“కుంకుడుకాయలు” ప్రకృతి అందించిన సహజమైన షాంపూ..మన కేశ సంపదను వృద్ధి చేయడంలో ఎన్ని లాభాలు అందిస్తాయో తెలుసా..?|Soap nuts has many benefits in boosting our hair growth and is a natural shampoo in Telugu

క్రూరరోగాలను సైతం కట్టిపెట్టే అంతటి శక్తి కలిగిన ప్రకృతి ప్రసాదం మన ఈ కుంకుడుచెట్టు మరియు కుంకుడుకాయలు(Our soap tree and soap nuts are a gift of nature that has the power to bind even the worst diseases) :

      మన జుట్టు కోసం ప్రకృతి అందించిన వరప్రసాదంలాగా కుంకుడుచెట్లను, కుంకుడుకాయలు మనకు అందుబాటులో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించి మన జుట్టును సంరక్షించుకోకుండా..రసాయనాలు కలిగిన షాంపూ లు ఉపయోగించి, జుట్టు సమస్యలు ఏర్పరుచుకొని, జుట్టుకు ఒక ఆకర్షణ అనేది లేకుండా చేసుకోవడం సరి అంటారా..?

   భారతీయ సాంప్రదాయపు అలవాట్లలో ముఖ్యముగా “కేశ సంపద(pilose)(Wealth of hair)”ను వృద్ధి చేసుకునేందుకు కుంకుడుకాయలు ఎంతగానో ఉపయోగపడేవి. ప్రతి గ్రామంలో “కుంకుడుకాయ చెట్లు(soap trees)” ఉండేవి. ఒకప్పుడు తలస్నానం చేయడానికి “కుంకుడుకాయల రసం(soap nuts juice)”ను వాడేవారు. అయితే, ఈ రోజుల్లో కుంకుడుకాయలతో తలంటు పోసుకోవడం అనేది చాలా తగ్గిపోయింది.

 అంతేకాదు, పూర్వపు రోజుల్లో వాతావరణం చాలా స్వచ్ఛమైనదిగా ఉండేది. ఎలాంటి కలుషితం అనేది ఉండేది కాదంటారు..అందుకు గాను, జుట్టు కు సంబంధించి ఎలాంటి సమస్య ఏర్పడేది కాదు మరియు చాలా ఆరోగ్యవంతంగా ఉండేది. ప్రస్తుతకాలం యొక్క పరిస్థితి ఎక్కడ చుసిన కలుషితం, పూర్తిగా వాతావరణం కలుషితం అయ్యేలాగా రసాయనాలను తెగ వాడేయడమే కాదు..రసాయనాలు ఉపయోగించి తయారు చేయని పదార్థం అంటూ లేదు..ఈ విధంగానే మన జుట్టు సమస్యలు కూడా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది.

     చిన్న పెద్ద తేడా లేకుండా త్వరగా తెల్లబడటం, జుట్టు రాలిపోయి, సన్నగా అవ్వడం, చుండ్రు సమస్యలు, చిట్లిపోవడం, త్వరగా తేమను కోల్పోవడం, బట్టతల రావడం, బయటకి వెళ్ళామంటే చాలు త్వరగా జుట్టు పొడి బారడం, తలపై కురుపులు..ఇలా ఎన్నో సమస్యలను చూస్తున్నాము. అందుకే, మన శరీరంలో జుట్టు కూడా అతి ముఖ్యమైన భాగం అని కూడా అనవచ్చు..ఎందుకంటే, ఎవరికైనా జుట్టు లేకపోతే వారి పూర్తి అందాన్ని పోగొట్టుకున్నవాళ్ళు అవుతారు. జుట్టుతోనే అందం వస్తుంది అని వేరే చెప్పనక్కర్లేదు..జుట్టు లేకపోతె లేదా జుట్టు పెరగడం లేదు అని ఎంతో మంది ఈ రోజుల్లో బాధపడడం మనం చూస్తూనే ఉంటాము.. 

