Best Tulasi uses and Benefits in Telugu|తులసి ఉపయోగాలు మరియు లాభాలు

Tulasi uses and Benefits(తులసి ఉపయోగాలు) 

తులసి  మంత్రమ్ 

                                      ఓం ,

                                             యాన్ములే సర్వతీర్థాని 

                                            యన్మద్యే సర్వదేవతాః 

                                            యదగ్రే సర్వవేదాశ్చ  

                                             త్యాం నమామ్యహమ్ .

Best Tulasi uses and Benefits in Telugu

సూక్తులు(Sayings) 

  • తులసి స్మరణమ్, “హరినామస్మరణం సకలపాపహరణం”.
  • తులసిని తాకినంతనే పవిత్రత సిద్ధిస్తుంది. తులసిని ప్రార్ధించడం వల్ల రోగములు నశిస్తాయి.
  • తులసిని పూజించిన యముని గురించి భయముండదు.
  • తులసి ఆకులు మరియు పూలు శ్రీ కృష్ణుల వారికి అత్యంత ప్రీతికరమైనవి.

      “జగత్  ఏవమ్ అనౌషధం 

      న కించిత్ విద్యతే ద్రవ్యమ్

      వషాన్నార్థ  యోగామ్”

                    మన సనాతన హిందూ దేశం ఎంతో భాగ్యవంతమైనది. దీనికి కారణం యావత్ ప్రపంచంలో కెల్లా మన భారతదేశంలో వైద్యానికి పనికి వచ్చే ఎన్నో చెట్లు(the trees), మొక్కలు(Plants), ఔషదాలు(Medicines), మూలికలు(Herbs) ఉన్నాయి. ఇందులో భాగంగానే “తులసి(basil)”. తులసి మొక్క గురించి ఎన్నో కథలు, నమ్మకాలు, ఆచారాలు మన పురాణాలలో విస్తరించబడి ఉన్నాయి. మన భారతావనిలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వబడింది.

హిందూ ధర్మ పూజ విధానంలో మొదటగా ప్రాధాన్యం ఇచ్చేది మన “తులసి మాత”కు. తులసి గాలి తగిలితేనే మనిషి యొక్క సమస్త రోగాలు సమసిపోతాయని, ఎటువంటి రోగాలనైనా ఎదురించగలిగే శక్తి తులసికి ఉంది. వ్యాధి నిరోధక శక్తి(Immunity) పెంచుతుంది అని ఆయుర్వేద మహర్షులు తెలుసుకున్నారు. వీరు ఇంటింట తులసి మొక్కలను నాటించి, వాటి ఉపయోగాలను ప్రజలకు వివరించి, నిత్య జీవితంలో తులసి మొక్క ఒక ప్రధాన భాగస్వామిగా మార్చి ఉన్నారు. తులసి ప్రత్యక్షంగా పూజలందుకుంటూ ఒక పవిత్రమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది.

Tulasi uses and Benefits in Telugu

 తులసి పూజ విధానము (Method of Tulasi Puja)

          ప్రాతఃకాలం స్నానం ఆచరించుకొని, పూజ విధానాన్ని ఆరంభించుకొని, తులసి చెట్టుకు నీళ్లు పోయాలి. ఆవునెయ్యి(cow ghee)తో దీపారాధన చేసి, 7 లేదా 11 లేదా 108 సార్లు “తులసి మంత్రమ్” చదవాలి.

                     ప్రతి సంత్సరము “కార్తీక శుక్ల ఏకాదశి” రోజున తులసి మొక్కకు చెరకు గడలతో పందిరి వేసి, ఆ పందిరికి మామిడి తోరణాలు కట్టి, పూలతో  తులసి మొక్కను అందంగా అలంకరించి పూజ చేస్తారు. ఈ సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది. దీపావళి ఉత్సవాలలో తులసి ముందు దీపాలతో అలంకరిస్తారు. ఉత్తర భారతంలో బాణా సంచాను కాల్చుతారు, దక్షిణ భారతంలో గౌడీయ వైష్ణవ సముదాయంలో ఆ రోజును తులసి వివాహ్ లేదా తులసికి కృష్ణుని తో శిలారూపంలో వివాహం జరిగిన రోజుగా భావిస్తారు .

