మీ పీరియడ్స్ ఆలస్యం కోసం మందులు వాడటం వల్ల కలిగే ఆరోగ్య పరిస్థితి|A health condition caused by taking medication to delay your period in Telugu

    రుతుక్రమ ఆలస్యం కోసం మందులు వాడడం ఈ రోజుల్లో చాలా సులభతరం అయింది అని చెప్పొచ్చు. చెప్పాలంటే, పూర్వకాలంలో లేనిది ప్రస్తుత కాలంలో ఒక ఆచారంగా ముందుకు సాగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో వారి వారి ముఖ్యమైన సందర్భాల కోసం, ఫంక్షన్లు, పూజా కార్యక్రమాలు..ఇంకా ఎన్నో..వీటి కోసం, రుతుక్రమం ఇబ్బంది కలిగించే స్థితి వస్తుంది అంటే చాలు..రుతుక్రమ ప్రక్రియను తప్పించడానికి మందులు వేసుకోవడం వారికి తెలిసిన సుపరిచిత వైద్యం. దీని కోసం, ఇది ఒక ముఖ్యమైన మందుగా భావించి వారి దగ్గరే  భద్రపరుచుకునే అలవాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. 

   ఇందులో కొంతమందికి చదువు, జ్ఞానం, అవగాహన లేకపోవడంతో రుతుక్రమ ఆలస్యం కోసం టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అని తెలివి ఉన్న వారు చెపితే వేసేసుకోవడం. ఇది వాళ్లకు తెలిసిన మార్గం అంతే..దీని నుండి ఆరోగ్యానికి ఎన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి అనే కనీస అవగాహన కూడా లేకపోవడం ఒక కారణం. మరియు కొంతమంది చదువు, జ్ఞానం కలిగి ఉన్న కూడా వైద్యుడి సలహా తీసుకోకుండా ఏమౌతుంది లే అని సులువుగా టాబ్లెట్ వేసుకొని, రుతు ప్రక్రియను ఆపేస్తున్నారు. సమయానికి మందు ఉపయోగపడిందా? ఆనందపడ్డామా? ఇది చూసుకుంటే..సరిపోతుందా? ఎవరికీ వారు ఒక్కసారి ఆలోచించండి..

ఋతుక్రమం ఆలస్యం కోసం వేసుకునే మందుల వివరణ(Description of Medicines for Delayed Menstruation)

     రుతుక్రమంని ఆపడానికి అయినా, ముందుగా వచ్చేలా చేయడానికి అయినా వాడే “మాత్రలు(Tablets)” ఒకటే.. అవే “హార్మోన్ల మాత్రలు(Hormone Pills). అవి వేసుకున్నంత కాలం నెలసరి రాదు. ఆపిన రెండు నుండి వారం రోజుల లోపు ఏ రోజైన నెలసరి రావచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నెలసరిని తప్పించడం కుదరదు. కావాలంటే, మీకు ఏ తేదీలో వస్తే అడ్డమో, ఆ తేదీకి 3 రోజుల ముందు నుండి హార్మోన్ మాత్రలు వాడటం మొదలు పెట్టి, ఆ తేదీ దాటిపోయే వరకు మాత్రలు వాడటం ఒక్కటే మార్గం.  కానీ, వివిధ అవసరాలకు రుతుక్రమం ను వాయిదా వేయడం కోసం మాత్రలు వేసుకోవడం సాధారణం అయింది అని తెలిసిన విషయమే..కానీ, మాత్రల వల్ల శరీరంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం ముఖ్యం.A health condition caused by taking medication to delay your period in Telugu

రుతుస్రావం ఎప్పుడు అవుతుంది(When is menstruation)?

    మీ హార్మోన్ల లోని మార్పులు “పీరియడ్స్ సమయాన్ని(Time of periods)” నిర్ణయిస్తాయి. ప్రతినెలా అండాశయాల ద్వారా ఉత్పత్తి అయ్యే “ఈస్ట్రోజెన్ హార్మోన్(estrogen hormone)” కారణంగా “గర్భాశయం(the uterus)” చుట్టు ఉన్న పొర మందంగా మారుతుంది. ఫలదీకరణం చేసిన “గుడ్డు ప్రవేశానికి” సిద్ధంగా ఉండటానికి గర్భాశయ పొర సిద్దమవుతుంది. ఆ పొరను “ప్రొజెస్టరాన్ హార్మోన్(Progesterone hormone)” 2 వారాల పాటు కాపాడుతుంది. ఆ సమయమే “గర్భధారణ(pregnancy)”కు ఉత్తమ కాలం. ఆ సమయంలో గర్భం ధరించకపోతే, ప్రొజెస్టరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోతూ ఉంటాయి. అలాగే, గర్భాశయం..దాని పొరను కూడా కోల్పోవడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలోనే పీరియడ్స్ ప్రారంభమౌతాయి.

