ఋతుస్రావం నెలకి 2 సార్లు వస్తుందా? రక్తస్రావ రంగులో తేడాలున్నాయా?|Menstruation 2 times a month? Are there differences in the color of the bleeding? in Telugu

   ప్రతినెలా స్త్రీలకు రుతుక్రమం సహజప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది. రుతుక్రమ సమయంలో ఏ సమస్యలు లేనంత వరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, మీ నెలసరి సమయంలో జరిగే మార్పులు, రుతుక్రమ సమస్యలకు సూచనలు అందజేస్తాయి. వాటిని గుర్తించి చికిత్స తీసుకుంటే, మొదటి దశలోనే సమస్య కు పరిష్కార మార్గం దొరుకుతుంది.

రుతుక్రమం నెలలో 2 సార్లు రావడానికి కారణాలు(Reasons for Menstruation to Come 2 Times in a Month)

సాధారణంగా మహిళల్లో రుతుక్రమం 28 రోజులకు ఒకసారి వస్తుంది. చాలా మంది మహిళలు రుతుక్రమం సమయంలో ఇబ్బందులు పడుతుంటారు. కొందరి మహిళల్లో రుతుక్రమం క్రమంగా వస్తూ ఉంటాయి. అలా కాకుండా, అకస్మాత్ గా ఒక్కోసారి నెలలో 2 సార్లు రుతుక్రమం వస్తూ ఉంటుంది. దీనికి కారణం, శరీరంలోని హార్మోన్ల బ్యాలన్స్ సరిగా లేకపోవడం. మరికొందరి మహిళల్లో యుక్తవయస్సు నుండి రెండుసార్లు వస్తుంటుంది. ఇది సమస్య కాదు. కానీ, అకస్మాత్ గా ఒకే నెలలో రెండు సార్లు రుతుక్రమం వస్తూ ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలి.Menstruation 2 times a month? Are there differences in the color of the bleeding? in Telugu

    పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ సమస్యలు, గర్భనిరోధక మాత్రలు, యాంటీ డిప్రెషన్ మందులు వాడటం, పీసీఓడీ, శక్తికి మించిన వ్యాయామం చేయడం, గర్భ సంబంధిత ఆపరేషన్లు..అనేవి ఇరెగ్యులర్ పీరియడ్స్ కి కారణం అవుతాయి. తద్వారా, ఈ సమస్యలు రుతుక్రమంలో మహిళలకు ఇబ్బందిని కలిగిస్తాయి.Menstruation 2 times a month? Are there differences in the color of the bleeding? in Telugu

  • ఒత్తిడి(Stress) : కుటుంబంలో ఒత్తిడి, పని ఒత్తిడి ప్రభావంతో కూడా రుతుక్రమంలో మార్పులు రావడం జరుగుతుంది. శరీరంలోని హార్మోన్లు ఒత్తిడికి గురి కావడం ద్వారా ఒకే నెలలో రెండు సార్లు రక్తస్రావం జరుగుతుంది. అయితే, కేవలం ఒత్తిడి మాత్రమే కారణం అని చెప్పలేము. శరీరంలోని వేడి కారణంగా కూడా ఒక్కోసారి 2 సార్లు వస్తుంది.
  • శరీర బరువులో మార్పులు(Changes in body weight) : శరీర బరువు ఎక్కువ, తక్కువ అవడం వంటి మార్పులు వస్తే రుతుక్రమం సరిగ్గా రాకపోవడానికి కారణం కావొచ్చు. కొందరి స్త్రీలలో రుతుస్రావం ఎక్కువ రోజులు లేదా తక్కువ రోజులు అవ్వొచ్చు. ఇంకా కొందరిలో రెండు వారాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. దీనికి హార్మోన్ల అసమతుల్యతే కారణం.
  • థైరాయిడ్ సమస్య(Thyroid problem) : ఈ సమస్య ఉండడం వల్ల కూడా ఒకే నెలలో రెండు సార్లు పీరియడ్స్ వస్తూ ఉంటాయి. థైరాయిడ్ ఫంక్షన్ అనేది ఋతుస్రావంలోని యోని స్రావంతో ముడిపడి ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి నుండి ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజెన్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. థైరాయిడ్ సమస్య కూడా ఇరెగ్యులర్ పీరియడ్ కు కారణమౌతాయి.
  • గర్భనిరోధక మాత్రలు(Contraceptive Pills) : గర్భనిరోధక మాత్రలను వాడకం కూడా ఒకే నెలలో రెండు సార్లు పీరియడ్ రావడానికి కారణమౌతుంది. కడుపులోని ఫైబ్రాయిడ్లు రక్తం గడ్డకట్టడం, అధిక రక్తస్రావం జరగడానికి కారణమౌతుంది.
  • ఫైబ్రాయిడ్స్ లేదా తిత్తులు(Fibroids or cysts) : ఋతుస్రావ సమయంలో ఈ ఫైబ్రాయిడ్స్ మూలంగా ఆటంకం అనేది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల కూడా మీ పీరియడ్స్ అనేవి క్రమరహితంగా మారడం జరుగుతుంది.
  • లైంగిక అంటువ్యాధులు(Sexually Transmitted Infections) :క్లామిడియా మరియు గోనేరియా” వంటి లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు. ఇది గర్భాశయం యొక్క వాపును కలిగిస్తుంది. ఇది ఋతు సమయ వ్యవధి అనేది క్రమరహితంగా, అసాధారణంగా చేయడానికి ఒక కారణం అవుతుంది.

