నీరు ఒక అమూల్యమైన పదార్థం మరియు ప్రాముఖ్యత|Water is a precious substance and importance in Telugu

  విశ్వంలో ఒక్క “భూగ్రహం(Earth planet)” మీద మాత్రమే జీవం ఉండగలగడానికి కారణం “నీరు(water)”. ఈ నీరు, ప్రకృతి..సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపురూపమైన జల పదార్థం మరియు ప్రాణాధారం. అన్ని గ్రహాల్లో కెల్లా భూగ్రహంలోనే నీటిని కలిగి ఉండడం..దీని ద్వారా ప్రకృతి, పచ్చదనం, చెట్లు, వృక్షాలు, జంతువులు, మానవులు, ఇలా ఎన్నో..విశ్వంలోని సమస్తం “జలం” ఆధారితంగా బ్రతకడం అనేది ఒక అద్భుతమైన విషయంగా భావించాల్సి ఉంటుంది. నీరు లేనిదే ప్రకృతి లేదు, సకల జీవరాశి లేదు, ప్రపంచం లేదు, విశ్వం లేదు..

 అంతటి గొప్ప అమూల్యమైన పదార్థం(A precious substance) ఈ నీరు. ఈ నీరే “మానవ నాగరికత వికాసానికి” పునాది వేసింది(It was this water that laid the foundation for the “development of human civilization”). ప్రప్రథమంగా “జీవి పుట్టుక(Birth of the Creature)” నీటితోనే జరిగింది. నీరు లేకుండా ప్రపంచంలోని ప్రస్తుత జీవన గమనం ఉహించదానికి కూడా అవకాశం ఉండేది కాదు. అయితే, నీటి పుట్టుక, విశేషాలు, ప్రాముఖ్యతలు తెలుసుకుందాము. 

 సమస్త ప్రాణకోటికి అవసరమయ్యే నీటి ప్రాముఖ్యత(Importance of water for all life cycle) 

మన దైనందిన జీవితానికి నీరు చాలా అవసరం. నీరు మానవుల అస్తిత్వానికి అత్యంత ఆవశ్యకమైనది. మన శరీర వ్యవస్థ సున్నితంగా పనిచేయడానికి నీరు ఎంతో అవసరం.

మనం ఆహరం లేకుండా వారం రోజులు అయినా జీవించగలమేమో..కానీ, నీరు లేకుండా మనం 3 రోజులు కూడా జీవించలేము. మన శరీరంలో 70% నీరు ఉంటుంది. ఈ నీరు శరీరం సాధారణంగా పనిచేయడానికి సహాయపడుతుంది. మన శారీరక, మానసిక ఆరోగ్యానికి తగినంత నీరు తీసుకోవడం చాల ముఖ్యం. మన రోజువారీ పనులకు, మన నిత్యావసరాలకు కూడా నీరు చాలా అవసరం. మన నిత్యజీవితానికి నీటిపైనే ఆధారపడుతున్నాము.

నీరు లేని ప్రపంచం నిలకడ లేనిది. ఇది భూమండలంలోని సకల చరాచర జీవులన్నింటికీ ,మానవాళి అంతటికి, మొక్కలకు వర్తిస్తుంది. భూమికి తగినంత నీరు లేకపోతే..మొదటిది,

  • పచ్చదనం(the greenery) త్వరగా కనుమరుగవుతుంది.
  • అన్ని వృక్షాలు(the trees) త్వరగా చనిపోయి, బంజరుగా మారడానికి అవకాశం ఉంటుంది.
  • దీని ద్వారా వివిధ కాలాల ఉనికి(Existence of different tenses) నిలిచిపోతుంది.
  • భూమి అంతా ఒక భారీ, అంతులేని వేసవి(summer) అవుతుంది.
  • జలచరాల నివాసాలు(Aquatic habitats) కూడా తొలగించబడుతాయి.
  • వీక్షించడానికి తిమింగలాలు మరియు చేపలు(Whales and fish) ఉండవని దీని అర్ధం.
  • మనం నీటిని సంరక్షించుకోకపోతే(If water is not conserved), అన్ని జీవరాశులు చనిపోతాయి.