ఋతుక్రమం ఆలస్యం ఎందుకు జరుగుతుంది(Why is menstruation delayed) :

   ఆడవారి శరీర అవయవాలలో జరిగే మార్పులు ఈ ఋతుస్రావం మొదలు ప్రారంభం అనేది తప్పనిసరిగా జరగడం సహజం. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి 12 సంవత్సరాల వయస్సులోనే ఆరంభం అవుతుంది. ఇంకొంతమందికి 15, 16 సంవత్సరాల వయస్సు వరకు కూడా సమయం తీసుకుంటుంది.

   అండాశయాల్లోని హార్మోన్లలో మార్పు చోటు చేసుకొని, ఫలితంగా, పురుష హార్మోన్ గా పరిగణించే టెస్టోస్టిరాన్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి కావడం వల్ల నెలసరి సక్రమంగా రాదు. “పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(Polycystic Ovary Syndrome)”గా పేర్కొనే ఈ పరిస్థితి వల్ల ప్రతి నెల అండం సక్రమంగా విడుదల కాదు. కొందరిలో అండాలే విడుదల కావు. అందుకే నెలసరి రావడంలో ఆలస్యం. ఒకవేళ వచ్చిన రక్తస్రావం సక్రమంగా కాకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. ఇదే తీరు కొనసాగితే కనుక సంతాన సాఫల్య సమస్యలు, అవాంఛిత రోమాలు, మొటిమలు బాధిస్తాయి. ఈ సమస్యతో బాధపడే ప్రతి 10 మందిలో నలుగురు అధిక బరువు పెరుగుతారని ఓ అధ్యయనం తెలిపింది. సమస్యను నివారించకపోతే మధుమేహం, అధిక రక్తపోటు వంటివి తప్పవు. అలాగే, నెలసరి సక్రమంగా రాకపోయినా, ఆగిపోయిన కూడా  “గర్భాశయ క్యాన్సర్(cervical cancer)” ప్రమాదం లేకపోలేదు. కాబట్టి, వైద్యులు సూచించిన మందులు వాడుతూ, జీవనవిధానంలో తప్పనిసరిగా చేసుకోవాల్సిన మార్పులపైన దృష్టి ఉంచితే, ఈ సమస్యను చాలా మటుకు అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. 

రుతుస్రావం వాయిదా ఎలా అవుతుంది(How to postpone menstruation)

    క్రమం తప్పకుండ నెలసరి రావడానికి హార్మోన్ల స్థాయిలే కారణం అవుతాయి అని తెలుసు కదా..వాటిలోని హెచ్చుతగ్గుల(Ups and downs) వల్లే పీరియడ్స్ వస్తాయి. శరీరంలో ప్రొజెస్టరాన్ స్థాయిలు తగ్గినపుడు గర్భాశయం చుట్టూ ఉన్న పొర తొలగిపోతుంది. నెలసరి రావడానికి కారణం ఇదే. పీరియడ్స్ ను ఆలస్యం చేసే మాత్రల్లో “సింథటిక్ ప్రొజెస్టరాన్(Synthetic Progesterone)” ఉంటుంది. ప్రొజెస్టరాన్ స్థాయిలు తగ్గకుండా ఈ మాత్రలు పని చేస్తాయి. అందువల్ల పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి.

ఋతుస్రావాన్ని ఆలస్యం చేసే మాత్రల్లో “నోరెథిస్టిరాన్(Norethysterone)” ఉంటుంది. ఇది ప్రొజెస్టరాన్ ఆర్టిఫిసియల్ రూపం. ఇది శరీరంలో ప్రొజెస్టరాన్ స్థాయిలను కృత్రిమంగా పెంచి, నెలసరి ఆలస్యం చేస్తుంది. మందమైన గర్భాశయ లైనింగ్ ఎంతకాలం ఉంటుందనే దానిపై పరిమితి ఉన్నప్పటికీ..పీరియడ్స్ ను సుమారు  2 వారాల పాటు వాయిదా వేయడానికి ఈ మందులు సహాయపడుతాయి.

మాత్రలు ఎప్పుడు తీసుకోవాలి(When to take pills)?

    మీ నెలసరి సమయానికి, 3 రోజుల ముందు టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. మీకు ఆలస్యం కావాలి అనుకునేంత వరకు ప్రతి రోజు వైద్యుడు సూచించిన మేరకు ఈ మందులు తీసుకోవడం కొనసాగించాలి. మీరు ఈ టాబ్లెట్స్ వేసుకోవడం ఆపిన తర్వాత వారంలో మీ పీరియడ్స్ మొదలవడం జరుగుతుంది. A health condition caused by taking medication to delay your period in Telugu

ఋతుక్రమ ఆలస్యం కోసం మందులు వాడటం మంచిదేనా(Is it good to use medicine for delay of menstruation)?