      ప్రస్తుత కాలంలో రసాయనాలు కలిగిన షాంపూని వాడడం మాత్రమే జుట్టును శుభ్రం చేయగలదు దీనికి మించి ఇంకోటి లేదు అని ఆలోచించే పరిస్థితిలో ఉన్నాము. అందులోను రసాయనాలతో కూడినవి అని తెలిసిన కూడా రకరకాల షాంపూ లను వాడడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము..కానీ, పూర్వపు రోజుల్లో ఏ పదార్థాలతో జుట్టును శుభ్రం చేసుకునేవారు అనే ఆలోచన ఒక్కటే కాదు. ఎలా..జుట్టు ఒత్తుగా పెరుగుతూ, పోషణ కలిగి ఉండి, నల్లగానే ఉంటూ ఎంతో ఆకర్షణీయంగా ఉండేది అని ప్రతి ఒక్కరు గమనించగలిగితే పరిష్కార మార్గం తెలిసిపోతుంది..ఇందులో భాగంగానే కుంకుడు కాయలు చాలా శ్రేష్ఠమని ఈ రోజుల్లో ప్రతిఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

      భారతదేశంలోని ఆడవారికి ఉండే జుట్టుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి మన “అమ్మమ్మల కాలం(Grandmother’s Time)” వరకు కూడా చాలా మక్కువ ఉండేది అంతగా ఆకర్షితులు అయ్యేవారు..మన భారతీయ ప్రజల జుట్టు అంతగా ప్రసిద్ధి పొందింది మరియు మగవారికి ఉండే జుట్టుకు కూడా ఎంతో ప్రత్యేకత సంతరించుకునేది..ఒత్తుగా పెరగడం(Growing tall), మంచి పోషణ(good nutrition) కలిగి ఉండడం. అందుకే మగవారు కూడా జుట్టును పొడవుగా పెంచుకునే వారంట..అయితే, దీని అంతటికి కారణం ఒకే ఒక్క చక్కని సహజసిద్ధమైన ఔషధం కుంకుడుకాయలతో కూడిన షాంపూ(A good natural remedy is shampoo with soap nuts).. ఏ రంగంలోని ప్రముఖులకైనా కూడా ఎవరికైనా విగ్గు కావాల్సి వస్తే, భారతదేశములో లభించే ఈ జుట్టుతోనే తయారు చేసి, ఇచ్చే వారంట..ఇంతగా, లాభాలను కలిగి ఉండి, మనకు ఎలాంటి హాని కలగనివ్వకుండా జుట్టుకు కావాల్సిన పోషణను అందించడంలో ప్రకృతి ప్రసాదించిన కుంకుడుకాయ ఎప్పుడు ముందు స్థానంలో ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు కదా!

    అయితే, కుంకుడు చెట్టు “సపిండేసి(Sapindesi)” కుటుంబానికి చెందిన ఒక రకమైన వృక్షం. 20 మీటర్ల ఎత్తు వరకు పెరిగే ఆకురాల్చే మొక్క. ఈ మొక్కను “బంకమట్టి నేల(Clay soil)”పై మాత్రమే సాగు చేయవచ్చు. దీని నుండి లభించే కుంకుడు కాయల కోసం పెంచుతారు. ఇవి చలికాలంలో కాస్తాయి. వీటి మూలం భారతదేశం, చైనా మరియు నేపాల్ యొక్క ఉష్ణమండల ప్రాంతాలు..Soap nuts has many benefits in boosting our hair growth and is a natural shampoo in Telugu

కుంకుడుకాయకున్న ఇతర పేర్లు(Other Names of Soap nuts) :

      రీత/అరిత(Rita/Arita)(హిందీ), కుంకుడుకాయ(Kunkudukaaya)(తెలుగు), బూండి కొట్టై(Boondi Kottai)(తమిళం), పసక్కొత్తమారం(Pasakkottamaram)(మలయాళం), అమ్తలకాయి(Amthalakai)(కన్నడ), రితా(Rita)(బెంగాలి), అరితి(Ariti)(గుజరాతి), రింతి(Rinthi)(మరాఠీ).

     కుంకుడుకాయలను సబ్బుగింజలు(Soap nuts), రీతా(rita), సోప్ బెర్రీస్(soap berries) లేదా వాషింగ్ నట్స్(washing nuts) అని కూడా పిలుస్తారు. ఇవి సహజమైన జుట్టు సంరక్షణ ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రాచీనకాలం నుండి ఉపయోగించబడుతున్నాయి.

