అశోకవృక్షం అనగా “దుఃఖ నివారణి”.శారీరకంగా, మానసికంగా ఆరోగ్యముగా ఉంచే ఆయుర్వేద వృక్షం.|Ashoka tree is an Ayurvedic tree that removes grief and is worshiped in Telugu.

 అశోక వృక్షం శోకాన్ని హరింపజేసే ఆయుర్వేద వృక్షం మరియు పూజింపబడే వృక్షం(Ashoka tree is an Ayurvedic tree that removes grief and is worshiped) :

        మనం అశోక వృక్షంను పార్కుల్లో, రోడ్డు పక్కన, విద్యాలయాలలో ఇలా..మొదలైన చోట చూడడం సర్వసాధారణమే. ఇవి అన్ని నీడనిస్తూ, ఆహ్లాదకరమైన వాతారణాన్ని, గాలిని మనకు అందిస్తుంది అని మాత్రమే తెలుసు కదా.. కానీ, మన చుట్టూ పరిసర ప్రాంతాలలో పెరిగే అనేక ఆయుర్వేద వృక్షాలలో “అశోక చెట్టు” ఒకటి.

       ఈ అశోక వృక్షమును(Ashoka tree) హిందూమతంలో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ “శోకం ఉండదు(There will be no grief)” అని అంటారు. అశోక అనేది “సంస్కృత పదం(Sanskrit word)”. అశోక అంటే “భాదలు లేకుండా దుఃఖాలను తగ్గించేది(Alleviating sorrows without suffering)” అని అర్ధం. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అశోక వృక్షం “బహుళ ఆయుర్వేద ప్రయోజనాలున్న(It has multiple Ayurvedic benefits)” పుష్పించే చెట్టు(Flowering tree). ఎత్తుగా, గుబురుగా పెరుగుతూ చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది, ఈ అశోక చెట్లు ఆహ్లాదమే కాదు, ఎన్నో ఆరోగ్య లాభాలను ప్రసాదిస్తాయని చాల మందికి తెలియని విషయం. దీని మొగ్గలు, పువ్వులు, కాయలు కూడా ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇది భారతదేశం, శ్రీలంక దేశాలలో విస్తృతంగా పెరుగుతుంది.

Ashoka tree is an Ayurvedic tree that removes grief and is worshiped in Telugu.

ఈ వృక్షం బెరడు, ఆకులు, విత్తనాలు, పువ్వులను అనేక ఔషదాల తయారీలో ఉపయోగిస్తారు. అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతాయి.

ఆరోగ్య సమస్యలకు అశోక చెట్టు అందించే ప్రయోజనాలు(Benefits of Ashoka tree for health problems):