                  తులసి మొక్కకు చేసే ఆరాధన వల్ల సంతోషకరమైన సత్సంబంధమైన భాందవ్యాలు, భార్య-భర్త అలాగే ప్రతి బంధంలో కూడా  మరియు ఆయురారోగ్యాలను అనుభవించేటటువంటి శక్తిని మనకు ఇస్తుంది. కోపతాపాలు దరిచేరనివ్వకుండా ప్రశాంతకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. నవగ్రహదోషాల నుండి కాపాడుతుంది.

                    మీ మనసు పూర్తిగా ప్రశాంతం చేసుకొని మంత్రం చదవడమే కాకుండా, తులసి యొక్క ఆవరణలో కొంత సేపు ఆ స్వచ్ఛమైన గాలిని స్వీకరిస్తే మనిషి జీవిత మనుగడకే ఎన్నో లాభాలను దరిచేరుస్తుంది. వెలకట్టలేని అద్భుతమైన శక్తిగా, మనకు కన్పించని ఒక positivity power మన ప్రదేశంలోనే కాకుండా, మన అంతరంగస్థితిని కూడా శుద్ధి చేసే ఒక గొప్ప ప్రక్రియను కలిగి ఉంది.

తులసి మొక్క పేర్లు (Tulasi Plant Names)

సంస్కృతంలో(In Sanskrit) : తులసి, విశ్వపూజిత, వైష్ణవి, విష్ణుప్రియ, లక్ష్మి ప్రియ, వృందా, వృందావని, మాధవి, పావని, విశ్వపావని, కృష్ణతులసి, కృష్ణాజీవని, పవిత్ర, సుగంధ, దేవదుందుభి, అని,

హిందీలో(In Hindi) : రామ తులసి, కృష్ణ తులసి  అని,

తెలుగులో(In Telugu) : లక్ష్మి తులసి, కృష్ణ తులసి, భూతులసి, అడవి తులసి, గగ్గెర, నెలతులసి, మరువక తులసి, రుద్రజడ తులసి, అని,

లాటిన్ లో(In Latin) : “ocinum sanctum” అని,

ఇంగ్లీషులో(In English) : “holy basil” అని పిలుస్తుంటారు.

ప్రధానంగా “అర్చన”కు ఉపయోగించేవి మూడు రకాలు.1.శ్రీ లక్ష్మి తులసి, 2.కృష్ణ తులసి, 3.వన తులసి 