కుంకుడుకాయలు జుట్టుకు అందించే ప్రయోజనాలు(Benefits of soap nuts for hair) :

       ప్రస్తుత ఉరుకులపరుగుల జీవితంలో ప్రతిఒక్కరికి సమయం అనేది లేకపోవడంతో కెమికల్స్ తో తయారుచేసిన  షాంపూలు వాడడం మొదలుపెట్టారు..అయితే, ఈ షాంపూలతో వచ్చే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని తిరిగి పాత పద్ధతులకు (అదే “కుంకుడుకాయల రసంతో కూడిన షాంపూ(Soap nuts Juice Shampoo)”)కు ప్రాధాన్యతను ఇవ్వడంపై ఉత్సహంగా ఉంటున్నారు కొంతమంది..ఈ కుంకుడుకాయల వల్ల మన జుట్టు కలిగే పోషణ, ప్రయోజనాలు(Hair nutrition and benefits) తెలుసుకుందాము..Soap nuts has many benefits in boosting our hair growth and is a natural shampoo in Telugu

  1. కుంకుడుకాయల రసం జుట్టును శుభ్రం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇది “నాచురల్ షాంపు(As a natural shampoo)”గా పని చేస్తుంది. కుంకుడుకాయలోని “సెపోనిన్(seponin)” వలన నురగ తయారై తలపై ఉన్న మలినాలు తొలగి పోయి, వెంట్రుకలు శుభ్రపడుతాయి.
  2. తలంటుకి కుంకుడుకాయలను వాడడం చాలా మంచిది. ఎందుకంటే, దీని వల్ల వెంట్రుకలు ఆరోగ్యముగా ఉండడమే కాకుండా, మంచి పోషణను అందిస్తుంది. పేలు, చుండ్రు సమస్యలు(Dandruff problems) రావు.
  3. కానీ, కుంకుడుకాయలను వాడాలంటే కొంత శ్రమ ఉంటుంది. కాయలోని గింజలను చితక్కొట్టి తొలగించాల్సి ఉంటుంది. వాటిని వేడి నీటిలో నానబెట్టి ఆ రసంతో జుట్టును శుభ్రం చేసేవారు.
  4. ఆ తర్వాత శీకాకాయ పొడి మార్కెట్లో లభించడం ఆరంభమైంది. ఆ పొడిని నీటితో తడిపి, ఆ ముద్దతో తలరుద్దుకునేవారు. అయితే, ఈ రోజుల్లో శీకాకాయ పొడితో పాటుగా కుంకుడు పొడి కూడా లభిస్తుంది.
  5. కుంకుడు రసం “సూక్ష్మక్రిమి సంహారిణి(Microbicide)”గా పని చేస్తుంది. స్కాల్ప్ మీద ఫంగస్ పెరగడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. కురుపులు, చుండ్రు మొదలైన చర్మ సమస్యలు ఉంటే, తలస్నానం చేసినపుడు కుంకుడు రసంను ఉపయోగించడం అలవాటు చేసుకుంటే సరి, స్కాల్ప్ ను పూర్తిగా శుభ్రపరుస్తుంది. స్కాల్ప్ మీద “ఫంగల్ గ్రోత్(Fungal growth)” ఏర్పడే అవకాశం ఉండదు.
  6. కుంకుడుకాయల్లో ఉండే విటమిన్ ఏ, డి వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఇందులోని విటమిన్స్ జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇచ్చి, పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.
  7. కుంకుడుకాయల్లో ఉండే యాంటీ ఫంగల్(Antifungal), యాంటీ బాక్టీరియల్(antibacterial) లక్షణాల వలన జుట్టు రాలడం సమస్య(Hair fall problem)ల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.
కుంకుడుకాయ పొడి(soap nuts powder) :
  1. వేసవిలో కుంకుడుకాయలను బాగా ఎండబెట్టి పొడిచేసుకొని నిల్వ చేసుకోవచ్చు.
  2. దీనివల్ల తలస్నానం చేసే ప్రతిసారీ, కుంకుడుకాయలను దంచడం, నానబెట్టడం అనే శ్రమ తప్పుతుంది.
  3. ఎండబెట్టిన నారింజతొక్కలు(Orange peels), నిమ్మతొక్కలు(lemon peels), మందారఆకులు(hibiscus leaves), మందారపూలు(hibiscus flowers), ఉసిరి పొడి(amla powder), మెంతుల పొడి(fenugreek powder), వీటన్నింటిని కుంకుడుపొడిలో కలపవచ్చు.
  4. ఈ అన్నింటితో కలిపిన పొడితో తలస్నానం చేస్తే వెంట్రుకలు నల్లగా(Hair is black) ఉంటాయి. జుట్టు ఊడదు(Hair is black), జుట్టు తెల్లబడదు(Hair does not turn white), జుట్టు సిల్కీ(Hair is silky) గా తయారు అవుతుంది. కుంకుడుకాయలతో తలస్నానం చేయడం వల్ల కేశాలు జిడ్డులేకుండా శుభ్రపడుతాయి(Hair is cleansed without greasiness).
కుంకుడుకాయలతో ఇతర ప్రయోజనాలు(Other Benefits of Soap nuts) :
  • కుంకుడు రసంలో ఖరీదైన పట్టు, సిల్క్ చీరలను(Silk sarees) నానబెట్టి, ఉతికితే అవి ఎంతో మేలు చేస్తుంది మరియు మెరుస్తాయి.
  • కుంకుడు రసంలో బంగారు ఆభరణాలను(Gold ornaments) నానబెట్టి, మెత్తని బ్రష్ తో మృదువుగా రుద్దితే, అవి శుబ్రపడ్డాక ధగధగా మెరుస్తుంటాయి.
  • బాణలి, పెనం వంటి జిడ్డు పాత్రలను(Oily vessels) కుంకుడు పిప్పితో శుభ్రపరచవచ్చు.
  • ప్రసవమైన బాలింతరాలికి 11 వ రోజు పురిటి స్నానం చేయించబోయే ముందు రోజు ఇరుగుపొరుగు వారికి కుంకుడుకాయలు(soap nuts), నూనె(oil), సున్నిపిండి(flour), పసుపు(turmeric), కుంకుమ(saffron) తో పాటు మిఠాయిని పంచుతారు.
  • పూర్వపు రోజుల్లో పెళ్ళికి వచ్చిన వియ్యాల వారి విడిదిలో కుంకుడుకాయలు, కొబ్బరినూనె, పౌడర్, అద్దం ఉంచడం సాంప్రదాయం. ఈ విధంగా కుంకుడుకాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
కుంకుడుకాయలను ఎలా వాడాలి(How to use soap nuts) :

