Thyroid Symptoms in Telugu | థైరాయిడ్ వ్యాధి లక్షణాలు

Thyroid Symptoms in Telugu Language:

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో Thyroid Symptoms గురించిన అవగాహనా చాలా అవసరం. మారుతున్న జీవనశైలి మరియు శరీరంలో వచ్చే మార్పుల వలన ప్రస్తుతం ఎదుర్కొంటున్న చాలా ప్రమాదకరమైన వ్యాధి Thyroid. ఈ రోజుల్లో చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మన శరీరంలోని హార్మోన్స్ లలో అసమతుల్యత సమస్య ఉంటె ఈ  థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది.

శరీరంలో ఈ Thyroid లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉండటం జరుగుతుందో,అప్పుడు మనకు ఇంకా కొన్ని రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఇందులో ఒక ఇబ్బంది ఏంటి అంటే,మనకు జ్వరం,యూరినరీ ఇన్ఫెక్షన్ లాంటి కొన్ని రకాల వ్యాధులు మనకు వచ్చినప్పుడు వెంటనే తెలుస్తుంది, కానీ ఈ థైరాయిడ్ సమస్య మనకు ఉంది అని తెలుసుకునే లక్షణాలు ఎవ్వరు సరిగ్గా అంచనా వేయలేరు.

దాదాపుగా కొంత మందిలో ఈ వ్యాధి ఎప్పుడో వచ్చి ఉంటది, ఏదైనా వ్యాధి ట్రీట్మెంట్ గురించి డాక్టర్ వద్దకు వెళ్తే అ డాక్టర్ మిమ్మల్ని చూసి,అనుమానించి పరీక్షలు రాస్తే అప్పుడు థైరాయిడ్ వ్యాధి ఉంది అని తెలుస్తుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

అందువల్ల మనకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అని కొన్ని లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు. అలాంటి కొన్ని లక్షణాలు ఏంటో తెలుసుకుందాం..

1.అలసి పోవటం 

మామూలుగా ఒక మనిషికి రోజు 7 నుండి 8 గంటల నిద్ర అవసరం అవుతుంది. కానీ కొందరు 10 నుండి 12 గంటలు పడుకుంటారు,ఇలాంటి వారికీ ఈ విధమైన అలసట ఉండకూడదు. ఒక మనిషికి సరిపడినంత నిద్ర ఉన్నా కూడా అలసట ఎక్కువగా ఉంటే థైరాయడ్ ఉంది అని అనుమానించాలి.

2.అధిక బరువు 

అధిక బరువు వల్ల కూడా ఈ సమస్య రావటానికి అవకాశం ఉంటుంది. అయితే బరువు వున్నవారందరికీ ఈ సమస్య ఉండకపోవచ్చు,అలాంటప్పుడు ఎలా గుర్తించాలి? సాధారణంగా బరువు పెరిగేవారు ఒకేసారి పెరగరు,ఒక నెలలో 1 నుండి 2 కిలోలు పెరుగుతారు.

కానీ ఒక నెలలో 4నుండి 5 కిలోలు ఒకేసారి పెరిగితే థైరాయిడ్ సమస్య ఉంది అని గుర్తించి వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగిన పరీక్షలు చేసుకోవాలి. అంటే తక్కువ సమయంలో బరువు పెరిగినా ఈ సమస్య ఉంది అని అనుమానించాలి.

3.నెలసరి 

మహిళల్లో ఈ నెలసరి సరిగ్గా లేకున్నా ఈ సమస్య రావచ్చు. మాములుగా ప్రతీ మహిళకి నెలసరి అనేది సర్వ సాధారణం. అయితే ఎప్పుడైతే శరీరంలో జరిగే హార్మోన్స్ హెచ్చు తగ్గుల వలన నెలసరి సరిగ్గా జరగదో ,అప్పుడు ఈ థైరాయిడ్ కి సంబంధించిన పరీక్షలు చేసుకోవటం వలన ముందుగానే గుర్తించి అవసరమైన చికిత్స చేయించుకోవాలి.

4.మలబద్దకం

తరచూ మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నా కూడా ఈ వ్యాధికి ఒక సంకేతం. ఈ మలబద్ధకాన్ని తగ్గించుకోవటానికి సరయిన ఆహార జీవనశైలి,తగిన మందులు వాడినా కూడా మలబద్ధకం సమస్య అలానే ఉంటె థైరాయడ్ సమస్యకి సంబంధించి పరీక్షలు చేయించుకోవాలి.

మలబద్ధకం సమస్యకి అద్భుతమైన ఆయుర్వేద ఔషధాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

5.జుట్టు అధికంగా రాలటం 

జుట్టు రాలడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. పోషకాహార లోపం,విటమిన్స్ లోపం,డిప్రెషన్ వలన కూడా జుట్టు రాలుతుంది. కానీ కొందరిలో ఎంత మంచి ఆహారం తిన్నా,ట్రీట్మెంట్ చేయించుకున్నా జుట్టు రాలె సమస్య తగ్గదు. అలాంటి వారిలో థైరాయిడ్ సమస్య ఉండే అవకాశం ఉంటుంది.

పైన చెప్పిన వాటిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా డాక్టర్ని సంప్రదించి,తగిన పరీక్షలు చేయించుకొని,వ్యాధికి అవసరమైన చికిత్స చేయించుకోవటం వలన ముందు ముందు వచ్చే అనేక రకాల వ్యాధులు రాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

 

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.

అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.