  1. లక్ష్మి తులసి(Lakshmi Tulasi) : దీనిని ‘తెలుపు’ తులసి అని కూడా వ్యవహరిస్తారు. కాడలు తెల్లగా, పెద్ద పెద్దగా ఆకుపచ్చని ఆకులతో దట్టమైన పుష్ప గుచ్చాలు ఉండే జాతి. తెల్ల తులసి క్రిమికీటక నాశిని. దీని ఆకు రసం కొంచెం కారం, చేదు కలసి ఉంటుంది. వేడి చేసే స్వభావంతో జ్వరాలను, దగ్గును ,క్రిమి రోగాలను, కఫవాతములను హరింపజేసి రుచిని పుట్టిస్తుంది. బుద్దిని, జఠరాగ్నిని పెంచుతుంటుంది.
  2. కృష్ణ తులసి(Black basil) :  దీనిని “నల్ల తులసి” అని కూడా అంటారు. లక్ష్మితులసి కన్నా అధిక శక్తివంతమైనది. ముఖ్యముగా చర్మవ్యాధులు, అంటూ రోగాలు, కఫ రోగములు, ఉదర  రోగములు, గుండె రోగాలు పోగొట్టడంలో చాల ప్రభావితం చూపిస్తాయి.
  3. రామ తులసి(Rama Tulasi) : క్రిమికీటక సంహారిణిగా పని చేస్తుంది. రాతి నేలలు, కొండవాలులో ఎక్కువగా కన్పిస్తుంది. నీటి వనరులు లేని చోట్ల కూడా పెరగగలదు. జీర్ణ శక్తి పెంచే గుణం కలది. రామ తులసి ఆకులను కొన్నింటిని భోజనం అనంతరం సేవిస్తే కడుపులో నులి పురుగులు సైతం నశిస్తాయి.
  4. అడవి తులసి(Wild basil) : ఎన్నో ఔషధ గుణాలు కలిగి గిరిజనులు తమ పాలిట కల్పతరువుగా భావించే అడవి తులసి, చాల ఘాటైన వాసన కలిగి తేలు, జెర్రీ వంటి పెద్ద విషకీటకాల విషాన్ని విరిచే గుణాన్ని కలిగి ఉంది. శ్రీశైలం, తిరుపతి, తలకోన తదితర అడవుల్లో కొన్ని ప్రాంతాల్లో లభిస్తుంది.
  5. మరువక తులసి(Forget basil) : దీనిని కర్పూర తులసి అని కూడా అంటారు. దీనిని సువాసన గల ఇతర పుష్పాలతో జత చేసి దండలుగా కట్టి తలలో పెట్టుకోవడానికి, దైవ పూజ నిమిత్తము కూడా  వాడుతారు. ఈ తులసి వాసనకు తలలో పేలు, ఈపి, చుండ్రు నశిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో దీనిని కర్పూరం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ కర్పూరం చర్మ రోగ నివారిణి ఔషదాలు వినియోగం కోసం తయారీ చేస్తారు. దీని ఎస్సెన్స్ (సారాన్ని) సువాసన గల కేశ తైలం తయారీ లో వినియోగిస్తారు. ఈ కర్పూర తులసి తైలం చెవి పోటుకి, ఉదర కోశ వ్యాధుల నివారణకు, వాత దోషాలు పోగట్టడానికి సైతం వాడతారు.
  6. రుద్రజడ తులసి(Rudrajada Tulsi) : ఈ  రుద్రజడ తులసి జాతికి చెందిన గింజలను, ప్రాచీనులు వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా సబ్జా గింజలు(Sabja seeds)గా వాడేవారు. ఈ తులసి గింజలు నీట నాన బెట్టి, ఆ పానీయం తాగితే అధికంగా చేరిన ఉష్ణం త్వరితంగా తగ్గుతుంది. ఏది కూడా జ్వర నివారణకు బాగా ఉపకరిస్తుంది. నిత్యం ఈ ఆకుల్ని సేవిస్తే, మూత్రకోశ సంబంధ వ్యాధుల్ని కూడా నివారించవచ్చు.

   తులసి మొక్క విజ్జ్ఞానపరమైన ప్రాముఖ్యత కలిగిన లాభాలు(Tulasi plant benefits of scientific importance) :

