ఎక్కువ రక్తపోటుని నిరోధించగలిగే ఆహార పదార్థాలు(Foods that can prevent high blood pressure)
రక్తపోటు లేదా అధిక రక్తపోటు(blood pressure) అనేది ఈ రోజుల్లో సాధారణంగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్య. రక్త నాళాలు నిరంతరం ఒత్తిడి(pressure)ని పెంచడం వలన ఇది గుండె, మెదడు, మూత్రపిండాలు, ఇతర వ్యాధుల ప్రమాదానికి దారి తీస్తాయి. సాధారణంగా దూమపానం, మద్యపానం చేసేవారిలో, వృద్దులు, అధిక బరువు ఉన్న వారిలో, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో రక్తపోటు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రింది పిండి పదార్దాలతో బీపీ ని కంట్రోల్(control)లో ఉంచుకోవడం చాల సులభం అవుతుంది.
తృణధాన్యాలు(Cereals) :
రక్తపోటును అధిగమించాలంటే ఆహార నియమాలపై శ్రద్ధ వహించడం, తప్పకుండ వ్యాయామం చేయడం అలవాటుగా చేసుకోవాలి. రోజువారీ ఆహారంలో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి. తక్కువ మోతాదులో సోడియం ఉన్న ఆహార పదార్దాలను తీసుకోవడం వలన రక్తపోటును హెచ్చుతగ్గులు కాకూండా నియంత్రించవొచ్చు. అధిక రక్తపోటు ఉన్న వారు శుద్ధి చేసిన పిండి నుండి ధాన్యపు పిండికి మారాలని, అలాగే ఎక్కువ పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చాలి. అధిక రక్తపోటు గలవారికి ఆహారంలో తృణధాన్యాలను చేర్చినపుడు అద్భుతాలు చేస్తాయి అని 2010 లో అమెరికన్ జర్నల్ అఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన ప్రకారం తృణధాన్యాలు అధికంగా ఉన్న ఆహరం తీసుకోవడం ద్వారా రక్తపోటు నిరోధక మందుల పనిచేస్తుందని తెలిపారు. ఇది గుండె జబ్బులు, గుండె స్ట్రోక్, గుండె ఆగిపోవడం వంటి ప్రమాదాలను తగ్గిస్తాయి.
హై బీపీ(high blood pressure) ని తగ్గించే పిండి :
గోధుమ పిండి(wheat flour) :
భారతదేశంలో సాధారణంగా ఉపయోగించే పిండిలో గోధుమపిండి ఒకటి. ఇందులో ఎక్కువ మొత్తంలో ఫైబర్, ప్రోటీన్ లు ఉంటాయి.
ఓట్స్ పిండి(Oat flour) :
ఓట్స్ ను పిండి గా మార్చవొచ్చు. దీనికి ఓట్స్ మిక్సీలో వేసి పొడి చేసి, రొట్టెలు, పాన్ కేక్ లు చేసుకోవొచ్చు. అనేకరకాల తీపి, రుచికరమైన వంటలు తయారు చేసుకోవొచ్చు.
బులుగురు గోధుమపిండి /బుక్వీట్ పిండి(Buluguru wheat flour/buckwheat flour) :
బుక్వీట్ మరొక తృణధాన్యం. దీనిలో ఫైబర్, ప్రోటీన్ లు అధికంగా ఉంటాయి. ఇది గ్లూటెన్ రహితమైనది. అలెర్జీ ఉన్నవారు కూడా దీనిని తినవొచ్చు. నూడుల్స్ నుండి రొట్టెలు, చిప్స్, స్నాక్స్ వరకు ఈ పిండి తో ఏదైనా చేసుకోవొచ్చు.
బార్లీ పిండి(Barley flour) :
బార్లీ..భూమిపై మొట్టమొదటి సారిగా పండించిన ధాన్యాలలో ఒకటి. ఈ పురాతన ధాన్యాన్ని మళ్ళీ ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. బార్లీ గడ్డి కుటుంబానికి చెందింది. కానీ శుద్ధి చేసిన దాన్యాలకు ఆరోగ్యకరమైన ఆహార దాన్యంగా విస్తృతంగా సాగు చేస్తారు.100 గ్రాముల బార్లీ లో 17 గ్రాముల డైటరీ ఫైబర్, 12 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి.
రక్తపోటును అదుపులో ఉంచడానికి ఆహార పదార్థాలు(Foods to Control Blood Pressure) :
సిట్రస్ పండ్లు(Citrus fruits) :
అధిక రక్తపోటు ఉన్నవారు సిట్రస్ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచే “విటమిన్ సి” ని అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. అదేవిధంగా వివిధ రకాల పోషకాలు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ప్రతి రోజు మధ్యాహ్నం సమయంలో ఒక పుల్లటి పండు తినండి. కావాలంటే కివి తినొచ్చు. ఇందులో ఫైబర్(fiber) కూడా ఉంటుంది. ఇది పొట్టను ఆరోగ్యముగా ఉంచుతుంది.
అరటిపండు(banana) :
అధిక రక్తపోటు కు గల కారణాలలో సోడియం ఒకటి. అరటిలో లభించే అధిక పొటాషియం కంటెంట్, సోడియం చెడు ప్రభావాలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అదేవిదంగా, పొటాషియం అధికంగా ఉండే ఇతర ఆహారాలు గుండె ఆరోగ్యానికి దోహదం చేసి గుండె జబ్బులను వొచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోజుకు ఒకటి నుండి రెండు అరటిపండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పొటాషియం లభిస్తుంది.