  1. నొప్పి నివారణ(Pain relief) : అశోక వృక్షం ఆకులను పేస్ట్ లా చేసి శరీర భాగాలపై రాస్తుంటే, కీళ్ల నొప్పులు(Joint pains), కండరాల నొప్పులు(Muscle aches) తగ్గుతుంటాయి.
  2. మొటిమల నివారణ(Acne Prevention) : అశోక చెట్టు బెరడును నీటిలో వేసి మరిగించేసి, ఆ నీటిని చల్లారిన తర్వాత ఆవనూనెతో కలిపి మొటిమలపై రాయాలి. ఇలా చేస్తూ ఉంటె మొటిమలు(pimples) తగ్గుముఖం పడుతాయి.
  3. తెలివితేటలు(Intelligence) : ఒక కప్పు పాలలో అశోక చెట్టు బెరడు పొడి, బ్రాహ్మి పొడులను ఒక టీస్పూన్ మోతాదులో కలిపి తాగుతూ ఉంటె “తెలివితేటలు” పెరుగుతాయి. రోజుకు రెండు సార్లు ఇలా తాగాలి.
  4. చర్మ సంరక్షణ(Skin care) : అశోక వృక్షంలో సహజంగా చర్మం యొక్క రంగును మెరుగుపరిచే గుణం ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. చర్మం యొక్క అలెర్జీల నివారణకు ఉపయోగపడుతుంది. అశోక ఆకుల పేస్ట్ ను రాస్తూ ఉంటే గనుక, గాయాలు(Injuries), పుండ్లు(sores), దురదలు(itches), మచ్చలు(Spots) తగ్గుతాయి. చర్మం సురక్షితంగా ఉంటుంది.
  5. అంటువ్యాదులు(Infectious diseases) : ఈ చెట్టు బెరడును ఉపయోగించడం వల్ల ఫంగల్(Fungal) మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు(bacterial infections) దరి చేరకుండా ఉంటాయి. బెరడు మన శరీరాన్ని శుద్ధి చేయడంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది.
  6. అంతర్గత రక్తస్రావం(Internal Bleeding) : అశోక చెట్టు పువ్వులను తీసుకొని నలిపి తీయాలి. అర టీ స్పూన్ మోతాదులో కొద్దిగా నీటితో కలిపి తాగుతూ ఉండాలి. దీంతో ఇంటర్నల్ బ్లీడింగ్ తగ్గుతుంది. మరియు డయేరియా నుండి బయట పడవచ్చు.
  7. పైల్స్(Piles) : అశోక  చెట్టు సారాలను అంతర్గత పైల్స్ చికిత్సలో మరియు పైల్స్ కారణంగా జరిగే రక్తస్రావం తగ్గించడానికి ఉపయోగిస్తారు. అశోక బెరడు నుండి తయారు చేసిన మూలికా మందులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అశోక  చెట్టు యొక్క బెరడు ను కషాయంలా చేసి తాగుతూ ఉంటే, శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గుతూ ఉంటాయి. పైల్స్ తగ్గుతాయి.
  8.  నులిపురుగుల నివారణ(Prevention of worms) : అశోక చెట్టు యొక్క  ఆకులు లేదా బెరడు తీసుకోవడం ద్వారా నులిపురుగులు(Worms) బారిన పడే అవకాశం ఉండదు.  జీర్ణాశయంలో ఉండే పురుగులు చనిపోతాయి. కడుపు నొప్పి(Abdominal pain)ని, ఉబ్బసాన్ని(asthma) కూడా తగ్గిస్తుంది.
  9. డయాబెటిస్(Diabetes) : అశోక కషాయాన్ని తీసుకోవడం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్తులకు సహాయపడుతుంది. షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
  10. కిడ్నీ రాళ్లు(Kidney stones) : చెట్టు విత్తనాల పొడిని కొద్ధిగా తీసుకొని దాన్ని తమలపాకులో చుట్టి తింటూ ఉంటే, ఆస్తమా తగ్గుతుంది, కిడ్నీలో రాళ్లు కరుగుతాయి.
  11. మహిళలకు వచ్చే సమస్యలు మరియు కడుపు నొప్పికి అశోక చెట్టు భాగాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఇందుకు గాను అశోక వృక్షం బెరడు, పువ్వులు, ఆకులను ఉపయోగించవచ్చు. 
  12. అశోక వృక్షం భాగాలతో తయారు చేసిన “సిరఫ్” మనకు లభిస్తుంది. దాన్ని రోజుకు 10-15 ఎంఎల్ మోతాదులో తాగవచ్చు. విత్తనాల పొడి అయితే 1 నుండి 3 గ్రాముల మేర తీసుకోవాలి. పువ్వుల పొడి అయితే 1 నుండి 3 గ్రాముల వరకు తీసుకోవచ్చు. బెరడు కాషాయం అయితే 15 -30 ఎంఎల్ మోతాదులో తీసుకోవచ్చు.

అశోక చెట్టు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నా, గర్భిణీలు దీన్ని తీసుకోవడం వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి, గర్భిణీలు దీనికి దూరంగా ఉండాలి.Ashoka tree is an Ayurvedic tree that removes grief and is worshiped in Telugu.

అశోక వృక్షం గురుంచి మన పురాణాలు తెలియజేసే విషయాలు(Things our Puranas tell us about the Ashoka tree) :

         అశోక వృక్షం కింద కూర్చొని “రామ పారాయణం(Recitation of Rama)” చేస్తే “శోక నివారణ(Grief cure)” జరుగుతుంది అంటారు. ఉగాది పచ్చడిలో పూర్వం అశోక పుష్ప లేలేత మొగ్గలను, చివుళ్ళను వాడేవారు అని ప్రాచీన గ్రంథాలను బట్టి తెలుస్తుంది. సంతానం కోసం వేచి చూసేవారు, కోరేవారు ఒక శుభదినం చూసుకొని, అశోక వృక్షం కింద సీతారాముల పటాన్ని ఉంచి పూజిస్తే, సంతానప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రవచనం.

       గౌతమ బుద్ధుడు లుంబిని వనంలో అశోక వృక్షం కింద జన్మించాడు. ఈ మహావీరుడు వైశాలి నగరంలో అశోక వృక్షం కింద సన్యాసాన్ని స్వీకరించాడు. రామాయణంలో, రావణుడు సీతమ్మవారిని బంధించింది ఈ అశోకవనంలోనే. సీతాదేవిని హనుమంతుడు అశోక వనంలో గుర్తిస్తారు. అందుకే ఆ తర్వాత కాలంలో అశోకకు “సీతాశోక(Sitashoka)” అనే పేరు కూడా వచ్చింది. హిందువుల ప్రేమ దేవుడైన మన్మథుని పంచబాణాలలో ఒకటి ఈ “అశోక వృక్షం పుష్పాలు”.