  • దాదాపుగా తులసి 500 రకాల వైద్యం చేయవొచ్చని ఒక పరిశీలలో తేలింది. తులసిలో ఉండే ఆకులకు, వేర్లకు, గింజలకు, ఔషదాతత్వాలు ఎన్నో ఉన్నాయి.
  • తులసి మొక్క ఇంట్లో ఉంచడం వల్ల కార్బన్ డయాక్సయిడ్(carbon dioxide), కార్బన్ మోనాక్సయిడ్(Carbon monoxide) మొదలైన విష వాయువులను గ్రహిస్తుందని నమ్ముతారు.
  • తులసి 24 గంటలు ప్రాణవాయువు(Oxygen) ను వదులుతూ ఉంటుంది. ఆహ్లాదకరమైన సుగంధాన్ని(the aroma) సృష్టిస్తుంది. పరిసరాలను తాజాగా ఉంచుతుంది.
  • ఇటీవలి అధ్యయనాలలో తులసి “ఎడాప్టోజెన్(Adaptogen) గాను” , “యాంటిస్ట్రెస్(Antistress)” గా పని చేస్తుందని తేలింది.
  • ఆయుర్వేద సుగుణాలు కలగలిసినవి తులసి మొక్క. అందుకే తులసిని “క్వీన్ అఫ్ హెర్బ్స్(Queen of Herbs)”గా  పిలుస్తారు.
  • దీనిలో A, C vitamins, కాల్షియం(Calcium), ఐరన్(Iron), క్లోరోఫిల్(Chlorophyll) వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
  • ఒక “యాంటీమైక్రోబయల్(Antimicrobial)” ఏజెంట్ గా చర్మగాయాలు తగ్గిస్తుంది.
  • తులసి నివాసస్థలము భారతదేశ స్థానికతకు చెందింది. అయితే మధ్య ఆఫ్రికా నుండి ఆగ్నేయ ఆసియా వరకు గల ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా ఇది కనబడింది.   
    • ఆసక్తికరమైన అంశం(Interesting topic)  : మన దేశంలో ఉన్న”తాజ్ మహల్”ను కాలుష్య ప్రభావానికి కలిగించే నష్టం నుండి రక్షించడానికి పర్యావరణవేత్తలు తాజ్ మహల్ చుట్టూ 10 లక్షల తులసి మొక్కలు నాటారు. ఎంతటి చెడు  కాలుష్యం, విషవాయువుల ప్రభావంను నివారించి తులసి మొక్క మనకి ప్రాణవాయును అందజేసి, ఒక రక్షణ వలయంగా ఉండడం ఎంతో అద్భుతమైన ప్రక్రియ.

 ఔషదంగా తులసి మొక్క ఆరోగ్యానికి కలిగించే ఉపయోగాలు(Health benefits of Tulasi plant as medicine)

