How to Remove Pulipiri in Telugu | పులిపిర్లని ఏ విదంగా తొలగించుకోవాలి?

How to Remove and Treatment Pulipiri in Telugu-పులిపిర్లు తగ్గించటానికి అవసరమైన చికిత్స 

ఈ Pulipiri చర్మంపైన అసాధారణంగా పెరిగే ఒక రకమైన గడ్డలు. ఇవి శరీరంపైన ఏ బాగములోనైనా వచ్చే అవకాశం ఉంది,అయితే ఇవి ప్రధానంగా ముఖం,చేతులు,పాదాలలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ Pulipiri Human Papiloma Virus [HPV] అనే ఒక రకమైన వైరస్ వలన వ్యాపిస్తుంది అని పరిశోధనలో వెల్లడైంది.

ఇవి అంటుసంక్రమణ లక్షణాన్ని కలిగి ఉంటుంది,అంటే కొందరిలో  వీటిని తాకటం వలన ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వ్యాపిస్తాయి.

పులిపిర్లు వాటి ఆకారంలో విభిన్నంగా ఉంటాయి,అంటే అనేక రకాల ఆకారాల్లో శరీరంపై ఏర్పడి,చూడటానికి అందవిహీనంగా కనపడతాయి. అయితే ఈ పులిపిర్లకి ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన నివారణా చర్యలు ఏమీ లేవు.

ఇవి ఎవ్వరికైనా,ఈ వయస్సులో వారికైనా,రావటానికి అవకాశం ఉంటుంది. పులిపిర్లు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో రావటానికి ఎక్కువగా ఆస్కారం ఉంది.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో కొన్ని రకాల వైరస్లు మన శరీరం పైన దాడి చేయటం ద్వారా ఇవి ఏర్పడతాయి. ఈ పులిపిర్లు ఉన్నవారు వాటిని గిల్లటం,కాల్చటం మరియు కత్తరించటం వంటి పనులు చేయకూడదు.

పులిపిరి లోషన్ ఆన్లైన్లో కొనటానికి ఇక్కడ క్లిక్ చేయండి

పులిపిర్లు వచ్చిన వారిలో ఎటువంటి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేదు. వీటికి నివారణా చర్యలు లేకపోయినప్పటికీ,ఆధునిక వైద్యంలో “క్రియో థెరెపీ”అనే చికిత్స పద్ధతి అందుబాటులో ఉంది.

ఈ చికిత్స పద్ధతిలో శరీరమైన ఏర్పడిన పులిపిర్లని పూర్తిగా తొలగించటం చేస్తారు. కొందరిలో ఒకసారి ఈ విధంగా తొలగించిన తర్వాత కూడా,మళ్ళీ చర్మంపైన ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఇలాంటి వారిలో కొన్నిరకాల మందులను ఉపయోగించి శరీరంలో పులిపిర్లని ఎదుర్కునే యాంటీబాడీస్ ఉత్పత్తిని పెంచటం వలన మళ్ళీ పులిపిర్లు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.

How to Remove and Treatment Pulipiri in Telugu-పులిపిర్లు తగ్గించటానికి అవసరమైన చికిత్స 

Recommended Pulipiri Medicine

    

 

 

పులిపిర్ల రకాలు

సాధారణంగా పులిపిర్లు మన శరీరంలో ఏ బాగంలోనైనా రావచ్చును. అయితే పులిపిర్లు ఏర్పడే ప్రదేశాన్ని బట్టి కొన్ని రకాలుగా వ్యవహరిస్తారు. చేతి వేళ్ళ మధ్య,వేళ్ళ బాగంలో ఏర్పడే వాటిని “కామన్ పులిపిర్లు” అని పిలుస్తారు.

పాదాల మీద వచ్చే వాటిని “ప్లాంటార్ పులిపిర్లు” అని అంటారు. ముఖం మీద మరియు మెడ మీద వచ్చే వాటిని “ఫ్లాట్ పులిపిర్లు”అని పిలుస్తుంటారు. అయితే కొందరిలో వారి జననాంగాల మీద కూడా ఇవి వస్తాయి. ఇలా జననాంగాల మీద వచ్చే పులిపిర్లని “జనియాటల్ పులిపిర్లు” అని వ్యవహరిస్తారు. 

