలు తలెత్తుతాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరం పోషకాలను గ్రహించదు. మూత్రం రూపంలో విలువైన పోషకాలు శరీరం నుండి బయటకు వెళ్లిపోతాయి.

నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యయనాల ప్రకారం,Is Drinking Too Much Water Harmful To Our Health? in Telugu

ఆరోగ్యముగా ఉండాలి అంటే..నీళ్లు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. మన శరీరానికి ఎన్ని లీటర్ల నీళ్లు సరిపోతాయి అనే దానికి ప్రత్యేకమైన ఫార్ములా ఏమి లేదు. శారీరక శ్రమ(Physical activity), వయస్సు(age), లింగం(sex), శరీర స్థితి(body condition)ని బట్టి నీటి మోతాదు మారుతుంటుంది.

ఒక వ్యక్తి సగటున రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలంటే..

పురుషులు   –    15.5 కప్పులు (3.7 – 5 లీటర్లు)

మహిళలు    –    11.5 కప్పులు (2.7 – 4 లీటర్లు)

దీని ప్రకారం మీ శరీరానికి అవసరమయ్యే మేరకు ఏదైనా తీసుకోవాలి. దాహంగా ఉంటేనే నీటిని తాగాలి. ఇతర వేళల్లో పుచ్చకాయలు(Watermelons), స్పినాచ్ పండ్లు(spinach fruits) వంటివి అధిక మోతాదులో ఉండే కూరగాయలు లేదా పండ్లను తినాలి. అలాగే, కొబ్బరి నీళ్లు(coconut water), టీ(tea), కాఫీ(coffee), జ్యూస్(juice)లతో కూడా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు. రోజుకు 1.5 లీటర్ల నీరు తాగితే సరిపోతుందని సూచించారు.Is Drinking Too Much Water Harmful To Our Health? in Telugu

ముగింపు(conclusion)

మన శరీరం ముందుగానే నీటి శాతం కలిగి ఉంటుంది. ఈ విషయంపై కొంతమందికి మాత్రమే అవగాహన ఉంటుంది. అందులోను చదువు, జ్ఞానం ఉన్నా సరే..కొంతమందికి తెలియకపోవొచ్చు. అందుకే, అధిక నీరు తీసుకుంటే..మన శరీరం ఏ పరిస్థితికి దారి తీసే అవకాశం ఉంది అని వివరంగా తెలియజేసిఉన్నాము. 

మనిషి బ్రతకడానికి నీరు అవసరం. అందుకే..నీటిని తీసుకుంటాము..తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇంతవరకు మాత్రమే ప్రతిఒక్కరికి తెలుస్తుంది. దాహము వేస్తుందా?..నీటిని తాగేస్తున్నాము సరే.. నీటిని ఎక్కువగా తాగండి అని వైద్యులు చెబితే తాగేస్తున్నాము సరే..కానీ, నీటి మోతాదు ఎక్కువయితే, అనారోగ్య సమస్యలు కొత్తగా కొని తెచ్చుకున్నవాళ్ళం కూడా మనమే అవుతున్నాము అనే విషయం తెలుసా? ఎందుకంటే..కొన్ని ఆరోగ్య సమస్యలు అధిక నీటి శాతం వల్ల కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఇది మనకు తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం కూడా అవుతుంది..

అందుకే, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి..బరువును బట్టి..ముందుగానే, మనం తీసుకున్న నీటి శాతం మన శరీరంలో ఎంత ఉంది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరియు ప్రతి ఒక్కరు ఒక్కసారి మీ శరీరాన్ని మీరు గమనించుకోండి..చాలా దాహం వేయడం వలన నీటిని తాగుతున్నారా? వైద్యుడు చెప్పారు కాబట్టి..పాటిస్తున్నారా? అని. అయితే, మన శరీరానికి అవసరమయ్యే నీరు ఏ విధంగా ఉంటుంది అంటే..మీరు చేసే కష్టం, పని భారం పైన..శారీరక శ్రమ పైన ఆధారపడి ఉంటుంది. దీని ద్వారా మీ శరీరం ఎక్కువ నీటిని అడగడంలోను, తాగడంలోనూ ఇబ్బంది ఉండదు అంటున్నారు నిపుణులు. ఇంకా, ఏ శారీరక శ్రమ కలిగి లేకపోయినా..నీరు ఎక్కువగా తాగడంపైన దృష్టి పెట్టడం వల్ల ఆరోగ్యముగా ఉంటాము అనేది పొరపాటే అని భావించాల్సిన అవసరం ఉంది.  

