Neem Oil Uses in Telugu-వేపనూనె వాడటం వల్ల కలిగే ఉపయోగాలు
వేపనూనె చేదుగా ఉంటుందని చాలా మంది ఉపయోగించరు. కానీ ఈ Neem oil Benefits తెలిస్తే కచ్చితంగా ఉపయోగిస్తారు. జుట్టు పెరుగుదలకు,చర్మ సంరక్షణకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా e వేపనూనె ఉపయోగపడుతుంది. Neem oil మన ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది.
ఈ వేప నూనెని వేపచెట్టు నుండి తయారు చేస్తారు. వేపచెట్టు యొక్క గింజలను తీసి ఎండలో ఎండబెట్టి ఒక సంగ్రహణ పద్ధతిలో నూనెని తయారుచేస్తారు. వేపనూనె చాలా ఘాటయిన వాసన కలిగి ఉండి,పసుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది.
ఈ వేపనూనెని మన దేశంలో అనేక రకాల సౌందర్య ఉత్పత్తులు,సేంద్రీయ వ్యవసాయం మరియు ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వేపనూనె యాంటీబ్యాక్తీరియా మరియు యాంటీఇన్ఫ్లమ్మెటరీ లక్షణాలు కలిగి ఉంటుంది.
బెస్ట్ వేపనూనెని ఇక్కడ క్లిక్ చేసి కొనండి
వేపనూనెతో వేపసబ్బులు,షాంపూలు వంటి అనేక రకాల Neem oil benefits in Telugu చర్మ సంబంధ ఉత్పత్తులలో విరివిగా ఉపయోగిస్తారు.
సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు తమ పంట పొలాల్లోని మొక్కలకు ఎలాంటి తెగుళ్లు,కీటకాలు దరిచేరకుండా ఈ వేపనూనెని వాడుతారు.
వేపనూనెకి చేదు మరియు గాటు వంటి లక్షణాలు ఉండటం వలన ఇళ్లల్లో ఉండే క్రిములు,కీటకాలు,నల్లులు,బొద్దింకలు వంటి వాటిని బయటకి పారదోలటంలో ఎంతగానో సహాయపడుతుంది.
వేపనూనె ప్రయోజనాలు-Neem Oil Benefits
ఈ వేపనూనెని ఆయుర్వేదం,హ్యూమియోపతి,యునాని వంటి వాటిలో విరివిగా వాడుతున్నారు. ఆధునిక వైద్యంలో అనేక రకాల వ్యాధులకు ఈ వేపనూనెని ఉపయోగిస్తున్నారు .
నోటి ఆరోగ్యం
ఏ వయస్సువారికి అయినా నోటి సంరక్షణ చాలా ప్రధానమైనది. నోటి సంరక్షణ లేకపోవటం వలన అనేక రకాల వ్యాధులకు దారితీస్తుంది. దంత సంరక్షణ సరిగ్గా లేకపోతే దంతాలపై పచ్చటి పొర ఏర్పడి అనేక రకాల బ్యాక్తీరియా అభివృద్ధి చెంది,దంతక్షయం వంటి రోగాలు రావటానికి దారితీస్తుంది.
వేపనూనె దంతక్షయం వంటి రోగాలు రాకుండా మరియు వచ్చిన నోటి వ్యాధులు నయం చేయటంలో ఉపయోగకారిగా ఉంటుంది.
గర్భ నియంత్రణ
గర్భ నిరోధకం అనేది అవాంఛిత గర్బాలని నిరోధించటానికి ఒక సురక్షితమైన పద్దతి. చాలా రకాల దేశాలలో గర్భనిరోధక మందులు చాలా వ్యయంతో కూడినదిగా ఉంది.