రుతుస్రావం ఆలస్యంగా రావడానికి మందులు వేసుకోవడం సురక్షితం కాకపోవొచ్చు. తప్పని సరి పరిస్థితుల్లో చాలా ముఖ్యమైన పనుల కోసం టాబ్లెట్ వాడితే పరవాలేదు. కానీ, మాత్రలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించడం అవసరం అని గుర్తుపెట్టుకోవాలి. అయితే, దీర్ఘకాలికంగా ఈ మందులను పదే పదే వేసుకోవడం వల్ల, శరీరంలోని హార్మోన్ల పై ప్రభావం పడుతుంది. దీని కారణంగా, నెలసరి క్రమం తప్పే అవకాశం ఉంది.

  • కొంతమందిలో ఈ మాత్రలు వాడిన తర్వాత బ్లీడింగ్(Bleeding) ఎక్కువవుతుంది.
  • కొంతమందిలో ఈ బ్లీడింగ్ సమస్య చాలా నెలల వరకు(For several months) కొనసాగుతూనే ఉంటుంది.
  • ఈ మాత్రల వాడకం ఎక్కువయితే గర్భధారణ విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
  • కొంతమందిలో నెలసరితో సంబంధం లేకుండా బ్లడ్ స్పాటింగ్ సమస్య(Blood spotting problem) మొదలవ్వొచ్చు. లేదా బ్లీడింగ్ సరిగా కాకపోవడం(Irregular bleeding) జరుగుతుంది.
  • ఇంకా, ఈ  మందులు వాడటం వల్ల మానసిక కల్లోలం(Mood swings), ఆందోళన పెరగడం(increased anxiety), చలి జ్వరంతో బాధపడడం(suffering from chills and fever) లాంటివి అనుభవిస్తారు..
  • వక్షోజాల్లో నొప్పి(Pain in the chest), పొత్తి కడుపు నొప్పి(pain in the lower abdomen)గా ఉండడం.
  • అసౌకర్యం(Discomfort), వికారం(nausea), డయేరియా(diarrhea) వంటి దుష్ప్రభావాలు ఎదురౌతాయి.

మూర్ఖంగా అధిక మొత్తంలో మందులు వాడితే, రక్తంలో గడ్డలు(Blood clots) ఏర్పడి, ప్రాణానికే ప్రమాదం రావొచ్చు. ఋతుచక్రాన్ని మీ చేతుల్లోకి తీసుకొని ఎలా అంటే అలా..ఎప్పుడు పడితే అప్పుడు మందులు వాడి డిస్ట్రబ్ చేస్తే, గర్భసంచి(womb)లో మార్పులు రావడమే కాదు..హార్మోన్ల సమతుల్యం దెబ్బతిని, బహిష్టులు క్రమం తప్పకుండా రావడం ఆగిపోయి, ఎప్పుడుపడితే అప్పుడు క్రమరహితంగా(Irregular) వచ్చి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది.A health condition caused by taking medication to delay your period in Telugu

ఎవరు, ఎలాంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి(Who and what kind of people should be careful) 
  • బ్లీడింగ్ సరిగ్గా అవ్వనివారు(Bleeding irregularities).
  • అధిక రక్తస్రావం ఉన్న వారు(Those with excessive bleeding).
  • రొమ్ము గడ్డలు(Breast lumps), రొమ్ము క్యాన్సర్(breast cancer), రొమ్ము క్యాన్సర్ కుటుంబ చరిత్ర కలిగి ఉన్న వారు(those with a family history of breast cancer).
  • ఊపిరితిత్తుల సమస్యలు(People with lung problems), మెదడులో రక్తం గడ్డ కట్టిన వారు(blood clots in the brain),
  • మూర్ఛ నిరోధకం(Anticonvulsant) ఉన్న మహిళలు ఈ మందులను జాగ్రత్తగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. A health condition caused by taking medication to delay your period in Telugu
ముగింపు(conclusion) 

రుతుక్రమ ఆలస్యం కోసం వేసుకునే మందుల ప్రభావం స్త్రీల ఆరోగ్యంపై ఎలా చూపుతుంది తెలుసుకున్నాము..