ఋతుస్రావ రక్తం యొక్క రంగును బట్టి కలిగే సమస్యలు, మార్పులు(Problems and changes due to the color of menstrual blood) 

    ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నపుడు పీరియడ్స్ సమయంలో బయటకు విడుదలయ్యే “రుతు రక్తం రంగులోనూ” తేడా కన్పిస్తుంది. ఇలా రంగులో తేడా ఉంటే అది స్త్రీలలో వ్యంధత్వం లేదా బ్యాక్టీరియా సంక్రమణ లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులకు సంకేతం అని కూడా గుర్తించవచ్చు. ఇదేమి ఆరోగ్యకరమైన లక్షణం కాదు. పీరియడ్స్ లో రంగు మారితే..వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.Menstruation 2 times a month? Are there differences in the color of the bleeding? in Telugu

రుతుస్రావ రంగును బట్టి తెలిపే వ్యాధులు(Diseases that are indicated by the color of menstruation) 

  • నారింజ రంగు(Orange Color) : పూర్తి ఆరోగ్యవంతులుగా ఉన్నట్లు సూచించే రక్తస్రావం యొక్క రంగు ఇది.
  • ప్రకాశవంతమైన ఎరుపు(Bright Red) : ప్రిమెన్స్ట్రుల్ సిండ్రోమ్ అంటే..మానసిక కల్లోలం అని సూచన. రుతుక్రమం ప్రారంభంలో తేలికపాటి పొత్తికడుపు నొప్పి ఉంటుంది. అదే సమయంలో ప్రకాశవంతమైన ఎరుపు రక్తస్రావంను గమనిస్తే అది గర్భస్రావం , ఫైబ్రాయిడ్ గర్భాశయం, గర్భాశయ పాలిప్, ఎక్టోపిక్ గర్భం తదితర పరిస్థితులను సూచిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు కలిగిఉన్నపుడు సూచించే రంగు. ఇంకా..
  • లేత గులాబీ(Light pink) : రక్తహీనతను సూచించే రంగు. రక్తం లైట్ పింక్ కలర్ లో వచ్చినట్లయితే, ఈస్ట్రోజెన్ లెవల్స్ తగ్గినట్లు అర్ధం. దీనివల్ల, శృంగారం పట్ల ఆసక్తి లేకపోవడం, వెంట్రుకలు ఊడడం జరగవచ్చు.
  • పసుపు(Yellow) : రక్త లోపం యొక్క నిర్దారణ చేసే రంగు.
  • మెరూన్(Maroon) : అధిక ఈస్ట్రోజన్ కారణంగా ఈ రంగు సూచిస్తుంది. కొందరికి రక్తం బ్రౌన్ లేదా డార్క్ కలర్ లో వస్తే..అప్పుడు మరీ ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. పాత రక్తం బయటకి రావడం వల్ల ఇలా జరుగుతుంది.
  • గోధుమ రంగు(Brownish) : తక్కువ ప్రొజెస్టరాన్ ను కలిగి ఉన్నపుడు ఈ రంగును సూచిస్తుంది.
  • బూడిద రంగు(Gray Color) : బాక్టీరియా ఇన్ఫెక్షన్ ను కలిగి ఉన్నట్లు ఈ రంగు తెలుపుతుంది. ఇది ఇన్ఫెక్షన్స్ కి, గర్బిణీలలో మిస్ క్యారేజ్ కి సూచన.
  • ఊదా రంగు(Purple) : ఈస్ట్రోజెన్ లెవల్స్ చాలా ఎక్కువగా ఉన్నట్లు అర్ధం. ఇలా..ఎక్కువ ఈస్ట్రోజన్ కలిగి ఉంటే, అధిక రక్తస్రావం, పి సి ఓ ఎస్, లాంటి సమస్యలతో భాదపడుతున్నపుడు సూచించే రంగు ఇది. 
  • నలుపు రంగు(Black Color) : చాలా మందంగా మరియు నలుపు రంగులో రావడానికి అర్ధం వచ్చేసి..ముందు నెలసరిలోని మిగిలిపోయిన రక్తస్రావాలు బయటకి రావడాన్ని ఈ రంగు సూచిస్తుంది. పీరియడ్స్ రంగు మొదట్లో ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటుంది. పీరియడ్స్ పురోగమిస్తున్న కొద్దీ నెమ్మదిగా రక్తం గోధుమ లేదా నలుపు గోధుమ రంగులోకి మారుతుంది. గర్భాశయ లైనింగ్ నెమ్మదిగా పడిపోవడం లేదా మునుపటి ఋతుచక్రపు లైనింగ్ అవశేషాలు బయటకు రావడం వలన కావొచ్చు.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి(When to consult a doctor) ?
  • ఋతుస్రావ రక్తం యొక్క రంగు అసాధారణమైన బూడిద, పసుపు, నారింజ, ఆకుపచ్చ రంగులో బయటకు వస్తున్నపుడు లేదా దుర్వాసనతో వస్తుంటే అది లైంగికంగా సంక్రమించే వ్యాధులకు సంకేతం కావచ్చు.
  • అలాగే, తరచుగా పీరియడ్స్ మిస్ అవుతుంటే, లేదా 7 – 8 రోజుల కంటే ఎక్కువ కాలం పాటు పీరియడ్స్ రావడం, ముద్దలు ముద్దలుగా పీరియడ్స్ రావడం జరుగుతున్నట్లయితే..ఫెర్టిలిటీ వైద్యుడిని సంప్రదించాలి.Menstruation 2 times a month? Are there differences in the color of the bleeding? in Telugu

