Munagaku Health Benefits in Telugu | మన ఆరోగ్యానికి మునగాకు ఏ విదంగా ఉపయోగపడుతుంది

Munagaku Benefits in Telugu:

మన దక్షిణ భారత దేశంలో మునగ చెట్టుకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మునగ చెట్టులోని ప్రతి భాగం కూడా చాలా ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఈ చెట్టు అన్ని రకాల వాతావరణములలో,అలాగే అన్ని రకాల ప్రాంతాలలో పెరగటానికి చాలా అనువుగా ఉంటుంది. మునగ చెట్టు పువ్వులు తెల్లగా,గుత్తులుగా ఉంటాయి. ఈ చెట్టు సాధారణంగా 8 నుండి 10 అడుగుల ఎత్తు  వరకు పెరుగుతాయి.

Munagaku Health Benefits in Telugu

మునగాకులలో చాలా రకాల పోషకాలు ఉండటం వలన దీనిని రోజూ వారి ఆహారంలో తీసుకోవటం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

ఇంకా ఈ మునగాకు ఆకు కూరలు అమ్మే వారి దృష్టిలో పడలేదు,లేకుంటే దీనిని డబ్బులు పెట్టి కొనవలసి వచ్చేది. ప్రస్తుతం ఈ మునగాకు ఉచితంగానే చెట్లమీది నుండి కోసుకోవచ్చు,ఎందుకంటే ఈ ఆకు గురించిన అవగాహనా,ఈ ఆకు యొక్క అద్భుతమైన ఆయుర్వేద లక్షణాలు,ఈ ఆకు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా అందరికి తెలియక పోవటమే దీనికి కారణం.

అసలు ఒకవిధంగా చెప్పాలంటే అన్ని రకాల ఆకుకూరలలో మునగాకు చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఈ మునగాకు గురించి తెల్సుకోవటం చాలా అవసరం.

పోషకాలు:

  • మునగాకులో విటమిన్ ఏ ,సి అలాగే ఇనుము,మాంసకృతులు చాలా పుష్కలంగా ఉంటాయి,
  • ఇందులో బీటా కెరోటిన్ మరియు పొటాషియం అధిక మోతాదులో లభిస్తాయి.
  • సాధారణంగా మనం పాలకూర,చుక్క కూర మనం ఎక్కువగా తింటూవుంటాం.కానీ ఈ మునగాకులో ఉండే ఇనుము పాలకూర కంటే 30% అధికంగా ఉంటుంది మరియు కాల్షియం 100% ఎక్కువగా ఉంటుంది.
  • కాల్షియం,యాంటీఆక్సిడెంట్స్ ఈ ఆకులో పుష్కలంగా లభిస్తాయి.

Munagaku Health Benefits in Telugu

ఆరోగ్య ప్రయోజనాలు:

  • కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ మునగాకులను ఒక ముద్దలాగా నూరి నొప్పి ఉన్న చోట కట్టు కట్టడం వలన నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
  • మధుమేహం ఉన్న వారు ఈ ఆకు కూరని క్రమం తప్పకుండా తీసుకోవటం వలన మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
  • ఈ మునగాకులో క్లోరోజిన్ అధిక మోతాదులో ఉంటుంది. క్లోరోజిన్ రక్తపోటుని నియంత్రించటంలో చాలా బాగా పనిచేస్తుంది.
  • కంటి చూపు తక్కువగా ఉన్నవారు,రేచీకటితో బాధపడేవారు మునగాకు రసాన్ని తాగటం వలన మంచి పలితం ఉంటుంది.
  • బాలింతగా ఉన్నవారు పాలు బిడ్డకి ఎక్కువగా అందటానికి ఈ మునగాకుని ఎక్కువగా తీసుకోవటం వలన పాలు సమృద్ధిగా బిడ్డకి అందుతాయి.
  • ఆస్తమా,T.B తో బాధపడేవారు కొన్ని ఆకులని తీసుకొని ఒక గ్లాసు నీళ్లలో మరిగించి అందులో కొద్దిగా నిమ్మరసం మిరియాలు వేసుకొని తాగటం వలన మంచి ప్రభావం ఉంటుంది.
  • రక్త హీనతతో బాధపడేవారు ఈ ఆకుని ఆహారంగా తీసుకోవటం వలన మంచి గుణం ఉంటుంది.
  • ఈ మునగాకులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే మాంసం తినరో,అలాంటి వారు ఈ మునగాకుని తినటం వలన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి.
  • ఎదిగే పిల్లలకి ఈ మునగాకిని తినిపించడం వలన ఎముకలు చాలా ధృడంగా మారుతాయి.
  • మునగాకులో యాంటీఆక్సిడెంట్స్ అధిక మోతాదులో ఉంటాయి. దీనివలన జీర్ణ సంబంధ సమస్యతో బాధపడేవారు ఈ ఆకుని రెగ్యులర్ గా తీసుకోవటం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

  • లూస్ మోషన్స్ తో బాధపడేవారు ఈ మునగాకు రసంలో కొద్దిగా తేనె కలిపి తాగటం వలన మోషన్స్ తగ్గిపోతాయి.
  •  థైరాయడ్ సమస్యతో బాధపడేవారు ఈ మునగాకుని తినటం వలన సమస్య తీవ్రతని తగ్గించుకోవచ్చు.

               ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకుని నిర్లక్ష్యం చేయకుండా,మిగతా ఆకుకూరలు తిన్నట్టుగానే ఈ మునగాకుని తీసుకోవటం అలవాటుగా చేసుకోవటం వలన,ఎన్నో రకాల వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు.

 

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.

అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.