శరీరంలో జరిగే రుతుప్రక్రియ సహజమైనది. పూర్తిగా హార్మోన్ల పై ఆధారపడి సాగే ప్రక్రియను మన చేతులోకి తీసుకొని, ముందుకు వెనక్కి లాగుతూ ఉంటె..కేవలం ఆరోగ్య సమస్యను మాత్రమే సృష్టించదు. ప్రాణ నష్టం కూడా జరిగే సందర్భాలు లేకపోలేదు. ఈ విధంగా ఏర్పడిన పరిస్థితి కేవలం, అనుభవం కలిగిన వ్యక్తులు మాత్రమే జాగ్రత్త పడగలరు. ఎందుకంటే, టాబ్లెట్ మీ శరీరంలో కలిగించే మార్పులకు అనుగుణంగా మీ ఆరోగ్యం సరిగా లేకపోతె వచ్చే సమస్యలు మాములుగా ఉండవు. అకస్మాత్ గా ఏమై ఉంటుంది అని ఆలోచించే సందర్భాలు వచ్చినపుడు కూడా రుతుక్రమ సమస్యలు నుండి వచ్చే ఇబ్బందులు ఏమి ఉన్నాయ్ అని గుర్తుకు చేసుకోవడం చాలా ముఖ్యం. దీని నుండి కొంతలో కొంతైనా జాగ్రత్త పడడానికి వీలు ఉంటుంది.

అయితే, కొంతమంది చెప్పే విషయం ఏమిటంటే..మందులు వాడడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. వేసుకోవడం ఆపిన తర్వాత ఋతుస్రావము ప్రారంభం అవుతుంది అని..నిజమే కావొచ్చు. జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం ఏదైనా వచ్చినపుడు, వైద్య సలహా పాటించడం తప్పక పోవొచ్చు. కానీ, మందుల ప్రభావం వారి శరీరంలోని హార్మోన్ల యొక్క మార్పుల పరిస్థితిని అనుభవించాలి అంటే..ముందుగా వారు ఎంతో ఆరోగ్యవంతంగా మరియు శక్తివంతంగా ఉంటే తప్ప రుతుక్రమ ప్రక్రియకు వాడే మందుల ప్రభావం వారి శరీరానికి హాని చేయలేదు అని ఖచ్చితంగా చెప్పగలం..  

అంతేగానీ..వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని చూసుకోకుండా..వైద్యుని సలహా తీసుకోకుండా మందులు వేసుకొని సమస్య తీర్చుకున్నాము అని తృప్తి పడితే..తిరిగి సమస్య కలిగేది టాబ్లెట్ వేసుకున్న వాళ్ళకే కానీ వేరేవాళ్లు అనుభవించే స్థితి కాదు అని గుర్తుపెట్టుకోవాలి. పైన తెలిపిన సమస్యలు మీ శరీరంలో వచ్చే అవకాశం కన్పిస్తున్నట్లయితే, ముందుగా మీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా లేకపోవడం ఒక కారణం మరియు జీవితంలో జరిగే ఎన్నో మానసిక సంఘర్షణలు కారణం అవుతుంటాయి. అందుకే, వెంటనే వైద్యుడిని సంప్రదించించి చికిత్స తీసుకోవడం ఆరంభించాలి. 

స్పష్టంగా చెప్పాలి అంటే..మానవ శరీరం ఒక అద్భుతం. అందులో ఉండే ఒక్కో అవయవం, దాని పనితీరు నిర్ణయించడం జరిగిపోయింది. అవయవాల పనితీరు ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అది అలాగే కొనసాగాలి. అలా సాగితేనే..మనిషి జీవనం ఉంటుంది. దానిలో ఏదైనా మార్పులు సంభవిస్తే..అంతా గందరగోళం..ఏ అవయవ పనితీరు ఎలా కొనసాగించాలి అర్ధం కాక..మనిషి శరీర ఆరోగ్యాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసేస్తుంది. దీనికి కావాల్సిన అవగాహన ముందుగా మనిషి దగ్గర ఉండగలగాలి. వైద్యుడి సహాయంతో సమస్యను పరిష్కరించుకోగలగాలి. అలా కూడా చేయలేని పరిస్థితికి వస్తే, జీవన గమనం ఆగిపోవాల్సిందే. ఏ అవయవం కూడా ముందుకు సాగి జీవన పయనాన్ని సాగించలేదు. 

ఇందులో రుతుక్రమం ఆడవారి శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. అర్ధం..అంతే సహజంగానే మనం చూడాలి..ముందుగా లేదా ఆలస్యంగా లేదా అధిక రక్తస్రావం లేదా తక్కువ రక్తస్రావం కలిగి ఉన్నారా? అయితే, మీ ఆహార ప్రణాళికలో మార్పులు చేసుకోవడం, సమతుల్యమైన పోష్టికాహారం తీసుకోవడం పైన దృష్టి కేంద్రీకరించడం చేయాలి. ఇంకా రుతుస్రావం ఆలస్యంగా రావడం కోసం టాబ్లెట్ వేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? వేసుకునే ముందు మీ ఆరోగ్యంపై మీకు అవగాహన కలిగి ఉండాలి. ఎంత తట్టుకునే శక్తి ఉంది అని ఆలోచించుకోండి..వైద్యుడి సలహా తీసుకోండి.

..సర్వేజనా సుఖినో భవంతు.. 

Add Comment