మీ ఋతుస్రావంలో వచ్చే దుర్వాసనకు వివరణ(Explanation of bad smell in your period) 

     నెలసరి సమయంలో వచ్చే దుర్వాసనను చాల మంది తేలికగా తీసుకుంటారు. అయితే, కొన్ని కేసుల్లో “గర్భాశయ క్యాన్సర్(Cervical Cancer)”కు సంకేతం కావొచ్చు అంటున్నారు నిపుణులు. ఈ వ్యాధి ఉన్న వారిలో అధిక రక్తస్రావం, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. ముఖ్యముగా కుళ్ళిన వాసన వస్తున్నట్లయితే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించడం తప్పనిసరి అని తెలుసుకోవాలి.

    సాధారణంగా ఋతుస్రావ సమయంలో లోదుస్తులు పరిశుభ్రముగా ఉంచుకోవడం ముఖ్యం. తర్వాత, నెలసరి కోసం ఉపయోగించే ప్యాడ్ లు ప్రతి 4 గంటలకు ఒకసారి మార్చుకోవడం చేస్తూ ఉండాలి. దీనివల్ల, లీకేజి సమస్య నుండి విముక్తి ని కల్గిస్తూ..ఇన్ఫెక్షన్స్ బారి నుండి మనకు సంరక్షణగా ఉంటుంది.

ఋతుస్రావంలో ఉపయోగించే ప్యాడ్స్ లో రకాలు(Types of pads used in menstruation) :

మార్కెట్ లో లభించే ప్యాడ్స్ లో రసాయనాలు, పరిమళాల వాడకం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా, ఈ రసాయనాలు రక్తస్రావంతో కలిసినపుడు ఒక రకమైన దుర్వాసన వెలువడడం జరుగుతుంది. పైగా ఈ ప్యాడ్లు ఆరోగ్యానికి హానికరం అవుతుంది. కాబట్టి, వీటికి బదులు కాటన్, మైక్రోఫైబర్ తో తయారు చేసిన సహజసిద్ధమైన ప్యాడ్స్ ను ఎంచుకుంటే..సురక్షితంగా ఉంటుంది.Menstruation 2 times a month? Are there differences in the color of the bleeding? in Telugu

ఋతుస్రావంలో ఉపయోగించే కప్స్(Menstrual cups) : ప్యాడ్స్ కు బదులుగా నెలసరి సమయంలో కప్స్ వాడకం వల్ల కూడా దుర్వాసనను చాల వరకు తగ్గించుకోవచ్చు అని తెలుస్తుంది. అయితే, ఈ కప్స్ ను కూడా ప్రతి 6 గంటల కు ఒకసారి శుభ్రం చేస్తూ..వాడాల్సిన అవసరం ఉంటుంది.Menstruation 2 times a month? Are there differences in the color of the bleeding? in Telugu