భూమిపై నీటి పుట్టుక యొక్క విశేషాలు(Features of the birth of water on earth) 

భూమిపై నీరు ఎలా ఎప్పుడు పుట్టింది అనేది గ్రహశాస్త్రం(Astronomy). ఖగోళ శాస్త్రం, ఖగోళ జీవశాస్త్ర(astrobiology) రంగాలలో పరిశోధన అంశంగా ఉండింది. సౌర వ్యవస్థలోని రాతి గ్రహాలలో “భూమి” ప్రత్యేకమైనది. దాని ఉపరితలంపై ద్రవరూప నీటి మహా సముద్రాలను కలిగి ఉన్న ఏకైక గ్రహం ఇది. ఇతర రాతి గ్రహాల కంటే ఎక్కువ నీరు భూమిపై ఎందుకు ఉంది అనే విషయం మానవ మేథస్సుకు పూర్తిగా అర్ధం కాలేదు. కానీ, భూమి పుట్టినప్పుడే ఉన్న పదార్థంలో నీరు ఉండి ఉండాలి. 4500 కోట్ల సంవత్సరాలుగా భూమిపై నీరు సమీకృతమై సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయమై అనేక పరికల్పనలు ఉన్నాయి.

నీటిని..“నీరు, ఉదకం లేదా జలం” అనే పేర్లు గల పదాలతో పిలవడం జరుగుతుంది..నీరు యొక్క సాంకేతిక నామం “H2O”. ప్రకృతిలో లభ్యమయ్యే నీరు అతిశుద్దమైన “వర్షపు నీరు(Rainwater)”. ఈ జలం సకల చరాచర జీవులన్నింటికీ కూడా అత్యవసర పదార్థం. మన భూమి మీద పెరిగే వృక్షాలు, జంతువులు, సర్వ మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు “గాలి” తర్వాత ముఖ్యమైనది “నీరు” అనే చెప్పాలి.

ప్రకృతి అందించిన పంచభూతాలలో గల నీటి చక్రం(The water cycle in the Panchabhutas provided by nature) 

నీరు ఈ భూమండలంపై 71% పైగా ఆవరించి ఉండి, మన ఈ భూతలంపై నాలుగింట 3 వంతులు ఉపరితల జలాల రూపంలో నీరును కలిగి ఉంది. అవి,

  1.  ఘన రూపం(Solid form) అనగా మంచు గడ్డల రూపంలోనూ(హిమానీనదాలు(Glaciers))(మంచు కొండలు(mountains of ice)).
  2. ద్రవ రూపం(liquid form) (సముద్రాలు, నదులు, తటాకములు మొదలైనవి)
  3. వాయు రూపంలో(in gaseous form)(మేఘాలు(Clouds), ఆవిరి(steam))Water is a precious substance and importance in Telugu

నీటి యొక్క పరిస్థితులు(Conditions of water) 

భూమిపై నీటిని 3 స్థితులలో చూస్తుంటాము. ఘన, ద్రవ, వాయు స్థితులు. అనగా..

  • నీరు సూర్యుడి వేడిమికి ఆవిరి రూపం ధరించి,
  • వాయు రూపం అనగా..మేఘాలుగా మారి చల్లదననాన్ని ఇస్తూ..
  • ద్రవ రూపంలోకి మారి ఆకాశం నుండి వర్షం రూపంలో తిరిగి భూమికి చేరుతుంది.
  • అలా కొనసాగే ప్రక్రియలో ప్రకృతిలోని సమస్త జీవరాశులకు నీటిని అందించి, భూగర్భజలం, నదులు, జలాశయాల రూపంలో ప్రవహించి తిరిగి సముద్రంలో కలుస్తుంది.
  • ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగడం ముఖ్యమైనది మరియు ఇది సృష్టి ధర్మం.
నీటి వనరులు(Water Sources) :

నీరు లభించే ప్రదేశాలు భౌగోళిక పరిస్థితులను బట్టి మారుతుంది. వీటి అన్నింటిని ఆ ప్రాంతపు “నీటి వనరులు” అంటారు.

