Papaya Fruit Benefits in Telugu:
మన దేశంలో Papaya చాలా సంవత్సరాల నుండి ప్రముఖమైనదిగా గుర్తింపు పొందింది. మన దేశంలో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,అస్సాం,పంజాబ్ వంటి రాష్టాలలో Papaya ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రధానంగా మన రెండు తెలుగు రాష్టాలలోని మెదక్,కడప మరియు ఆదిలాబాద్ జిల్లాలలో ఎక్కువగా ఈ పండును సాగుచేస్తున్నారు. ఈ పంట కోత సమయయం చాలా తక్కువగా ఉండటం,ఈ మధ్య డెంగ్యూ వ్యాధికి చికిత్సగా వైద్యులు ఈ పండుని తినమనటం వంటి కారణాల వలన Papaya పండు కి డిమాండ్ బాగా పెరిగింది.
బొప్పాయి పండులో విటమిన్ ఏ ,బి ,సి ,డి ఉండటం వలన ఈ పండుని రోజూ తీసుకోవటం వలన అనేక రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అందులోనా ఈ పండులో ” పెప్పిన్ ” అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సమస్యతో బాధపడేవారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
బొప్పాయి చెట్టు అందుబాటులో లేనివారు ఈ క్రింది బొప్పాయి జ్యూస్ ని వాడుకోవచ్చు.
పోషకాలు :
- బొప్పాయి పండులో కెరోటిన్,విటమిన్ A,B,C,D,E వంటివి చాలా పుష్కలంగా ఉంటాయి.
- ఖనిజాలు,లవణాలు,ఫ్లేవోనైడ్లు,పాన్తోనిక్ ఆమ్లాలు,పీచు వంటి పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి.
- ఈ పండులో విటమిన్ C అధిక మోతాదులో ఉండటం వలన దంతాల సమస్య,చిగుళ్ల నుండి రక్తం కారటం,రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచటం,రోగనిరోధక శక్తిని పెంచటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
- ఇందులో బీటా కెరోటిన్ అనే పదార్థం ఉండటం వలన కంటికి సంబంధించిన అనేక రకాల వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
- బొప్పాయి పండులో విటమిన్ ఏ అధిక శాతంలో ఉంటుంది. అలాగే ఇందులో కాల్షియం,భాస్వరం,మెగ్నిషియం వంటివి కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి.
ఉపయోగాలు:
- ఈ పండులో ఉండే తెల్లని గుజ్జు మొఖానికి అప్లై చేసుకోవటం వలన నల్లటి మచ్చలు,మొటిమలు తొలగిపోయి చాలా అందంగా తయారవుతారు.
- చర్మం జిడ్డుగా ఉన్న వారికి బొప్పాయితో చేసే పేస్ ప్యాక్ ఎంతగానో సహాయపడుతుంది.
- మలబద్దకం సమస్య ఉన్నవారు బొప్పాయి పండు తినటం చాలా మంచిది.
- తామర వ్యాధి ఉన్నవారు బొప్పాయి పండు తినటం వలన వ్యాధి తీవ్రత తగ్గుతుంది.
- బొప్పాయి కాయ తినటం వలన బి.పి అదుపులో ఉంటుంది.
- బొప్పాయి ఆకుల రసాన్ని మరియు పండుని తినటం వలన డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్ల సంఖ్యని పెంచటంలో తోడ్పడుతుంది.
- జలుబు,ఫ్లూ జ్వరం,చెవి నొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు బొప్పాయి పండు తినటం వలన చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
- రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచటంలో ఉపయోగపడుతుంది.
- రోగనిరోధక శక్తి ని పెంచటంలో సహాయపడుతుంది.
- బొప్పాయిలో ఉండే పెప్పీన్ అనేప్రదార్థం జీర్ణక్రియకు సంబందించిన మందులు తయారు చేయటంలో వాడుతున్నారు.
- దీనిలో ఉండే పీచు వలన అర్శమొలలు రాకుండా కాపాడుతుంది.
- ఆస్తమా మరియు కీళ్లనొప్పులు తగ్గిస్తుంది.
జాగ్రత్తలు:
- గర్భంతో ఉన్న ఆడవారు బొప్పాయి కాయని తినకూడదు. ఇందులో పెపిన్ అధిక మోతాదులో ఉండటం వలన గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది.
- బొప్పాయి కాయలో పాలు ఉండటం వలన దురద కలుగుతుంది. అందుకే మనం బొప్పాయి కాయని కోసేటప్పుడు పాలు మన చేతికి తగిలినప్పుడు దురద కలుగుతుంది.
- బొప్పాయి పండుని ఎక్కువగా తినటం వలన కెరటనిమియా అనే వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి. అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.