బ్లూ బెర్రీ(blue berry) :
బ్లూ బెర్రీ(blue berry)లో యాంటీఆక్సిడెంట్స్(antioxidents) సమృద్ధిగా ఉంటాయి. అధిక రక్తపోటును నివారించడంలో ఆంథోసైనిన్స్ అని పిలువబడే ఫ్లవనాయిడ్స్ ను కలిగి ఉంటాయి. బ్లూ బెర్రీ ఉదయం పరిగడుపున తీసుకోవడం మంచిది. వీటిని ఎవరి అభిరుచులకు తగ్గట్టుగా అయిన తీసుకోవొచ్చు. లేదా మిల్క్ షేక్ లో కూడా కలిపి తీసుకోవొచ్చు.
ఆకు కూరగాయలు(leafy vegtables) :
పాలకూర, క్యాబేజీ, లెట్యూస్, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి ఆకు కూరల్లో పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటు అదుపులో ఉండేలా దోహదం చేస్తుంది. ఆకు కూరలను సలాడ్స్, శాండ్ విచ్లు లేదా డిష్ రూపంలో సులభంగా ఆరగించవొచ్చు. ఇవి మార్కెట్ లో విరివిగా లభిస్తాయి.
వెల్లుల్లి(garlic) :
మన వంట గదిలో ఉండే వెల్లుల్లి ఒక సహజ యాంటిబయోటిక్, యాంటీఫంగల్ ఫుడ్. వెల్లుల్లి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి ని పెంచుతుంది. ఇది కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి, రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా సహాయపడుతుంది. ఈ మార్పులు రక్తపోటును తగ్గిస్తాయి.
టమాటా(Tomato) :
టమాటా లో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అధిక రక్తపోటును ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే కెరోటినాయిడ్లను కూడా కలిగి ఉంది.
డార్క్ చాక్లెట్(Dark Chocolate) :
చాక్లెట్ లు తినడం వల్ల లావుగా అవుతారు అని తినడం మానేస్తారు. కానీ డార్క్ చాక్లెట్ తినడం వల్ల రక్తపోటును అధిగమించవొచ్చు. డార్క్ చాక్లెట్ లోని కోకో రక్తనాళాల్లోని రక్తాన్ని చిక్కబడనివ్వకుండా ఉంచుతుంది. తద్వారా రక్తపోటు తగ్గుతుంది. అలా అని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం లేకపోలేదు.
ఆలివ్ నూనె(Olive oil) :
ఆలివ్ నూనె లో ఫాలిఫెనాల్స్ ఉంటాయి. రక్తపోటు ను నియంత్రించడంలో ఇవి ఎంతో సహాపడుతాయి. ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలను పొందడానికి సలాడ్స్, పాస్తా పై చల్లుకోవొచ్చు. ఈ నూనె ను వేడి చేయకూడదు. అలా చేయడం వల్ల దాని గుణాలను కోల్పోయేలా చేస్తుంది.
చేపలు(Fish) :
మాకేరెల్, సాల్మన్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా 3 ఫ్యాటి ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతాయి. రక్త నాళాల్లో మంటను తగ్గించడంతో పాటు ట్రీగ్లిసరైడ్స్ ను కూడా తగ్గిస్తాయి. అధిక రక్తపోటును నివారించడానికి చేప మాంసం ఉపయోగపడుతుంది.
పిస్తా పప్పు(Pistachio Nuts) :
ఇందులో అధిక ప్రోటీన్ అధిక ఫైబర్ కలిగి ఉంటుంది. రక్తపోటు ను నియంత్రించడం తో పాటుగా, మిమ్మల్ని పూర్తీస్థాయిలో ఆరోగ్యముగా ఉంచుతుంది.
అవిసె గింజలు(flax seeds) :
వీటిలో అవసరమైన ఒమేగా 3ఫ్యాటి ఆమ్లాలు, లినొలెనిక్ ఆమ్లాలు ఉంటాయి. అవిసె గింజలు రక్తపోటును తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. అవిసె గింజలు ఒక శక్తివంతమైన సూపర్ ఫుడ్(super food) అని అనేక అధ్యనాలు చెబుతున్నాయి.
కొత్తిమీర ఆకులు(Coriander leaves) :
ఆరోగ్య నిపుణుల అధ్యయనం ప్రకారం, వీటిని ఆహారంలో చేర్చడం ద్వారా రక్తపోటును సులభంగా నియంత్రించవొచ్చు. డైట్ లో కూడా చేర్చి వారానికి ఒకసారి తినొచ్చు. రక్తపోటుతో పాటు ఇది ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.
అధిక రక్తపోటు స్పష్టమైన లక్షణాలను చూపించదు. చాల ఆలస్యం అయ్యేవరకు చాల గుర్తించడం కష్టం. క్రమం తప్పకుండ ఆరోగ్య పరీక్షల కోసం వైద్యుడిని సంప్రదించడం చాల ముఖ్యం. ఆహార నియమాలపై శ్రద్ధ వహిస్తే వ్యాధి వలన కలిగే అనర్థాలను అదుపు చేసుకోవొచ్చు. తద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఈ ఆహారాలు రక్తపోటు ను నియంత్రించడం తో పాటు, రోగనిరోధక శక్తి ని బలోపేతం చేయడానికి కూడా మేలు చేస్తాయి. ముందు జాగ్రత్తతో రక్తపోటును సులభంగా నివారించవొచ్చు.