  1. సముద్రాలు(the seas) : భూగోళం యొక్క జలావరణంలో ప్రధాన భాగం ఈ మహా సముద్రం లేదా మహాసాగరం..ఉప్పు నీటితో నిండిన ఈ మహాసముద్రాలు భూమి ఉపరితలంపై 71% గా విస్తరించి ఉంది. వీటి మొత్తం వైశాల్యం 36.1 కోట్ల చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలోని సముద్రపు జలాలలో దాదాపు సగ భాగం 3,000 మీటర్లుకు(9,800 అడుగులు) పైగా లోతైనవి.. సముద్రాల సెలైనిటీ(ఉప్పుదనం) దాదాపు మిలియన్ కు 35 వంతులు(3.5%). అని సముద్ర జలాల సెలైనిటీ మిలియన్ కు 31 నుండి 38 వంతులు ఉంటుంది. వ్యావహారికంగా 5 వేరు వేరు మహాసాగరాలుగా గుర్తిస్తారు. అవి, పసిఫిక్ మహాసముద్రం, అట్లాన్టిక్ మహా సముద్రం, హిందూ మహా సముద్రం, ఆర్కిటిక్ మహా సముద్రం, దక్షిణ మహా సముద్రం లేదా సదరన్ సముద్రం. ఈ 5 మహాసాగరాలు అని చెప్పబడుతున్న గాని ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయిన పెద్ద నీటి భాగాలు. కనుక, దీనిని “ప్రపంచ మహా సముద్రం” అని పిలువబడుతుంది. మహా సముద్రాలలో కొన్ని చిన్న భాగాలను “సముద్రాలు, సింధుశాఖలు” అంటారు. Water is a precious substance and importance in Telugu
  2. నదులు(rivers) : ఎతైన కొండల ప్రాంతాల్లో నుండి వర్షపు నీరు ప్రవహించి నదిగా మారుతుంది. వర్షపు నీటి వలన కానీ, ఎతైన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కానీ..చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ..అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహాంగా మారడమే “నది”గా పరిగణించబడుతుంది. చాలా వేగంగా పారుతూ..నదీ ప్రవహించే కొద్దీ, పెద్దదిగానూ, వెడల్పుగాను మారుతుంది. సాధారణంగా, పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి, వేల కిలోమీటర్లు ప్రవహించి, చివరికి సముద్రాలలో అంతమౌతాయి. సముద్రంలో కలిసే ముందు “డెల్టా” ప్రాంతంలో చాలా విశాలంగా ఉండి, నెమ్మదిగా ప్రవహిస్తుంది. భూమి “తూర్పు నుండి పడమటి”కి తిరుగుతుంది. కనుక, ఆ ప్రభావంతో చాలా నదులు తూర్పు వైపు ప్రవహిస్తాయి. చాలా తక్కువ నదులు మాత్రం తూర్పు నుండి పడమటికి ప్రవహిస్తున్నాయి. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి. పశ్చిమ అమెరికాలోని ఎడారులలోను, సౌదీ అరేబియాలోని ఎడారులలోను ఇలా భూమిలోకి ఇంకిపోయే నదులు ఉన్నాయి. ఇవి వర్షాలు పడ్డప్పుడు మాత్రం పొంగి పొర్లుతున్నాయి. వర్షం ఆగిపోగానే మిగిలిన నీరు నేలలోకి ఇంకిపోయి ఎండిపోతాయి. ఇలా..