Best Tulasi uses and Benefits in Telugu

  • రోజు 10-15 తులసి ఆకుల్ని తింటూ ఉంటే, వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎలాంటి వ్యాధుల్ని అయినా దరిచేరనివ్వదు.
  • infections ని నయం చేస్తుంది.
  • రక్తాన్ని శుద్ధి చేసి, రక్త ప్రసరణ, రక్తపోటును తగ్గిస్తుంది.
  • తులసి రక్తంలో చెక్కర మోతాదును తగ్గించగలిగే శక్తి ఉంది.
  • పులిపిర్లను(Sour) నిరోధిస్తుంది.
  • మలబద్దకాన్ని(Constipation) నిరోధిస్తుంది.
  • నోటి దుర్వాసనను అరికడుతుంది.
  • కిడ్నీలో రాళ్లను సైతం కరిగించే అద్భుతమైన నివారణ.
  • వీర్యపుష్టికి తులసి ఒక గొప్ప వరం.
  • ప్రతిరోజు తులసి ఆకులను తింటే శరీరంలో కొవ్వును సైతం తగ్గించుకోవొచ్చు. దీనితో పాటుగా శరీరంలో మలినాలను బయటకి పంపి బరువు కూడా తగ్గిస్తుంది.
  • “గుండెపోటు” నివారణకు కూడా, రాకుండా ఉండాలంటే ప్రతి రోజు తులసి ఆకులు స్వీకరించాలి.
  • తులసి ఆకు రసంలో కొబ్బరినూనె కలిపి కాళ్ళపగుళ్ళకు పూస్తే త్వరగా నయమయ్యే అవకాశం ఉంది.
  • స్త్రీలకు రుతుక్రమం(Menstruation for women) ఎక్కువగా అవుతూ ఉంటే, తులసి ఆకురసం, తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే రోజుల తరబడి అయ్యే స్రావం అరికట్టబడుతుంది.
  • స్త్రీలకు గర్భాశయ లోపం(Uterine deficiency in women) ఉంటే సహజంగా గర్భాలు నిలవకపోవడం(Absence of pregnancies) జరుగుతు ఉంటుంది. ప్రతిరోజు తులసి రసం తీసుకోవడం వాళ్ళ ఎలాంటి గర్భాశయ వ్యాదులైన నివారించబడి గర్భం దాల్చడానికి మార్గం సుగమం కాగలదు.
  •  10 గ్రాముల తులసి ఆకు రసం,20-30 గ్రాములు తాజా పెరుగు లేదా 2-3 చెంచాల తేనెతో కలిపి తినడం వల్ల “క్యాన్సర్” నయం అయ్యే అవకాశం ఉంది.
  • మోకాళ్ళు, పాదాల జాయింట్లు నొప్పి నివారణకు తులసి ఆకు ఎండించి నీళ్లలో వేసి కాచి కాషాయం వలె తీసుకుంటే సరి.
  • 1 చెంచా తేనే + తులసి ఆకు రసం కలిపి తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి.
  • తులసి ఆకులు + మిరియాలు నీళ్లలో మరిగించాలి. ఈ కాషాయం జలుబు టైంలోనే కాదు, చలికాలం మొత్తం తాగితే చాలా మంచిది.
  • విషజ్వరాలు(Poisonous fevers) : కృష్ణతులసి ఆకు రసం 10 నుండి 20 గ్రాములు తీసుకొని దానిలో 2గ్రాములు మిరియాలపొడి కలిపి రెండుపూటలా సేవిస్తూ ఉంటే మలేరియా హరించుకుపోతుంది. అంతేకాకుండా విపరీతమైన జలుబు, అజీర్ణం, మందాగ్ని, దగ్గు తగ్గిపోతాయి.
  • శ్వాసకు సంబదించిన తులసి లాభాలు(Benefits of Tulasi Relating to Breathing) : తులసి ఆకులు రోజు గుప్పెడు నమిలి తింటే, శ్వాసనాళాలు శుభ్రమవుతాయి .ఎండబెట్టిన తులసి ఆకుల చూర్ణాన్ని నశ్యం మాదిరిగా పీలుస్తూ ఉంటె “ఆస్త్మా” అద్భుతంగా నయం అవుతుంది అని పరిశీలనలో తేలింది.
  • స్పృహతప్పి పడిపోతే(If you faint) : తులసి ఆకు రసంలో చిటికెడు సైన్ధవలవణం కలిపి కరిగించి వడపోసి రెండు ముక్కు రంధ్రాలలో మూడు చుక్కలు వేస్తె ఏ విధమైన స్పృహతప్పిన వెంటనే తెలివిలోకి వస్తారు.
  • నీళ్ల,జిగట విరేచనాలకు(For watery and viscous diarrhea) : తులసి ఆకురసం 20గ్రాములు, చిటికెడు జాజికాయ పొడి కలిపి సేవిస్తూ ఉంటే నీళ్ళవిరేచనాలు, జిగట విరేచనాలు ఆగిపోతాయి.