ముగింపు(Conclusion) 

నెలకు 2 సార్లు రుతుస్రావం రావడం..అనగా..ప్రతి 15 రోజులకు ఒకసారి రుతుస్రావం రావడం అనేది ఆందోళన కలిగిస్తున్నాయా? ఋతుస్రావం యొక్క రంగులో తేడాలు అనుభవిస్తున్నారా? అయితే, వీటి గురించి వివరంగా తెలిజేసి ఉన్నాము..అలాగే, మీరు ఋతు సమయంలో దుర్వాసను కూడా కలిగి ఉన్నట్లయితే..ఋతు పరిశుభ్రత ఎలా ఉండాలి అనేది తెలిజేసి ఉన్నాము..

కాబట్టి, ముందుగా ప్రతి ఆడపిల్ల జీవితానికి సంబంధించిన..అతి ముఖ్యమైన ఋతుస్రావం, వాటి హార్మోన్ల సహజ ప్రక్రియ పైనా ఎంతో శ్రద్ధ, జాగ్రత్తలు అవసరం అని గుర్తించాలి. పైన తెలిపిన సమస్యలు అన్ని కూడా యుక్త వయస్సు నుండి అనుభవిస్తున్నారా? వయస్సు పెరిగే కొద్దీ, వారి జీవితంలో కలిగే సమస్యల నుండి లేదా అనారోగ్య కారణాల వల్ల గానీ..అనుభవిస్తున్నారా? ఒక్కసారి గ్రహించుకోండి.

చిన్న చిన్న కారణాల వల్ల నెలకు 2 సార్లు రుతుస్రావం కలగడం కానివ్వండి మరియు ఋతుస్రావ రంగులో తేడాలు రానివ్వండి..దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండదు అనే చెప్పాలి. చిన్న కారణాలతో సమస్య మొదలైతే..జీవన విధానంలో మరియు తీసుకునే ఆహారంలో ఏమి తేడాలు కలుగుతున్నాయి? ఏ విధమైన మార్పు చేసుకోవాలి అని వెంటనే గ్రహించగలిగి..తగిన చిట్కాలు పాటించండి ఆలస్యం చేయకుండా..

ఎందుకంటే, మన ఆరోగ్యంలో కలిగే మార్పులు, హార్మోన్ల తేడాలు అనేవి కూడా ముందుగా మనం తీసుకునే ఆహరం పైనే ఆధారపడి ఉంటుంది. మరియు మన జీవితంలో ఎంత ప్రశాంతతను కలిగి ఉన్నారు? అనేక రకాల సమస్యల వల్ల కలిగే ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నాము అనేది ముఖ్యం అవుతుంది. వీటిని సరి చేసుకోగల జ్ఞానం మనం సంపాదించగలిగితే చాలు..జీవితంలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండగలగడానికి మనది మనం అవకాశం ఏర్పరుచుకున్నవాళ్ళం అవుతాము.  

కానీ, ప్రతి అమ్మాయి మరియు ఆడవారు వారి వారి జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యల కారణంగా..అనారోగ్య సమస్యల మూలంగా తీవ్రమైన సమస్యగా అనుభవించే స్థితికి చేరుకున్నట్లయితే, ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా ఋతుస్రావ సమస్యలు కలిగి ఉన్నట్లయితే, వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించి, కలిగిన సమస్య ఏ స్థితిలో ఉంది..ఏ విధానమైన పరిష్కారం సరైంది అని స్పష్టంగా తెలుసుకోవాలి.

అన్నిటికంటే..ముందుగా.. ప్రతి స్త్రీ యొక్క ఋతుస్రావంలో కలిగే మార్పులు, వారి యొక్క అనారోగ్య పరిస్థితికి కారణమై, చాలా ఇబ్బందికర స్థితిని అనుభవించడం అనేది ఆందోళన కలిగించే విషయం అని గుర్తించగలిగే అవగాహనను కలిగి ఉండడం ముఖ్యం. ఇంకా..ఋతుస్రావ రంగు కూడా మనకు మన ఆరోగ్య స్థితి ఎలా ఉంది అని కూడా తెలియజేసేటటువంటి ఒక సూచనగా భావించాలి మరియు అర్ధం చేసుకుంటే కూడా తెలుస్తుంది. దీని ద్వారానే మీ సమస్యను మీకు మీరై పరిష్కరించుకునే మార్గం ఎలా? అనేది సులభతరంగా అవగతం అవుతుంది.     

Add Comment