అయితే, నీరు ఎక్కువగా తాగితే..ఆరోగ్యానికి హానికరం అంటున్నారు అని..మరీ తక్కువ నీటిని తాగడం కూడా మన శరీరం పూర్తిగా బలహీనపడే అవకాశం ఉంటుంది అని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.

సాధారణంగా, ప్రతి మనిషి ఉదయం లేవగానే కనీసం ఒక 2 గ్లాసుల నీటిని తాగడం మరిచిపోవొద్దు. దీని ద్వారా శరీరం నుండి విష లేదా వ్యర్థ పదార్థాలు తొలగింపబడుతాయి అంటారు. ఆ తర్వాత, తీసుకునే నీరు మీకు చాలా దాహంగా అనిపిస్తేనే ఎక్కువ మొత్తంలో నీటిని (అంటే, మనసుకు చాలు అనిపించేంతగా అని అర్ధం) తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇంకా ప్రతి 30 నిమిషాలకు లేదా 1 గంటకు ఒకసారి కొన్ని నీళ్లు తాగడం కూడా సరిఅయిందే అవుతుంది. ఇంకా చెప్పాలంటే..రోజు మొత్తంలో కేవలం నీరు తాగడమే కాకుండా..మధ్య మధ్యలో నీరు కలిగిన కూరగాయలు, పండ్లు లేదా జ్యూస్ లు లేదా టీ, కాఫీ లు తీసుకోవడం కూడా, మీ ఆరోగ్యానికి రక్షణయే అవుతుంది. మరియు శరీరానికి నీటి శాతంతో కూడిన ఆరోగ్యాన్ని పెంచగలిగే అవకాశం ఉంటుంది.Is Drinking Too Much Water Harmful To Our Health? in Telugu

ఇలాగా..మీరు చేసే పని, రోజువారీ దినచర్య ను దృష్టిలో ఉంచుకొని..మీరు తీసుకునే నీరు ఎంతవరకు మీకు తృప్తిని అనిపిస్తుంది?..తక్కువగా నీరు మీ శరీరంలో చేరిన భావన కలుగుతుందా? లేదా ఎక్కువ నీరు తాగిన భావన కలుగుతుందా? అనేది ఒక్కసారి మీది మీరు ఆలోచించి గ్రహించగలిగితే చాలు..సమస్యను మీరే పరిష్కరించుకునే జ్ఞానం రావడం జరుగుతుంది. 

ముందుగా, మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? అయినా సరే..మీరు తీసుకునే మందులతో పాటు, నీటిని తీసుకోవడం ఆరోగ్యాన్ని అందిస్తుంది అని వైద్యులు సూచించడం సహజం అయినప్పటికీ, ఎక్కువ మోతాదులో నీరు తీసుకోమన్నారు అని తాగడం మీకు ఎంతగా హాయిని కలిగిస్తుంది అని గమనించుకోవడం ముఖ్యం. ఎందుకంటే, ఇది అనుభవపూర్వకంగా తెలియజేస్తున్న విషయం..అధిక నీరు తీసుకుంటే..మీ లోపల మొదలయ్యే సమస్య వెంటనే మీకు తెలియకపోవొచ్చు.

కానీ, దీని నుండి శరీరం లోపల అవయవాలకు వాపుతో మొదలై హానికర పరిస్థితులను దరి చేర్చగలదు. అందుకే, ఒక్కోసారి వైద్యులు కూడా ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల సమస్య వచ్చింది అని చెప్పలేకపోవొచ్చు. ఎందుకంటే, మనం తీసుకునే నీరు మన శరీరానికి ఎంత సరిపోతుంది? సరిగ్గా మీ శరీరానికి ఎక్కువ నీరు చేరిందా? లేదా తక్కువ నీరు చేరిందా? అని వారు ముందుగా గమనించలేరు కదా! దీన్ని బట్టి, మన ఆరోగ్య సంరక్షణకు ముందు మనమే వైద్యులుగా జ్ఞానం సంపాదించడంలో ఎలాంటి తప్పు ఉండదు.

తెలిసి తెలియక అధిక నీరు తీసుకొని మీ ఆరోగ్యం విషప్రభావంను కలిగి ఉండడం మొదలయింది అంటే కూడా..వెంటనే జాగ్రత్త వహించగలిగితే..సమస్య పరిష్కారం అవుతుంది. సమస్య తీవ్ర స్థాయికి వెళ్ళినపుడు వైద్యుడి సలహాలు తప్పనిసరిగా తీసుకోండి.

 

 

Add Comment