  • కడుపునొప్పి,కడుపుఉబ్బరం(Stomach ache, flatulence) : తులసి గింజలపొడి 3 గ్రాములు, పటికబెల్లం పొడి 3 గ్రాములు ఒక మోతాదుగా నీటితో సేవిస్తూ ఉంటే కడుపునొప్పి, తగ్గిపోతాయి.
  • ఉబ్బసానికి ఉధృతమైన యోగం(Hot Yoga for Asthma) : తులసి ఆకులు 100గ్రాములు, తానికాయబెరడు 200గ్రాములు కలిపి ఒక లీటర్ నీటిలో ఒక రోజంతా నానబెట్టి పొయ్యి మీద పెట్టి పావు లీటర్ కాషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి 2,3 చెంచాల మోతాదుగా రెండుపూటలా ఆహారానికి ముందు సేవిస్తూ ఉంటే క్రమంగా ఉబ్బసం హరించిపోతుంది.
  • పాముకాటుకు తులసి చికిత్స(Tulasi treatment for snake bite) : తులసి రసం ద్వారా సర్పవిషాన్ని విరిచివేయొచ్చని ఆయుర్వేద మహర్షులంతా ఎలుగెత్తి చాటారు. పాము కరిచిన వెంటనే గుప్పెడు కృష్ణ తులసి ఆకులను నమిలించాలి. ఆ వెంటనే ఆకులు, వెన్న కలిపి నూరి ఆ ముద్దను కరిచిన చోట లేపనం లాగ పూయాలి. అప్పుడు లోపలి నుండి విషం బయటకు లాగబడి తెల్లగా ఉన్న వెన్న నల్లగా మారుతుంది. అది తీసివేసి మరలా కొత్త లేపనం రాయాలి. ఈ విధంగా వరుసగా ఆ లేపనం నల్లగా మారనంతవరకు మారుస్తూ ఉంటే సర్పవిషం విరిగిపోతుందని సమస్త ఆయుర్వేద గ్రంథాల్లో అనుభవపూర్వకంగా చెప్పబడింది.
  • గజ్జి, తామర(Scabies, eczema) : కృష్ణతులసి ఆకులు నిమ్మకాయరసం తో కలిపి, మెత్తగా నూరి రెండు పూటలా పైన లేపనం చేటు ఉంటే అతి త్వరగా ఆ చర్మరోగాలు హరించిపోతాయి.
  • పిల్లల లివర్ సమస్యలకు(For children’s liver problems) : కప్పు నీటిలో 10 తులసి దళాలు వేసి అరకప్పుకు మరిగించి వడబోసి గోరువెచ్చగా తాగిస్తూ ఉంటే లివర్ ఆరోగ్యవంతమవుతుంది.
  • జుట్టు సమస్యకు(For hair problem) : తలకు తులసి ఆకు రసం రాత్రంతా ఉంచుకొని, తలస్నానం చేస్తే పేలు పోతాయి. దీనితో పాటు తెల్లవెంట్రుకలు రావడం కూడా తగ్గుతాయి.
  • * తులసి ఆకుల ఘాటు ఉదయం కల్లా పేలు,ఈపూలు సహా రాలిపోతాయి.
  • * తులసి విత్తులు, నల్ల ఉమ్మెత్త విత్తులు కలిపి తింటే అద్భుతంగా నిద్రపడుతుంది.
  • * గుప్పెడు తులసి ఆకులు నమలడం వల్ల  మానసికపరమైన ఒత్రిళ్ళతో సతమతమయ్యే ప్రతి ఒక్కరికి  తులసి దివ్యఔషదం.
  • కంటి సమస్యకు(For eye problem) : తులసి రసాన్ని 2,3 చుక్కలు కంట్లో వేస్తె కళ్ళ వెంట నీళ్లు కారడం, కళ్ళ మంటలు తగ్గడమే కాక, కంటికి బలాన్ని చేకూరుస్తుంది.
  • * అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు టానిక్ వలె పుచ్చుకుంటే- కంటికి కునుకు రాదన్న బెంగ ఉండదు. నిద్రలేమి భాద నుండి ఉపశమనం తథ్యం.
  • చెవి సమస్యకి(For ear problem) : రుద్ర తులసి ఆకుల రసాన్ని కొద్దిగా వెచ్చ చేసి చెవిలో వేస్తె చెవిపోటు తగ్గుతుంది. చెవి నుండి దుర్వాసనతో కూడిన చీము కారడాన్ని రుద్రా తులసి అరికడుతుంది.
  • * తులసి రసం + నువ్వులనూనె కలిపి కాచి గోరువెచ్చగా ఉన్నపుడే 3,4 చుక్కలు వేసి దూది పెట్టినట్లయితే చెవిపోటు నెమ్మదిస్తుంది.
  • * ప్రాచీనకాలంలో చెవిపోట్లకు వినికిడి సమస్యల నివారణకు తులసి పసరు చెవిలో పోసేవారని శాస్త్రంలో ఉంది.