వేపనూనె గర్భం రాకుండా నిరోధించడంలో సహాయపడుతుంది అని అనేక రకాల పరిశోధనలలో వెల్లడైంది. వేపనూనెని యోనిలో రాయటం వలన వీర్యకణాలు అండం వరకు చేరకుండా నిరోధిస్తుంది అని ప్రీక్లినికల్ పరిశోధనలలో నిరూపించబడింది.
అదేవిదంగా ఈ వేపనూనెని వాడటం వలన ఎటువంటి దుష్ప్రవం చూపలేదని వెల్లడైంది.
కణితి గాయాలను తగ్గించటం
Neem oil కణితి [నెత్తి ] గాయాలని తగ్గించటంలో సహాయపడుతుంది. కొన్ని రకాల చర్మ రోగాలకు ఆపరేషన్ చేయటం ద్వారా ఏర్పడే గాయాలకు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.
అలాగే చర్మం తొలగించి ఆపరేషన్ చేయటం వలన స్కిన్ ఇన్ఫెక్షన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా నెత్తి మీద వచ్చే చర్మ కాన్సర్ ఆపరేషన్లకి తరచూ చర్మం తొలగించి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది.
తామర మరియు సోరియాసిస్
వేపనూనె తామర మరియు సోరియాసిస్ వంటి రోగాలకు చాలా అద్భుతంగా పని చేస్తుంది. Neem oil లో విటమిన్ ఇ,ఎమినో ఆసిడ్స్ మరియు కొవ్వు ఆమ్లాలు వంటివి పుష్కలంగా ఉండటం వలన చర్మ రోగాలకు చాలా బాగా పనిచేస్తుంది.
1/2 టీ స్పూన్ ఆలివ్ నూనె తీసుకొని,అందులో 8 నుండి 10 చుక్కల వేపనూనె వేసి తామర మరియు సోరియాసిస్ సమస్య ఉన్నచోట పూయటం వలన తొందరగా ఉపశమనం కలుగుతుంది. అమెజాన్ ఆన్లైన్లో బెస్ట్ వేపనూనెని కొనండి
మొటిమలు
వేపనూనెలో యాంటీ ఇన్ఫలమేటరీ,యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు అధిక మోతాదులో ఉండటం వలన మొటిమలు తొలగించటంలో సహాయపడుతుంది.
దీనికి ఒక టీ స్పూన్ వేపనూనె మరియు టీ స్పూన్ ఆలివ్ నూనె తీసుకొని రెండింటిని బాగా కలిసేలా కలపాలి. ఆ తర్వాత మొటిమలు ఉన్న చోట మృదువుగా అప్లై చేసి,ఒక గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా ఒక రెండు వారాలు చేస్తే మంచి పలితం ఉంటుంది.
గోరుచుట్టు
వేపనూనెలో యాంటీ బాక్టీరియా మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన గోరుచుట్టు సమస్యని తగ్గించటంలో చాలా అద్భుతంగా పని చేస్తుంది.
దీనికోసం కొద్దిగా వేపనూనె తీసుకొని,గోరువెచ్చగా వేడిచేసి గోరుచుట్టు సమస్య ఉన్న ప్రాంతంలో మృదువుగా అప్లై చేయాలి. ఈ విధంగా రోజూ ఉదయం మరియు సాయంత్రం రెండు పూటలా అప్లై చేయటం వలన గోరుచుట్టు సమస్య రెండు వారాలలో తగ్గుతుంది.
నల్లటి మచ్చలు
వేపనూనె నల్లటి మచ్చలను తగ్గించటంలో ప్రయోజనకారిగా ఉంటుంది. మనం ఎండలో బయట తిరగటం వలన దుమ్ము,ధూళి మరియు సూర్యరశ్మి కారణంగా చర్మం పైన,అలాగే ముఖం మీద నల్లటి మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది.
ఇలాంటి సమస్యకి వేపనూనె చాలా బాగా పని చేస్తుంది. ఎందుకంటే వేపనూనెలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫలమేటరీ వంటి సూక్ష్మ లక్షణాలు కలిగి ఉండటం వలన నల్లటి మచ్చలను తగ్గిస్తుంది.