కుంకుడుకాయలను 2 రకాలుగా వాడవచ్చు. 1. రసం రూపంలో 2. పొడి రూపంలో ఉపయోగిస్తారు. కుంకుడుకాయలకు ఉసిరికాయలు, శీకాకాయలు కూడా జత చేసి వాడుకోవచ్చు.

  1. 10 లేదా మీకు సరిపోయినన్ని కుంకుడుకాయలను దంచి, అందులో ఉండే గింజలను తీసేయాలి.
  2. వలిచిన కుంకుడుకాయలను వేడి నీటిలో గాని రాత్రంతా నానబెట్టాలి. లేదా 15 నిమిషాలు గ్యాస్ పైన గాని మరిగించవచ్చు. ఆ తర్వాత, చల్లారనివ్వాలి.
  3. మరుసటి రోజు వడకట్టి, ఆ రసమును షాంపు లాగ తలకు పట్టించి, మసాజ్ చేసి, శుభ్రపరుచుకోవాలి.
  4. అయితే, గింజలతో సహా కుంకుడుకాయలను నానబెట్టిన రసమును వాడితే, జుట్టు పొడిగా అవుతుంది. అందుకే గింజలను తొలగించాలి.
  5. కుంకుడుకాయలను చల్లని నీటిలో నానబెడితే ఉపయోగం తక్కువ..అందుకే వేడి నీటిలో నానబెట్టాలి. జుట్టు మెత్తగా తయారు అవుతుంది.
  6. తయారు చేసిన రసంను ఒక 72 గంటల లోపు వరకు మాత్రమే ఉపయోగించుకుంటే మంచిది. ఆ తర్వాత మిగిలితే దాన్ని ఉపయోగించకుండా ఉండగలిగితే మంచిది.
  7. కానీ, కుంకుడుకాయలతో నాచురల్ షాంపు అనేది తయారు చేసే విధానం తెలిసిన కూడా పాటించడం సరియైనది అవుతుంది.