తులసి మొక్క ఆచార ఉపయోగాలు(Ritual Uses of Tulasi Plant)Tulasi uses and Benefits in Telugu  

  •  తులసి భర్త పేరు “జలంధరుడు “.
  • హిందూ సంస్కృతిలో తులసి మొక్కను ప్రత్యక్ష దైవంగా పూజిస్తారు. తులసికి పవిత్రమైన స్థానంతో పాటు, ప్రధాన స్తానం ఉంది.
  • తులసి విష్ణువుకు ప్రియమైన భక్తురాలు. విష్ణు పూజలో తులసిని విరివిగా వాడుతారు.
  • తులసి పూజ చేస్తే మాంగళ్యం చిరకాలం నిలుస్తుంది.
  • తులసి ఉన్న చోట దుష్ట శక్తులు కూడా ప్రవేశించడానికి వీలు ఉండదు అని నమ్ముతారు.
  •  ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి.
  • వృక్ష శాస్త్ర అధ్యయనాలలో మొక్కలు కూడా మనుషుల మాదిరిగానే స్పందిస్తాయిని సాక్ష్యాధారాలతో సహా రుజువు చేయబడింది. ఆయుర్వేద గ్రంధాలు అవసరం లేకుండా మొక్క భాగాలను పీకడం, తుంచటం వంటివి చేయవొద్దని హితవు చెబుతారు.                                                                                                                                                                                                            తులసి వాస్తు విషయ లాభాలు(Tulasi Vastu material benefits) 

  • హిందూ విశ్వాసాల ప్రకారం “కార్తీక” నెలలో గురువారం తులసి మొక్కను నాటాలి. తులసి మొక్కను బేసి సంఖ్యలో ఉంచాలి.
  • మొక్క ఉష్ణమండల మరియు 6-8 గంటలు సూర్యకాంతిలో ఉంచటం అవసరం. అందుకే బయట ఉంచారు. తులసి మొక్కను  “తూర్పు”కు లేదా “ఉత్తరాన” లేదా “ఈశాన్య”దిశలో లేదా “ఇంటి మధ్య భాగం”లో ఉంచాలి.
  • తులసి మొక్క మనకి ఆహ్లాదకరమైన సుగంధాన్ని సృష్టిస్తుంది. పరిసరాలను తాజాగా ఉంచుతుంది.                            

తులసి ఆకు రంగు మారితే వచ్చే మార్పులు(Changes in the color of the Tulasi leaf)  

  • negative energy : తులసి మొక్క ఆకులు అకస్మాత్ గా వేరే ఏదైనా రంగుకు మారితే, ఆ ఇంట్లో ఉన్న వారిపై ఎవరో తాంత్రిక శక్తులు ప్రయోగిస్తున్నారు అని అర్ధం.
  • నిత్యం నీళ్లు పోస్తూ పెంచే తులసి మొక్క ఆకులు అకస్మాత్ గా ఎండిపోతే ఆ ఇంటి యజమానికి ఆరోగ్యపరంగా కీడు జరగపోతుందని సూచనని మనకి అందిస్తుంది.
  • positive energy : తులసి మొక్కను ఉంచిన కుండీలో దానంతట అదే మరో తులసి మొక్క పుట్టుకు వస్తే ఆ ఇంట్లో వాళ్ళకి జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు.
  • తులసి మొక్కకు ఒక వేళ నీళ్లు పోయకున్న పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే, ఆ ఇంట్లో ఉన్న వారందరికీ అదృష్టం కలిసి రాబోతుందని అర్ధం.

Add Comment