అందుకోసం కొద్దిగా దూది తీసుకొని వేపనూనెతో తడి చేసి మచ్చలు ఉన్న చోట మృదువుగా అప్లై చేయాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
జుట్టు సంరక్షణ
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి జుట్టు సంరక్షణ అనేది చాలా ప్రధానంగా మారింది. అనేక మంది యువత హార్మోన్స్ ప్రభావం,ఒత్తిడి మొదలైన కారణాల వలన చిన్న వయస్సులోనే జుట్టు ఊడిపోవటం మరియు జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఇలాంటి వారు రోజూ మిగతా నూనెలకి బదులు వేపనూనెని రాయటం వలన క్రమంగా జుట్టు తెల్లబడే ప్రక్రియ ఆగిపోతుంది మరియు జుట్టు ఊడిపోవటం సమస్య తగ్గుతుంది. అలాగే కొందరిలో డాండ్రఫ్ సమస్య వేధిస్తుంది. బెస్ట్ వేపనూనెని ఇక్కడ ఆన్లైన్ లో కొనండి ఇలాంటివారు కూడా వేపనూనెని అప్లై చేయటం ద్వారా కొద్దిరోజుల్లోనే ఉపశమనం పొందవచ్చు. పేలు అనేది ఒక రకమైన పరాన్నజీవి. ఈ పేలు సాధారణంగా పాఠశాలలకు వెళ్లే పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది.
అలాగే ఇది ఒకరినుండి ఒకరికి చాలా సులభంగా వ్యాపిస్తుంది. ఈ పేనుని తగ్గించటంలో వేపనూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పేలు ఉన్నవారు ఈ వేపనూనె రాత్రి పడుకునే ముందు కొద్ది కొద్దిగా తీసుకుని తలకి పట్టించాలి.
ఆ తర్వాత ఒక టవల్ తీసుకొని వెంట్రుకలు మొత్తం కవర్ అయ్యేలాగా కట్టుకొని,ఉదయాన్నే దువ్వెనతో దూసుకుంటే పేలు చనిపోవటం మీరు చూడవచ్చు. తర్వాత షాంపూతో స్నానం చేయటం వలన పేలు సమస్య తగ్గుతుంది.
ముడతలను తగ్గిస్తుంది
దాదాపుగా అందరికి ఒక వయస్సు రాగానే ముఖం మీద ముడతలు రావటం సర్వ సాధారణం. అయితే ఈ వేపనూనెను తరచూగా ముఖం మీద మరియు చేతులకి అప్లై చేయటం వలన ముడతలు తొందరగా రాకుండా అడ్డుకట్ట వేయగలుగుతుంది.
అంతేకాకుండా చర్మం మృదువుగా మరియు సున్నితంగా మారి నిగారింపు వస్తుంది.
క్యాన్సర్ కు వేపనూనె
తొలి దశలో ఉండే క్యాన్సర్ కి వేపనూనె ఎంతో ప్రయోజనకారిగా పనిచేస్తుంది. క్యాన్సర్ లో ఊపిరితిత్తుల క్యాన్సర్,రొమ్ము క్యాన్సర్,చర్మ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సలు ఉంటాయి.
ప్రస్తుతం ఉన్న వైద్య విధానంలో రేడియో థెరపీ,కీమో థెరపీ మరియు సర్జరీ వంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ చికిత్సా విధానాల వలన చర్మం పొడిబారటం,జుట్టు ఊడిపోవటం,అలసిపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వేపనూనె రొమ్ము క్యాన్సర్ కణాలలో ఉండే [సెల్ డెత్] ని ప్రేరేపిస్తుంది అని మరియు రొమ్ము క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా నిరోదించటంలో సహాయపడుతుంది అని ఒక క్లినికల్ అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు కనుగొనటం జరిగింది.
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.
అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.