పులిపిరికాయలకి ఇంటి చికిత్స 

పులిపిర్లు మన శరీరానికి ఎటువంటి హాని కలిగించినప్పటికీ కొందరిలో ఇవి ఉండటం వలన ఆత్మనూన్యతా భావానికి లోనౌతారు. అందువలన వీటికి చికిత్సని కోరుకుంటారు.

తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడే మనకు అందుబాటులో ఉండే వస్తువులతో చికిత్స చేసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది.

యాపిల్ సిడర్ వెనిగర్

పులిపిర్లని తగ్గించటంలో యాపిల్ సిడర్ వెనిగర్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో “యాసిడ్” అధిక మోతాదులో ఉండటం వలన పులిపిర్లని తగ్గించటంలో ప్రధానపాత్ర పోషిస్తుంది.

దీనికోసం మీరు కొద్దిగా దూదిని తీసుకొని,వెనిగర్ లో ముంచి వీటి మీద రుద్దాలి. ఈ విధంగా రెండు నుండి మూడు వారాలు ప్రతి రోజూ క్రమం తప్పకుండా చేయటం వలన పులిపిర్లు మాయమవుతాయి.

బెస్ట్ పులిపిరి క్రీమ్ ఇక్కడ క్లిక్ చేసి అమెజాన్ లో కొనండి

బేకింగ్ పౌడర్

ఈ పులిపిర్లని తగ్గించుటలో బేకింగ్ పౌడర్ కూడా ఎంతో అద్భుతంగా పని చేస్తుంది. కొద్దిగా ఆముదం నూనె తీసుకొని,అందులో సరిపడా బేకింగ్ పౌడర్ వేసి బాగా కలిసేలా కలపండి.

ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు పులిపిర్ల మీద అప్లై చేసి,ఒక బ్యాండేజ్ వేసి కట్టు కట్టాలి. ఆ మరుసటి రోజు ఉదయం కొద్దిగా గోరువెచ్చని నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా మూడు నుండి నాలుగు రోజులు చేస్తే పులిపిర్లు మాయమవుతాయి.

How to Remove Pulipiri in Telugu

వెల్లుల్లి

ఏ విధమైన చర్మరోగ సంబంధ వ్యాధులకైనా వెల్లుల్లి ఎంతో అద్భుతంగా పని చేసే ఔషధం. వెల్లుల్లి లో “ఎల్లిసన్” అనే పదార్థం ఉండటం వలన ఫంగస్ మరియు బాక్టీరియా వంటి వాటితో పోరాడుతుంది.

అందువలన పులిపిర్లతో కూడా ఈ వెల్లుల్లి అద్భుతంగా పోరాడుతుంది. ఇందుకోసం కొన్ని వెల్లుల్లి రెబ్బలని తీసుకుని,మెత్తగా నూరి పేస్టులాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న పేస్ట్ ని పులిపిర్ల మీద ముద్దలాగా పెట్టాలి. ఇలా చేస్తే పులిపిర్లు కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి.

పైనాపిల్

పైనాపిల్ పులిపిరికాయలు తగ్గించటంలో సహాయపడుతుంది. దీనికోసం కొన్ని తాజాగా ఉండే పైనాపిల్ ముక్కలను తీసుకొని పులిపిర్లు ఉన్న ప్రదేశంలో అప్లై చేయటం వలన తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా రోజులో మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆముదం నూనె

ఈ ఆముదం నూనెని అనేక రకాల ఆయర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. ఆముదం నూనెకి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకస్థానం ఉంది. ఆముదం నూనెని  పులిపిరికాయలను తగ్గించటానికి ఉపయోగించవచ్చును.

ఆముదం నూనెని కొద్దిగా గోరువెచ్చగా చేసి పులిపిరి ఉన్నచోట అప్లై చేయవలెను. ఈ విధంగా రోజుకు రెండు నుండి మూడు సార్లు అప్లై చేయటం వలన ఒక వారంలో పులిపిరికాయలు తగ్గి,చర్మం సాఫ్టుగా తయారవుతుంది.