ఇంకిపోని నదులనే మనం “జీవనదులు” అంటాము. నేలలోకి ఇంకిపోగా మిగిలిన నీరే జీవనదులలో ప్రవహించేది. ఎంతనీరు ఇంకుతుంది అనేది నదీ గర్భం అడుగున ఉన్న రాతి పొరల లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అడుగున సున్నపురాయి(లైమ్ స్టోన్) ఉంటే..ఎక్కువ నీరు ఇంకే అవకాశం ఉంది. అడుగున నల్లసేనపు రాయి(గ్రానైట్) ఉంటే నీరు అంతగా ఇంకదు. ప్రపంచంలోని పెద్ద నదులు 10 ఉన్నాయి. ముఖ్యమైన నదులు 32 వరకు ఉండి..భారతదేశం నదుల దేశంగా పరిగణించబడడంలో అతిశయోక్తి లేదు.Water is a precious substance and importance in Telugu
  3. సరస్సులు(Lakes) : ఇది సముద్రం కాదు. చెరువు కంటే లోతైనది గా ఉంటుంది. నీటితో నింపబడి ఉంటే దానిని “సరస్సు” అంటారు. వైశాల్యంలో ఒక హెక్టార్ కంటే ఎక్కువగా ఉంటే..వాటిని మనం “సరస్సులు” అనవచ్చు. వైశాల్యంలో ఒక హెక్టార్ కు తక్కువ ఉంటే అవి “చెరువులు” అని అర్ధం. పెద్ద సరస్సుల కన్నా చిన్న చిన్న సరస్సుల సంఖ్య ఎక్కువ. ప్రపంచంలో గల సరస్సులలో 60% కెనడా దేశంలోనే కలవు. 1000 సరస్సుల ప్రదేశం అని “ఫ్లిన్డ్లాండ్ను(Flindland)” అంటారు. ప్రపంచంలో కెల్లా పెద్ద సరస్సు “విక్టోరియా” సరస్సు. భారత్ లో పెద్ద మంచి నీటి సరస్సు “ఊలార్” సరస్సు.Water is a precious substance and importance in Telugu
  4. చెరువులు(Ponds) : చెరువు లేదా జలాశయం మంచి నీరు నిలువచేయు ప్రదేశం. చాలా చెరువులు వర్షం మీద ఆధారపడుతాయి. మరికొన్ని చెరువుల అడుగున ఊటబావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిండి ఉంటాయి. భారతదేశంలో చాలా గ్రామాలలో చెరువు నీరు త్రాగడానికి ఉపయోగిస్తారు. కొన్ని పెద్ద చెరువులు పంటపొలాలకు నీరు అందిస్తున్నాయి. పూర్వకాలంలో మహారాజులు ప్రజల అవసరాల గురించి..రాజ్యంలో చెరువులు, నదుల మీద ఆనకట్టలు కట్టి, నీటిని నిలువ చేసే వాటిని కూడా చెరువులే అంటారు. ఇలా తయారైన “నాగార్జున సాగర్” ఒక సముద్రం లాగ ఉంటుంది. చెరువులలో 2 రకాలు ఉంటాయి. అవి, 1. మంచినీటి చెరువు : మంచి నీరు మాత్రమే ఉండేవి. 2. ఊర చెరువులు : పశువులను కడిగేందుకు, బట్టలు ఉతికేందుకు వినియోగిస్తారు. గొలుసు కట్టు చెరువులు : ఒక ఊరి చెరువు నిండిపోయి అలుగు పోస్తే..ఆ వృథా నీరు మరో పల్లెలోని చెరువు, కుంటల్లోకి వెళ్తుంది. దీన్నే “గొలుసుకట్టు చెరువులు” అంటారు. చేపల చెరువులు : చేపల పెంపకానికి ఉపయోగిస్తారు. చేపల కోసం చెరువు తవ్వకాల వల్ల సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లో తాగునీరు కలుషితమౌతుంది. మురుగు నీరు చెరువులు : మురుగు నీరు చేరి నిలువ చేయడం ద్వారా ఏర్పాటైన చెరువులు. దేవాలయాలలో చెరువులు : దేవాలయాలలో దేవుడి భక్తుల కోసం ఏర్పాటు చేసిన చెరువు. ప్రముఖమైన చెరువులు : మానస సరోవరం..