కేశ సంరక్షణలో ఎంతగానో ఉపయోగపడే ఈ కుంకుడు చెట్లను మరలా పెంచాలి. వాటిని సంరక్షించుకోవాలి.

కుంకుడుకాయలు చర్మానికి అందించే ఒక అద్భుతం(Soap nuts is a miracle for the skin) :

     కుంకుడుకాయలో సహజమైన కండిషనింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని తేమగా మార్చడంలో సహాయపడుతాయి. కాబట్టి, చర్మం పొడిబారకుండా ఉంటుంది. సున్నితమైన చర్మం కలిగిన వ్యక్తులు సబ్బుగింజల నుండి తయారు చేయబడిన ఉత్పత్తులను ఉపయోగించడం చాలా మంచిది ఎటువంటి హాని కలగదు. మరియు మరెన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా కుంకుడుకాయలు ఎంతో ప్రభావితంగా పని చేస్తాయి అని చెప్తున్నారు. 

ముగింపు(Conclusion) : 

       కుంకుడుకాయలు మన కేశ సంపదను వృద్ధి చేయడంలో ఎన్ని లాభాలను అందిస్తుందో తెలుసుకున్నాము.. కుంకుడు నుండి తీసిన రసం గాని లేదా గింజ తీసి వలిచి ఎండిబెట్టిన కుంకుడు ను పొడి చేసి గాని ఉపయోగిస్తే మనం మన జుట్టును ఎంతో ఆరోగ్యవంతంగా చూడొచ్చు. మనం పూర్తిగా కలుషితమైన వాతావరణాన్ని కలిగి ఉండి, ఎక్కడ చుసిన మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేలాగా రసాయనాలు నిండి ఉన్నాయి అని ప్రతి ఒక్కరికి తెలుసు..అవి ఎంత హానిని మనకు అందజేస్తున్నాయి అని గమనించాలి మరియు పూర్తి అవగాహన ఏర్పరుచుకోవడం ముఖ్యం..

      అవగాహన లేకుండా మన చర్మానికి, జుట్టుకు సరిపోతుంది ఎలాగైనా వాడేయొచ్చు అనేది మూర్ఖత్వం అవుతుంది. తగిన జాగ్రత్తలు పాటించడం సరియైనది. ఎందుకంటే, ఈ రోజుల్లోని కలుషితమైన వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, కుంకుడు అనేది మన జుట్టుకు, చర్మానికి ఎటువంటి హాని ని చేయకపోయినా కూడా పరిస్థితిని బట్టి వచ్చే మార్పులు గమనించుకొని సమస్య దేని నుండి ప్రారంభం అయింది అని తెలుసుకోవాలి. సొంత ఇంటి చిట్కాలతో వైద్య విద్యలు మీపై మీరు ప్రయత్నించండి..కానీ, ముందుగా పరీక్షించుకోవాలి..ఎక్కువగా ఏదైనా సమస్య అనిపిస్తే మాత్రం వైద్యుడి సలహా తప్పకుండా పాటించాలి. 

       కుంకుడు రసం తయారు చేయడానికి కొంచెం ఓపిక, శ్రమను మనం అందించగలిగితే, తిరిగి కుంకుడుకాయలు మన జుట్టును ఎంతో ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. పూర్వపురోజుల్లో పెంచినట్లే ప్రతి గ్రామంలో కుంకుడుచెట్లను పెంచి, వాటిని సంరక్షించుకోవడం మన ధర్మముగా భావిస్తే, పూర్వవైభోగం కళ ను చూసేవాళ్ళం అవుతాము. మరియు కుంకుడుకాయలు చేసే అద్భుతాలు తిరిగి మనం చేసే విధంగా, అనుభవించే విధంగా చేయొచ్చు. మన జుట్టు కోసం ఒక సహజమైన కుంకుడుకాయల రసంను వాడి మన ప్రకృతి వాతావరణాన్ని కూడా కలుషితం అవ్వకుండా చేయగలిగే భాద్యత మనపై ఉంది అని కూడా గుర్తుంచుకోవాలి. 

 

Add Comment