అరటి పండు యొక్క తొక్క 

సాధారణంగా అన్ని సీజన్లలో దొరికే పండు అరటి పండు. అరటి పండులో చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి. అరటి పండుతో పాటు అరటి తొక్క కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

పులిపిరికాయలని తగ్గించటానికి అరటి పండు తొక్కని వాడుకోవచ్చు. అరటి పండు తొక్కకి అతుక్కుని ఉండే లోపలి బాగంని పులిపిరి ఉన్నచోట రుద్దాలి. ఒక రోజులో నాలుగు నుండి అయిదు సార్లు అప్లై చేయటం వలన మంచి ఫలితం ఉంటుంది.

How to Remove Pulipiri in Telugu

తులసి ఆకులు 

మన దేశ ఆయుర్వేద చరిత్రలో తులసి ఆకులది ఒక ప్రత్యేకస్థానం. అనేక రకాల రోగాలకు తులసి ఆకులని వాడతారు. ఆయుర్వేద ఔషధాలలో తులసి ఆకులను విరివిగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇందులో వైరస్ ని ఎదుర్కునే యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

పులిపిర్లని తగ్గించటానికి కూడా తులసి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. తాజాగా ఉండే కొన్ని తులసి ఆకులని తీసుకొని మెత్తగా నూరి,పులిపిరి ఉన్న చోట అప్లై చేయాలి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత దాని మీద గాలి తగలకుండా ఒక టేప్ తో మొత్తం కవర్ అయ్యేలా చుట్టాలి.

ఇలా ఒక రోజంతా అలానే ఉంచి,మళ్ళీ కొత్తగా అప్లై చేయాలి. ఈ విధంగా చేస్తే అతి త్వరగా పులిపికాయలు రాలిపోతాయి.

విటమిన్ C మాత్రలు 

విటమిన్ C మాత్రలలో ఆమ్ల పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆమ్లం [అసిడిక్ ] పులిపిరికాయలని తగ్గించటంలో ఉపయోగపడుతుంది. ఈ మాత్రలు అన్నిరకాల మెడికల్ షాపులలో దొరుకుతాయి.

రోజుకు ఒక మాత్ర నీటిలో కలిపి మెత్తగా చేసి పులిపిరి మీద రాయండి. ఇలా చేస్తే తొందరలోనే పులిపిరికాయలు తగ్గిపోతాయి.

బెస్ట్ విటమిన్ C మాత్రలు అమెజాన్ లో పర్చేస్ చేయండి

                                                                               

ఉల్లిపాయ 

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే ఒక నానుడి ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. ఉల్లిపాయ సాధారణంగా ఏ వంటకం చేసిన కూడా అందులో వాడతారు. ఈ ఉల్లిపాయ పులిపిర్లని తగ్గించటంలో ఎంతో బాగా పని చేస్తుంది.

అందుకోసం ఒక 100 ML వెనిగర్ తీసుకొని అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసి రాత్రంతా నానబెట్టి,ఉదయాన్నే ఆ ఉల్లిపాయ ముక్కలని పులిపిరి ఉన్న చోట కొద్దిసేపు ఉంచాలి. ఇలా చేస్తే కొద్దిరోజుల్లోనే సమస్యనుండి బయట పడవచ్చు.

How to Remove Pulipiri in Telugu

బంగాళాదుంప 

బంగాళదుంపని సాధారణంగా వంటలలో వాడతారు. కానీ దీనితో పులిపిర్లని తగ్గించటానికి కూడా ఉపయోంచుకోవచ్చు. పచ్చి బంగాళాదుంపని గుజ్జులాగా చేసి పులిపిరి ఉన్న చోట అప్లై చేయాలి. గుజ్జు  ఆరిన తర్వాత ఒక శుభ్రమైన గుడ్డతో తుడిచివేయాలి. ఇలా చేస్తే పంచి ఫలితం ఉంటుంది.

 

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయ చేసి నలుగురికి  Share  చేయండి.

అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య విషయాలు మా నుండి పొందటానికి Subscribe చేసుకోండి.