టిబెట్, హుస్సేన్ సాగర్..హైదరాబాద్, సరూర్ నగర్ చెరువు..హైదరాబాద్, మీరు ఆలం చెరువు..హైదరాబాద్, కంభం చెరువు..ప్రకాశం జిల్లా, వైరా చెరువు..ఖమ్మం జిల్లా, పాకాల సరస్సు..వరంగల్ గ్రామీణ జిల్లా, కొత్త చెరువు..గాజుల రామారం. Water is a precious substance and importance in Telugu
  5. బావులు లేదా నూతులు(Innovations) : కొన్ని ప్రాంతాలలో మంచినీటి కోసం తయారు చేసుకున్న కట్టడాలను “బావులు లేదా నూతులు” అంటారు. బావులలో రకాలు..ఊట బావులు : ఈ బావులలో ప్రకృతి సిద్ధంగా నీరు ఊరుతుంది. అందువల్ల, ఇవి వేసవి కాలంలో కూడా ఎండిపోవు. దిగుడు బావి : ఈ బావులు భూమి ఉపరితలంపై కలిసి ఉంటాయి. అనగా వీటికి గట్లు ఉండవు. అందువల్ల వీటిలో పశువులు, చిన్న పిల్లలు పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కొన్నింటిలో దిగడానికి మెట్ల మార్గం కూడా ఉంటుంది. గొట్టపు బావి : ఈ బావులు యంత్రాల సహాయంతో భూమిలో చాలా లోతు వరకు తవ్వించి, క్రింది పొరలలో ఉన్న నీరును మోటారు పంపు ద్వారా బయటకు తీస్తారు. పట్టణాలలోని ఇండ్లలో బోరుబావి ని వేయించి వాడుతున్నారు. మరియు ఆధునిక వ్యవసాయంలో కూడా వీటిని ఎక్కువగా తవ్విస్తున్నారు. గిలక బావి : ఈ బావులు గట్టుతో ఉండి, సురక్షితమైనవిగా ఉంటాయి. చేద బకెట్ తో నీరు తోడుకోవడానికి మధ్యలో బావి గిలక నిర్మించబడి ఉంటుంది.
  6. భూగర్భ జలాలు(Ground water) : భూమి ఉపరితలంపై ఉన్న మట్టి పొరలలో కనపడే నీటిని కాకుండా, చాలా భూమి లోతులో రాతి పొరలలో ఉంటూ..పారే నీటిని “భూగర్భజలం” అని అంటారు. భూగర్భంలోని రాళ్ల స్వభావాన్ని బట్టి భూగర్భ జలం లభ్యమయ్యే పరిస్థితులు మారుతుంటాయి. మన రాష్టంలో పలు రకాల రాళ్లు ఉన్నాయి. అందులో, ఎక్కువ శాతం గట్టి రాళ్లే ఉన్నాయి. గట్టి రాళ్ళలో నీరు నిలవడానికి, పారడానికి కావాల్సిన గుణాలు తక్కువ. అందుకే, మన రాష్ట్రంలోని రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో భూగర్భ జలం సాధారణంగా తక్కువగా లభిస్తుంది. దానికి తోడు ఈ ప్రాంతంలో వర్షపాతం కూడా తక్కువ కావడంతో కరువులు తరచుగా ఏర్పడుతాయి. గోదావరి, కృష్ణ నదులు ప్రవహించే ప్రాంతాలలో ఎక్కువగా ఇసుక రాళ్లు ఉంటాయి. ఈ రాళ్ళలో అపారమైన భూగర్భ జల సంపద చాలా సమృద్ధిగా దొరుకుతుంది.  
నీరుకు సంబంధించిన జీవశాస్త్రం(Aquatic Biology) 

