Best Home Remedy tips for foot crack in Telugu Language:
Foot crack సమస్యతో ఇబ్బంది పడేవారి సంఖ్య ఈ రోజుల్లో బాగానే ఉంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నా,ఎక్కువగా నీళ్ళలో పనిచేసే వారిలో పాదాలు పగులుతాయి. కొందరికి చలికాలములో,మరికొందరికి ఎండాకాలంలో ఈ సమస్య విపరీతంగా ఉంటుంది. కొందరు శరీరం మొత్తాన్ని బాగా శుభ్రంగా ఉంచుకుంటారు కానీ,పాదాలను పట్టించుకోరు.
Recommended Foot Cracked Repair Cream
అయితే ఈ Foot crack సమస్యకి డాక్టర్ వద్దకి వెళ్లకుండా మనకు అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో చాలా సులభంగా మన ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. అలాంటి కొన్ని గృహ చికిత్సల గురించి వివరంగా తెలుసుకుందాం.
1.బియ్యం పిండి:
కొద్దిగా బియ్యం పిండిని తీసుకోండి, అందులో కొద్దిగా తేనె,ఆపిల్ సైడర్ వెనిగర్ని కలిపి ఒక పేస్ట్ లాగా తయారుచేసుకోవాలి. ఆ తర్వాత మీ పాదాలను ఒక 10 నిమిషాల పాటు గోరువెచ్చని నీళ్లలో నానపెట్టాలి.
తర్వాత పాదాలను బయటకి తీసి మనం తయారుచేసుకున్నపేస్టుతో పాదాలను శుభ్రంగా కడిగి,ఒక పొడి బట్టతో పాదాలను తడి లేకుండా తూడవాలి,తర్వాత వాసెలిన్ పూసి సాక్స్ వేసుకొని పడుకోవాలి. ఈ విధంగా ఒక వారం రోజులు చేస్తే పగుళ్ల సమస్య నుండి బయటపడవచ్చు.
2.రోజ్ వాటర్:
రోజ్ వాటర్ పాదాల పగుళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి మీరు చేయవలసింది రాత్రి పడుకునేముందు పాదాలను బాగా శుభ్రం చేసుకొని తడి లేకుండా చూసుకోవాలి.
ఆ తర్వాత రోజ్ వాటర్,గ్లిజరిన్ సమ భాగాలుగా తీసుకొని బాగా కలిపి పాదాల మీద బాగా అప్లై చేయాలి. తర్వాత మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఈ విధంగా ఒక పది రోజులు చేసారంటే పాదాల పగుళ్లు మాయం అవుతాయి.
2.కూరగాయల నూనెలు:
ఆలివ్ ఆయిల్,ఆముదం నూనె,నువ్వుల నూనె,కొబ్బరి నూనె మొదలైన వాటిని కూరగాయల నూనెలు అంటారు. దీనికి మీరు ఎం చేయాలంటే ముందుగా మీ పాదాలను బాగా శుభ్రంగా కడుక్కొని,పొడి బట్టతో తుడుచుకోవాలి.
ఆ తర్వాత పైన చెప్పిన నూనెలలో ఏదో ఒకటి తీసుకొని పాదాల మీద అప్లై చేసి ఒక 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత పాదాలకు సాక్స్ వేసుకొని పడుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజులు చేయటం వలన మీ పాదాల పగుళ్ళని తగ్గించుకోవచ్చు.
4.వేపాకు:
వేపాకులో యాంటీఫంగల్ లక్షణాలు ఉండటంవలన మన పాదాలకు బాగా మేలు చేస్తుంది. దీనికి మీరు పాదాలను బాగా శుభ్రం చేసుకోవాలి.
తర్వాత కొన్ని వేపాకులు తీసుకొని,అందులో ఒక స్పూన్ పసుపు కలుపుకొని బాగా పేస్ట్ లాగా నూరుకోవాలి. ఇలా తయారుచేసుకున్న పేస్ట్ ని పాదాలకు అప్లై చేసుకొని,ఒక గంట తర్వాత కడుక్కోవాలి.
ఈ విధంగా చేయటం వలన రెండు వారాలలోనే మీ పాదాలు చాలా మృదువుగా తయారుఅవుతాయి.
5.గోరింటాకు:
ముందుగా మన పాదాలను శుభ్రం చేసుకోవాలి. కొన్ని గోరింటాకులు తీసుకొని బాగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి,ఆ తర్వాత రుబ్బుకున్న గోరింటాకు పేస్ట్ ని పాదాలకు అప్లై చేసి,ఎండలో ఆరబెట్టుకోవాలి.
ఆరిన తర్వాత నీటితో కడిగి,తడి లేకుండా చూసుకొని కొబ్బరి నూనెతో అప్లై చేయాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే మంచి పలితం ఉంటుంది.
ఈ విధంగా పైన చెప్పిన మనకు అందుబాటులో ఉండే, గృహ చికిత్సలు వాడటం వలన మన పాదాలకు ఎటువంటి హాని లేకుండా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.
అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.