  • అశోక చెట్టుకు ప్రతిరోజు నీటిని పోయడం వలన మానసికంగా(Mentally), శారీరకంగా(physically) ఆరోగ్యముగా ఉంటారు. ఆడవారు ప్రతిరోజు అశోక చెట్టుకు నీటిని పోయడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది.
  • అశోక చెట్టును ఇంటికి ఉత్తరం వైపున పెంచితే(ఉత్తరం దిశలో మాత్రమే నాటాలి అప్పుడు మాత్రమే దాని ప్రయోజనం కలుగుతుంది), అనుకూలమైన శక్తి(positive energy) ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
  • ఇంటి ప్రధాన ద్వారంకు అశోక చెట్టు యొక్క ఆకులను తోరణముగా కట్టడం వలన శుభప్రదంగా భావిస్తారు. అశోక వృక్షం ఉన్న ఇంటిలో దుష్ట శక్తులు(Evil forces) నివాసం ఉండలేవు అంటారు.
  • పెళ్లి అయిన దంపతులు అశోక చెట్టు వేళ్ళను దిండు కింద పెట్టుకొని పడుకుంటే, వారి సంసారంలో ఎటువంటి కలతలు లేకుండా సుఖసంతోషాలతో(With happiness) ఉంటారు.
  • అశోక వృక్షం ఉన్న ఇంట్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తి అవుతాయని నమ్మకం.
  • అశోక చెట్టు యొక్క వేళ్ళను శుభ్రం చేసి, మన ఇంటి దేవుడి గదిలో పెట్టుకుంటే, ఇంటికి ఏమైనా వాస్తు దోషాలు(Vastu Doshas) ఉన్నట్లయితే తొలగిపోతాయి.
  • అశోక చెట్టు కింద ప్రతిరోజు నెయ్యి, కర్పూరం తో దీపం వెలిగిస్తే, ఇంటిలోని వారందరు సుఖసంతోషాలతో ఉండడమే కాకుండా, అదృష్టం(good luck) కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.

ముగింపు(Conclusion) :

         అశోక వృక్షం గురుంచి అన్ని విషయాలు తెలుసుకున్నాము కదా..ఆయుర్వేద పరంగా మన ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడడం అంటే అర్ధం, దీని నుండి మనకు లభించే ఆహ్లాదకరమైన వాతావరణమే మనల్ని మానసికంగా, శారీరకంగా శక్తివంతుల్ని చేస్తుంది. అలాగే, మన ఇంటి వాస్తు దోషాలను సరి చేయడంలోను ఎంతగానో పాత్ర వహిస్తుంది.

       ఆయుర్వేద పరంగా ఉపయోగపడుతూ ఎన్ని ప్రయోజనాలను అందించినా సరే, మనం ఏ భాగం నుండి ఔషధాన్ని అది కూడా ఎంత మోతాదులో తీసుకుంటున్నాము అనేది అవగాహనను పెంచుకోవాలి. మనలో అవగాహన అనేది లేకుండా ఏ వృక్షం యొక్క ఔషధాన్ని అయిన తీసుకోవడం సరి కాదు. అది మనకు మన శరీరంలో కలిగే మార్పులకు తేడా కలిగిస్తే, దీని నుండి ఆరోగ్యం యొక్క నష్టాన్ని చూసే పరిస్థితి వస్తుంది. కాబట్టి, ఆయుర్వేద వైద్యుల సలహాలతో మాత్రమే ఔషధాన్ని వాడడం సరైన పద్ధతి.

       అందుకే, ఆలస్యం చేయకుండా అశోక చెట్లను పెంచి అభివృద్ధి చేయడంలో మన వంతు కృషి చేయడం చాలా అవసరం అవుతుంది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి..ఈ అశోకచెట్టు పూజింపబడేది కూడా, కాబట్టి, అదే విధంగా మనం కూడా ఆ వృక్షాన్ని కాపాడుకోవాలి, తిరిగి మనకు ఎన్నో వేల రెట్ల ఆనందాన్ని మన మనస్సుకు, మన ఇంటికి అందజేయగలుగుతుంది. ముందు నుండే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే కూడా ఇలాంటి వృక్షాల పెంపకంతో స్వచ్చమైన వాతావరణం మనం పొందేలాగా ఏర్పరుచుకోవడంలో, శ్రద్ధ వహించడం తప్పనిసరి అవుతుంది మన అందరికి..

Add Comment