జీవం నీటి నుండి మొదలైంది. జీవుల్లో జీవ రసాయన క్రిములన్ని నీటి వల్లనే సంభవం అవుతుంది. జంతువుల శరీరంలో 70 – 90% వరకు నీరు ఉంటుంది. నీరు ముఖ్యముగా 2 రకాలు. అవి,

  1.  సముద్రపు నీరు(Sea water) లేదా ఉప్పు నీరు(salt water).
  2.  మంచి నీరు(Good water).

మంచి నీరు కంటే సముద్రపు నీరు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంది. ఎక్కువగా జీవులు సముద్రంలోనే వేరు వేరు లోతులలో జీవించడానికి తగిన వాతావరణ పరిస్థితుల్లో ఉంటాయి. జంతువులు నీటిని చర్మం ద్వారా పీల్చుకోవడం, తాగడం, ఇంకా జీవ ప్రక్రియలో వెలువడిన నీటిని వాడుకోవడం చేస్తాయి. జీవ వ్యవస్థలో నీరు మంచి ద్రావణి. ఇందులో చాల వరకు లవణాలు కరుగుతాయి. అందుకే దాన్ని “విశ్వవ్యాప్త ద్రావణి(universal solvent)” అంటారు. ఇంచుమించు అన్ని జీవరసాయనాలు నీటిలో కరుగుతాయి. ఇందువల్ల, నీరు జీవపదార్థాల రవాణాకు తోడ్పడుతుంది. ఉదాహరణకు : రక్తం, శోషరసం, మూత్రం.

భూమి పై నీరు ఉంటేనే మన బ్రతుకు..లేకుంటే నిర్జీవం(If there is water on earth, we cannot live without it)

భూమి యొక్క ఉపరితలంలో దాదాపు 71% నీటితో నిండి ఉంటుంది. భూమిపై సుమారు 1.386 బిలియన్ క్యూబిక్ కిలోమీటర్ల నీరు ఉంటుంది. దానిలో 97% ఉప్పు నీటి రూపంలో మహా సముద్రాలు మరియు సముద్రాలలో ఉంది.

భూమి యొక్క నీటిలో దాదాపు 2.8% మంచి నీరు ఉంటే, అందులోను 68.7% హిమానీ నదాలు అనగా..ఘనీభవించిన నదులు మరియు మంచు రూపంలో ఉంటాయి. మిగిలిన దానిలో అత్యధిక భాగం 0.62% భూగర్భ జలాలుగా ఉంది.

ప్రపంచంలో మనకి భూపరితలంపై అందుబాటులో ఉండే మంచి నీరు 1% అయితే, అందులో నదులలో ఉండేది 1% అంటే..1/100 వంతు మాత్రమే. ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఇక సరస్సు, చెరువులలో 1/2 వంతు ఉంటుంది. ఇంత తక్కువ నీటితో మనం మనుగడ సాదిస్తున్నాము.

ముగింపు(Conclusion) 

ఈ విశ్వంలో అమూల్యమైన పదార్థముగా ఉన్న నీరు..వాటి విశేషాలు, ప్రాముఖ్యతలు తెలుసుకున్నాము..

నీరు ఈ విశ్వంలో సముద్రాలు, నదులు, చెరువులు, బావులు, భూగర్భజలం రూపంలో మనకు లభిస్తుంది..వీటిని మనం మనకు దగ్గర్లో లభించే చెరువులు, బావుల ద్వారా తీసుకుని..తాగడానికి మరియు మన నిత్యావసరాలకు అవసరమయ్యే నీరును ఉపయోగించుకుంటున్నాము. అతి ముఖ్యమైన విషయం..తినడానికి ఆహారపదార్దాలు లేకపోయినా సరే కానీ, నీరు లేనిది ఒక్క రోజు కూడా బ్రతకలేము అనేది మనకు నిత్యసత్యంగా సమస్త జీవరాశికి అనుభవపూర్వకంగా తెలిసిన విషయమే అని చెప్పవచ్చు.. అందుకే, పంచభూతాలలో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. ఈ విశ్వం కోసం ప్రకృతి..దైవం అందించిన అపురూపమైన పదార్థముగా చెప్పబడుతుంది.

ఎన్నో రూపాల్లో లభ్యమయ్యే ఈ నీటిని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము..కలిగే లాభాలు, నష్టాలు గురించి తర్వాతి ఆర్టికల్స్ లో వివరిస్తాము..

Add Comment